ఆయన ఓ అచల హిమవన్నగం
ఎవరన్నారు నాన్న వెనక బడ్డాడని?
ఆయన దిక్కులు తెలిసిన దిక్సూచి
ఎవరన్నారు నాన్న వెనక బడ్డాడని?
ఆయన బహుదూరపు బాటసారి
ఎవరన్నారు నాన్న వెనకబడ్డాడని?
ఆయన నమ్మినోళ్ళ ఆంతర్యం తెలిసిన అంతర్యామి
రేపు లేని, మాపు తెలియని శ్రమజీవి..సర్వసంగ పరిత్యాగి
ఇవ్వడమంటే ఇష్టం, తీసుకోవడం తెలియని త్యాగి
మానావమానాలను నవ్వుతూ పంటి బిగువున భరించడం ఆయన నైజం
బాధ్యతలే తప్ప హక్కులు కోరడు
తనలో తాను కుమిలిపోతాడే కానీ తనువు శాశ్వత మనుకోడు
నిశ్శబ్ధ నుంచి మహా నిశ్శబ్ధం లోకి జారిపోతాడు నర్మగర్భంగా
ఇప్పుడు చెప్పండి?
నాన్న వెనక బడ్డాడా?
ఆయన ఎప్పుడూ ఒకడుగు ముందే.. మునుముందే..//
_అంతరంగ తరంగం
_ఆదూరి వేంకటేశ్వర రావు
________________________
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి