16, నవంబర్ 2023, గురువారం

పుష్పాలు వాటి ప్రాధాన్యత*

 *పుష్పాలు వాటి ప్రాధాన్యత*


*పర్వతమంత బంగారాన్ని భగవంతునికి సమర్పించినంత పుణ్యం, ఒక్క సంపంగి పువ్వును సమర్పిస్తే వస్తుంది.*


*సౌవర్ణాచ్చ ప్రసూనాస్తూ, మత్ర్పియం నాస్తి పాండవ*

*మేరుతుల్య సువర్ణాని, దత్త్వా భవతియత్ఫలం*

*ఏకేన స్వర్ణ పుష్పేన, హరిం సంపూజ్య తత్ఫలం*

*సువర్ణ కురుమైర్దివ్యై,* *యైర్నధితో హరి:*

*రత్న హీనై: సువర్ణాద్యై:,* *సభవేజ్జన్మ జన్మని*

*సంపంగి పూలతో పూజచేయనివాడు* 

*మరుజన్మలో సువర్ణ రత్నాల హీనుడవుతాడు.*

*ఆయుష్షుకోసం దుర్వారపూలతో,* 

*సంతానంకోసం దత్తొరపూలతో*

*రుద్రదేవుని పూజించాలట.*

*ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైన పూలతో* 

*శ్రీహరిని అర్చించితే పుణ్యప్రాప్తి కలుగుతుంది.* 

*చైత్రమాసంలో కమలాలు, జాజులు, సంపంగి పువ్వులు, బిల్వపత్రాలు,*

*వైశాఖ మాసంలో మల్లెపూవులు,*

*ఆషాఢమాసంలో కమలాలు, కదంబపుష్పాలు,*

*శ్రావణ మాసంలో అవిశెపూవులు, దూర్వారాలు,* 

*భాద్రపదంలో సంపంగులు, మల్లెలు, సింధూరాలు,*

*ఆశ్వయుజ మాసంలో తీగమల్లెలు, మల్లెపూవులు,* 

*కార్తీకంలో కమలాలు, సంపంగులు,*

*మార్గశిరమాసంలో బకుళ పుష్పాలు,* 

*పుష్యమాసంలో తులసి,* 

*మాఘ, ఫాల్గుణ మాసాల్లో అన్ని రకాల పుష్పాలు* *శ్రీమహావిష్ణువు పూజకు ఉపయోగించడంవల్ల* 

*విశేష పుణ్యప్రాప్తి కలుగుతుంది.*

*సాధారణంగా చెట్టునుంచి ఆరోజు కోసిన పూలను జలంతో ప్రోక్షించి స్వామి పూజకు ఉపయోగిస్తుంటాము* 

*కానీ, కొన్ని పుష్పాలను కొన్ని రోజులపాటు నిలువ ఉంచిన తరువాత కూడా పూజకు ఉపయోగించవచ్చు.*

*ఉదాహరణకు..*

*కమలాలను పదకొండు రోజులవరకు నిలువ ఉంచినప్పటికి పూజకు వినియొగించవచ్చని ‘భవిష్యపురాణం’ పేర్కొంటోంది.* 


*బిల్వ పత్రాలను, తులసీదళాలను, అవిశపూలను, వాడిపోయినప్పటికీ పూజకు ఉపయోగించవచ్చు.*

ఒకవేళ ఈ పువ్వులు చిద్రమైనప్పటికీ పూజకు ఉపయొగించవచ్చని ‘మేరుతంత్రం’ చెబుతోంది.

కామెంట్‌లు లేవు: