5, సెప్టెంబర్ 2022, సోమవారం

భిక్షాం దేహీ చ పార్వతి

 ఓం శ్రీ మాత్రే నమః


అన్నపూర్ణే... సదాపూర్ణే


అన్నపూర్ణే, సదాపూర్ణే

శంకర ప్రాణ వల్లభే

జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం

భిక్షాం దేహీ చ పార్వతి


"అన్నం సమృద్ధిగా గల తల్లీ, ఎల్లవేళలా నిండైన జగదంబ (ఎన్నడూ ఆ తల్లి కోశాగారం ఖాళీగా ఉండదు). శంకరునికి ప్రాణప్రియమైన దేవీ.. ఓ పార్వతీ దేవీ జ్ఞాన వైరాగ్యాలు సిద్ధించడానికి మాకు భిక్షనీయవమ్మా" అని అర్ధంతో కూడినది ఈ శ్లోకం.


జగదంబ ప్రకృతి.

ఈ ప్రకృతి అన్నాల భాండారం (అన్నపూర్ణ).

ఎన్ని జీవులు ఎన్ని రకాలుగా తిన్నా తరగని భాండారం (సదాపూర్ణే).

ఈ ప్రకృతి అంతా పరమేశ్వరుని శక్తి (శంకర ప్రాణ వల్లభ).

పవిత్రమైన ఈ చింతనతో అన్నాన్ని స్వీకరించేవారు,

అన్నం పరబ్రహ్మం స్వరూపమని గ్రహించినవారు "జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం" అన్నాన్ని గ్రహిస్తారు.


జ్ఞానంతో ఏది సత్యమో, ఏది అసత్యమో గ్రహించి మోహ శోకాలను, రాగ ద్వేషాలను వదిలే దివ్యానుభవం పొందాలి.

అందుకోసమే అన్నం స్వీకరించాలని లోతైన అర్ధాన్ని

పై శ్లోకం తెలియచేస్తుంది.


కాశీ క్షేత్రంలో అన్నపూర్ణ, విశ్వనాధుల చిత్రాన్ని పరికిస్తే, అందు అన్నపూర్ణ వడ్డిస్తుంటే ఈశ్వరుడు ఆహారాన్ని గ్రహిస్తుంటాడు.

ప్రకృతి నుంచి తయారైన ఆహారం ముందుగా ఈశ్వరునికి నివేదించి, అటుపై మనం స్వీకరించాలనే జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞాన భూమికయే కాశీక్షేత్రం.


ఈ ప్రపంచంలో మనం పొందే పదార్ధాలన్నీ అన్నపూర్ణ ప్రసాదాలే.


విశ్వనాధుడు గంగ అన్నపూర్ణ లకు పతి.

శక్తి స్థానమైన "భార్య" రూపం లోని అన్నపానాదులే అన్నపూర్ణ, గంగమ్మ తల్లులు.


ఒకే జగన్మాత గంగ, అన్నపూర్ణలుగా భిన్నరూపాల్లో మనకు సాక్షాత్కరించడమే ఇందు విశిష్టత.


"పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే,

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే" 


కనుపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి.

కనిపించేవి అన్నీ కూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి.

అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది.

అయినా ప్రపంచమంతా నీ నుండే వచ్చినా,

ఇంకా ఆ శక్తి "పూర్ణమే"

ఆ పూర్ణశక్తియే "అన్నపూర్ణ"


ఆ పూర్ణ శక్తిని ధ్యానిస్తే, మేధాశక్తి వృధ్ధి చెందుతుంది.

మథుర భాషణ, సమయ స్పూర్థి, వాక్శుధ్ధి, భక్తిశ్రధ్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి.




🌷🌷🌷🌷🌷


అన్నపూర్ణాస్తుతిః 


నిత్యానందకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ

నిర్ధూతాఖిలఘొరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ|

ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ1


తాత్పర్యము:

నిత్యమైన ఆనందము నిచ్చుదానవు, వరములను- అభయమును ప్రసాదించు దానవు, సౌందర్య సముద్రమైన దానవు, ఘొరమైన పాపముల నన్నిటినీ కడిగి వేయుదానవు, హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్ష పెట్టుము.


నానారత్నవిచిత్రభూషణకరీ హేమామ్బరాడమ్బరీ

ముక్తాహారవిడమ్బమానవిలసద్వక్షొజకుమ్భాన్తరీ|

కాశ్మీరాగరువాసితాఙ్గరుచిరా కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ2


తాత్పర్యము:

వివిధ రత్నముల విచిత్రాభరణములను ధరించినదానవు, బంగారు వస్త్రములను కట్టుకున్న దానవు, వక్షస్థలముపై ప్రకాశించు ముత్యాల హారములు ధరించిన దానవు, కుంకుమ- అగురులు పూసుకొనుటచే సువాసనలు వేదజల్లు శరీరము కలదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్ష పెట్టుము.


యొగానన్దకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ

చన్ద్రార్కానలభాసమానలహరీ త్రైలొక్యరక్షాకరీ|

సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ3


తాత్పర్యము:

యొగముచే పొందు ఆనందమును కలిగించుదానవు, శత్రువులను నాశనం చేయు దానవు, ధర్మనిష్టను ఏర్పరచుదానవు, చంద్రుడు- సూర్యుడు- అగ్నులతొ సమానమైన కాంతి ప్రవాహమైనదానవు, మూడులొకములను రక్షించుదానవు, సమస్త్యైశ్వర్యములను ప్రసాదించుదానవు, తపస్సులకు ఫలమునిచ్చుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్ష పెట్టుము.


కైలాసాచలకన్దరాలయకరీ గౌరీ హ్యుమా శాఙ్కరీ

కౌ మారీ నిగమార్థగొచకరీ హ్యొంకారబీజాక్షరీ|

మొక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ4


తాత్పర్యము:

కైలాస పర్వత గుహయందుడు దానవు, తేల్లని దానవు, ఉమాదేవివి, శంకరుని భార్యవు, కుమారివి, వేదార్థమును భొధించు దానవు, ఒంకార బీజాక్షరస్వరూపము కలదానవు, మొక్షద్వారపు తలుపులను తేరచేడి దానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్ష పెట్టుము.


దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాణ్డభాణ్డొదరీ

లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాఙ్కురీ|

శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ5తాత్పర్యము:

కనబడీ కనబడని మహిమలు కలదానవు, గర్బమునందు బ్రహ్మాండములను మొయుచున్న దానవు, లీలానాటకమునకు సూత్రధారివి, విజ్ఞానదీపమును వేలిగించుదానవు, పరమేశ్వరుని ఆనందింపచేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము.


ఆదిక్షాన్తసమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ

కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ|

స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాదీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ6


తాత్పర్యము:

’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరముల సముదాయమైన దానవు, పరమేశ్వరునకు ప్రియురాలవు, శంకరుని భార్యవు, కాశ్మీర త్రిపురేశ్వరివి, మూడుకన్నులు కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము.


ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ

నారీనీలసమానకున్తలధరీ నిత్యాన్నదానేశ్వరీ|

సాక్షాన్మొక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ7


తాత్పర్యము:

భూమియందలి సమస్తజనులకు నాయకురాలవు, విజయమునిచ్చుదానవు, తల్లివి, దయాసముద్రమైనదానవు, స్త్రీమూర్తివి, నల్లని కురులు కలదానవు, నిత్యము అన్నదానము చేయుదానవు, సాక్షాత్తుగా మొక్షమునిచ్చుదానవు, ఏల్లప్పుడు శుభము కలిగించు దానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము.


దేవీ సర్వవిచిత్రరత్నరుచిరా దాక్షాయణీ సుందరీ

వామా స్వాదుపయొధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |

భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ8


తాత్పర్యము:

దేవివి, విచిత్రములైన సర్వరత్నములతొ అలంకరింపబడినదానవు, దక్షుని కుమార్తేవు, సుందరివి, యువతివి, మధురమైన పాలిండ్లు కల దానవు, ప్రియమునిచ్చుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్ష పెట్టుము.


చన్ద్రార్కానలకొటికొటిసదృశీ చన్ద్రాంశుబిమ్బాధరీ

చన్ద్రార్కాగ్నిసమానకుణ్డలధరీ చన్ద్రార్కవర్ణేశ్వరీ|

మాలాపుస్తకపాశసాఙ్కుశకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ9


తాత్పర్యము:

కోట్లాది చంద్రులు, సూర్యులు, అగ్నిలతొ సమానముగా ప్రకాశించుదానవు, సూర్యబింబము వలే ఎర్రనైన క్రింది పెదవి కలదానవు, చంద్రుడు, సూర్యుడు, అగ్నిల వలే ప్రకాశించు కుండలములు ధరించిన దానవు, చంద్రుడు, సూర్యుడు వంటి వర్ణము కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము.


క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ

సర్వానన్దకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ|

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ10


తాత్పర్యము:

వీరులను రక్షించుదానవు, మహాభయంకరివి, తల్లివి, దయా సముద్రమైన దానవు, అందరికీ ఆనందము కల్గించు దానవు, ఎల్లప్పుడు శుభము కల్గించుదానవు, విశ్వమునకు రాణివి, శొభిల్లు దానవు, దక్షప్రజాపతికి(యాగనాశనము ద్వారా) దుఃఖమును కల్గించుదానవు, సుఖము నిచ్చుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపేట్టుము.


అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే|

జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి11


తాత్పర్యము:

ఓ అన్నపూర్ణా.. ఎల్లప్పుడు పూర్ణముగా ఉండు తల్లి. శంకరుని ప్రాణవల్లభురాలా.. పార్వతీ.. జ్ఞానము వైరాగ్యము సిద్ధించుటకు భిక్ష పెట్టుము.


మాతా చ పార్వతీ దేవి పితా దేవొ మహేశ్వరః|

బాన్ధవాః శివభక్తాశ్చ స్వదేశొ భువనత్రయమ్||


తాత్పర్యము:

తల్లి పార్వతీ దేవి, సి, మూడు లోకములు స్వదేశము.


ఓం నమః శివాయ

పరమేష్టి

 ధర్మాకృతి : పరమేష్టి గురువులు - 2


శ్రీవారి సన్నిధిలో నిరంతరం భాష్య పాఠం జరిగేదట. ఆ రోజుల్లో మహామహాపాధ్యాయులైన మన్నారు గుడి పెరియవాగా ప్రసిద్ధి చెందినా రాజుశాస్త్రి గారు, హరిహర శాస్త్రిగారు, తిరువయ్యార్ బాలకృష్ణ శాస్త్రి గారు వంటి మహా పండితులు తరచుగా శ్రీవారి సమక్షంలో వాక్యార్థం చేస్తూ ఉండేవారట. స్వామివారికి స్వయంగా సంగీతంలో అభినివేశం ఉంది. అనేకమంది సంగీత విద్వాంసులు శ్రీవారి వద్ద తమ సంగీతాన్ని వినిపించి వారి మన్ననలనందుకోవడం మహా గౌరవంగా భావించేవారు. పాపనాశం శివం వంటి వాగ్గేయకారులు వీరిపై కృతులు కూడా చేశారు.


కొంతకాలం తరువాత ధర్మ ప్రచారానికి బయలుదేరిన స్వామివారు తంజావూరు, ఒడయార్ పాళెం, దక్షిణార్కాటు, తిరుచ్చి, కోయంబత్తూరు, మళయాళ దేశాలలో విస్తృత పర్యటన చేశారు. వీరు పండితులలోనూ, పామరులలోనూ ప్రతి ఒక్కరిని పలుకరించి మాట్లాడి, వారి సుగుణాలను ఉత్సాహపరుస్తూ, కష్టాలకు తరుణోపాయం ప్రసాదిస్తూ అందరికీ అత్యంత ప్రేమాస్పదులై ఉండేవారట. వీరు కోపమన్నదే ఎరుగరని చెబుతారు.      


1876లో పంచాంగ గణన రీతులపై వెంకటేశ్వర దీక్షితులు, సుందర శ్రౌతి ఒక పక్షం గానూ. తిరునల్వేలి కృష్ణ జోశ్యులు వేరొక పక్షం గాను వివాదపడగా, స్వామివారు ఆ కాలంలో ప్రముఖ గణిత శాస్త్ర పండితులయిన శ్రీనివాసయ్య అప్పశాస్త్రి, అప్పా దీక్షితులు మధ్యస్థులుగా ఇద్దరి వాదనలనూ ఆసాంతముగా విని, మధ్యస్థులు సుందర రామ శ్రౌతి పక్షమైన దృక్సిద్ధాంతమే సమంజసమైనదని అభిప్రాయ పడగా, స్వామివారు కూడా నిర్ణయాన్ని పరిశీలించి, శ్రీముఖం ద్వారా దృక్సిద్ధాంతమే సమంజసమైనదని కట్టడి చేశారు. దక్షిణ దేశంలో, ఆంద్ర దేశంలోనూ ఈ సిద్ధాంతమే ప్రస్తుతము ఎక్కువ ప్రచారంలో ఉంది.


కంచి పీఠాధిపతుల పూర్వీకులు ఎంతోమంది యావద్భారత విజయ యాత్ర చేసినట్లు వారి గురు సంప్రదాయం చెబుతోంది. స్వామివారు కూడా వారి పూర్వాచార్యుల బాటలోనే 1877లో ఉత్తర దేశ యాత్ర సంకల్పించారు. మాయవరం, చిదంబరం, వైదీశ్వరం, విల్లుపురం మీదుగా కాంచీపురం చేరి తమ మఠంలో కొంతకాలం ఉండి మదరాసు మీదుగా తిరువట్రియూరు చేరారు. తిరువట్రియూరుకు కంచి పీఠానికి అనేక తరాలుగా సంబంధం ఉంది. శంకరుల విగ్రహం ఉన్న అతి కొద్ది శివాలయాలలో ఈ ఊరి దేవాలయము ఒకటి. ఇక్కడి అమ్మవారికి శంకరులే స్వయంగా శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రసిద్ధి. కంచి కామకోటి పీఠానికి ఇక్కడ స్వంత మఠమున్నది. పూర్వాచార్యుల సిద్ధి క్షేత్రములో కట్టిన బృందావనాలున్నాయి. స్వామివారు ఆలయ ప్రధాన దేవత అయిన త్యాగేశ్వరుని అతి పురాతనమైన దక్షిణామూర్తిణి, ఆదిశంకరుని, అమ్మవారిని దర్శించి ఆంద్రదేశములో అడుగు పెట్టారు. మూడు ఏనుగులు, రెండు లొట్టిపిట్టలు, పది గుర్రపు బళ్ళు, నలభై ఎడ్ల బళ్ళు ఆవులు, మూడు వందలమంది పరివారంతో యాత్ర సాగింది.


ఆంధ్రదేశ ప్రజల శ్రద్ధాభక్తులకు సంతుష్టులయిన స్వామివారు యాత్ర ఎంతో నిదానంగానే కొనసాగించారు. దారిలోని సంస్థానాధీశ్వరులైన కార్వేటి నగరపు రాజా వంటి వారి ఆహ్వానములను అందుకొని వారి దేశములలోని ముఖ్య గ్రామములను పావనము చేస్తూ ధర్మ ప్రచారము ముఖ్య కార్యంగా యాత్ర సాగించారు. 


పూర్వాచార్యుల కాలంలో ఆరంభించబడిన పీఠ వ్యతిరేక ప్రచారము వీరు చేరక ముందే ఆయా సంస్థానములకు వెళ్ళింది. అక్కడి సంస్థానాధీశ్వరులందరూ సభ చేసి ఆధారాలను పరిశీలించి, కంచి కామకోటి పీఠాన్ని ఆదిశంకరులు అధిష్ఠించిన సర్వజ్ఞ పీఠంగా గుర్తించి స్వామివారిని ఎంతో ఆదర భావంతో ఆహ్వానించారు. శ్రీమఠపు ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి అందరికీ ఈ పరిశ్రమ ఎంతో ఉపయోగకారి అయింది. విజయనగర రాజ సంస్థానపు పండితులు తాము ఈ దుష్ప్రచారాన్ని ఖండించడమే కాక, తగిన సమాధానమియ్యవలసినదని మదరాసు మహాజన సభను కోరడం జరిగింది. తత్ఫలితమే ‘శంకరతత్త్వ సుబోధిని’ అనే పేరుతో ఏలూరు వాస్తవ్యులు గాధి జగన్నాథపాకయాజి గారిచే వ్రాయబడిన గ్రంథము.


పీఠాపురం తుని సంస్థానాల మీదుగా 25.7.1865న శనివారం ఉదయం పదిగంటలకు విజయనగరము (తూర్పు ఆంద్ర) విజయం చేశారు. స్వామివారి ఈ విజయనగర విజయ యాత్ర ఆ సంస్థాన పక్షాన రికార్డు చేయబడి ముద్రించబడినది. వారి మాటలలో విజయనగరమునకు స్వామివారిని ఆహ్వానించిన తీరు ఈ దిగువ వివరించబడింది. “శ్రీ జగద్గురు భగవత్పాదులు శ్రీపీఠ పరివారంతో విజయనగరమునకు విజయము చేయునవసరమున శ్రీ విజయనగర సంస్థానము రెండేనుగులు, తూర్పు సవర్లు, కుడతాఘాట్లు, లౌక్యులు, పండితులు, పురోహితులును, నయోధ్య ప్రాంతమునకు ముందుపోయి, శ్రీవారి నెదుర్కొని భక్తిపూర్వకముగా స్వాగతమొనర్చి పల్లకీనధిరోహించి ఉన్న శ్రీవారిని తీసుకొని వచ్చి శ్రీ ఓరుగంటి లక్ష్మీకాంతం గారింట్లో నిలిపిరి. బ్రాహ్మణ భోజన నిమిత్తము 300 మందికి వలసిన సామాగ్రి శ్రీమఠమునకు సమర్పించబడినది. 26వ తేదీ వ్యాసపూజ అనంతరము మహారాజా వారు స్వామివారికి వ్యాసపూజ చేసి 116/-రూ.లు 5౦౦ల మందికి భోజన సామాగ్రి సమర్పించినదే కాక శ్రీవారికి నగరములో ఏర్పాటు కాని రోజులలో రోజుకు 25రూ.ల చొప్పున సంస్థాన పక్షాన భిక్ష చేయవలసినదని’ ఆదేశించారు. ఆ రోజుల్లో బంగారం తులం 13రూ.లు ఉండేది. 


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

చిన్నమెరుపు - 12 .

 కంచి పరమాచార్య ఉపన్యాసాలలో చిన్నమెరుపు - 12 .


పంచాంగ నమస్కారం  అంటే రెండుచేతులూ రెండుకాళ్ళూ , రెండుమోకాళ్ళూ, వక్షస్సు , తల, నేలకు తాటించటం.


పురుషుల మాదిరిగా స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయరు.  వారు చేసేది పంచాంగ నమస్కారం .  మొత్తం శరీరాన్ని నేలపై  ఆన్చడం మంచిదయినా  పూర్వులు మాతృత్వాన్ని గమనించారు .  స్త్రీలందరూ అంబికా స్వరూపులే కదా ! గర్భం లో పిల్లను మోస్తోంది . పాలనిస్తోంది . అట్టి పనులు చేసే భాగాలు నేలకు తగలగూడదని వద్దన్నారు 


వణక్కం అంటే వంగుట యని తమిళంలో అర్ధం .  నమస్కారం లో ' నమ ' కు కూడా వంగుట అనే అర్ధం . నమ్ అనగా వంగుట .  నమనం దాని నుండి వచ్చిందే . 


ఎవ్వరూ సంస్కృతాన్ని మాతృ భాషగా వాడటం లేదు .  కానీ , మత గ్రంధాలన్నీ సంస్కృతంలో వున్నాయి .  అర్చన అందులోనే అనాదిగా సాగుతున్నది .  ఆలయాలు ఒకే ప్రాంతానికి పరిమితం కావు .  అనేక ప్రాంతాల వారు వచ్చి దేవతలను పూజిస్తారు.  అందుకే సంస్కృతం.  


అందరూ ఒక కుటంబం అనే భావన దీని వలన కలుగుతుంది . జాతీయ సమైక్యం కోసమయినా  కొన్ని సంప్రదాయాలను కాదనకూడదు .


జమ్మూ కాశ్మీరు లో వున్న  వైష్ణవీదేవి ఆలయమయినా, దక్షిణ ప్రాంతం లోని రామేశ్వరమయినా  భారతీయులందరూ పాల్గొంటారు .


🌹🙏

మరికొంత ఇంకొకసారి..

ప్రేమతో,

గండవరపు ప్రభాకర్,

4, సెప్టెంబర్ 2022, ఆదివారం

సంభోగ నియమాలు -

 ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో తెలియచేసిన స్త్రీ సంభోగ నియమాలు  -


 *  ప్రాణులకు నిత్యము శరీరము నందు సంభోగేచ్ఛ కలుగుచుండును. సంభోగం ఆచరించని యెడల శరీరము నందు మేహరోగం , మేధోవృద్ది , శరీర సంధులు సడలుట వంటి సమస్యలు కలుగును.


 *  సంభోగ సంబంధ ఆలోచనలు కలిగినపుడు బలవంతముగా మనస్సును నిరోధించుట , క్రోధము చెందుట, బ్రహ్మచర్యము , స్త్రీ సంభోగ సుఖం అనుభవించకుండా ఉండటం వలన మనుష్యుడు యొక్క శుక్రము క్షీణించును.


 *  శుక్రము క్షీణించినవానికి శరీర దౌర్బల్యము , ముఖం వాడుట, పాండురోగం , చిక్కిపోవుట , భ్రమ , నపుంసకత్వం , తన ప్రమేయం లేకుండానే శుక్రస్కలనం జరుగును.


 *  ఒకే గోత్రం గల స్త్రీ , శత్రువు భార్య , రాజు భార్య , మిత్రుని భార్య , దీర్ఘరోగములు కలిగిన స్త్రీ , శిష్యుని భార్య , బ్రాహ్మణ స్త్రీ , పిచ్చితో బాధపడుతున్న స్త్రీ , సన్యసించిన స్త్రీ , పతివ్రత , గురువు యొక్క భార్య , ముసలితనం గల స్త్రీ , గర్భవతి , అపరిచిత స్త్రీ వీరితో సంభోగం జరుపుట నిషిద్దం మరియు ధర్మశాస్త్ర విరుద్ధం.


 *  బాల,ముగ్ధ , ప్రౌఢ (అధిక వయస్సు ) స్త్రీల యొక్క వయోబేధమును , అనురాగమును అనుసరించి సంభోగక్రియ జరుపవలెను .


 *  స్త్రీ పదహారు సంవత్సరముల వరకు బాల అనియు , పదహారు మొదలుకొని ముప్పైరెండు సంవత్సరముల వరకు తరుణి అనియు , ముప్పైరెండు సంవత్సరముల నుండి యాభై సంవత్సరాల వరకు ప్రౌఢ అనియు , యాభై సంవత్సరాల పైబడిన వృద్ధస్త్రీ అని అందురు . ఈ వృద్ధస్త్రీతో సంభోగం నిషిద్దం.


 *  గ్రీష్మ, శరదృతువుల యందు కామేచ్ఛ గల పురుషుడు బాలసంభోగం హితకరం . హేమంత , శిశిర ఋతువు నందు తరుణియగు స్త్రీతో రమించుట హితకరం , వర్ష, వసంత ఋతువు యందు ప్రౌడస్త్రీతో రమించుట హితకరం.


 *  బాలా సంభోగం బలమును వృద్దిచేయును. తరుణీ సంభోగం శక్తిని క్షీణింపచేయును. ప్రౌఢ సంభోగం ముసలితనమును కలిగించును. ఈ నియమాలు అతిగా సంభోగించువారికి మాత్రమే . నియమిత పద్దతిలో కాలాన్ని అనుసరించి సంభోగించువారికి ఎటువంటి అనారోగ్యం కలగదు .


 *  కొత్తమాంసం , వేడిగా ఉన్న అన్నం , యవ్వనస్త్రీతో సంభోగం , పాలతో కూడిన అన్నం , నెయ్యి , వేడినీటి స్నానం ఈ ఆరు సేవించినవెంటనే శరీరబలాన్ని పెంచును.


 *  చెడిపోయిన మాంసం , వృద్ధస్త్రీ సంభోగం , ఉదయపు ఎండ , రేగటి పెరుగు , ప్రాతఃకాలంలో స్త్రీతో సంభోగం , ప్రాతఃకాలంలో నిద్ర ఈ ఆరు వెంటనే బలాన్ని హరించును .


 *  వయస్సులో తనకంటే పెద్దది అయిన స్త్రీతో రమించిన పడుచువాడు అయినను వృద్ధలక్షణాలు కలిగినవాడిగా అగును.


 *  హేమంత , శిశిర ఋతువుల యందు వాజీకరణ ఔషధాలు సేవించిన పురుషుడు యథేచ్ఛగా స్త్రీతో రమించవచ్చు. తప్పనిసరిగా వాజీకరణ ఔషధాలు సేవించవలెను . వసంత, శరదృతువుల యందు మూడు దినములకొకసారి , గ్రీష్మ , వర్ష ఋతువుల యందు పదిహేను రోజులకు ఒకసారి స్త్రీ సంభోగం ఆచరించవలెను.


 *  మనుష్యునికి శీతాకాలం నందు రాత్రి సమయములో , గ్రీష్మ కాలము నందు పగటి యందు , వసంతఋతువులో ఆహోరాత్రుల యందు , వర్షాకాలం నందు మేఘాలు గర్జించు కాలం నందు , శరదృతువులో ఎల్లప్పుడూ కామోద్రేకం కలుగుచుండును.


 *  పగటి యందు స్త్రీ సంభోగం ఆయుక్షీణం . సంభోగమునకు గ్రీష్మ, వసంత ఋతువులు అనుకూల కాలం .


 *  ఉదయ సంధ్య, సాయంత్రపు సంధ్యాకాలము నందు , పర్వదినముల యందు , గోవులను విడుచు ప్రభాతవేళ , అర్థరాత్రి యందు , మధ్యాహ్న కాలం నందు సంభోగం నిషిద్దం.


 *  శరీరబలం కలిగినవాడు, వాజీకరణ ఔషధాలు సేవించువాడు , యవ్వనవంతుడు ప్రతినిత్యం సంభోగం జరపవచ్చు.


 *  గురువులు నివశించే ప్రదేశమునకు సమీపస్థలం , బహిరంగ ప్రదేశముల యందు , దుఃఖకరమైన మాటలు వినపడు ప్రదేశముల యందు స్త్రీసంభోగం నిషిద్దం.


 *  అధికభోజనం చేసినవాడు , భయం కలిగినవాడు, శరీర అవయవముల యందు బాధ కలిగినవాడు , దప్పిక కలిగినవాడు , బాలుడు , వృద్దుడు , మలమూత్రాలు వచ్చువాడు , రోగముతో భాధపడువాడు స్త్రీసంభోగం చేయరాదు .


 *  రజస్వల అయిన స్త్రీ , సంభోగము నందు ఇష్టతలేనిది , మాలిన్యము కలిగినది , వయస్సులో తనకంటే పెద్దది అయిన స్త్రీ , రోగపీడితురాలు , అంగలోపము కలిగినది , గర్బవతి, ద్వేషించునది అయిన స్త్రీతో సంభోగం నిషిద్దం. ఇట్టి స్త్రీలతో రమించిన రోగములు కలుగును.


 *  సంభోగ నిగ్రహము లేని పురుషుడు రజస్వల అయిన స్త్రీతో సంభోగించిన పురుషునికి దృష్టి, ఆయువు, తేజస్సు నశించును.


 *  గర్భవతితో రమించిన గర్బమునకు హాని , రోగగ్రస్థ స్త్రీతో రమించిన బలం కోల్పోవును . మరియు మలినంతో ఉన్నది, ద్వేషించునది , శరీరం కృశించినది , బహిరంగ ప్రదేశమునందు సంభోగించిన శుక్రము క్షీణించి మనస్సు వికలతనొందును.


 *  ఆకలిగొనినవాడు , మనస్సు యందు కలవరం కలిగినవాడు , దప్పికతో ఉండువాడు , శరీర దుర్బలత కలిగినవాడు స్త్రీసంభోగం చేసినయెడల శుక్రం క్షీణించి వాతం ప్రకోపించును . ఆరోగ్యవంతుడు అయినను మధ్యాహ్న కాలం నందు రమించిన యెడల పైనచెప్పిన గుణములే కలుగును.


 *  రోగపీడితుడు స్త్రీసంభోగం చేసిన దేహబాధ , ప్లీహోదరం (spleen enlargement ) , మూర్చ, మృత్యువు కలుగును. సంధ్యాసమయం , అర్థరాత్రి యందు సంభోగం వొనర్చిన వాత,పిత్తములు ప్రకోపించును .


 *  రోగములు కలిగిన యోని యందు , గుదము నందు అంగప్రవేశం చేసి సంభోగం జరిపిన ఉపదంశం ( అంగము నందు తీవ్రంగా పోటు , కురుపులు ) , వాతప్రకోపం , శుక్ర క్షయం కలుగును.


 *  మలమూత్రాలు వచ్చుచున్నప్పుడు అవి నిరోధించి (ఆపుకొని ) సంభోగం చేసిన , స్కలన సమయంలో శుక్రము బయటకి రాకుండా బలవంతముగా ఆపుట వలనను , శుక్ర స్కలన సమయంలో వెల్లికిలా పడుకొని శుక్రం స్కలించుచున్న శుక్రం రాయిలా గడ్డకట్టి విపరీతమగు నొప్పి వచ్చు శుక్రశ్మరీ అను వ్యాధి వచ్చును.  కావున ప్రకృతి విరుద్ధములు అగు కార్యములను చేయకుండా ఉండటం మంచిది .


 *  సంభోగానంతరం , స్నానం , చందనలేపనం చేసుకుని చల్లనిగాలి , మధురభక్ష్యములు , చల్లనినీరు , పాలు , మాంసరసం , పెసరకట్టు , ద్రాక్షారసం వంటివాటిని సేవించి మెత్తనిపాన్పుపైన పడుకొని నిద్రించవలెను . ఇలా చేయుట వలన శరీరమునకు అంతకు ముందు ఉండు బలం సిద్ధించి నీరసం , నిస్సత్తువ పోవును .


 *  మన శరీరబలమునకు మించి అతిమైధునం చేయుటవలన వాతవ్యాధులు , శూల , కాస , జ్వరం , శ్వాస , లివరు రోగములు , పాండువు , క్షయ వంటి వ్యాధులు సంభంవించును.


         పైనచెప్పిన విధముగా నియమితకాలాన్ని అనుసరించి సంభోగ క్రియను నిర్వర్తిస్తూ ఆరోగ్యముగా ఉండగలరు.


              పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    

 ఉత్తర , పడమర దిక్కులకు తల ఉంచి నిద్రించకూడదు అన్నవిషయానికి సంపూర్ణ వివరణ  -


        రాత్రి సమయంలో పడుకునేప్పుడు శిరస్సు తూర్పుదిశగా ఉంచవలెను అనియు మరియు దక్షిణ దిశకు ఒక మాదిరిగా కొంచం మంచిది అని పెద్దవారు చెప్తారు అదేవిధంగా మనపురాణాలలో కూడా వ్రాయబడి ఉన్నది. తూర్పుదిశకు శిరస్సు ఉంచి శయనించువాడు ఆరోగ్యవంతుడు అనియు మార్కండేయ పురాణమున చెప్పబడి ఉంది.  దీనికి సంబంధించిన కొన్ని విషయాలను సంపూర్ణంగా వివరిస్తాను.


            భూమి ఒక పెద్ద అయస్కాంతం . మాములు అయస్కాంతం చుట్టూ అయస్కాంతక్షేత్రం ఎలా ఉండునో భూమికి కూడా చుట్టూ అయస్కాంతక్షేత్రం 66,000 మైళ్ళ వరకు వ్యాపించి ఉండును. ఈ విశ్వం అండాండం అనియు మనశరీరంను పిండాండం అని జ్ఞానులు  పిలుస్తారు . విశ్వములోని అన్నింటి ప్రభావం , శక్తి మన శరీరంలో కూడా ఉన్నది. అందుకనే ఈ రెండింటి మధ్య "లయ" తప్పకుండా కాపాడగలుగు శక్తి ఉన్న చాలా మానసిక రుగ్మతులకు ఔషధం దొరుకును .


            ఉత్తరదిక్కుకు ఆకర్షణ ( అయస్కాంత) శక్తి ఉన్నది. దిక్సూచిని ఏ దిక్కుకి తిప్పినను దాని ముల్లు ఉత్తరదిక్కుకు తిరుగును. ఈ ఆకర్షణ శక్తి మానవుని శిరస్సు మూలకంగా శరీరంపైన తన ప్రభావమును చూపించును. అయస్కాంతపు ఉత్తర ధ్రువమునకు రోగనిరోధక శక్తి అనగా క్రిమిరోగాల వంటి వానిని నాశనం చేసి కాపాడగల శక్తి ఉన్నదని దక్షిణధ్రువమునకు శక్తిని ప్రసాదించగల గుణమున్నది మన పురాణాలలో ఉన్నది.  మానవుని శరీరం ఒక విద్యుచ్ఛక్తి కేంద్రం . శరీరముకు కావలసినంత విద్యుత్తు మాత్రమే శరీరంలో ఎల్లప్పుడూ ఉండును. శరీరం తనకి కావలసిన ఎలెక్ట్రిసిటీని ఎల్లప్పుడూ ఉత్పన్నం చేసుకొనుచూ బయటకి విసర్జించుచూ ఉండును.


         వాత్సాయన మహర్షి ప్రకారం శరీరం నందలి 24 కేంద్రాలలో ఈ పని జరుగును. ఈ 24 కేంద్రాలలో బ్రహ్మాండం అతిముఖ్యమైన కేంద్రం . బ్రహ్మాండం అనగా శిరస్సు నందలి పైభాగం . దీనినే పుణికి అని బ్రహ్మకపాలం అని అందురు. ఇది శరీరంలో విద్యుచ్చక్తి ఉత్పత్తికి మరియు బయటకి విసర్జనకు రెండింటికి కేంద్రమై ఉన్నది. మానవ శరీరంలో ఉత్పత్తి అయిన విద్యుత్ వెంట్రుకల చివరనుంచి చేతి గోళ్ల చివర నుంచి చర్మరంధ్రాల ద్వారా అత్యంత సూక్ష్మంగా బయటకి విసర్జించబడును.


       దాదాపు 1300 గ్రాముల బరువుగల మనవుని మెదడు దాదాపు 20 వాట్స్ విద్యుత్ శక్తిని వెలువరించును. మానవ హృదయము నుండి వెలువడు విద్యుత్ శక్తిని " వెక్టార్ " ద్వారా కొలుస్తారు. ఈ విద్యుత్ శక్తిని ఊపిరిని తమ ఆధీనంలో ఉంచగలుగుట ద్వారా ఆయుర్వృద్దిని పొందవచ్చును. యోగులు ఈవిధంగా ఉచ్చ్వాస , నిచ్చ్వాసాలను తమ అదుపులో ఉంచి జీవశక్తిని దాని పరిమాణాన్ని ప్రభావితం చేయగలిగేవారు.


            శిరస్సును ఉత్తరదిక్కుకు ఉంచి నిద్రించిన ఉత్తరదిక్కు నందు ఉన్న ఆకర్షణశక్తి వలన శరీరం నందలి విద్యుత్ శక్తి కొంత కోల్పోవును . ప్రతిదినం ఇట్లు జరుగుచుండడం వలన క్రమేణా శరీరం తన శక్తిని వర్ఛస్సును కోల్పోవును . విద్యుత్ కిరణములు మన పాదముల నుండి ప్రవహించి శిరస్సు నుండి వెలువడును. విద్యుత్ శక్తి ప్రవహించుచోట చల్లదనమును , వెలువడుచోట ఉష్ణం కలుగునని శాస్త్రవేత్తలు నిర్ధారించెను . కావున శిరస్సు నుండి విద్యుత్ శక్తి వెలువడుటచే శిరస్సు అత్యుష్ణమ్ చెంది తలభారం , బాధ , అలసట , నిస్సారం మొదలగునవి కలుగును. కొన్ని శరీరభాగాలు తమ క్రియను కోల్పోయి పక్షవాతం , తిమ్మిరి , నడుమునొప్పి మొదలగు వాతవ్యాధులు కలుగును. నరముల సంబంధ వ్యాధులు జనియించుటకు వీలు కలుగును. కావున దక్షిణదిశకు శిరము ఉంచి శయనించిన యెడల విద్యుత్ శక్తి పాదముల గుండా వెలువడుట వలన నష్టమేమి సంభవించదు. పార్థివ విద్యుత్ దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రవహించును.


        ఇదేవిధముగా పడమట దిక్కు కూడా . ఇక్కడ సూర్యుడు అస్తమించుట చేత అతని ఆకర్షణశక్తి , మనుష్యుని నందలి విద్యుత్ శక్తిని ఆకర్షించును. సూర్యుడు ప్రపంచానికి కన్నువంటి వాడు. సర్వప్రాణులకు ఆధారభూతము , జగత్తును పోషించువాడు . సూర్యుని నుండి ప్రసరించు కిరణములు మనుష్యుని పై మంచి ప్రభావం చూపి దానితో శరీరం నందలి విద్యుత్ ని తన అధీనంలో ఉంచుకొనును. అందువలనే ఉత్తర దిశకు తల ఉంచి నిదురించిన ఎటువంటి పరిణామాలు కలుగునొ అటువంటి పరిణామాలే పడమర దిక్కుకి తల ఉంచి నిదురించిన కలుగును.


  

              

అజ్ఞానానికి నవ్వుతాడు.*

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐



*భగవంతుడు రెండు సార్లు మనిషి అజ్ఞానానికి నవ్వుతాడు.*


*ఇంకాసేపట్లో చనిపోయే బిడ్డకు వైద్యం చేస్తూ వైద్యుడు వాళ్ళ తల్లితో “ఏమీ భయం లేదమ్మా మీఅబ్బాయికి ఏమి కాదు.నేను బతికిస్తాను  అన్నప్పుడు.*


*మరోసారి ఇద్దరు అన్నదమ్ములు భూమిని పంచుకొని ఇదిగో ఈభూమి నాది ,అదిగో అటు వైపు వున్నది నా తమ్మునిది అన్నప్పుడు. వీడితండ్రి,తాత,ఇదేమాట అన్నారు పోయారు.*


*ఇప్పుడు వీడు అదే అంటున్నాడు.రేపు వీడు పోతాడు అయినా “ఇది నాది” అనే భ్రమలో, మాయలో,అజ్ఞానంలో బతుకు తున్నాడు అని నవ్వుకుంటాడట.*



*నిజమే...ఏదిీ శాశ్వతం కాదు. మనం ,మన పిల్లలు,మనం సంపాదించుకున్న ఇళ్ళు,భూమి, మన బ్యాంకు బాలన్స్ ఏవి మనవెంట రావు.*


కాబట్టి

*మనిషి దేవుణ్ణి కోరుకోవలసిన వరాలు:-*


*అనాయాసేన మరణం. బాధలేని సుఖమరణం*


*వినా దైన్యేన జీవనం. ఒకరిపై ఆధారపడని జీవితం*


*దేహాంతే తవ సాన్నిధ్యం పోయేముందు నీ దర్శనం*


*దేహిమాం పరమేశ్వర ప్రసాదించు పరమాత్మా !!*.


సర్వేజనాసుఖినోభవంతు

        శుభమస్తు 

----------------------------------------

          గోమాతను పూజించండి

          గోమాతను సంరక్షించండి

ధర్మాకృతి

 ధర్మాకృతి : పరాపర గురువులు - 1


రాజా గోవింద దీక్షితుల వారి వంశానికి చెందినా శ్రీ వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు కామకోటి 64వ పీఠాధిపతులయ్యారు. వీరి సంయాసాశ్రమ నామము చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి. స్వామివారు పీఠాధిపత్యానంతరము కొంతకాలము కుంభకోణములోనే ఉండి తపస్సు చేశారు. మంత్రశాస్త్రములో మంచి పరిశ్రమ చేశారు. శ్రీవిద్యా సంప్రదాయములో అందెవేసిన చేయిగా ప్రసిద్ధిచెందారు.


అమ్మవారు వీరికి అనవరతము ప్రత్యక్షముగా ఉండేదని ప్రసిద్ధి. ఒకసారి ఔత్తరాహికులైన పండితులు స్వామి దర్శనానికి వచ్చారట. స్వామివారు వారి బసకు, భోజనానికి తగిన ఏర్పాట్లు చేయించి, సన్మానం చేయబోతున్నంతలో వారు తమకు కావలసినది ఈ సన్మానం కాదనీ స్వామి వారితోనే శాస్త్రవాదం కావాలనీ కోరారట. స్వామివారు అలాగే కానీయండని తమ దైనందిన పూజాదికములు ముగించి తిరువిసైనల్లూరు, కుంభకోణము, తిరువిడైమరుదూరు, తంజావూరు ప్రాంతములలోని పండితులను రావించి విద్వత్సభ ఏర్పాటు చేశారు. ఔత్తరాహ పండితులు సుఖాసీనులయిన తరువాత పూర్వపక్షం ఆరంభించమన్నారు.


పూర్వపక్షం ప్రారంభించిన పండితుడు రెండు మూడు వాక్యములు చెప్పి శ్రీవారి వంకకు చూసి నిశ్చేష్టుడై ఊరకుండిపోయారు. వారిలో వారు మాట్లాడుకొని, చివరకు వారి పెద్ద స్వామివారితో మీ ఒళ్ళో కూర్చుని జ్యోతిలా వెలిగిపోతున్న ఆ బాలిక చిరు మందహాసపు సొగసు మాకు పైవాక్యం తోచకుండా చేస్తోంది. దయచేసి ఆమెను లోపలి పంపి వేస్తె వాదం ఆరంభిస్తామన్నారట. అక్కడున్న మిగతా పండిత గణము, పరిచారక వర్గం ఆశ్చర్యమగ్నులై పోయారు. స్వామివారు చిరునవ్వుతో “సన్యాసినైన నా ఒళ్ళో దండకమండలాదులు తప్పితే బాలిక ఉండే అవకాశమున్నదా? ధైర్యంగా మీరు పూర్వపక్షాన్ని ఆరంభించండి అన్నారట. వారంతా సాష్టాంగంగా నమస్కరించి ‘పరదేవతా స్వరూపులయిన మీతో వాదన కోరడం అపచారం. మా అజ్ఞానాన్ని క్షమించండి” అని ప్రార్థించారు. “అదృష్టవంతులయ్యా మీరు! అమ్మవారి దర్శనం లభించింది” అని సంతోషపడి తగిన సత్కారములు చేసి పంపారు.


వీరికి తమ మఠ ఆధ్వర్యములో నడుస్తున్న కామాక్షీ దేవాలయపు కుంభాభిషేకము చేయించాలని అభిప్రాయం కలిగింది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారి తోడ్పాడుతో కంచికి విజయం చేశారు. కలాకర్షణ హోమము అయిన తరువాత అమ్మవారి కళను కలశములో ఆవాహన చేసి, అమ్మవారి విగ్రహానికి పాలతో అభిషేకం చేసి విగ్రహాన్ని కదిలించి జలావాసం చేయించారు. అప్పుడు చూస్తే గర్భాలయము అంతా పటిష్టము చేయవలసిన అవసరం కనిపించింది. ప్రభుత్వం వారు మంజూరు చేసిన ద్రవ్యం, మరి మఠద్రవ్యం కలిపినా ఈ కార్యానికి కావలసిన మొత్తానికి తక్కువగా కనిపించింది. ఇక తప్పదని స్వామివారు మద్రాస్ పర్యటనకు బయలుదేరారు.


శ్రీవారు చెన్నపురిలో ఒకరోజు రాత్రి రెండు గంటలకు ధ్యానమగ్నులై ఉండగా అమ్మవారు కనిపించి వారి చేయి తమ శిరోజములపై ఉంచి, పాలాభిషేకం అయిన కురులు ఎలా జటలు కట్టాయో చూడు. తిలాభిషేకము ఎప్పడు చేయిస్తావు. డబ్బులు కొరతపడితే నేనీయనా అని ప్రశ్నించిందట. ధిగ్గున లేచిన స్వామివారు వెంటనే కాంచీపురా ప్రయాణము సమకట్టారు. ఆ రోజుల్లో మదరాసు నగర ద్వారాలు రాత్రిపూట మూసివేసి ఉంచేవారట. శ్రీవారి కోర్కెపై తెల్లవారక ముందే నగర ద్వారాలు తెరిపించారు తెల్లదొరతనము వారు. స్వామివారు నేరుగా కంచి కామాక్షీ దేవాలయానికి వెళ్ళి జీర్ణోద్ధరణ పనులు పర్యవేక్షించారు. దానం ఎక్కణ్ణుంచి వచ్చిందో కానీ అవసరానికి వర్షించిందట. అమ్మవారికి అష్టబంధన మహా కుంభాభిషేకములు జరిపించి అమ్మ సన్నిధిలో ఆనంద భాష్పములతో మైమరచిపోయారు.


తరువాత మహాస్వామి వారు “శ్రీమఠం ఖైదు అయిన కథ’లో వివరించిన తాటంక ప్రతిష్ఠ ఉదంతం, తంజావూరు కనకాభిషేకం జరిగినాయి. కుంభకోణము చేరిన స్వామివారు తమకు అవసాన కాలమాసన్నమయిందని గ్రహించి తదనంతర శిష్యులను స్వీకరించి మహా దేవేంద్ర సరస్వతీ స్వామి వారనే పేరుతో సంయాసమిచ్చి, ప్రశాంతచిత్తులై బ్రహ్మలీనులైపోయారు. వీరి అధిష్ఠానము కుంభకోణపు మఠపు పెరటిలో తూర్పు మూలన వడకోటి బృందావనమనే పేరుతో పూజింపబడుతోంది. అయితే వీరి సమయములో శ్రీమఠాన్ని కదిలించి వేసిన సంఘటనల గురించి చెప్పుకోకుండా వీరి చరిత్ర పూర్తి కాదు.


క్రీ.శ. 1817 నుండి క్రీ.శ. 1879వరకు శృంగేరీ పీఠములో విరాజమానులయిన ఉగ్రనృసింహభారతీ స్వామివారు మహాప్రతిభాశాలురు. మన మహాస్వామి వారి మాటలలో మహా తపస్వి. మహా తేజస్వి. చిన్నతనములోనే కాలినడకన రెండు మార్లు కాశీయాత్ర చేసి విద్యాభ్యాసం చేశారు. మణికుట్టి శాస్త్రిగారి వద్ద ప్రస్థానత్రయ భాష్యశాంతి చేశారు. ఇరవై ఏళ్ళవయస్సులో శృంగేరీ పీఠాన్ని అధిష్ఠించారు. అప్పటికి మూడు తరములుగా శృంగేరీ ఆచార్యులు యుద్ధ భయం వలన పూనాలో ఎక్కువ కాలం గడిపారని బోడస్ వ్రాసిన మారాఠీ పుస్తకంలో ఉన్నది. 


(సశేషం)

ధర్మాకృతి : పరాపర గురువులు - 2


వీరు ఆహార భయ నిద్రాడులను జయించినవారు. కేవలం కందమూలాలు కొంతకాలం, కాకరకాయలు కొంతకాలం భుజిస్తూ రోజుకు ఇరవై గంటలు అత్యాశ్చర్యకరమైన తపశ్చర్య ఆచరించారు. అణిమాది సిద్ధులు వీరి పాదాక్రాంతమయ్యాయి. శృంగేరీ బిరుదములలో చెప్పబడిన ‘సర్వతంత్రస్వతంత్ర’ బిరుదము వీరి యెడ సార్థకమైనది. వీరిని చూసినంతనే గౌరవభావము కలిగి సంస్థానాధీశులు పాదాక్రాంతులయిపోయేవారని, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని సాధించేదాకా వదలిపెట్టడం వారి మనస్తత్వం కాదని వారి చరిత్రలో వ్రాసి ఉన్నది. వీరి మహాత్తుల గురించిన అనేక సంఘటనలు చెప్పబడినవి. మచ్చుకు ఒకటి రెండు చెప్పుకొందాం.


ఒకప్పుడు వీరు మధుర మీనాక్షి దేవాలయానికి వెళ్ళారు. అమ్మవారికి తామే స్వయంగా పూజ చేయాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. అక్కడి అర్చకులు శైవాగమమునకు సంబంధించిన వారు. వారు స్వామివారు సైతం లోపలి రావడానికి ఒప్పుకోలేదు. ఆగ్రహించిన స్వామివారు అమ్మవారి జీవకళను కొబ్బరికాయలోనికి ఆవాహన చేసి, తమతో విడిదికి పట్టుకొని పోయారు. ఆ విషయం బహిరంగంగా చెప్పి మరీ వెళ్ళారు. అమ్మవారి విగ్రహంలో జీవకళ లోపించిన విషయం అర్చకులు గ్రహించి కాళ్ళా వేళ్ళా పడితే క్షమించి స్వయంగా దేవాలయానికి వెళ్ళి తిరిగి కళాప్రతిష్ఠ చేశారు. ఈరోజునకు కూడా శృంగేరీ పీఠములో మీనాక్షీ దేవికి ప్రతిదినము మహా నివేదనము జరుగుతుందట.


ఒక సంస్థానాధీశులు స్వామివారిణి స్వయంగా వచ్చి ఆహ్వానించడానికి బదులు తమ ప్రతినిధి ద్వారా ఆహ్వానం పంపారట. రాజుగారికి పక్షవాతం వచ్చింది. తన తప్పు గ్రహించి, బుద్ధి తెచ్చుకొని స్వామివారి పాదాలను ఆశ్రయిస్తే క్షమించి సంస్థానానికి విజయం చేశారు. పక్షవాతం గుణమయిందని వేరే చెప్పనక్కరలేదు కదా!


మహదేవ శాస్త్రి అనే పేరు గల మహా ప్రతిభాశాలి అయిన పండితుడు తన వాదనా పటిమతో అందరినీ పరాజితులను గావించి, శృంగేరీ స్వామివారితో వారి తపోవృద్ధత్వాన్ని, జ్ఞాన వృద్ధత్వాన్ని వయో వృద్ధత్వాన్ని కూడా గణనలోనికి తీసుకోకుండా వాడనలోనికి దిగి స్వామివారినే తికమక పెట్టారట. “మహాదేవా! నీకు సరస్వతి మంచి వాక్పటిమను ప్రసాదించింది. నామీదే ప్రయోగింప చూశావు. ఇమనుంచి మరచిపోతావు” అని నిగ్రహించారట. తరువాత మహదేవులు శివగంగ పీఠాధిపతులుగా చాలా కొద్దికాలం ఉన్నారు. మతిమరుపు సంభవించింది.


వీరి మహిమలు, ఆధ్యాత్మిక ఔన్నత్యం కారణంగా వీరి కీర్తి దిగంతాలకు పాకింది. ఉగ్ర నరసింహ భారతీ స్వామివారు శృంగేరీ పీఠపు ఔన్నత్యాన్ని పునరుద్ధరించడానికి అహర్నిశలూ కృషి చేశారు. కూడలి, శివగంగ, విరూపాక్ష పీఠములపై వివిధ కోర్టులలో కేసులు వేశారు. అయితే వాదనకు తగిన ఆధారాలు లేకపోవడంతో శృంగేరీ వాదము కొన్ని కేసులలో కోర్టులలో నిలువలేదు. వీరి విస్తృత దక్షిణ దేశ పర్యటనలో కంచి కామకోటి పీఠమునకున్న ప్రత్యేక మర్యాదలన్నీ తాము పొందాలని ప్రయత్నించారు.


1838లో మహా మఖ సందర్భంగా కామకోటి పీఠాధిపతులు పల్లకీలో వెళ్ళే మార్గంలోనే తమ పల్లకీ వెళ్లాలని పట్టుబట్టారు. అయితే కుంభకోణంలో ఉన్న ఇతర మఠాధిపతులు ఒప్పుకోనందున ప్రభుత్వమూ వారికి వేరే మార్గము నిర్ణయించింది. మిగిలిన మఠముల ఎదురుగా పల్లకీ పైన వెళ్ళే అధికారం కామకోటి పీఠాధిపటులకే ఉన్నదని నిర్ణయమయింది. 1844లో అఖిలాండేశ్వరీ దేవాలయ కుంభాభిషేకపు కేసులో వివిధ కోర్టులలో జరిగిన వివాదము శ్రీమఠం ఖైదు అయిన కథలో చూడవచ్చు. 1866లో తిరిగి కుంభకోణం కామకోటి మఠం వీధిలో ఊరేగింపుగా వెళ్ళడానికి ప్రయత్నించి నిరోధించబడ్డారు. తిరుచ్చి ప్రాంతాలలో అగ్ర సంభావనకు ప్రయత్నించి కలెక్టరు చేత కూడదని కట్టడి చేయబడ్డారు. 


మద్రాసు సమీప ప్రాంతాలలో అగ్రపూజకై ప్రయత్నించడం చెన్నపురి మహాజనసభకు నచ్చలేదు. అది ఆ ప్రాంతాలకు పరంపరగా గురువులయిన కామకోటి పీఠ మర్యాదకు వ్యతిరేకమని ఆ ప్రాంత ప్రజలలో భావన కలిగింది. ఈ సమయంలో వీరు మదరాసు నగరానికి విచ్చేయనున్నామని చెన్నపురి మహాసభకు శ్రీముఖం పంపారు. 


మదరాసు మహాజన సభ ప్రత్యేక సమావేశంలో ఈ శ్రీముఖాన్ని చర్చించింది. ఆ నగరంలో సర్వ ప్రాతినిధ్యం గల సభ నిర్ణయానుసారం ఆ సభాధ్యక్షులు కామకోటి పీఠ గౌరవ ప్రపత్తులకు భంగం కానివిధంగా మాత్రమే శృంగేరీ స్వామివారు మదరాసు విజయం చేయవచ్చునని ఆహ్వానించారు. డానికి ఆ స్వామివారు బదులు వ్రాస్తూ “శ్రీ కంచి కామకోటి పీఠానికి విరోధము చేయవలెనని అభిప్రాయము ఉండేది లేదని యీ వివరం తెలిసేది” అంటూ సమాధానంగా శ్రీముఖం పంపారు.

పై వివరాలను బట్టీ ఈ స్వామివారిని అన్యధా అర్థం చేసుకోరాదు. వారు తపస్సంపన్నులు, జీవన్ముక్తులు. మహాపురుషులనే విషయం మనం మరచిపోరాదు. బిసి అని చెప్పడానికే వీరి వృత్తాంతాన్ని చెప్పాను. 


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

3, సెప్టెంబర్ 2022, శనివారం

వినాయక చవితి సందేశాలు

 ॐ          వినాయక చవితి సందేశాలు 

      

                   -----------------------     


                                  సందేశం - 7 



ఓమ్ (ॐ) - వినాయకుడు



ఓమ్ (ॐ)    


    వేదాలను త్రయీ అంటారు. గద్య మంత్ర గాన భాగాలుగా అవి మూడు.

    మొదటి దానిలో తొలిమంత్రం "అగ్నిమీళే పురోహితమ్". అందులో మొదటి వర్ణం "అ".

    రెండవదానిలో మధ్యమంత్రం "యో నిస్సముద్రో బంధుః". అందులో మధ్య అక్షరం "ఉ".

    మూడవదానిలో చివరి మంత్రం "అసమానాంతరమ్". దానిలో చివరి వర్ణం "మ్".


      ఈ మొదలు, మధ్య, చివరలలోని అ + ఉ + మ్ = ఓమ్ అయింది.

      దీన్ని మనం "ॐ" గా వ్రాస్తాం కదా! ఇది వినాయకుని రూపమే!            


     ఈ ॐ లో


1. "3" లా కనిపించే భాగం ఉంది. ఆ 3 అనే అంకె కూడా అడ్డంగా సరిసమానంగా కాక, పై భాగం చిన్నగానూ, క్రింది భాగం పెద్దగానూ కన్పిస్తుంది. దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే - చిన్నగా కనిపించే ఆ పైభాగం వినాయకుని "శిరస్స"నీ, క్రింద పెద్దగా కనిపించే భాగం ఆయన "బొజ్జ" అనీ తెలుస్తుంది.


2. ఆ శిరస్సూ బొజ్జా కలసిన భాగం నుండి - మనకి కుడివైపునా, ఆ దేవునికి ఎడమవైపునా - ప్రక్కగానూ, వంకరగానూ కనిపించే భాగం ఆయన "తుండం".


3. ॐ కి తలమీద ఉన్న అర్ధ చంద్రాకారపు భాగం - ఆయన శిరస్సుమీద ఉండే "చంద్రవంక".

       అందుకే 'నుదిటిపై చంద్రరేఖ గలవాడు' అనే అర్థం వచ్చే "ఫాలచంద్రః" అనేది కూడా వినాయకుని పేర్లలో ఒకటి.


4. విద్యలన్నిటికీ మూలమూ, విజ్ఞాన సర్వస్వం "వేదం". వేదపఠనం ప్రారంభించేముందు పండితులు 

      "శ్రీ మహాగణాధిపతయే నమః - శ్రీ గురుభ్యో నమః - హరిః ఓమ్" - అని పలికి ఆ మీదటే వేదాన్ని వినిపిస్తారు.

      ఏది వ్రాయాలన్నా - వేదాధినేత వినాయకుని ధ్యానించి, వినాయక రూపాన్ని ॐ అని వ్రాసి, ప్రారంభిస్తాం కదా!


5. ప్రాణాయామం

       ముమ్మార్లు ॐ పలకడంద్వారా ప్రాణాయామం చేసి, ధ్యానార్చనాది ఏ భగవత్కార్యమైనా మొదలుపెడతాం కదా!

     ప్రణవంతో ప్రాణాయామం చేస్తే, మెదడులో - ఆలోచనకి కేంద్రస్థానమైన "పిట్యూటరీ" గ్రంధి ఉత్తేజితమౌతుంది. 


పరమాత్మకు కల మూడు పేర్లు 


   "ఓమ్ ఖమ్ బ్రహ్మ" అని వేదం చెబుతుంది. అందులో మొదటిది,


"అవతీతి ॐ" 

   - రక్షిస్తుంది కాబట్టి "ॐ" అని పేరు. 

    మనం జ్ఞానం చేత రక్షింపబడతాం. ఆ జ్ఞానం వేదం ద్వారా పొందగలుగుతాం. 

   "ॐ" ఉచ్చరించడం ద్వారా మెదడులోని "పిట్యూటరీ"గ్రంథి ఉత్తేజితమై ఆలోచన సక్రమంగా ఉండడమూ, 

    "ॐ" రూపంలోని "వినాయకుడు" సకల విద్యలూ అనుగ్రహించడమూ జరుగుతుంది. 


    దీన్నిబట్టీ "కోరిన విద్యలకెల్ల ఒజ్జ" - వేదస్వరూపమూ - ప్రణవస్వరూపంగా ఆరాధింపబడేది "వినాయకుడే" అనేది తెలుస్తోంది కదా!


                    =x=x=x=


    — రామాయణం శర్మ

            భద్రాచలం

డబ్బుతో కొనుక్కోగలిగే అన్ని సౌకర్యాలుసరిపోదు

 ఒక యువ బిలియనీర్ ఆసుపత్రి కి హడావుడిగా వచ్చాడు

*డాక్టర్‌ని అడిగాడు, "మా అమ్మ ఎలా ఉంది? ఎప్పుడు, ఎందుకు అడ్మిట్ అయింది?"*


*"మీ అమ్మకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. అక్కడే కూర్చున్న వృద్ధ దంపతులు సకాలంలో ఆసుపత్రికి తీసుకొచ్చారు" అని డాక్టర్ చెప్పారు.

* కొడుకు వృద్ధ దంపతులకు కృతజ్ఞతలు తెలిపాడు. "మిమ్మల్ని గుర్తించలేకపోయినందుకు క్షమించండి" అన్నాడు. అతను కూడా తమకు తెలియదని ఆ మహిళ సమాధానం ఇచ్చింది. కొడుకు ఆశ్చర్యపోయాడు* 😳

*"మా అమ్మ మీకు ఎలా తెలుసు?" అని అడిగాడు. ఆ పెద్దమనిషి,* *"ఆమె మా వాట్సాప్ గ్రూప్‌లో మెంబర్‌" అని జవాబిచ్చాడు.* *కొడుకు కన్ఫ్యూజ్ అయ్యాడు.

*పెద్దమనిషి కొనసాగించాడు,* *"మాకు WhatsAppలో ఒక గ్రూప్ ఉంది — _"The 60 Plus Group."_*

*అరవై ఏళ్లు పైబడిన వారందరూ సభ్యులుగా ఉంటారు. తమ ఇరుగుపొరుగు వారిని చేర్చుకోవడం సభ్యుల విధి.*

*_ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ "గుడ్ మార్నింగ్" సందేశాన్ని పంపాలి. అదేవిధంగా మధ్యాహ్నం మరియు రాత్రి కూడా. సభ్యులు చాట్ చేయవచ్చు, వీడియో లు మార్పిడి చేసుకోవచ్చు._*

_*ఏ రోజైనా ఎవరినుంచైనా తప్పనిసరి సందేశం రాకపోతే, పక్కింటి సభ్యులు అప్రమత్తం చేయబడతారు మరియు వారు సభ్యుడిని సందర్శించడాన్ని ఒక విధిగా చేస్తారు.*_

*"ఈ ఉదయం, మీ అమ్మ నుండి మాకు మెసేజ్ రాలేదు. అందుకే మేము ఆమె వద్దకు వెళ్లి ఆమెను ఇక్కడకు తీసుకు రాగలిగాము."*

*"మీరు మీ తల్లిదండ్రులకు డబ్బుతో కొనుక్కోగలిగే అన్ని సౌకర్యాలు కల్పిస్తే సరిపోదు, వారికి మాట్లాడటానికి వ్యక్తులు కావాలి. మీరు మీ అమ్మను చివరిసారి ఎప్పుడు కలిశారు?"*

* కొడుకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు

*"చూడండి, అందుకే మాకు ఈ గ్రూప్ ఉంది. లేకపోతే, మేము 60+ వయసులో గోడలు మరియు కిటికీలతో మాట్లాడాలి", అని చెప్పి ఆ దంపతులు వెళ్లిపోయారు.*

*_మనం ఎదుగుతున్నప్పుడు, మన తల్లిదండ్రులు పెద్దవుతున్నారనే విషయాన్ని మర్చిపోకూడదు.

*పెద్దవారికి ఇది చాలా ముఖ్యమైన, అవసరమైన విషయం ఇది

(1)తప్పనిసరిగా వాట్సప్ గ్రూప్‌లో చేరడం

*మరియు*

*(2) ప్రతిరోజూ గుడ్ మార్నింగ్ సందేశాన్ని పంపడం!*

*మీరు ఒంటరిగా ఉన్నారని అనుకుంటే మీ సర్కిల్‌లో అమలు చేయడానికి అద్భుతమైన ఆలోచన!*

మంచికర్మలు* చెయ్యండి

 ఋణానుబంధం..అంతా ఋణానుబంధం.. జగమంతా  ఋణానుబంధం....................!!


ఒక తండ్రి 70 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత చనిపోయినప్పుడు పెద్దకొడుకు  వయస్సు 40, రెండవకొడుకు  వయస్సు  37, 

మూడవ కొడుకు వయస్సు 33, 

నాలుగవ కొడుకు వయస్సు 30. సంవత్సరాలు అయితే...


అంటే పెద్ద కొడుకుతో 40 ఏళ్ళు ఉంటే , 

చివరి నాలుగవ కొడుకుతో  30 ఏళ్ళు మాత్రమే వున్నాడు ఎందుకు ?


మీ అనుభవంలో .....ఒక సంతానం ఏదైనా కోరితే.. డబ్బులు లేకున్నా అప్పు చేసి వారి కోరిక నెరవేరుస్తాము , కానీ మరో సంతానం ఏదైనా కోరితే చేతిలో  డబ్బులున్నా వాడి కోరిక   తీర్చాలనిపించదు ఎందుకని ?


అలాగే కొంతమంది విషయంలో ఎక్కువ ప్రేమ చూపిస్తాం  ఎందుకని ?

చదవండి !


మనకు పూర్వ జన్మ కర్మల వలననే ఈ జన్మలో...

తల్లి, 

తండ్రి, 

అన్న, 

అక్క, 

భార్య, 

భర్త, 

ప్రేమికుడు, ప్రియురాలు, 

మిత్రులు, శత్రువులు 

మిగతా సంబంధాలు...

ఈ ప్రపంచం లో మనకు లభిస్తాయి. 


ఎందు కంటే మనం వీళ్లకు...ఈ జన్మ లో...

ఏదో ఒకటి ఇవ్వ వలసి, లేదా తీసుకొన వలసి రావచ్చును.


మనకు సంతాన రూపంలో ఎవరెవరు వస్తారు.

మనకు....

పూర్వ జన్మ లో సంబంధం వున్న వాళ్ళే..

ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు. 

వాటినే  మన శాస్త్రాల ప్రకారం నాలుగు రకాలుగా వున్నట్లు చెబుతారు...


ఋణాను బంధం.

గత జన్మ లో మనం ఎవరి వద్ద నైనా రుణం తీసుకుని వుండచ్చు  లేదా 

ఎవరో ఒకరి ధనాన్ని నష్ట పరచి వుండొచ్చు. 

అటు వంటి వాళ్ళు మీకు సంతాన రూపం లో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపంలో వచ్చి మీ వద్ద వున్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకూ వుండి ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యే వరకు మన తోనే వుంటారు.


శత్రువులు - పుత్రులు.

మన పూర్వ జన్మ లో శత్రువులు మనపై వారు తమ తమ కక్షను తీర్చుకోవటానికి మన ఇంట్లో సంతాన రూపం లో తిరిగి పుడతారు. 

అలా పుట్టి తల్లి దండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు, 

నానా గొడవలూ చేస్తారు. 

జీవిత మంతా ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే వుంటారు. 

ఎల్లప్పుడును తల్లితండ్రులను నానా యాతన పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితులను చేస్తూ... ఆనంద పడు తుంటారు.


తటస్థ పుత్రులు.

వీళ్ళు ఒక వైపు తల్లి తండ్రులకు సేవ చెయ్యరు... 

మరో వైపు సుఃఖం గా కూడా వుంచరు, 

వాళ్ళను వాళ్ళ మానానికి వాళ్ళను వదిలేసి వెళ్తారు.

వాళ్ళ వివాహా నంతరం తల్లి దండ్రులకు దూరంగా జరిగి పోతారు.


సేవా తత్పరత వున్న పుత్రులు.

గత జన్మలో మీరు ఎవరి కైనా బాగా సేవచేసి వుండవచ్చును, 

ఆ రుణాన్ని తీర్చు కోవటానికి మీకు కొడుకు లేదా, కుతూరు రూపంలో ఈ జన్మలో వస్తారు. 

అలా వచ్చి బాగా సేవను చేస్తారు. 

మీరు గతం లో  ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది. 


మీరు గత జన్మలో ఎవరి కైనా సేవ చేస్తే, 

ఈ జన్మలో మన ముదుసలి తనంలో మనకు సేవ చేస్తారు. 

లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కెడు నీళ్లు పోసే వారు కూడా మన వద్ద వుండరు.

ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుంది.

అని అనుకోవద్దు. 


ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగా నైనా పుట్ట వచ్చును..


ఒక వేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి వుండవచ్చును.

వాళ్ళే మీ  కొడుకు లేదా, కూతురుగా మీ ఇంట 

పుట్ట వచ్చును. 


ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనియ్య కుండా దూరంగా వుంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా, కూతురుగా మీ ఇంట పుడతారు. 


లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో, వాళ్ళు మీకు శత్రువు రూపం లో పుట్టి 

మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చు కుంటారు.


అందుకనే జీవితంలో ఎవరికీ కూడా కీడు, చెడు చెయ్య వద్దు. 

ఎందు కనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే...

దానికి ఈ జన్మ లో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం  అనుభవం లోకి తెస్తుంది.  


మీరు ఒక వేళ ఎవరికైనా ఒక్క రూపాయి దానం చేస్తే 

అది మీ ఖాతాలో నూరు రూపాయలుగా జమ చెయ్య బడతాయి. 


ఒక వేళ మీరు ఎవరి వద్దయినా ఒక్క రూపాయి లాక్కుంటే మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసి వేయ బడతాయి. 


(అనగా పాప పుణ్యాలు)

 కొద్దిగా ఆలోచించండి.

మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చు కున్నారు.


మళ్లీ ఎంత ధనాన్ని..మీ వెంట తీసు కెళ్తారు..? 


ఇప్పటి వరకు పోయిన వాళ్లు ఎంత బంగారం, 

వెండి పట్టుకు పోయారు..? 


చివరగా ఒకమాట !


తాతగారు  సంపాదించిన ఆస్తినంతా  తగలేసి  మాకు ఏమి మిగల్చలేదని  ఒక కొడుకు బాధపడతాడు .

దానికి కారణం అతనికి తాత తండ్రుల ఆస్తిపాస్తులు అనుభవించే  యోగం లేదన్నమాట !


అతి బీద కుటుంబంలో  పుట్టిన  మరో తండ్రి కోట్లాది రూపాయలు సంపాదించి సంతానానికి మిగిల్చి  చనిపోతాడు. 

దీనికి కారణం ఆ తండ్రి , తన కొడుకుకు  చెల్లించాల్సిన  అప్పన్నమాట !


మీ జీవితంలోని సంఘటనలను ఒకసారి బేరీజు వేసుకొని ఆలోచించండి .


నేను, 

నాది, 

నీది అన్నది.

అంతా ఇక్కడి కిక్కడే పనికి రాకుండా పోతుంది. 


ఏది కూడా వెంట రాదు. 

ఒకవేళ మీ వెంట వస్తే గిస్తే మీ పుణ్య పాపఫలం వెంట వస్తుంది. 


జీవితమన్నా, సంసారమన్న ఏదైనా అనండి అంత ఋణానుబంధం.


కావున మీరు వాస్తవాలను గ్రహించి , 

వాస్తవాలను తెలుసుకొని , 

ఎంత వీలయితే అంత *మంచికర్మలు* చెయ్యండి.

సంకల్ప శుద్ధి

 ✡️  సంకల్ప శుద్ధి  ✡️


‘ఉత్త చేతులతో వచ్చాం. ఉత్త చేతులతోనే వెళ్తాం’ అనుకోవడంలోని తాత్త్వికతను వివేకంతో అన్వయించుకోవాలి తప్ప, నిష్క్రియా పరత్వాన్ని కప్పిపుచ్చుకొనే ముసుగులాగా వాడుకోవడం విజ్ఞత కాదు. అలాంటి సందర్భాల్లో అవి శుష్కప్రియాలవుతాయి. శూన్యహస్తాలుగా మిగిలిపోతాయి•


ఫలానాది సాధించామని చెప్పుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? ఆశల రెక్కలు విప్పి హాయిగా ఎగరాలని, చుక్కల లోకాన్ని చుట్టిరావాలని ఆశించనిదెవరు? ఆసరాగా పందిరి వేసి, వేళకిన్ని నీళ్లు పోస్తే ఎగబాకని తీగ ఉంటుందా, రేకులు విప్పారకుండా ఉంటుందా?


సాఫల్య సాధనలో తొలి అంశం, 'సానుకూల దృక్పథం.' ‘సాధిస్తాను’ అని సంకల్పం చెప్పుకోవడం చాలా అవసరం. అలాగని పని మొదలుపెట్టింది లగాయతు ఫలితం గురించి లెక్కలు వెయ్యడమన్నది సాధకుడి లక్షణం కాదు. దాని వల్ల ఆత్రుత, ఒత్తిడి హెచ్చి, ఏకాగ్రత పక్కదారి పడుతుంది. గమ్యం మరింత దూరమవుతుంది. *వాకిట్లో కాలుపెట్టింది మొదలు వారణాసి ఎంత దూరమని లెక్కలు వేస్తుంటే - ఇక గంగాతీరం చేరేదెన్నడు?


లౌకికం కావచ్చు - పారమార్థికం కావచ్చు... జీవిత సాఫల్యానికి వర్తించే సూత్రాలు, మార్గదర్శకాలు ఒకటే. అన్వయించుకోవడంలోనే ఉంది. ఆధ్యాత్మిక వేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆయా రంగాలకు వర్తించేలా వాటిని చెప్పినా అంతస్సూత్రం ఒకటే!


ఇందులో.. స్పష్టత, వ్యూహం, సహాయం- ఈ మూడు అంశాలూ ప్రధానమన్నది నిపుణుల మాట! ఎందుకు అని ప్రశ్నించుకోవడంలోనే సాధకుడి లక్ష్యం స్పష్టమవుతుంది. మానసికంగా సంబంధిత లక్ష్యంతో సారూప్యం చెందడం వీలవుతుంది. 


ముని బాలుడి శాపం వల్ల ఏడురోజుల్లో చావు తప్పదని తెలుసుకున్న పరీక్షిత్తు ప్రాయోపవేశానికి సిద్ధపడినా..., శుకమహర్షి రాకతో చేరాల్సిన గమ్యం పట్ల స్పష్టత ఏర్పరచుకున్నాడు. వారం తిరగ్గానే మరణం ఎలానూ వస్తుంది. ఇప్పుడే బతుకును బలవంతంగా ముగించడం దేనికని తర్కించుకున్నాడు. విష్ణు సన్నిధికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని స్పష్టంగా ఏర్పరచుకుని, దానికి అనుగుణమైన మానసిక వైఖరిని అవలంబించాడు. 'భాగవత సప్తాహం' ద్వారా జీవిత దిశగా పురోగమించాడు. 


సాఫల్యసాధనలో రెండో అంశం 'వ్యూహం.' ఏడు రోజుల్లో భాగవతాన్ని వినేందుకు సిద్ధపడ్డ పరీక్షిత్తు ఈసురోమని చెవులొగ్గ లేదు. తరిగిపోతున్న దినాలను, ఆయువును తలచుకుంటూ కంటతడి పెట్టనూలేదు. వినడాన్ని ప్రేమించాడు. విష్ణు సాన్నిధ్యం చేరుకోవడాన్ని ఆరాధించాడు. పరిపూర్ణమైన భక్తితో, అంకిత భావంతో, శ్రీమన్నారాయణుడి చరణయుగళంతో మమేకమై తనను తాను సమర్పించుకున్నాడు. విన్న కథల పట్ల, వినిపించిన శుక మహర్షి పట్ల కృతజ్ఞతను కలిగి ఉన్నాడు. ఈ వ్యూహమే ఆయనను సఫలుణ్ని చేసింది. పరీక్షిత్తు ఏ దశలోనూ నిరాశకు తావివ్వలేదు. నీలినీడలను సోకనివ్వలేదు. శుకమహర్షి చెబుతున్న కొద్దీ, శ్రద్ధాసక్తులు మూటకట్టుకుని, అడుగడుగునా పరిప్రశ్నలు వేస్తూ, అడిగి మరీ చెప్పించుకున్నాడు. 


సాఫల్యాన్ని పొందడంలో నిపుణులు సూచించిన మూడో అంశం - 'సహాయం.' అది శుకమహర్షి రూపంలో సరైన సమయానికి లభించడం పరీక్షిన్మహారాజు చేసుకున్న అదృష్టం.


 రాముడి విషయంలో - రావణుడి చెరనుంచి సీతను విడిపించడాన్ని, పాండవుల విషయంలో - కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సాధించడాన్ని సాఫల్య సాధనలుగా భావిస్తే వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచించిన - ‘స్పష్టత, వ్యూహం, సహాయం’ అనే సూత్ర త్రయం వారికి ఎంత చక్కగా వర్తించిందో విశదమవుతుంది. 


 దేశ కాలాదులతో నిమిత్తం లేకుండా జీవితంలోని లౌకిక, ఆధ్యాత్మిక రంగాలు రెండింటిలోనూ సాఫల్య సాధన సుసాధ్యమవుతుంది. చక్కని మార్గం ఉండి... సంకల్ప శుద్ధి పట్ల మనసుండాలి.

గోవు వెనక వెళ్ళడమెందుకు

 గోవు వెనక వెళ్ళడమెందుకు?

పరమాచార్య స్వామివారు విజయయాత్రలలో భాగంగా, వివిధ ప్రాంతాలలో నివసిస్తుండేవారు. అలాంటి సమయాలలో కొందరు భక్తులు, తమ ఇళ్ళకు రమ్మనో లేదా అక్కడి దేవాలయాలకు రమ్మనో అభ్యర్తిస్తుంటారు.

భక్తులు రమ్మని ప్రార్తిస్తున్నది దేవాలయానికే అయితే పరమాచార్య స్వామివారు దాదాపుగా వారి అభ్యర్థనను మన్నించి అక్కడకు వెళ్లి, దేవుని దర్శనం చేసుకుని, దగ్గరలోని ఒక స్థలంలో మకాం చేసి, కొద్దిసేపో లేదంటే ఒకరోజో అక్కడ ఉంది భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తుంటారు. కొన్నిసార్లు ఏదైనా ఉపన్యాసం కాని లేదా సామాన్య విషయాలు చర్చించడం కాని జరుగుతూ ఉంటాయి.

ఒకసారి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తం విజయయాత్ర చేస్తున్నారు. యాత్రలో భాగంగా తిరుచిరాపల్లిలో కొన్నిరోజుల పటు మకాం చేశారు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు.

ఆ భక్తజన సమూహంలో తిరుచ్చిలోని ఒక కళాశాల ప్రధానాచార్యులు కూడా ఉన్నారు. వరుసలో అతని వంతు రాగానే మహాస్వామివారికి నమస్కరించి, ఎన్నోరకాల పళ్ళు పూలు సమర్పించాడు. మహాస్వామివారి దివ్యపాదములు తన కళాశాలను తాకాలని, విద్యార్ధులని అనుగ్రహించాలని ప్రార్థించాడు.

కాని మహాస్వామివారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అతని ప్రార్థనకు మౌనమే స్వామివారి సమాధానం అయ్యింది. అతను మాత్రం రోజూ వచ్చి స్వామివారిని అర్థించేవాడు.

చివరగా ఒకరోజు కరుణాసాగరులైన మహాస్వామివారు అతనిపై తమ దయను ప్రసరింపజేశారు. పటికబెల్లం, కుంకుమ ప్రసాదం ఇస్తూ, స్వామివారు అతనితో, “రేపు ఉదయం మీ కళాశాలకు వస్తాను. ఒక ఆవు, దూడతో నీవు నీ భార్య సిద్ధంగా ఉండండి” అని ఆజ్ఞాపించారు.

ఆ భక్తుని సంతోషానికి అవధులు లేవు. “ఖచ్చితంగా అలాగే చేస్తాను పెరియవా” అని మహదానందంతో వెళ్ళిపోయాడు.

చెప్పినట్టుగానే ఉదయం స్వామివారు కళాశాలకు వెళ్ళారు. అతను ఆవు, దూడ, పూర్ణకుంభంతో సహా స్వామివారికోసం ఎదురుచూస్తున్నాడు. మహాస్వామివారి పూర్ణకుంభాన్ని స్వీకరించి, కళాశాల ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డారు.

స్వామివారు ఆ భక్తునితో, “నువ్వు ఎక్కడేక్కడైతే నేను రావాలి అనుకుంటున్నావో, అక్కడకు నువ్వు ఆవు, దూడను ముందు తీసుకుని వెళ్ళు, నేను అనుగమిస్తాను” అని తెలిపారు.

స్వామివారి ఆదేశం ప్రకారం అతను భార్యతో కలిసి ఆవు దూడను ముందు తీసుకుని వెళ్తూ ఉంటె స్వామివారు ఆవు వెనుకగా వస్తున్నారు. మొత్తం కలియతిరిగిన తరువాత స్వామివారు ఆ భక్తునితో, “సంతృప్తిగా ఉందా?” అని అడుగగా, అతను తనకు కలిగిన ఆనందాన్ని మాటలలో చెప్పడం కుదరక, కళ్ళ నీరు కారుస్తూ, హృదయం ఉప్పొంగి, తనకు స్వామివారు కలిగించిన అదృష్టానికి, వారి దయకు కృతజ్ఞతగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. 

తమ వసతికి తిరిగొచ్చిన స్వామివారు సాయింత్రం భక్తులతో మాట్లాడుతూ, ఉదయం తాము కళాశాలకు వెళ్లోచ్చిన విషయం ప్రస్తావనకు రావడంతో ఒక వ్యక్తి స్వామివారిని, “పెరియవా, కళాశాలో మీరు ఆవు వెనుకగా ఎందుకు వెళ్ళారు?” అని అడిగాడు.

స్వామివారు చిరునవ్వుతూ, “అతను నాపై అత్యంత భక్తిభావం కలవాడు. నేను వస్తే అది కళాశాలకు మంచి అని నమ్మి నన్ను ఆహ్వానించాడు. కాని అది ఆడపిల్లలు చదివే కళాశాల. వారు అన్ని రోజులలోను కళాశాలకు వస్తారు. వారు దూరం ఉండాల్సిన సమయాలలో కూడా కళాశాలకు వస్తారు. అందుకే నేను ఒక ఆలోచన చేశాను. అతని కోరికను తీర్చాలి. నా అనుష్టానం, నియమపాలన కూడా కాపాడబడాలి. దానికి పరిష్కారం ఒక్కటే. మన శాస్త్రాలలో ఉన్నదాని ప్రకారం, ఎటువంటి అశౌచమైనా, ఎటువంటి స్థలమైనా గోవు డెక్కల నుండి వచ్చే ధూళి తగిలితే, ఆ స్థలం పవిత్రమవుతుంది. అందుకే ఆవును ముందు వదిలి నేను దాన్ని అనుసరించాను” అని బదులిచ్చారు.

స్వామివారు చెప్పిన విషయాన్ని విన్నవారందరూ స్థాణువులై నిలబడిపోయారు. ఇంతటి ధర్మసూక్ష్మము ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ధర్మాన్ని, ఆశ్రమ నియమ పాలనను ఇంతగా పాటించే జీవితం ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ఇలా దయను కూడా ధర్మంతో ముడిపెట్టి పాలించేవారు కంచి పరమాచార్య స్వామివారు కాక ఇంక ఎవరు ఉంటారు?

--- “కడవులిన్ కురల్” - తిరువారూర్ దివాకరన్. ‘కుముదం’ పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।

2, సెప్టెంబర్ 2022, శుక్రవారం

*అమ్మ కొంగుచాటు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*🌷శ్రీమతి శశికళ ఓలేటి గారి కథనం🌷*

                *అమ్మ కొంగుచాటు!* 

                       🌷🌷🌷                                         


“ అమ్మకూ నాకూ మధ్య అడివంత దూరం! అడివయితే పరవాలేదు అఖాతం కాకుండా ఉంటే చాలు!”… అనుకుంటూ…దట్టమయిన చెట్లు చీకట్లు పరుస్తూంటే, అడివి గుండా నెమ్మదిగా డ్రయివ్ చేస్తున్నాడు భాస్కర్. 


“ అమ్మతో ఆ విషయం ఎలా ప్రస్థావించాలో ఏమిటో? అమ్మ ఎలా తీసుకుంటుందో. నన్ను అసహ్యించుకుంటుందేమో. ఇన్నాళ్ళూ తన బాధ్యతలు ఏదీ పంచుకోకుండా, దేశాంతరాలు ఉద్యోగనిమిత్తం పారిపోయి, ఇప్పుడు హఠాత్తుగా ఊడిపడి… ఇల్లూ, పొలం అమ్మేసి నా దగ్గరకు వచ్చేయి… అంటే…ఒప్పుకుంటుందా? లేక తను పెంచిన కొడుకేనా ఈ వంచకుడు… అనుకుంటూ నిరసిస్తుందా?”…అతని తలపులు అతన్ని సతమతం చేస్తుంటే, ఎదురుగా వస్తున్న అడవి దున్నను ఇంచుమించు గుద్దేయబోయాడు. హఠాత్తుగా వేసిన బ్రేకు… కారుని మూడొండల అరవై డిగ్రీలు తిప్పి, పక్కనున్న గెడ్డ లోకి తోసేసింది. 


       కారు కదిలే పరిస్థితి లేకపోవడంతో, ముఖ్యమయిన వస్తువులు తీసుకుని, అడవిదారిని నడవసాగాడు భాస్కర్. ఆకాశం మేఘాచ్ఛాదితమై ఉంది. అలసిన ప్రాణానికి సాంత్వనిస్తూ చల్లగాలి  తగులుతోంది. దారిలో మర్రిచెట్టు కింద చిన్న గూడులో “కడిమితల్లి రాయి”…పసుపుకుంకాలతో, అడివిపూలతో కలకలలాడుతోంది. ఎంత చిరపరిచితమైన పరిసరాలు ఇవన్నీ. అమ్మకొంగు పట్టుకుని బాల్యమంతా తారాడిన నెలవులు. కడిమితల్లి రాయి తనూ, అమ్మే కదా మోసుకుంటూ తెచ్చి అక్కడ పెట్టింది. 


బడికి వెళ్ళాలంటే అడవి దాటాలి… “ఒంటరిగా. భయం వేస్తోందమ్మా… “…అంటే కడిమి చెట్టు కిందుండే రాయిని తెచ్చి అక్కడ పెట్టి… “ ఈమె కదంబవన వాసిని. నిన్ను సదా రక్షిస్తూ నీతోనే ఉంటుంది!”…అంది అమ్మ. ఒకరోజు ఇలాంటి వానలోనే దారి తప్పినపుడు “ కడిమి తల్లీ!” అని పిలుస్తూ ఏడుస్తున్నాడు తను. ఇంతలో ఓ చెట్టు కింద తలదాచుకున్న ఒక అమ్మాయి, చెంచెత తన చెయ్యి పట్టుకుని ఇంటిదాకా తెచ్చి వదిలింది. అమ్మకు చెప్తే… “ అమ్మవారే కాపాడింది!”… అంటూ ఊరంతా చెప్పడం, కడిమితల్లి రాయి దేవతగా పూజింప బడడం మొదలయ్యింది అక్కడ. 


          “అయినా వేరే దేవతలేలా? అమ్మే పెద్ద దేవతామూర్తి. ఎంత సహనం, ఎంత శాంతం. సాటివారంటే ఎంత ప్రేమ. చిన్నవయసులో పెళ్ళి, పెద్దపెద్ద బాధ్యతలు మోస్తూ, నాన్న కోపాన్ని సహిస్తూ, చాలా ఏళ్ళు గొడ్రాలిగా ముద్రపడి, లేకలేక పుట్టిన తనను అపురూపంగా పెంచుకుంటూ…అలాంటి అమ్మను అనాధలా ఇన్నేళ్ళూ వదిలేసి, ఇప్పుడు తన స్వార్ధ ప్రయోజనం కోసం వెళ్తున్నాడు తను”… మనసంతా సిగ్గుతో ముడుచుకుపోయింది. సన్నగా చినుకులు మొదలవ్వడంతో నడక వడి పెంచాడు భాస్కర్. 


“ఎండొచ్చినా, వానొచ్చినా తన పెద్ద పవిటను ముందుకు లాగి, గొడుగులా పట్టి, తనకు ఆచ్ఛాదన నిచ్చేది అమ్మ. తను చిన్నపిల్లలా మారిపోయి ఎన్ని ఆటలాడేది. ఎన్ని పాటలు పాడేది. అమ్మ అంతరంగం అడివిలా చాలా లోతుగా, చిక్కగా రహస్యాలన్నీ దాచుకున్నట్టే ఉండేది. ఇంట్లో కన్నా ఎక్కువ పొలంలో, అడివిలో ఎందుకు ఆడించేదో మెల్లగా అర్ధమయ్యే వయసు వచ్చింది తనకు. రోజంతా బాధ్యతలు పట్టకుండా తాగుడులో గడిపే తండ్రి, అతని వ్యసనాలకు కరిగిపోతున్న ఇంటిపరువు, ఆస్తిబరువూ… తన కంట పడకూడదనే ఆమె తాపత్రయం అర్ధమవుతూ ఉండేది.”


      “తనను అమ్మ నుండి దూరం చేసిన రోజు తనకు ఇంకా గుర్తుంది. బాల్యచాపల్యం కొద్దీ నాన్న తాగి వదిలేసిన సీసాలోని ద్రావకం తను తాగాడు. అది చూసిన అమ్మ మొట్టమొదటి సారి తన మీద చెయ్యి చేసుకుంది. అలాగే చేతిలో చెయ్యి వేయించుకుంది…. జీవితంలో దాని మొహం చూడకూడదని. తన కోసం నాన్న ముందు గొంతు విప్పింది. బాబాయింటికి పట్నం పంపేసింది చదువులకు. ఒక హాస్టలు నుండి మరో హాస్టలుకు మారుతూ తన చదువంతా బయట ఊళ్ళలోనే. సెలవలకు అమ్మమ్మ ఇంట్లో అమ్మను చూడ్డమే”


తండ్రిగా తనకు ఏ జ్ఞాపకాలూ మిగల్చని తండ్రి తనకు ఒకే బాధ్యత నప్పచెప్పాడు. ఆయనకు కొరివి పెట్టడం. ఆయనతో అన్నేళ్ళ పాటూ సహజీవనం చేసిన ఆ మరోస్త్రీకి కూడా ఎంతో కొంత అప్పచెప్పి… మర్యాదగా సాగనంపిన తల్లి సంస్కారానికి దణ్ణం పెట్టాలో , లేక అన్నేళ్ళూ పడ్డ మనోవేదనకు చలించిపోవాలో కూడా అర్ధం కాలేదు తనకి. ఏదయితేనేం తండ్రితో ఉన్న ఋుణానుబంధం తీరిపోయింది. ఒక విధంగా ఊరితో కూడా. 


అమ్మ మాత్రం స్వయంగా పొలం పనులు చేసుకుంటూ, నాన్న పోగొట్టిన భూమినంతా తిరిగి సాధించుకుంది. ఇల్లు నిలబెట్టుకుంది… దేనిలోనూ తన కష్టం, ప్రమేయం లేకుండానే. 


        చదువవుతూనే, గల్ఫ్ లో ఉద్యోగం, దానికి ముందు స్నేహితుని చెల్లెలు కవితతో కులాంతర వివాహం అన్నీ కలలోలాగా జరిగిపోయాయి. కలల్లో బతికే కవితకు… కష్టాన్ని నమ్ముకున్న అమ్మకూ జత కుదరకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు, కానీ తననూ, అమ్మనూ విడగొట్టేంత విద్వేషం కవితలో ఎందుకో ఇప్పటికీ జవాబు లేని ప్రశ్న. మనవల కోసం తపించే అమ్మకు వాళ్ళు లీలగా గుర్తంతే. అంతలా ఎడం పెట్టింది కవిత అమ్మనుండి. ఈ రోజు స్వదేశంలో స్థిరపడుతూ… అమ్మ, ఆమె ఆస్తులు కావలసి వచ్చాయి కవితకు. “కలవాలి అమ్మను, మాట్లాడాలి మనసు తీరా… ఆస్తి కోసం కాదు…ఆత్మీయత కోసం. అందుకే తన ఈ ప్రయాణం”…..


   ఆలోచనల్లో పడి  పక్కనే ఏదో మోటర్ సైకిల్ ఆగడం గమనించనే లేదు భాస్కర్ . “ ఎవరింటికి అబ్బాయిగారూ? ఊళ్ళోకి వెళ్తున్నా. దిగపెట్టమంటారా?”… ఆపద్బాంధవుడిలా అడిగాడు అతనెవరో. ఇంటి దాకా దింపే వాడే…. వర్షం ముసురులా మారకపోతే. ఊరు పట్టణంలా మారిపోయి చాలా రోజులే అయిపోయినట్టుంది, గుర్తుపట్టనంతగా మారిపోయాయి వీధులన్నీ. చిన్న డాబా దగ్గర ఆపి, వాన తగ్గాకా వెళ్దామని ఆపాడతను. ఇలా మహాలక్ష్మిగారి అబ్బాయిని అని చెప్పాడో లేదో…అక్కడ ఉన్నవాళ్ళంతా గుమికూడిపోయారు. ఎవరి నోట విన్నా తల్లి గుణగణాలూ, ఉపకారాలూ, మంచిమాటలే. కడుపు నిండిపోయింది భాస్కర్ కు. వాళ్ళిచ్చిన వేడి టీ తాగుతూ… తల్లికి ఫోన్ చేసాడు. అమ్మ కదా…” వానలో తడుస్తూ రాకు నాన్నా. కారు పంపుతాను.”… అంటూ జాగ్రత్తలు. ఆమె గొంతులో సంభ్రమాశ్చర్యాలు దాచినా దాగడం లేదు. 


       మరో పదినిమిషాలు గడిచాయి. డాబా ముందు కారాగిన శబ్దం. “కారులోండి చీకట్లో గొడుగు వేసుకుని వడివడిగా వస్తోంది ఎవరదీ… అమ్మే కదా.” ఒక్క ఉదుటున బయటకు పరిగెట్టాడు. గొడుగు పట్టిన అమ్మను పట్టుకుని కొడుకు…ఇరువురూ ప్రేమ కోసం తపిస్తున్న దాహార్తుల్లా. దారంతా మాటల్లేవు. తల నుండి కారుతున్న నీళ్ళతో కన్నీరు కలిసిపోతోంది. 


      ఇంటికి చేరగానే… ఎదురుగా తండ్రి… నిలువెత్తు పటంలో. అప్రయత్నంగా నమస్కరించాడు. “బహుశా ఈ జన్మసంస్కారమే ఈ దేశంలో బాంధవ్యాలను గట్టిగా పట్టి ఉంచిందేమో! “. 


తల్లికి సాయంగా ఉంటున్న రైతు కుటుంబం వచ్చి పలకరించారు. తల తుడుచుకుంటూ…వాళ్ళతో మాట్లాడుతుంటే.. తల్లి కొంగు పట్టుకుని వ్రేలాడుతూ… అచ్చం చిన్నప్పటి తనలాగే నాలుగేళ్ళ పిల్లాడు, పెద్దపెద్ద కళ్ళతో, బూరి బుగ్గలతో, ఉంగరాల జుట్టేసుకుని… తన కేసే ఉత్సుకతతో చూస్తూ. 


“ పెద్దనాన్న!”… అంటూ ముందుకు తోసింది తల్లి. అప్రయత్నంగా చేతులు చాపాడు భాస్కర్. అంతే పరుగుల్న వచ్చి, చంకనెక్కాడు వాడు. 


       “ రోహిత్” ట వాడి పేరు. రాత్రంతా కురుస్తున్న వానతో పాటూ సాగిన తల్లీకొడుకుల కబుర్లధారలో ఎన్నో విషయాలు దొర్లాయి. రోహిత్ తల్లీతండ్రీ పొలంలో పనిచేస్తూ…పిడుగుపాటుతో చనిపోవడంతో రోహిత్ తన ఒడి చేరాడని,  న్యాయబద్ధంగా దత్తత చేసుకుని, రెండేళ్ళ నుండి తనే పెంచుతున్నట్టు చెప్పింది తల్లి. తన బిడ్డలు పొందవలసిన నాయనమ్మ ప్రేమ ఒక అనాధకు దక్కడం… భాస్కర్ లో చిన్న అసహనాన్ని కలిగించినా, అది క్షణికం మాత్రమే. అతనికి తన తల్లి మనసు తెలుసు. ఆమె ఏనాడూ తనకు దక్కని బంధాల గురించి వగచే మనిషి కాదు. తను కావలసిన వారినే బంధాలుగా మార్చుకునే మనిషి. జీవితంలో ఎలాంటి అసంతృప్తీ, పితూరీలు లేని మనిషి. 


      రెండు రోజుల్లో తిరిగి వెళ్ళిపోవాలని వచ్చిన భాస్కర్…వారం రోజులు ఉండిపోయాడు. చేజార్చుకున్న తల్లి ప్రేమ మళ్ళీ ఇన్నాళ్ళకు సంపూర్ణంగా అనుభవిస్తున్నాడు అతను. తల్లి కష్టించి, పెద్దది చేసిన పొలం చూసొచ్చాడు. ఫార్మ్ హౌస్ లో పౌల్టరీ, ఆవుల్నీ చూసి ఆశ్చర్యపోయాడు. పెద్ద చదువుసంధ్యలు లేకపోయినా, ఎలాంటి మగదక్షత లేకుండా తెలివితేటలతో, శ్రమతో ఆమె పెంచిన ఆ చిన్న సామ్రాజ్యం చూసాకా, రోహిత్ తో, అక్కడి రైతుల కుటుంబాలతో ఆమె పెంచుకున్న అనుబంధం చూసాకా…తల్లితో ఆస్తులు అమ్మించి, తనతో రమ్మని పిలవాలన్న ఆలోచనకు పూర్తిగా స్వస్థి చెప్పేసాడు భాస్కర్. తనకు శక్తి ఉంటే… కనీసం సమీపభవిష్యత్తులో నయినా తన పిల్లలను తన తల్లికి దగ్గర చెయ్యాలి అన్న ఆలోచన ఒక్కటే అతని మనసులో! 


    ఉరుమూ మెరుపూ లేకుండా ఊడిపడ్డ కొడుకు రాక యాదృచ్ఛికం కాదని ఆ అమ్మకు తెలీదా! బయట పడతాడేమో అని ఎదురు చూస్తోంది. కానీ ఎంత కాదన్నా ఆమె పెంపకం కదా. తల్లిని బాధపెట్టే ఏ మాటా అతని నోటంట రావడం లేదు. అతని ప్రయాణానికి ముందురోజు…కొడుక్కి అన్ని వివరాలూ చెప్పడం మొదలుపెట్టింది. ఎంత సంపాదించి పెట్టింది, అతని పిల్లలకు ఏం ఇవ్వబోతోంది .. రోహిత్ బాధ్యత, తనను నమ్ముకున్న కుటుంబాల సంక్షేమం.. వంటివి తల్లి చెప్తుంటే మౌనంగా వింటున్నాడు. 


“ నా మనవల కోసం పొదుపు చేసిన అరవై లక్షలున్నాయి భాస్కర్. వాళ్ళ పెద్దచదువుల కోసం ఇప్పుడే వాడుకో. మామయ్య నాకు తన అవసరార్ధం అమ్మిన విలువైన షేర్లు ఉన్నాయి. అవి అమ్ముకుని…ఏ ఇంటి మీదయినా పెట్టుకో! మిగిలినవి నా చివర వరకూ ఉంటాయి. ఈ వూరు విడిచి, నీ దగ్గరకు రమ్మనమని నువ్వు అడగచ్చు. కానీ ఊరితో, భూమితో, రోహిత్ తో నా అనుబంధం ఇప్పట్లో తెంపుకునేది కాదు. అమ్మగా ప్రస్థుతం నేను ఇంతే చెయ్యగలను నీకు. విదేశాల్లో సంపాదించింది ఇక్కడ వ్యాపారాల్లో పెట్టి నష్టపోయావని తెలిసింది. ఎప్పటికీ ఈ ఇంటి తలుపులు నీకోసం తెరుచుకునే ఉంటాయి. నువ్వెప్పుడూ నా గారాల కన్నయ్యవే. అమ్మకొంగు పట్టుకుని నువ్వెంత రక్షణ పొందావో, నీ చిట్టిచేయి పట్టుకుని ఈ అమ్మ కూడా అంత ఆసరా పొందింది నీ బాల్యంలో!”…కొడుక్కి చెప్పుకుంటుంటే ఆమె చెంపల మీంచి కన్నీరు జారిపోతోంది. 


          తల్లి అన్నీ తెలుసుకుంటోంది, తనను వదిలేయలేదన్న విషయం అతనికి కొండంత ధైర్యాన్నిచ్చింది. ‘అమ్మకొంగు చివరనే నేను ఎప్పుడూ’ అన్న నిశ్చింత అతని పరాజయాల్ని మరిపింప చేసింది. 


      “ నువ్వు రావద్దమ్మా నా దగ్గరకు. ఆమె ఉన్న ఇంట్లో నువ్వు ఒక్క క్షణం ఉండలేవు. నీకు గౌరవం లేని చోట నిన్ను ఉండనియ్యను. నేనే వస్తాను నీ దగ్గరకు. నీ మనవలు వస్తారు.నీ చెయ్యి ఎప్పుడూ అంతెత్తులో ఉండాలిసిందే. నేనే వస్తా నీ దగ్గరకు.!”…కన్నీళ్ళతో పలవరిస్తున్నట్టు చెప్తున్నాడు భాస్కర్. 


శశికళ ఓలేటి.

వక్రములను తొలగించే గణపతి

 వక్రతుండ నామార్ధం


గణపతికి వక్రతుండుడని పేరు. వక్రతుండ అనగానే వంకర తొండము కలవాడని చెప్పేస్తారు, కానీ నిజానికి అది వక్రతొండం కాదు, వక్రతుండం. వక్రానాం తుండయతి ఇతి వక్రతుండః అని అంటున్నది గణేశపురాణం. వక్రములను తుండనము చేయువాడు వక్రతుండుడు. వక్రములంటే దుష్టశక్తులు, దురలవాట్లు, చెడు సంస్కారాలు, పాపౌ ఆలోచనలు, నీచభావనలు మొదలైనవి చెప్పుకోవచ్చు. దుష్టులను శిక్షించేవాడు కనుక గణపతి వక్రతుండుడయ్యాడు. గణపతి శాంత స్వభావుడు అయినా, దుష్టులపట్ల చండశాసనుడు, కాలుడు. తన తొండంతో దుష్టులను, అరిష్టాలను, గండాలను, దోషాలను ద్వంసం చేస్తాడు. దుష్టులంటే వ్యక్తులే అని భావించనవసరంలేదు. మనలో కూడా అనేక చెడు సంస్కారాలు, నీచపు ఆలోచనలు ఉంటాయి. వాటిని నాశనం చేస్తాడు కనుక గణపతికి వక్రతుండ అని పేరు. అంతేకాదు, మనలో చెడు తొలగించినా, మనం మంచిగానే ప్రవర్తించినా, ఎదుటివారు మనకు కీడు చేయవచ్చు. కనుక అటువంటి వారి వక్రమైన ఆలోచనల పాలిట కాలుడై, నంశింపజేయువాడు కనుక గణపతికి వక్రతుండ అన్న నామం వచ్చింది.


పిల్లలు దురలవాట్లకు లోనైనప్పుడు, తల్లిదండ్రులు గణపతికి వక్రతుండ నామంతో జపించి, అర్చించి, వేడుకుంటే, తప్పుత్రోవ పట్టిన పిల్లలు తిరిగి మంచిమార్గంలోకి వస్తారు. ఈ వక్రతుండ అన్న నామం చాలా మహిమాన్వితమైంది. తంత్రశాస్త్రంలో సదాచారతంత్ర విధానంలో 'ఓం వక్రతుండాయ నమః' అనే వక్రతుండ గణపతి మంత్రానికి ఒక బీజాక్షరం చేర్చి, జపిస్తారు. ఈ వక్రతుండ గణపతి మంత్రాన్ని గణపతి గురించి తెలిసినవారి వద్దనుంచి గ్రహించి జపించాలి. ఆ జపం చేయడం వలన ఉపాసకుడి పై చేసిన ప్రయోగాలు విఫలమవుతాయి. మనం ధార్మికంగా ఉన్నా, లోకమంతా వ్యతిరేకంగా మారి, మనపై యుద్ధానికి వస్తున్న సమయంలో, ఈ వక్రతుండ గణపతిని జపిస్తే, చాలా త్వరగా వక్రమైన ఆలోచనలు నశించి, మిత్రభావం ఏర్పడుతుంది. ప్రపంచంలో అల్లకల్లోలాలు, ఉత్పాతాలు, యుద్ధాలు ముంచుకొస్తున్న సమయంలో వక్రతుండ గణపతి మంత్రాన్ని జపిస్తే, తక్షణమే ఫలించి, లోకంలో శాంతి ఏర్పడుతుందని చెప్పారు. ఎప్పుడైనా ఆపదలు ముంచుకోస్తే, పరిస్థితులు చేజారితే, వెంటనే వక్రతుండ అనే నామంతో గణపతి స్మరించాలి. రక్షణ కలుగుతుంది. తొండం యొక్క ప్రస్తావన వచ్చింది కనుక గణపతికి ఉండే వంకర తిరిగిన తుండం ఓంకారానికి సంకేతం అని గుర్తుపెట్టుకోండి.


ఓం వక్రతుండాయ నమః


వక్రములను తొలగించే ఆ గణపతి మనలోని చెడు భావనలను తొలగించుగాకా

ఓం గం గణపతయే నమః

గురు మూర్తియే

 జయజయ శంకర  హరహర  శంకర


     ఛాందోగ్య  ఉపనిషత్తులోని  మూడు  నాలుగవ  అధ్యాయములలో  మధువిద్య, సంవర్గవిద్య  అని రెండువిద్య  లున్నవి. తత్త్వమసి  వాక్యము  ఛాందోగ్యములోనిదే.

    శ్వేతకేతువుకు, అతని  తండ్రి  గురువును అయిన  ఉద్దాలక  ఆరుణి- తత్త్వమసి  యని  తొమ్మిదిమార్లు  ఉపదేశము చేశాడు - తత్  అనగా  పరమాత్మ యగు  బ్రహ్మము. త్వం  అనగా  జీవాత్మ - అసి అనగా వున్నావు.

    నీవు  బ్రహ్మముగా  నున్నావు - అని దీని అర్థం. సాధనలుచేసి  ఎన్నడో  భావికాలమున  నీవు  బ్రహ్మ అవుతావని కాదు. ఇప్పుడూ  ఎప్పుడూ  నీవు  బ్రహ్మమే - అని  తండ్రి  శ్వేతకేతువుకు  బోధిస్తాడు.

       ఐనచో  సాధనలు  ఎందుకు? బ్రహ్మగా  మనమున్నా  మనకు  బ్రహ్మనిష్ఠలేదు. వున్నచో  మనలను  ఆవరించుకొనివున్న  కామక్రోధాదుల మాట ఏమి? సంతత  బ్రహ్మనిష్ఠులమై  యున్నచో  నిస్తరంగ సముద్రంలాగా  వుంటాము కదా ! అట్లు  ఒకస్థితి వున్నదని  కూడా  తెలియని  స్థితిలో  కదా మనమున్నాము?

      బృహదారణ్యకములోని  " చెలది  పురుగు తన దేహమునుండి  వెలువడు  తంతువులచే  గూడును అల్లినట్లు, అగ్ని నుండి  విస్ఫులింగములు  వెలికి వచ్చినట్లు, బ్రహ్మ  నుండి సమస్త  ప్రపంచము  నిర్ణయించుచున్నది" అను  మంత్రమును  భగవత్పాదులవారు  వివరించునపుడు  భిల్లుని కథ చెప్పి ' ఆదర్శ  సంప్రదాయవిద  ఆఖ్యాయికాం సంప్రచక్షతే' - సంప్రదాయ విదులు  చెప్పిన కథ అని  వ్రాసినారు.

      ఈ  కధలోని  భిల్లుడు  రాజుగా మారలేదు. అతడు ఎప్పుడూ  రాజకుమారుడే. కాని  భిల్లుల  సాంగత్యము వల్ల  తన్ను  భిల్లుడని అనుకున్నాడు. మంత్రి  ఉద్భోధవల్ల  తాను భిల్లుడు కాదనీ, రాజకుమారుడనీ గ్రహించాడు. అజ్ఞానస్థితిలో  భిల్లుడనియా, జ్ఞానము  కలిగిన  పిదప తాను రాజకుమారుడని తెలుసుకొన్నాడు.

      మన  స్థితికూడ  ఈ భిల్లుని వంటిదే. మనమందరమూ  జీవాత్మలు  అన్న భావనలో  సంసారులముగా  ఉన్నాము. వాస్తవంగా  మనము  పరమాత్మలమే. మన స్వరూపాన్ని  మనకు బోధించి  దానిని  అనుభవములోనికి  తెచ్చుకొనుటకై  వలసిన  సాధనాంగములను  నేర్పి, మన కర్మావశేషమును  నిర్మూలించుటకు  తన  తపస్సును వ్యయంచేసి మనలను  ఉద్ధరించు అవ్యాజకరుణామూర్తి  ఎవరు?

     మన  గురు మూర్తియే!