23, ఏప్రిల్ 2021, శుక్రవారం

శ్రీరమణీయం* *-(149)*_

 _*శ్రీరమణీయం* *-(149)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"మనసును నిశ్చలంగా ఎవరు ఉంచుకోగలుగుతారు ?"*_


_*అద్దంలో మంట కనిపించినా అది అద్దానికి గాని దాన్ని చూసే వారికిగానీ ఏ హాని చేయదు. జ్ఞానుల మనసు అలాగే ఉంటుంది. పరిపూర్ణ శాంతిని, భగవంతుని సాన్నిధ్యాన్ని , ఆత్మానుభవాన్ని పొందిన సద్గురువులు, యోగులు, జ్ఞానులు మనసును నిశ్చలంగా ఉంచుకుంటారు. కప్ప సహజంగానే తన నాలుకను పైకి మడిచి 'ఖేచరీ విద్య'తో ఆకలిదప్పులులేని స్థితిలో ఉంటుంది. యోగి కూడా ఈ లోకంలో అలా జీవిస్తాడు. అలాగే శ్రీరమణభగవాన్ వంటి జ్ఞానులు ఈ ప్రపంచంలో మనతోపాటు జీవిస్తున్నా ఏ విషయాలు వారి మనసును చలింపజేయలేవు. మనకి వారికి తేడా అంతా విషయాన్ని స్వీకరించే తీరులోనే ఉంటుంది. వాస్తవానికి ప్రాపంచిక విషయాలేవి మన మనసుకు కూడా అంటేవి కావు. కానీ మనకి ఆ విషయంలో అనుభవం లేదు. ఆ వివేకం కలిగిన రోజు మనం కూడా సాక్షిత్యంతో సాధనలో ముందుకు సాగుతాం !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'మనస్సు స్వస్వరూపమే దైవం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

కరోనాకు

 ప్రపంచాన్ని వణికిస్తున్న  కరోడా కరోనాకు షాక్ 

     Rs.50,000/-రివార్డ్                      

      ----------------

👉 ఒక్క రూపాయితో కరోనాకు మందు కనుగొన్న లయన్ రంగా వెంకటేశ్వరరావు "అల్లాఉద్దీన్ అద్భుత దీపం "చిట్కా 

--------------------------

నాసికా రంధ్రాల్లో (ముక్కులో )ఒకచుక్క నిమ్మరసం వేసుకొంటే ముక్కులో, గొంతులో,శ్వాస కోశాల్లో దాగి ఉన్న కరోనా వైరస్ అంతా శ్లేష్మ రూపంలో నోటిలోనికి వచ్చేస్తుంది .దాన్ని కాండ్రించి ఉమ్మివేయాలి. తదుపరి గోరువెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి పుక్కిలించి ఉమ్మాలి. వెంటనే మనకు రిలీఫ్ గా ఉంటుంది. తర్వాత శుభ్రమైన కొబ్బరి నూనె లో వేలు ముంచి నాసికా రంధ్రాల్లో రాయాలి.


 ఈ విధంగా చేసిన తర్వాత మాకు రిలీఫ్ రాలేదని ఎవరైనా రుజువు చెసినచో వారికి రంగా వెంకటేశ్వరరావు గారిచే రూ. 50,000/-బహుమానం ఇవ్వబడుతుంది. అని ఛాలంజ్ చెయ్యడం జరిగింది.


👉 కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న విలన్ ఐతే,తేలికగా  నివారణ మందు కనుగొన్న ప్రపంచ హీరో మన సోదరుడు"రంగా వెంకటేశ్వరరావు  "నిమ్మరసం శానిటైజర్ కన్నా గొప్పగా పనిచేస్తుంది. నిమ్మరసం చేతులకు, శరీరానికి, తలకు,  గదుల్లోను,  వస్త్రములపై  ఉపయోగిస్తే కరోనా మన దరి చేరదని అమ్మ లాంటి నిమ్మ వల్ల అనేక లాభాలున్నాయని  చెబుతున్నారు మన రంగా వేంకటేశ్వరరావు గారు. భయం తో వణికిపోతున్న ప్రపంచ ప్రజలకు ఈ గొప్ప ఉపాయం కనుగొన్న వ్యక్తి నిడదవోలు పట్టణ" రంగా "వారి ముద్దుబిడ్డ శ్రీ రంగా సుబ్బారావు సత్యవతి పుణ్య దంపతుల కుమారుడు MJF Ln. రంగావెంకటేశ్వరరావు గారు పచ్ఛిమ గోదావరి జిల్లా, నిడదవోలు లయన్స్ క్లబ్ అధ్య్యక్షులుగా, జిల్లాసేవా కో-ఆర్డినేటర్ గా పనిజేసి, తను అధ్యక్షుడుగా ఉన్న  క్లబ్ నకే కాకుండా ఇతర క్లబ్ లకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి  జిల్లాలోనే ఉత్తమ అధ్యక్షులుగా ప్రధమ బహుమతి పొంది, ప్రస్తుతం కూడా జిల్లా సేవా కోఆర్డినేటర్ గా ఉండిరి. పైన చెప్పిన విధంగా వెంకటేశ్వరరావు గారు స్వయంగా ప్రయోగం చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత,  పలువురు కరోనా బాధితులైన రాజకీయ నాయకులకు, ఇతరులకు  సూచించి వారు కూడా  ఫలితం పొందిన తర్వాత వారినుండి  అభినందనలు పొందడం కూడాజరిగిందని మీకు తెలియజేయుచున్నాము. 

   ఒక సైనికులు సైనైడ్ చుక్క ప్రాణం తీస్తుంది.

 అమ్మ లాంటి ఒక నిమ్మరసం చుక్క ప్రాణాన్ని కాపాడుతుంది. సర్వేజనా సుఖినో భవంతు. 😷🙏😱

నోటంట మాట రాలేదు ....

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

*నాకు నచ్చిన శివరాం మోహన్ గారి మరో కథనం.*

              🌷🌷🌷

ప్రక్కన కూర్చున్నాయన్ని చూసి పలకరింపుగా నవ్వాను .... ఆయన కూడ ముందు కొంచెం ఆశ్చర్యపోయినా మొహమాటంగా నవ్వారు .... కాకినాడేనా సార్ ... అన్నాను మాట కలుపుతూ... నాన్ స్టాప్ దొరకలేదు ... ఈ వెధవ ఎర్ర బస్సు దొరికింది .... ఎప్పటికి తీసుకెళ్తాడో ఏంటో ... ఆయన విసుగ్గా అంటుంటే ... నేను నవ్వుతూ.... ఏదైనా అర్జన్టు పనుందా సార్ కాకినాడలో ... అన్నాను... అదేం లేదండి ....పాసింజర్ బస్సు అన్ని స్టాపుల్లో ఆగి వెళ్తుంటే చిరాకు ...అంటుంటే ...  ఎంత సార్ .... యానాం దాటితే తాళ్లరేవు తర్వాత రెండు దెబ్బల్లో జగన్నాధపురం ... ఇంక కాకినాడ ఊళ్ళో కెళ్లిన తర్వాత ఎర్రబస్ అయినా ఎక్సప్రెస్ అయినా ఒక్కటే... రాత్రయ్యేకొద్దీ బస్టాండ్ లో ఒంటరిగా కూర్చొని ఎక్సప్రెస్ గురించి ఎదురు చూట్టం కన్నా దొరికిన ఎర్ర బస్సు ఎక్కేస్తే .... జనాలు ఉంటారు ..జర్నీ తెమిలిపోద్ది .అన్నాను.. 

          ఆ పెద్దాయన ఈ సారి నా వంక తేరిపార చూశారు ... ఏం చేస్తుంటారు మీరు .... అన్నారు... కొంచెం ఆసక్తిగా .... నేను చెప్పాను .... అదేంటండి... మీకు వెహికల్ ఇస్తారేమో .. అన్నారు... అది ఇక్కడ ఉండిపోద్దండి... నన్ను కాకినాడ బస్సు ఎక్కించి... అన్నాను నవ్వుతూ ... ఆయన కూడా నవ్వుతూ మీరు భలే మాటాడుతున్నారే అంటుంటే .... 

                చెప్పానా ... అప్పుడే యానాం బ్రిడ్జి వచ్చేసింది చూశారా ....వృద్ధ గౌతమికి ఆఖరి మజిలీ ఇదే... సముద్రుడు ఎదురొచ్చి మరీ తీసుకుపోతాడు గోదారమ్మని ..... తాపం తట్టుకోలేక .... అంటుంటే...ఆ పెద్దాయన నవ్వుతూ .... నా భుజంమీద చరిచాడు...పావుగంట లోనే ఆయనకు చనువు పెరిగిందని నవ్వుకుంటూ .. ... ఈ బ్రిడ్జి కట్టాక సుఖంగా ఉంది గానీ ... రేవులు దాటి కాకినాడ వెళ్లాలంటే తల ప్రాణం తోకకు వచ్చేది ... రాత్రి పూటయితే ఇంక చెప్పక్కర్లేదు .. 

                     .అన్నంపల్లి దాకా బస్సు ....అక్కడ గోదారి పాయ దాటి మురమళ్ళ .... అక్కడ్నుంచి అద్దె సైకిల్ తీసుకుని ఎదుర్లంక రేవుకొచ్చి .... అద్దె సైకిల్ అక్కడ అప్పజెప్పేసి .... నావెక్కి యానాం చేరుకొని అక్కడ్నుంచి వీరభద్ర ట్రావెల్సోడి  కిక్కిరిసిపోయిన బస్సెక్కి పడతా లేస్తా కాకినాడ చేరేసరికి భోజనం టైం కూడా మించిపోయేది ... మనల్ని చూసి .... అదేంరా బాబు ఉత్తరం ముక్కయినా రాసావుకాదు ... అని ముక్కు చీదుకుంటూ పొయ్యేలిగించేవాళ్ళు అక్కలో మేనత్తలొ .... 

                 మనకు తెలీకుండానే చాపకింద నీరులా అభివృద్ధి కూడా జరిగింది ఈ అరవై డెబ్బై ఏళ్లలో .... దీనికి మన వయసు వాళ్లే ప్రత్యక్ష సాక్షులు ... ప్రతి దానికి బ్రిటీషోళ్ళని మెచ్చుకుంటారు మనోళ్లు కొందరు మన ప్రభుత్వాన్ని ఈసడిస్తూ ...అంకినకాడికి దోచుకుని పీల్చి పిప్పి జేసి అప్పగించి వెళ్లారని ఇంకా బతికున్న అప్పటి వాళ్ళని అడిగితే చెబుతారు...   . అభివృద్ధి చెందిన యూరప్ అమెరికాలతో పోల్చి ఎద్దేవా చేస్తుంటారు నవతరం .... ఆ దేశాలకు స్వతంత్రం వచ్చి వందల ఏళ్ళు గడిచాయని మాత్రం మర్చిపోతారు ....వాళ్ళు ఇతర దేశాల్ని దోపిడీ చేసి పెంచుకున్న సంగతి కూడా మర్చిపోయారు ... 1947 లో మన జనాభా 39 కోట్లు ... మరిప్పుడు 130 కోట్లు ...ఇది అతి పెద్ద ప్రజా స్వామ్య దేశం .... మన పల్లెటూర్లలో ఇప్పటికి కనిపించే ఉమ్మడి కుటుంభాల్లాంటిది ... ఎవర్నీ నొప్పించకుండా చక్కపెడుతూ వెళ్ళాలి ..... నియంతృత్వ దేశాల్లో ప్రజల భావోద్వేగాలను పట్టించుకోరు కాబట్టి అభివృద్ధి పెరుగుదల స్పీడ్ గా  ఉంటుంది .... మానవ సంబంధాలు మాత్రం మరోలా ఉంటాయి ... మనం అమెరికానో బ్రిటనో మన పిల్లల దగ్గరకెళ్ళి ఒక్క రెండు నెలలు ఉంటే .. కొత్తలో భలేగా ఉంది అనిపిస్తాది ....వారం రోజులకే  మాట్లాడేవాడు కనిపించక మన దేశమ్మీద బెంగొస్తాది ... అభివృద్ధి మెల్లగా జరిగినా పర్లేదు ... అభిమానాలు తగ్గకుండా ఉంటె అదే పదివేలు .... అనిపిస్తది .....

                       మాటల్లో పడి కాకినాడ కల్పనా సెంటర్ ఒచ్చేసింది ..... అదేంటి సార్ మీరెక్కడ దిగాలి .... అంటుంటే.... నేను జిల్లా పరిషద్ దగ్గిరే దిగాలి ... కానీ దిగబుద్ధి కాలేదు ... మీతో మాట్లాడుతుంటే ... మీరెక్కడ ... కాంప్లెక్స్ లో దిగాలా ... నేనూ అక్కడే దిగుతాను .... అక్కడ్నుంచి ఆటో ఎదో పట్టుకుని వెనక్కు వెళ్తాను ... ఆయన మనస్ఫూర్తిగా అలా అంటుంటే నాకు నోటంట మాట రాలేదు ....

                                                                                                                                                               *"సం"మోహనం*

వెలుగు వైపుగా

 

      *వెలుగు వైపుగా* 

                🌷🌷

నేను నా తల్లితండ్రులకు ఒక్కడే‌ కొడుకుని…. నాకు పన్నెండేళ్లు వయసులో, మా అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతే, మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకోకుండా, చాలా కష్టపడి నన్ను పెంచాడు. మిగిలిన రైతులు పొలంలో వరి, జొన్న, మొక్కజొన్న లాంటి ఆహారధాన్యాలు పండిస్తే, మా నాన్న కూరగాయలు పండించేవాడు. ధాన్యం పండించటం కన్నా కూరగాయల పంటకు‌‌ ఎక్కువ శ్రమించవలసి ఉంటుంది కానీ వాటి మీద‌ ఆదాయం వెంట వెంటనే లభిస్తుంది, కనుక కూరగాయలే నయమనుకునేవాడు. ఇవే కాక మా పొలంలో కొన్ని కరివేపాకు, నిమ్మ వంటి ఆదాయాన్నిచ్చే‌ చెట్లు కూడా ఉండేవి. 


అలా పండించిన కూరలను నెత్తి మీద ‌బుట్ట పెట్టుకుని వారాంతపు సంతలలో తనే స్వయంగా అమ్మేవాడు. అవికాక వంటపనీ, మిగిలిన పనులూ కూడా ఆయనే చేసేవాడు. అంత కష్టపడి నా స్కూల్ ఫీజులకీ, యూనిఫార్మ్ లకూ, పుస్తకాలకూ‌ డబ్బులు ఖర్చుపెడుతుంటే, నేను బాధతో ఏడ్చేవాడిని. "చదువు వద్దూ, ఏం వద్దూ… నన్నూ నీతో పొలానికి తీసుకుపొమ్మని" గొడవ చేసేవాడిని.


ఆయన నా మాటలు పట్టించుకునేవాడు కాదు, పైగా "నువ్వు చదువుకోకపోతే ఇప్పుడు నేను పడే కష్టం అంతా వృధా అవుతుంది నాయనా! ఒక తరం బాగుపడాలంటే, ఒక తరం కొన్ని త్యాగాలు చేయక తప్పదయ్యా!" అనేవాడు. నాకు నాన్న మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా, ఆయన కోరిక మేరకు ‌చదువు కొనసాగించాను.


ఎస్ ఎస్ సి అయిన తరువాత ఇంటర్లో చేరాను. చాలామంది పాలిటెక్నిక్ డిప్లొమా చేయించమని మా నాన్నకు సలహా ఇచ్చారు, కానీ ఆయన వినలేదు. నేను ఇంటర్లో బయాలజీ తీసుకున్నాను. ఇక ఆ రెండేళ్లు స్నేహితులూ, సరదాలంటూ సమయం వృధా చేయకుండా, బాగా కష్టపడి మెడిసిన్ లో సీటు సంపాదించాను. సీటైతే వచ్చింది కానీ, మా కులానికి స్కాలర్షిప్ వచ్చే అవకాశం లేదు. సామాజిక అసమానతల పట్ల అవగాహన ఉన్నవాడిని కనుక నేను ప్రభుత్వ విధానాలని ఎన్నడూ తప్పు పట్టలేదు. మొత్తానికి మెడిసిన్ లో చేరాను కానీ డబ్బుకు ఇబ్బంది ఉండేది… అప్పట్లో మెడికల్ కాలేజ్ కి, అతి సామాన్యమైన బాటా చెప్పులతో వెళ్లింది బహుశా నేనొక్కడినే. నాకు అదేమీ అవమానంగా అనిపించేది కూడా‌ కాదు, ఎందుకంటే మా నాన్న అసలు చెప్పులే లేకుండా‌ తిరిగేవాడు, ఒకవేళ ఎప్పుడైనా వేసుకున్నా ఊర్లో చెప్పులు కుట్టే అతని దగ్గర కుట్టించిన గట్టి తోలుచెప్పులే.


నా మెడిసిన్ పూర్తి కావచ్చింది… హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడు, ఒక‌ ఫ్రొఫెసర్ కి నా కష్టపడే తత్వం, చదువు పట్ల ఉన్న శ్రద్ధ నచ్చాయి, ఆయనదీ, మాదీ ఒకే కులం. ఒకరోజు ఆయన వాళ్ల ఇంటికి ఆహ్వానించాడు. ఆ పిలవటం వెనకాల, వాళ్ళ కుటుంబ సభ్యులకు నన్ను పరిచయం చేయాలనే ఉద్దేశ్యం ఉందని నాకు తెలియదు. అతని భార్యకూ, కూతురికీ నన్ను పరిచయం చేసాడు. వారిని చూస్తే ఎంతో ఆధునికంగా, మాకన్నా ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని తెలుస్తోంది… జీవితం అంటే, విలువైన వస్తువులూ, నగలూ, సౌకర్యాలూ అమర్చుకోవటం, తరచూ రెస్టారెంట్లకూ, వెకేషన్స్ కోసం మంచి ప్రదేశాలకు వెళ్లడం, వెరసి విలాసవంతమైన జీవితం అనుభవించటంలోనే సంతోషం ఉంటుందనుకునే మనస్తత్వం వారిది. ఆ తరువాత కొన్నాళ్లకి ఆయన, మా ఊరికి వెళ్లి నాన్నను కలిసి, నాకు తన కూతురినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానని, ఆ పెళ్లి వలన నాకు మంచి జీవితం లభిస్తుందని చెప్పాడు… నాన్నకూ, మా పొరుగువారికీ‌ కూడా ఆ మాట నిజమనిపించింది, నా అదృష్టానికి మురిసిపోయారు.

మా నాన్న నన్ను ఇంటికి రమ్మని కబురు చేసాడు. అక్కడికి వెళ్లాక, మా బంధువులూ, పొరుగిళ్ల వాళ్లూ, "నేను మా ప్రొఫెసర్ గారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని" చెప్పారు. మా నాన్న మాత్రం కాసేపు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు… చివరికి "మా అబ్బాయికి ఏది సరైనదో అదే చేయవచ్చు, నేను చెప్పేదేమీ లేదు" అన్నాడు. నేను 'నిజంగా ఆమెను పెళ్లి చేసుకుంటే నాకు మంచి జరుగుతుందా? అసలు నేను ఆమెకు నచ్చిన జీవితం ఇవ్వగలనా?' అనే సందిగ్ధంలో ఉండిపోయాను. 


నా డాక్టర్ డిగ్రీ చూసి చాలామంది గొప్పగా అనుకుంటున్నారు కానీ నా బతుకేమిటో నాకు తెలుసు. నాకొచ్చే స్టైఫండ్ నా కనీస అవసరాలకు మాత్రమే సరిపోతుంది, అలాంటప్పుడు పెళ్లి చేసుకుని భార్యను పోషించాలంటే, అదీ ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని పోషించటం నాకు సాధ్యమేనా? మావాళ్లందరి మాటల్లో "ఒక అమ్మాయి తన భాగ్యాన్ని తనే వెంటపెట్టుకుని వస్తుంది… జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లుగా ఉండవు, కొన్ని కొన్ని విధి నిర్ణయాన్ననుసరించి జరుగుతాయి, అంతే" అన్నారు.


మొత్తానికి నా చేత "సరే" అనిపించారు. నా నిశ్చితార్థానికి మా నాన్న ఒక ముతక ధోవతి, తెల్ల‌చొక్కా, పై తుండు వేసుకుని వచ్చాడు.. అవే తోలు చెప్పులు. నా కాబోయే మామగారి స్నేహితులంతా డాక్టర్లు, పెద్ద ఉద్యోగస్తులు, వారందరినీ‌ చూసాక నాన్నకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది… చిరునవ్వు మినహా మాటలే లేవు. ఫంక్షన్ పూర్తవగానే నాన్న నన్ను ఆశీర్వదించి ఊరికి వెళ్ళిపోయాడు.


నిశ్చితార్థమయితే జరిగింది కానీ రేపు పెళ్లయ్యాక, నా భార్యను ఎక్కడికి తీసుకువెళ్లాలనే ప్రశ్న నా మనసులో తలెత్తింది.. నాకు ఉద్యోగం దొరికిన తరువాత,  అక్కడ ఇల్లు తీసుకొని ఉండచ్చు, కానీ అప్పటివరకూ ఎలా? ఊర్లో ఉన్న మా స్వంత ఇల్లు చాలావరకూ పాడయిపోయింది. అసలా ఇల్లెంతని? ఒక చిన్న హాలు, వంటగది, మరో రెండు గదులూ… వాటిలో ఒక గది నిండా వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగుమందులూ, విత్తనాల వంటివి ఉంటాయి. మరొక గదిలో రెండు కాటన్ పరుపులూ, కొంత వంటింటి సామాను ఉంటాయి. బాత్రూమ్ ఉంది కానీ పేరుకే, దానిలో పట్నాల్లో ఉండే సౌకర్యాలేవీ ఉండవు. నాన్న కాలకృత్యాల కోసం ఉదయాన్నే దూరంగా పొలాల్లోకి వెళ్లిపోతాడు, వస్తూ వస్తూ పంట బోర్ల దగ్గరే స్నానం చేసి వస్తాడు. మా ఇద్దరికీ అన్నం, ఏదో ఒక పప్పు చేసేవాడు… తాజా కూరగాయలు కనుక‌ మామూలుగా వండినా, చాలా  రుచిగా అనిపించేవి. ఇంట్లో ఒక గేదె ఉంది... పాలు, పెరుగూ, నెయ్యి మా అవసరాలకు సరిపడా వచ్చేవి. అవే‌ కాక‌ కోళ్లు కూడా ఉండేవి, ఎప్పుడైనా‌ చికెన్, గుడ్లు వండుకునే వాళ్లం… కానీ అవి ఏవి పడితే అవి తింటాయని గమనించిన నాన్నకు, చికెన్ తినడం నచ్చేది కాదు. ఎప్పుడైనా మటన్ మాత్రం తినేవాడు. అది  ఇంట్లో వండాలంటే పనీ, ఖర్చూ కూడా ఎక్కువే కనుక ఎప్పుడైనా పార్టీల్లోనే తినేవాళ్లం.


ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నాతో, ఒక పట్నంలో పెరిగిన అమ్మాయి, కనీసం డైనింగ్ టేబుల్ కూడా లేని ఇంట్లో ఎలా సర్దుకోగలదు అని నా భయం. 


పెళ్లి మరో రెండువారాలుందనగా, మా కాబోయే అత్తగారు ఫోన్ చేసి "బాబూ! మా అమ్మాయి పూజ పెరిగిన జీవన విధానం వేరు, మీ ఇంట్లో తను సర్దుకోలేదేమో అనిపిస్తోంది. ఎటూ మీరు ఏదైనా ఉద్యోగంలో చేరాలంటే ఇక్కడే సిటీలో ఉండాలి కదా! పూజ చిన్నప్పుడు తన పేరు మీద ఒక ఫ్లాట్ కొన్నాం, అదిప్పుడు ఖాళీ అయింది.. ఇప్పుడు ఆ ఇల్లు బాగు చేయించి, కలర్స్ వేయించి, కొత్త ఫర్నిచర్ అమర్చి మీకు ఇవ్వాలనుకుంటున్నాం" అని చెప్పేసరికి నాకూ అదే మంచిదనిపించింది.


ఊరికి వెళ్లినప్పుడు ఈ సంగతి మా నాన్నతో చెప్తే ఆయన ఎప్పట్లానే "నీకు మంచిగనిపిస్తే చాలు" అన్నాడు.


ఆ రోజు రాత్రి ఎందుకో? అమ్మను‌ తలుచుకుని బాగా ఏడ్చాను. నాన్న నన్ను కాలేజికి పంపించకుండా ఉంటే బాగుండేదనిపించింది. ఆయనలాగా నేనూ వ్యవసాయం చేసుకుంటే, నా భార్య‌ కూడా మాతోపాటు ఇక్కడ ఉండి, మాకు వండిపెడుతూ, నాన్నను ఈ వయసులో జాగ్రత్తగా‌ చూసుకునేదేమో! ఇప్పుడు నాన్న ఆరోగ్యం బాలేదు, ఎప్పుడైనా తన గురించి శ్రద్ధ తీసుకుంటేగా? ఒక కంటి సమస్యకు కాని, ఫిజీషియన్ కానీ, సుగర్ కి కానీ ఏ డాక్టర్నీ కలవలేదు. తన విషయాలన్నీ కర్మ కొదిలేసి, నన్ను మాత్రం డాక్టర్ని చేసాడు. నేను ఆయన కోసం కొడుకుగా ఏం చేస్తున్నాను? 'భౌతికమైన వస్తువులూ, సుఖాలే జీవితమా? అసలు నా చదువే ఓ కొలిక్కి రాలేదు. ఈ రోజుల్లో ఉట్టి ఎమ్ బి బి ఎస్ సరిపోదు, రేపు నా భార్య, మామగారు నన్ను ఎవరికైనా పరిచయం చేయాలన్నా‌ చాలా చిన్నతనంగా భావిస్తారు. సమాజంలో సరైన గౌరవమూ, మంచి ప్రాక్టీస్ కావాలంటే నేను ఎమ్ డీ లేదా ఎమ్ ఎస్ చేయాలి. మా మామగారి సహకారం లేనిదే నేను ఇవేవీ సాధించలేను. 


నా ఆప్తమిత్రుడొకడు ఇంటర్, బిఏ అతి మామూలుగా చదివి పాసయి, తరువాత‌ ఎడ్వొకేట్ అయ్యాడు. ఇప్పుడు ఊళ్లోనే తల్లితండ్రులతో కలిసి ఉంటూ, తాలూకా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న  కోర్టుకు వెళ్లి వస్తూ ఉంటాడు. పొలాలు కూడా చూసుకోగలుగుతున్నాడు. మరొక స్నేహితుడు కూడా, స్కూల్ అసిస్టెంట్ గా చేస్తూ, తల్లితండ్రులతో కలిసి హాయిగా ఊళ్లోనే ఉంటున్నాడు. వాళ్ల జీవన విధానాన్ని కానీ, తల్లితండ్రులను కానీ వదులుకునే అవసరం లేకుండా, సంతోషంగా ఉంటున్నారు… మరి నేనేంటి, ఎమ్ బి బి ఎస్ లాంటి గొప్ప చదువు చదివీ, ఇంత బాధ పడుతున్నాను?


నా ప్రశ్నలకు జవాబులు దొరికేవరకూ కాలమాగదు కదా! అనుకున్న సమయానికి నా పెళ్లి పూజాతో జరిగిపోయింది… మా మామగారు వాళ్లు ఇచ్చిన ఫ్లాట్ లో ఉంటూ, వాళ్ల సపోర్ట్ తో నా చదువు కొనసాగించాను.

మా నాన్న ఊళ్లోనే ఉన్నాడు. నా పెళ్లయిన తరువాత మరీ ఒంటరి వాడయిపోయాడు. ఒకసారి నేనొక్కడినే ఆయన్ను చూడటానికి వెళ్లినప్పుడు నా దగ్గరకు రమ్మని అడిగాను… రెండు మోకాలి చిప్పలూ అరిగిపోయాయి, కర్ర సహాయంతో నడుస్తున్నాడు..షుగర్, బీపీ కూడా బాగా పెరిగాయి. వైద్యం చేయిస్తాను నాతో రమ్మని పిలిస్తే, ఆయన ఒప్పుకోలేదు. చేసేది లేక మందులు కొనిచ్చి, "ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొమ్మని‌‌ చెప్తే" ఎప్పట్లాగే ఓ నవ్వు నవ్వాడంతే. డబ్బులు తీసి ఇవ్వబోతే, వద్దన్నాడు. పొలానికి వెళ్లటం మానేసి ఒక చెట్టు కింద, కూరగాయలు పెట్టుకుని అమ్ముతున్నాడు… ఇతర కూరగాయల వ్యాపారస్తులు కూడా వాళ్ల కూరగాయలు నాన్ననే అమ్మి పెట్టమనేవారు. సాయంకాలం వచ్చి ఎవరి వాటా డబ్బులు వారు తీసుకునే వారు. నాన్నకూ తిండికీ, బట్టకూ లోటు లేకుండా జరిగిపోతోంది కనుక సంతోషంగానే ఉన్నాడు. ఆయనకొచ్చే వృద్ధాప్య పింఛన్ తో అవసరమైన సరుకులూ, వంట గాస్ లాంటి అవసరాలు తీరుతున్నాయి.


నా మనసులో మాత్రం మా నాన్నను దగ్గరుండి చూసుకోలేక పోతున్నాననే బాధ తొలిచేస్తోంది. తన జీవితం అంతా నాకోసమే కష్టపడ్డాడు, ఎన్నో సుఖాలు వదులుకున్నాడు… ఇప్పటికీ, ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లో, తన వంట తనే చేసుకోవలసి వస్తోంది. నేనూ, నా భార్యా ఆయన కోసం ఏమీ చేయలేకపోతున్నాం. నా భార్యకైతే అసలా ఊరూ, మా ఇల్లూ ఏవీ నచ్చవు. నేను మాత్రం ఆయన్నలా వదిలేయలేకపోతున్నాను.


క్రిందటి రోజు సాయంత్రం, నాన్నకు బాగాలేదని కబురు తెలిసి మా ఊరికి వెళ్లాను. రాత్రికి మా పొరుగింటి వాళ్లు అన్నమూ, కూరలూ తెచ్చి ఇచ్చారు. నాన్న మొహంలో నేను వచ్చానన్న సంతోషం కనపడింది. ఇద్దరమూ కలిసి భోజనం చేసాము. కొంతసేపటి తరువాత నా ఎడ్వొకేట్ మిత్రుడు వచ్చి, "మేజిస్ట్రేట్ అయ్యానని" శుభవార్త చెప్పాడు. చాలా సంతోషం వేసింది. ఊరివారందరూ కూడా అతడిని గౌరవంగా చూస్తున్నారు.. అతని తల్లితండ్రులు కొడుకు ఎదుగుదల చూసి  గర్వపడుతున్నారు. వాడు ఒకప్పుడు చదువు మీద‌ శ్రద్ధ లేకుండా ఆకతాయిగా తిరిగేవాడు, ఎలానో ఎల్ ఎల్ బీ పూర్తి చేసాడు… ఇప్పుడు మేజిస్ట్రేట్ అయినా, రేప్పొద్దున్న సెషన్స్ కోర్టుకీ, ఆ పైన హైకోర్టుకీ, చివరికి సుప్రీంకోర్టు జడ్డ్ కావాలన్నా అతని ఎల్ ఎల్ బీ అర్హత సరిపోతుంది. కానీ ఎమ్ బి బి ఎస్ అలా కాదు… నేను ఈ ఊరిలో చిన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నడపాలన్నా, ఏదో ఒక స్పెషలైజేషన్ ఉండాలి... అంతేకాదు ఎన్నో వస్తువులు సమకూర్చుకోవాలి. ఈ విద్యా విధానంలోనే ఏదో తేడా ఉంది. ఒక ఎమ్ బి బి ఎస్ డాక్టర్ పూర్తి స్థాయి సర్జరీలు చేసే వీలు లేనప్పుడు,  ఆ కోర్సులో ముందస్తుగా సర్జరీలు ఎందుకు నేర్పుతారు? రేపు నేను స్వంత ప్రాక్టీస్ పెట్టాలంటే, సిటీల్లో ఉండే పెద్ద ఆస్పత్రుల మీద ఆధారపడి, వాళ్ల కింద కమీషన్ ఏజంట్ లా పనిచేయాలి. నాకు చాలా దుఃఖంగా అనిపించింది. రాత్రి నాన్న పక్కన పడుకున్నప్పుడు, నాకు పన్నెండేళ్ల వయసులో, నాన్నను హత్తుకుని పడుకున్నట్లుగా అనిపించింది. నాన్న ఏడుస్తున్నాడని తెలుస్తోంది. ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నాను, నాన్నతోనే ఇక్కడే, ఉండిపోవాలని… బహుశా నేను పేరాసెటమాల్, యాంటిబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేసుకుంటూ, సాధారణ డాక్టర్ గా ఉండిపోతాను, అయినా పరవాలేదు... మేము కలిసి ఉన్నప్పుడు కూడా నా భార్య‌ సంతోషంగా ఏమీ లేదు… ఆమె దృష్టిలో నేను ఒక పల్లెటూరి బైతుని, నాగరికత, ఆధునికత తెలియని వాడిని.


ఇక ఈ మానసిక‌ సంఘర్షణ నుంచీ బయట పడటానికి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నా భార్యతో విడిపోయి ఈ పల్లెలోనే ఉండిపోతాను 'కలిసొచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్నాను' అనుకున్నా సరే. 

ఈ భౌతిక సుఖాలు శాశ్వతమని భావించి ఉంటే సిద్ధార్థుడు ఏనాటికీ బుద్ధుడిగా మారేవాడే కాదు. నా కనుల ముందు నిజమైన వెలుగు ఇప్పుడు కనిపిస్తోంది.


🌷🌷🌷🌷🌷🌷🌷


ఆంగ్ల రచన by Sri Prabhakar Dhoopati

FICTION

12 April 2021


స్వేచ్ఛానువాదం: రత్నశ్రీ వఠెం

శ్రీనాథుడు

 ‘కవి సార్వభౌముడు’ గా ప్రసిద్ధి గాంచిన శ్రీనాథుడు తన కాలం నాటి సాహిత్య ప్రపంచానికి హిమాలయ పర్వత సదృశమైన సారస్వత మూర్తి. దేశదేశాలు తిరిగి, అనేక ఆస్థానాలలో సత్కారాలు పొందినవాడు. 


విజయ నగరంలో విద్యాస్పర్థలో గౌడ డిండిమ భట్టును ఓడించి, అతని కంచు ఢక్కను పగుల గొట్టించాడు. అక్కడే, ప్రౌఢ దేవ రాయల ఆస్థానంలో రాజు చేత కనకాభిషేకం చేయించుకున్న వాడు. కొండవీటి రెడ్డిరాజుల రాజ్యంలో విద్యాధికారి పదవిని నిర్వహించాడు. అవచి తిప్పయ, మామిడి సింగయ మంత్రి లాంటి సమకాలీన రాజకీయ వేత్తలతో భుజం భుజం కలిపి తిరిగాడు. 


హర విలాసము, కాశీ ఖండము, భీమేశ్వర పురాణము, శివరాత్రి మహాత్మ్యము, మరుత్తరాట్చరిత్ర లాంటి కావ్యాలు వెలయించాడు. శ్రీహర్షుని సంస్కృత నైషధాన్ని ‘శృంగార నైషధం’ గా మహా ప్రౌఢంగా ఆంధ్రీకరించాడు. జానపదుల వీరగాధ అయిన పల్నాటి వీర చరిత్రను ద్విపదలో అందంగా సంతరించాడు.


ఎంతో వైభవంగా బ్రతికిన శ్రీనాథుడి చివరి దినాలు మాత్రం చాలా బాధాకరంగా గడిచాయి. సానుభూతి లేని పాలకుల చేతుల్లో బాధలు పడ్డాడు. సొంత వ్యవసాయం లో పక్షుల వల్లా, వరదల వల్లా పంటలు పాడై పోయాయి. పన్నులు కట్టలేక శిక్షలు అనుభవించాడు. చివరికి ఆ దిగులుతోనే మరణించాడు. అయినా, ఆ మహాకవి ఆత్మ విశ్వాసం చూడండి. చనిపొయే టప్పుడు ‘దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ అరుగుచున్నాడు శ్రీనాథు డమర పురికి’ అంటూ స్వర్గారోహణం గావించాడు.


ఆయన కాలంలోనే ఏమి, ఈనాటికి కూడా శ్రీనాథుడు ఒక మేరు శిఖరమే!

22, ఏప్రిల్ 2021, గురువారం

టీ

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

టీ

“ఏమన్నా తాగుదామా” అడిగా మా ఆవిడని, ఇద్దరిలో ఎవరికి తాగాలనిపించినా ఇలా అడగటం పరిపాటి.

“సరే టీ కలపండి” టాబ్ లోంచి మొహం తియ్యకుండానే అంది మా ఆవిడ. 

యుద్ధానికి బయలుదేరిన ఉత్తర కుమారుడిలా, అర్జనుడు లేకుండానే వంటింట్లోకి బయలుదేరా. అయ్యా టీ పెట్టటానికి ఇంత బిల్డప్పా అంటే, మరి పెళ్ళానికి నచ్చేలా పెట్టడం అంటే మాటలు కాదు.

నెమ్మదిగా పాల పాకెట్ ని కట్ చేసి, జాగ్రత్తగా గిన్నెలో పోశా. ఏంటో, ఎంత జాగ్రత్తగా పోసినా సగం పాలు వొలికి పోతాయి ఎప్పుడూ అంతే. గబగబా దొరికిన నాప్కిన్ తో అంతా శుభ్రం చేసి, మల్లీశ్వరి సినిమా లో కుండీ గుద్దెసి, శుభ్రం చేసిన తరువాత బ్రహ్మానందం లా విజయగర్వం తో ఒక నవ్వు నవ్వు కున్నా.

మా ఆవిడ సోఫా లోంచి, “మీకు పాకెట్ లోంచి పాలు తియ్యడం రాదు, జాగ్రత్త!! గిన్నెలో పాకెట్ పెట్టి కట్ చేసుకోండీ, లేకపోతే నేను రానా”  

“అక్కర్లే, జాగ్రత్తగానే తీశా” పూర్తి నమ్మకమైన గొంతు తో చెప్పా. ఏమి విచిత్రమో, అంత నమ్మకం గా చెబితే మా ఆవిడకి అనుమానం వచ్చేస్తుంది.

“ సరే వలికినా మీరు తుడవకండి నేను చూసుకుంటా” మా ఆవిడ నాకు తెలుసులే అన్నట్టు గా.

“టీ పొడి ఎక్కడుంది”

“పోపుల డబ్బా పక్కన”

టీ డబ్బా వెతికి ,టి పొడి తీసే లోపు వెధవ పాలకి ఖంగారు వచ్చేసింది, స్టోవ్ అంతా పొంగి పోయాయి.

మళ్ళి మన నాప్కిన్ తో మరోసారి పొంగిన పాలు, స్టోవ్, శుభ్రం చేసి; పాలలో టీ పొడి, పంచదార వేసి, ఈసారి స్టౌ సిమ్ లో పెట్టి జాగ్రత్తగా చూస్తూ కూర్చున్నా.  

“స్టోర్ రూమ్ లో మామిడి కాయ ఒకటి తీసి కొయ్యండి. ముక్కలు సరిగ్గా తరగండి అందంగా. లేక పోతే నాకు ఇవ్వండి నేను తరుగుతా.” అంది మా ఆవిడ పైకి మెట్లేక్కుతూ.

వెళ్ళి మామిడికాయ లు ఒక రెండు తీసి, శుభ్రం గా కడిగి, సన్నగా అందం గా ముక్కలు చేసి, ఉప్పు కారం సన్నగా చల్లి రెండు ప్లేట్లలో సద్ది ఒకటి మా ఆవిడ కిచ్చా.

“టీ ఏది” అడిగింది మా ఆవిడ,

“తెస్స్తున్నా” అని జాగ్రత్త గా మేనేజ్ చేసి, మార్చి పోయిన టీ చూడటానికి వంటింట్లోకి పరిగెత్తా.

ఇంకేముంది ముచ్చటగా మూడోసారి పొంగి మిగిలిన టీ నాకేసి చూస్తోంది గిన్నె లోంచి.

రెండు చిన్న కప్పులలో ఎలాగో అలా వడపోసి, సద్ది ముందు మా ఆవిడ చేతికి టీ అందించా.

“చాలా బావుంది టీ!!, కొద్దిగానే కలిపారే “ చిరాగ్గా అంది మా శ్రీమతి క్వాంటీటీ సరిపోక.

నెమ్మదిగా నసిగా, “పాలు వలికాయి” అని.

“అనుకున్నాను, ఇందాకటి నుండి పాల వాసన తెగ వచ్చేస్తుంటే, టీ కూడా వలికిందా, సరే వచ్చి కూర్చోండి, అయినా నాది బుద్ది తక్కువ మిమ్మల్ని కలపమనడం” అంటూ వంటింట్లో కి పరిగెట్టింది అర్జనుడిలాగా .  

ఎలా అయినా టీ కాయడం వేళాకోళం కాదండీ బాబు. గొప్ప ఆర్టు.!!! అందరికీ రాదు.


సేకరణ:- పుసులూరి రమేష్.

మనోధైర్యం*

 *మనోధైర్యం*


దాదాపు పాతిక సంవత్సరాల క్రితం ఒక కుటుంబం, జీవనోపాధి కోసం అమెరికా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళింది. వారికి ఒక అందమైన కొడుకున్నాడు. యుక్తవయసులో అతడు ఎంతో ఆకర్షణీయంగా వుండేవాడు. సర్కస్ లో ట్రెపీజ్ ఆర్టిస్టుగా చేరాలని అతని అభిలాష. ఎంత ఎత్తు మీద నుంచి అయినా అవలీలగా దూకేవాడు.


ఒకరోజు, ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో అయిదుగురు దొంగలు అతడిపై కత్తులతో దాడి చేసారు. అయితే, అందరిలా అతడు భయపడి పర్సు ఇచ్చెయ్యలేదు. ఎదుర్కొన్నాడు. ఆ ఫలితంగా వారు అయిదుగురూ అతడిని నిర్దాక్షిణ్యంగా చావబాదారు. అరగంట తరువాత అక్కడ గస్తీ తిరిగే పోలీసులు, రోడ్డుమీద రక్తపుమడుగులో పడివున్న అతడిని చూసి, శవమనుకుని, మార్చురీకి తీసుకెళ్ళారు. అక్కడి డాక్టర్లు కొసప్రాణం వుందని నిర్ధారించారు. కొత్తగా చేరిన నర్సు అతడి ఆకృతి చూసి స్పృహ తప్పిపడిపోయింది.

అతడి మొహం స్థానంలో రక్తపు ముద్ద వుంది. ముక్కు వేలాడుతూంది. ఒక కనుగుడ్డు, సాకెట్ లోంచి బయటకొచ్చి నిర్జీవమైపోయింది. పుర్రె రెండు చోట్ల బ్రద్దలై వుంది. శరీరంపై పదహారు ఫ్రాక్చర్లున్నాయి. దవడ పక్కకి తిరిగిపోయింది. మొత్తం పళ్ళన్నీ ఊడిపోయాయి. అతడు మనిషి అవటానికి ఏడాది పట్టింది. అయితే, అతడికి ముక్కులేదు. ఒక కన్నులేదు. పళ్ళు లేవు. ఒకప్పటి అందమైన కుర్రవాడు, కేవలం "కదిలే మాంసపు ముద్ద"లా మిగిలాడు. అందరూ అతడివైపు కనీసం చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. చూడగానే ఒళ్ళు గగుర్పొడిచేటంత భయంకరమైన ఆకృతి. ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. చివరకు, ఏ కంపెనీలో అందమైన ట్రెపీజ్ ఆర్టిస్టుగా చేద్దామనుకున్నాడో, ఆ కంపెనీలో సర్కస్ ఫీట్లు చెయ్యాల్సి వచ్చింది. సర్కస్ లో ప్రేక్షకులకి అతడిని *A MAN WITH NO FACE* గా అనౌన్స్ చేసేవారు.


అసలెవరూ అతడిని అక్కడ ఒక మనిషిగా గుర్తించేవారు కాదు. సరి అయిన తిండి లేదు. తిండివున్నా, తినటానికి పళ్ళు లేవు. అవి కట్టించుకోవటానికి డబ్బు లేదు. ఇంత జరిగినా, అతడు తన చిన్నప్పటి అలవాటుని పోగొట్టుకోలేదు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చర్చికెళ్ళి ప్రశాంతంగా కూర్చునేవాడు. గంటల తరబడి 'ధ్యానం'లో లీనమయ్యేవాడు. దానధర్మాలు చేసేవాడు. ఇలా రెండేళ్ళు గడిచాయి. అతడిని ప్రతిరోజూ చూస్తున్న చర్చి ఫాదర్ కి జాలీ అభిమానం కలిగాయి. మనిషి స్వరూపాన్ని పోగొట్టుకున్నా, మానవ స్వభావాన్ని పోగొట్టుకోని అతడికి, సాయం చేద్దామనుకున్నాడు.


ఆస్ట్రేలియాలోని ప్రముఖ ప్లాస్టిక్ సర్జెన్, ఆ ఫాదర్ కి ఆప్తమిత్రుడు. డెంటిస్ట్ ఖర్చులు చర్చి భరించింది. అతడి మొహం మీద ఆర్నెల్లపాటు ఎనిమిది ఆపరేషన్లు జరిగాయి. గాజు కన్ను అమర్చారు. దవడ వంకర సరిచేసి, ఒక రూపుకి తీసుకువచ్చారు. క్రమక్రమంగా అతడికి ఒక ఆకారం ఏర్పడింది. వివాహం జరిగింది. పిల్లలు పుట్టారు. అతడు కథానాయకుడిగా, పై సంఘటన ఆధారంతో A MAN WITHOUT A FACE అని సినిమా తీసారు. హిట్టయింది. ఆ తరువాత వరుసగా సూపర్ డూపర్ హిట్స్ MAD MAX, BRAVE HEART, LETHAL WEAPON సినిమాలు వచ్చాయి. అతనెవరో మీలో కొందరికి తెలిసే ఉంటుంది.

అతడు *హాలీవుడ్ నెం. 1 నటుడు మెల్ గిబ్సన్.* పది మిలియన్ డాలర్లకధిపతి. ఇప్పటికీ అతడు ఖాళీ సమయాల్లో అదే చర్చి దగ్గర దానధర్మాలు చేస్తూ కనపడతాడు. మనోధైర్యం అంటే అది.


మనం చాలా చిన్న సమస్యలు చూసి బెంబేలు పడతాం. దానికి కారణం, నిజమైన సమస్యలు తెలియక....!! చాలామంది ఈ వాదనని ఒప్పుకోరు. *ఎవరి సమస్య వారికి పెద్దది* అంటారు. ఇది ఆత్మ సమర్థన. 'విచారం' పట్ల వుండే ప్రేమ. 


కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటుందని అందరూ చెబుతారు కానీ కొబ్బరికాయలోకి ఆ నీళ్లు ఎలా వచ్చాయో లేక వస్తాయో చెప్పేవాడే మేధావి, అలాగే సమస్యను పరిష్కరించుకోమని చెప్పడం చాలా తేలిక కానీ ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చెప్పడమే చాలా కష్టం.

అలా చెప్పగలిగే శక్తి మరియు 

మేధావితనం కేవలం మన మనసు కు మాత్రమే ఉంటుంది. 


*సమస్యతో పాటు పరిష్కారం కూడా పురుడుపోసుకుంటుంది*.సమస్యను చూస్తూ కూర్చుంటే పెద్దదిగా కనిపిస్తోంది కానీ దాన్ని సాధించడం మొదలుపెడితే చాలా చిన్నదిగా కనబడుతుంది.


అర్జునుడు నిర్వేదాన్ని పోగొట్టడానికి కృష్ణ భగవానుడు గీతను బోధించాడు. రామకృష్ణ పరమహంస కన్నీళ్లు తుడవడానికి కాళీ మాత దర్శనం ఇచ్చింది.


అలాగే మన సమస్యల పరిష్కారానికి మన మనసు మంచి మార్గని చూపిస్తుంది. 

మనోధైర్యాన్ని మించిన మందు గాని, అంతకంటే విలువైన ఆస్తి గాని మరేది ఈ ప్రపంచంలో లేదు ఇది అందరికీ తెలిసిన సత్యం.


సమస్యతో సహచర్యం చేయడం తప్ప వేరే మార్గం లేదు మనకి, దానితోనే ఉంటూ దానితోనే పోరాడుతూ,మనల్ని మనం విజయ తీరాల వైపు నడిపించు కోవాలి.


*అపజయానికి కృంగి పోక విజయానికి పొంగిపోక తన గమ్యం వైపు పైనుంచి వాడే పరిపూర్ణమైన వ్యక్తి గా ఎదుగుతాడు*


🌹 *డా. ఓ. మహమ్మద్ రఫి* 🌹

మంచి కథలు గ్రూప్ లో ప్రవేశం కొరకు క్రింది అవకాశం ఉపయోగించుకోవవచ్చును.

*ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక తమిళనాడు మరియు అమెరికా మెత్తం 31 గ్రూపులు ఉన్నాయి (7000 మంది సభ్యులు వున్నారు)* అన్నింటిలో ఒకే కధ పంపించబడుతుంది. 

 👇

https://chat.whatsapp.com/CQ2af235UzgLjnB7EbKND7

అఖండ భారతాన

 ఒకానొకనాడు, ఈ విశ్వ జీవజాలం అతి పవిత్ర భావనతో ఆస్వాదించినది, " అఖండ భారతాన అపౌరుషేయంగా వెలువడ్డ వేద నాద సుస్నేహ గానామృతం ! సువిశాల విశ్వంలో, పవిత్ర భారతావనికి నాటికీ నేటికీ, ఏనాటికైనా చక్కటి మైత్రీ భావనాత్మక దృష్టి సుస్థిరమని గ్రహించాల్సిన సమయమిది ! విశ్వ వ్యాప్తమైన ఆయుర్వేద వైద్య విజ్ఞానపు మూలాలు అదృష్టవశాత్తు, పవిత్ర భరతఖండంలో ఏనాడో వెల్లివిరియడం, సకల జీవుల నిత్య చైతన్య స్ఫూర్తిగా, " సువిశాల విశ్వ సంక్షేమాత్మక, సంరక్షణకై, సంపూర్ణ ఆయురారోగ్య సంపత్తిని " జీవకారుణ్య దృష్టితో  పవిత్ర వేద విజ్ఞానం, " విశ్వ జీవరాశికి నిరంతరాయంగా అందచేయడం " మన అదృష్టం ! మన పండితులు, మన దేశపు పండుగలన్నిటినీ, యావత్ విశ్వ సంక్షేమాత్మక దృష్టిలో జరుపుకోవాలని అనునిత్యం కోరుతుండడం ఈ భరతభూమి గొప్పదనం ! 🕉️🌹🤝                                                              సువిశాల విశ్వంలో, ప్రతి వ్యక్తీ, ప్రస్తుత క్లిష్ట సమస్యలకు సత్వర పరిష్కార సిద్ధికై, తమ వంతు కృషి సల్పడం అత్యంత కీలకమైన విషయంగా భావించి ముందుకు అడుగు వేయాల్సిన తరుణమిది ! యావత్ విశ్వ జీవరాశి, సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆయురారోగ్య సంపత్తిని త్వరితగతిన పొందాలని మనఃపూర్వకంగ ఆశిస్తూ........                             " స్వస్తిశ్రీ  చాంద్రమాన శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు "                                                                            🌹🌸🌺🌻🌍🕉️                                                                    గుళ్లపల్లి ఆంజనేయులు

ప్రాణం ఏ జీవితం ఒకటే* 🙏

 *ప్రాణం ఏ జీవితం ఒకటే* 🙏


ఒక కోటీశ్వరుడు నడుచుకుంటూ వస్తూఉండగా ఒక ఇంటి ముందుకు రాగానే  తన కాలి చెప్పులు తెగిపోయాయి 

ఆ ఇంటిలోని యజమానిని పిలిచి 

నా చెప్పులు తెగిపోయాయి ఇక్కడ వదిలి వెళ్తానండి 

పారేయొచ్చు కానీ కొత్తవి అందుకే మనసు రావట్లేదు 

రేపు పనివారిని పంపించి తీసుకువెళతాను అని అడిగాడు 

అందుకు ఆ ఇంటి యజమాని 

అయ్యా మీరు ఎంత పెద్ద కోటీశ్వరులు మీ చెప్పులు మా ఇంటి ఆవరణలో ఉంటె మాకే గౌరవం అని చెప్పాడు 

ధనవంతుడు తన పనిలో పడి ఆ విషయాన్నీ మరిచిపోయాడు 


ఒకరోజు హఠాత్తుగా ఆ ధనవంతుడు చనిపోయాడు 

అయన శవం ఊరేగింపు జరుగుతున్నది భారీ వర్షం మొదలయింది 

ఎవరూ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి 

అయన ఆరోజు చెప్పులు వదిలిన ఇంటి ముందు శవాన్ని తీసుకొచ్చి ఆపి ఆ ఇంటి యజమానిని పిలిచారు 


వర్షం ఎక్కువగా ఉందండి వర్షం ఆగే వరకు శవాన్ని మీ ఇంటి ముంగిట కాసేపు ఉంచుకుంటాం అని అడిగారు అందుకు ఆ ఇంటి యజమాని కోపం కట్టలు తెంచుకున్నాయి 


మొదట శవాన్ని తీయండి ఎవరి ఇంటి శవాన్ని ఎవరింటి ముందు ఉంచేది మీరు అని కసురుకున్నాడు 


అంతే అండి ప్రాణం ఉన్నంత వరకు చెప్పులకున్న విలువ కూడా ప్రాణం పోయాక ఉండదు నీ వెనుక ఎంత డబ్బు ఉన్నా 


డబ్బుకు విలువ ఎక్కువ అనుకుంటారు కానీ నిజానికి ప్రాణంకే విలువ ఎక్కువ

ప్రాణం పోయాక కోట్లు ఉన్నా వృధానే 


లోకాన్ సమస్తాన్ శుఖినోభవంతూ

తెలుగు బ్రాహ్మణులు

 తెలుగు బ్రాహ్మణులు


వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న బ్రాహ్మణులలో తెలుగు బ్రాహ్మణులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కల్హణుని 'రాజతరంగిణి'లో పేర్కొన్న 'పంచ ద్రావిడుల'లో తెలుగువారు ఒకరు. ఒక జాతి సంఖ్యాపరంగా విస్తృతం అవుతున్నప్పుడు, వారు భాషలవారీగా, ప్రాంతాలవారీగా, పాటించే విధానాలు, ఆచారవ్యవహారాల ఆధారంగా పలు తెగలుగా విడిపోవడం సహజం. సాంఘికంగా ఇలా వచ్చే అనేక మార్పులలో భాగంగానే, తెలుగు మాట్లాడే ప్రాంతాలలోని బ్రాహ్మణులు 'తెలుగు బ్రాహ్మణులు'గా పరిగణనలో ఉండటం సహజం. వీరుకూడా, కాలానుగతంగా వచ్చే మార్పుచేర్పులకు లోనవుతూ, అనేక విధాలైన పరిణామాలకు గురి అవుతుంటారన్నది గుర్తించాలి. 


1891లో ప్రచురితమైన ఒక గ్రంధం ప్రకారం, తెలుగు బ్రాహ్మణులలో స్మార్తులు అత్యధికులు. మధ్వులు ఉన్నప్పటికీ వారి సంఖ్య పరిమితం. మధ్వులలోనూ కన్నడ ప్రాంతాలనుంచి వచ్చి, తెలుగు ప్రాంతాలలో స్థిరపడినవారే అధికం. 


ఆ పుస్తకం ప్రకారం, తెలుగు స్మార్త బ్రాహ్మణులలో కానవస్తున్న తెగలు అనేకం ఉన్నప్పటికీ, వాటిలో ప్రధానమైన తెగలు ఇవి:


1. తెలగాణ్యులు :


నైజామ్‌ ప్రాంతంలో, నాటి నిజామ్‌ దురంతాలను భరించలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు. వీరు ముఖ్యంగా నేటి కరీమ్‌నగర్‌ జిల్లాలోని ధర్మపురి, మంథని, కాళేశ్వరం, చెన్నూరు ప్రాంతాలకు చెందినవారు.


2. మురికినాడు :


ఇది చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం ప్రాంతమని 'కాకతీయ సంచిక'లోని 168వ సేజీ పక్కనగల చిత్రపటం ద్వారా తెలుస్తోంది. ఈ మురికినాడులోని కొంత ప్రాంతాన్నే 'తొండపినాడు', 'తొండపి మండలం' అనికూడా అనేవారు. ('ముల్క్‌' అంటే 'దేశం' అని అర్థం. నైజామ్‌ ప్రాంతానికి ఒకప్పుడు 'ముల్క్‌' అనే పేరుండేది. ఇది 'ముల్కి నాడు' శబ్దం అపభ్రంశం అయి, 'మురికినాడు' అయిందన్న భావన తప్పుగా తోస్తోంది.) 


3. వెలనాడు - వీరిలోనూ 3 తెగలు. అవి:


             1. శుద్ధ వెలనాడు, 2. కాకిమాని వెలనాడు, 3. పెరుంబటి వెలనాడు.


(వీరినే 'వెలినాటి బ్రాహ్మణులు' అంటారనీ తెలుస్తోంది. వీరిలోని 3 శాఖలనూ 1. శుద్ధ వెలినాడు, 2. పేరుంబేడి వెలినాడు, 3. వెలినాడు బ్రాహ్మణులుగా పేర్కొంటున్నారు. మొత్తంమీద వీరందర్నీ 'వెల్నాటి బ్రాహ్మణులు' అనడమూ ఉంది.)  


4. కాసలనాడు :


ఒకప్పటి 'కోసల దేశం' నేటి 'మధ్యప్రదేశ్‌' అనుకోవచ్చు. అప్పటి దక్షిణ కోసల దేశం అయిన జబల్‌పూర్‌, రేవా, బిలాస్‌పూర్‌, సాగర్‌, సాత్నా వంటి ప్రాంతాలనుంచి కొన్ని మతపరమైన కారణాల వల్ల మన ప్రాంతాలకు వలస వచ్చినవారు వీరు. వీరినే 'కోసలనాటి బ్రాహ్మణులు' అనేవారు. 


5. కరణ కమ్మలు -


         1. బాల కరణాటి బ్రాహ్మణులు, 2. కొలింగేటి బ్రాహ్మణులు, 3. ఓగేటి బ్రాహ్మణులు. 

(వీరిలోనూ 1. బగల్నాటి కరణ కమ్మలు, 2. కొవిజేటి కరణ కమ్మలు. 3. ఓగోటి కరణ కమ్మలు అని 3 శాఖలున్నట్లు కూడా ఉంది. ఇవి పౖౖెన పేర్కొన్న 3 శాఖల పేర్లే అనిపిస్తోంది.)


6. వేగినాడు


7. తొండ్రనాడు


(ఇది బహుశా నేటి తిరుపతి ప్రాంతం కావచ్చు. తిరుమాండ్యం శాసనం, కపిలేశ్వర శాసనాల ఆధారంగా నేటి తిరుపతి ప్రాంతానికి ఒకప్పుడు 'తుండీర మండలం', 'తుండక విషయం', 'తుండైనాడు', 'తొండమనాడు' అనే పేర్లుండేవని తెలుస్తోంది. ఈ పేర్లలోంచే 'తొండ్రనాడు' కూడా రూపొంది ఉండవచ్చు.) 


8. ఔదమనాడు


9. కోనసముద్ర ద్రావిడులు 


10. ఆరామ ద్రావిడులు

1891లో ప్రచురితమైన ఆ పుస్తకం ప్రకారం పైన పేర్కొన్న పది తెగలవారూ 'వైదికులు'. వీరిలో కోనసీమ ద్రావిడులు, ఆరామ ద్రావిడులూ మొదట తమిళనాడు ప్రాంతానికి చెందినవారైనా, తెలుగునాడుకు వచ్చి, ఇక్కడ స్థిరపడ్డారు. క్రమంగా వీరి భాష, కట్టూబొట్టూ అన్నీ పూర్తిగా తెలుగు సంప్రదాయానికి అనుగుణంగా మారిపోయాయి. ఈ రెండు తెగలవారికీ తెలుగు బ్రాహ్మణులలో విశిష్టస్థానాలు ఉన్నాయి. తమిళ ప్రాంతంనుంచి వచ్చి, తెలుగు ప్రాంతంలో స్థిరపడిన కారణంగా, వీరిని కొన్నిచోట్ల 'సంకీర్ణులు' అని వ్యవహరించటంకూడా ఉంది. 


ఆరామ ద్రావిడులు

 ఆరామ ద్రావిడుల గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం: 


ఆరామ ద్రావిడులనే కొందరు 'తూర్పు ద్రావిడులు', 'కోస్తా ద్రావిడులు', 'కోనసీమ ద్రావిడులు', 'పేరూరు ద్రావిడులు' అనడమూ ఉంది. ప్రాథమికంగా ఇవన్నీ వారు స్థిరపడిన ప్రాంతాలకు సంబంధించిన పేర్లేనన్నది స్పష్టం. తూర్పు ద్రావిడులు ప్రధానంగా మన కోస్తాకు ఆవల ఉన్న ఉత్కళ ప్రాంతం, తూర్పు ఆంధ్రదేశంలోని వారు. కోస్తా ద్రావిడులు కోస్తా జిల్లాలలో స్థిరపడినవారు. ఇక, కోనసీమ ద్రావిడులు మన కోనసీమలో స్థిరపడినవారు. ఈ ఆరామ ద్రావిడులలో పేరూరు ద్రావిడులనే వారూ ఉన్నారు.


ఆరామ ద్రావిడులు ఆంధ్రదేశానికి రావటం వెనుక కొన్ని కథలు ఉన్నాయి. జనజీవనచరిత్ర అంతా పలు సందర్భాలలో జరిగిన, జరుగుతున్నవలసల వివరమేనన్నది వాస్తవం. ఆరామ ద్రావిడుల కథా అంతే! ఒక కథనం ప్రకారం - చాళుక్యరాజైన రాజేంద్రచోళుడు, తన కుమార్తె అయిన అమ్మంగి దేవిని రాజమహేంద్రవర పాలకుడైన రాజరాజ నరేంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ సందర్భంలో, ఆయన తన కుమార్తెతోబాటుగా, 18 కుటుంబాల బ్రాహ్మణులను వేంగి రాజ్యానికి పంపాడు. ఈ 18 కుటుంబాలవారూ అసలు నాటి చాళుక్యదేశం (దాదాపు నేటి తమిళనాడు) లోని 'వేలంగమన్‌' అనే గ్రామానికి చెందినవారు. (ఇప్పుడు ఈ గ్రామం 'వలంగైమన్‌' పేరుతో తిరువరూర్‌ జిల్లాలో ఉంది.) రాజాజ్ఞ తలదాల్చి, వీరిలో కొందరు 'అగ్నిహోత్రం' ధరించి, కాలినడకన వేంగి రాజ్యానికి రాగి, మరికొందరు నావలమీద వచ్చారు. నావలమీద వచ్చినవారు సముద్రతీరంలోని 'కొనసీమ' లేదా 'కోనసీమ'కు చేరారు. వారే 'కోనసీమ ద్రావిడులు' అయ్యారు. ఇక, భూమార్గాన వచ్చినవారికి రాజరాజనరేంద్రుడు, ర్యాలి సమీపాన స్థలం ఇచ్చి నివాసం ఉండమన్నాడు. వారంతా అరవ ప్రాంతంనుంచి వచ్చిస్థిరపడిన కారణంగా, అక్కడ (ర్యాలిలో) ఉన్న గుట్టలను స్థానికులు 'అరవ దిబ్బలు'గా వ్యవహరించేవారని అంటారు. నేటికీ ర్యాలిలో అరవ దిబ్బలు ఉన్నాయి. 


అరవదేశంనుంచి ఇక్కడ స్థిరపడినవారిలో - నన్నయభట్టారకుడి శిష్యుడు నారాయణ భట్టు ముఖ్యుడు. 'శ్రీమదాంధ్ర మహాభారతం' ఆంధ్రీకరణంలో నన్నయభట్టుకు నారాయణ భట్టు చేసిన సహాయానికి మెచ్చిన రాజరాజ నరేంద్రుడు ఆయనకు నందంపూడి అగ్రహారాన్ని కానుకగా ఇచ్చారన్న కథా ఉంది. 


ఇక, చోళదేశంనుంచి వచ్చిన మరికొందరు, పలిమెలపాడు పాలకుడి అనుమతితో పేరూరులో స్థిరపడ్డారని అంటారు, వీరు అసలు తమిళనాడులోని 'పెరియ ఊర్‌' (పెద్ద ఊరు) నుంచి వచ్చారని, కనుక, తాము స్థిరపడిన ఊరికి అలాగే, 'పేరూరు' అని పేరు పెట్టుకున్నారని అంటారు. ఇక్కడి ద్రావిడులు 'పేరూరు ద్రావిడులు'గా సుప్రసిద్ధులయ్యారు.


వీరికి 'ఆరామ ద్రావిడులు' అన్న పేరు రావడానికి మరో కారణాన్ని శ్రీ చందూరి వేంకట సుబ్రహ్మణ్యం గారు తమ 'వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు' పుస్తకం (పేజీ 82)లో వివరించారు. మన రాష్ట్రంలో ఉన్న పంచారామాలు- ద్రాక్షారామం, భీమారామం, క్షీరారామం, అమరారామం, కుమారారామం- లలో ముందుగా స్థిరపడిన ద్రావిడులు గనుక వీరిని 'ఆరామ ద్రావిడులు' అంటారని ఆ పుస్తకంలో ఉంది.  


11. తుంబల వారు


12. ప్రథమ శాఖీయులు 


13. నియోగులు-  


        1. ఆరువేల నియోగులు 2. కమ్మెల బ్రాహ్మణులు 3. ప్రాజ్ఞాడు బ్రాహ్మణులు 4. నందవరీక బ్రాహ్మణులు

        5. పెసలవాయిల బ్రాహ్మణులు 6. తుమ్మనాడు లేదా కమ్మనాడు బ్రాహ్మణులు 7. లింగధారులు 8. ప్రథమశాఖ నియోగులు 


ఇక్క డ మనం కొన్ని ముఖ్య విశేషాలు గమనించాల్సి ఉంది. పైన పేర్కొన్న తెగలలో కొన్ని ప్రాంతాలపరంగా ఉండటం స్పష్టం. వీటిలో కొన్ని ఇప్పుడు కనపడటం లేదనిపిస్తోంది.


(బాల కర్నాటి, కొలింగేటి, ఓగేటి, తొండ్రనాడు, ఔదమనాడు వంటి కొన్ని నియోగ బ్రాహ్మణ శాఖలు ఎక్కడైనా ఉన్నాయోమో కానీ, ఈ సంకలనకర్త దృష్టికి రాలేదు.) 


నందవరీకులు

    నందవరీకుల గురించిన ఈ దిగువన వివరిస్తున్న చరిత్ర శ్రీ గోపానందనాథులు 1996లో రాసిన 'శ్రీ దేవీ మాహాత్మ్యము- శ్రీ చౌడేశ్వరీ చరిత్రము' అనే పుస్తకంలో ఉంది. 


    సోమ వంశంలో పాండురాజు సంతతికి చెందిన నందరాజు అప్పటి కర్నాటక దేశంలోని నందవరం రాజధానిగా పరిపాలన చేసేవాడు. ఈ నందరాజు జనమేజయునికి తొమ్మిదో తరానికి చెందిన ఉత్తుంగభుజుని కుమారుడు. ఈయన చాణక్య-మౌర్యుల చరిత్రలోని నవనందులలోనివాడు కాడు. నందరాజు గొప్పశివభక్తుడు. ఈయన శివభక్తికి మెచ్చి, ఒక సిద్ధుడు ఒక దివ్యపాదుకల జతను ప్రసాదిస్తాడు. తను ఇచ్చిన దివ్యపాదుకల విషయం ఎవ్వరికీ చెప్పవద్దనే ఆంక్ష కూడా విధిస్తాడు. ఈ దివ్యపాదుకల ప్రభావంతో నందరాజు ప్రతీ నిత్యమూ వేకువజామున లేచి, కాశీనగరం చేరుకుని గంగాస్నానానంతరం విశ్వేశ్వరుని, విశాలాక్షిని దర్శించుకుని, తిరిగి తెల్లవారే లోగా తన రాజధానికి చేరుకునేవాడు. ఇలా కొంతకాలం జరిగాక, తన భర్త తెల్లవరే సమయంలో అదృశ్యం కావడాన్ని గుర్తించిన రాణి, తన భర్తను ఆ విషయమై నిలదీస్తుంది. తప్పనిసరై, నందరాజు తనకు సిద్ధుడు ఇచ్చిన పాదుకలగురించి వివరిస్తాడు. అది ఒక గొప్పవింతగా భావిస్తూ, తననూ కాశీకి తీసుకువెళ్లమని కోరుతుంది. నందరాజు ఆమెను అక్కడికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత, రాణికి రజోదర్శనం అవుతుంది. ఆ అశుచి ఫలితంగా దివ్యపాదుకలను ఉపయోగించుకోలేక, రాజధానికి తిరిగి చేరలేని పరిస్థితి ఏర్పడి, వారిద్దరూ కాశీలో చ్కిడిపోతారు.


ఈ దశలో వారు అక్కడున్న కొందరు విప్రులను చూస్తారు. వారి తేజస్సును చూసి, వారికి నమస్కరించి, తమకు సంప్రాప్తించిన విపత్తును వివరించి, సహాయం చేయవలసిందిగా కోరతారు. తపస్సంపన్నులయిన ఆ బ్రాహ్మణులు తమ దివ్యదృష్టితో భవిష్యత్తును చూసినవారై, త్వరలోనే కాశీనగరం కరవుకాటకాల పాలవుతుందని గ్రహించి, ఆ సమయంలో తమను నందరాజు ఆదుకోగలడని ఆశిస్తూ, ఆయననుంచి తగిన వాగ్దానం పొందుతారు.


వారు చేస్తామన్న సహాయానికి ప్రతిగా, తన రాజ్యంలోని నందవర అగ్రహారాన్ని వారికి దానం ఇచ్చేందుకు అంగీకరిస్తూ, విళంబినామ సంవత్సర చైత్ర బహుళ అమావాస్య సూర్యోదయ సమయంలో కాశీలోని గంగాతీర మణికర్ణికా ఘట్టంలో, శ్రీవిశ్వేశ్వర మహాదేవునికి సమర్పణంగా, శ్రీ చాముండాదేవి సాక్షిగా


ఆ విప్రులకు దానం చేశాడు. (ఇది నేటి క్రీ.శ. 2013కు 4135 సంవత్సరాల క్రితం, అంటే యుధిష్టిర శకంలోని 980కి సమానం.) ఆ తర్వాత, ఆయనకు సహాయం చేయడానికి సిద్ధపడిన విప్రులు, వేదోక్తవిధిని రాణిని శుచిని చేసి, రాజును, రాణిని క్షేమంగా నందరాజ్యానికి చేర్చుతారు. 


    ఆ తర్వాత, ఆ విప్రులు గుర్తించినట్లే కాశీనగరం కరవుకాటకాల పాలవుతుంది. తాము అక్కడ ఉండలేక, మొత్తం 500 ఇళ్లవారు నందరాజు తమకు ఇచ్చిన దానాన్ని గుర్తు చేసుకుని, నందరాజ్యానికి వస్తారు. నందరాజ్యం చేరిన వారికి రాజదర్శనం వెంటనే లభించక, కొంత సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో తమ నిత్యకర్మానుష్టానాలను రాజభవనంముందే పూర్తి చేసి, తీర్థజలాన్ని అక్కడే ఉన్న ఒక ఎండు రావి చెట్టుమీద చల్లుతారు.


ఆ విధంగా మూడు రోజులు గడిచేసరికి, ఆ ఎండు చెట్టు చిగురిస్తుంది. ఇది కేవలం ఆ విప్రుల తపోబలప్రభావమేనని భావించిన రాజసైనికులు వెంటనే


ఆ విషయాన్ని రాజుగారికి తెలియజేస్తారు. ఆయన రాజభవనం ముందుకు వచ్చి, ఆ విప్రులను సభకు ఆహ్వానిస్తాడు. సభలో, విప్రులు రాజుకు ఆయన తమకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుకు తెస్తారు. నందరాజుకు ఆ విషయం జ్ఞప్తికి వచ్చినా, తాను దివ్యపాదుకలను పొందిన సంగతినిగానీ, తాను ప్రతినిత్యం కాశీకి వెళ్లిన సంగతినిగానీ ప్రజలు విశ్వసించరేమోనన్న భీతితో, తాను అసలు కాశీకి వెళ్లనే లేదని బొంకుతాడు. అప్పుడు ఆ విప్రులు నందరాజు, కాశీలో విశాలాక్షి సాక్షిగా తమకు వాగ్దానం చేశాడని సభలో వివరిస్తారు. అయితే, సభలోని పురజనులు సైతం రాజుకే వత్తాసు పలుకుతూ, తమ రాజు అసలు కాశీకి వెళ్లనే లేదనీ, ఒకవేళ విప్రులు చెప్పేది నిజమే అయిన పక్షంలో విశాలాక్షిచేత తనముందు సాక్ష్యం చెప్పించాలని గేలి చేస్తూ విప్రులను నిండుసభలో అవమానపరుస్తారు. జగన్మాతముందు చేసిన వాగ్దానాన్ని కాదనటమేగాక ఆవిధంగా నిండుసభలో తమను అవమానపరచటంతో వారు ఎంతగానో నొచ్చుకుని, కాశీలోని విశాలాక్షి మాత చేతనే సాక్ష్యం చెప్పించటం భావ్యంగా ఉంటుందని భావించి, తమలో నలుగురు పెద్దలను ఎంచుకుని, వారిని విశాలాక్షి దగ్గరకు పంపుతారు. అలా కాశీకి వెళ్లిన నలుగురు పెద్దలు:


    1. బ్రహ్మశ్రీ అవధానం పెద్దిభట్టు (శ్రీవత్సస గోత్రం)

    2. బ్రహ్మశ్రీ తర్కశాస్త్రం మాధవభట్టు (వశిష్టస గోత్రం)

    3. బ్రహ్మశ్రీ పురాణం శ్రీధరభట్టు (భారద్వాజస గోత్రం) 

    4. బ్రహ్మశ్రీ వార్తికం కమలనాభ పండితుడు (హరితస గోత్రం)


పై నలుగురు ప్రముఖులు కాశీకి వెళ్లి, అక్కడ జపతపహోమాలను శాస్రోక్తంగా చేసి, జగన్మాతను పూజించి, ఆమెను ప్రసన్నం చేసుకుంటారు. వారి భక్తికి మెచ్చి, ఆమె వారిముందు ప్రత్యక్షం కాగానే, జరిగిన విషయం ఆ తల్లికి వివరించి, తమతో వచ్చి, సభలో సాక్ష్యం చెప్పవలసిందిగా కోరతారు. వారు కోరినట్లే తాను నందరాజు వద్దకు వచ్చి, సాక్ష్యం చెప్తాననీ, అయితే, మార్గంలో ముందు వెళ్లే విప్రులు ఎవ్వరూ జ్యోతి రూపంలో వచ్చే తనను వెనుదిరిగి చూడరాదని స్పష్టం చేస్తుంది. ఆ ప్రకారమే, నందరాజ్యం పొలిమేర వరకూ వచ్చిన విప్రులు, అక్కడ వెనుదిరిగి చూస్తారు. ఫలితంగా ఆ జగన్మాత జ్యోతి రూపంలో అక్కడ నిలిచిపోతుంది. ఈ వృత్తాంతం అంతా విప్రులు వచ్చి, నందరాజుకు విన్నవిస్తారు. ఆయన తన సతీమణి, బంధుమిత్ర పురజనపరివారసహితంగా వచ్చి, అందరిముందూ జరిగినదంతా తెలియజేసి, మహానుభావులైన విప్రుల పట్ల తను చేసిన తప్పును క్షమించమని జగన్మాతను ప్రార్థిస్తాడు. పశ్చాత్తాపం చెందుతున్న రాజును జగన్మాత క్షమించి, విప్రులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చమని ఆనతి ఇస్తుంది. ఆ ప్రకారమే, నందరాజు వెంటనే ఆ విప్రులకు నందవరాది అగ్రహారాలను దానం చేసి, తగిన వృత్తులను కలగజేస్తాడు. కాశీనుంచి విచ్చేసిన జగన్మాతను అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకోవలసిందిగా నందరాజు ప్రార్థిస్తాడు. తాను చౌడేశ్వరీ నామంతో అక్కడ వెలసి, విప్రులను, ఇతర చరాచరసృష్టినీ కాపాడతానని తల్లి అభయప్రదానం చేసి, అక్కడ జ్యోతిరూపంలో వెలుస్తుంది. నాటినుంచీ అక్కడి బ్రాహ్మణులు అందరూ 'నందవరీకులు'గా పేరొంది, నిత్యం వేదశాస్త్ర అభ్యాసంతోబాటు, అగ్నిష్టోమ్యాది యజ్ఞకర్మలను ఆచరిస్తూ,, తమ ఇళ్లలోని అన్ని శుభకార్యాలలోనూ చౌడేశ్వరీమాతను 'జ్యోతి' రూపంలో కొలుస్తూ, ఆ జగన్మాతను ఆరాధిస్తూ,


తల్లి కరుణతో జగద్విఖ్యాతిని పొందుతున్నారు - అని ప్రచారంలో ఉన్న గాథ. 


    శ్రీ చౌడేశ్వరీమాత ఆవిర్భావ చరిత్ర, చరిత్రరచనకు ముందునాటి భవిష్యత్పురాణం, భాగవతంలోని ద్వాదశ స్కంధములో ఉన్నట్లూ, ఆధునిక కాలంలో విన్నకోట సీమ, కొండవీడు, కొండపల్లిల దండకవిలెలలోనూ నమోదు అయిఉన్నట్లు శ్రీ గుంటుపల్లి సోమయ్య వివరించారు. వీరు 1914 ప్రాంతంలో 'ప్రబంధ కల్పవల్లి' అనే మాసపత్రికకు సంపాదకులుగానూ ఉండేవారు. చారిత్రక ఆధారాలనుబట్టి, శ్రీ చౌడేశ్వరీమాత అవతారం జరిగి, క్రీ.శ. 2013 నాటికి సుమారు 4134 సంవత్సరాలయిందని శ్రీ గోపానంద నాథులు రచించిన 'శ్రీ నందవర చౌడేశ్వరీ చరిత్ర' అనే పుస్తకం పేర్కొంటోంది. 


సీ. జన్మదేశంబశేష బ్రహ్మవిద్యల కాశ్వలాయన శాఖకాశ్రమంబు  


     సంకేత భవనంబు సకల శాస్త్రములకు ప్రథమాగమములకు పట్టుకొమ్మ,

     ఉపనిషత్తులకు నిత్యోత్సవస్థానంబు, యామళంబులకు సింహాసనంబు,

     ఆలయంబఖిల కావ్యాదికంబులకు గంధర్వలోకంబు గాంధర్వమునకు,

     కాశికాక్షేత్ర కళ్యాణ కటకనగర విప్ర పంచశతీ వృత్తి విస్తృతంబు,

     గుణపవిత్ర త్రయోదశ గోత్రయుతము నందభూవరదత్తంబు నందపురము.


సీ.శ్రీవత్సగోత్ర, వాశిష్ఠ సాత్రేయ, కౌశికస విశ్వామిత్ర, శ్రీ యగస్త్య,

    కాశ్యప, కుత్సస, గౌతమ, మౌనభార్గవ ఋషిగోత్ర మౌద్గల్య, వీత

    హవ్య, భరద్వాజ హరితస ముఖ్య త్రయోదశ గోత్రులౌ భూదివిజుల

    నాశ్వలాయన సూత్రులౌ విప్రవర్యుల సకత వేద శాస్త్ర పురాణవిదుల


          చముండ మాంబా ప్రసాద ప్రశస్త ఘనుల


          పూజ్యుల గణించి తనదు సామ్రాజ్యగరిమ 

          నగ్రహార క్షితిని వృత్తులారునేడు

          భూవరు డొసగె యానంద లీల.


     పైన చెప్పిన విధంగా నందవరీకులు ప్రధానంగా కాశీనుంచి ఇక్కడికి వచ్చినవారుగా అర్థమవుతోంది. అయితే, పైనగల మొదటి సీస పద్యం ఆరో పాదంలో 'కాశికాక్షేత్ర కల్యాణ కటకనగర...' అన్న పదాల ఆధారంగా వీరు కల్యాణ్‌ (నేటి మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది), కటకనగరం (నేటి ఒడిషా రాష్ట్రంలో ఉంది) వంటి ప్రాంతాలనుంచి కాశీకి చేరి ఉంటారనే భావనా ఉంది. 


అలాగే, రెండో సీస పద్యంలో పేర్కొన్న విధంగా వీరిలో 'శ్రీవత్సగోత్ర, వాశిష్ఠ సాత్రేయ, కౌశికస, విశ్వామిత్ర, శ్రీ యగస్త్య, కాశ్యప, కుత్సస, గౌతమ, మౌనభార్గవ, (ఋషిగోత్ర) మౌద్గల్య, వీతహవ్య, భరద్వాజ హరితస' అనే 13 గోత్రాలు ఉండేవనేదీ స్పష్టం. వీరు ఋక్శాఖ, ఆశ్వలాయన సూత్రులైన కరణకర్మ శాఖీయులు. అలాగే, మిగిలిన అందరు బ్రాహ్మణులకు మల్లేనే నందవరీకులు సైతం మొదట పూర్తిగా వైదికులేకాగా, తర్వాత కాలంలో వారిలోనూ వైదికి, నియోగి విభేదాలు ఏర్పడ్డాయి.


    నందవరీకులలో విశిష్టమైన ఖ్యాతి గడించిన ప్రముఖులు అనేకంగా ఉన్నారు. చాణక్యుడు, మహామంత్రి తిమ్మరుసు, విద్యానాథుడు, తాళ్లపాక అన్నమయ్య, తరిగొండ వేంగమాంబ, నన్నయ భట్టారకుడు, సంకుసాల నృసింహ కవి, రాయన భాస్కర మంత్రి వంటి ప్రముఖులు అందరూ నందవరీకులే.


లింగధారులు

    లింగధారణ అనేది శివారాధనకు చెందిన విశ్వాసచిహ్నం అన్నది స్పష్టం. 


    వీరశైవులకు వృషుడు, నంది, భృంగి (భృంగిరిటి), వీరుడు, స్కందుడు అనే అయిదుగురే గోత్రకర్తలు, పంచాచార్యులు. వీరికే యుగభేదాలనుబట్టి వేర్వేరు పేర్లు సమకూడాయి. అలా వచ్చిన పేర్లు (పైన చెప్పిన వరుస క్రమంలోనే): రేవణసిద్ధ, మరుళసిద్ధ, ఏకోరామ, పండితారాధ్య, విశ్వారాధ్య అనేవి. ఈ ఆరాధ్య మతధర్మాలను స్వీకరించినవారు మిగిలిన బ్రాహ్మణులనుంచి తాము భిన్నమని చెప్పుకోవడానికి 'ఆరాధ్య' పదస్వీకారం చేసి, 'ఆరాధ్యబ్రాహ్మణులు' అయ్యారని తెలుస్తోంది. 


        'ఆరాధ్య బ్రాహ్మణులు లింగధారణాది వీరశైవ ధర్మములను స్వీకరించినను లింగముతోబాటు యజ్ఞోపవీతమును ధరించి యుపనయన సంస్కారములు గ్రహింతురు. లింగధారులుగాని బ్రాహ్మణులు చెప్పికొను ఋషిగోత్ర సూత్రములనే వీరును జెప్పుకొందురు. వీరిలో నిప్పటికినిట్టి గోత్రసూత్రవ్యవహారమే జరుగుచున్నది.' అంటారు శ్రీ బండారు తమ్మయ్యగారు. (పాలకురికి సోమనాథ కవి, వ్యాసం, కాకతీయ సంచిక, 1991, పే. 214)  


ప్రథమ శాఖీయులు

    ప్రథమ శాఖీయులు అటు వైదీకులలోనూ, ఇటు నియోగులలోనూ ఉండటం గమనార్హం. 


    ప్రథమ శాఖీయులగురించి తెలుసుకోవాల్సిన విశేషాలు అనేకం ఉన్నాయి. ముందుగా వీరికి 'ప్రథమ శాఖ' అన్న పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం:


    వైశంపాయనుడి వద్ద వేదాభ్యాసం చేస్తున్న యాజ్ఞవల్క్యుడు, వైశంపాయనుని ఆగ్రహానికి గురై, తను అంతవరకూ నేర్చుకున్న వేదాలను కక్కివేయాల్సివస్తుంది. అప్పుడు, తీవ్రమైన నిరాశకు గురయిన యాజ్ఞవల్క్యుడు వేదాభ్యాసం కోసం సూర్యుడిని ప్రార్థిస్తాడు. సూర్యుడు ఒక గుర్రం రూపంలో ప్రత్యక్షమయి, యాజ్ఞవల్క్యునికి యజుర్వేదం నేర్పుతాడు. ఆయన నేర్పినవే 15 శాఖలు. యజుర్వేదంలోని ఆ మొదటి 15 శాఖలను 'శుక్ల యజుర్వేదం' అంటారు. వాటిని యాజ్ఞవల్క్యుడు తన శిష్యులైన కణ్వుడు, మధ్యందినుడు, కాత్యాయనుడు, వాజసనేయుడు-లకు నేర్పాడని భాగవతంలో ఉంది.


అయితే, సూర్యుడినుంచి వేదం నేర్చుకోవటం పాపమనీ, అధమమనీ వైశంపాయనుడు శపిస్తాడు. దానికి యాజ్ఞవల్క్యుడు, బాధపడి, తన గురువైన వైశంపాయనుడిని క్షమాపణ కోరతాడు. అప్పుడు సూర్యుడి వినతి మేరకు శాంతించిన వైశంపాయనుడు, తన శాపం తప్పదనీ, అయితే దానికి కొంత మినహాయింపు ఇవ్వగలననీ చెప్తూ, శుక్ల యజుర్వేదం నేర్చుకునేవారు ప్రతీదినం ఒక ముహూర్తకాలంపాటు (అంటే, 48 నిమిషాలపాటు) అధములుగా ఉంటారని చెప్పాడని వరాహ పురాణం పేర్కొంటోంది. ఈ శుక్ల యజుర్వేద (యజుర్వేదంలోని తొలి 15) శాఖలను అనుసరించేవారిని 'ప్రథమ శాఖీయులు' అంటారు. వీరినే 'వాజసనేయులు', 'కాత్యాయనులు' లేదా 'శుక్ల యజుస్‌'లనీ అనడమూ ఉంది. యాజ్ఞవల్క్యుని వద్ద వేదం నేర్చుకున్న కాత్యాయనుడు, వేదానికి సూత్రాలను రాశాడు కనుకనే, ఈ సూత్రాలను పాటించే వీరికి 'కాత్యాయనులు' అని పేరు వచ్చింది.  


    స్కంద పురాణం, 17, 18 అధ్యాయాలలో శుక్ల యజుర్వేదం గురించిన ప్రసక్తి ఉన్నా, ఈ శాపం గురించిన ప్రస్తావన లేదు. 


    యాజ్ఞవల్క్యుడు, సూర్యుని వద్ద నేర్చుకున్న యజుర్వేద శాఖలను ఏమాత్రం ఎవ్వరూ మార్చలేదు గనుక, ఇవి 'శుద్ధ'మైనవి గనుక, ఇవి 'శుక్ల యజుర్వేదం'గా పేరు పొందాయనీ అంటారు.

రామాయణం

 రామాయణం.....*


రామాయణం నుండి నేర్చుకోవలసిన కొన్ని విషయాలు..

రామాయణం పనితనం పెంచుతుంది. నిద్రపోయే కుంభకర్ణులు కావద్దంటుంది.

సేవా భావం నిర్మాణం చేస్తుంది. ఆంజనేయునిలా, లక్ష్మణుడిలా సేవ చేయండని పిలుపునిస్తుంది.

ఏకతాపథంలో నడిచే ఆలోచనలను కలిగిస్తుంది. రామానుజుల్లా కలిసి ఉండమంటుంది. వానరుల్లా సంఘటిత శక్తితో నడవండి అంటుంది.

రామాయణం సజ్జనులను కాపాడమంటుంది. దుర్జనులను శిక్షించమంటుంది.

రామాయణం తల్లిదండ్రుల మాటలను పాటించమంటుంది. అందుకొరకు మనముందు దశరథుణ్ణీ, శ్రీరామున్ని నిలిపింది.

రామాయణం కన్నతల్లిని ప్రేమించమంటుంది.
కన్న నేలను రక్షించుకొమ్మంటుంది.

రామాయణం గురువుల మాటను పాటించి ప్రజానురంజక పాలన చేయమంటుంది.
ఉదాహరణకు.. వాల్మీకి, వశిష్ట, విశ్వామితులున్నారు.

వ్యక్తిసుఖం కంటే దేశం.. దేశ ప్రజలే ముఖ్యమని రామాయణం సందేశమిస్తున్నది.
ఉదాహరణకు.. సీతా పరిత్యాగాం..

రామాయణం అపూర్వగ్రంథం..

మనల్ని నీతిమంతులుగా,
బుద్ధిమంతులుగా,
శక్తిమంతులుగా,
శ్రీమంతులుగా,
ధర్మమూర్తులుగా,
ప్రతిభావంతులుగా,
దేశ భక్తులుగా,
దేశ సంరక్షకులుగా,
సర్వగుణ సంపన్నులుగా తీర్చిదిద్దుతుంది..

రామాయణం చదువుదాం..
ఆలోచిద్దాం..
పరమార్థాలు పదిమందికి చెబుదాం..
అందరూ రామాయణం చదివేందుకు దోహదం చేద్దాం..

రామాయణం...

ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ..
ఒక కొడుకుకి తండ్రి మీద ఉన్న గౌరవం..
ఒక భర్తకి భార్య మీద ఉన్న బాధ్యత..
ఒక భార్యకి భర్త మీద ఉన్న నమ్మకం..
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం..
ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం..
ఒక మనిషిలోని బలం..
మరో మనిషి లోని స్వార్ధం..
ఇంకో మనిషి లోని కామం..
ఒకరి ఎదురు చూపులు..
మరొకరి వెతుకులాటలు..
అండగా నిలిచిన మనుషులు..

అన్ని కలిపి మనిషి మనిషి గా బ్రతకడానికి అవసరమైన ఒక నిఘంటువు...

శక్తి ఉన్నా ఒద్దికగా ఉండటం రామ తత్వం..
అవకాశం ఉన్నా భర్త వెంట నడవటం సీత తత్వం..
కష్టాల్లో తోడు నిలవడం ఆంజనేయ తత్వం..
ప్రతి అడుగులో మంచిని గ్రహించాలన్నదే రామాయణ పరమార్ధం...

ఇదే రామాయణం మనకిచ్చే ఆదర్శ సందేశం...

*|| ఓం నమః శివాయ ||*

హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ యాప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....

Spiritual Seekers 🙏
https://t.me/Spiritual_Seekers 

కల్యాణోత్సవం

 *శ్రీరామ నవమి కల్యాణోత్సవం* 🙏🌷🌹💐


గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.


 **చరిత్ర ** 

రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.


ఉత్సవం సవరించు

ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు {క్రీ.పూ} శాలివాహన శకం 5114, జనవరి 10 న జన్మించారు.


 *ఉత్సవంలో విశేషాలు*  

ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.

బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.

ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.

ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు.).

దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది.

భద్రాచలంలో రామదాసు చే కట్టబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు.

ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు.

ఆచార్య సద్బోధన*

 *ఆచార్య సద్బోధన*


భగవంతుడు మనకు వివేకాన్ని, ఆచరణకు సన్మార్గ విలువలను ఇచ్చాడు. భగవంతునితో సంబంధం పెంచుకోవా్డానికి ఈ రెండూ ఆవశ్యకాలే.


పరమాత్మునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం వలన మనిషిలో సమతుల్యత ఏర్పడుతుంది. ఆ సంబంధం అతడిని శక్తిమంతుడిని గావిస్తుంది. 


జీవితంలో అమూల్యమైన అనుభవం మనం పరమాత్ముడిని ఆశ్రయించినప్పుడే కలుగుతుంది. అప్పుడే జీవితానికి స్వాంతన, భద్రత కలుగుతాయి.


పరమాత్ముడి ఆలోచనలు, అన్వేషణ ద్వారా కనుగొనాలి. ఆ సంబంధాన్ని కనుగొన్నప్పుడే ఈ ప్రపంచంలో మన స్థానాన్ని స్వీకరించి వివేకంతో దానికి పరిపూర్ణత చేకూర్చినవారమవుతాం.


*శుభంభూయాత్*

Message from Air Marshal Ashutosh Sharma, Chest physician &

 *Message from Air Marshal Ashutosh Sharma, Chest physician & pulmonologist COMMAND HOSPITAL AIR FORCE, BANGLORE* 

Please send this message to all your colleagues daily.


*Important Message for all* 


The hot water you  

     drink is good for your throat. 


But this Corona   

      virus is hidden behind the 

      Paranasal sinus of your nose for 3 to 4 days. 


The hot water we 

      drink does not reach there. 


After 4 to 5 days  

    this virus that   

    was hidden behind the  

   paranasal sinus reaches your lungs.


 Then you have trouble breathing.


That's why it is very important to take steam, 


which reaches the  

    back of your Paranasal sinus.


 You have to kill this  

   virus in the nose with steam.


At 50°C, this virus becomes disabled i.e. paralyzed. 


At 60°C this virus  

    becomes so weak that any 

     human immunity  

     system can fight against it.


 At 70°C this virus dies completely.


This is what steam does. 


The entire Public    

    Health Department knows this.


 But everyone wants to take   

    advantage of this Pandemic. 


So they don't share this information openly.


One who stays at home should take steam once a day. 


If you go to the market to buy Groceries   

vegetables etc.

 take it twice a day.


 Anyone who meets  

     some people or goes to office

    should take steam 3 times a day.                      


 *Steam week* 


   According to doctors, 

Covid -19 can be killed by 

    inhaling steam from the nose and mouth, 

   eliminating the Coronavirus.  


If all the people  

   started a steam drive campaign for a week, 


the pandemic will soon end. 


So here is a suggestion: 


* Start the process for a week from

morning and evening, for 

  just 5 minutes  

    each time, 

to inhale steam.  

  

If we all adopt this practice for a week  the deadly 


Covid-19 will be erased.


This practice has no side effects & doesn't cost anything either.


  So please send this message to all your Loved Ones, relatives,

    friends and neighbours, 

     so that we all can kill this 

     Corona virus together and live and walk freely

    in this beautiful world.


          *Thank you, jai hind*

విధిరాతను

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹


🍀విధిరాతను తప్పించలేరు🍀

✍✍

దేవతల రాజైన ఇంద్రుడు ఓసారి కాశీ నగరంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. భూలోకంలోని రాజులు, ఋషులు, మామూలు ప్రజలు, జంతువులు, పక్షులు, కీటకాలు- అందరినీ ఆ సమావేశానికి ఆహ్వానించాడు. "అక్కడ ప్రతి ప్రాణీ తమ కష్టాల్ని నేరుగా దేవతలకు విన్నవించుకోవచ్చు" అని ప్రకటించాడు.

దాంతో చాలా మంది ఎక్కడెక్కడినుండో చేరుకున్నారక్కడికి. వరసగా అందరూ సభ లోకి వెళ్తున్నారు. 

ఆ సభ వాకిలి మీద ఒక చిలుక వాలి ఉంది. ప్రతి ఒక్కరినీ మర్యాదగా పలకరిస్తున్నది అది. అందరూ దాన్ని చూసి ముచ్చట పడుతూ లోనికి పోతున్నారు. 

ఇంద్రుడి పిలుపును అందుకొని యమ- ధర్మరాజు కూడా వచ్చాడు, ఆ సభకు. యముడిని కూడా మర్యాదగా లోనికి ఆహ్వానించింది చిలుక.

యముడు మృత్యువుకు అధిపతి: ఏ ప్రాణి ఎప్పుడు, ఎక్కడ చచ్చిపోతుందో ఆయనకు తెలుసు. అట్లాంటి యముడు సభలోకి పోతూ-పోతూ, వెనక్కి తిరిగి మరీ ఆ చిలుక కేసి చూశాడు. పూర్తిగా లోనికి పోబోతూ మళ్ళీ ఓసారి ఆగి, చిలుక వైపుకు తిరిగి చూసి- నవ్వాడు కూడా!

అప్పటివరకూ సంతోషంగానే ఉన్న చిలుకకు ఇప్పుడు దిగులు మొదలైంది- "ఎందుకు, ఈ యముడు నన్ను చూసి ఎందుకు నవ్వాడు?" అని బెంగ మొదలైంది.

క్షణ క్షణానికీ దాని బెంగ ఎక్కువైంది. కొద్ది సేపట్లోనే అది నీరసపడిపోయింది. దానికి కళ్ళు తిరగటం మొదలు పెట్టాయి. వాంతి వచ్చినట్లయింది- అంతలో పక్షిరాజు గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు. ఆయన కూడా సభలోనికి పోబోతూ చిలుక పరిస్థితిని గమనించి పలకరించాడు- ఏం చిలకమ్మా, దిగులుగా ఉన్నావు? నీ సమస్య ఏమిటి? నాకు చెప్పు; నేను నీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను" అన్నాడు.

చిలుకకు ప్రాణం లేచివచ్చినట్లయింది. "నీకు గాక ఇంకెవరికి చెప్పుకుంటాను స్వామీ! మా పక్షులందరికీ పెద్ద వాడివి నువ్వే కదా! అందుకని నా కష్టాన్ని నీకే చెప్పుకుంటాను. విను- ఇందాక యముడు సభ లోకి వెళ్ళాడు. నన్నే మళ్ళీ మళ్ళీ‌ చూస్తూ పోయాడు. చివరికి వెనక్కి తిరిగి నావైపు చూసి నవ్వాడు కూడా! నాకు భయం వేస్తున్నది. అతని నవ్వు గుర్తుకొచ్చినకొద్దీ నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లనిపిస్తున్నది. లేకుంటే అంతమందిలో నన్ను ఒక్కడినే వేరుచేసి ఎందుకు చూస్తాడు యముడు? నాకిప్పుడు మనసు మనసులో లేదు. ఇక ఎవ్వరినీ స్వాగతించలేను.

ఎక్కడికన్నా వెళ్ళి దాక్కుందామనిపిస్తున్నది. నా వెంటపడి తరిమే మృత్యువుకి అందకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోదామని ఉన్నది" గరుడుడికి చెప్పుకొని ఏడ్చింది చిలుక.

"ఓసి! ఇంతేనా! నువ్వు దిగులు పడకు! నిన్ను నేను కాపాడతాను. ఈ భూలోకంలో సురక్షిత స్థలాలకోసం‌ వెతికి వేసారేదెందుకు? వేరే చోట ఎక్కడా అవసరం లేదు. మా పక్షి జాతి దానివి నువ్వు- ఎవరికీ అందకుండా నేను నిన్ను నేరుగా దేవలోకంలో విడిచి వస్తాను- పద; నీకెందుకు భయం!" అని గరుత్మంతుడు దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని క్షణాల్లో దేవలోకం చేరుకు-న్నాడు. అక్కడ దాన్ని నందనవనంలో వదిలి- "బాగుందా, ఇక్కడ? ఏది కావాలన్నా ఊరికే కోరుకో చాలు- అది నీ సొంతం అవుతుంది. ఇక భయపడవుగా?! నేను సభకు వెళ్ళొస్తా మరి- ఉండు!" అని దాన్ని అక్కడ విడిచిపెట్టి పోయాడు.

సభంతా ముగిసిన తరువాత అందరూ బయలుదేరి బయటికి వస్తున్నారు. యమ-ధర్మరాజు కూడా బయటికి వస్తూ అంతకుముందు చిలుక కూర్చున్న వాకిలి వైపు చూశాడు. చిలుక అక్కడ లేదు! యముడి నొసలు ముడి పడ్డాయి. ఆయన అటు వైపు వెళ్ళి, చిలుక కోసం వెతకటం మొదలు పెట్టాడు.

అంతలో గరుత్మంతుడు అక్కడికి వచ్చి, యముడిని చూసి నవ్వాడు- "ఏమి యమధర్మరాజా! ఏదో వెతుకుతున్నావు?" అని అడిగాడు.

"ఈ వాకిలి మీద ఒక చిలుక ఉండింది ఇందాక- 'అది ఇప్పుడు ఎక్కడ ఉన్నదా' అని వెతుకుతున్నాను" అన్నాడు యముడు. 

గరుత్మంతుడు గర్వంగా నవ్వాడు- "ఏమి, దాని ప్రాణాలను తీసుకు పోదామనుకున్నావా? అది ఇప్పుడు ఇక్కడ లేదు.

నువ్వు ఇందాకదాన్ని చూసి నవ్వావట గదా- అది చాలా భయపడింది. అందుకని నేను దాన్ని తీసుకెళ్ళి, నీకు అందని చోట- దేవలోకంలో- దాచి వచ్చాను" అన్నాడు.

"అయ్యో!‌ ఎంత పని చేశావు!" అన్నాడు యముడు, తల పట్టుకొని.

"ఏమైంది?" అడిగాడు గరుడుడు.

"ఇందాక నేను దాన్ని చూసి, దాని మరణం ఏవిధంగా ఉండనున్నదో చదివాను- 'కొద్ది సేపటిలో ఈ చిలుక దేవలోకంలో నీటమునిగి చనిపోతుంది' అని రాసి ఉంది దాని నుదుటన! 'భూలోకంలోని ఈ పక్షి దేవలోకానికి ఎట్లా పోతుంది? -అదీ కొద్ది సేపట్లో ఎట్లా పోతుంది?- పోయి అక్కడ ఎట్లా చనిపోతుంది? -అంతా అబద్ధం; జరిగే పని కాదు!' అనుకొని నవ్వాను నేను! చూడగా నువ్వు విధివ్రాతను నిజం చేసినట్లున్నావు- ఇప్పుడు అది ఎలా ఉన్నదో ఏమో!" అన్నాడు యముడు బాధగా.

ఆ సరికి నిజంగానే చిలుక దేవలోకంలో నీటమునిగి చనిపోయి ఉన్నది!

"చేతులారా చిలుకను మృత్యువు వాకిటికి చేర్చానే!" అని బాధపడుతున్న గరుడుడిని ఓదారుస్తూ యముడు అన్నాడు-"విధిని తప్పించటం ఎవరి తరమూ కాదు గరుడరాజా, నేను కూడా‌ విధివ్రాతకు లోబడి వర్తించాల్సిందే!" అని.✍✍

🙏🙏🙏🙏🙏🙏🙏🙏