16, నవంబర్ 2023, గురువారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


జనమేజయా ! ఈ రకంగా రవిపుత్రులైన అశ్వినులు చ్యవనుడి తపోబలంతో సోమపాయులు

అయ్యారు. అప్పటినుంచీ ఆ మహర్షీ, ఆ సరస్సూ, ఆ ఆశ్రమం, ఆ యజ్ఞభూమీ అన్నీ చాలా విఖ్యాతిని

పొందాయి.

రేవతుడి సత్యలోక యాత్ర

సూర్యవంశంలోపుట్టి ఇంతటి ప్రసిద్ధిని పొందిన శర్యాతికి అనర్హుడనే కుమారుడు జన్మించాడు.

అతడికి రేవతుడు జన్మించి రాజ్యం పాలించాడు. ఇతడు సముద్ర గర్భంలో కుశస్థలి అనే మహానగరం

నిర్మింపజేసి అరిందముడై సకలభోగాలూ అనుభవించాడు. ఇతడికి నూర్గురు పుత్రులు ప్రభవించారు.

వారిలో కకుద్మి జ్యేష్ఠుడు. కడసారిగా ఆడపిల్ల పుట్టింది. శుభలక్షణ సంపన్న. సుందరాంగి. పేరు రేవతి.

యుక్తవయస్కురాలు అయ్యింది. రేవతుడు రైవతాద్రికి వచ్చి అనురూపభర్తకోసం రాజపుత్రుల్లో అన్వేషణ

సాగించాడు. ఎవరికి ఇవ్వడమా అనేది ఎంతకూ తేలలేదు. సర్వజ్ఞుడైన సృష్టికర్తనే అడుగుదామనిపించి

రేవతిని వెంటబెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. యజ్ఞాలూ ఛందస్సులూ పర్వతాలూ సముద్రాలు

నదులూ దివ్యరూపధారులై ఋషులతో దేవతాజాతులతో కలిసి బ్రహ్మసభలో సమావిష్టులై కనిపించారు.

అందరూ ముకుళిత హస్తాలతో ముక్తకంఠంతో బ్రహ్మను స్తుతిస్తున్నారు.

(అధ్యాయం-7, శ్లోకాలు-522

వ్యాసమహర్షీ ఇక్కడ నాదొక సందేహం. రేవతుడు రేవతితో సహా బ్రహ్మలోకానికి

వెళ్ళాడంటున్నావు. నేను లోగడ విన్నదాని ప్రకారం బ్రహ్మజ్ఞానియై శాంతచిత్తుడైన బ్రాహ్మణుడు

మాత్రమే బ్రహ్మలోకానికి వెళ్ళగలడు. కూతురిని తీసుకుని ఒక క్షత్రియుడు ఎలా వెళ్ళగలిగాడు?

మానవుడై పుట్టి మానవదేహంతో స్వర్గలోకానికిగానీ బ్రహ్మలోకానికిగానీ ఎవరైనా వెళ్ళగలరా? అది

దుష్ప్రపం అంటారు. అలా వెళ్ళిన వారికి మళ్ళీ భూలోకంలోకి ప్రవేశం ఉంటుందా ? ఉంటే

యథాతథంగా వస్తారా, ఏమైనా మార్పులుంటాయా ? ఈ సందేహాలు నువ్వే తీర్చాలి

కామెంట్‌లు లేవు: