భాగవతులు -- ఆముక్తమాల్యద
సీ. పరమ పావనులైన పురి భాగవతులట
భాగవతుల గాంచి పరవశించి
యెదురుగా తామేగి మృదువచనములతో
వినయమ్ము తోడను వినుతి చేసి
పాద్యంబు నిచ్చియు బహుభక్తి తోడుత
కొబ్బరాకుల చాప కూర్మి వేసి
అద్దానిపై ప్రీతి నతిథుల నునిచియు
నునుపోకమట్టచే ననువు నున్న
సరియైన దొన్నెలన్ సంసిద్ధ పరచియు
న్నరటి యాకందున నతిథితతికి
నన్నమ్ము పప్పును నాజ్యధారలు బహు
వ్యంజనంబులు మధు ఫలరసాలు
క్షీర దధులతోడ క్షీరాన్నముల తోడ
నాహారమును బెట్టి యమిత భక్తి
భుజియించి నంతట భోక్తల కంతట
యంఘ్రిసంవాహన మాచరించి
తే.అడిగి క్షేమంబు వినయాన విడియ మిచ్చి
యతిథి పోయెదనన్న తా మనుసరించి
భక్తి నొసగియు తగిన సంభావనమ్ము
విడువ లేకను వీడ్కోలు నిడుచు నుంద్రు.
సరళ పద్యానుసరణ :
గోపాలుని మధుసూదనరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి