14, సెప్టెంబర్ 2024, శనివారం

మత్తకోకిల

 *మత్తకోకిల*


*తల్లిదండ్రుల సేవయందున  తన్మయత్వము నొందుమా*

*యెల్లకాలము వారి దీవెన యీప్సితంబును తీర్చుగా* 

*పిల్లలందున తల్లిదండ్రుల ప్రేమ యెప్పుడు తగ్గునా*

*కల్లకాదిది యెల్లవారికి కార్యమేదియు చేసినన్*

*చల్లనైనది వారిచూపని సాగిపొమ్మిక మిత్రమా*



*పద్య కవితా శిల్పకళానిధి* 

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి* 

*పాఠశాల సహాయకులు* *(తెలుగు)*

కామెంట్‌లు లేవు: