కంచి పరమాచార్య ఉపన్యాసాలలో చిన్నమెరుపు - 12 .
పంచాంగ నమస్కారం అంటే రెండుచేతులూ రెండుకాళ్ళూ , రెండుమోకాళ్ళూ, వక్షస్సు , తల, నేలకు తాటించటం.
పురుషుల మాదిరిగా స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయరు. వారు చేసేది పంచాంగ నమస్కారం . మొత్తం శరీరాన్ని నేలపై ఆన్చడం మంచిదయినా పూర్వులు మాతృత్వాన్ని గమనించారు . స్త్రీలందరూ అంబికా స్వరూపులే కదా ! గర్భం లో పిల్లను మోస్తోంది . పాలనిస్తోంది . అట్టి పనులు చేసే భాగాలు నేలకు తగలగూడదని వద్దన్నారు
వణక్కం అంటే వంగుట యని తమిళంలో అర్ధం . నమస్కారం లో ' నమ ' కు కూడా వంగుట అనే అర్ధం . నమ్ అనగా వంగుట . నమనం దాని నుండి వచ్చిందే .
ఎవ్వరూ సంస్కృతాన్ని మాతృ భాషగా వాడటం లేదు . కానీ , మత గ్రంధాలన్నీ సంస్కృతంలో వున్నాయి . అర్చన అందులోనే అనాదిగా సాగుతున్నది . ఆలయాలు ఒకే ప్రాంతానికి పరిమితం కావు . అనేక ప్రాంతాల వారు వచ్చి దేవతలను పూజిస్తారు. అందుకే సంస్కృతం.
అందరూ ఒక కుటంబం అనే భావన దీని వలన కలుగుతుంది . జాతీయ సమైక్యం కోసమయినా కొన్ని సంప్రదాయాలను కాదనకూడదు .
జమ్మూ కాశ్మీరు లో వున్న వైష్ణవీదేవి ఆలయమయినా, దక్షిణ ప్రాంతం లోని రామేశ్వరమయినా భారతీయులందరూ పాల్గొంటారు .
🌹🙏
మరికొంత ఇంకొకసారి..
ప్రేమతో,
గండవరపు ప్రభాకర్,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి