శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీ కృష్ణ జన్మాష్టమి
‘శ్రీకృష్ణావతార జన్మదినం’ మనకు చాలా పవిత్రమైన పుణ్యదినంగా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ, పరమ భాగవతోత్తములు అందించిన స్వామీవారి జన్మవృత్తాంత విశేషాలను ఏమిటో….. ఒక్కసారి సమిక్షించుకుందం !
శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవులకు ‘శ్రీకృష్ణుడు’ జన్మించాడు. అంటే ! క్రీస్తు పూర్వం 3228 సం|| అన్నమాట! ఓ దేవకినందనా ! ఓ వృష్టివంశ మంగళ దీపమా ! సుకుమార శరిరుడా! మేఘ శ్యామ! భూభారనాశక ముకుంద! నీకు సర్వదా జయమగుగాక!
వసుదేవసుతం దేవం కంసచాణుర మర్దనం |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ||
నేటి మన సమాజానికి యుగయుగాల చరిత్ర కలిగియుంది. అట్టి ఈ సమాజం ఎల్లప్పుడు కులాతిత, మతాతీత, వర్ణాతితంగా ఉంటూ, సహజీవనాన్ని కోరుకుంటూ వస్తూవుంది. అందు ఉన్న ఈ జనులంతా వార్కి జన్మతహవస్తున్న ఆచారాలను అనుసరిస్తూ ! వారి పోట్టకుటికోసం వివిధ వృత్తులను చేపడుతూ ఉంటారు. చేసే పనులు వేరు అయినా: పూలదండలో దారంవలె “ధర్మం” మాత్రం వీరందరికీ ఒకటే ఉంటుంది. అన్ని కాలాల్లోను చెక్కుచెదరకుండా ఉండేది “ధర్మ మార్గం” ఒక్కటే అని సర్వులూ అంగికరిస్తున్న విషయం. ఈ కాలగమన ప్రయాణంలో జనజీవనానికి అప్పుడప్పుడు ఎన్నో ఆటంకాలు ఏర్పడుతూ, శృతి మించి రాగానికి వస్తు వుంటాయి. అట్టి మానవ మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చినప్పుడు….. గీతలో శ్రీ కృష్ణ భగవానుడు అర్జునితో ఇలా అన్నాడు!
యదా యదా హి ధర్మస్యా
గ్లానిర్భవతి భారత
అభ్యుత్యానం అధర్మస్య
తదాత్మానం సుజామ్యహమ్
ఓ అర్జునా ! ధర్మమునకు హాని కలిగినప్పుడు… అధర్మము పెచ్చుపెరిగినప్పుడు నన్ను నేను సృజించుకొందును. అనగా సాకార రూపముతో లోకమున నేను అవతరింతును, అని చెప్పియున్నాడు. ఈ భారతావనిలో శ్రీకృష్ణుడు అంటే తెలియని వారుండరు. ఆయనే ఈ నవభారత నిర్మాణానికి సూత్రధారుడు, కానీ మనకు మనుష్యులను పూజించడమే తెలుసుగాని, అర్ధం చేసుకోవడం తెలియటంలేదు. శ్రీకృష్ణుని భగవంతుని అవతారంగా, మానవ రూపంలో, జన్మించిన దేవునిగా ఆరాధించామేగాని మానవుడిగా పుట్టిన ఆ దేవదేవుని మానవునిగా కాక వారి లీలలను మానవ మనుగడతో సరిపోల్చుకుంటూ అర్ధం చేసుకోవడం కూడా అంతే ముఖ్యంగా తెలుసుకోవాలి. భగవానుడు సామాన్య జనుల మధ్య సామాన్య మానవుడి రూపంలో జన్మించి నివురుగప్పిన నిప్పులా దినదినాభివృద్ది చెందుతూ ధర్మానికి ఆటంకం కలిగించే శక్తులను తనలో ఉన్న మధ్యాహ్న సూర్యకాంతితో ఒక మండించే శక్తిలా; ఆ దుష్టశక్తులను నశిపంచేస్తూ సామాన్య జనులకు ఊరటకలిగిస్తూ…. మానవులందరు తిరిగి ఎలాకలిసి మెలిసి జీవించాలో అని జ్ఞానబోధను చేస్తూ ముందుకు సాగిపోతుంటాడు. ఆ బాలకృష్ణుడు దినదిన ప్రవర్ధమానమగుచూ తన లీలావినొదాదులచే బాల్యమునుండే, అడుగడుగునా భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడు.
బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో కుడా మానవులకు అందని దేవరహస్యం ఉందట ! వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లటి కుండను బద్దలుకొట్టి మానవునిలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్తూ ఉంటారు. ఆలాగునే….. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్ళను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూఉంటే, రాళ్ళను విసిరిచిల్లుపెట్టేవాడట. అలా ఆకుండ మానవశరీరము అనుకుంటే ఆకుండ లోని నీరు “అహంకారం’ ఆ అహంకారం కారిపోతేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలొనీ ఆంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు.
