సంపూర్ణ ఆరోగ్యం సిద్దించుట కొరకు ఆయుర్వేద సూత్రాలు -
* ప్రాతఃకాలం నందే నిద్ర నుండి మేల్కొనవలెను . బ్రహ్మ ముహూర్తం సరైన సమయం .
* ప్రాతఃకాలం నందు నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చటి నీటిని తాగవలెను దీనివలన మలమూత్రాలు సాఫీగా సాగును.
* నిద్ర లేచిన వెంటనే మలమూత్ర విసర్జన చేయవలెను . మలమూత్రాలను బలంగా ఆపుట వలన రోగాలు సంప్రాప్తిస్తాయి .
* దంతధావనం నందు నాలుకను , దంతములను శుభ్రపరచుకోవలెను . నల్లతుమ్మ చెట్టు బెరడు కషాయం నోటి యందు క్రిములను తొలగించు గుణము కలదు
* దంతముల పాచిని తొలగించుట కొరకు వనమూలికలతో చేసినటువంటి దంత చూర్ణంని వాడవలెను . చిగుళ్ల యందు వ్యాధులు ఏమైనా ఉన్నచో చిగుళ్లకు నువ్వులనూనె రాయవలెను .
* స్నానానికి ముందు నువ్వులనూనెతో మర్ధించుకొని కొంతసేపు నీరెండలో ఉండవలెను . నువ్వులనూనె బదులు కొబ్బరినూనె లేదా ఆవాలనూనె వాడుకోవచ్చు . ఆవాల నూనె చాలా శ్రేష్టం . ఔషధ తైలాలు కూడా వాడవచ్చు .
* శరీరంకి నూనె మర్దించుకొనుట వలన చర్మం మృదువుగా , కోమలంగా తయారగును.
* కీళ్లు , కండరాలు కదలికలు మంచిగా జరుగును.
* రక్తప్రసరణ మంచిగా జరుగును. చర్మం ద్వారా , మలపదార్థాలు త్వరగా తొలగించబడును.
* వ్యాయమం చేయవలెను .
* స్నానం గొరువెచ్చటి నీటితో చేయవలెను .
* గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వలన జఠరాగ్ని పెరుగును . రోమకూపములు , స్వేదరంధ్రములు , చర్మము శుభ్రపరచబడి శరీరం నిర్మలంగా ఉండును.
* నివశించే ప్రదేశముని బట్టి, కాలం మరియు అలవాట్లని అనుసరించి ఆహారం నిర్ణయించవలెను . తీపి , పులుపు , ఉప్పు, కారం , చేదు , వగరు అను ఆరు రుచులు కలిగి ఉండు ఆహారముని తీసుకొనవలెను .
* జీర్ణశక్తికి అనుకూలంగా ఉండు ఆహారముని నిర్ణయించుకొని తీసికొనవలెను .
* భోజనం చేయుటకు 10 - 15 నిమిషములు ముందు పచ్చి అల్లం ముక్కలను కొద్దిగా ఉప్పుతో కలిపి తినవలెను .
* గట్టిగా ఉండు పదార్థాలను బాగుగా నమిలి తినవలెను .
* సాధ్యం అయినంత వరకు ఆహారసేవన తరువాత పెరుగు లేదా మజ్జిగ సేవించవలెను .
* బాగుగా చల్లగా , వేడిగా ఉన్నటువంటి ఆహారపదార్థాలు తీసుకోరాదు .
* ఆహారం తినుటకు 15 నిమిషాల లోపు నీరు తీసుకోరాదు . తిన్నవెంటనే అధిక మోతాదులో నీటిని తీసుకోరాదు . మధ్యమధ్యలో కొంచం కొంచం నీటిని తీసుకోవచ్చు .
* ఆలస్యముగా జీర్ణం అయ్యేటువంటి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోరాదు
* భోజనం చేసిన వెంటనే అధిక శ్రమ చెయ్యరాదు . భోజనం చేసిన వెంటనే కొంత సమయం విశ్రాంతి తీసికొనవలెను .
* తూర్పు , దక్షిణం వైపు తల యుంచి నిద్రించవలెను .
* నిదురించే గది అత్యంత స్వచ్ఛముగా గాలి వీచే విదముగా ఉండవలెను .
* నిద్రించే మంచం ఎత్తు , వంపులు లేకుండా స్థిరంగా ఉండవలెను .
* గది వాతావరణం దుష్ప్రభావం లేకుండా ఉండవలెను .
* మెదడుని ఉత్తేజిత పరుచు పనులు అనగా గట్టిగా చదువుట , ఆలోచించుట , మద్యపానం , కాఫీ, టీలు సేవించుట మొదలగు వాని తరువాత వెంటనే పడుకోరాదు .
* రోజుకి కనీసం 7 గంటలు నిద్రించవలెను .
* పగటినిద్ర మంచిది కాదు కేవలం ఎండాకాలం నందు మాత్రమే పగటి సమయం నందు నిద్రించవలెను .
* నింద్రించుటకు ముందు అరికాళ్లకు , అరచేతులకు తైలం మర్దించుట వలన కలలు నియంత్రించబడును . అనగా పీడకలలు నియంత్రించబడును.
* అధికంగా మైథునం చేయుట వలన శరీరముకు హాని కలుగును. దీనివలన క్షయ మొదలగు వ్యాధులు కలుగును .
* మైథునం రాత్రి మొదటి భాగం నందు చేయుట ఉత్తమం . తగినంత విశ్రాంతి లభించును.
* అసహజ మైధున కర్మలు రోగాలకు మూలకారణం .
* వ్యాధులకు చికిత్స తీసుకునే సమయంలో మైధున ప్రక్రియ నిలిపివేయవలెను . లేనిచొ శరీర రోగ నిరోధక శక్తి సన్నగిల్లును.
* మూత్రము ఆపుట వలన మూత్రము పోయుటలో బాధ కలుగును. మూత్రములో రాళ్లు ఏర్పడును . మూత్రాశయం యొక్క కండరాలు పటుత్వము కోల్పోవును. మూత్రమార్గంలో వాపు , మంట కలుగును. అందువలన బలవంతంగా మూత్రాన్ని ఆపరాదు .
* మలవిసర్జన ఆపుట వలన కడుపులో నొప్పి , కడుపుబ్బరం , అజీర్ణం , అపానవాయువులు , తలనొప్పి , కడుపులో పుండ్లు వంటి సమస్యలు మొదలగును . కావున మలవిసర్జన ఆపకూడదు.
* శుక్రం బయల్పడే సమయంలో నిరోదించినచో శుక్రం గడ్డలు గడ్డలుగా రావటం వృషణాలలో నొప్పి , సంభోగం చేయు సమయంలో నొప్పి కలుగును. కావున శుక్ర వేగాన్ని నిరోధించరాదు .
* వాంతిని ఆపుట వలన దద్దుర్లు , తలతిరగడం , రక్తహీనత , కడుపులో మంట , చర్మరోగాలు మరియు జ్వరం కలుగును . కావున వాంతులను బలవంతంగా అపరాదు.
* తుమ్ములను ఆపుట వలన జలుబు , ముక్కునుండి అదేపనిగా నీరు కారే పీనస రోగం , తలనొప్పి , పార్శ్వపు నొప్పి మొదలగు సమస్యలు కలుగును. ముక్కులో ఉండు మలినాలు , అనవసర పదార్థాలను తొలగించుటకు సహాయపడతాయి. తుమ్ములను బలవంతంగా ఆపరాదు .
* త్రేపులను ఆపడం వలన ఎక్కిళ్లు , ఛాతిలో నొప్పి , దగ్గు , ఆకలి మందగించడం , రుచి లేకపోవుట మొదలగు సమస్యలు సంభంవించును.
* ఆవలింతలు ఆపుట వలన కండ్లు , గొంతు , చెవి , ముక్కు సంబంధ వ్యాధులు ఉత్పన్నం అగును .
* ఆకలి , దప్పిక శరీరంకు కావలసిన పోషకాంశాలు మరియు నీటి ఆవశ్యకత ని తెలియచేస్తాయి . వీటిని అతిగా ఆపుట వలన శరీరంకు అందవలసిన పోషకాలు అందక శరీరం క్షీణించిపోతుంది. శరీరం కావాల్సిన రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల సాంక్రమిక వ్యాధులు సంభవిస్తాయి . శరీరం పొడిగా మారును .
* కన్నీటిని ఆపుట వలన మనసిక వ్యాధులు , ఛాతిలో నొప్పి , తలతిరుగుట మరియు జీర్ణకోశ వ్యాధులు కలుగుతాయి .
* శ్వాసప్రక్రియని ఆపుట వలన శ్వాసకోశ వ్యాధులు , గుండెజబ్బులు కలిగి మనిషి ని ఉక్కిరిబిక్కిరి చేయును . ఒక్కోసారి మరణం కూడా కలుగును.
* నిద్రని ఆపుట వలన నిద్రలేమి , మానసిక వ్యాధులు , జీర్ణకోశ వ్యాధులు , మరియు జ్ఞానేంద్రియ వ్యాధులు సంభంవించును.
పైన చెప్పిన వాటిని అధారణీయ వేగాలు అని ఆయుర్వేదంలో పిలుస్తారు . ఇవి మొత్తం 13 రకాలు గా విభజించారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా ఆపరాదు .
ఈ నియమాలు నిబద్ధతతో పాటించటం వలన అనారోగ్యాలు కలగకుండా చూసుకోవచ్చు.
మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి