15, సెప్టెంబర్ 2024, ఆదివారం

వామన జయంతి

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*

15.09.2024,ఆదివారం


*నేడు వామన జయంతి, (ఓనం)*


కేరళ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ ఓనం (Onam). ఈ పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. తెలంగాణలో బతుకమ్మ, బోనాలు, ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి, తమిళనాట దీపావళి ఎంత ప్రసిద్ధో.. ఓనం కూడా కేరళ సంస్కృతికి ప్రతీక. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయనికి ముడిపడిన పండుగే ఓన‌ం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కేరళలోని వ్యవసాయ పండుగ.


ఓనం వేడుకల్లో భాగంగా తొలిరోజును అతమ్.. చివరి రోజున తిరు ఓనమ్ వేడుకలను నిర్వహిస్తారు. ఈ రెండు రోజులు చాలా కీలకమైనవిగా పరిగణిస్తారు.


పదవ రోజు తిరువోనం. దీనినే ఓనం ప్రధాన ఉత్సవంగా పరిగణించాలి. కుటుంబంలోని అందరు ఒకచోట చేరి కలసి పండగ జరుపుకుంటారు. *‘ఓనమ్ సద్య’* అనే ప్రత్యేక భోజనాన్నిఈ రోజున ఆరగిస్తారు, అందరికీ పెడతారు. ఈ పండుగలో పూలతో అలంకరణ, వంటకాలు, ఆటలు, సంగీతం, కేరళ ప్రత్యేక సంప్రదాయ సంబరాలు భాగంగా ఉంటాయి.


ఓన సద్యం..


ఇక ఈ పండుగ రోజున మలయాళీలు నిర్వహించే ఓనసద్యా అనే విందు చాలా ముఖ్యమైనది. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపై పలు రకాల ఆహార పదార్థాలు వడ్డిస్తారు. సంప్రదాయ ఊరగాయలు, అప్పడాలు, పాయసం, పప్పు, అన్నంతోపాటు రకరకాల పిండివంటలను చేసుకుని కుటుంబమంతా కలిసి ఆరగిస్తారు.


పాలనలో రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్థిల్లారని చెబుతారు. అందుకే రాక్షస రాజు అయినప్పటికీ బలిచక్రవర్తిని గౌరవించేవారు. బలిచక్రవర్తితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పదిరోజుల పాటూ మహాబలిని పాతళలోకం నుంచి భూమ్మీదకు అహ్వానిస్తూ జరుపుకునే పండుగే ఓనం. ఇదే వేడుగను కొన్ని రాష్ట్రాల్లో వామన జయంతిగా జరుపుకుంటారు.

యుంజన్నేవం

 

*యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః ।*

*శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగఛ్చతి ।। 15 ।।*

युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानस: |

शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति || 15||


యుంజన్ — మనస్సుని భగవంతుని యందే నిమగ్నం చేసి; ఏవం — ఈ విధంగా; సదా — ఎల్లప్పుడూ; ఆత్మానం — మనస్సు; యోగీ — ఒక యోగి; నియత-మానసః — క్రమశిక్షణ కలిగిన మనస్సు కల వాడు; శాంతిం — శాంతి; నిర్వాణ — భౌతిక బంధాల నుండి విముక్తి; పరమాం — అత్యున్నత; మత్-సంస్థామ్ — నాయందే స్థితమై ఉండి; అధిగఛ్చతి — పొందును.


*BG 6.15 : ఈ విధంగా, నిరంతరం మనస్సుని నాయందే నిలిపిఉంచుతూ, క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నా యందే పరమ శాంతితో స్థితుడై ఉండును.*


*వ్యాఖ్యానం*


ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ధ్యాన పద్దతులు ఉన్నాయి. జెన్ పద్దతులు, బౌద్ధ పద్దతులు, తాంత్రిక పద్దతులు, టావో పద్దతులు, వైదిక పద్దతులు మొదలగునవి. వీటన్నిట్లో మరల ఉప-శాఖలు ఉన్నాయి. హిందూ ధర్మాన్ని పాటించేవారిలోనే అనేకానేక రకాల పద్దతులు పాటిస్తున్నారు. క్లిష్టమైన సమస్యేమిటంటే, మన వ్యక్తిగత అభ్యాసం కోసము వీటిలో మనం ఏది పాటించాలి? అని నిర్ణయించుకోవటం. శ్రీ కృష్ణుడు ఈ చిక్కు ప్రశ్నకు సులువైన సమాధానం సూచిస్తున్నాడు. ధ్యాన విషయం భగవంతుడే ఉండాలి మరియు భగవంతుడు మాత్రమే ఉండాలని చెప్తున్నాడు.

ధ్యానము యొక్క లక్ష్యము కేవలం ఏకాగ్రతను పెంపొందించుకోవటమే కాదు, మనస్సుని పరిశుద్ధి చేసుకోవటం కూడా. శ్వాస, చక్రాలు, శూన్యం, దీపం వంటి వాటిపై ధ్యానం ఎకాగ్రతను పెంచుకోవటానికి దోహదపడవచ్చు. కానీ, మనస్సుని పరిశుద్ధి చేసుకోవటానికి ఖచ్చితంగా మనస్సుని సంపూర్ణ పరిశుద్దుడైన భగవంతును యందు నిలిపితేనే సాధ్యం. భగవంతుడు ప్రకృతి త్రిగుణముల కన్నా అతీతుడని 14.26వ శ్లోకంలో పేర్కొనబడినది, కాబట్టి, ఎవరైతే ఆయనపై మనస్సుని నిమగ్నం చేస్తారో వారి మనస్సు కూడా త్రిగుణముల కంటే అతీతంగా అవుతుంది. ఈ విధంగా, 'ప్రాణము' లపై ధ్యానం అలౌకికమైనదని అభ్యాసకులు అనవచ్చు కానీ నిజమైన అలౌకిక ధ్యానం అనేది భగవంతుని పట్ల చేసేదే ఉంటుంది.

మరైతే, భగవంతునిపైనే మనస్సు నిలిపే మార్గం ఏమిటి? మనము భగవంతుని దివ్య లక్షణములైన అన్ని - నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు, పరివారము - వీటిపై ధ్యానం చేయవచ్చు. ఇవన్నీ భగవంతుని కన్నా అభేదము మరియు ఆయన సర్వ శక్తులను కలిగి ఉన్నాయి. కాబట్టి, భక్తులు వీటిలో దేనిపైనైనా ధ్యానం చేసుకుని, భగవంతునిపై ధ్యానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. భారతదేశంలో, చాలా భక్తి మార్గాల్లో భగవన్నామమే ధ్యానానికి ఆధారంగా చేయబడింది. ఈ విధంగా రామాయణం (రామచరితమానస్) ఇలా పేర్కొంటున్నది:

బ్రహ్మ రామ తేఁ నాము బడ, బర దాయక బర దాని

‘జీవాత్మలకు ప్రయోజనకారిగా ఉండటంలో, భగవంతుని నామము భగవంతుని కన్నా గొప్పది.’ నామ ఉచ్చారణ అనేది భగవంతున్ని గుర్తుంచుకోవటానికి అత్యంత అనుకూలమైన పద్దతి, ఎందుకంటే దీనిని ఎక్కడైనా, ఎప్పుడైనా చేయవచ్చు - నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, కూర్చున్నప్పుడు, తినేటప్పుడు, ఇంకా ఏ ఇతర పని చేస్తున్నప్పుడైనా.

కానీ, చాలామంది సాధకులకు, కేవలం భగవత్ నామము మాత్రమే, మనస్సుని రంజిల్ల చేయటానికి తగినంత ఆకర్షణ కలుగచేయదు. అనంతమైన జన్మల సంస్కారముల వలన మనస్సు సహజంగానే స్వరూపముల వైపు ఆకర్షితమవుతుంది. భగవత్ రూపము ఆధారంగా చేసుకుంటే, ధ్యానమనేది సహజంగా, సులువుగా ఉంటుంది. దీనినే 'రూప ధ్యానము' అంటారు.

ఒకసారి మనస్సు భగవత్ రూపంపై కేంద్రీకృతమయితే, మనము దాన్ని, దేవుని గుణముల పై - అయన దయ, ఆయన సౌందర్యం, ఆయన జ్ఞానం, ఆయన ప్రేమ, ఆయన ఉదారత, ఆయన కృప, ఇంకా ఎన్నో... – వీటిపై చింతన చేయటం ద్వారా - మరింత ఇనుమడింపచేయవచ్చు. ఆ తర్వాత మానసిక సేవ చేయటం ద్వారా ధ్యానంలో మరింత పురోగతి సాధించవచ్చు. ఆయనకు ఆహార పదార్థములు సమర్పించినట్టు, అర్చన చేసినట్టు, ఆయనకు పాటలు పాడినట్టు, పాద సేవ చేసినట్టు, విసనకర్ర వీచినట్టు, స్నానం చేపించినట్టు, ఆయనకై వంట చేసినట్టు ఇలా భావన చేయవచ్చు. దీనిని 'మానసీ సేవా' (మనసులో భగవంతుని సేవ చేయటం) అంటారు. ఈ రకంగా, మనం భగవంతుని నామాలు, రూపాలు, గుణములు, లీలలు మొదలైన వాటిపై ధ్యానం చేయవచ్చు. ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ భగవంతుని యందే మనస్సుని నిమగ్నం చేయటానికి, శ్రీ కృష్ణుడు చెప్పిన ఉపదేశం పాటించటానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఉపకరణములే.

ఈ శ్లోకం చివరన, శ్రీ కృష్ణుడు, ధ్యానం యొక్క అత్యున్నత ప్రయోజనం ఇస్తున్నాడు, అవే, మాయా నివృత్తి, మరియు శాశ్వత ఆనందాన్ని ఇచ్చే భగవత్ ప్రాప్తి.


ఒరిజినల్ ఇంగ్లీష్ మూలం ఇక్కడ చూడండి: https://www.holy-bhagavad-gita.org//chapter/6/verse/15

అష్ట దిక్కుల గాలులు

 అష్ట దిక్కుల గాలులు - లాభ నష్టాలు . 


  గాలులు లొని రకాలు - 


     బౌగోళిక పరిస్థితులను బట్టి సూర్య చంద్రుల గమనాలని బట్టి భూమి స్వరూపాన్ని ఎనమిది దిక్కులుగా విభజించారు. అన్ని దిక్కుల నుంచి వీచే గాలులు అన్ని ఒకే రకంగా ఉండవు . ఆయా దిక్కుల స్వభావాన్ని బట్టి గాలి స్వభావం మారుతుంది . అయితే అన్నివేళలా అన్ని దిక్కుల నుండి గాలులు వీచవు. ఒక్కో రుతువులో ఒక్కో దిక్కునుండి ఒక్కో రకమైన గాలులు వీస్తాయి. వాటివల్ల మానవులు మానవులకు కొంత ఆరోగ్యము , కొంత అనారోగ్యము కలుగుతాయి. ఏ గాలులు అనారోగ్యమో , ఏ గాలులు ఆరోగ్యమో తెలుసుకోవడం ప్రతి మనిషికి అవసరం. 


  దక్షిణ దిక్కు గాలులు - 


    ఏప్రిల్ , మే నెలలలో వచ్చే వసంత మాసంలో దక్షిణ దిక్కు నుంచి గాలులు నెమ్మదిగా వీస్తాయి . ఇవి మలయ పర్వతం మీదగా వీచడం వలన ఆ పర్వతం మీద ఉన్న ఔషధాల సువాసనలు కూడా ఈ గాలులతో కలిసి వస్తాయి. ఈ మలయ పవనాలు తమ చల్లని స్పర్శతో మానవాళిని వేసవితాపం నుంచి కాపాడతాయి. ఈ గాలులని ఆస్వాదించ గలిగితే శరీరంలోని త్రిదోషాలు హరించి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ గాలిలో తీపి , చేదు , వగరు రుచులు ఉంటాయి. ఈ కాలంలో అదే స్వభావం కలిగిన ఈశాన్య గాలులు కూడా వీస్తాయి 


  నైరుతి గాలులు - 


      జూన్ , జూలై నెలలలో వచ్చే గ్రీష్మ రుతువు లొ నైరుతి దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఈ గాలుల్లో కారం రుచి ఉంటుంది. ఇవి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఈ గాలులు వాళ్ళ ఉదర రోగాలు , పైత్య రోగాలు , మేహా రోగాలు పుడతాయి. రక్త పిత్త రోగాలు కూడా పుడతాయి. ఈ నైరుతి గాలులు సకల రోగాలుకు నిలయాలు. 


  పడమర గాలులు - 


     ఆగస్ట్ , సెప్టెంబర్ నెలలలో ఉండే వర్ష ఋతువులో పడమర గాలులు వీస్తాయి . ఈ గాలులు వెగటుగా ఉండి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. అయినా గ్రీష్మ ఋతువులో నైరుతి గాలుల వలన ఏర్పడిన రక్తపిత్త వ్యాధి హరించి పొతుంది. ఎంతో కాలం నుంచి ఉన్న వివిధ వ్రణాలు మాడిపోతాయి. 


  వాయువ్య దిక్కుల గాలులు - 


   

     అక్టోబర్, నవంబర్ నెలలలో ఉండే శరత్కాలంలో వాయువ్య దిక్కు నుంచి గాలులు వీస్తాయి . ఈ గాలులలో కారం , చేదు గుణాలు ఉంటాయి. తేమ ఉండదు. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అయితే వాత వ్యాదులు కలిగించడం . వాతవ్యాదులు ఉన్నవారికి ఎక్కువ అవ్వడం ఈ గాలుల స్వభావం . కఫ రోగాలు , పైత్య రోగాలు తగ్గించి వంటిలోని చెడు నీరు తొలగించే గుణం ఈ గాలులలో ఉంది. 


  తూర్పు , ఉత్తర దిక్కుల గాలులు - 


     డిసెంబర్ , జనవరి నెలలలో ఉండే హేమంత ఋతువులో తూర్పు దిక్కున ఉండి ఉత్తర దిక్కుకు ఈ గాలులు వీస్తాయి . తూర్పు గాలులు చలువ చేస్తాయి. కాని వీటివల్ల వాత రోగాలు , కఫ రోగాలు పైత్య రోగాలు పెరుగుతాయి. వంటి నిండా నీరు పట్టే ఉబ్బు వ్యాధి ని కలిగిస్తాయి. ఉత్తరపు గాలులు కూడా చల్లగా ఉంటాయి. ఇవి కఫాన్ని , కొవ్వుని పెంచుతాయి. 


   ఆగ్నేయ గాలులు - 


  

       ఫిబ్రవరి , మార్చి నెలలలో ఉండే శిశిర ఋతువులో ఆగ్నేయ దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఇవి కూడా అమిత చల్లగా ఉంటాయి. వాతవ్యాదులని పుట్టిస్తాయి. ఉబ్బు రోగాలు , వ్రణాలు ఉన్నవారిని మరింత పీడిస్తాయి.


      మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

ఉపవాసం రకాలు

 ఉపవాసం రకాలు - సంపూర్ణ వివరణ - 3 . 


       అంతకు ముందు పెట్టిన రెండు పోస్టుల యందు ఉపవాసం రకాలు చేయు విధానం గురించి వివరించాను. ఇప్పుడు మీకు రసోపవాసం మరియు ఫలోపవాసం చేయు విధానం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరిస్తాను . 


  రసోపవాసం - తీసుకోవలసిన జాగ్రత్తలు . 


      ఉబ్బసవ్యాధులు కలిగినవారు మొదట నిమ్మరసం తాగుటకు భయపడుతుంటారు. కాని ఉపవాసంలో నిమ్మరసం త్రాగినట్లైనా ఆయాసం పెరగదు సరికదా తగ్గును. అవసరం అయినచో వేడినీటిలో నిమ్మకాయ పిండుకుని ఉదయం , సాయంత్రం వేడివేడిగా తాగవచ్చు . మధ్యహ్నం మాత్రం చన్నీటిలో తాగవలెను . 


                    ప్రేవులలో పుండు , పొట్టలో పుండు , అమీబియాసిస్ వ్యాధితో బాధపడేవారు నిమ్మరసంతో ఉపవాసం చేయరాదు . వీరు పలుచటి మజ్జిగతోగాని ఉపవాసం చేయవలెను . రోగి చిక్కి బలహీనంగా ఉన్నచో పలచని పాలతో కూడా ఉపవాసం చేయవచ్చు . 


       మూత్రపిండ వ్యాధులలో బార్లినీటితో కాని , పచ్చికొబ్బరి నీటితోగాని ఉపవాసం చేయించవచ్చు. దీనివలన మూత్రం చక్కగా విసర్జించబడి మూత్రకోశ వ్యాధులు త్వరగా నయం అగును. 


            నిమ్మకాయలు దొరకని సమయంలో ఆయా ఋతువుల్లో లభించే బత్తాయి , కమల , నారింజ రసములను పలుచగా చేసి రోజుకు 3 సార్లు ఇవ్వవచ్చు . 


   ఫలోపవాసం చేయు విధానం - 


        ఉదయం 8 గంటలకు నిమ్మరసం , 10 గంటలకు రసముగల పండ్లు , మధ్యహ్నం 3 గంటలకు నిమ్మరసం మరియు సాయంత్రం 6 గంటలకు పండ్లు తీసుకోవాలి . ఈ విధముగా ఫలోపవాసం చేయవలెను . పండ్లే కదా అని అధికంగా తినరాదు. ఫలోపవాసము నందు మంచినీరు కూడా బాగా తాగినచో మలబహిష్కరణ మంచిగా జరుగును. 


       పైన చెప్పిన విధముగా ఉపవాసము సరైన నియమాలు పాటిస్తూ చేసినచో శరీరం నందలి వ్యర్ధపదార్ధాలు అన్నియు బయటకి వెడలి శరీరముకు మంచి ఆరోగ్యం చేకూరును. ప్రతి ఒక్కరు ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధాలు తీసుకుని శరీరాన్ని శుభ్రపరచుకొనవలెను. సర్వరోగాలకు మూలకారణం మనం తీసుకునే ఆహారం కావున మన శరీరతత్వానికి అనుకూలమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకొనవలెను . 


              

             సంపూర్ణం   


  

      మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

వామన జయంతి*


*నేడు…*


               *వామన జయంతి*

                  ➖➖➖✍️


*’ధర్మ సంస్థాపనకోసం అవసరమైన సందర్భాల్లో అవతరిస్తూనే ఉంటా'నని శ్రీమహావిష్ణువు అభయ ప్రదానం చేశాడు.*

```

ఆ పరంపరలో ఆవిష్కారమైన అయిదోది వామనావతారం. భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి, కశ్యపుల కుమారుడిగా శ్రీహరి వామనమూర్తిగా అవతరించాడు.


దీనిని వామన ద్వాదశిగా, విజయ ద్వాదశిగా వ్యవహరిస్తారు.


సృష్టిలోని జీవావరణంలో జీవులు సూక్ష్మరూపం నుంచి మహా భారీకాయం వరకు వైవిధ్యభరితంగా గోచరమవుతాయి.


ఈ అణుత్వం, మహారూపాలు పరస్పర విరుద్ధమైనవి. కానీ, ఆ వైవిధ్యం ఆత్మ, పరమాత్మల విషయంలో లేదని వేదోక్తి.


ఆత్మ అణువు కంటే సూక్ష్మమైనది, మహత్తరమైనది. అది ఎంత సూక్ష్మమైనదో, అంత స్థూలమైనదని కఠోపనిషత్తు ప్రకటించింది. 


వామనావతార నేపథ్యం ఇదే!


వామనావతార విశేషాల్ని శ్రీమద్భాగవతం, వామన పురాణాలు విశదీకరిస్తున్నాయి….


ఓసారి బలి చక్రవర్తి ఇంద్రుణ్ని ఓడించి, స్వర్గానికి అధిపతి అయ్యాడు. విజయగర్వంతో రాక్షసులు అనేక అకృత్యాలకు పాల్పడసాగారు. దాంతో దేవతల మాతృమూర్తి అదితి కలత చెంది, కేశవుణ్ని వేడుకుని, అనుగ్రహాన్ని పొందింది. ఫలితంగా నారాయణుడు దేవతల రక్షణార్థం వామనుడిగా అవతరించాడు. అతనికి ఉపనయన సంస్కారాలు జరిగాయి.


బ్రహ్మ తేజస్సు, దివ్య యశస్సులతో వెలిగే వటుడైన వామనుడు దండాన్ని, గొడుగును, కమండలాన్ని ధరించి బలి చక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. 'స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు...' అంటూ బలిని ఆశీర్వదించాడు. సందర్భోచిత లౌక్యాన్ని ప్రదర్శించాడు.


వామనుడి వర్చస్సు, వాక్చాతుర్యానికి ముగ్ధుడై బలి చక్రవర్తి ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. 


'కేవలం నా పాదాలకే పరిమితమైన మూడు అడుగుల భూమిని మాత్రం నాకివ్వు చాలు' అన్నాడు వామనుడు.


ఆ వటుడి రూపంలాగానే అతడి కోరిక కూడా కురచగానే ఉందని బలి భావించాడు. భూ దానానికి సమాయత్తమైన బలిని అతడి గురువు శుక్రాచార్యుడు నిలువరించాడు.


అయినా బలి శుక్రుడి మాట వినకుండా, వామనుడికి ఉదకపూర్వకంగా భూమిని దానం చేశాడు.


త్రివిక్రముడిగా వామనుడు విరాట్‌ రూపాన్ని సంతరించుకుని, ఓ పాదంతో భూమినీ, మరో పాదంతో స్వర్గాన్నీ ఆక్రమించి, మూడోపాదం బలి శిరస్సుపై ఉంచి, అతణ్ని రసాతలానికి అణగదొక్కాడు.


బలి సర్వ సమర్పణా భావానికి ప్రసన్నుడైన వామనుడు సుతల లోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాధిపత్యాన్ని కల్పించాడు.


వామన పురాణంలో ఇదే గాథను పోలిన మరో వృత్తాంతం గోచరమవుతుంది…


దుంధుడు అనే దానవుడు దేవతలపై దండెత్తే బలాన్ని సమకూర్చుకోవడానికి దేవికా నదీ తీరాన అశ్వమేధ యాగం చేయసాగాడు.


దుంధుణ్ని యుక్తితో జయించాలని, శ్రీహరి వామన రూపంలో దేవికానదిలో ఓ దుంగలాగా తేలుతూ కొట్టుకుపోసాగాడు.


దుంధుడు, అతడి అనుచరులు ఆ బాలుణ్ని రక్షించారు. తన పేరు గతి భానుడనీ, తాను మరుగుజ్జునైనందువల్ల ఆస్తి వివాదాల్లో తనను దాయాదులు నదిలో పడవేశారని చెప్పాడు.


అతడి దీనగాథను విని దుంధుడు ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. మూడడుగుల నేల కోరిన వామనుడు ఆ సంవిధానం లోనే దుంధుణ్ని భూమిలోకి తొక్కి సమాధి చేశాడని పురాణగాథ.


వామనావతారం ఆత్మ తత్వాన్ని అద్భుతంగా ప్రకటించింది. జీవుడు తనలో ఉన్న ఆత్మ, విశ్వాంతరాళంలో ఉన్న పరమాత్మ ఒక్కటేనని జ్ఞానపూర్వకంగా గుర్తించాలి.


ఆ స్పృహ ఏర్పడే కొద్దీ వామనరూపం అనూహ్యంగా పెరిగి పెద్దదై, విశ్వవ్యాప్తమై, పరమాత్మ తత్వమై భాసిల్లుతుంది.


యజ్ఞయాగాదులనేవి పేరుకోసం చేయవద్దనీ, నేను ప్రభువును, నేను గొప్ప దాతనని గర్వించడం తగదని భగవద్గీత హెచ్చరించింది


పరుల ధనాన్నీ, భూమిని ఆక్రమించడం, దానం చేయడం, నేను కర్తను, భోక్తను అని విర్రవీగేవారు అజ్ఞానులని ఈశావాస్య ఉపనిషత్తు చెబుతోంది.


ఈ నేపథ్యమే బలి పతనానికి దారి తీసింది. మనిషి బిందు స్థితిలో బీజప్రాయంగా నిద్రాణంగా ఉన్న శక్తిని ఆత్మవిశ్వాసంతో గుర్తించాలి. దీని ద్వారా మనిషి మహనీయుడిగా ఎదగవచ్చని వామనావతారం సందేశమిస్తుంది.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440889636

లింక్ పంపుతాము.దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు🙏

*శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


*తనువే నిత్యముగానొనర్చు మది లేదా, చచ్చి జన్మింపకుం*

*డనుపాయంబు ఘటింపుమీ గతులరెంటన్నేర్పు లేకున్న లే*

*దని నాకిప్పుడెచెప్పు; చేయఁగల కార్యంబున్న సంసేవఁజే*

*సి నినుం గాంచెదఁగాక కాలముననో శ్రీకాళహస్తీశ్వరా!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 37*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నాకు ఈ తనువును శాశ్వతమొనర్పుము, లేక మఱొక్క జన్మమైనా లేకుండుగా నిశ్చయించుము.... ఈ రెండు పనులు చేయకున్న నాకు నీ పాద నిరంతరధ్యానము ఎబ్భంగి (ఎల్లప్పుడూ) కలుగునో వచింపు ప్రభో!*


✍️🌺🌷🌹🙏

*ఉత్తర కర్ణాటక : ఇడగుంజి*

 🕉 *మన గుడి : నెం 440*


⚜  *ఉత్తర కర్ణాటక : ఇడగుంజి* 


⚜ *శ్రీ





ఇడగుంజి గణపతి క్షేత్రం*



💠 ఇడగుంజి గణపతి క్షేత్రం

అష్టవినాయక క్షేత్రాలలో ఒకటి.

ఇడగుంజి గణపతి కలియుగ కల్పతరువు,

ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర సమీపంలోని

ఇడగుంజిలోని వినాయకుడు అత్యంత

శక్తివంతమైన దేవుడిగా భక్తుల భావిస్తారు.


💠 స్కందపురాణంలోని సహ్యాద్రి ఖండంలో ఈ క్షేత్ర ప్రాముఖ్యత గురించి ప్రస్తావించబడింది.  'ఎడ' అంటే 'ఎడమవైపు' మరియు 'కుంజ్' అంటే తోట. శరావతి నది ఎడమ ఒడ్డున ఉన్నందున ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. 

ఈ గ్రామం ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఉంది. శరావతి నది అరేబియా సముద్రంలో కలిసేచోట ఈ ఆలయం ఉంది.


💠 ఈ ఆలయంలోని గణపతిని ద్విభుజాలు కలిగి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి.

 ఏ పెళ్లిని తలపెట్టినా  అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే.  అందుకే కొందరు భక్తులు కర్నాటకలోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు.


💠 కర్నాటకలోని బంధి అనే జాతివారు ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు,

పెళ్లికొడుకుకి చెందిన కుటుంబాలవారు

ఈ ఆలయానికి చేరుకుంటారు.

అక్కడ వినాయకుని రెండు పాదాల చెంత  రెండు చీటీలను ఉంచుతారు.

కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే

దానిని శుభసూచకంగా భావించి_ వినాయకుని అనుగ్రహంగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. 

అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు


💠 ఇడగుంజి ఆలయంలో మూలవిరాట్టైన

వినాయకుడు చూడముచ్చటగా కనిపిస్తాడు. 

సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. 

ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం.


💠 ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలోని గణపతికి ఇక్కడ రెండు దంతాలు ఉంటాయి.

అంతే కాదు అన్ని చోట్ల గణపతి కడుపుకు నాగుపాము చుట్టుకుని ఉంటుంది.

కానీ, ఇక్కడ ఉండదు. 

అలాగే నాగ యజ్ఞోపవీతం ధరించి ఉండటం

పలు విగ్రహాలకు గమనించి ఉంటాము. 

అలాగే ఇచట గణపతి ద్విభజాలతో ఉంటారు.

రెండు చేతుల గణపతి ఒక చేతిలో పద్మం మరో చేతిలో లడ్డూతో కనబడుతాడు.

ప్రపంచంలోనే ద్విభుజ గణపతి దేవుడు ఇక్కడే.


💠 పురాణ కథనం ప్రకారం మహాభారత రచనకు గణపతి ఆగని గంటం కోసం తన దంతాన్నే ఉపయోగించారని ప్రతీతి. 

అంటే.. ఇక్కడి గణపతి అంతకు పూర్వమే ఉన్నారన్నమాట.


💠 భక్తుల నమ్మకం మేరకు భగవంతుడు ఆ ప్రాంతాన్ని కుంజారణ్యగా పిలువబడినపుడు అక్కడ ఉండేవాడని చెపుతారు. 

ప్రాచీన కాలంలో ఋషులు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకొనేవారు.


🔆 *స్థలపురాణం* 🔆


💠 ద్వాపర యుగం ముగిసే సమయానికి కృష్ణుడు భూమిని విడిచిపెట్టబోతున్నాడు కాబట్టి అందరూ కలియుగ ఆగమనాన్ని భయపడ్డారు . 

కలియుగం యొక్క అన్ని అడ్డంకులను అధిగమించడానికి కృష్ణుడి సహాయం కోరుతూ ఋషులు తపస్సులు మరియు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. 


💠 వాలఖిల్య నేతృత్వంలోని ఋషులు కర్నాటకలోని శరావతి నది ఒడ్డున అరేబియా సముద్రంలో కలుస్తున్న అటవీ ప్రాంతమైన కుంజవనంలో క్రతువులు ప్రారంభించారు. 

ఈ సమయంలో, అతను యాగం చేయడంలో చాలా అడ్డంకులు ఎదుర్కొన్నాడు.

అందువల్ల, అతను సమస్యను పరిష్కరించడానికి తగిన మార్గాలను అన్వేషిస్తూ నారదుని సలహా కోరాడు .


💠 నారదుడు వాలఖిల్యకు తన యాగాన్ని పునఃప్రారంభించే ముందు అడ్డంకులను తొలగించే గణేశుని ఆశీర్వాదం పొందమని సలహా ఇచ్చాడు. 

ఋషుల అభ్యర్థన మేరకు, నారదుడు వినాయకుని జోక్యాన్ని కోరుతూ కుంజవన వద్ద శరావతి నది ఒడ్డున వ్రతం కోసం ఒక స్థలాన్ని ఎంచుకున్నాడు. 

భూమిని నాశనం చేయడంలో పాల్గొన్న రాక్షసులను అంతం చేయడానికి  త్రిమూర్తులు ( బ్రహ్మ , విష్ణు, శివుడు ) కూడా ఈ స్థలాన్ని గతంలో సందర్శించారు. 


💠 దేవతలు ఆ సమయంలో చక్రతీర్థం మరియు బ్రహ్మతీర్థం అనే పవిత్ర సరస్సులను కూడా సృష్టించారు. 

నారదుడు మరియు ఇతర ఋషులు దేవతీర్థం అనే కొత్త పవిత్ర చెరువును సృష్టించారు. నారదుడు దేవతలను ఆహ్వానించి వినాయకుని తల్లి పార్వతిని గణేశుడిని పంపమని వేడుకున్నాడు. పూజలు నిర్వహించి గణేశుడిని కీర్తిస్తూ కీర్తనలు పఠించారు. 

వారి భక్తికి సంతోషించిన గణేశుడు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆచారాలను నిర్వహించడంలో సహాయపడటానికి స్థలంలో ఉండటానికి అంగీకరించాడు. 


💠 ఈ సందర్భంగా, ఆలయానికి నీటిని తీసుకురావడానికి మరో సరస్సు కూడా సృష్టించబడింది మరియు దానికి గణేశ-తీర్థం అని పేరు పెట్టారు. అదే ప్రదేశాన్ని ఇప్పుడు ఇడగుంజి అని పిలుస్తారు.


💠 మురుడేశ్వర (19km), గోకర్ణ (68km),

మూక పంచశతి

 శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన

పాదారవిందశతకం

🙏🌸🙏🙏🙏🌸🙏

శ్లోకము:-

విరావైః మాంజీరైః కిమపి. కథయంతీవ మధురం.                       

పురస్తా దానమ్రే 

పురవిజయినీ స్మేరవదనే |

నయస్యేవ ప్రౌఢా 

శిథిలయతి యా ప్రేమకలహ

ప్రరోహం కామాక్ష్యాః 

చరణయుగలీ సా విజయతే ||8||

 

భావము:

ప్రణయ కలహంలో అపరాధియైన శివుడు నవ్వుతూ దేవి చరణ సన్నిదిలో తలవంచగా, ప్రౌఢురాలఇన చెలికత్తెలా దేవిచరణాలు ధ్వనిస్తున్న అందెలతో మధురంగా మాట్లాడి ప్రణయ కలహాన్ని తొలగిస్తున్నాయి. ఆ చరణాలకు విజయం కలుగుతుంది.

 

*********************************

సెప్టెంబర్,15, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        🌞 *ఆదివారం*🌞

🌹 *సెప్టెంబర్,15, 2024*🌹

     *దృగ్గణిత పంచాంగం*                  


        *ఈనాటి పర్వం*

      *వామన జయంతి*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం -   శుక్లపక్షం*


*తిథి     : ద్వాదశి* సా 06.12 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : శ్రవణం* సా 06.49 వరకు ఉపరి *ధనిష్ఠ*


*యోగం  : అతిగండ* మ 03.14 వరకు ఉపరి *సుకర్మ*  

*కరణం  : బవ* ఉ 07.31 *బాలువ* సా 06.12 ఉపరి 

*కౌలువ* తె 04.44 వరకు ఆపైన *తైతుల*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 07.00 - 10.00 మ 02.00 - 04.00*

అమృత కాలం  :*ఉ 09.10 - 10.39*

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.27*


*వర్జ్యం   :  రా 10.26 - 11.53*

*దుర్ముహూర్తం:సా 04.31 - 05.20*

*రాహు కాలం: సా 04.37 - 06.09*

గుళికకాళం      : *మ 03.06 - 04.37*

యమగండం     : *మ 12.02 - 01.34*

సూర్యరాశి : *సింహం* 

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 05.56* 

సూర్యాస్తమయం :*సా 06.09*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.56 - 08.22*

సంగవ కాలం   :*08.22 - 10.49*

మధ్యాహ్న కాలం:*10.49 - 01.16*

అపరాహ్న కాలం:*మ 01.16 - 03.42*

*ఆబ్ధికం తిధి:భాద్రపద శుద్ధ ద్వాదశి*

సాయంకాలం  :  *సా 03.42 - 06.09*

ప్రదోష కాలం   :  *సా 06.09 - 08.30*

రాత్రి కాలం     :  *రా 08.30 - 11.39*

నిశీధి కాలం      :*రా 11.39 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.09*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    🌞 *||సూర్యమండలాష్టకం||*🌞


యన్మణ్డలం జ్ఞానఘనం త్వగమ్యం త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపమ్ ।

సమస్త తేజోమయ దివ్యరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ ౪ ॥ 


🌞 *ఓం సూర్యాయ నమః*🌞


🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>      


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌞🌞🌹🌷

 🌹🍃🌿🌞🌞🌿🍃🌹

మహాలయ పక్షం

 మహాలయ పక్షం ప్రారంభం , మహాలయ పక్షం అంటే ఏమిటి ? మహాలయ అమావాస్య ఎప్పుడొస్తుంది?*


(సెప్టెంబర్ 18 వ తేది  నుండి అక్టోబర్ 2 వ తేది వరకు ఈ 15 రోజులను మహాలయ పక్షం అంటారు.)




మహాలయ పక్షం ఈనెల సెప్టెంబర్ 18 న ప్రారంభమై అక్టోబర్ 2 వ తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి , మీ పితృదేవతలను స్మరించి , వారికి నమస్కారము చేస్తూ ,  *నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి , మీ దీవెనలు అందచేయండి’* అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు. 


భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో , బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని , మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో , ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.


తండ్రి జీవించి , తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ , శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య (అక్టోబర్ 2 వ తేది) నైనా చేసి తీరాలి.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - వర్ష ఋతువు - భాద్రపద మాసం - శుక్ల పక్షం - ద్వాదశి - శ్రవణం -‌‌ భాను వాసరే* (15.09.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

హైందవం వర్ధిల్లాలి

 *హైందవం వర్ధిల్లాలి*


భారతీయ సంస్కృతికి మూలాధారమైన హిందూ సంస్కృతి అంతరిస్తుందని అనను, అనలేను గాని, తగ్గుచున్నదన్న భావన కలుగుతుందని మాత్రము చెప్పగలను. 


ఉదారము, నిర్మలమైన హిందూ *వైదిక ధర్మమును*  జాతి జనులెల్లరు మనసా, వాచా, కర్మణా అనుసరించకపోవడం వల్లనే జాతి దుర్భలమై, సంఘటిత శక్తి కొరవడి ఇబ్బందులకు గురవుతున్నది.  *వైదిక ధర్మమంటే.... వేద ప్రొక్త ధర్మమే వైదిక ధర్మము*. అదే సనాతన ధర్మం.


*ఇతర మతముల, ధర్మముల ఆవిర్భానికి ముందే వైదిక ధర్మము లోకమంతటికీ మేలు చేసే మార్గం ఉపదేశించిందన్న  సత్యం విశ్వ వ్యాప్తం*.


 ఇతర మత గ్రంథాలన్ని వేదముల అనంతరమే వెలుగు చూసాయి. ఇది చారిత్రక సత్యము. జనులందరు వేదముల యందు  భక్తి కల్గి, వేద విహితమైన మార్గాన్ని అనుసరించాలి. 


ఏ మతమైనా, ధర్మమైనా అనుష్ఠించడం వలననే సజీవంగా ఉంటాయన్న సత్యం మరువరాదు. కావున జనులెల్లరు (కుల, వర్గ రహితంగా) ప్రత్యేక శ్రద్ధతో హైందవ సంప్రదాయ అనుష్టాన పరులు కావాలి. పెద్దలు  బోధించిన, పొందుపర్చిన ధర్మాలు ఆచరిస్తూ ఉండాలి. 


భారత దేశంలో రాష్ట్రాలు, భాషలు వేరైనా, సంస్కృతులు, సంప్రదాయాలు విభిన్నమైనా  దేశమంతా సమైక్యంగా ఉండాలంటే నిర్దేశించబడిన హిందూ జీవన విధానాన్ని హిందువులందరు అనుసరించాలి. హిందూ జీవన ప్రమాణాలలో ముఖ్యమైనవి.... *సత్సంస్కారం, నైతికత, సత్ప్రవర్తన, సత్యవాక్య పరిపాలన, శౌచాది ధార్మిక నిష్ఠ*  మున్నగునవి.


ఈ అధునాతన కాలంలో  *పాశ్చాత్య పోకడల ప్రభావాలకు లోనై అధికులు శాస్త్ర నిషిద్దమైన మార్గాలను అనుసరించి, పాపాలను మూట కట్టుకోవడమే గాకుండా, హిందూ మత వ్యతిరేక  ధర్మాలను బలపరుస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఇందువల్ల జాతి భ్రష్టు పట్టు అవకాశములు మెండు. ఇటువంటి చర్యల వలన మన భవిష్యత్ తరాలను మనమే తప్పుత్రోవ వైపు మళ్లిస్తునామన్న భావన కలుగుతుంది* కావున హిందూ  ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి.


ధన్యవాదములు.

*(సశేషము)*

_సెప్టెంబరు 15, 2024_* 🌝

 ॐ 卐 ॐ 

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

🌞 *_సెప్టెంబరు 15, 2024_* 🌝

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*వర్ష ఋతువు*

*భాద్రపద మాసం*

*శుక్ల పక్షం*

🔔తిథి: *ద్వాదశి* మ3.01

🔯వారం: *భానువాసరే*

(ఆదివారం)

⭐నక్షత్రం: *శ్రవణం* సా4.57

✳️యోగం: *అతిగండ* మ2.20

🖐️కరణం: *బాలువ* మ3.01

*కౌలువ* రా2.07

😈వర్జ్యం: *రా8.46-10.17*

💀దుర్ముహూర్తము: *సా4.24-5.13*

🥛అమృతకాలం: *ఉ6.52-8.25*

👽రాహుకాలం: *సా4.30-6.00*

👺యమగండం: *మ12.00-1.30*

🌞సూర్యరాశి: *సింహం*

🌝చంద్రరాశి: *మకరం*

🌄సూర్యోదయం: *5.50*

🌅సూర్యాస్తమయం: *6.03

   🙏 *వామన జయంతి* 🙏

 👩‍🔬 *ఇంజనీర్స్ డే* 👨‍🔬

ఇరగవరపు రాధాకృష్ణ🙏

14, సెప్టెంబర్ 2024, శనివారం

మత్తకోకిల

 *మత్తకోకిల*


*తల్లిదండ్రుల సేవయందున  తన్మయత్వము నొందుమా*

*యెల్లకాలము వారి దీవెన యీప్సితంబును తీర్చుగా* 

*పిల్లలందున తల్లిదండ్రుల ప్రేమ యెప్పుడు తగ్గునా*

*కల్లకాదిది యెల్లవారికి కార్యమేదియు చేసినన్*

*చల్లనైనది వారిచూపని సాగిపొమ్మిక మిత్రమా*



*పద్య కవితా శిల్పకళానిధి* 

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి* 

*పాఠశాల సహాయకులు* *(తెలుగు)*

తెలుగు భాషలో

 *ఇప్పటి వరకు గణితంలో చూసిన గమ్మత్తును తెలుగు భాషలో చూడండి.* 


మూడింటిని #నిలువుగాను, #అడ్డంగాను చదివి చూడండి. ఎటు చదివినా అవే పదాలు వస్తున్నాయి చూడండి!


స మ త

మ జ్జి గ

త గ ము


కం చ ము

చ క్కె ర

ము ర ళి


క్షీ ర ము

ర వ్వ లు

ము లు కు


కా ను పు

ను వ్వు లు

పు లు లు


కా ర ము

ర గ డ

ము డ త


స మ త

మ ర ల

త ల పు


త మ కం

మ ర్యా ద

కం ద కం


పొ ల ము

ల లి త

ము త క


ధ న ము

న వ్య త

ము త క


వ ర స

ర వి క

స క లం


హి మ జ

మ న ము

జ ము న


క వి త

వి న ల

త ల క


కో వె ల

వె న్నె ల

ల ల న


మ న సు

న య నం

సు నం ద


ది న ము

న గ రి

ము రి కి


టో క రా

క వ్వ ము

రా ము డు


చ దు వు

దు ర ద

వు ద కం


ప్ర వే శం

వే ది క

శం క రం 

అందమైన మన మాతృభాషను ఆస్వాదిద్దాం