11, జూన్ 2023, ఆదివారం

ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

 ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి వర్ధంతి సందర్భంగా నివాళులతో


మీ కోట్ నా బూట్లను వెదకడానికి వెళ్లింది :


వేదాంతముల తోడ వెక్కిరింత తోడ -లెక్చర్లు ఇచ్చే ఆయన్ని చూస్తే ఎంతటి వాడికైనా గుండె గుబేలే ..ఆయన చాతుర్యం అటువంటిది.. పైగా ఇంగ్లాండు వెళ్ళి పెద్ద చదువులు చదివి వచ్చిన  వారాయే . సహజ కవి,  ఉన్నత మనస్కుడు కూడా .ఆయనే దుగ్గిరాల గోపాల కృష్ణయ్య -


హిందూత్వ సాధన కోసం,  హిందువుల హక్కుల కోసం పోరాడేందుకు ఒక సేవాసంస్థ, ఒక దండు ఉండాలని ఆశించిన ఆయన

రామదండు సంస్థాపన జేశారు. 


చీరాల పేరాల ఉద్యమం ద్వారా ఆంగ్లేయుల గుండెల్లో నిద్ర పోయిన తెలుగు ఘనుడు. ఆంధ్ర రత్న అని పేరుబడ్డవారు.


వారు దురదృష్టవశాత్తూ చిన్నతనములోనే మరణించారు గానీ లేకున్న అత్యున్నత స్థాయి పదవులు నిర్వహించ వలసినవారు. 


ఓసారి  రైలులో దుగ్గిరాల వారు ప్రయాణిస్తున్నారు. రాత్రి కావొచ్చింది . 


ఓ ఆంగ్లేయుడు అటూ ఇటూ తిరుగుతూ బూట్ల కిర్రు కిర్రు శబ్ధం చేస్తున్నాడు. ఎంతటికీ నిద్ర పట్టడం లేదు వీరికి. 


కాసేపటికి ఆ ఆంగ్లేయుడు నిద్ర పోయాడు. 


వెంటనే దుగ్గిరాల వారు లేచి తన బూట్లతో పెద్ద శబ్ధం చేస్తూ అటూ ఇటు నడవడం ఆరంబించారు. ఆయన గంభీర రూపం చూస్తే ఆంగ్లేయునికి భయం వేసింది .


కాసేపయ్యాక బూట్లు విప్పేసి బెర్త్ కింద పెట్టి నిద్ర పోయారు దుగ్గిరాల వారు.


అదను చూసి ఆ అంగ్లేయుడు ఆ బూట్లను ఎత్తి కింద పడేసాడు కిటికీ నుండి . 


మధ్యలో దుగ్గిరాల వారు మెలుకువ వచ్చి చూస్తే తన బెర్త్ కింద ఉన్న బూట్లు లేవు. సరేలే అని పడుకుని  ఉన్న ఆ ఆంగ్లేయుని ముఖం పరికించాడు . ఆ పని చేసింది అతడే అని తెలుసుకుని అక్కడ తగిలించి ఉన్న అతగాడి కోట్ తీసి కింద పడేసి తనపాటికి తను పుస్తకం ఏదో వ్రాసుకుంటూ కూర్చున్నారు.


కాసేపయ్యాక టికెట్ కలెక్టర్ వచ్చి అందరి టికెట్టులు అడుగుతున్నారు. ఆంగ్లేయుడు లేచి తన కోట్ కోసం చూస్తే కోటెక్కడ ఉంది. 


మీరు గానీ నా కోట్ చూసారా అని దుగ్గిరాల వారిని అడిగారు ఆ ఆంగ్లేయుడు . 


అది "ఇందాకే పోయిన నా బూట్లను  వెదకడానికి వెడుతుంటే చూసాను " అని సమాధానం ఇచ్చారు ఆంగ్లములో.


అవాక్కయిపోయిన ఆంగ్లేయుడు చేతిలో మళ్ళీ  టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి.


మొత్తం ఆతను ఉద్యోగానికి వెళ్లవలసిన ప్రాంతపు చిరునామా అన్నీ అందులోనే ఉన్నాయిట .


వాడి మొహం లో నెత్తురు చుక్క లేక పోవడం చూసి టికెట్ కావాలా!!? , కొనమంటావా!!?? అని ఎదురడిగారట.

 



*10వేల ఏళ్ల‌నాటి త్రిశూలం..* 

*3వేల ఏళ్లనాటి వజ్రాయుధం....* 


       బాలి, మలేషియా, జపాన్, చైనా వంటి దేశాల్లో హిందువుల దేవుళ్లను వివిధ పేర్లతో పూజిస్తూ ఉంటారని చెబుతారు. 

తాజాగా మరో దేశంలో హిందూ దేవుళ్ళ ఆనవాలు తవ్వకాల్లో వెలుగులోకి వచ్చాయి. 10 వేల ఏళ్ల నాటి త్రిశూలం, 3 వేల ఏళ్ల కిందటి వజ్రాయుధాన్ని # *కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త సయ్యద్ శామీర్ హుస్సేన్ బెంగళూరులో ప్రెస్ క్లబ్లో ప్రదర్శించారు.* 

ఆయన మీడియాతో మాట్లాడుతూ 2015 మే నెలలో *#ఫిలిప్పిన్స్ మైనింగ్ తవ్వకాలల్లో ఈ త్రిశూలం, వజ్రాయుధం బయటపడ్డాయని తెలిపారు.*

  2012 నుంచి ఫిలిప్పిన్స్ కాపర్, గోల్డ్ మైనింగ్ల్లో తను భాగస్వామిని అని తెలిపారు. వ్యాపార రీత్యా తన సమయాన్ని ఫిలిప్పిన్స్లోనే ఎక్కువగా గడుపుతూ ఉంటానని, అలాగే అక్కడి పౌరులతో కలిసి పనిచేయడం వల్ల వారితో దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.

ఈ క్రమంలో 2015 మే 5న మైనింగ్ సూపర్వైజర్, తాను మునుపెన్నడూ #చూడని వస్తువులు తవ్వకాలలో బయటపడ్డాయని తెలిపారు.  వాటిని నీటితో శుభ్రం చేయగా అందులో ఒకటి చూడడానికి దేవుడి విగ్రహంలా ఉంది. ఇక రెండోది త్రిశూలంగా గుర్తించామని చెప్పారు. అయితే ఈ రెండూ కూడా హిందూ పురాణాలకు సంబంధించిన వస్తువులుగా నిర్థారించినట్లు తెలిపారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి వాటి ఫొటోలను స్నేహితులందరికీ పంపిన‌ట్లు తెలిపారు.

 

వాటిపై పరిశోధన కోసం ఇంటర్నెట్ లో వెతికారట. త్రిశూలంతో పాటు దొరికిన మరో వస్తువు వజ్రాయుధం అని తెలిసిందని చెప్పారు. అది #హిందూ_పురాణాల్లో ఇంద్ర భగవానుడి ఆయుధం, త్రిశూలం శివుడిది అయ్యుండవచ్చని భావించి తర్వాత భారత్ కు వచ్చి పురావస్తు శాఖ వారిని సంప్రదించామని, పురావస్తు శాఖ మాజీ అధికారి #అంజనీమున్షీ వాటిని పురాతన వస్తువులుగా ఆమోదించారని వివరించారు.

©️ Nijam today 

https://nijamtoday.com/2023/06/10/anciant-trishul-vajrayudh/?fbclid=IwAR2Xjhz5kA0ZJCubOuH3SMdh72wktqViTRkTMl5eWSmXrB7pItdmpSSQa5Y


#karnataka #trishul #vajrayudha #phillipines #benglore #hindu #hinduism

కారణమూ... "మనస్సే",

 🅄🅂🄴🄵🅄🄻 🄸🄽🄵🄾🅁🄼🄰🅃🄸🄾🄽

*అన్ని రోగాలకూ కారణమూ... "మనస్సే", విరుగుడూ... "మనస్సే"    “జపాన్ శాస్త్ర వేత్తలు చేసిన వివిధ ప్రయో గాలలో ఆశ్చర్య కర విషయాలు వెలుగు చూశాయి.*


*ఇంత కాలం మనం "గుడ్డి"గా నమ్ముతున్న అనేక ఆరోగ్య సమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారం లో లేవని,"మనం జీవించే విధానం లోనే ఉన్నాయని"*

*మనసును హాయిగా ఉంచు కున్న వారికి     ఏ రోగాలు రావని వారు తేల్చి చెబు తున్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసు బాగున్న వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని తేల్చారు.          మనసు కలత బారితే లేని పోని ఆలోచనలు చోటు చేసుకుని వాటి నుంచి బైటపడ డానికి "బలహీనతలు" పెంచు కోవడం, వాటికి బానిసలై "దురలవాట్ల" పాలై పోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు.           ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి, "జీవన శైలి"ని సరి దిద్దే పనిలో పడ్డారు.*


      _అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌ మెంట్ ఇచ్చే పద్ధతి మార్చు కున్నారు._

    

*ఇది వరకు తిన కూడదు*

     *అన్న అన్ని రకాల*

     *ఆహారాన్ని నిరభ్యంతరంగా*

    *తిన మంటున్నారు.*


_పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందు కోసం నచ్చిన పాటలు విన మంటున్నారు._


*ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయ మంటున్నారు. కొందరు "వాకింగ్" ఇష్టపడితే మరి కొందరు జిమ్‌కు వెళ్ళాలను కుంటారు. ఇంకొందరు "బ్రిస్క్‌వాక్" చేయాలనుకుంటే, ఇంకొందరు "స్టెయిర్ కేస్  వాక్"  చేయాలను కుంటుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచి పెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయ మని సూచిస్తున్నారు.*


      ఒక్క సారిగా వీరి వైఖరి

      ఇలా మారి పోడానికి

      కారణం సరికొత్త

      అధ్యయనాలలో

      వెలుగు చూస్తున్న అంశాలే

      కారణం. 

*ఇలా వెల్లడైన అనేక పరి శోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తది.          దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబు తున్నారో చూద్దాం.*  


*➢    "మానసిక ఒత్తిడి" వల్ల గ్యాస్ ::*

       కడుపులో  గ్యాస్ సమస్యను వాయువు అంటారు.                ఇది రావ డానికి, ముదర డానికి కారణం  ఆహార లోపాల వల్ల కాదట.  

"మానసిక ఒత్తిడి" వల్ల ఎక్కువ వస్తుందట !


*➢  "ఆవేశ కావేశాల" వల్లే అధిక రక్తపోటు ::*


     ఉప్పు ఎక్కువగా తినే వారి కంటే 

"ఆవేశ కావేశాలను" అదుపులో పెట్టుకోని వారిలోనే  "అధిక రక్తపోటు" ఎక్కువట !


*➢   "అతి బద్ధకం" వల్ల చెడు కోలెస్టరాల్ ::*


        కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే  అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడు కోలెస్టరాల్ ఎక్కువట!


*➢   "మధుమేహం" సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినే వారిలో కంటే,*

       "అధిక స్వార్ధం", 

       "మొండితనం"

*ఉన్నవారి లోనే ఎక్కువట !*


*➢  "అతి విచారం" వల్ల ఆస్త్మా  ::*


    ఊపిరి తిత్తులకు గాలి అందక పోవడం కంటే, 

అతివిచారం వల్లనే ఊపిరి తిత్తులలో మార్పులు వచ్చి ఆస్త్మా వస్తుందట... 


*➢   "ప్రశాంతత" లేక గుండె జబ్బులు ::*


ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టు కోవడంలో మార్పులు వస్తున్నాయట.


అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట. 


*మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు "మూల కారణాలు" తరచి చూస్తే "ఆహార అలవాట్ల" వల్లకాదని లైఫ్‌ స్టయిల్ సంబంధ మైన వేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు.         వారి అధ్యయనం ప్రకారం-* 


  *  50% ఆధ్యాత్మికత

      లోపంవల్ల

  *  25% మానసిక కారణాల

      వల్ల

  *  15% సామాజిక,

      స్నేహబాంధవ్యాల లోపం

      వల్ల

  *  10% శారీరక కారణాల

       వల్ల...

*రోగాలు వస్తున్నాయి. అందువల్ల "కడుపు మాడ్చుకుని" ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా, "జీవన శైలి"ని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు.* 


*వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండా లంటే* 


       -  స్వార్ధం, 

       -  కోపం, 

       -  ద్వేషం, 

       -  శత్రుత్వం, 

       -  ఆవేశం, 

       -  అసూయ,

       -  మొండితనం, 

       -  బద్ధకం, 

       -  విచారం, 


*వంటి "వ్యతిరేక భావాల"ను వదిలించు కోవాలి.*


       -  కారుణ్యం, 

       -  త్యాగం, 

       -  శాంతం, 

       -  క్షమ, 

       -  నిస్వార్ధం, 

       -  స్నేహభావం,

       -  సేవాభావం, 

       -  కృతజ్ఞత, 

       -  హాస్య ప్రియత్వం,

       -  సంతోషం , 

       -  సానుకుల దృక్పథం

పెంచు కోవాలి.”

భగవంతుడు

 *1).అనంతమైంది ఆకాశం...*

(ఆ అనంతమే భగవంతుడు)

 

*2).అగ్నిలో ఉన్న వేడి అగ్ని...*

(ఆ వేడి భగవంతుడు)

 

*3).వాయువులో ఉన్న చలనం వాయువు...*

(ఆ చలనమే భగవంతుడు)


*4).నీటిలో ఉన్న రుచి నీరే...*

(ఆ రుచి భగవంతుడు)

 

*5).భూమిలో ఉన్న (మొలకెత్తే) శక్తే భూమి...*

(ఆ శక్తే భగవంతుడు)

 

*అర్ధమైతే ఆనందించండి అర్థం కాకపొతే ఆలోచించండి.*

వాసిష్ఠం లో

 సాక్షాత్తూ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు ఒక రాక్షసుడైన రావణాసురుడిని చంపడానికి భార్యావియోగం అనుభవించి దుఃఖించాల్సిన పని ఏమిటి? దీని వెనుక ఏమైనా శాపాలు కానీ, మరేదైనా కారణం కానీ ఉందా?

దీనికి సమాధానం యోగ వాసిష్ఠం లో దొరుకుతుంది.

యోగ వాసిష్ఠం లో రాముడికి కలిగిన సందేహాలకు వసిష్ఠ మహర్షి చేసే తత్వబోధ ఉంటుంది. అందులో ఆయన మానవుడిగా ఎలా అవతరించాడు, భార్యా వియోగం ఎలా కలిగింది, అందుకు కారణమైన 4 శాపాలు వున్నాయి. వాటిల్లో 3 శాపాలు భార్యా వియోగానికి కారణమైనవి. అవి

1. ఒకసారి దేవదానవ సంగ్రామంలో విష్ణుమూర్తి దేవతల పక్షాన పోరాడుతూ, రాక్షసులను తరుముతుంటే వారు భృగు మహర్షి భార్యని శరణువేడారు. ఆమె వారిని తన ఇంట్లో దాచి, శ్రీహరి ఇంట్లోకి పోవడానికి వీల్లేదని అడ్డగించింది. ఇప్పుడైతే రాక్షసులంతా ఒకేచోట దొరికారు, ఇప్పుడు వీరిని వదిలేస్తే లోకాలకు చాల ఉపద్రవం తెస్తారు, ముని పత్ని అయివుండి, ఈమె శ్రీహరికి ఎదురు తిరుగుతుంది. పైగా పాపాత్ములకి సహాయం చేస్తుంది అని శ్రీహరి ఒక్కక్షణం ఆలోచించి, పాపం వస్తే రానిమ్మని, లోకక్షేమం కోసం అడ్డువచ్చిన భృగుపత్నిని సంహరించి, ఆ తర్వాత రాక్షసులని సంహరించాడు. భృగుమహర్షికి తన భార్య చేసింది తప్పని తెలుసు. అయినా దుఃఖంతో ఒళ్ళు తెలియక "శ్రీహరి! నీకు కూడా నాలాగే భార్యా వియోగం కలుగుగాక!" అని శపించాడు.

2. బృంద అనే గోలోక కన్య శ్రీహరి పొందు కావాలని వరం కోరింది. భర్త కావాలని కోరలేదు, అది విని రాధాదేవి ఆగ్రహించి రాక్షసకన్యవి కమ్మని శపించింది. ఆ జన్మలో కూడా ఆమె పేరు బృందయే. ఆ జన్మలో ఆమె జాలంధురుడు అనే రాక్షసుడికి భార్యయై మహాపతివ్రత గా ఉండేది. జాలంధురుడు మహా దుర్మార్గుడై లోకాలను పీడిస్తూ ఉండేవాడు. కానీ బృందయొక్క పాతివ్రత్య మహిమవల్ల వాడికి చావు లేకుండా పోయింది. అందువల్ల ఆమె పాతివ్రత్యాన్ని భంగపరచవలసిన అవసరం ఏర్పడింది. పూర్వ జన్మలో ధర్మభంగకరంగా ఆమె శ్రీహరి పొందు కోరింది కనుక, ఇలాంటి విషమ పరిస్థితుల్లో, రాబోయే ప్రమాదాలు తెలిసి కూడా, శ్రీహరి జాలంధరుడి రూపం ధరించి బృందాదేవిని మోహింపచేసాడు. పాతివ్రత్య భంగం జరగగానే జాలంధురుడు యుద్ధంలో మరణించాడు. అప్పుడు విష్ణుమూర్తి చేసిన మోసాన్ని గ్రహించిన బృందాదేవి దుఃఖావేశంలో, తాను పూర్వజన్మలో చేసిన తప్పుని గుర్తించలేక, తప్పంతా శ్రీహరిదే అని భావించి, "నాకు భర్త్రువియోగం కలిగినట్లే, నీకూ భార్యావియోగం కలుగుగాక!" అని శపించింది.

3. పూర్వం పయోష్ణీ నదీ తీరాన దేవదత్తుడు అనే గృహస్తు నరసింహోపాసన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన తపస్సుకి సంతోషించి నృసింహ స్వామి మంచి ఆర్భాటంగా సాక్షాత్కరించాడు. సామాన్యంగా దేవతల సాక్షాత్కారాలు ఎవరు తపస్సు చేసారో వారికి మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈ నృసింహ సాక్షాత్కారం దేవదత్తుడి భార్యకి కూడా కనిపించింది. ఆమె ఆ భయంకర ఆకారాన్ని చూసి గుండె ఆగి మరణించింది. దేవదత్తుడు సాక్షాత్కార మహానందంలో మునిగి, కొంతసేపటికి ఇహలోకంలో వచ్చాడు. వస్తూనే ఈ సాక్షాత్కారం వల్ల తన భార్య మరణించింది అని గ్రహించి దుఃఖావేశంలో పడిపోయి, వివేకం కోల్పోయి "విష్ణుదేవా! నీకు కూడా నాకుమల్లే భార్యావియోగం సంభవించుగాక!" అని శపించాడు.

ఈ 3 శాపాలు శ్రీ మహావిష్ణువికి భార్యావియోగాన్ని కలిగించేవి. ఈ ముగ్గురి మీదా ప్రేమవల్ల, వారి శాపాలని మన్నించి, మానవుడై జన్మించి 3 సార్లు భార్యావియోగాన్ని అనుభవించాడు. రావణుడు సీతాపహరణం చేసినప్పుడు ఒకసారి, తర్వాత లోకుల అపవాదు వల్ల సీత గర్భవతిగా ఉండగా రెండోసారి, మళ్ళీ యజ్ఞశాలలో కలిసాక, ఈసారి సీతాదేవి భూప్రవేశం చేయడంతో శ్రీరాముడికి మూడోసారి భార్యావియోగం. ఇలా 3 శాపాలు చెల్లినాయి.

ప్రసన్న (USA)

గొప్ప తపస్సు.

 .

                  *_సుభాషితమ్_*


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*కాయక్లేశైశ్చ బహుభిః* 

*న నైవార్థస్య రాశిభిఃl*

*ధర్మః సమ్ప్రాప్యతే సూక్ష్మః*

*శ్రద్ధా ధర్మోsద్భుతం తపఃll*

                      నారద పురాణమ్


తా𝕝𝕝 

ఆచారాదులతో శరీరాన్ని కష్టపెట్టుకున్నంత మాత్రాన, ధనాదులు రాశులుగా ఉన్నా, సూక్ష్మమైన ధర్మాచరణ తేలిక కాదు....శ్రద్ధ కలిగి ఉండటమే ధర్మం.... అదే గొప్ప తపస్సు.

కవితా నిర్వచనము

 


ఉత్తమ కవితా  నిర్వచనము 

                                       ------------------------------------------ 


సీ: పొసఁగ   ముత్తెపు సరుల్  పోహళించినలీలఁ


                దమలోన దొరయు   శబ్దములు   గూర్చి ,


       యర్ధంబు  వాచ్య   లక్ష్య  వ్యంగ్య   భేదంబు


                        లెఱిఁగి   నిర్దోషత   నెసఁగఁ  జేసి ,


      రస భావములకు  సంగతంబుగ   వైదర్భి


    మొదలైన  రీతు  లిమ్ముగ   నమర్చి ,


   రీతుల   కుచితంబులై   తనరారెడు


                     ప్రాణంబు   లింపుగాఁ   బాదుకొల్పి ,


గీ:  యమర, నుపమాదులును,  యమకాదులు  నగు

      నట్టి   యర్ధశబ్దాలంక్రియలు    ఘటించి ,

     కవితఁ  జెప్పంగ   నేర్చు  సత్కవివరునకు 

     వాంఛితార్ధంబు   లొసఁగని   వారుఁ  గలరె ?


కళాపూర్ణోదయము -అవతారిక- పింగళి సూరన;


                ఉత్తమ  కవితా  నిర్వచనాన్ని  పింగళి సూరన  చెప్పిన  విధానం  అపూర్వం! అంతకు ముందున్న కవులెవ్వరూ  ఇంత విశదంగా  కవిత్వ తత్వాన్ని  వింగడించిన వారు లేరు. ఈవిధానం  ఆనాటి  లాక్షణిక , ఆలంకారిక ,విధానాలకు ప్రతీకగా  నున్నదని చెప్పవచ్చును. 


                            శబ్దములు , అర్ధములు ,దోష ముల ప్రయోగింపకుంట , రస ,భావముల  యోజన ,వైదర్భి మొన్నగు రీతులను ,ఉపమాది యర్ధాలంకారములను ,యమకాది శబ్దాలంకారములను ,ప్రయోగిస్తూ  కవిత్వం చెపితే  మెచ్చి  ,కవికి యీప్సతార్ధముల నెవ్వరు యీయరు? అంటాడు సూరన.


                   శబ్దాలు ముత్యాల దండలా అమర్చుకోవాలట.ముత్యాలదండ ఒకేపరిమాణంగల  ముత్యాలతో  గుచ్చుతారు. అలాగే కవిత్వంలో  ఉపయోగించేమాటలు  ఒకదానికొకటి  పొంతన కలిగి ఉండాలని కవి యభిప్రాయం.


                         అర్ధము  వాచ్య  (అభిధ )  లక్షణ  ,వ్యంజన , అనిమూడురీతులు. అభిధ-వాచ్యార్ధ బోధకం; లక్షణ - కొంచెంలోతుగా ఆలోచిస్తే తట్టేఅర్ధం. వ్యంజన- ధ్వనించే యర్ధము; ఇలాఇది మూడువిధాలు. వీటిని యెక్కడ దేనిని ప్రయోగించాలో తెలిసియుండాలి.


                       దోష ము  లున్నాయి.ఇవి ప్రయోగిస్తే  ప్రధాన రసానికి  విఘాతం కలిగిస్తాయి. కాబట్టి  నిషేధం. అయితే అవి యేవో కవి ముందుగా తెలిసికోవాలి. తరువాత వాటిని వారించాలి.


                    రసము  భావము  మొన్నగు  వానిని  పోషించటానికి   వృత్తులను  తెలిసికోవాలి.శృంగారానికి -వైదర్భి; వీరమునకు- ఆరభటి ; శాంతాదులకు - సాత్వతి; ఉపయోగిస్తారు. వీటిని పోషించేవి రీతులు వాటి స్వరూపాన్ని తెలిసికొనియుండాలి.


                     ఇక  రచనలో అలంకార  ప్రయోగంలో  వైపుణ్యం ఉండాలి.  ఉపమాది  అర్ధాలంకారములు. యమకాది శబ్దాలంకారములను  ఉచిత మైనరీతిలో  ప్రయోగిస్తూ  కావ్యం వ్రాయాలి.


                        ఇదంతా కవిత్వ రచన  కుపకరించే  సామగ్రి !


           ఇదిగో  ఇన్నితిప్పలు పడితే  కవి  కావ్యం వ్రాయగలడు. అంత ప్రతిభావంతుని  మెచ్చని దెవ్వరు?


              సూరన  వ్యంగ్యముగా  తనప్రతిభ  నంతయు నిందు  వ్యక్తమొనరించుచు  


                           కళాపూర్ణోదయ  మెంత  ప్రతిభైక  సాధ్యమో  నిరూపించెను.


              ఇదీ  సాంప్రదాయ  కవిత్వరచనలో  గల కష్టాలు సుఖాలు. విన్నారుగదూ?


                                                     స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷👌👌👌👌

గుడిలో పూజారిని

 గుడిలో పూజారిని పోషించే వ్యవస్థ కనుమరుగయ్యింది !


కాదు కనుమరుగు చేశారు, ఇది ఒక పథకం ప్రకారం జరిగింది ! 


గుడిలో పూజారికి కడుపునిండకపోతే ఆ దేవుడు చూపిన వేరే దారి వెతుక్కుంటాడుగానీ పూజారిగా ఉండడు! 


అప్పుడు గుడి ఉండదు దేవుడిపూజలూ ఉండవు!


 మనం గొప్పగా చెప్పుకునే భారతీయ సంస్కృతి అసలే ఉండదు ! ... ఎందుకంటే గుడులే సంస్కారకేంద్రాలు కాబట్టి ! 


పూజారికి కానుకలు వేయవద్దు అని బోర్డులు ! బాగుంది ! 


మరి ఆయనకు జీతమెంత ఇస్తారు ఆలోచించారా ? 


ఎక్కువలో ఎక్కువ 15000/ ఆడబ్బుతో పెళ్ళానికి చీరలేకొంటాడా ? పిల్లాడికి చదువులేచెప్పిస్తాడా ? 

రోగంరొష్టువస్తే వైద్యమే చేయించుకుంటాడా ? 


అసలు విషయం మరచిపోయా ఇంటి అద్దె కట్టి కడుపునింపుకొని గుడ్డలుకొనుక్కొన్న తరువాత కదా పైన చెప్పినవి ! 


గుడులు ఆదాయకేంద్రాలు కాదు అవి సంస్కారకేంద్రాలు ! అక్కడ పనిచేసేవారి జీవితం జీవనం సుఖసంతోషాలతో ఉంటేనే ! సంస్కృతి సంప్రదాయం నిలబడేది !


పూజారిగారికి దక్షిణ ఇవ్వండి ! వారి జీవితాలలో వెలుగు నింపండి ! 


అప్పుడే భారతీయసంస్కారాలు పదికాలాలు నిలబడతాయి !


🚩 జై శ్రీరామ్ 🚩




https://kutumbapp.page.link/WYYxAJnJqzJdGsws9?ref=F4LTY

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 87*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 87*


ఆనాడే చంద్రగుప్త మౌర్యుని పట్టాభిషేకం. 


పాటలీపుత్రం అంతటా మామిడి తోరణాలతో, రంగురంగుల రంగవల్లికలతో సువాసనలు గుభాళించే వివిధ పూలహారాలతో అలంకరించబడింది. మహానందుల వారిపై తమకి గల భక్తి అభిమానాలను నగర పౌరులు వీధి వీధినా, ఇంటింటా రకరకాల రంగురంగుల అలంకారాలతో ముస్తాబు చేసి తమ రాజభక్తిని చాటుకున్నారు. 


ఆ ఆలంకరణల్లో అతి ముఖ్యమైనవి, ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నవి స్వాగత ద్వారాలు. మహారాజుగా సింహాసనాన్ని అధిష్టించబోతున్న చంద్రగుప్తుడు గజరాజు చంద్రలేఖ మీద ఆసీనుడై ఊరేగింపుగా ఒక్కొక్క ద్వారం క్రింది నుంచి వస్తాడు. ఆ ద్వారాలు దాటుతున్నప్పుడు వాటి మధ్య ప్రత్యేకంగా నిర్మించిన గుమ్మటాల్లోంచి పూలవర్షం మహారాజు పై కురుస్తుంది. ఆ వింతలూ, విడ్డూరాలూ కళ్ళారా చూడడానికి నగర పౌరులు ప్రధానవీధులకి ఇరువైపులా బారులు తీరి గుంపులు గుంపులుగా నిలబడి ఆ ఘడియ కోసం ఉత్సాహంగా ఎదురు చూడసాగారు. 


అయితే అతిథి భవనంలో చాణక్యుడు ఏ మాత్రం ఉత్సాహంగా లేడు. 'ఆ స్వాగత ద్వారాలలో ఒకటి దారువర్మ అనే శిల్పి నిర్మించాడు. దారువర్మ రాక్షసమాత్యునికి భక్తుడు, భృత్యుడు. అజ్ఞాతవాసంలో ఉన్న అమాత్యుడు శిల్పి దారువర్మ ద్వారా ఊరేగింపు సమయంలో చంద్రగుప్తుని హతమార్చడానికి వ్యూహం రచించాడు' అని వర్తమానం పంపించాడు ఇందుశర్మ. 


చాణక్యుడు ఈ వార్త తెచ్చిన ఆగమసిద్ధి వైపు చిరాకుగా చూస్తూ "ఒకవైపు ఊరేగింపుకి సమయం దగ్గర పడుతుంటే ఇంత ఆలస్యంగా వార్తలు పంపడం ?" అని విసుక్కున్నాడు. 


ఆగమసిద్ధి తలవంచుకుని "విషకన్య ప్రయోగం విఫలమై అజ్ఞాతవాసంలోకి వెళ్ళినప్పటి నుంచి అమాత్యుడి అనుపానులు తెలియడంలేదు. అతడిప్పుడు జీవసిద్ధిని కూడా కలవడం లేదు. అసలు ఈ మాత్రం విషయ సేకరణయే గగన కుసుమం అయిందని, ఇందుశర్మ గురుదేవులు, మనవి చెయ్యమన్నారు" చెప్పాడు వినయంగా. 


చాణక్యుడు అసహనంగా పచార్లు చేస్తూ..  

"పోనీ ఆ దారుశర్మ నిర్మించిన ద్వారం ఎక్కడో గుర్తించారా" అడిగాడు. 


"అలా గుర్తించడం అసాధ్యం. మౌర్యుడు ఊరేగింపుగా వచ్చే ప్రధానమార్గాలలో పౌరులు ఎవరిశక్తి, భక్తి కొలది వారు ద్వారాలు నిర్మించుకున్నారు. నగరంలో రాజమార్గంలో సుమారు 250 స్వాగతద్వారాల నిర్మాణం జరిగింది. అయితే ఉత్తరదిశలో ఆ ద్వారం నిర్మించమని దారుశర్మను అమాత్యుడు ఆదేశించినట్లు తెలిసింది" అని మనవి చేశాడు ఆగమసిద్ధి. 


చాణక్యుడు చప్పున ప్రచార్లు ఆపి 

"ఆహా ... ! రాక్షసామాత్యా...! నీ రాజభక్తి ప్రశంసనీయము. నవనందులపై నీకు గల ప్రేమాభిమానములు అసామాన్యములు. ఈ చాణుక్యుని తంత్రములనే త్రిప్తిగొట్టుటకు విశ్వప్రయత్నాలు చేయుచుంటివిగా ...? చూసేదగాకా..." అన్నాడు సాలోచనగా. 


అంతవరకూ మౌనంగా ఉన్న చంద్రగుప్తుడు నోరు విప్పి "తమరు, అసలా రాక్షసుని ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావడం లేదు" అన్నాడు అసహనంగా. 


"ఉపేక్ష కాదు చంద్రా, ఆపేక్ష... రాజభక్తిలో, మంత్రాంగంలో, పరిపాలనా చాతుర్యంలో అమాత్యుడు అసమాన ప్రజ్ఞా దురంధరుడు. అతడు నీకు విధేయుడే, ఈ మంత్రిమండలికి నాయకుడై ' మహామంత్రి'గా బాధ్యతలు స్వీకరించేనా... ఇక నీకూ, నీ సామ్రాజ్యమునకూ ఎదురే ఉండదు. అందుకే అతడంటే ఆపేక్ష. ఎలాగైనా నీకు విధేయుడుగా మార్చవలెనని యే ఉపేక్ష..." చెప్పాడు చాణక్యుడు. 


చంద్రుడు నొసలు చిట్లించి "ఏమో... అతనిని ఎవరు నమ్మగలరు ? ఎట్లు నమ్మగలరు ? అతను నందానుకూలుడు" అన్నాడు అనాసక్తిగా. 


"ఏం... ? నువ్వు కావా, నందుడివి... ?" ఎదురు ప్రశ్నించాడు చాణుక్యుడు. చంద్రుడు నిర్ఘాంతపోయాడు. 


చాణక్యుడు నవ్వి "మీ తండ్రిగారిది నందవంశము. వారి వారసుడివైన నువ్వే అసలైన నందుడివి కానీ.... సంకరజాతి వారైనా నవనందులు నందవంశస్థులు కారు. కాలేరు. ఈ సత్యం రాక్షసామాత్యునికి కూడా తెలుసు. అందుకే అతడికి నీ పట్ల బయటికి వ్యక్తం చెయ్యలేనంతటి ప్రేమాభిమానాలున్నాయి. కానీ అతడు మహాపద్మనందుడికి ఇచ్చిన మాట గురించి ఇదంతా చేస్తున్నాడు. అపాత్రదానం ఎంత పాపమో, అధర్మనుడికి చేసిన వాగ్దానమూ అటువంటిదే... దానిని మీరడం దోషం కాదు. ద్రోహం కాదు. ఈ ధర్మసూక్ష్మాన్ని రాక్షసుడు గ్రహించేటట్లు చెయ్యగలిగితే... చంద్రా... ! నేను కలలుకంటున్న మహాసామ్రాజ్య స్థాపన జరుగుతుంది. దానికి నువ్వు సార్వభౌముడివై, రాక్షసామాత్యుని సారధ్యంలో ప్రజారంజకంగా పాలన చేస్తూ నా అర్థశాస్త్రమును ఈ దేశవ్యాప్తంగా ఆచరణ సాధ్యం చేసి ప్రజలను ధర్మ, న్యాయ, సత్య, అహింస, ప్రేమ మార్గాలలో బుద్ధి జీవులుగా మార్చవలెనని నా సంకల్పం... దానికోసమే ఈ ప్రయాస... అందుకే ఈ ఉపేక్ష..." అని వివరించాడు గంభీరంగా. 


చాణక్యుని అంతర్యానికీ ఆత్మ విచక్షణకి జేజేలనర్పిస్తూ చంద్రుడు, ఆగమసిద్ధి చేతులెత్తి నమస్కరించారు. క్షణం తర్వాత ఆగమసిద్ధి కల్పించుకొని ... "ఊరేగింపు బయలుదేరడానికి అట్టే వ్యవధి లేదు. రాక్షసామాత్యుని వ్యూహాత్మక ద్వారం ఎక్కడ నిర్మించబడిందో తెలుసుకునేంతటి వ్యవధి లేదు. పోనీ... ఊరేగింపు మానేస్తే ... ?" అన్నాడు.


"అసంభవం ...." అన్నాడు చాణక్యుడు పట్టుదలగా. దీర్ఘాలోచనతో వికృతంగా భృకుటి ముడిచి "ఈ చాణక్యుడు ఒకసారి నిర్ణయం తీసుకుంటే. దాని ప్రకారం ఆ కార్యక్రమం జరిగిపోవాలి. చంద్రుడు భద్రగజంపై ఊరేగింపుగా పురవీధుల్లో సాగుతూ సుసాంగ ప్రాసాధాన్ని చేరుకుంటాడని చాణక్యుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయానికి తిరుగులేదు. చంద్రా ! నువ్వు సిద్ధంకా... ఇప్పుడే వస్తా..." అనేసి విసవిసా బయటికి నడిచాడు. 


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఆనాటి జీవన శైలి.

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

❤️60 ఏళ్ళ  పూర్వం ఆనాటి జీవన శైలి....❤️



🎉

ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందొం పుల్లలు అని కూడా అనే వారు.

😃

కొంతమంది కచ్చిక,  (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళ పొడితో పళ్ళు తోముకునే వారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచు కోవడానికి ఉపయోగించేవారు.

🎊

మగ వాళ్ళు చాలా మంది నూతి దగ్గరే,  నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనే వారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయి నిచ్చేది. చలి కాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి.

💐

ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రల పొయ్యి, లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్ర మైన విషయం. Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మే వారు.

👋

కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీ పొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరు లెక్కన అమ్మే వారు.

🤝

బొగ్గుల కుంపటి మీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది వత్తుల స్టౌ,  పంపు స్టౌ వాడేవారు కిరసనాయిలు ది.

🌸

అదే విధంగా గా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం( పావు వీశ)గా తూచే వారు.

🏀

ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించే వారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెల తోనే. అందరి ఇళ్లలోనూ  రాచ్చిప్పలు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు,  ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచే వారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బురోట్లోనే.

🎉

అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి.

🎈

అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు.

㊗️

బియ్యం లో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసన్నాలు, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, మధ్య రకం. కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు.

🇺🇳

సీతారామాభ్యానమః అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్ళకు వచ్చి తిథి వార నక్షత్రాలు చెప్పి వెంటనే వెళ్లి పోయేవారు. వెళ్లిపోయే లోపులో గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసే వారు. ఒక వేళ, రాలేకపోతే,  అయితే ఏదో తప్పు చేసినట్లుగా, అపరాధ భావనతో ఉండి, మర్నాడు ముందే రెడీగా ఉండి, రెండు గుప్పెళ్లు వేసేవారు బియ్యం.

🍼

రాత్రిపూట7, 8 గంటలకు మాదాకవళం తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు పేచీ పెడుతుంటే మాదాకవళం అబ్బాయికిచ్చేస్తానని భయపెట్టేవారు తల్లులు.

🎂

టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి / ఎర్ర నూక ఉప్మా లాంటివి ఉండేవి.

🇦🇬

పిల్లలు అందరూ 3 పూటలు అన్నం తినే వారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేల మీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు.

🌸

ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పెద్దలు పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు.

💍

డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితి మంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండే వారు. గదులు కూడా చాలా పెద్దవి.

♦️

3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి - 27 రూపాయలు. కరెంటు -1 బల్బు కి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30 అద్దె ఉండేది.

🎁

వైద్యం కి డాక్టర్స్ చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరకు ఇచ్చే వారు. జ్వరం తగ్గే వరకూ లంఖణమే. తర్వాత బన్ను, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్  భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది.  అదే ప్రభుత్వాసుపత్రికి పోతే రంగు రంగుల ఔషథాలిచ్చేవారు.

🌹

ఇంకా, పిల్లల చదువుల మీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు.  అంతే.   ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసే వారు కాదు.

🎉

పుస్తకాలు ఎప్పుడు, వేరే వాళ్ళు వాడినవే.    పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేట్ కి టెక్స్ట్ బుక్స్ కొనే వారు. నోట్స్ అన్నీ తెల్ల కాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. క్రితం ఏడు నోట్ బుక్స్ లో మిగిలిన తెల్ల కాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త బుక్ లా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు.🎊


రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం.  అర్థం అయినా కాకపోయినా, రాత్రి పెందలాడే, నిద్ర.   వేసవి కాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసనకర్రే."*

🌷

ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది.  రెండు రూపాయలు పెట్టి,  ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు.

🥳

అదీ ఆరోజుల్లో జీవన శైలి.

ఎవరికీ ఏ చీకూ చింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు  నిర్వహించేవారు.

🏵️

అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలుండేవి 

వారాలబ్బాయిలు వీథి దీపాల చదువులు… మనుషులంత ఒక్కటిగా ఉండే వాళ్ళు.  ప్రజలంతా అమాయకంగా ఉండేవాళ్ళు.

㊗️

కక్షలూ కార్పణ్యాలు.  కోప తాపాలు కుళ్ళూ కపటం.   ఈర్ష్యా ద్వేషాలు  వాళ్ళకుంది మాకులేదని ఏనాడూ అనుకునే వారే లేరు.   అహంకారం ప్రతీకారం అనేవే తెలీదు అప్పటి జనాలకి.

🎈

వెనక్కి తిరిగి చూచుకుంటే ఆ రోజులే బాగున్నాయనిపిస్తుంది. ఇప్పుడున్నన్ని సౌకర్యాలు, విలాసాలు లేకపోయినా, ప్రకృతికి దగ్గరగా, ఆరోగ్యంగా గడచిన రోజులు.....🙏🏻 🙏

సేకరణ:- వాట్సాప్ పోస్ట్.

రాజపుత్ర వీరుడు బుందేల్కండ్

 80 ఏళ్ల రాజపుత్ర వీరుడు బుందేల్కండ్ రాజా ఛత్రశాల్.. తనను వేలాది మొఘుల్ జీహాదీలు చుట్టుముట్టినప్పుడు ' పీష్వా బాజీరావ్ ' కు రాసిన ఉత్తరంలో చేసిన సంబోధన..         నదిలో దిగిన గజేంద్రుడ్ని మొసలి పట్టుకున్నట్టు నన్ను నాశత్రువులు పట్టుకున్నారు.. ఈ సమయంలో నన్ను ఆదుకొని నాకు తోడుగా వచ్చి పొరాడి తమ శౌర్యాన్ని చూపి నన్నూ నా ప్రజలను నారాజ్య మహిళల మానాలనూ కాపాడాల్సిన నా తోటి రాజపుత్రులు షండులై పారిపోతున్నారు.. ఒక నిస్సహాయ రాజపుత్రుడు ఒక మహావీరుడైన బ్రాహ్మణుడ్ని తనరాజ్యం తన మహిళల మానప్రాణ రక్షణకోసం చేయిచాచి ఆర్ధిస్తున్నాడు.. ' పీష్వా బళ్లాడ్ '.. నన్నూ నా రాజ్యలక్ష్మిని అవమానాల నుంచీ కాపాడు.. హిందూ ధర్మపరిరక్షకుడైన శివాజీ రాజే ఖడ్గానివి నీవు.. ఒక సుక్షత్రియుడి విన్నపాన్ని మన్నిస్తావని ఆశిస్తూ - రాజా ఛత్రశాల్..  ఈ లేఖ చూసిన మరుక్షణమే రక్తం ఉడికిపోయిన ' పీష్వా బళ్లాడ్ ' తన దగ్గర ఉన్న కేవలం 500 ఆశ్విక దళంతో బుందేల్ ఖండ్ వైపు పరుగుతీశాడు.. 10 రోజుల ప్రయాణం కేవలం 48 గంటల్లో ముగించి అలసటన్నదే లేకుండా గెరిల్లా యుద్ధ తంత్రంతో మొఘల్ సేనలను ఊచకోత కోసి సేనాధిపతి ఫంగస్ ఖాన్ తల నరికి రాజా ఛత్రశాల్ కు కానుకగా అందిస్తూ చెప్పాడు.. ఒక సుక్షత్రియుడి రాజ్యాన్ని రాజ్యలక్ష్మిని మహిళల మానప్రాణాలను చెరచబోయిన ఒక దుర్మార్గుడి తలను ఒక బ్రాహ్మణ్ వీరుడు మీకు బహుమతిగా ఇస్తున్నాడు స్వీకరించండి.. ఆ విజయానికి ఉప్పొంగిపోయిన రాజా ఛత్రశాల్ పీష్వా బాజీ ని ఆలింగనం చేసుకొని అంటాడు ' ఇదం క్షాత్రమ్ ఇదం బ్రాహ్మ్యమ్ '.. జైభవానీ..వీర్ శివాజీ.. భారత్ మాతాకీ జై..🙏🙏🙏 శేఖర్ శర్మ

దేవాలయాలు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

దేవాలయాలు కడితే ఉద్యోగాలు వస్తాయా?

దానికి బదులు బడి కట్టండి.

ఓ ప్రతిపక్ష నాయకుడి వ్యాఖ్యలు.

అయితే సమాజ శ్రేయస్సు కోసం గుడులు ఉండాలి, బడులు ఉండాలి.

గుడి గురించి....

#గాడిదకేం_తెలుసు_గంధ_చెక్క_వాసన అన్నట్టు


లక్ష కోట్లకు పైబడి వ్యాపారం జరుగుతోంది .. 😎


దేవాలయాలు లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతాది.


#దేవాలయాలు_ఉండటం_వలన:-

పూజలు, యాగాలు, హోమాలు, అన్నదానాలు, విద్యాసంస్థలు, మరి ఎన్నో సేవ సమస్తలు పని చేస్తున్నాయి.


1) పూలు అమ్మేవారు, 

2) పండించే వారు,

3) టెంకాయ అమ్మేవారు, 

4) పండించే వారు,

5) పూజా సామాగ్రి అమ్మే అంగడులు, 

6) వాటిని పండించే వారు, 

7) వ్యాపారం చేసేవారు, 

8) దేవాలయాలను అలంకరించడానికి లైటింగ్, మైక్ సెట్ 

9) దేవాలయ పర్యాటక వ్యవస్థ, 

10) వారిని నమ్ముకొన్న రవాణా వ్యవస్థ(బస్, ఆటో), 

11) డ్రైవర్లు, 

12) దేవాలయాల వద్ద ప్రసాదాలు, బొమ్మలు అమ్మే అంగడులు

13) బొమ్మల తయారీ వ్యవస్థ, 

ఇలా దేశంలో కొన్ని వ్యవస్థలే దేవాలయాల పైన ఆధారపడి ఉన్నాయి.

14) భారత దేశంలో పర్యాటక కేంద్రాలుగా 90% ఉన్నది దేవాలయాలే

15) దేవాలయాలలో పని చేస్తున్న ఉద్యోగులు

16) హిందూ ఆచారాలలో జరిగే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఫంక్షన్ల కారణంగా కొన్ని వ్యవస్థలే బతుకుతున్నాయి


ఇలా ఈ వ్యవస్థలలో ఒక్క హిందువులే కాదు #ముస్లింలు, #క్రిస్టియన్లు ఇలా ప్రతి ఒక్కరూ ఆధారపడి బతుకుతున్నారు.


#బ్రాహ్మణ వ్యవస్థ పోతే పై అన్ని వ్యవస్థలో దెబ్బతింటాయి, తద్వారా దేశం నాశనం అవుతుంది. ఇది గ్రహించిన శత్రు దేశాలు బ్రాహ్మణులను శత్రువులుగా చూపుదు కొన్ని వర్గాలను రెచ్చగొడుతున్నాయి.


ఇన్ని మాటలు చెప్పే మీరు గత 70 ఏళ్లలో #దేవాలయాల_సంపదను, #దేవాలయ_భూములను దోచుకున్నారు.

ఇప్పుడు దేవాలయాలకు #వచ్చే_భక్తులను_దోచుకుంటున్నారు. 


భారతదేశంలో దేవాలయాలు లేకపోతే ఒక్క నెల రోజులలోనే మీ ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి.


భారతదేశంలో #హిందూ_దేవాలయాలు, #హిందూ_ధార్మికత, #ఆచారాలు లేకపోతే ఈ దేశమే లేదు... ఎవడు ఏమనుకున్నా ఇది #హిందూదేశమే.


బడులు విజ్ఞానాన్ని అందిస్తే

గుడులు సంస్కారాన్ని ఇస్తాయి.

🙏🙏

సేకరణ:- హందాడి గణేశ్ వాట్సాప్ పోస్ట్

ఈ రోజు పద్యము:

 187వ రోజు: (భాను వారము) 11-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


ధరణీనాయకు రాణియు

గురురాణియు నన్నరాణియు కురకాంతను గ

న్నరమణి దను గన్న దియును 

ధర నేవురు తల్లులనుచుఁ దలఁపు కుమారా!


 ఓ కుమారా! రాజు భార్యయు, గురు భార్యయు, అన్న భార్యయు, అత్త (భార్య తల్లి)యును, ఈ ఐదుగురు తల్లులని భావింపవలెను. 

 

ఈ రోజు పదము. 

శరభము: అగౌకసము, ఉత్పాదకము,ఊర్థ్వలోచనము, చౌగంటి, మీగండ్లమెకము.

బుద్ధి కుశలతను

 శ్లోకం:☝️

*న దేవా దణ్డమాదాయ*

  *రక్షంతి పశుపాలవత్ ।*

*యం తు రక్షితమిచ్ఛంతి*

  *బుద్ధయా సంవిభజన్తి తం ।।*


భావం: దేవతలు పశులకాపరుల వలే కర్రతో కాపలా కాయరు. తాము రక్షించవలసిన వ్యక్తులకి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు.🙏

అంటే ఎవరికి వారే ప్రమాదముల నుండి బయటపడే బుద్ధి కుశలతను దేవతలు ప్రసాదిస్తారని భావం.

నిర్వాణ షట్కము**

 **నిర్వాణ షట్కము** 


01

మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం

న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే

న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః

    చిదానందరూపః శివోహం శివోహం

    చిదానందరూపః శివోహం శివోహం



ఘనత గల్గిన చిత్తమ్ము  మనసు కాను 

అరయ బుద్ధిని గాను నే నహము కాను 

చెవులు కన్నులు నాసిక  జిహ్వ  కాను

అవని వ్యో మాగ్ని  వాయువు నరయ కాను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను    01


02                                                                 

న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః

న వా సప్తధాతుః న వా పంచకోశః

న వాక్పాణిపాదం న చోపస్థపాయుః

           చిదానందరూపః శివోహం శివోహం

           చిదానందరూపః శివోహం శివోహం 


ప్రాణ  సంజ్ఞను  భావింప కాను నేను 

పంచ వాయువు లరయంగ యంచ కాను

రక్త రస మాంస  మేదాస్థి  యుక్త మైన 

సప్తధాతువులను గాను  సంభ్రమముగ

పంచకోశంబులను గాను నెంచ నేను

కర చరణ మాట లేమియు న్నరయ కాను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను  02 


03                                                                 

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ

మదో నైవ మే నైవ మాత్సర్యభావః

న ధర్మో న చార్థో న కామో న మోక్షః

    చిదానందరూపః శివోహం శివోహం

    చిదానందరూపః శివోహం శివోహం



ద్వేష మనురాగ  లోభముల్ వెదుక లేవు 

ఆరయ మనురాగ ద్వేషమ్ము లసలు లేవు

మోహలోభంబులును కూడ మొదలు లేవు 

మరియు ధర్మార్థ  కామముల్ మహిత ముక్తి

యేవియును లేవు నాకు నే నేమి కాను

      శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను   03



04                                                                 

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం

న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా

అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా

            చిదానందరూపః శివోహం శివోహం

            చిదానందరూపః శివోహం శివోహం



ఎన్నగా పుణ్య పాపంబు లేవి లేవు 

సుఖము దుఃఖము లనునవి చూడ లేవు 

తీర్థ మఖములు మంత్రముల్ తెలియ లేవు

అనుభవమ్మది  లేదు నా కనుభవించ

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను   04     

05                                                                 

న మే మృత్యుశంకా న మే జాతి భేదః

పితా నైవ మే నైవ మాతా న జన్మః

న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యం

           చిదానందరూపః శివోహం శివోహం

           చిదానందరూపః శివోహం శివోహం



చనెడుభయమది  లేదింక  జాతిలేదు 

జనని జనకులు తా లేరు జన్మలేదు

కాను  బంధువు  నరయంగ  కాను సఖుడ

కాను నే శిష్యుడను మరి  కాను గురువు

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను   05  


 06                                                             

అహం నిర్వికల్పో నిరాకార రూపః

విభుర్వ్యాప్య సర్వత్ర సర్వెంద్రియాణాం

సదామే సమత్వం న ముక్తిర్న బంధః

           చిదానందరూపః శివోహం శివోహం

           చిదానందరూపః శివోహం శివోహం



లేదు  రూపమ్ము చూడగన్  లేదు మార్పు

ఇల ప్రదేశమ్ము లందున యింద్రియముల

వ్యాప్తి చెందియు ననయమ్ము వరలు చుందు

నరయ సమదృష్టి నుందు నే నన్నిటందు 

ముక్తి బంధమ్ము లవిలేవు రక్తి లేదు

      శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను   06



అనువాద రచన..

గోపాలుని మధుసూదన రావు