🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 30*
శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో సురేంద్రనాథ్ మిత్రా నరేంద్రుని ఇంటికి సమీపంలో నివసిస్తున్నాడు.శ్రీరామకృష్ణులను తన ఇంటికి ఆహ్వానించి, ఉత్సవం జరుపుకోవాలనుకొన్నాడు. సురేంద్రుని ఇంట్లో కీర్తనలు గానం చేయడానికి వృత్తి గాయకులు ఎవరూ లభించనందువలన నరేంద్రుణ్ణి కీర్తనలు పాడడానికి ఆహ్వానించాడు.
అది 1881 నవంబరు. శ్రీరామకృష్ణులు వచ్చిన కాసేపటికి నరేంద్రుడు పాడనారంభించాడు. నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణులు ఎంతో ఆకర్షితులయినారు. ఒక రోజు దక్షిణేశ్వరానికి రావలసిందని స్వయంగా అతణ్ణి ఆహ్వానించారు.
నరేంద్రునికి సంబంధించినంత వరకు ఆనాటి సమావేశం అతడిలో ఎలాంటి స్పందన కలిగించలేదు. ఈ సంఘటన జరిగిన కొన్ని వారాల తరువాత గొప్ప కుటుంబం నుండి సంబంధం వచ్చింది. నరేంద్రుడు అందుకు నిరాకరించాడు. బ్రహ్మచర్యమూ, సత్యనిష్ఠా కి వివాహం ఒక ఆటంకమని అతడి గట్టి నమ్మకం.
ఆధ్యాత్మిక లక్ష్యాల కారణంగా నరేంద్రుడు వివాహానికి నిరాకరిస్తున్నాడని గ్రహించిన రామచంద్రదత్తా, "భగవదనుభూతి పొందాలని నీకు నిజమైన ఆసక్తి ఉండే పక్షంలో, దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లు" అని నరేంద్రునికి సలహా ఇచ్చాడు. ఆ సమయంలో ఒక రోజు పొరుగున వసిస్తూన్న సురేంద్రుడు కూడా నరేంద్రుణ్ణి తనతో దక్షిణేశ్వరానికి రమ్మని ఆహ్వానించాడు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి