6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

శనివారం, సెప్టెంబరు 7, 2024

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*శనివారం, సెప్టెంబరు 7, 2024

    *శ్రీ క్రోధి నామ సంవత్సరం*      

 *దక్షిణాయణం - వర్ష ఋతువు*

  *భాద్రపద మాసం -  శుక్ల పక్షం*   

🔔తిథి      : *చవితి* మ1.51 వరకు

🔯వారం   : *శనివారం* (స్థిరవాసరే)

⭐నక్షత్రం  : *చిత్ర* ఉ10.27 వరకు

✳️యోగం : *బ్రహ్మం* రా10.11 వరకు

🖐️కరణం  : *భద్ర* మ1.51 వరకు

       తదుపరి *బవ* రా2.43 వరకు

😈వర్జ్యం   : *సా4.35 - 6.20*

💀దుర్ముహూర్తము : *ఉ5.49 - 7.27*

🥛అమృతకాలం.   : *తె3.07 - 4.52*  

👽రాహుకాలం       : *ఉ9.00 - 10.30*

👺యమగండ/కేతుకాలం : *మ1.30 - 3.00*

🌞సూర్యరాశి: *సింహం* || 🌝చంద్రరాశి: *తుల*

🌄సూర్యోదయం: *5.49* || 🌅సూర్యాస్తమయం:   *6.09  ? *వినాయక చవితి*      వినాయక చవితి శుభాకాంక్షలు*

సర్వేజనా సుఖినో భవంతు - ఇరగవరపు రాధాకృష్ణ

Panchaag


 

జలము కనుగొనుట -

 నిర్జల ప్రదేశం నందు చెట్ల ద్వారా జలము కనుగొనుట - 


 * తాటి చెట్టుకి కాని టెంకాయ చెట్టుకి గాని పుట్ట ఆవరించి ఉండిన దానికి పశ్చిమమున 6 మూరల దూరమున నాలుగు మాటల లోతున దక్షిణమున నుంచి వచ్చెడి జలధార ఉండును. 

 

 * టెంకాయ చెట్టుకి దక్షిణమున పుట్ట ఉండిన దానికి ఏడు మూరల దూరమున 5 మట్టుల లోతున సంరుద్ధజాలం కలిగి ఉండును. ఒక నిలువు లోతున నానా వర్ణములు కలిగిన శల్యములు , నల్లని రంగు కలిగిన మ్రుత్తికయు , ఆయుధములతో చేధించ దగిన పాషాణం ( రాయి ) , తెల్లని మన్ను, దాని క్రింద పడమట నుంచి ప్రవహిన్చేడు జలధార యు ఉండును. మరియు పుట్టలు ఉండిన యెడల వాటి సమీపమున జలము ఉండును. 

  

 * మారేడు చెట్టు, కానుగ చెట్టు, జీడి చెట్టు, మద్ది చెట్టు, చిత్తముధపు చెట్టు, వీటి యందు యే చేట్టుకైనా పుట్ట చుట్టుకొని యుండిన దానికి ఉత్తరమున మూడు మూరల దూరము నందు నాలుగున్నర నిలువు లోతున సమృద్ధిగల జలం ఉండును. నీరు లేని నిర్జల ప్రదేశం నందు గంబీరమైన శబ్దం పుట్టిన యెడల అచ్చట 35 పురుష ప్రమాణమున ఉత్తరమునకు ప్రవహించే జలనాది ఉండును. 


  * పెద్ద మాను చెట్టు కొమ్మలు అన్ని సరీగా ఉండి వాటిలో ఒక కొమ్మ నేలకు వంగి గాని , తెలుపు వర్ణం కలిగి కాని యున్దినట్లితే అచ్చట మూడు మట్ల లోతున జలం ఉండును. 


  * యే వృక్షం అయినా వాటి వాటి స్వభావం మారి చిగుళ్ళు, పువ్వులు, కాయలు మొదలగు వాటి వరనములు బెధముగా ఉండిన యెడల దానికి తూర్పున మూడు మూరల దూరమున నాలుగు మట్టుల లోతున జలం ఉండును. దాని యందు తెల్లని మన్ను రాళ్ళు ఉండును. 

 

 * రెండు తలల ఖర్జూరం చెట్లు ఉండిన యెడల దానికి పడమర మూడు మూరల దూరం నందు మూడు మట్టుల లోతులో స్వచ్చ జలం ఉండును. 

 

 * తెల్ల మోదుగ చెట్టు ఉండిన దానికి దక్శినమున మూడు మూరల దూరము నందు మూడు మట్టుల లోతున జలము ఉండును. 

 

 * యే ప్రదేశమున వేడి పొగలు ఉండునో అచ్చట రెండు నిలువుల లోతు అదిక ప్రవాహము గల జలదార ఉండును.


 * యే ప్రదేశము నందు పైరులు నలుపక్కల కోమలముగా నుండి మద్య యందు మాడిపోయి ఉండిన , తెలుపు వర్ణం కలిగి యుండినను మికకిలి కొమలముగా నుండినను అచ్చట అదిక ప్రమాణం గల జలదార నిలువు లోతు ఉండును. 

 

 * మరుభూమి అనగా నిర్జలమైన కొండల యందు ఉండు అరణ్యభుమి ములు మొదుగ చెట్టు కు పడమర పుట్ట యుండిన దానికి దక్షిణమున మూడు మూరల దూరము నందు 12 నిలువుల లోతున పడమటి నుండి ప్రవహించే జలనాడి ఉండును. 


 * దురద గొండి చెట్టుకి ఉత్తరమున పుట్ట యుండిన దానికి మూడు మూరల దూరము నందు 10 మట్టుల లోతున దక్షిణమున నుండి ప్రవహించే జలనాడి ఉండును. మరియు నిలువు లోతున పచ్చని వర్ణం గల కప్ప ఉండును . 

 

 * మరియు మద్ది చెట్టుకి ఉత్తరమున పుట్ట యుండిన యెడల దానికి దక్షిణమున రెండు మూరల దూరమున 15 పురుషుల ప్రమాణమున దక్షిణము నుంచి ప్రవహించే ఉప్పు నీటి జలదార ఉండును. 

 

బావి తవ్వునప్పుడు రాళ్లు పడినప్పుడు వాటిని బెధించుటకు ఉపాయం - 

 

 

 * బావి తవ్వునప్పుడు శిలలు కనిపించినప్పుడు వానిని పగలగోట్టుటకు మోదుగు కట్టెలను , దూబర కట్టెలను కాల్చి ఆ బూడిదను సున్నపు నీళ్ళలో కలిపి రాతిని తడిపి పగలగొట్టిన రాయి పగులును.


  * పూర్వము చెప్పినట్టుగా మోదుగ , తుబుర కట్టెలను కాల్చిన బూడిదను , దర్భల బస్మము , మొక్కలపు చెట్టు చెక్కలను, కాల్చిన బూడిద నీళ్లలో కలిపి ఆ నీళ్లు చక్కగా కాచి కాల్చిన బండ మీద 7 పర్యాయములు పోసి తడపగా రాళ్లు పగులును. 

 

 * ఉత్తరేను, తిప్పతీగా, వేపచెక్క, ఆకు, తుభర కట్టెలు, నువవు కట్టెలు, వీని బూడిద ను ఆవు ముత్రములో కలిపి కాచి 6 దినములు రాళ్ళ మీద పోసి నానబెట్టిన యెడల శిలలు పగులును. 

 

 * అరటి పట్టలను కాల్చి ఆ బూడిదను మజ్జిగ యందు కలిపి చక్కగా కాచిన తరువాత అందులొ రాతిని పగలగొట్టడానికి ఉపయొగించే ఆయుధములు ఒక దినమంతయు అందులొ నానబెట్టి రాతిపై ప్రయోగించగా ఆ ఆయుధములు చెడకుండా ఉండును. అలాగే ఆ ఆయుధముల చేత రాళ్లు , ఇనుము మొదలగు వాటిని పగలగొట్టిన ఆ ఆయుధములు మెరుపు , పదును పోకుండా ఉండును. 


       మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

భాగవత పద్యరత్నములు*

 *శ్రీ పోతన భాగవత పద్యరత్నములు*

*నేమాని సూర్యనారాయణ*

*" చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ - 10 "*


*4 - 881 - వచనము:*

పురుషుడు స్త్రీల యిండ్లను ఆశ్రయించి క్షుద్రమై, కామ్యపరిపాకం నుండి పుట్టిన జిహ్వ, ఉపస్థ మొదలైన కామ జనిత సుఖలేశాన్ని అన్వేషిస్తాడు. స్త్రీయందే మనస్సు నిల్పి మనస్సును కొల్లగొట్టే స్త్రీల మాటలను వినగోరుతాడు. కళ్ళముందే తోడేళ్ళ గుంపులాగా ఆయుస్సును హరించే రాత్రింబవళ్ళను లెక్కచేయడు. వెనుకనుండి బోయవాని వంటి యముడు శరీరాన్ని చీల్చివేస్తుండగా జీవుడు విహరిస్తాడు. కాబట్టి నీవు ఈ జీవుని లేడివంటి చేష్టలు కలవానిగా భావించు. బాహ్యవ్యాపారాలైన శ్రౌతస్మార్తాది రూపకర్మలను హృదయంలో నిగ్రహించు. అతి కాముకుల గాథలతో కూడిన సంసారాన్ని విడిచిపెట్టి, సర్వజీవులకు దిక్కైన భగవంతుని సేవించు. సంపూర్ణ విరక్తిని పొందు” అని నారదుడు చెప్పగా ప్రాచీనబర్హి ఇలా అన్నాడు.


*4 - 882 - కందపద్యము:*

*"మునివర! భగవంతుండవు*

*ననుపమ విజ్ఞాననిధివి ననఁదగు నీ చే*

*తను వివరింపంగాఁ దగి*

*యెనసిన యీ యాత్మతత్త్వ మిటు నాచేతన్.*


*భావము:*

“మునీంద్రా! భగవంతుడవు, మేటి జ్ఞానివి అయిన నీవు చెప్పిన ఆత్మ తత్త్వాన్ని…


*4 - 883 - వచనము:*

విని బాగా ఆలోచించాను. నాకు కర్మను బోధించిన ఆచార్యులకు ఈ ఆత్మతత్త్వం తెలియదు. తెలిస్తే కర్మని ఉపదేశింపరు కదా! ఆ ఆచార్యుల ఉపదేశం చేత నాకు ఆత్మతత్త్వం విషయంలో కలిగిన మహాసంశయం నీ వల్ల పటాపంచలయింది” అని ఇంకా ఇలా అన్నాడు.


*4 - 884 - సీసపద్యము:*

*అనఘాత్మ! యేమిటి యందు నీ యింద్రియ-*

  *వృత్తులు దగఁ బ్రవర్తింపకుండు*

*టను జేసి ఋషు లైన ఘనముగ మోహింతు-*

  *రట్టి యర్థము నందు నాత్మ సంశ*

*యము గల్గుచున్నది; యది యెట్టి దనినను-*

  *బురుషుఁ డేయే దేహమునను జేసి*

*కర్మముల్ చేసి తత్కాయంబు నీ లోక-*

  *మందునే విడిచి తా నన్యదేహ*


*4 - 884.1 - తేటగీతి:*

*మర్థితో ఘటియించి లోకాంతరమును*

*బొంది తత్కర్మఫలమును బొందు ననుచుఁ*

*బ్రకటముగ వేదవేత్తలు పలుకుచుందు*

*రన్న నది యెట్లు విన నుపపన్న మగును?*


*భావము:*

పుణ్యాత్మా! ఇంద్రియ వృత్తులలో అప్రవృత్తులై ఋషులు మోహించే అర్థం గురించి నాకు సంశయం కలుగుతున్నది. పురుషుడు ఏ దేహం చేత కర్మలు చేస్తాడో ఆ దేహాన్ని ఈ లోకంలోనే విడిచిపెట్టి తాను మరొక దేహాన్ని ధరించి మరొక లోకాన్ని చేరి అక్కడ కర్మఫలాన్ని అనుభవిస్తాడని వేదవేత్తలు చెపుతారు. ఇది ఎలా పొసగుతుంది?


*4 - 885 - వచనము:*

అంతేకాదు. చేసిన వేదోక్తమైన కర్మ ఆ క్షణంలోనే నశిస్తుంది కదా! ఇంక జీవుడు మరొక దేహం పొంది లోకాంతరంలో ఎలా అనుభవించగలడు?” అని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు ప్రాచీనబర్హితో ఇలా అన్నాడు “రాజా! లింగశరీరాన్ని ఆశ్రయించి ఉండే జీవుడు కలలో జాగ్రద్దేహాభిమానాన్ని విడిచి, అటువంటిదో లేక అటువంటిది కానిదో అయిన మరొక శరీరం పొందుతాడు. మనస్సులో సంస్కార రూపంలో ఆ హితమైన కర్మని ఆచరిస్తాడు. అలాగే జీవుడు ఏ లింగ శరీరం చేత కర్మని చేస్తాడో ఆ లింగశరీరం చేతనే లోకాంతరంలో ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. భిన్న దేహాన్ని పొందడు. ఇవ్వటం, పుచ్చుకొనడం మొదలైన వానిలో స్థూల దేహానికి కర్తృత్వం ఉన్నదని భ్రమించకూడదు. జీవుడు అహంకారంతోను మమకారంతోను కూడినవాడు. ఆ జీవుడు మనస్సు చేత ఏ దేహాన్ని పొందుతాడో, ఆ దేహం చేతనే ప్రాప్తించిన కర్మని అనుభవిస్తాడు. అలా కాకుంటే కర్మ పునర్జన్మకు కారణం కావటం పొసగదు. కాబట్టి మనః ప్రధానమైన లింగశరీరానికే కర్తృత్వం పొసగుతుంది” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

అన్నదానము

 పద్యం:☝️

*అన్నదానము గొప్పదనవచ్చునే గాని*

*అన్నంబు జాములో నరిగి పోవు*        

*వస్త్రదానము గూడ భవ్యదానమె గాని*

*వస్త్రమేడాదిలో పాతదగును*

*గృహదానమొకటి యుత్కృష్ట దానమె గాని*

*కొంప కొన్నేండ్లలో కూలిపోవు*

*భూమిదానము మహా పుణ్యదానమె గాని*

*భూమి యన్యుల జేరి పోవవచ్చు*

*అరిగిపోక, ఇంచుకయేని చిరిగిపోక*

*కూలిపోవక యన్యుల పాలుగాక*

*నిత్యమయి, వినిర్మలమయి, నిశ్చలమయి*

*యొప్పుచుండు విద్యాదానమొకటి జగతి*

- చిలకమర్తి లక్ష్మీనరసింహం

రామో విరామో విరజో.

  👆 శ్లోకం 

రామో విరామో విరజో.                       

మార్గో నేయో నయోనయః||.                  

వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో                         

ధర్మో ధర్మవిదుత్తమః|.                       


ప్రతిపదార్థ:


రామ: - నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు.


విరామ: - సకలజీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.


విరత: - విషయ వాంఛలు లేనివాడు.


మార్గ: - మోక్షమునకు మార్గము తానైనవాడు.


నేయ: - ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు.


నయ: - జీవులను నడిపించి పరమపదస్థితికి గొనిపోవువాడు.


అనయ: - తనను నడుపువాడు మరొకడు లేనివాడు.


వీర: - పరాక్రమశాలియైనవాడు.


శక్తిమతాం శ్రేష్ఠ: - శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు.


ధర్మ: - ధర్మ స్వరూపుడు.


ధర్మ విదుత్తమ: - ధర్మము నెఱింగినవారిలో శ్రేష్ఠుడు

*శ్రీ కాళహస్తీశ్వర శతకము - 32*

 💎🌅  *_-|¦¦||¦¦|-_* 🌄🪔


  🙏  //*సుభాషితమ్*// 🙏


  *రోసీ రోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్‌*

  *బాసీపాయదు పుత్త్ర మిత్ర జన సంపద్భ్రాంతి వాంఛా లతల్‌*

  *కోసీకోయదు నామనం బకట! నీకుం బ్రీతిగా సత్క్రియల్‌*

  *చేసీ చేయదు దీని త్రుళ్ళణఁపవే శ్రీకాళహస్తీశ్వరా!!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 32*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! స్త్రీరతియందు, పుత్రమిత్రబాంధవులయందు నాకు తనివి తీరినట్టే ఉండి మరల మరల కలుగుచున్నది....ఇటువంటి మనస్సును నాకు ఎందుకు ప్రసాదించితివి....నీ సేవానుతినతి సపర్యలు చేసి కూడా వాటిమీద మనస్సు నిలువదే.... ఈ సంసార బంధాల తలను వేగముగా త్రెంపి నన్ను కాపాడు ప్రభో!*

           

✍️🌺🌷🌹🙏

⚜ *శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 431*


⚜ *కర్నాటక  : మందార్తి _ ఉడిపి* 


⚜ *శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం* 



💠 మందర్తి దుర్గా పరమేశ్వరి ఆలయం శక్తి ఆరాధనలో ముఖ్యమైన మరియు పవిత్రమైన ఆలయాలలో ఒకటి.  

మహిషాసురమర్ధిని మరియు చాముండేశ్వరి యొక్క రాతి చిహ్నాలతో పాటు, ఇది తొమ్మిది పాత ముసుగులను కలిగి ఉంది, ఇది దేవత యొక్క విభిన్న రూపాలను వర్ణిస్తుంది.  ఆలయంలో నాగతీర్థం అనే చెరువు కనిపిస్తుంది.


💠 ఈ అమ్మవారు సుదేవ మహర్షిని కాపాడడానికి అవతరించింది.

సుదేవ మహర్షి  హేమాద్రి మహారాజు  దేవవర్మకి  ఆయన భార్య  జలజాక్షికి

మహిషాసురుని అకృత్యాలనుండి కాపాడతానని శరణు ఇచ్చాడు.  


🔆 స్థలపురాణం 🔆


💠 నాగలోకాధిపతియైన శంఖచూడునికి ఐదుగురు కుమార్తెలు.

మందరతి , నాగరతి , దేవరతి , చారురతి , నీలారతి అని పేర్లతో పెంచాడు.

వారిని శివపుత్రుడు ,  షణ్ముఖుడైన కుమారస్వామికే యిచ్చి పెళ్లి చేయాలనే కోరికతో వుండేవాడు.


💠 ఆ 5 నాగపుత్రికలకు

యవ్వనం వచ్చాక తండ్రి కోరిక తీర్చేందుకు  కుమారస్వామిని పరిణయం చేసుకోవాలని కైలాసానికి వెళ్ళేరు.

కానీ , అక్కడ నందదీశ్వరుడు

వారిని ఆడ్డగించడంతో వాగ్వాదము పెరిగి  నందీశ్వరుడు వారిని భూలోకంలో నాగులై చరించమని శపించాడు.


💠 దేవ వర్మన్ అనే రాజు ఏదో ఒక దండనకు లోనై హిమాద్రి కొండలలోని అడవులలో సంచరిస్తూండగా అక్కడ అడవి కారుచిచ్చులో చిక్కుకున్న ఐదు నాగులను రక్షించి తన బట్టలో మూటకట్టుకున్నాడు. 

వాటిని  తనతో పాటు తీసుకుని వెళ్ళాడు.

అవి  సమయం చూసుకొని ఒక్కొక్క చోట ఒక్కొక్క పుట్టలో దూరి

పోయాయి.


💠 ఆ విధంగా  మందరతి అన్న

నాగిని  వెళ్ళిన ప్రదేశానికి 'మందార్తి ' అని పిలవబడింది.

ఇతర నాగకన్యలు వెలసిన స్ధలాలను  నాగర్తి,  అర్చనమహ, శూరడి, నీలావరా అని ప్రసిధ్ధిపొందాయి.

ఈ ఐదు స్ధలాలలో దుర్గా పరమేశ్వరీ

ఆలయాలు  నిర్మించబడ్డాయి.


💠 ఒకసారి ఈ నాగకన్యలు దేవవర్మ కలలో కనపడి హిమాద్రి రాజు యొక్క పుత్రిక జలజాక్షి ఆపదలో చిక్కుకున్నదని వెంటనే వెళ్ళి ఆమెను కాపాడమని చెప్పారు.

దేవవర్మ వెంటనే వెళ్ళి రాజకుమార్తెను కాపాడాడు. 

హిమాద్రి రాజు తన పుత్రికను రక్షించిన దేవవర్మకే ఇచ్చి వివాహం చేసి  తన  రాజ్యానికి రాజుని చేశాడు.


💠 వ్యాఘ్రపాద మహర్షికి కిరతా అనే స్త్రీ కి  పుట్టిన మహిషుడనే రాక్షసుడు జలజాక్షిని 

ఒకసారి చూశాడు.  

జలజాక్షి మీద వ్యామోహంతో ఆవిడని బాధలు పెడుతూ  వచ్చాడు. ఆ రాక్షసుని ముందు  దేవవర్మ శక్తి సామర్ధ్యాలు పనిచేయలేదు.

జలజాక్షి  , దేవవర్మ  యిద్దరూ సుదేవ ముని ఆశ్రమానికి వెళ్లి , శరణు కోరారు.


💠 గొప్ప అతీంద్రియ శక్తులు కలిగిన ముని దుర్గాపరమేశ్వరి అనుగ్రహంతో  మహిషుడు పంపి మహోదరుడనే  రాక్షసుడు ప్రయోగించిన ఆయుధాలని అన్నిటినీ మింగేశాడు.

కోపంతో మహిషుడే స్వయంగా యుధ్ధానికి దిగాడు. 


💠 మునికి అండగా దుర్గాదేవి తన భూతగణాలతో  దుర్గాదేవి, మహిషాసురుని ముందు చెదల పుట్టగా అవతరించినది. 

అనేక ఆయుధాలతో పుట్టను నేలమట్టం చేయాలని చూశాడు.


💠 ఆ భయంకర చెదల పుట్ట మహిషాసురుని ఆయుధాలనన్నిటిని మింగి వేసింది.  

ఆఖరికి, దుర్గాదేవి భైరవుని సహాయంతో మహిషాసురుని అణిచి తన కాలితో తొక్కిపట్టినది.

శక్తిహీనుడైపోయిన మహిషాసురుడు అమ్మవారి కాళ్ళు పట్టుకొని , " ఇంక నా దేహం నీ కాళ్ళక్రిందనే వుంటుంది. అనుగ్రహించమని" ప్రార్ధించాడు.


💠 మహర్షి ప్రార్ధనకి కరుణించి అవతరించనట్లే , తన ప్రార్ధనలు కూడా మన్నించి ఈ ప్రాంత భక్తులను కాపాడుతూ వారి కోరికలు నెరవేరుస్తూ అక్కడే కొలువై వుండమని వేడుకొన్నాడు.

మహిషుని  ఆఖరి కోరిక నెరవేర్చి లోక కళ్యాణం కోసం మందార్తిలో దుర్గాదేవి వెలసింది.


💠 పిదప హేమాద్రి మహారాజు దేవవర్మ స్వప్నంలో కనిపించి తను వున్న ప్రదేశాన్ని తెలిపి తనను తీసుకుని వచ్చి ప్రతిష్టించమని ఆదేశించింది.

మహారాజు దుర్గాదేవి తెలిపిన చోటున లభించిన విగ్రహా రూపాన్ని తీసుకువచ్చి

ప్రతిష్టించి ఆలయం నిర్మించాడు.

ఈనాటికి  శ్రీ దుర్గా పరమేశ్వరి

అనే పేరుతో మహిమాన్వితమైన అమ్మవారిగా భక్తులు ఆరాధిస్తున్నారు.


💠 కేరళ శైలిలో , 5 అంతస్తుల గోపురం కలిగిన ఆలయం యిది.

లోపలికి ప్రవేశించగానే ధ్వజస్ధంభాన్ని, బలిపీఠాన్ని చూస్తాము.


💠 గర్భగుడిలో  ఆశీనురాలైన దుర్గాదేవి వరద హస్తాలతో అభయమిస్తూ పుష్పాలంకారాకృతితో భక్తులకు దర్శనము అనుగ్రహిస్తున్నది .


💠 లోపలి ప్రాకారంలో వీరభద్రుడు, సుబ్రహ్మణ్యస్వామి తీర్ధం సమీపమున నాగదేవతల విగ్రహాలను దర్శిస్తాము


💠 ఈ ఆలయంలో యక్షగాన,కణ్డేసేవ, గణేశచతుర్ధి,షష్ఠి, నవరాత్రి, రంగ పూజలు, కుంకుమార్చనలు వంటి అనేక

ఉత్సవాలు వైభవోపేతంగా చేస్తారు.


💠 ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో  ఘనంగా జరిపే రధయాత్రోత్సవంలో లక్షలాది  భక్తులు

పాల్గొని దేవి అనుగ్రహానికి పాత్రులవుతారు.


💠 దుర్గా పరమేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు చండీహోమాలతో ఘనంగా జరుపుకుంటారు.  మందర్తి దుర్గా పరమేశ్వరి ఆలయంలో మకర మాసంలో ఐదు రోజుల మఠోత్సవాలు మరియు కుంభమాసంలో జాతర వార్షిక మరియు ముఖ్యమైన సంఘటనలు.


💠 మందర్తి ఉడిపికి ఉత్తరాన 30 కి.మీ దూరంలో ఉంది.  

బ్రహ్మ

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

   *"సర్వం ఖల్విదం బ్రహ్మ"*

        *అంటే ఏమిటి.।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*"సర్వం ఖల్విదం బ్రహ్మ" అనేది ఉపనిషత్తులుగా పిలువబడే వేద గ్రంథాల నుండి వచ్చిన సంస్కృత పదబంధం.*


*ఇది వైదిక ప్రజలకు తాత్విక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రకటన. పదబంధాన్ని ఈ క్రింది విధంగా విభజించవచ్చు:*


*1) సర్వం: దీని అర్థం "అన్ని" లేదా "ప్రతిదీ."*


*2) ఖలు: ఇది "నిజంగా" లేదా "నిజంగా" అని అర్థం వచ్చే ఒక ఉద్ఘాటన కణం.*


*3) ఇదం: దీని అర్థం "ఇది."*


*4) బ్రహ్మ: ఇది వేద తత్వశాస్త్రంలో అంతిమ వాస్తవికత లేదా అత్యున్నత విశ్వశక్తిని సూచిస్తుంది.*


*అన్నింటినీ కలిపితే, "సర్వం ఖల్విదం బ్రహ్మ"ని "ఇదంతా నిజానికి బ్రహ్మమే" లేదా "ఉన్నదంతా బ్రహ్మమే" అని అనువదించవచ్చు. వేద తత్వశాస్త్రంలో బ్రహ్మంగా తరచుగా సూచించబడే అంతిమ వాస్తవికత విశ్వంలోని ప్రతిదానికీ అంతర్లీనంగా ఉన్న సారాంశం అనే ఆలోచనను ఈ ప్రకటన వ్యక్తపరుస్తుంది. ప్రపంచం యొక్క వైవిధ్యం మరియు బహుళత్వం అనేది ఒక అంతిమ, మార్పులేని వాస్తవికత యొక్క వ్యక్తీకరణలు అనే భావనను ఇది తెలియజేస్తుంది. ఈ ఆలోచన అద్వైత వేదాంత యొక్క ద్వంద్వ రహిత తత్వశాస్త్రంలో ప్రధానమైనది.*


*ఓం నమః శివాయ॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

సర్వం ఖల్విదం బ్రహ్మ*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

     *సర్వం ఖల్విదం బ్రహ్మ*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఒకరోజు అతిథి ఒకరి ఇంటికి వస్తాడు. ఆ ఇంటి ఇల్లాలు ఎంతో రుచిగా జీడిపప్పు, పిస్తా వేసి పాయసం వండి పెడుతుంది. అతిథి అంత రుచికరమైన పాయసం తిని ఆనందంతో పాయస పాత్రలోని గరిటకు నమస్కారం చేస్తూ నువ్వు నాకు భగవంతుడివి ఇంత రుచికరమైన పాయసం విస్తరిలో వేసావు అంటాడు…*


*వెంటనే ఆ గరిట నన్ను పొగిడితే ఏమీ ఉపయోగం లేదు. వడ్డించిన చేతికి నమస్కరించు మరింత పాయసం దొరుకుతుంది అంటుంది.*


*ఇల్లాలు ఇది నా గొప్పతనం కాదు నా భర్త కష్టపడి సంపాదించి తెస్తే నేను వండిపెట్టాను ఆయనకు నమస్కరించమంటుంది.*


*యజమాని ఇందులో నా గొప్పతనమేమి లేదు భూదేవి మహిమ ఆమె వలన పండిన పంటతో నేను ఆతిథ్యం ఇచ్చాను అంటాడు.*


*భూదేవి నాకు జలం ఆధారం ఆయనకు నమస్కరించు అనగా.. జలం ఆగ్నికి, అగ్ని వాయువుకు, వాయువు ఆకాశానికి ఇలా చివరకు మా అందరికి ఆధారభూతమైన వాడు ఒక్కడే ఆయనే “పరమాత్మ” ఆయనకు నమస్కరించమని చెబుతారు.*


*మనం తినే పాయసానికి పరమాత్మకు సంబంధం ఇదే..*


*సృష్ఠిలో ప్రతిదానికి మూలం ఆ పరబ్రహ్మమే.. మన దగ్గర ఎంత ధనమున్నా, కీర్తి ప్రతిష్టలున్నా వాటన్నిటిని సృష్టించిన వాడు, వాటన్నిటికి అధిపతి ఆ పరమేశ్వరుడే..*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

అక్షింతలు

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*తల ఫై అక్షింతలు ఎందుకు వేస్తారు?*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసు కోనేపుడు పాదాల కెందుకు నమస్కరిస్తాం?*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*అక్షింతలు అంటే మన కందరికీ తెలుసు..*


*బియ్యం లో పసుపు కలిపి ఏ పండగ వచ్చినా, ఏ దైనా శుభకార్యాలు జరిగినా, దేవాలయాల లోను మన పెద్దలు మనల్ని అశీర్వదించడానికి  మనఫై అక్షింతలు వేస్తారు.*


*అయితే ఈ అక్షింతలు వెయ్యడం లోని పరమార్దం ఏమిటో  తెలుసు కుందాం..*


*అక్షింతలు అంటే  క్షతం కానివి.అని అర్ధం. అంటే రోకలి పోటుకు విరగనివి అని..  శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట. అలాంటి బియ్యాన్ని పసుపు మరియు  నెయ్యితో లేక, నూనె తొ కలిపి అక్షింతలు తయారు చేస్తారు.*


*నవ గ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని...దాన వస్తువుగా పేర్కొంటారు.ఆ రకంగా నవ గ్రహాలలో చంద్రుడికి ప్రీతి కరమైన దాన వస్తువు బియ్యం.  చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.*


*మనిషి మనసు, బుద్ధి, గుణము, వ్యసనము వీటన్నిటికి చంద్రుడే  కారణమని, మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా  ఉంటుంది. అని మన  పెద్దల నమ్మకం.*


*అందుకే  ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సు పై ప్రభావం చూపు తుందని, మనో ధర్మాన్ని నియంత్రిస్తాయి.అని గట్టిగా విశ్వసిస్తారు.. అందు కే అక్షింతలను తల ఫై వేసి ఆశీర్వదిస్తారు..*


*సైంటిఫిక్ గా చెప్పా లంటే బియ్యానికి విద్యుత్ శక్తిని గ్రహించే  తత్వం ఉంది.  దేహం ఓ విద్యుత్‌ కేంద్రం.విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి.*


*పెద్దలు మన ఫై అక్షింతలు వేసి ఆశీర్వదించే సమయంలో, వారి దేహం లోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షంతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. అంతే కాదండీ!*


*మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో ప్రధాన మైనది. శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు,  విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా...*


*తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటి లోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది. శిరస్సు. ఈ కారణం గా అక్షింతల ద్వారా  పెద్దలలో ఉండే సాత్విక గుణం పిల్లలకు లభిస్తుంది.*


*ఇక పసుపు క్రిమి సంహారకం, ఆశీస్సులు ఇచ్చే వారికీ ఎటువంటి చర్మ వ్యాదులు లాంటివి. ఉన్నా అవి ఆశీస్సులు పుచ్చు కొనే వారికి రా కుండా ఉంటాయి.*


*పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు  మనకు అక్షింతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే!*


*ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్య మేనట...*


    *‘అన్నాద్భవన్తి భూతాని’*


*అని భగవద్గీత లో మూడవ అధ్యాయం లో చెప్ప బడింది.*  


*జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం...భగవంతునిపై అక్షింతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు...ఈ అన్నంలో పుట్టీ, తిరిగి ఈ జీవుడిని భగవంతుడి లోకి చేర్చడమే...*


*పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకొనేటప్పుడు పాదాల  కెందుకు నమస్కరిస్తాం?*


*పెద్దల దగ్గర మన ఆశీర్వాదం తీసు కొనేటపుడు వారి పాదాలకు నమస్కరించడం మన సంప్రదాయం. 

అయితే అలా... చెయ్యడం లోని అర్ధం ఏమిటో తెలుసు కుందాం..*


*మన  శరీరం లో...తల ఉత్తర దృవంఅయితే... పాదాలు దక్షిణ దృవం.. వ్యతిరేక దృవాలేఆకర్షించుకుంటాయి.. అప్పుడే గా శక్తి విడుదల అవుతుంది.*


*అలానే మనం పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసు కొనే టపుడు మన తలను వారి పాదాలకు తాకించి ఆశీర్వాదం తీసు కుంటాం. అప్పుడు వారి పాదాల లోని దక్షిణ దృవం మన తలలో గల ఉత్తర దృవం తో ఆకర్షితమై శక్తిని వెలువరిస్తుంది... అందుకే మన హిందూ  సాంప్ర దాయం లో పెద్దల కాళ్ళకు నమస్కరిస్తాం.*


*మన సంప్రదాయం లో  ప్రతీ దానికి ఏదొక పర మార్దం దాగి ఉంటుంది.*


*మన సంప్ర దాయాలను అర్దం లేని వని కొట్టి పారేయ కుండా వాటిలోని పరమార్దం తెలుసు కొని  ఆచరిద్దాం...*


*సర్వేజనా స్సుఖినో భవంతు*


*లోకాస్సమస్తా స్సుఖినో భవంతు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

మృణ్మయ గణపతే

 *మృణ్మయ గణపతే సర్వదా పూజ్యనీయం..*

భాద్రపద శుక్ల చతుర్థీ అంటే... వినాయకచవితి. ఈ గణపతి పూజా నియమాల గురించి ముద్గల పురాణంలో చెప్పబడింది. అందులో కణ్వమహర్షి భరతునికి గణపతి తత్వాన్ని, భాద్రశుక్ల చవితి వ్రత మహిమను చెప్పారు. అందులో భాగంగా ప్రధానమైన నియమం గణపతి యొక్క మూర్తిని మట్టితో మాత్రమే చేసి పూజించడం.  మిగతా పదార్ధాలతో చేసిన విగ్రహాల గురించి  అందులో ప్రస్తావన లేదు. గణపతిని మట్టితో పూజించడం వెనుక పంచీకరణం అనే ఒక తత్వం ఉంది. అసలేంటీ ఈ పంచీకరణం అంటే?

ఆకాశం నుండి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు,నీటి నుంచి భూమి ఉద్భవించాయి. ఇవి పంచభూతతత్వం.    జడపదార్ధమైన భూమి చైతన్యం కలిగిన నీళ్ళతో చేరినప్పుడు ప్రాణశక్తి కలిగి - ఆహారపదార్ధాలనూ, ఓషధులని మనకు అందిస్తుంది. నీరు ప్రాణాధారశక్తి. జడశక్తులు కలయికతో ఈ సృష్టి ఏర్పడిందనడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారుచేస్తాం. అప్పుడది పూజార్హం అవుతుంది. మన శరీరంలో ఆరు చక్రాలు ఉన్నాయి అంటుంది యోగశాస్త్రం. ఆరు చక్రాల్లో మొదటిది మూలాధారచక్రం, వెన్నుపూస చివరిభాగాన ఉంటుంది. నాలుగు రేకులు పద్మంవలే, ఎరుపు రంగు కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మూలాధారచక్రానికి గణపతి అధిష్ఠానదేవత. మూలాధారం - పృధ్వీ తత్వం, అంటే భూమికి సంకేతం. కనుక వినాయకున్ని మట్టితోనే చేయాలి.

పంచభూతాల్లో, ప్రతి భూతంలోనూ, దాని తత్వం 1/2 వంతు, తక్కిన 4 భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే భూమి- అందులో 1/2 భూతత్వం అయితే, 1/8 జలం, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం ఉంటాయి.  దీన్నే 'పంచీకరణం' అంటారు. ఒక్కో తత్వానికి ఒక్కో అధిష్ఠానదేవత ఉంటారు. భూతత్వానికి అధిష్ఠానదేవత గణపతి, ఆకాశతత్వానికి ఈశ్వరుడు (శివుడు), జలతత్వానికి నారాయణుడు, అగ్నితత్వానికి అంబిక, వాయుతత్వానికి ప్రజాపతి (బ్రహ్మ). మనం పూజించే విగ్రహంలో గణపతి తత్వం 1/2 భాగం ఉండగా, మిగిలిన ఈ అన్ని దేవతల తత్వం 1/8 భాగంగా ఉంటుంది. పరమాత్ముడు ఒక్కడే, ఎన్నో విధాల కనిపించినా, అన్నీ ఒక్కరూపమే.  మృణ్మయ వినాయక విగ్రహంలో 1/2 భూతత్వం, తక్కినవి 1/8 ప్రకారం ఉంటాయి. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మృణ్మయ ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠానదేవతలను పూజిస్తున్నాం అన్నట్లే . ఇది ఇతర పదార్ధాల చేత చేయబడిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలుగదు. పంచభూతాలతో ఆధునిక మానవుడు సంబంధం తెంచుకున్న కారణం చేతనే అనేక సమస్యలకు, ఒత్తిళ్ళకు, రోగాలకు బాధితుడవుతున్నాడు.

ఏ తత్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, చివరికది ఆ తత్వాలలోనే లయం అవుతుంది. అదే సృష్టి ధర్మం. కనుక మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటివాటి తత్వాల్లో  లీనమవుతాయి. ఇదే పంచభూతాత్వాక శక్తి. అంటే ఇక్కడ అర్ధం ఏమిటంటే....చివరికి ఏదైనా పృథ్వి లో మిళితం కావాలిసిందే అన్నమాట. ఓషధిగుణాలు కల్గిన 21 రకాల పూజపత్రాలులతో పూజించడంలో ఉన్న పరమర్థమూ అదే.

కనుక వినాయకుడిని మట్టితో చేసి పూజించడమే సర్వులకు శుభప్రదం, మంగళప్రదం.

ఓం గం గణపతయే నమః

*-శృంగేరీ జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థమహాస్వామివారు.*

7. " మహా దర్శనము

 7. " మహా దర్శనము " ---ఏడవ భాగము -- -సుఖ ప్రసవము


 ఏడవ భాగము -- సుఖ ప్రసవము 


          మరు దినము ఆలంబిని తల్లితో కర్మ విచారము ప్రస్తావించి , భర్త తనకు చెప్పినదంతా చెప్పినది . తల్లికి ఆశ్చర్యము కాలేదు . " నువ్వు మంచి పనే చేసినావు , దేహమే నేను అనుకొనువారి మాట వేరు . దేహము నేను కాదు ; నేననేది వేరే ఇంకొకటుంది అని నమ్మువారు ఇటులనే చేయవలెను . నిజమే . ఆడది జన్మ ఎత్తినపుడే సిగ్గుపొరలను కప్పుకొనే పుడుతుంది . అలాగని మెట్టినింటికి ద్రోహము అగునట్లు చేయవచ్చునా ? అట్లు చేసిన , పుట్టింటికి కూడా ద్రోహము అయినట్లే . కాబట్టి నువ్వు చేసినది సరియైనదే . కానుపు గది ఎక్కడ అని అనుకున్నారు ? అది ముందు చెప్పు . " 


" నడిమింట్లోనే ఒక మూలలో తెరలు కట్టి చేయవలెను . " 


        " సరే , అక్కడే చేయండి , దానికి రెండు వైపుల నుండీ దారి ఉండనీ . బిడ్డ పుట్టగానే నేను మంత్రసానిని ఒక దారినుండీ బయటికి పిలుచుకొని వస్తాను . ఇంకొక దారి నుండీ నీ భర్త వచ్చి కర్మను ముగించుకొని వెళ్ళనీ . వారు వెళ్ళిపోగానే నువ్వు నన్ను పిలువు . నేను మంత్రసానితో పాటు వచ్చి తరువాతి కార్యము చేసెదను . " 


         ఆ దినము పంచమి , కర్మకు కావలసిన తేనె , నెయ్యి , బంగారము సిద్ధమయినాయి . ఆడవారు కర్మకు ఒప్పుకున్నందు వలన కర్మకు ఇక ఉన్న అడ్డు తీరిందని దేవరాతుడు బహుళ తృప్తుడైనాడు . 


         ఆలంబినికి ఆయాసము ఎక్కువగుతూ వచ్చినది . కూర్చుంటే లేచుట , లేస్తే కూర్చొనుట కష్టమగుతున్నది . దేవరాతుడు అది చూచి అగ్ని పరిచర్యను తానే వహించి చేస్తున్నాడు . 


         ఆలంబిని తల్లి జాయంతి కూతురికి వేడినీళ్ళు ఇస్తూ , ’ గర్భము జారినది , ఇక రెండో మూడో దినములు , అంతే . " అన్నది . కూతురు , " వారి మాట ప్రకారమైతే రేపే జననము కావలెను " అన్నది . తల్లి , " అయినా కావచ్చును , అయితే , బిడ్డ మాత్రము , ...ఆలంబీ , ఏమీ అనుకోవద్దు , మాంచి భూతపు బిడ్డ అవుతుంది " అంది . ఇద్దరూ నవ్వినారు . 


         గురువారము తెల్లవారింది . నడిమింట్లోనే ఒక మూలలో ప్రసూతి గృహము సిద్ధమయినది . తల్లి , బాలింత పడక మొదలైనవన్నీ సిద్ధము చేసి ఉంచినది . అందరూ త్వరితముగానే భోజనములు కానిచ్చినారు . గర్భిణి కూడా భోజన శాస్త్రము అయిందనిపించినది . మధ్యాహ్నపు సూర్యుడు నెత్తిపై నుండి పశ్చిమమునకు దిగు సమయమునకు , పొద్దుటి నుండీ అప్పుడప్పుడు వస్తున్న నొప్పి తీవ్రమైనది . వెంటనే , మజ్జిగన్నము తింటున్న తల్లి భోజనము వదలి చేతులు కడుక్కొని పరుగెత్తి వచ్చినది . 


         ఆలంబిని ఎక్కువ సేపు నొప్పులు తినలేదు . తల్లిని ఆనుకొని ఒరిగి కూర్చునియుండగనే మరియొక నొప్పి వచ్చినది . దానితో పాటే , జలోదయ , శిరోదయములు రెండూ ఏకకాలములోనే అయినవి . ఇంకొక ఘడియ లోపలే శిశువు లోకానికి వచ్చినది . తాను వచ్చినట్టు ప్రకటించుటకా అన్నట్టు ఏడ్చింది . 


         తల్లి జాయంతి , కూతురికి చెప్పినట్లే మంత్ర సానిని పిలుచుకొని బయటికి వెళ్ళినది . వేరే వాకిలి నుండీ దేవరాతుడు లోపలికి వచ్చినాడు . ఆచార్యుడు కొడుకు కుడి భుజమును ముట్టుకొని , " సరస్వతీ దేవి నీకు మేధను ఇవ్వనీ , ఇంద్రుడు నీకు మేధను ఇవ్వనీ " అను అర్థము వచ్చు మంత్రమును ఉచ్చరించినాడు . బిడ్డతల్లిని ఉద్దేశించి , " అరుంధతీ సమానురాలా, నువ్వు స్తోత్రములు చేయుటకు పాత్రురాలవు . వీర పుత్రుని పొందిన ఓ వీరమాతా , నీకు మంగళమగు గాక " అని అభినందించినాడు . 


         అక్కడనుండి వెళుతూ ,’ నేనిక స్నానము చేస్తాను . కొడుకు పుట్టగానే నిలుచున్నవాడు నిలుచున్నట్టే నీటిలో దుముకి స్నానము చేయవలెనంట . ఆ నీరు ఎంతగా పైకి ఎగసిపడితే అంత అక్షయమైన లోకములు పితృ దేవతలకు దొరికి మా పితృ ఋణము తీరునంట. నువ్వు ఇప్పుడు బిడ్డకు స్తన్యము నిచ్చునపుడు మరచిపోకుండా సరస్వతిని ధ్యానించు , " హే సరస్వతీ దేవీ , సర్వ ప్రాణులకూ అన్న ప్రదాతయైనది నీ స్తనము . రత్నములనూ , ధనమునూ అధికముగా ఇచ్చునది నీ స్తనము . దేవతలందరికీ రక్షణనిచ్చునది నీ స్తనము . దానిని ఈ బిడ్డకు కూడా ఇవ్వు" అని ఆమెను ధ్యానించి , బిడ్డకు స్తన్యమునివ్వు ’ అని నిర్దేశించి బయటికి వచ్చినాడు . 


         అతడు ఇవతలికి వచ్చిన తరువాత జాయంతీ , మంత్రసానులు మరలా వచ్చి బిడ్డకు వెచ్చటి నీరు ఇచ్చి , నాళమును కత్తరించి , చేయవలసినదంతా చేసి , బిడ్డకు స్తన్యపానము చేయించి తల్లీ బిడ్డలను నిద్రపుచ్చారు . 


         ఇక్కడ ఆచార్యుడు స్నానము చేసి లోపలికి వచ్చు వేళకు రాజ భవనము నుండీ రాజ పురోహితుడు , రాజ పురుషునితో పాటూ వచ్చినాడు . రాజ పురోహితుడు లోపలికి వస్తూనే ఆచార్యుడు ఎదురేగి " రండి రండి , రాజ పురోహితులు దయ చేయవలెను " అని స్వాగతము చెప్పినాడు . భార్గవుడు , ’ రథములో రాజపురుషుడు వచ్చినాడు . అతడిని రమ్మనండి ’ అన్నాడు . ఆచార్యుడు నీరుకారుతున్న శిరోజములను పిండుకుంటూ , " నాకోసము ఆపని మీరు చెయ్యండి , నేను మడి బట్ట కట్టుకొని వస్తాను ’ అని లోపలికి వెళ్ళినాడు . 


         అతడు బయటికి వచ్చువేళకు రాజ పురుషుడూ , పురోహితుడూ ఒక గదిలో కూర్చొనియున్నారు . ఇద్దరూ ఆచార్యునికి వందనము చేసి రాజాజ్ఞను తెలిపినారు : ’ శిశు జననమైన తర్వాత చేయవలసిన కర్మల నన్నిటినీ ఏ శంకా లేకుండా వైభవముగా జరిపించి రాజాశీర్వాదము చేయవలెనని మీకు చెప్పి రమ్మని మహారాజు మా ఇద్దరినీ పంపించినాడు " 


         ఆచార్యుడు , " ఇంట సుఖప్రసవమై పుత్ర జననమయినది . రాజాజ్ఞ ప్రకారము ఏ లోపమూ లేకుండా సర్వమునూ క్రమముగా జరిపించెదము . మేము చేయు ప్రతియొక్క కర్మ వలననూ మహారాజులకు నిస్సందేహముగా శ్రేయస్సు కలుగును అని వారికి తెలపండి . నేను సకాలములో వచ్చి దర్శనము చేసుకొనెదను " అన్నాడు .

సత్సంగం

 🔔 *సత్సంగం* 🔔


🙏🪷మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.


🙏🪷దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి…


*🙏శ్లో:"అనాయాసేన మరణం*

*వినా దైన్యేన జీవనం*

*దేహాంతే తవ సాన్నిధ్యం*

*దేహిమే పరమేశ్వరం."*


*🙏"అనాయాసేన మరణం"🙏*


🙏🪷నాకు నొప్పి లేక బాధ  లేని

మరణాన్ని ప్రసాదించు.


*🙏"వినా ధైన్యేన జీవనం"🙏*


🙏🪷నేను ఎవరి మీదా ఆధారపడకుండా,నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.


*🙏"దేహాంతే తవ సాన్నిధ్యం"🙏*


🙏🪷మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేనునిన్ను దర్శించుకునే విధంగా దీవించు. 


*🙏"దేహిమే పరమేశ్వరం"🙏*


🙏🪷ఓ భగవంతుడా నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.


🙏🪷1. అనుక్షణం నీ ప్రార్ధనలోనే గడిపే విధముగా అనుగ్రహించు. నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.


🙏🪷2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ .... నా బిడ్డలకు కానీ ...సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను, కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.


🙏🪷3. నాకు ఎప్పుడూ కూడా నీవు    సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.


🙏🪷ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడని మరువకండి.


🙏🪷దీనినే ‘ *దర్పణ దర్శనం’* అంటారు, మనస్సనే దర్పణంలో  దర్శించి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశాన ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ.

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

మనందరికీ తెలిసిన పేర్లే

 సంస్కృత పేర్లు కాబట్టి ఇవి ఏవిటో అనుకుంటున్నాం కానీ, 

వీటి పేర్లు మన వాడుక భాషలో మనందరికీ తెలిసిన పేర్లే అండి 👍


మాచీ పత్రం అంటే చేమంతి ఆకులు,

దూర్వా పత్రం అంటే గరిక,

అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకులు,

దత్తూరపత్రం అంటే ఉమ్మెత్త ఆకులు,

బిల్వ పత్రం అంటే మారేడు దళాలు,

బదరీ పత్రం అంటే రేగు చెట్టు ఆకులు,

చూత పత్రం అంటే మామిడి చెట్టు ఆకులు,

కరవీరపత్రం అంటే గన్నేరు ఆకులు,

మరువక పత్రం అంటే మనం పూలకుండీల్లో పెంచుకునే మరువం & ధవనం, 

శమీ పత్రం అంటే జమ్మి చెట్టు ఆకులు,

సింధువార పత్రం అంటే వావిలి ఆకులు, నీళ్లలో మరిగించి ఆ నీళ్ళతో స్నానం చేస్తే body pains తగ్గుతాయి అని విన్నాం కదా అవేనండి వావిలి ఆకులు, 

అశ్వత్ధ పత్రం అంటే రావిచెట్టు ఆకులు,

దాడిమీ పత్రం అంటే దానిమ్మపళ్ళ చెట్టు ఆకులు, 

జాజి పత్రం అంటే సన్నజాజి, మల్లి, మొదలైన ఆకులు, 

అర్జున పత్రం అంటే మద్ధిచెట్టు ఆకులు, 

అర్క పత్రం అంటే జిల్లేడు ఆకులు 

ఇలా ఇవన్నీ మనకు తెలిసిన పేర్లే అండి,

చాలా వరకూ ఈ పత్రులు దొరుకుతాయి అండి 👍

వినాయక చవితి ముందురోజున 

కూరగాయల మార్కెట్ లో 

ప్రత్యేకించి ఈ పత్రులు  అమ్ముతారు అండి 👍


హరహరమహదేవ 🙏🙏