🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *శివానందలహరీ – శ్లోకం – 1*
. శ్రీ ఆదిశంకరాచార్య విరచితం
*కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః*
*ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే |*
*శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున*
*ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్ 1*
కళలస్వరూపులునూ (శ్రీవిద్యాస్వరూపులు, సకలవిద్యాస్వరూపులు), సిగలపై చన్ద్రకళలను ధరించినవారునూ (కాలాతీతులునూ), ఒకరినొకరు తపస్సుద్వారా పొందిన వారునూ, భక్తులకు ఫలములిచ్చువారునూ, త్రిభువనములకూ మంగళదాయకులునూ, హృదయమునందు ధ్యానములో మరలమరల గోచరించువారునూ, ఆత్మానందానుభవముతో స్ఫురించు రూపముకలవారునూ అయిన పార్వతీపరమేశ్వరులకు నమస్కారములు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి