*_-శ్రీరుద్రాభిభిషేక ద్రవ్యఫలము_-*
శ్లో!! పయసా సర్వసౌఖ్యాని దధ్నా౽రోగ్యం బలంయశః! ఆజ్యేనైశ్వర్యవృద్ధిశ్చ దుఃఖనాశశ్చ శర్కరా !! తేజోవృద్ధిశ్చ మధునా ధనమిక్షురసేనవై| సర్వసంపత్సమృద్ధిశ్చ నారి కేళజలేనచ!!
మహాపాపాని నశ్యంతి తక్షణాద్భస్మ వారిణా! గంధతోయేన సత్పుత్ర లాభశ్చా౽త్రన సంశయః!! భూలాభః పుష్పతోయేణ భాగ్యం బిల్వజలేనవై| దూర్వాజలేనలభతే నా౽న్యధా నష్ట
సంపదః!! అపమృత్యుహరంచైవ తిల తైలాభిషేచనం|
రుద్రాక్ష సలిలేనైవ మహతీం శ్రియమాప్నుయాత్!!
స్వర్ణోదకాభిషేకేన ఘోర దారిద్ర్య నాశనం|
అన్నేన రాజ్యసంప్రాప్తి ర్మోక్ష మాయుస్సు జీవనం!!
ద్రాక్షారసేన సర్వత్ర విజయం లభతే ధృవం!
ఖర్జూర ఫలసారేణ శత్రుహాని ర్భవిష్యతి!!
వైరాగ్యంలభతే జంబూఫలసారేణ వైజగుః| కస్తూరీ సలిలేనైవ చక్రవర్తిత్వ మశ్నుతే!!
నవరత్నామ్బునా ధాన్య గృహ గోవృద్ధి రుచ్యతే| రసాలఫలసారేణ దీర్ఘ వ్యాధి వినాశనం!!
హరిద్రవారిణా లింగస్నానంవై మంగళప్రదమ్| రుద్రస్నానఫలాన్యే తాన్యుచ్యంతే మునిభిః పురా!!
*( _-రుద్రకామ్యార్చనావిధౌ-_)*
తా॥ ఆవుపాలతో శివునభిషేకించిన సర్వసౌఖ్యములు,
ఆవు పెరుగుతో ఆరోగ్య బల యశస్సులు కలుగును.... ఆవునేయితో ఐశ్వర్యవృద్ధి, మెత్తని పంచదారతో దుఃఖనాశనము, తేనెతో తేజోవృద్ధి, చెరుకురసముతో ధనవృద్ధి..... కొబ్బరినీళ్ళతో సర్వ సంపద్వృద్ధి, భస్మజలముతో మహాపాపహరము, సుగంధోదకముతో పుత్రలాభము, పుష్పోదకముతో భూలాభము, బిల్వజల ముతో భోగభాగ్యములు, దూర్వోదకముతో నష్టద్రవ్యప్రాప్తి, నువ్వులనూనెతో అపమృత్యుహరము, రుద్రాక్షోదకముతో మహ దైశ్వర్యము, సువర్ణ జలముతో దరిద్రనాశనము, అన్నముతో రాజ్వప్రాప్తియు, ఆయుర్వృద్ధి, సుఖజీవనము, మోక్షప్రాప్తి, ద్రాక్షపండ్లరసముతో సకలకార్యజయము, ఖర్జూరఫలరసముతో శతృవులకు హాని, నేరేడుపండ్ల రసముతో వైరాగ్యము, కస్తూరీ జలముతో చక్రవర్తిత్వము, నవరత్నజలముతో ధాన్య, గృహ, గోప్రాప్తి, మామిడిపండ్ల రసముతో దీర్ఘవ్యాధి నాశనము, పసుపునీళ్ళతో సౌభాగ్యము మంగళ ప్రదము...
ఆయా ద్రవ్యములతో పరమశివునకభిషేకము చేసిన "ఆయా ఫలములు కలుగునని పూర్వము మహర్షులచే చెప్పబడినది......
==========================
శ్లో॥ దశాపరాధాస్తోయేన క్షీరేణ శతనాశనం |
సహస్రం శమతేదధ్నా ఘృతేనత్రి సహస్రకం॥
మధునా పంచసాహస్రం శర్కరాష్ట సహస్రకం |
ఆయుతం చేక్షుసా రేణ నియుతామ్రరసేనచ॥
నారికేళోదకం చైవ చాయుతత్రయ నాశనం॥ ద్రాక్షారసేనార్బుదంచ తై లేనత్వర్బుదద్వయం|
అనంతం గంధతోయేన అభిషేకం శివస్యచ॥
*( _-ఇతి యోగజాగమే-_)*
తా॥ శంకరునకు స్వచ్ఛమైన జలముచే అభిషేకము చేసిన 10 అపరాధములు చేసిన దోషము పోవును.... ఆవుపాలతో 100, ఆవు పెరుగుతో 1,000, ఆవునేయితో 3,000, పట్టుతేనెతో 5,000, పంచదారపానకముతో 8,000, చెరకు రసముతో 10,000, మామిడిపండ్లరసముతో 20, 000, కొబ్బరినీళ్ళతో 30,000 .. ద్రాక్షపండ్లరసముతో ఒక అర్బుదము, నువ్వులనూనెతో రెండు అర్బుదములు,పన్నీరుతో లెక్కలేనన్ని అపరాధములు చేసిన దోషముపోవును......గాన వారి శక్త్యానుసారముగా పై ద్రవ్యములతో రుద్రునభిపేకించి దోషవిముక్తు లగుదురుగాక...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి