22, అక్టోబర్ 2023, ఆదివారం

Shakti pitam


 

Nrutyam


 

శ్రీధరీయం 60

 🌹శ్రీధరీయం 60 🌹


బాలాంబకు దనుజౌఘ

జ్వాలాంబకు నాదు చిత్త భద్రాలయకున్ 

రోలంబాలకకున్ నిజ 

లీలా లాలిత లలితకు శ్రీధరి సుతకున్


శ్రీమాతుః ప్రియ పుత్రికాం ,నవసమాం 

బాలార్క తేజోవిభామ్

బీజ త్రైపుర వాసినీం ,సువిమల 

శ్వేతాంబరాం వాక్ప్రదాం

జాగ్రత్ స్వప్న సుషుప్తిగాం ,త్రిపురగాం ,

శ్వాసై ర్మరాళై ర్వహాం

నౌమి త్వాం లలితాత్మజాం, ఘనరణాం.

బాలాంబికాం శ్రీధరీమ్.


🌹మణిశింజిని 🌹

లలితా త్రిపుర సుందరి వయస్సు 16 ఏళ్ళయితే ఆమెపుత్రిక అయిన బాలాత్రిపురసుందరి వయస్సు కేవలం 9 సంవత్సరాలు మాత్రమే.ఉదయిస్తున్న బాలసూర్యునవలె ఎఱ్ఱగా ప్రకాశిస్తూ.ఉంటుంది.

ఐం క్లీం సౌః అనే 3బీజాక్షరాలే చిన్నతల్లి నివాసం.అందులో మొదటి ఐంకారం సరస్వతీ బీజాక్షరమే.కనుక బాలమ్మ విద్యాప్రసాదిని.ఎప్పుడూ స్వచ్ఛమైన తెల్లని వస్త్రం ధరించిఉంటుంది.ఇదికూడా శారదా లక్షణమే. జాగ్రదాది అవస్థాత్రయం లో ఉంటూ  అవి ఆంటకుండా తురీయావస్థలో ఉండే జ్ఞానశక్తే బాలాంబ అంటే.ఈతల్లిని యుద్ధానికి పంపిస్తూ లలితాంబ తన హృదయం నుండీ కర్ణీరథాన్ని పుట్టించి యుద్ధభూమిలో స్వేచ్ఛగా తిరగడం కోసం హంసల్ని ఆరథానికి గుఱ్ఱాలుగా ఏర్పటుచేసింది.

అవి మనలోని ఉచ్ఛ్వా నిశ్వాసలే.హృదయంలోని రక్తాన్ని శుభ్రంచేసే వాయువులవే.తద్వారా

🌹 బలంతి ప్రాణినః అనయా 🌹అన్నవ్యుత్పత్తిలో బాలాశబ్దం ఏర్పడుతోంది.ఆతల్లి భండాసుర పుత్రులతో చేసేయుద్ధంలో రణనిపుణ వలే  మెరుపులా మెరుస్తూ భండపత్రుల్ని నశింపజేసింది.శ్రీధరి ఐన బాలాంబకు నమస్కారం.

    🌹🙏 ధూళిపాళ మహాదేవమణి 🙏🌹

నవగ్రహా పురాణం🪐* . *61వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *61వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*సూర్యగ్రహ చరిత్ర - 4*


ఆ ప్రశాంత వాతావరణంలో సూర్యుడూ , సంజ్ఞ అశ్వ దంపతులుగా విహరిస్తూ. ఉండిపోయారు.


అశ్వరూపంలో ఉన్న సంజ్ఞ తనలో సూర్యుడు ప్రవేశపెట్టిన తేజస్సును నాసికా రంధ్రాల గుండా వెళ్ళగక్కింది. రెండు నాసికారంధ్రాల నుండి వెలువడిన సూర్య తేజం . ఇద్దరు కుమారులుగా మారింది. ఆశ్విక దాంపత్య ఫలంగా , అశ్వముఖాలతో , మానవ శరీరాలతో జన్మించిన ఇద్దరు పుత్రులతో బాటు , సహజ శరీరంతో మరొక పుత్రుడూ ఆవిర్భవించారు.


తమ ఆశ్విక దాంపత్యం ఫలవంతం కాగానే , సూర్యుడు తన సహజరూపాన్ని ధరించాడు. ఆయనను అనుసరిస్తూ సంజ్ఞ కూడా తన బడబారూపాన్ని వీడి , పూర్వ రూపాన్ని పొందింది.


అశ్వముఖాలతో జన్మించిన కుమారులకు - 'నాసత్యుడు' అనీ , 'దస్రుడు' అనీ పేర్లు నిర్ణయించాడు సూర్యుడు. ఆ ఇద్దరూ అశ్వనీ కుమారులుగా ప్రసిద్ధులవుతారని చెప్పాడు సంజ్ఞతో.


మూడవ కుమారుడికి 'రేవంతుడు' అని నామకరణం చేశాడు సూర్యుడు. అశ్వావతార సమయంలో తమకు పుట్టిన ఆ ముగ్గురు పుత్రుల భవితవ్యం గురించి భర్తను అడిగింది. సంజ్ఞ.


*"ఇప్పుడు మనకు జన్మించిన ఈ ముగ్గురూ సామాన్యులు కారు ! సద్యోగర్భాన జన్మించి యువకులయ్యారు. చూడు ! నాసత్యద్రసులు ఇద్దరూ - అశ్వనీ కుమారులుగా , దేవ వైద్యులవుతారు. అశ్వనీ దేవతలుగా ఆరాధించబడతారు !”* సూర్యుడు చిరునవ్వుతో చెప్పాడు. *“ఇక రేవంతుడు అశ్వసంభూతుడైన కారణంగా అశ్వ విద్యలో ప్రసిద్ధుడవుతాడు !"*


*"సంజ్ఞా ! నీ బిడ్డలు - వైవస్వతుడూ , యముడూ , యమీ నీ కోసం పరితపించి పోతున్నారు. మందిరానికి వెళ్దాం , రా!”* సూర్యుడు మన్ననగా అడిగాడు. 


సంజ్ఞ సమాధానం చెప్పకుండా చూపుల్ని క్రిందకు దించుకుంది. ఆమెలో కలుగుతున్న ఆలోచనను వ్యక్తం చేస్తున్న 'అక్షర బిందువుల్లా' - సంజ్ఞ అందమైన శరీరం మీద స్వేద బిందువులు పొటమరించాయి.


సంజ్ఞ శరీరాన్ని అలంకరించిన 'చెమట పూసల్ని' సూర్యుడు చిరునవ్వుతో చూశాడు. *"అర్థమైంది ! నీ కోసం , మన దాంపత్యం కోసం నా దేహం విరజిమ్మే వెల్తురునూ , వేడిమినీ తగ్గించుకొంటాను !”*


*"స్వామీ...!"* సంజ్ఞ ఆనందంగా అంది. *“అది... అది...నా భాగ్యం...”*


సంజ్ఞ భర్త వైపు ప్రశ్నార్థకంగా చూసింది. *"స్వామీ... మన బిడ్డలు... అశ్వనీ కుమారులూ , రేవంతుడూ... మనతో మందిరానికి వస్తారు కదా !”*


సూర్యుడు తల అడ్డంగా ఊపాడు. *"నీ అశ్వనీ కుమారులు దేవ వైద్యులు. రేవంతుడు దేవలోక అశ్విక నిపుణుడు ! ముగ్గురూ దేవలోకంలో ఇంద్రుని కొలువులో వెలుగొందాల్సినవారు !”*


*"జననీ జనకులారా ! మమ్మల్ని దేవలోకానికి ఎవరు తీసుకువెళ్తారు ?"* రేవంతుడు ప్రశ్నించాడు. అశ్వనీ కుమారులు తమ అశ్వముఖాలను ఆడించారు. 'అవును' అన్నట్టుగా. 


*"అదిగో... ఆకాశమార్గాన... వస్తున్నారు చూడండి !... నారదమహర్షి !"* అన్నాడు. సూర్యుడు నవ్వుతూ.


*“నారాయణ !”* అంటూ వాళ్ళ వద్ద సిద్ధమయ్యాడు నారదుడు. *"ఈ ప్రశాంత ప్రదేశంలో సద్యోదాతులైన అశ్వనీ కుమారులను , రేవంత కుమారుడినీ ఇంద్ర సభకు జేర్చమని , బ్రహ్మదేవులు నన్ను పంపించారు !"*


అశ్వనీ కుమారులూ , రేవంతుడూ తల్లిదండ్రులకు నమస్కరించారు. సంజ్ఞ పుత్రుల్ని అక్కున జేర్చుకుని , నుదుర్ల మీద చుంబించింది. సూర్యుడు ముగ్గుర్నీ కౌగిలించుకుని , దీవించాడు.


*"అశ్వినులారా ! మీ వైద్యం దేవతలకే కాదు, మానవులకూ ఉపయోగపడాలి !”* సూర్యుడు అన్నాడు.


*"తండ్రిగారి ఆశయాన్ని తలదాల్చి , కర్తవ్యపాలన చేస్తాం !"* అన్నాడు నాసత్యుడు. 


*"అమ్మా...సంజ్ఞా ! నీ రూపం ధరించి , నీ 'ఛాయ' అక్కడ ఆడిన నాటకం , అశ్వకామిని రూపంలో ఇక్కడ నువ్వు సాగించిన సాధనా ఫలవంతమయ్యాయి ! అక్కడ శనైశ్చరుడు జన్మించాడు ! ఇక్కడ దేవవైద్యులూ , రేవంతుడూ జన్మించారు !"* నారదుడు మెప్పుగా అన్నాడు..


సూర్యుడు నారదుణ్ణి ఆశ్చర్యంగా చూశాడు. *“అయితే , నారదమహర్షీ ! ఇక్కడ ఈ సంఘటనలకు సంకల్పం...”.*


*“అక్కడ జరిగింది, సూర్యాదిత్యా !"* చేత్తో పైకి చూపుతూ మాట పూర్తి చేశాడు నారదుడు.


నారదుడి వెంట వెళ్తున్న ముగ్గురు కుమారులనూ అశ్రునయనాలతో చూస్తూ ఉండిపోయింది సంజ్ఞ. సూర్యుడు ఆమెను సమీపించాడు. ఆమె భుజం చుట్టూ చేతిని వేశాడు. సంజ్ఞ తలతిప్పి , ఆయన ముఖంలోకి చూసింది.


*"వైవస్వతుడూ , యముడూ , యమీ నీకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు, మందిరంలో !"* సూర్యుడు చిరునవ్వుతో అన్నాడు.


సంజ్ఞ బుగ్గల మీదికి జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ , భర్త వైపు చిరునవ్వుతో చూసింది.


*"అమ్మా !"* యమీ , యముడూ , వైవస్వతుడూ సంజ్ఞను చూడగానే ఏకకంఠంతో అరిచారు. తన వైపు దూసుకువచ్చిన ముగ్గుర్నీ ఒకేసారి తన చేతుల్లో బంధించలేక సతమతమవుతూ , వాళ్ళ శిరస్సుల మీద ముద్దులు కురిపించింది సంజ్ఞ..


సూర్యుడు ఆనందంగా తల్లీబిడ్డల్ని చూస్తూ ఉండిపోయాడు. ద్వారం వద్ద శబ్దమైంది. అందరూ చూశారు. శని , సావర్జీ , తపతీ వస్తున్నారు. ముగ్గురూ ఆగి , ఆశ్చర్యంగా సంజ్ఞ వైపు చూస్తూ ఉండిపోయారు.


*"అమ్మా..."* తపతి అనుమానిస్తూ అంది.


*"రా తల్లీ ! రండి , నాయనా ! నేను మీ అమ్మనే !"* సంజ్ఞ హాయిగొలిపేలా నవ్వుతూ అంది.


ముగ్గురూ సంజ్ఞ దగ్గరగా వచ్చారు. వైవస్వతుడు , యముడూ , యమీ పక్కకు జరిగారు. శనీ , సావర్టీ , తపతీ సంజ్ఞను సమీపించారు. ముగ్గుర్నీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది సంజ్ఞ.


*"అమ్మా...ఆ అమ్మ ?"* శని సందేహిస్తూ లోపలి కక్ష్య వైపు చూపించాడు.


*"ఛాయా !”* సంజ్ఞ బిగ్గరగా పిలిచింది. ఛాయ ద్వారం దాటి , ఈవలకు వచ్చి , తటపటాయిస్తూ చూసింది. ఆమె ముఖం మీద అపరాధ భావన నాట్యం చేస్తోంది.


*"ఇలా రా , ఛాయా !"* సంజ్ఞ స్వరంలో ఆజ్ఞ ధ్వనించింది.


ఛాయ మెల్లగా నీడలా కదుల్తూ , ఆమె దగ్గరగా వచ్చింది.


*"ఛాయా ! నీ కర్తవ్యం ముగిసింది. నువ్వు నీ వ్యక్తిత్వాన్ని మరిచిపోయి , నాలో నా ఛాయలో కలిసిపోవాలి !"* సంజ్ఞ గంభీరంగా అంది.


ఛాయ మంత్ర ముగ్ధలా మౌనంగా చూసింది. *"రా , ఛాయా ! నాలో కలిసిపో !"* సంజ్ఞ అంది.


సూర్యుడూ , ఆరుమంది పిల్లలూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఛాయ నెమ్మదిగా సంజ్ఞ వైపు నడిచింది. సమీపించిన క్షణంలో సంజ్ఞలో కలిసిపోయిన ట్టనిపించింది. సువర్ణకుడ్యం మీద సంజ్ఞ నీడ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.


అందరూ సంజ్ఞ వైపు ఆశ్చర్యంగా చూశారు. సంజ్ఞ అందర్నీ కలియజూసింది. *“ఈ సంజ్ఞా , ఆ ఛాయా ఇద్దరూ నేనే ! మీరు ఆరుగురూ నా బిడ్డలే ఇకనుంచీ !"* అంది నవ్వుతూ.


అందరి ముఖాలూ నవ్వుతో వికసించాయి.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 71*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 71*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


కాళీమాతను నరేంద్రుడు అంగీకరించడాన్ని శ్రీరామకృష్ణులు ఒక అతి ముఖ్యమైన సంఘటనగా పరిగణించారు. ఎందుకు? కాళీమాత అంటే- శ్మశానం, చుట్టూ కాలుతున్న శవాలు, పిశాచాల భయానక తాండవం, నక్కల ఊళలు, విరబోసుకున్న శిరోజాలు, రక్తం ఓడుతున్న నాలుక, మానవ కపాలాలతో కూర్చబడిన హారం, చేత రక్తం స్రవించే ఖడ్గం, నరకబడిన శిరస్సు, శివుని ఛాతీ మీద నిలబడిన భంగిమ ఇదే ఆమె ఆకారం! జీవితపు మరో ప్రక్క చూపించే ప్రతీకగా విలసిల్లుతున్నదామె.


సుఖం, హాయి, మాధుర్యం, అందం, ఆనందాల కలయిక మాత్రమే జీవితం కాదు. జీవితానికి మరొక వైపు కూడా ఉంది. దుఃఖం, శోకం, చెడు, ఘోరం, ఏడ్పులతో నిండినదది. అది ఎక్కణ్ణుండి వచ్చింది? స్వామి వివేకానంద మాట లోనే దానిని విందాం:


"చెడు ఎందుకున్నది? దేవుడు మంచి చెడులు రెండింటికీ కారకుడని చెప్పడంలోనే ఈ ప్రశ్నకు జవాబు ఉంది..... దేవుడు సర్వదా మంగళస్వరూపుడే అయితే ఈ మంచి చెడులన్నింటికి ఎవరు బాధ్యులు? సైతాన్ అనే పెద్దమనిషి ఒకడున్నాడని క్రైస్తవులు, మహమ్మదీయులు అంటారు. ఇద్దరు (దైవాలు) పని చేస్తున్నారని మీరెలా చెప్పగలరు? ఉన్న దొక్కరే అయివుండాలి....


 తాకితే పిల్ల వాని వేళ్లను కాల్చివేసే అగ్ని ఆహారాన్ని పచనం చేస్తుంది. అగ్ని మంచిదనిగాని, చెడుదనిగాని ఎలా చెప్పగలరు? అగ్నిని సృష్టించిన వారిద్దరు వేర్వేరని ఎలా చెప్ప గలరు? అశుభమనే దాన్నంతా సృష్టించిన వారెవరు? దేవుడే. ఇంతకు మించి సమాధానం లేదు! మృత్యువును, జీవనాన్ని, ప్లేగును, అంటువ్యాధులను సమస్త్రాన్ని ఆయనే పంపుతాడు. దేవుడు అలాంటివాడే అయితే అతడు మంగళ కరుడు - అమంగళకరుడు; అతడు సౌందర్యరూపుడు - వికారుడు; అతడు జీవం - మృత్యువు కూడా. 

 

ఇలాంటి దేవుణ్ణి ఉపాసించడం ఎలా? 

 

భీషణస్వరూపుణ్ణి ఆత్మ నిజంగా ఎలా ఉపాసించ నేర్చుకోగలదో మనం తెలుసుకొందాం; అప్పుడా ఆత్మకు శాంతి కలుగుతుంది. మీకు శాంతి ఉందా? ఆందోళనల నుండి మీరు ముక్తులా? ఇలా తిరిగి ముందు భీకరమైన మూర్తిని చూడండి, పైముసుగును తొలగించి ఇప్పుడు దేవుణ్ణి చూడండి. అతడు సగుణుడు. శుభం, అశుభం అంతా అతడే. మరొక రెవ్వరూ లేరు."


ఈ సత్యాన్ని ఆ రోజు నరేంద్రుడు కనుగొన్నాడు. జీవితం గురించిన అతడి దృక్పథాన్ని, భగవంతుని గురించిన అతడి దృక్పథాన్ని ఈ సత్యం పరిపూర్ణం గావించింది. కాలాంతరంలో జగద్గురువుగా విరాజిల్లనున్న ఆతడి దృష్టి పరిపూర్ణతని సంతరించుకొంది. అందుకే శ్రీరామకృష్ణులు అంతగా సంతోషించారు. తమ కార్యం పూర్తయిందనే భావన బహుశా ఆయన మనస్సులో మెరసివుండ

వచ్చు. "శ్రీరామకృష్ణ పరమహంస నన్ను కాళీమాతకు అప్పగించారు. దీన్లో ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ తరువాత ఆయన రెండు సంవత్సరాలే జీవించారు.


ఆ రెండు సంవత్సరాలూ కూడా శారీరక రుగ్మతతో ఎంతో బాధపడుతూ గడిపారు. ఈ సంఘటనానంతరం ఆరు నెలలు కూడా ఆయన పూర్ణ ఆరోగ్యంతో జీవించలేదు" అని కాలాంతరంలో స్వామి వివేకానంద చెప్పారు.


ఈ విధంగా దుఃఖమనే ఒక తరంగం ఉవ్వెత్తున లేచి నరేంద్రుణ్ణి పరిపూర్ణవ్యక్తిగా తీర్చిదిద్దింది; జీవితాన్ని యథాతథంగా స్వీకరించేటట్లు చేసింది.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 61*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 61*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*అసౌ నాసావంశ స్తుహినగిరి వంశ ధ్వజపటే*

*త్వదీయో నేదీయః ఫలతు ఫల మస్మాకముచితమ్ |*

*వహత్యంతర్ముక్తా శ్శిశిరకర నిశ్వాస గలళితాః*

*సమృద్ధ్యా య త్తాసాం బహిరపి స ముక్తామణిధరః ‖*


అమ్మా

తుహినగిరివంశ ధ్వజపటే = హిమవంతుని వంశ కీర్తి పతాక అయిన తల్లీ!


అసౌ నాసా వంశః = లేత వెదురు ముక్క(వంశః) వలె వున్ననీ నాసిక, (ఇది కవి చమత్కారం.బాగా పండిన వెదురులో ముత్యములు పుడతాయట. అలాగే వెదురు పచ్చగా వుండి, లోపల బోలుగా ఉండటంతో దీనిని నాసికాదండముతో పోల్చారు. వేణువును వంశి అంటాము కదా.


వహత్యంతర్ముక్తా శ్శిశిరకర నిశ్వాస గలితం, సమృద్ధ్యా యత్తాసాం బహిరపి స ముక్తామణిధరః =

ముక్తాః అంటే మంచి ముత్యము. అలాగే ముక్తులైన వారు అని కూడా అర్థం. అమ్మా, నీ నాసికలో ఎన్నో ముత్యాలు లోపల ఉంచుకొని ఒకటి బయటకు ధరించావా తల్లీ అని భక్తితో అడుగుతున్నారు. ఇక్కడ రెండు విషయాలు.

ఒకటి నాసిక బయట ధరించిన ఆభరణానికి లోపల కూడా ఒక ఆభరణం ఆసరాగా పట్టుకొని ఉంటుంది.

 రెండవది ముక్తి పొందినవారు ఎందరో మహా యోగులు అమ్మవారిలో లీనమై ఉన్నారు. ఈ విషయం నిరూపించటానికా అన్నట్లు ఒక ముత్యమును బయట ధరించారు. అమ్మవారు మనలో ప్రాణశక్తిగా సంచరిస్తున్నారు. ఉచ్చ్వాస నిశ్వాసములలో. నిశ్వాసము చంద్ర స్వరూపమైన ఇడా నాడి (శిశిరకర  నిశ్వాస అన్నారు అందుకే) ద్వారా వెలువడుతుంది. అలా వెలువడిన నిశ్వాసముతో బయటకు వచ్చిన ముత్యము ఆమె నిశ్వాసము, శశికరుడైన చంద్రుని స్థానమైన ఇడా నాడి నుండి వచ్చినప్పుడు అమృత బిందువులు జాలువారుతాయి, అవి ఘనీభవించి ముత్యములుగా మారుతాయి అని కవి చమత్కారం. అమ్మవారు ఆభరణముగా ధరించారట. ముత్యము కూడా చంద్ర స్వరూపమే. ముత్యములు ఆలుచిప్పలలోనూ, గజరాజుల కుంభస్థలములలోనూ కూడా లభిస్తాయి. రాబోయే 74 వ శ్లోకంలో, శివుడు గజాసురుని సంహరించి, వాని కుంభస్థలము నుండి సేకరించిన ముత్యములతో చేసిన మాలను అమ్మవారికి బహుకరించారని చెప్పబడుతుంది. 


లలితా సహస్ర నామములలోని *నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజితా*, *తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా* అనే రెండు నామములు ఇక్కడ స్మరింపదగినవి.  ఈ నామముల అర్థము

అప్పుడే విచ్చుకున్న చంపక పుష్పము వలె అమ్మవారి నాసాదండము విరాజిల్లుతున్నది. అమ్మ ధరించిన నాసాభరణము నక్షత్రకాంతిని  త్రోసిపుచ్చుతున్నది అని. 

కుడి ప్రక్కన సూర్య సంబంధమైన పింగళ నాడి, ఎడమ ప్రక్కన చంద్ర సంబంధమైన ఇడా నాడి, మధ్యన అగ్ని సంబంధమైన సుషుమ్న నాడి. పార్వతీ పరమేశ్వరుల త్రినేత్రములు కూడా వీరి స్థానములే.


          🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వెన్నముద్దల బతుకమ్మ

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🪻బతుకమ్మ పండుగలో వెన్నముద్దల బతుకమ్మ🪻*


ఇప్పటికే ఏడు రోజుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. వాటిలో ఎంగిలిపువ్వు బతుకమ్మ , అటుకల బతుకమ్మ , ముద్దపప్పు బతుకమ్మ , నానబియ్యం బతుకమ్మ , అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ , వేపకాయల బతుకమ్మ వేడకలు ముగిశాయి.


ఇక బతుకమ్మ పండుగలో 8వ రోజును *'వెన్నముద్దల బతుకమ్మ'గా* బతుకమ్మను ఆరాధిస్తారు. ఈరోజు తంగేడు , గునుగు , చామంతి , గులాబీ , గడ్డి పువ్వు , మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆట , పాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈరోజు వాయనంగా నువ్వులు , బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪷🌺🌷🌹🪷🌺🌷🌹🪷🌹

దుర్గమంబులయందు

 *సీసము*

దుర్గమంబులయందు దుర్గమా యమ్మగా

   సుగమంబు లనుకూర్చు నిగమ జనని

శత్రుపీడలయందు సతమత మౌనాడు

   కాళికాదేవిగా కాచు తల్లి

సిరులొసంగెడు వేల్పు శ్రీ మహాలక్ష్మి యై

   సకలసంపదలిడు సన్నుతాత్మ

మాకాళి మాలక్ష్మి మాసరస్వతియౌ

   ఆదిపరాశక్తి యఖిల జనని.

*తే.గీ.*

సకల విద్యలు సమకూర్చు శారదాంబ

అఖిలసంపదలొసగంగ యమ్మ లక్ష్మి

దుష్ట సంహార మొనరించు దుర్గ తానె

మూడు మూర్తుల కలబోత మోక్షదాయి.

*అందరికీ దుర్గాష్టమీ మహానవమీ విజయదశమి శుభాకాంక్షలు.*


*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 61*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 61*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*అసౌ నాసావంశ స్తుహినగిరి వంశ ధ్వజపటే*

*త్వదీయో నేదీయః ఫలతు ఫల మస్మాకముచితమ్ |*

*వహత్యంతర్ముక్తా శ్శిశిరకర నిశ్వాస గలళితాః*

*సమృద్ధ్యా య త్తాసాం బహిరపి స ముక్తామణిధరః ‖*


అమ్మా

తుహినగిరివంశ ధ్వజపటే = హిమవంతుని వంశ కీర్తి పతాక అయిన తల్లీ!


అసౌ నాసా వంశః = లేత వెదురు ముక్క(వంశః) వలె వున్ననీ నాసిక, (ఇది కవి చమత్కారం.బాగా పండిన వెదురులో ముత్యములు పుడతాయట. అలాగే వెదురు పచ్చగా వుండి, లోపల బోలుగా ఉండటంతో దీనిని నాసికాదండముతో పోల్చారు. వేణువును వంశి అంటాము కదా.


వహత్యంతర్ముక్తా శ్శిశిరకర నిశ్వాస గలితం, సమృద్ధ్యా యత్తాసాం బహిరపి స ముక్తామణిధరః =

ముక్తాః అంటే మంచి ముత్యము. అలాగే ముక్తులైన వారు అని కూడా అర్థం. అమ్మా, నీ నాసికలో ఎన్నో ముత్యాలు లోపల ఉంచుకొని ఒకటి బయటకు ధరించావా తల్లీ అని భక్తితో అడుగుతున్నారు. ఇక్కడ రెండు విషయాలు.

ఒకటి నాసిక బయట ధరించిన ఆభరణానికి లోపల కూడా ఒక ఆభరణం ఆసరాగా పట్టుకొని ఉంటుంది.

 రెండవది ముక్తి పొందినవారు ఎందరో మహా యోగులు అమ్మవారిలో లీనమై ఉన్నారు. ఈ విషయం నిరూపించటానికా అన్నట్లు ఒక ముత్యమును బయట ధరించారు. అమ్మవారు మనలో ప్రాణశక్తిగా సంచరిస్తున్నారు. ఉచ్చ్వాస నిశ్వాసములలో. నిశ్వాసము చంద్ర స్వరూపమైన ఇడా నాడి (శిశిరకర  నిశ్వాస అన్నారు అందుకే) ద్వారా వెలువడుతుంది. అలా వెలువడిన నిశ్వాసముతో బయటకు వచ్చిన ముత్యము ఆమె నిశ్వాసము, శశికరుడైన చంద్రుని స్థానమైన ఇడా నాడి నుండి వచ్చినప్పుడు అమృత బిందువులు జాలువారుతాయి, అవి ఘనీభవించి ముత్యములుగా మారుతాయి అని కవి చమత్కారం. అమ్మవారు ఆభరణముగా ధరించారట. ముత్యము కూడా చంద్ర స్వరూపమే. ముత్యములు ఆలుచిప్పలలోనూ, గజరాజుల కుంభస్థలములలోనూ కూడా లభిస్తాయి. రాబోయే 74 వ శ్లోకంలో, శివుడు గజాసురుని సంహరించి, వాని కుంభస్థలము నుండి సేకరించిన ముత్యములతో చేసిన మాలను అమ్మవారికి బహుకరించారని చెప్పబడుతుంది. 


లలితా సహస్ర నామములలోని *నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజితా*, *తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా* అనే రెండు నామములు ఇక్కడ స్మరింపదగినవి.  ఈ నామముల అర్థము

అప్పుడే విచ్చుకున్న చంపక పుష్పము వలె అమ్మవారి నాసాదండము విరాజిల్లుతున్నది. అమ్మ ధరించిన నాసాభరణము నక్షత్రకాంతిని  త్రోసిపుచ్చుతున్నది అని. 

కుడి ప్రక్కన సూర్య సంబంధమైన పింగళ నాడి, ఎడమ ప్రక్కన చంద్ర సంబంధమైన ఇడా నాడి, మధ్యన అగ్ని సంబంధమైన సుషుమ్న నాడి. పార్వతీ పరమేశ్వరుల త్రినేత్రములు కూడా వీరి స్థానములే.


          🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం  - అష్టమి -  ఉత్తరాషాఢ - భాను వాసరే* *(22-10-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/HwcTJhatqmQ?si=zNLrMFO8dLVnL9oT


🙏🙏

పెళ్ళాం వచ్చింది

 🤔చచ్చిన పెళ్ళాం వచ్చింది😀


ఆ. 'ఓటు' వేయదలచి యొంటిగా నొక్కండు

     చేరె 'బూతు' కడకు చీటి తోడ

     లిష్టు ననుసరించి యిష్టమౌ వారికి

     వేసె 'ఓటు' నతడు విడువ కుండ


ఆ. అంత నాత డడిగె నధికారి నటగాంచి

    "వచ్చెనా? యిటకును భార్య" యనుచు,

     అంత లిస్టు చూచి యధికారి యనియెను 

     పావుగంట ముందు వచ్చె నంచు.


ఆ. "పెద్దవాళ్ళు మీరు యిద్దఱు రాకుండ

      భార్య నేల ముందు పంపినావు?

      పాప మామె వచ్చి బహు శ్రమ కోర్చియున్

      ఓటు వేసె నప్పు డొంటరిగను


క.  ఇద్దఱు సతతము బ్రతుకున

     నొద్దికతో నుండకుండ నొంటరి నుంటన్

     పెద్దయ్యా ! యిది న్యాయమె !

     పెద్దామెను చూడు మింక ప్రియ మారంగన్ "


క.  అధికారి మాట లన్నియు

     యెద తాకగ పెద్దమనిషి యేడ్చియు మదిలో

     సదమల పత్నిని తలచియు

     వ్యధ చెందుచు నిట్టు లనియె నాతని తోడన్


ఆ.  "పత్ని నన్ను వీడి పదునైదు యేండ్లయ్యె 

     కలసి వత్తు మెట్లు కార్యములకు?

     ఓటు వేయుటకును నొక్కతే యాయమ

     దిగియు వచ్చు చుండు దివము నుండి


ఆ. పత్ని యామె వచ్చు ప్రతి యెన్నికలయందు

     ఓటు వేయుటకును నీటు గాను,

     ముందుగానె వచ్చు తొందర పడియును

     కలియ దామె నన్ను కర్మ మేమొ!


ఆ. ఎదురు చూచు చుందు నెప్పుడు న్నామెకై

     వేయికండ్లతోడ విసుగు లేక

     యెపుడు వచ్చు నామె యెప్పుడు పోవునో

     యెన్ని సార్లు కూడ యెఱుగ నైతి"


ఆ. వేదనమున వ్యక్తి వివరించ నారీతి

     వినియు  నా యధిపతి విస్తుపోయి

    "చచ్చినామె యెట్లు వచ్చెను ఓటేయ ?"

     ననియు మదన పడియె మనము నందు.


తే. "చచ్చినామెకు బదులుగా వచ్చి యెవరొ

      ఓటు వేయుచు నుండిరి దీటు గాను,

      ప్రభుత యుండిన నీరీతి ప్రజల కెట్లు

      ఒనరు న్యాయమైనటువంటి ఓటు హక్కు?"


తే. తలచి యారీతి యధికారి త్రపను పొంది

     మిన్నగా నెంచి భవితను మిన్నకుండె

    "చచ్చి నట్టియు తన పత్ని వచ్చు రీతి''

     తలచి నవ్వుచు యింటికి తరలె నరుడు


                సమాప్తము


కథానిక రచన

గోపాలుని మధుసూదన రావు

భక్తిసుధ

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 


             *_శ్లోకమ్-_*


*_సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్‌ స్తవే_*

*_తేనాస్య శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్‌_* 

*_సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః_*

*_సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చ ఐశ్వర్యమవ్యాహతమ్‌...._*


*_దక్షిణాముర్తి స్తోత్రమ్- 10 -_*


సర్వ భూతముల ఆత్మ తత్వమును బోధించే ఈ స్తవాన్ని విన్నవారు, చదివిన వారు, ధ్యానించి, సంకీర్తన చేసినవారు అనుభూతి చెందినవారు ఈశ్వరత్వం పొందుగాక,సకల సిద్ధులు పొంది,ఐశ్వర్యం కలుగుగాక..... దక్షిణామూర్తి స్తోత్రమ్ - సంపన్నమ్ - సుసంపన్నం.

శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి*

 శ్రీమాత్రేనమః 

*శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి*

           ది:22-10-2023


శా॥

భృత్యుల్ నీకు శివుండు బ్రహ్మ హరియున్ ప్రేతల్ విచారించ; నా

దిత్యవ్రాతము  సేవజేయ విలసత్తేజమ్ము దీపించ నీ 

స్తుత్యమ్మైన పరాక్రమం బసురసందోహమ్ములం గూల్చెనే 

యత్యుత్సాహముతోడ నిన్ గొలుతు నిత్యానందసంధాయినీ!  -15 

శా॥

సర్వాధారగుణోజ్జ్వలీ! శుభకరీ! సర్వార్థదాత్రీశ్వరీ! 

సర్వైశ్వర్యవిరాజమానకుశలజ్జాజ్వల్యతేజోనిధీ! 

సర్వానందకరీ! భవార్తిశమనీ! సౌందర్యరూపార్ణవీ! 

సర్వజ్ఞానకరీ! నమోస్తు! హరహృత్సౌందర్యవర్థఙ్కరీ!  16 

శా॥

అంతర్యాగముచేత సత్వరముగా నానందముం బొంది నీ 

పొంతన్నిల్పుక యాదరింతువట సమ్మోదమ్మునన్ శ్రీకరీ! 

భ్రాంతుల్ బాపుచు జ్ఞానమీయుమిక క్షేత్రమ్మేల నీవుండగా! 

క్రాంతిం జూపుమ దానవాంతకమతీ! కైమోడ్పులర్పించెదన్  17 

(క్షేత్రము=శరీరము)

*~శ్రీశర్మద*

8333844664

అవ్యక్తము నుంచి వ్యక్తమయిన స్థితి

 ఓం నమః శివాయ 🧘‍♀️నవదుర్గలు /షట్చక్రాలు / శ్రీ చక్రం -మానవశరీరం🧘‍♂️

అవ్యక్తము నుంచి వ్యక్తమయిన స్థితినే అమ్మవారు లేక మూలప్రకృతి అంటారు.

ఆధ్యాత్మికత స్థితులు/చక్రాలు

ఆధ్యాత్మికత =ఇచ్ఛాశక్తి +జ్ఞానశక్తి +క్రియాశక్తి = పార్వతి + సరస్వతి + లక్ష్మీ= ధ్యానం + జ్ఞానం + సేవ = Starting + Middle + Ending stage.


నవ రాత్రులనగా:--

1) ☸️మూలాధారచక్రం - (శైలపుత్రీ)- Body consciousness / మొదటి రోజు పృధ్వీ🌎తత్త్వము:- అనగా అన్నమయ శరీరమునకు సంబంధించినది.


2)☸️స్వాధిష్టానచక్రం - (బ్రహ్మచారిణీ) - Family  consciousness / రెండవ రోజు జల 💦తత్త్వము:- ప్రాణమయ శరీరమునకు సంబంధించినది. రెండవ రోజు పూజ కోరికలు ధర్మయుక్తము అవడానికి.


3)☸️మణిపూరకచక్రం -  (చంద్రఘంట) Society consciousness  / మూడవ రోజు అగ్ని  🔥తత్త్వము:-  మనోమయ కోశమునకు సంబంధించినది. మనలో భావాలు అగ్నితో పునీతమవుతాయి. అక్కరలేని భావాలు ఉండవు.

 

4)☸️అనాహతచక్రం - (కూష్మాండ) Empty consciousness / నాల్గవ రోజు వాయు 🌬తత్త్వము:-  దైవీ పరమైన భావాలు కలుగుతాయి. పంచభూతముల యందు స్వామిత్వము వస్తుంది. అంతర్లోకాలకి తీసుకొని వెడుతుంది.


5)☸️విశుద్ధచక్రం - (స్కందమాత) Balanced  consciousness / అయిదవ రోజు ఆకాశ🎇తత్త్వము. మన హృదయము లోపల ఆకాశము దర్శనమిస్తుంది. అమ్మవారిని 'దహరాకాశరూపిణి' అంటాము గదా!


6)☸️ఆజ్ఞా చక్రం - (కాత్యాయనీ)Third  eye consciousness / ఆరవ రోజు  మనసు మీద గూడా స్వామిత్వము వస్తుంది. మనసు మృదువుగా తయారయితే సప్తమి రోజు పూజ అనుభూతి నిస్తుంది.


7)☸️సహస్రార చక్రం  - (కాలరాత్రీ) Sharing knowledge to Universe consciousness. ఏడవ రోజు మనసును దాటి బుద్ధి లోకాలలోకి ప్రవేశం జరుగుతుంది. అపుడు మూలా నక్షత్రము రోజు పూజ చేసుకోవాలి.


8) ☸ ఊర్ధ్వ సహస్రారచక్రము -(మహాగౌరీ) (బ్రహ్మరంధ్రము)All  type of  knowledge to Universe consciousness.-  ఎనిమిదవ రోజు దుర్గాష్టమి పూజ. అనగా అజ్ఞానాన్ని నిర్మూలిస్తుంది. మహిషాసురుడు అంటే అహం కారంతో కూడిన స్వభావము.

 

9)☸బిందు చక్రం - (సిద్ధిదాత్రీ)All  type of  knowledge to Universe consciousness.- అహంకారం తగ్గిపోతే  అమ్మవారి మహత్యం తొమ్మిదవ రోజు తెలుస్తుంది. తొమ్మిది, పది రోజులు పరమాత్మ  దివ్య చైతన్యంతో కూడి ఉంటుంది. అదే మహర్నవమి. విజయదశమి.


10)నిర్వాణచక్రం - (మహిషాసురమర్ధిని /దుర్గాదేవి /రాజరాజేశ్వరీ దేవి ) All  type of  knowledge to Complete Universe  consciousness / ☸️Every consciousness is need for our Life...

.

మానవుడు చేసిన కర్మలనునసరించి వారికి సద్గతులు అమ్మవారు కలిగిస్తుంది, సాధకుని యొక్క సాధనను బట్టి అన్నిరకాల ముక్తులను ప్రసాదించే తల్లి ఆ  ముక్తి 5 రకాలు గా వర్ణించ బడింది.


1.మణిపూరంలో దేవిని అర్చించే వారికి “సార్షిరూపముక్తి”.(మణిపూరంలో దేవిని అర్చించేవారు దేవి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకుని ఉంటారు. దీన్ని సార్షిరూపముక్తి అంటారు.)


2.అనాహతంలో దేవిని అర్చించేవారికి “సాలోక్యముక్తి”(అనాహతంలో దేవిని అర్చించేవారు దేవిపట్టణంలోనే నివసించగలుగుతారు.దీన్ని సాలోక్యముక్తి అంటారు.)


3.విశుద్ధిచక్రంలో దేవిని అర్చించే వారికి 'సామీప్యముక్తి” (విశుద్ధిచక్రంలో దేవిని అర్చించేవారు దేవికి అతిదగ్గరగా సేవకులుగా ఉంటారు. ఇది సామీప్యముక్తి.)


4.ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించే వారికి “సారూప్యముక్తి”(ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించేవారు వేరే దేహం ధరించి దేవితో సమానమైనరూపంలో ఉంటారు. ఇది సారూప్యముక్తి.)


5.సహస్రారంలో దేవిని అర్చించే వారికి “సాయుజ్యము”(సహస్రారంలో దేవిని అర్చించేవారు జన్మరాహిత్యం పొందుతారు. వీరికి మరుజన్మ.ఉండదు. ఇది శాశ్వతమైన ముక్తి. సాయుజ్యం.లభిస్తాయి.)


@@@@@@@@@@

శరన్నవరాత్రులు - శ్రీ త్రిపురసుందరి

@@@@@@@@@@

దైవీ ప్రవృత్తులను కలసి అఖండ విశ్వవ్యాపక చైతన్యశక్తిని జాగృతం చేసి, లోక హింసాకారకులైన రాక్షస శక్తులన్ని నశింపజేసే విజయమే నిజమైన విజయం. మన చుట్టూ ఉన్న జగత్తులో ఆ విజయం సంభవిస్తే లోక క్షేమకరం. వ్యక్తిలో దనుజ ప్రవృత్తిని దైవీ ప్రవృత్తి జయిస్తే అది వ్యక్తికి సార్ధకత. ఈ విజయానికి సంకేతంగా జరుపుకునే పర్వదినమే ‘విజయ దశమి’.


నవరాత్రుల పూజ తరవాత దశమితో పండగలు ముగుస్తాయి. ‘నవ’ సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. తొమ్మిది పూర్ణ శక్తి. నక్షత్రాలలో మొదటిదైన ‘అశ్వని’ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసం ‘ఆశ్వయుజం’. ఒక విధంగా – నక్షత్రగణనతో ఇది సంవత్సరానికి మొదటి మాసం. ఈ తొమ్మదిరోజులు విశ్వ చైతన్య శక్తిని (పరాశక్తని – ఆదిశక్తిని) ఆరాధించేవారు పూర్ణంగా సంవత్సరారాధన ఫలాన్ని పొందుతారు. యోగపరంగా అంతర్ముఖావలోకనమే రాత్రి. ఆ సాధనలో విశ్వమంతటా వ్యాపించిన అఖండ శక్తిని గమనించ గలుగుతాం. అదే మనలోనూ సంచరిస్తోందని తెలుసుకున్నాక – మన అహంకారాలు, సంకుచిత దృష్టులూ అంతరిస్తాయి. ఆ అపరమిత శక్తినే వైష్ణవి, జగజ్జనని, శ్రీమాత, దుర్గ, లక్ష్మీ, సరస్వతి మొదలైన వివిధ నామాలతో భావించడం ఈ సాధనల విశేషం. మనలోని పరమిత శక్తిని ఆ అఖండ శక్తితో అనుసంధానం చేస్తే – ఈ వ్యష్టి చైతన్యం వ్యాప్తమై అనంతమైన శక్తులను జాగృతం చేసుకుంటుంది. ఆ శక్తిని ‘త్రిపురసుందరి’ అన్నారు. ఈ నామంలో ఎంతో వైశిష్ట్యం ఉంది. ఈ ప్రపంచమంతా ‘త్రిపురం’, ‘పురం’ అంటే చోటు అని అర్ధం. ఈ చోటు అనేది దేశకాలాత్మకం. ‘దేశం’ (స్థానం) లోకం. అదికాలానికి నిబద్ధమై ఉంటుంది. లోకం, కాలం కలిపి పురం.


ఈ విశ్వమంతా త్రిపురమే. మనమున్న చోటు నడిమిభాగం. దానికిపైన ఊర్ధ్వలోకాలు ... కింద అధోలోకాలు. ఈ ఊర్ధ్వ, మధ్య, అధోలోకాలు – మూడు లోకాలు. అలాగే భూత, భవిష్య, వర్తమానాలు. వ్యాపించిన గుణాలు సత్త్వ, రజస్తమో గుణాలు. జరిగే పనులు – సృష్టి, స్థితి, లయలు. ముగ్గురు వేల్పులు – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఓంకారం మూడు అంగాలు – అ, ఉ, మ. వేదానికి ప్రధానంగా మూడు రకాల మంత్రాలు – ఋక్, యజు, స్సామములు.


ఇలా అన్నీ ‘త్రి’పురాలే. ఇక మనలో భౌతిక, ప్రాణిక, మానసిక శక్తులు మూడు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడు. జాగ్రత్, స్వప్త సుషుప్తులు మూడు. యోగపరమైన నాడులు మూడు – ఇడా పింగళ సుషుమ్న. ఇలా బైటా, లోపలా ఉన్న ప్రపంచమంతా మూడింటితో కూడినదే. ఈ మూడింటిలో వ్యాపించిన సౌందర్యమే – త్రిపుర సుందరి.


ఇంతకీ ఏమిటీ సౌందర్యం? చైతన్యమే సౌందర్యం. ఈ చైతన్యమనే సౌందర్యమున్నప్పుడే జీవిలో ‘నేను’ అనే స్ఫురణ. అటుపై బుద్ధిశక్తి, మనశ్శక్తి, ఇంద్రియశక్తి పనిచేస్తాయి. సర్వశక్తులకు మూలం ఈ చైతన్యమే. కనుక దీనిని ‘ఆదిశక్తి’, ‘పరాశక్తి’ అని భావించారు. ఆ సౌందర్యాన్ని అమ్మా అని పిలిస్తే ‘సుందరి’. ఆ శక్తి అనుగ్రహమే అంతా అని తెలియనివాడు అంతా తన నిర్వాకమే అనుకుంటాడు. మన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలలో వ్యాపించిన ఆ శక్తిని పరాశక్తిగా గుర్తించని అజ్ఞానమే త్రిపురాసుర లక్షణం. దీనిని తొలగించాలంటే జ్ఞానోదయం కావాలి. ఆ జ్ఞానం లభించడమే త్రిపురాసుర సంహారం. త్రిపురాసుర అజ్ఞానం నశిస్తేనే త్రిపురసుందరిని తెలుసుకోగలం.


త్రి-పురా, ఈ మాటా చాలా అద్భుత శబ్ధం. ‘పురా’ అంటే చోటు అనేకాకా ‘పూర్వము’ అని కూడా అర్ధం. ఈ మూడుచోట్లు (మూడు లోకాలు, మూడు స్థితులు, మూడు కాలాలు వగైరా) కలుగక ‘పూర్వమే’ ఉంది ఆ సౌందర్యం. మూడింటికీ పూర్వమున్నదీ, మూడు నశించినా తాను నశించనిది ‘త్రిపురం’. పదార్ధంకన్నా ముందున్నది శక్తి. అందుకే అది ‘త్రిపురా’, ‘పురాణాత్ పురా’ – ‘నిండినది’ అని కూడా ‘పురా’ శబ్ధానికి అర్ధం.


త్రి కూడిని విశ్వంలో నిండినది ఇదే. ముందున్నదీ, నిండినదీ అయిన ఆ శాశ్వత చిత్ శక్తియే నిజమైన లావణ్యం. అందుకే అది ‘లలిత’ జీవరాశి అంతా ఆ శక్తినే ‘ఆశ్రయించు కున్నది, ఆ శక్తినే ‘శ్రీ’ అంటారు. ఈ శబ్ధానికి ఆశ్రయమనేకాక, శోభ, కాంతి, ఐశ్వర్యం అనే అర్ధాలున్నాయి. ఈ వివరణను చూస్తే సౌందర్యానికన్నా ఐశ్వరమేమున్నది.


చైతన్యమే లేకపోతే శోభ, కాంతి ఉండవు. అందుకే సౌందర్యలహరియే శ్రీమాత. ఈ చైతన్య శక్తిని గ్రహించి అజ్ఞానాన్ని, దుష్టత్వాన్ని తొలగించడమే దుర్గారాధన. దుర్గతి, దుష్టత్వం వీటిని సమూలంగా నాశనంచేసే దివ్యత్వమే దుర్గాదేవి..


నవదుర్గల ధ్యాన స్తోత్ర0


శైలపుత్రీ:-

 వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరామ్| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ||*


బ్రహ్మ చారిణి:-

 దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలః|దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||


చంద్రఘంట:-

 పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా|  ప్రసాదం తనుతే మహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా ||


కూష్మాండ:-

 సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ|  దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||


స్కందమాత:-

 సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా |శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||


కాత్యాయని:-

 చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||


కాళరాత్రి:-

ఏకవేణీజపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా  లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||


మహాగౌరి:-

 శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరభరా శుచిః |:మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||


సిద్ధధాత్రి:-

సిద్ధ గంభర్వ యక్షాద్యైః అసురైర మరైరపి 

సేవ్యమానా సదా భూయత్ సిద్ధిదా సిద్ధిదాయినీ | సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే 

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే ||.


హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.


గోవా, మహారాష్ట్రలలో అధికంగా ఉన్న గౌడ సారసజ్వత బ్రాహ్మణుల కులదేవత "నవదుర్గ".


గొవాలో మడికియమ్, పాలె, పోయింగ్వినిమ్, బోరిమ్‌లలోను, మహారాష్ట్రలోని రేడి, వెంగుర్ల లలోను నవదుర్గా మందిరాలున్నాయి. 16వ శతాబ్దిలో గోవా రేడి నవదురగ్ా మందిరం ప్రస్తుత మహారాష్ట్రలోని వెంగుర్లకు మార్చబడింది. నవరాత్రి ఉత్సవాలలో నవదుర్గలను పూజిస్తారు.


నవదుర్గలు:


సప్తశతీ మహా మంత్రానికి అంగభూతమైన దేవీకవచంలోనవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఇలా ఉంది.


ప్రథమం శైల పుత్రీతి


ద్వితీయం బ్రహ్మచారిణీ


తృతీయం చంద్ర ఘంటేతి


కూష్మాండేతి చతుర్థకం


పంచమం స్కందమాతేతి


షష్ఠం కాత్యాయనీతి చ


సప్తమం కాలరాత్రీతి


మహాగౌరీతి చాష్టమం


నవమం సిద్ధిదా ప్రోక్తా


నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా


ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని ఉంది. అయితే, సప్తశతీ గ్రంథంలో మాత్రం వీరి చరిత్రలను ప్రస్తావించలేదు.


నవదుర్గలు -మహిమలు


శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటేతి, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.


1. శైలపుత్రి

' వందేవాంచితలాభాయ చంద్రార్ధకృత శేఖరమ్

వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్'


సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి.


2. బ్రహ్మ చారిణి

'దధనా కరపద్మాభ్యం అక్షమాలా కమండలా

దేవీ ప్రేదతు మయీ బ్రహ్మే చారిణ్యనుత్తమా '


'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.


3. చంద్రఘంట

'పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా

ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా'


ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు 'చంద్రఘంట' యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.


ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.


4. కూష్మాండ


'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ

దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '


దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము లోని సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.


'అష్టభుజాదేవి' అని కూడా అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.


భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.


5. స్కందమాత


'సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా

శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ '


కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని 'స్కందమాత'పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, 'పద్మాసన' యనబడు ఈమెయు సింహవాహనయే.


స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.


6. కాత్యాయని


'చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా

కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ '


"కాత


్యాయనీ మాత" బాధ్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.

కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులములోని గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.


ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును.


7. కాళరాత్రి


'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా

లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ

వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా

వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ '


"కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.


కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను "శుభంకరి" అనియు అందురు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు.

కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.


8. మహాగౌరి

'శ్వేతే వృషే సమారూఢా శ్వేతంబరధరా శుచిః

మహాగౌరి శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా!'


అష్టవర్షా భవేద్గౌరీ - "మహాగౌరి" అష్టవర్ష ప్రాయము గలది. ఈమె గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును.ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళ కాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన. తన కుడిచేతులలో ఒకదానియందు అభయముద్రను, మఱియొకదానియందు త్రిశూలమును వహించియుండును. అట్లే ఎడమచేతులలో ఒకదానియందు డమరుకమును, వేఱొకదానియందు వరముద్రను కలిగియుండును. ఈమె దర్శనము ప్రశాంతము.


పార్వతి యవతారమున పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేత వర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచు "మహాగౌరి" యని వాసిగాంచెను. ఈమె శక్తి అమోఘము. సద్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగును. వారి పూర్వ సంచిత పాపములును పూర్తిగా నశించును. భవిష్యత్తులో గూడ పాపతాపములుగాని, దైన్య దుఃఖములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై, ఆక్షయముగా పుణ్యఫలములను పొందుదురు. ఈ దేవి పాదారవిందములను సేవించుటవలన కష్టములు మటుమాయమగును. ఈమె యుపాసన ప్రభావమున అసంభవములైన కార్యముల సైతము సంభవములే యగును... ఆదిత్యయోగి..


9. సిద్ధిధాత్రి

'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి

సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ


సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.


ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథములన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును.


సప్తశతి:

సప్తశతిలో -


మహాలక్ష్మి


మహాకాళి


మహాసరస్వతి


నంద


శాకంభరి (శతాక్షి)


భీమ


రక్తదంతిక


దుర్గా


భ్రామరీ


అనే వారి చరిత్రలను చెప్పారు. కానీ, వీరిని నవదుర్గలని ప్రత్యేకంగా


వ్యవహరించలేదు.


సప్తసతీ దేవతలు:

సప్తసతీ దేవతలని మరో సంప్రదాయం ఉంది. దీనిలో


నందా


శతాక్షీ


శాకంభరీ


భీమా


రక్తదంతికా


దుర్గా


భ్రామరీ


అనే ఏడుగురు సప్తసతులు. వారిగురించి సప్తశతీ గ్రంథంలో ఉంది. దీనివల్లే ఈ గ్రంథానికి సప్తసతి అని మరొక పేరు వచ్చింది... ఆదిత్యయోగి...


☸️శ్రీ చక్రం మానవ దేహం


ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి. అయినా వేటికి అవి ప్రత్యేక పని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట. మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము, పని ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి. ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే అట్టి దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు. వేదమునకు మూలము నాదము. దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి, మంత్రములుగా శక్తిని సంతరించు కున్నాయి. యంత్రమంటే ఏమిటి ?యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క (శక్తి) స్వరూపమే. ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమ వుతుంది.మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు. అవి 1) ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే ‘ఇచ్ఛ’ (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే.


ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే. నేటి శాస్త్రజ్ఞులు కూడా, ఏ పదార్థమైనా శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే. విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే ‘ప్రకృతి’ అని, ‘పరాశక్తి’ అని, ‘అవ్యక్తం’, ‘శుద్ధమాయ’ అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి, వారికి అందిస్తోంది.


శ్రీ చక్ర ఆవిర్భావం ఉండేది బ్రహ్మమొక్కటే. ఈ బ్రహ్మం సత్‌, చిత్‌, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికి,చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం. కేవలం కాంతి (ప్రకాశ) రూపముగానున్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను ‘విమర్శ’ (ఆలోచన) అన్నారు. కాంతిని పరమశివుడుగాను, విమర్శను పరాశక్తిగాను భావించారు. కాంతి (ప్రకాశ) స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలికవల్ల నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువు నందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు. దీనినే ”పరాబిందువు” అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి. దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీచక్రమునకు ఆధారము. ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ) లో రెండు పప్పులు (బద్దలు) ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువు నందు శివశక్తులొకటిగా ఉంటాయి.


శ్రీ చక్రం – పరాశక్తి వేర్వేరు కాదు, అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువు లేర్పడినవి.1) శివశక్తులొకటిగా నున్న ‘బిందువు’, 2) అచేతనంగా ఉన్న ‘శివుడు’, 3) ‘చేతనా స్వరూపమైన శక్తి’. ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వరతత్వాన్ని సూచిస్తోంది. మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం, కనీసం ఊహించలేం. కనుక శక్తి మాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది.  తదుపరి అనేక దేవీరూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీచక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థము లకు సమన్వయం కలుగుచున్నది. పరాశక్తికి శ్రీ చక్రానికి ఏ మాత్రం భేదం లేదు. శ్రీ దేవియే శ్రీచక్రము.శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది. శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది.


ఇటువంటి శ్రీవిద్యను, శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుమంది, పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవము  తెలుపుచున్నది.


శ్రీ చక్ర నిర్మాణం బిందువు, త్రికోణము, అష్టకోణచక్రము, అంతర్దశారము- బహిర్దశారమను దశత్రికోణ చక్రము, చతుర్దశారము, అష్ట దళ పద్మము, షోడశ దళ పద్మము, భూపురము అను తొమ్మిది ఆవరణము లతో కూడినది శ్రీచక్రం. శ్రీచక్రంలో ఉన్న మొత్తము త్రిభుజాల సంఖ్య 43. మొత్తము పద్మముల సంఖ్య 24. మొత్తము వృత్తముల సంఖ్య 7 (బిందువుతో కలిపి). ఈ శ్రీచక్రములోని తొమ్మిది చక్రములను (శివచక్ర, శక్తిచక్రములను) నవయోనులని వ్యవహరిస్తారు.


త్రికోణ, అష్ట కోణ, దశ కోణద్వయము, చతుర్దశ కోణములు ఐదూ శక్తి కోణములు. బిందువు, అష్ట దళము, షోడశ దళము, చతురస్రము అను నాలుగూ శివచక్రాలు. ఈ చక్రంలోని బహిర్దశార, అంతర్ద శారములను కలిపితే శ్రీచక్రము అష్టాచక్రా అవుతుంది. నవద్వారా అంటే తొమ్మిది త్రికోణములు. వాటిలో నాలుగు శివాత్మకం, ఐదు శక్త్యాత్మకం. శ్రీచక్రంలోని నవావరణములు ఆరోహణ క్రమంలో ఇలా ఉన్నాయి.


1. భూపుర త్రయం – త్రైలోక్య మోహన చక్రం,


2. షోడశ దళ పద్మం – సర్వాశా పరిపూర చక్రం,


3. అష్ట దళ పద్మం – సర్వ సంక్షోభిణీ చక్రం,


4. చతుర్దశారము – సర్వ సౌభాగ్య చక్రం,


5. బహిర్దశారము – సర్వార్థ సాధక చక్రం,


6. అంతర్దశారము – సర్వ రక్షాకర చక్రం,


7. అష్ట కోణము – సర్వ రోగహర చక్రం,


8. త్రి కోణము – సర్వ సిద్ధిప్రదా చక్రం,


9. బిందువు – సర్వానందమయ చక్రం,


ఒక్కొక్క ఆవరణలోని దేవతలను సాక్షాత్కరించు కొనుటకు కొన్ని ప్రత్యేక బీజ మంత్రములు కలవు. శ్రీదేవీ ఖడ్గమాల స్తోత్రమునందు, శ్రీదేవీ బీజాక్షర సంబోధనమ్‌, న్యాసాంగ దేవతలు, దివ్యౌఘ గురువులు, సిద్ధౌఘ గురువులు, మానవౌఘ గురువులు, తొమ్మిద ఆవరణములలోని వివిధ దేవతలు నమస్కార నవాక్షరి దేవతల పేర్లు, విడివిడిగా, విపులముగా ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు మొదటి ఆవరణలో త్రైలోక్యమోహన చక్రం, అచ్చటి దేవతలు అణిమాది సిద్ధులు. ఇవి మనలోని వివిధ రకములైన మానసిక ప్రవృత్తులు.


ఆదిపరాశక్తి శ్రీ చక్రం – మానవ శరీరం గమనించవలసిన విషయమేమంటే, ఈ జగత్తులోని సకల తత్వాలు, సకల భువనాలు, పరమశివుడు, పరాశక్తి మానవునియందు కూడా కలవు. మానవ శరీరమును రెండు భాగములుగా చూస్తే – నాభి నుండి పైభాగము ఊర్థ్వలోకమని, క్రింది భాగం అధోలోకమని, ఈ రెండింటిని కలిపే వెన్నెముకను మేరుదండమని అంటారు. శ్రీ చక్రమును కూడా మేరువు అంటాము. మేరుపర్వతము కూడా భూమికి ఇరుసు వంటిది. ఏ రకంగా పరాశక్తి దివ్యస్వరూప కాంతులచేత జగత్తంతా ప్రకాశవంత మవుతుందో, మన మేరుదండములోని కుండలినీ శక్తిచేత శరీరమంతా చైతన్యమవుతుంది.మనలో ఆత్మ ఉన్నదని అంగీకరించినట్లే మన శరీర నిర్మాణ ప్రాధాన్యం కూడా గుర్తించాలి. నవావరణాత్మకమైన శ్రీచక్రానికి, మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రం చెబుతోంది. శ్రీచక్రాన్ని ఆరాధిస్తే అన్ని దేవతా మూర్తులను ఆరాధించినట్లేనని తంత్రశాస్త్రం తెలుపుతోంది. శ్రీ అంటే శుభకర మైనది. దీనిని నవచక్రమని, వియత్‌చక్రమని, నవయోనిచక్రమని అంటారు. చక్రము ఎప్పుడూ పరిభ్రమిస్తుంది. దీనికి ఆద్యంతము లుండవు. కేంద్ర బిందువు నుండి పరిధి వరకు ఎక్కడ కొలిచిననూ సమానంగా ఉంటుంది. చక్రారాధనము ప్రతిమారాధన కన్న శక్తివంతం. మంత్రం వలె యంత్రం కూడా మహిమ గలదే.


దేహో దేవాలయః ప్రోక్తో   జీవో దేవస్సనాతనః త్యేజేదజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్‌ !


శరీరమే దేవాలయము. జీవుడే అక్కడి దేవుడు, అజ్ఞానమనే మాలిన్యాన్ని త్యజించాలి. ఆ దేవుడే నేననే భావమే పూజ. ఆ భావనతోనే అర్పించాలి. కాబట్టి సాధకుని ధ్యానము, పూజ, భావన బాహ్యము నుండి లోనికి చొచ్చుకొని పోయి ఆత్మను చేరుకోవాలి. విశ్వంలోని శక్తులన్ని ఈ నవావరణముల ద్వారా ద్యోతకమై మానవుని పంచకోశములందు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు ఇమిడి ఉన్నవి.


నిరంతర సాధన మార్గం శ్రీచక్రాన్ని మన శరీరంతో పోల్చి పరిశీలిస్తే ఆ జగన్మాత శ్రీ లలితాదేవి దర్శనం ఎంత దుర్లభమో అనిపిస్తుంది. మనలోని కర్మ, జ్ఞానేంద్రియాల వెంటపడి పరిగెత్తే మనస్సు, బుద్ధి, అహంకార, మమకారాలు, కామోద్రేకాలు, శృంగారాది నవరసాలు, జాగ్రద, స్వప్న, సుషుప్తాది అవస్థలు వీటిని నడిపే సత్వరజస్తమోగుణాలు – వీటిన్నిటిని ఆ శ్రీదేవి విభూతులుగా గ్రహించి, వీటన్నింటినీ దాటి బిందుస్థానమునకు చేరుకోగానే అచట అద్వితీయమైన, సచ్చిదానంద రూపమైన, సస్వరూపానుభవము కలుగుతుంది. అదే శ్రీమాత దర్శనం. ఇది ఎన్ని జన్మలకు సాధ్యమో!


త్రైలోక్య మోహన చక్రం నుండి సర్వానందమయ చక్రం వరకు మనం ఎక్కవల?....

మా ఆవిడ వచ్చి vote వేసి వెళ్లిపోయిందా

 ఒక  పెద్దాయన  పోలింగ్  బూత్  లో  vote  వేసి  బయటకు  వస్తూ  poling  agent  ని  ఇలా  అడిగేడు : మా  ఆవిడ  వచ్చి  vote  వేసి  వెళ్లిపోయిందా అని.


Poling  ఏజెంట్  list  లో పేరు  check  చేసి ఇలా  అన్నాడు : హా ! కొద్ది  సేపటి  క్రితం వరకూ ఆవిడ  ఇక్కడే  ఉండేది.  Vote  వేసి ఇపుడే వెళ్ళిపోయారు !


పెద్దాయన : చాలా  విచారం  గా  మొహం  పెట్టి   నేను  కొంచెం  ముందు  వచ్చి  ఉంటే  బాగుండేది . ఆవిడని  కలిసి  వుండే వాడిని  అని  అన్నాడు !


ఏజెంట్ :ఏమి  sir! Aunty  మీరు  ఒక  దగ్గర   కలిసి  ఉండటం  లేదా  అని  అన్నాడు !


పెద్దాయన:  మా  ఆవిడ  చనిపోయి  15 సంవత్సరాలు  అయింది !కాని  ఎప్పుడు   ఎన్నికలు  వచ్చిన   vote  వేసి  వెళ్ళి పోతుoది అని   అన్నాడు .


!😀😀 Indian politics