ఇక చిన్ని కృష్ణుడు తన చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్టశిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామంలో అర్జునునకు రధాసారదియై అర్జునిలో ఏర్పడిన అజ్ఞానంధకారాన్ని తొలగించుటకు ‘విశ్వరూపాన్ని’ చూపించి గీతను బోధించి, తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు. ఇలా కృష్ణతత్వాన్ని కొనియాడి చెప్పుటకు వేయుతలలు కలిగిన ఆదిశేషునకే సాధ్యము కాదని చెప్పగా ! ఇక మానవ మాత్రులము… మనమెంతో చెప్పండి ? అట్టి శ్రీ కృష్ణ భగవానుని జ్ఞానబోధతో అందించిన ‘గీతామృతం’ మనకు ఆదర్శప్రాయం. ఇంకా, ప్రముఖ భాగవతోత్తములు మనకు అందించే సమాచారాన్ని బట్టి సుమారు ౩౦వ శతబ్దములకు పూర్వం అంటే క్రీస్తు పూర్వం 3122లో ద్వారకా పట్టణమందు కృష్ణభగవానుడు నిర్యాణము చెందినట్లు తెలియచున్నది. నాటినుండే కాళీ ప్రవేశముతో ‘కలియుగం’ ఆరంభమైనదని చెప్తారు. అట్టి ‘గీతాచార్యుడు’ కృష్ణపరమాత్మా జన్మాష్టమినాడు సూర్యోదయమునకు పూర్వమే కాలకృత్యాలను తీర్చుకొని చల్లని నీటిలో ‘తులసిదళము’ లను వుంచి స్నానమాచరించిన……. సమస్త పుణ్య తిర్ధములలోను స్నానమాచరించిన పుణ్యఫలాన్ని పొందుతారని భాగవతోత్తములు చెప్తున్నారు.
ఆరోజు భక్తులు వారి వారి గృహాలను ముత్యాలు ముగ్గులతో, పచ్చని తోరణాలతో కృష్ణ పాదాలను రంగవల్లికలతో తీర్చిదిద్ది ఆ కృష్ణ పరమాత్మను ఆహ్వానం పలుకుతూ, ఊయలలో ఓ చిన్ని కృష్ణుని ప్రతిమను వుంచి, రకరకాల పూవులతో గంధాక్షతలతో యధావిధిగా పూజించి, ధూపదీప నైవేద్యములతో ఆ స్వామిని ఆరాధించి భక్తులకు తీర్ధ ప్రసాదములు దక్షిణ తాంబులములు సమర్పించుకొనుట ఎంత మంచిదో చెప్పబడినది. ఇంతేగాక చాలా చోట్ల కృష్ణ పరమాత్మ లిలల్లో ఒక లిలగా ఉట్టికుండ కొట్టే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఓ కృష్ణా….! మరణ సమయాన నిన్ను స్మరించుచూ నీలో ఐక్యమవ్వాలని కోరిక వున్నది కాని! ఆ వేళ కఫవాత పైత్యములచే కంఠము మూతపడిపోయి నిన్ను స్మరించగలనో! లేనో ? అని తలచి ఇప్పుడే నా ‘మానస రాజహస’ను శతృఅబేధ్యమైన ‘నీ పాద పద్మ వజ్ర పంజర’ మందు ఉంచుతున్నాను తండ్రి….! అంటూ శ్రీ కృష్ణ భక్తులు ఆ భగవానుని వేడుకుంటారు. తెలుసుకున్నారు కదండీ…! శ్రీ కృష్ణాష్టమి ప్రత్యేకత. ఇట్టి పరమ పుణ్యదినమైన ఈ శ్రీ కృష్ణ జన్మాష్టమినాడు విశేషార్చనలు జరిపించుకుని కృష్ణభగవానుని ఆశిస్సులతో పునితులమవుదాము. నమస్తే…! జై శ్రీ కృష్ణ! #🙏🏼శ్రీకృష్ణుని లీలలు
https://sharechat.com/post/1xjyw47?d=n&ddl=nws_v10&p=v3&v=var10&~campaign=WAShareExpcontrol&referrer=whatsappShare
BuddyLoan ద్వారా కేవలం 5 నిమిషాల్లో రూ. 5 లక్షల వరకు అవాంతరాలు లేని పర్సనల్ లోన్ ను మీ బ్యాంక్ ఖాతాలో పొందండి. 24 గంటల్లో గ్యారెంటీడ్ డిస్బర్స్‌మెంట్ లేదా ప్రాసెసింగ్ ఫీజుపై 100% తగ్గింపు. సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.:https://s1.whistleloop.com/?linkid=6598&offerid=2&publisher_id=701&parentid=336
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి