25, మే 2023, గురువారం

శీలముచేత (ప్రవర్తనచేత) మాత్రమే శోభిల్లుతాడు‌

 .

                 _*సుభాషితమ్*_

 𝕝𝕝శ్లోకం𝕝𝕝

*న ముక్తాభిర్న మాణిక్యైః*

*న వస్త్రైర్న పరిచ్ఛదైః*।

*అలఙ్క్రియేత శీలేన* 

*కేవలేన హి మానవః॥*


తా𝕝𝕝  మానవుడు ముత్యాలహారములచే గానీ మాణిక్యాలు ధరించుటచేగానీ విలువైన వస్త్రాలు ధరించుటచే గానీ శోభిల్లడు.

*_మానవుడు తన శీలముచేత (ప్రవర్తనచేత) మాత్రమే శోభిల్లుతాడు‌ అని భావము.*

షష్టిపూర్తి ఎందుకు చేస్తారు?🌷

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌷షష్టిపూర్తి ఎందుకు చేస్తారు?🌷*     

                 🌷🌷🌷

*మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120                       సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది.             60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది                  షష్టిపూర్తి. ప్రతివారికీ మృత్యువు 60 వ యేట          ‘ఉగ్రరథుడు’ అను పేరుతో, 70 వ యేట ‘భీమరథుడు’        అను పేరుతో , 78 వ యేట ‘విజయరథుడు’      అనుపేరుతో ఎదురుచూస్తుంటాడు. ఆరోగ్య.        సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ.*       *షష్టిపూర్తి."*


*బృహస్పతి, శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.*


*మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి.*


*షష్టిపూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము… ‘ఆయుష్కామనయజ్ఞము’*


*పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు.*


*తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీసి వాటిమీద అయిదు అడ్డగీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు. వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం. అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను , 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు.*


*పక్షములను, తిదులను వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శనిని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని, జలము, భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లను ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ - ఇంకా ఏకాదశ రుద్రులు , నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతో వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు.*


*అపమృత్యు నివారణార్థం హోమాల్ని , జపాలని కుడా చేస్తారు. తదుపరి బ్రహ్మణులను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు.* 


*పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరిగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.*


*పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి."*


*సేకరణ:- వాట్సాప్ పోస్ట్.*

తెలుసుకుని వ్యవహరించాలి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

😀


అమెరికా వెళ్లే భారతీయులందరూ తప్పక చదవాల్సిన వ్యాసం..


US ఖరీదైన దేశం, కానీ దాని పౌర సేవలు అత్యున్నత ప్రమాణాలు.  


వేసవిలో, యుపిలోని కాన్పూర్ నుండి ఒక కుటుంబం సెలవు కోసం యుఎస్ వెళ్ళింది.  అందులో ఒక జంట, వారి ఇద్దరు పిల్లలు మరియు ఆ వ్యక్తి తండ్రి ఉన్నారు.


న్యూయార్క్ నగరంలో మూడు రోజుల తర్వాత, నయాగరా జలపాతానికి వెళ్లేందుకు కారును అద్దెకు తీసుకున్నారు.  NYC నుండి నయాగరా వరకు ఉన్న ఇంటర్‌స్టేట్ హైవే అద్భుతంగా ఉంది.


 ఒక 80+ అమెరికన్ మహిళ వారి వెనుక కారులో ఉంది, సురక్షితమైన దూరం ఉంచింది.  


భారతీయ పిల్లలు వెనుక సీటుపై మోకరిల్లి, వెనుకకు చూస్తూ, నవ్వుతూ, వెనక్కి ఊపుతూ ఉండే అమెరికన్ లేడీకి తరచూ ఊపుతూ ఉంటారు.


అకస్మాత్తుగా అమెరికన్ లేడీ వెనుక సీటు కిటికీలో నుండి ఒక వృద్ధ భారతీయుడి తల బయటకు వచ్చి రక్తం వాంతి చేసుకోవడం చూసింది.


ఆమె తన కారును పక్కన ఆపి వెంటనే సహాయం కోసం 911కి కాల్ చేసింది.


వెంటనే, అంబులెన్స్ హెలికాప్టర్ కనిపించింది.  అది ఒక మైలు ముందుకి దిగి, కారును ఆపమని భారతీయ కుటుంబానికి సంకేతాలు ఇచ్చింది మరియు శిక్షణ పొందిన వైద్య సిబ్బంది వృద్ధుడిని దాదాపు ICUలో ఉన్న ఛాపర్‌లోకి తీసుకెళ్లారు.  ఆక్సిజన్ సరఫరా ప్రారంభమైంది.


హృదయ స్పందన రేటు మరియు ఇతర పారామితులు పర్యవేక్షించబడ్డాయి.  సూచనలను అందించడానికి జాన్ హాప్‌కిన్స్ నుండి ఒక స్పెషలిస్ట్ MD వీడియో కాల్‌లో ఉన్నారు.


అరగంటలో, వృద్ధుడు క్షేమంగా ఉన్నాడని మరియు మళ్లీ ప్రయాణించడానికి సరిపోతాడని ప్రకటించారు.


అమెరికన్ లేడీ త్వరిత సహాయం మరియు సమయానుకూల చర్యకు అభినందనలు!


ఈ సేవల కోసం, వ్యక్తి నుండి 

$ 5,000 వసూలు చేయబడింది...


ఒక భారతీయ కుటుంబానికి ఇది చాలా డబ్బు.


ప్రణాళికేతర ఆర్థిక ఖర్చులతో, కాన్పూర్ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు మరియు అతని తండ్రిని తిడుతూ...


"పాన్ (తమలపాకులు) తిని కారులోంచి ఉమ్మివేయాల్సిన అవసరం ఎక్కడిది!"


*సేకరణ: వాట్సాప్ పోస్ట్.*

నీతి:-

వేరే దేశానికి వెళ్ళినపుడు అక్కడి పరిస్థితులు, పద్ధతులు తెలుసుకుని వ్యవహరించాలి.  లేకపోతే ఇలాగే ఔతుంది. 

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 70*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 70*


ఖణెల్ ... ఖణెల్... మంటూ కత్తులు ఒకదానిని మరొకటి మార్కొంటుంటే వాటి రాపిడికి, నిప్పురవ్వలు రాలాయి. 


అలెగ్జాండరూ, చంద్రుడూ తెగబడి వీరావేశంతో రంకెలు వేస్తూ పోరాడుతుంటే ఎవరు ఎక్కువో, ఎవరు తక్కువో వారి ద్వంద యుద్ధాన్ని చూస్తున్న వారికి అర్థం కాలేదు. పోరు అంతకంతకీ తీవ్రమవుతోంది. ఆవేశకావేషాలు మిన్నంటుతున్నాయి. ఖడ్గచాలన శబ్దాలతో ఆ మందిరం దద్దరిల్లిపోతుంది. 


అంతలో మెరుపు మెరిసినట్లు అలెగ్జాండర్ విసిరిన కత్తి వ్రేటుని చప్పున తలవెనక్కి వంచి తప్పించుకున్న చంద్రుడు, రెప్పపాటులో అడుగుముందుకు వేస్తూ తన కరవాలాన్ని చక్రవర్తి మీదకు విసిరాడు. అత్యంత లాఘవంగా విసిరిన ఆ వ్రేటుకి చక్రవర్తి చేతనున్న ఖడ్గం పై కెగిరి, పై నుంచి జర్రున కిందికి జారుతూ చక్రవర్తి నడుముకి వ్రేలాడుతున్న వొరలోకి దూరిపోయింది. 


క్షణం పాటు నిశ్చేష్టుడయ్యాడు యవన చక్రవర్తి. మరుక్షణమే తేరుకుని చప్పట్లు చరుస్తూ... 

"శభాష్ ! వీరుడివని నిరూపించుకున్నావ్. ఈ యవన సార్వభౌముని మనస్సు గెలుచుకున్నావు. నీకు తప్పక సహాయం చేస్తాం" అన్నాడు అభినందిస్తూ. 


చంద్రుడి వదనం వికసించింది. చాణక్యుని ముఖం ప్రకాశవంతమైంది. పర్వతకుని ముఖం ముడుచుకుపోయింది. 


"కానీ..." అన్నాడు చక్రవర్తి చిరునవ్వు నవ్వుతూ. 


చంద్రుడు అనుమానంగా చూస్తూ "కానీ... ?" రెట్టించాడు. 


అలెగ్జాండర్ మందహాసం చేసి "మగధని సంపాదించుకోవడానికి నీకు సహకరిస్తాం. అనంతరం మగధ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి. అది మా మొదటి నిబంధన" చెప్పాడు. 


చంద్రుడు అసహనంగా చూస్తూ "రెండోదేమిటి?" రెట్టించాడు. 


చక్రవర్తి సూటిగా చాణక్యుని వైపు చూస్తూ "చాణక్యుని అర్థశాస్త్రంతో పాటు మాకు అప్పగించాలి" చెప్పాడు. 


"ఏమిటీ.... చాణక్యుల వారిని మీకు అప్పగింతపెట్టాలా ? మగధని మీకు సామంతరాజ్యం చెయ్యాలా ? ఏం అడుగుతున్నావ్ నువ్వు ? ఎవరనుకుంటున్నావు మమ్మల్ని ? నువ్వేం చేసినా, నువ్వేం చెప్పినా తలవంచి, నీ అడుగులకు మడుగులోత్తే తొత్తులమనుకుంటున్నావా ? నీకు సామంతులుగా ఉండాల్సి వస్తే నీ సహాయం నాకు అవసరం లేదు. అవసరమైతే మగధరాజ్య కాంక్షనైనా వదులుకుంటానే గానీ చాణక్యుల వారిని నీకు అప్పగించే ప్రసక్తే లేదు. నీ యవన బలగం లేకుండా, నీ మద్దతు లేకుండా నా బలంతోనే మగధను నా హస్తగతం చేసుకుంటాను" అని హుంకరించాడు చంద్రుడు ఆవేశంతో. 


"ఆ అవకాశం నీకు ఇస్తే గదా..." అంటూ కనుసైగ చేసాడు అలెగ్జాండర్. రెప్పపాటులో యవన సైనికులు చాణక్య చంద్రగుప్తులను చుట్టుముట్టి బంధించారు. 


అలెగ్జాండర్ కోపంగా పర్వతకుని వైపు చూస్తూ... 

"ఈ దుర్హంకారులలిద్దర్నీ చెరసాలలో బంధించండి. వీళ్ళని ఏం చెయ్యాలో రేపు నిర్ణయిస్తాం" అని ఆదేశించాడు. 


చాణక్య చంద్రగుప్తులను కారాగరంలో బంధించారు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సామ గానం - ఖగోళ జ్ఞానం

 సామ గానం - ఖగోళ జ్ఞానం


శ్రీరంగం ఆలయ గోపుర నిర్మాణ సహాయానికి ముందుగా ఇష్టం వ్యక్తం చేసిన మంత్రాలయ మఠం వారు ఇప్పుడు కాస్త వెనకడుగు వేస్తున్నారని, కాబట్టి ఈ పనికి వేరొకరిని వినియోగించాలి కాబట్టి మరెవరిని అయినా సూచించాలని జీయర్ గారు శ్రీ దేశికన్ ని పరమాచార్య స్వామి వద్దకు పంపించారు. అప్పుడు స్వామివారు మౌనంలో ఉన్నారు. 


మహాస్వామివారు నేలపైన గ్రామఫోను బొమ్మ వేసి, పక్కనున్నవారిని సినీప్రముఖుల పేర్లను చెప్పమని సంజ్ఞలతో ఆదేశించారు. అందరి పేర్లూ ఒక్కొక్కటిగా చెబుతున్నారు కాని స్వామివారు ఇంకా ఇంకా అని అడుగుతున్నారు. హఠాత్తుగా ఎవరో నాపేరు చెప్పగానే, నేనే ఆ వ్యక్తి అని స్వామివారు చెప్పారు. 


నాకు పరిచయస్తుడైన తిరుచ్చి నివాసి చంద్రమౌళి నాకు ఈ విషయం తెలిపాడు. ఈయన మంచి మృదంగ విద్వాంసుడు. ఒకరోజు సాయింత్రం ఏడు గంటలప్పుడు ప్రాసాద్ స్టూడియో నన్ను కలుసుకొని జరిగిన సంగతి మొత్తం చెప్పాడు. 


“శ్రీరంగం ఆలయ గోపురం కట్టించమని నిన్ను ఆదేశించి, నిన్ను స్వామివారు అనుగ్రహించారు” అని చెప్పాడు. ”ఓహ్! పరమాచార్య స్వామివారు ఆదేశించారా? అయితే తప్పక చెయ్యాలి. నేను ఖచ్చితంగా చేస్తాను” అని చంద్రమౌళికి చెప్పాను. 


కాని దాని గురించి ఆలోచిస్తే నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నేను అప్పటిదాకా స్వామివారిని కలవలేదు. ఈ విషయం గురించి నాకు స్వామివారి వద్ద నుండి కాని, జీయర్ గారి వద్దనుండి కాని ప్రత్యక్షంగా సమాచారం రాలేదు. 


“మొత్తం గోపురం ఖర్చు 22 లక్షలు అవుతుంది. కాని స్వామివారు మిమ్మల్ని కేవలం ఆరవ అంతస్తు గురించి మత్రమే మీకు అప్పగించారు. అది దాదాపు 8 లక్షల రూపాయలు అవుతుంది” అని చెప్పాడు. “నేను మొత్తం గోపుర నిర్మాణానికే నా సమ్మతిని తెలిపాను. అంత ధైర్యం నాకు ఎలా కలిగిందో తెలుసా? అది కేవలం మహాస్వామివారి పైన ఉన్న భక్తి మాత్రమే. ఆ బరువు స్వామివారే చూసుకుంటారు. వారు ఏదైనా విషయం చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందులో నా పాత్ర, ప్రమేయము ఏమి ఉండదు” అని చెప్పాను.


ఆ తరువాత నాకు మహాస్వామి వారిని చూడాలనే కోరిక చాలా బలపడింది. నేను ఈ విషయాన్ని ప్రముఖ చిత్రకారుడు శిల్పికి చెప్పగా నేను కూడా వస్తాను అన్నాడు. మేమిద్దరమూ చంద్రమౌళితో కలిసి పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళాము. అప్పుడు మహాస్వామివారు సతారాలో మకాం చేస్తున్నారు. 


సతారాకి దగ్గర్లోని మహాగావ్ లో మహాస్వామి వారిని కలిసాను. అది సదూర ప్రాంతం. స్వామివారు గోశాలలో ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం మూడు గంటలు అయ్యింది. మేము వచ్చినట్టుగా అక్కడి కైంకర్యానికి చెప్పాము. అప్పుడు స్వామివారు మౌనంలో ఉన్నారు. మమ్మల్ని స్వామివారి వద్దకు తీసుకునివెళ్ళారు. స్వామివారు సంజ్ఞలతోనే మేమెవరమని అడిగారు. కైంకర్యం మమ్మల్ని ఒక్కొక్కరిగా పరిచయం చేశాడు. స్వామివారు చెయ్యెత్తి మమ్మల్ని ఆశీర్వదించారు. తరువాత వారు కొద్దిగా తల ఇటు తిప్పడంతో వారి కళ్ళను నేను చూడగలిగాను. ఎంతటి దేదీప్యమానమైన ప్రకాశవంతమైన కళ్ళు అవి. నా జీవితంలో అప్పటి దాకా అంతటి అమోఘమైన కళ్ళను నేను చూదలెదు. అవి నాకు ఏమో చేశాయి. ఆ కళ్ళను చూడడంతోనే నేను స్థాణువై నిలబడిపోయాను. రెండు చేతులు పైకెత్తి నమస్కరిస్తూ, నా ప్రమేయం లేకనే కళ్ళ నీరు కార్చాను. కొద్దిసేపు ఒక మామిడి పండును చేతిలో ఉంచుకొని దాన్ని ప్రసాదంగా నాకు ఇచ్చారు. ఎప్పటికి లభించని పెద్ద అనుగ్రహం అది.


స్వామివారు ఆ సాయింత్రం దగ్గర్లోని గ్రామానికి వెళ్తున్నారని కొందరు మాకు చెప్పారు. మేము తిరిగి వెళ్ళిపోవాలని చాలా బాధపడ్డాము. కాని మాకోసమే అన్నట్టుగా స్వామివారు ఎక్కడికి వెళ్ళడం లేదని తెలుసుకొని చాలా సంతోషించాము. ఆరోజు రాత్రి అందరమూ ఆకాశం క్రింద పచ్చని తోటలో కూర్చున్నాము. నాకు తెలిసి ఆ రోజు పొర్ణమి అనుకుంటా. ఆకాశంలో ఒక్క మబ్బు కూడా లేదు. మొత్తం నక్షత్రాలతో నిండి ఎంతో అహ్లాదాన్ని కలిగిస్తోంది. నన్ను అడగకుండానే స్వామివారి శిష్యులు నేను పాడాలనుకుంటున్నానని స్వామివారితో చెప్పారు. సరే అన్నారు. చెంబై వైద్యనాథ భాగవతార్ గారి ‘సామ గాన వినోదిని’ పాడటం మొదలుపెట్టాను. 


‘సామ గాన’ అని మొదలుపెట్టగానే మహాస్వామివారు వెంటనే నా వైపు తిరిగి వారి దివ్య కరుణా కటాక్ష వీక్షణాలను నాపై ప్రసరింపజేశారు. అలా పాడుతూనే కళ్ళ నీరు పెట్టడం మొదలుపెట్టాను. నన్ను నేను నియంత్రించుకోలేక పాట పూర్తి చెయ్యడానికి చాలా కష్టపడ్డాను. తరువాత స్వామివారు మౌనవ్రతం వీడి నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. కేవలం నన్ను కరుణించడానికే స్వామివారు నాతో మాట్లాడుతున్నారు. తరువాత స్వామివారు ఆకాశంలో 27 నక్షత్రాలను చూపించి, వాటి గురించిన విశేషాలను, స్థానాలను విపులంగా వివరించారు. అలాగే 12 రాశులను కూడా చూపించారు. “సర్వేశ్వరా! ఎంతటి అనుగ్రహం”. 


దాంతో మహాగావ్ లో మా దర్శనం పూర్తయ్యింది. వారిని తరచుగా దర్శించుకోవాలనే కోరిక చాలా బలపడింది. వారి భౌతిక దర్శనం ఒక ‘తత్వయోగి’ని చూసినట్టు. వారి స్వరూపం అవ్యాజ కరుణ, ప్రేమ, భక్తి స్వరూపం. వారి తీక్షణమైన వీక్షణాలను ఆ యోగిక శక్తిని నేను ఎన్నటికి మరచిపోలేను. అవి దక్కడం నా అదృష్టం. అది కేవలం వారి అనుగ్రహం.


--- ‘మ్యూసిక్ మాస్ట్రో’ ఇళయరాజా గారి ఇంటర్వ్యు నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శ్రీశైలం

 మహత్యానికి మరోపేరు శ్రీశైలం ఇష్టకామేశ్వరి.......!!


కోరికలు అనేకం. వాటిని తీర్ఛుకోవడానికి మార్గాలు అనేకానేకం. మానవ ప్రయత్నంతో కాని వాటిని దైవానికి విన్నవించి తీర్చుకోవాలనుకొంటాం. దేవుడికి మన ఇష్టకామాలను (కోరికలు) చెప్పుకొంటాం. మన కోరికలు వినే దైవాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి ఆలయం ఒకటి. శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఇష్టకామేశ్వరీ దేవి భక్తుల కోరికలు తీర్చి వారిలో ఆస్తికతను పెంచుతున్నది.


ఇష్టకామేశ్వరి దేవత విగ్రహం చాలా విశిష్టమైనది. ఈ రాతి విగ్రహాన్ని తాకితే చాలా గట్టిగా ఉంటుంది. #అయితే నుదట కుంకుమ పెట్టినప్పుడు నుదురు వేలికి మెత్తగా చర్మంలా తాకుతుంది. ఎన్నో సంవత్సరాలుగా వేలాది మంది భక్తులు ఈ అనుభూతిని పొందుతున్నారు. దేవి మందహసంతో భక్తులకు దర్శనం ఇస్తున్నది.


భక్తులకు దేవిపై అపార నమ్మకం. రెండు మూడు మార్లు ఈ దేవిని దర్శించిన వారున్నారు. మళ్ళీ మళ్లీ వస్తుంటారు. దానికి కారణం వారు వచ్చివెళ్లిన తర్వాత కోరిన కోరికలు సాఫల్యం కావడమే. కోరికలు తీరినందుకు కృతజ్ఞతాభావంగా ఆలయం సందర్శించి మళ్ళీ కొత్త కోరికలు అప్పగించి వెడతారు. అవి నెరవేరుతాయి. దీనితో మళ్లీ వస్తారు.


#ఇష్టకామేశ్వరి విగ్రహం అరుదైనదని, ఇలాటి విశిష్టత కలిగిన విగ్రహ దేశంలో మరెక్కడా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో అరుదైన విషయం. భక్తులు తమంతట తామే ఆలయానికి రారని, వారిని దేవి ఆహ్వానిస్తుందని ప్రతీతి. అమ్మ భక్తులకు పిలుపు ఇస్తుందని, ఆ పిలుపు మేరకు వారు ఇక్కడికి వచ్చి పూజలు జరుపుతున్నారని నిర్వాహకులు చెబుతారు.


ఎంతోకాలం క్రిందట అడవిలో కొందరు చెంచులకు అమ్మ విగ్రహం కనిపించిందని, వారు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి పూజలు జరిపారని, ఇప్పటికీ వారి సంతతి వారే ఆలయ అర్చకులుగా వ్యవహరి‌అస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

 మువ్వురు మానవులకు రథోత్సవాలు

దాదాపు ముప్పైయేళ్ళు గడిచిపోయాయి. అప్పుడు నేను కాంచీపురం తాలూకా కార్యాలయంలో రెవెన్యు ఇనస్పెక్టర్ గా పనిచేస్తుండేవాడిని. ఒకరోజు తహసీల్దారు గారు పిలుస్తున్నారని నా సహాయకుడు చెప్పడంతో వెళ్లాను.

“సుబ్రహ్మణ్యన్ ఈరోజు ఎండోమెంట్ బోర్డు కమీషనరు కంచి వస్తున్నారు. ఆయన మన కలెక్టరుకు కూడా స్నేహితులు కనుక కంచి పెరియవా దర్శనానికి దగ్గరుండి ఏర్పాట్లు చెయ్యి” అని ఆదేశించారు.

తరువాత నేను కంచి మఠానికి విషయం తెలిపి, కావాల్సిన ఏర్పాట్లను చేశాను. ముందుగా నిర్ణయించిన సమయానికే ఎండోమెంట్ బోర్డు కమీషనరు మఠానికి వచ్చి, పరమాచార్య స్వామివారికి నమస్కరించి, స్వామి ఎదురుగా కూర్చున్నారు.

దివ్యతేజస్సు ఉట్టిపడుతుండగా మహాస్వామి వారు కమీషనరుతో మాట్లాడటం మొదలుపెట్టారు. వారి సంభాషణ చిన్న దేవాలయాలలో జరగాల్సిన జీర్ణోద్ధరణతో పాటు పెద్ద పెద్ద దేవాలయాలలో చెయ్యాల్సిన కుంబాభిషేకాల దాకా వెళ్ళింది.

శ్రీ శంకరాచార్య స్వామివారికి సాధారణంగా ఒక అలవాటు ఉంది. అక్కడున్న భక్తులను మన ధర్మానికి సంబంధించిన ప్రశ్నలను అడిగి సమాధానం చెప్పమంటారు. వారు ఇరకాటంలో ఉన్నప్పుడు స్వామివారే వాటికి సమాధానాలు చెప్పి అందరినీ సంతోషపరుస్తారు. అలా శ్రోతలను ప్రశ్నలను అడిగి వారే సమాధానాలు చెప్పడం ద్వారా అవి మరుగునపడక బాగా జ్ఞాపకం ఉంటాయని స్వామివారి ఆలోచన.

ఆరోజు కూడా కంచి స్వామివారు ఒక ప్రశ్న అడిగారు. అది కూడా కమీషనరుకే. “ఇది నువ్వు చెప్పగలవా? మానవ జన్మను పొంది పరమపదం చేరిన మువ్వురు వ్యక్తులకు తీర్థ్-తిరువిళ (రథోత్సవం) జరుపుతారు ఇప్పటికి. ఆ మువ్వురు ఎవరు?” అని అడిగారు.

అది అడిగినది కమీషనరుకే ఆయినే అక్కడున్న మేమందరమూ మా బుద్ధికి పనిపెట్టాము. సాధారణంగా రథోత్సవం దేవుళ్ళకు మాత్రమే చేస్తాము. కానీ పరమాచార్య స్వామివారు అడుగుతున్నది మానవులుగా పుట్టినవారు అని!

మా పరిస్థితిని గమనించిన స్వామివారు “మరొక్క ఐదు నిముషాల సమయం ఇస్తాను. ఎవరైనా సమాధానం చెప్పవచ్చు” అని అన్నారు.

ఐదు నిముషాలు గడిచినా ఎవ్వరం సమాధానం చెప్పలేకపోయేసరికి స్వామివారు, “పర్లేదు. మిమ్మల్ని మీరు బాధపెట్టుకోకండి. నేనే సమాధానాలు చెబుతాను” అని చెప్పనారంభించారు.

“’చూడికొడుత్త నాచ్చియార్’ గా ప్రసిద్ధి పొందిన ఆండాళ్ కు శ్రీవిల్లిపుత్తూర్ లో రథోత్సవం; శ్రీవైష్ణవ స్థాపకులైన శ్రీ రామానుజులకి శ్రీపెరుంబదూర్ లో రథోత్సవం; శ్రీ మాణిక్యవాచకులకు తిరుప్పేరుందురైలో రథోత్సవం జరుగుతాయి. ప్రతి సంవత్సరం వీరు మువ్వురికి పెద్ద ఎత్తున రథోత్సవం జరుగుతుంది. ఇటువంటి చిన్ని విషయాలు కూడా మీకు తెలిసిఉంటే మంచిది, అందుకనే అడిగాను” అని చిన్నపిల్లాడిలా గట్టిగా నవ్వారు.

ఆ నవ్వు ఎలాంటిది అంటే పచ్చని చెట్టుకు కొట్టిన మేకులాగా ఇప్పటికి నా జ్ఞాపకాల పొరల్లో తాజాగా ఉంది.

- ఏరాసు, చెన్నై - 61. మహాపెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం 🙏

24, మే 2023, బుధవారం

ప్రసన్నం చేసుకోవచ్చు.

 శ్లోకం:☝️

*లుబ్ధమర్థేన గృణ్హీయాత్*

 *స్తబ్ధమంజలికర్మణా ।*

*మూర్ఖ ఛందోఽనువృత్తేన*

 *యథార్థత్వేన పండితమ్ ॥*

   - చాణక్యనీతి


భావం: లోభిని డబ్బుతో, మొండివాడిని నమస్కార దండప్రణామములతో గౌరవించి, మూర్ఖుడిని తన కోరికను నెరవేర్చడం ద్వారా మరియు బుద్ధిమంతుడిని యథార్థం మాట్లాడి ప్రసన్నం చేసుకోవచ్చు.

రోజు పద్యము:

 169వ రోజు: (బుధ వారము) 24-05-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


ఎదుటివారు మనకు ఏమి చేసిన మేలొ 

అట్టి మేలు మనమునందచేయ 

జగములోన వెలుగు సహకారభావమ్ము 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల


ఎదుటి వారు ఏమి చేస్తే మనకు మేలు (మంచి) జరిగింది అని అనుకుంటామో అదే మేలు మనము ఇతరులకు (అందరకు) చేసిన ఎడల మనమందరిలో సహకార భావమ్ము పెంపొందును 


ఈ రోజు పదము. 

ఏనుగు (Elephant): ఇభము, కుంజరము, కరి, దంతి, హస్తి, గజము, గౌరు, దంతి, పద్మి, భార్గవము, మాతంగము, శృంగి, సామజము.

23, మే 2023, మంగళవారం

భజగోవిందం

 ॐ                 भज गोविन्दं

                    భజగోవిందం 

                 (మోహముద్గరః) 

            BHAJA GOVNDAM   

 

      (श्रीमच्छंकरभगवतः कृतौ 

       శ్రీమచ్ఛంకరభగవత్పాద కృతం 

           BY SRI ADI SANKARA)


                       ఉపక్రమణిక 


      కాశీ పట్టణంలో  ఒక వ్యాకరణ పండితుడు "డుకృఞ్ కరణే" అన్న వ్యాకరణ ధాతుపాఠాన్ని వదలకుండా వల్లె వేయడం ఆదిశంకరుల కంటబడింది. 

      ఆ వ్యాకరణ పండితునిలో 

  - స్వస్వరూప జ్ఞానం కొరవడి, 

  - కనిపిస్తున్న అసత్యాన్ని అనంత సత్యమని నమ్ముకొని 

  - భవబంధాలలో తగులుకొని 

  - దరిజేరటానికి దారీ తెన్నూ కానక కొట్టుమిట్టాడుతున్న జీవరాసులు కదలాడాయి. 


     అంతే! 

    

    శంకరాచార్యుల హృదయం ఉత్తుంగతరంగంలా ఉవ్వెత్తున పైకెగసింది. 

    ఆ మహనీయుడు త్రుటిలో ఆ వ్యాకరణ పండితుని ముంగిట నిలిచారు. 

    ఆయన శిష్యులూ పరుగు పరుగున చేరారక్కడ. 


   "భజగోవిందం భజగోవిందం 

     గోవిందం భజ మూఢమతే"  అంటూ, 

    

    విశ్వాన్ని మేలుకొలుపే గీతాలాపనకి ఉద్యమించిందాయన గళం. 

    అనంత విశ్వమూ ఆ పల్లవిని అందుకొంది. 

    పన్నెండు శ్లోకాలని శంకరులూ, వారి శిష్యులు ఒక్కొక్కరూ ఒక్కొక్క శ్లోకాన్నీ ఆశువుగా పలికారు. 

    కాశీ అన్నపూర్ణ మాత అనుగ్రహించి వెన్నంటగా, మనమూ ఆ సర్వజన శ్రేయో గీతంతో గొంతు కలుపుదాం. 

    నిశ్రేయస పథగాములమై ముందుకురుకుదాం. 

    రేపటి నుంచీ ఆ శ్లోకాలని ఒక్కొక్కటిగా తెలుసుకొందాం. 


Introduction by Sir Raajaaji at the Gramphone recording of Bhajagovidam verses sang by M S Subbulakshmi. 


M S సుబ్బులక్ష్మి గానం చేసిన భజగోవిందం గ్రాంఫోను రికార్డు ముందుమాటగా రాజాజీ అన్న మాటలు 👇 


    Adi Shankaracharya wrote a number of Vedantic works for imparting knowledge of the Self and the Universal Spirit. 

    He also composed a number of hymns to foster Bhakti in the hearts of men. 

    One of these hymns is the famous Bhaja Govindam.

    The way of devotion, is not different from the way of knowledge or Jnana. 

    When intelligence matures and lodges securely in the mind, it becomes wisdom. 

    When wisdom is integrated with life and issues out in action, it becomes Bhakti.

    Knowledge, when it becomes fully mature is Bhakti. If it does not get transformed into Bhakti, such knowledge is useless tinsel. 

    To believe that Jnana and Bhakti - knowledge and devotion are different from each other, is ignorance. 

    If Sri Adi Shankara himself who drank the ocean of Jnana as easily as one sip’s water from the palm of one’s hand,  

    sang in his later years, hymns to develop devotion. 

    It is enough to show that Jnana and Bhakti are one and the same. 

    Sri Shankara has packed into the Bhaja Govindam song: the substance of all vedanta and 

    set the oneness of Jnana and Bhakti to melodious music. 


* Tomorrow onwards, daily, let us know each Sloka with its meaning. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

జగద్గురు అర్హత

 జగద్గురు అర్హత


1931వ సంవత్సరం చివరి రోజుల్లో బ్రిటీషు ప్రభుత్వం వారు కాంగ్రెస్ కార్యకర్తలను బంధించి, హింసించడం చాలా ఎక్కువగా ఉండేది. వారికి సహాయం చేసిన ప్రజలకు, సంస్థలకు కూడా తీవ్రమైన పరిస్థితులు కల్పిస్తామన్న హెచ్చరికలు జారీచేశారు.


పరమాచార్య స్వామివారు ఉత్తర ఆర్కాటు జిల్లాలోని ఆరణిలో మకాం చేస్తున్నారు. కాంగ్రెస్ వ్యక్తులు కొందరు స్వామివారిని దర్శించుకోవాలనుకున్నారు. ఈ సమయంలో స్వామివారు కాంగ్రెస్ వ్యక్తులను కలవడం వల్ల మఠానికి ఏదైనా సమస్య వస్తుందని శ్రీమఠం అధికారులు తెలిపారు.


పరమాచార్య స్వామివారు వారి భయాలన్నింటిని విని, “సభ్యులందరినీ లోపలకు రమ్మని చెప్పండి. అలాగే శ్రీమఠం తరుపున వారందరికీ భోజనాదులు ఏర్పాటు చెయ్యండి” అని ప్రశాంతంగా చెప్పారు.


నివ్వెరపోయిన మఠం అధికారులు భయంభయంగానే స్వామివారి ఆదేశాలను పాటించారు. కాని ప్రభుత్వం ఎటువంటి సమస్య ఎదురుకాలేదు.


బ్రిటీషు ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రతిచర్య లేదన్న సంతోషకర వార్తను మఠం మేనేజరు స్వామివారికి తెలుపగానే, “నన్ను చూడాలన్న వారిని కలవకుండా నేను తలుపులు మూసుకుంటే, జగద్గురు అన్న బిరుదునామం ఉంచుకోవడానికి, ఈ పీఠ సింహాసనం పైన కూర్చోవడానికి నాకు అర్హత ఉండదు” అని చెప్పారు.


--- రా. గణపతి, “మహా పెరియవాళ్ విరుంధు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

మహనీయుల మంచి మాటలు.

 *మన మహనీయుల మంచి మాటలు.*

>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<                                              


 *అడవుల్లో తిరిగినా రాముడు  చెడిపోలేదు, అంతఃపురంలోపెరి గినా రావణుడు బాగుపడలేదు*       


 *వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో,అం తస్తులోనో ఉండదు. ఆలోచనల్లో,ఆచరణలోమాత్రమే ఉంటుంది.*

       

*కదలకుండా స్థిరం గాకూర్చుంటే మన శరీరం మన మాట వినక న రాలు అల్లుకుపోయి కదలలేని స్థి తికి వస్తాము*


*మన మనసు స్థిరంగాఉండకపో తే దానికి కూడా కష్టపడాల్సిందే*


*ఏది స్థిరం గాఉంచుకోవాలోఅది స్థిరంగా ఉంచుకోవాలి దేన్నీనిరం తరం కదల్చాలో*

*దాన్ని కదిలిస్తేనే శరీరం మనసు ఆరోగ్యం గా ఉంటాయి* 


*"విజయం సాధించాలంటే కావా ల్సింది దానిపట్ల ఉత్సాహం కృషి చేసేందుకు సుముఖత."*


*"నీచేయిదాటిపోయిన విషయ ముల గురించి నిన్ను వదిలి వెళ్ళి న వారి గురించి మరీ ఎక్కువగా ఆలోచించకు.                                                  నీవెంత ఆలోచించినా వాటిని సరిచేయలేవని తెలుసుకో."*


*"సహనాన్ని మించిన ఆయుధం లేదు. విశ్వాసాన్ని మించిన భద్ర త లేదు. నవ్వును మించిన ఔష ధంలేదు. ఈ మూడు ఉచితంగా నే లభిస్తాయి."* 


*"చేసిన తప్పుకు క్షమాపణ అడి గినవాడు ధైర్యవంతుడు. ఎదుటి వారి తప్పును క్షమించగలిగినవా డు బలవంతుడు."*


*భగవంతునికి దగ్గరవ్వాలిఅంటే ముందుగానియంత్రించుకోవల్సిం ది మనమనస్సును అందులోము ఖ్యంగా మాటను ఏమాట బడితే ఆ మాట అనేసి నేను కరెక్ట్ గానే అన్నాను అనుకుంటే! ఎదుటివా రు మన్నించినా భగవంతుడు మ టుకు క్షమించడు*


       *సర్వేషాంశాన్తిర్భవతు.*

షష్టిపూర్తి

 *షష్టిపూర్తి ఎందుకు చేస్తారు?*        

*మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120                       సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది.             60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది                  షష్టిపూర్తి. ప్రతివారికీ మృత్యువు 60 వ యేట          ‘ఉగ్రరథుడు’ అను పేరుతో, 70 వ యేట ‘భీమరథుడు’        అను పేరుతో , 78 వ యేట ‘విజయరథుడు’      అనుపేరుతో ఎదురుచూస్తుంటాడు. ఆరోగ్య.        సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ.*       *షష్టిపూర్తి."*


*బృహస్పతి, శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.*


*మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి.*


*షష్టిపూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము… ‘ఆయుష్కామనయజ్ఞము’*


*పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు.*


*తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీసి వాటిమీద అయిదు అడ్డగీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు. వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం. అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను , 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు.*


*పక్షములను, తిదులను వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శనిని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని, జలము, భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లను ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ - ఇంకా ఏకాదశ రుద్రులు , నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతో వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు.*


*అపమృత్యు నివారణార్థం హోమాల్ని , జపాలని కుడా చేస్తారు. తదుపరి బ్రహ్మణులను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు.* 


*పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరిగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.*


*పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి."*

ప్రవృత్తి నివృత్తి*

 *🌹🌹🌹అమృతస్య పుత్రాః🌹🌹🌹*


      *శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం*


                     *మొదటి భాగము*


                     *ప్రవృత్తి నివృత్తి*


                *వేదాలు ప్రవృత్తి, నివృత్తియని రెండు మార్గాలు చూపించాయి. ప్రపంచ వ్యవహారాలను ధార్మికంగా నిర్వహించడం ప్రవృత్తిమార్గం. ప్రాపంచిక వ్యవహారానికి దూరంగా ఉండి జనన మరణ ప్రవాహం నుండి విముక్తుడగుట, పరమాత్మతో ఐక్యమగుట నివృత్తిమార్గం.*


                *ప్రవృత్తిమార్గం, వేదచోదిత ధర్మంపై ఆధారపడి వర్ణాశ్రమాలతో ఉండి తన శ్రేయస్సునకు, సంఘ శ్రేయస్సునకు తోడ్పడే రీతితో ఉంటుంది. పుణ్య కర్మ ఫలం క్షీణించగా మరల జన్మనెత్తుట జరుగుతుంది.*


              *అంటే స్వర్గ సౌఖ్యము శాశ్వతము కాదని తేలినట్లే గదా! లోకంలో గాని, స్వర్గంలో కాని శాశ్వత సుఖం అంటూ లేదు. ఇక్కడా, అక్కడా భయం, దుఃఖం, క్రోధం మామూలే! కన్ను, చెవులు మొదలైన ఇంద్రియాల వల్ల కొంత సౌఖ్యం అనుభవించే మాట నిజమే. కాని లోనున్న ఆత్మకు ఇవి సంతోషాన్ని ప్రసాదిస్తాయా? ఆత్మతృప్తి కల్గుతుందా?*


                   *అఖండానందం అనుభవించాలంటే నివృత్తి మార్గాన్నే అనుసరించాలి. సంఘానికి దూరంగా ఉండి ఆత్మనే చింతిస్తూ అదే బ్రహ్మమని భావిస్తూ సమాధి స్థితిలో ఉండిపోవడమే. లౌకిక సుఖాలననుభవిస్తూ ఒక్కొక్కప్పుడు బ్రహ్మానందం అంటూ ఉంటారు.*


               *నిజమైన బ్రహ్మానందం నివృత్తి మార్గంలోనే. ఇలా అని నేను చెప్పడం కాదు. వేదమే 'అనావృత్తి శబ్దాత్, అనావృత్తి శబ్దాత్' అని చెప్పిందని బ్రహ్మసూత్రాలలో ఉంది. శబ్దమనగా ఇక్కడ వేదం. ఇదే ఛాందోగ్యోపనిషత్ మరల మరల చెప్పింది. నివృత్తి మార్గం వల్లనే పరమ సుఖమని, వీటి తాత్పర్యం.*


*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

శ్రీశైల శిఖర దర్శనం

 శ్రీశైల శిఖర దర్శనం వెనుక రహస్యం మీకు తెలుసా ?


🍁🍁🍁🍁🍁


శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైంది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలంలో శిఖరదర్శనం చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు, అక్కడ ఉన్న నందిని రోలుమాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటూ ఇటూ వీలుగా త్రిప్పుకొనుచూ సుదూరంగా ఉన్న శ్రీమల్లిఖార్జుని ఆలయపు విమానంపైనున్న శిఖరాన్ని చూడుటకు ప్రయత్నించాలి. అలా చూసే క్రమంలో ఆవ్యక్తికి గనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాలలో చనిపోతారు, పునర్జన్మ నుండి విముక్తులవుతారు. 


కొన్ని శతాబ్దాల క్రితం శ్రీశైల గర్భాన్ని చేరటానికి కారడవిలో, కాలి నడకన ప్రయాణించవలసి వచ్చేది. కొంతదూరం నడిచాక అప్పటికే అలసి సోలసిన కొందరు భక్తులు ఇక ఒక్క అడుగైనా ముందుకు వేయలేని స్థితిలో ఏదోవిధంగా ఈ కొండ శిఖరం (శిఖరేశ్వరం) కనబడేవరకు ప్రయాణించి శ్రీశైల శిఖరాన్ని చూసి తిరుగు ప్రయాణమయ్యేవారు. ఎంత దూరం నుంచి అయినా యీ శిఖరాన్ని చూస్తే గత జన్మల సంచిత పాపం సర్వమూ నశించి జనన మరణరూప సంసారచక్రం నుండి ముక్తి లభిస్తుందని పురాణాలు ఏకకంఠంతో చెబుతున్నాయి. కాలక్రమంలో ఈ శిఖరేశ్వరం నుండి శ్రీశైల ప్రధాన ఆలయ శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదని, అలా ఆలయ శిఖరం కనబడితే 6 నెలలలో మరణిస్తారని ఒక నానుడి ప్రజలలో నాటుకుపోయింది. ఈ విషయంలో సాహిత్యపరమైన ఆధారాలు ఏవీ లేకున్నా, ఆలయ శిఖరం స్పష్టంగా కనబడింది అని చెప్పిన వ్యక్తులు 6 నెలలలోపే దివంగతులవటం ఈ భావనకు బలాన్ని చేకూరుస్తుంది. కాగా, 6 నెలలలోపు ప్రాణాలను కోల్పోయే వారి కంటిచూపు అంత దూరంలో గలదాన్ని స్పష్టంగా కనబరుస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. 


శ్రీశైల ప్రధానాలయమైన శ్రీ మల్లికార్జునస్వామి ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న యీ శిఖరేశ్వరం వాస్తవంగా ఒక కొండ శిఖరం. ఈ శిఖరేశ్వరంలో కొలువు తీరిన 'వీరశంకరుడు' కాలక్రమంలో శిఖరేశ్వరునిగా ప్రసిద్ధుడయ్యాడు. ఈ వీరశంకరుడు ఎప్పుడు ప్రతిష్ఠించబడ్డాడో, ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇతమిత్థంగా చెప్పే ఆధారాలు నేటి వరకూ లభ్యం కాలేదు. కాని ఆలయం ఎదురుగా ఉన్న సా.శ. 1398  (శా.శ 1320) పార్థివ నామ సంవత్సర చైత్ర బహుళ దశమి బుధవారం నాటి ఈ దిగువ శాసనాన్ని బట్టి అప్పటికే యీ శిఖర పైభాగానికి భక్తులు తండోపతండాలుగా వెళ్ళే ఆచారం ఉన్నట్లు దృఢంగా తెలుస్తోంది.

.

.

.