హరిః ఓం నమః.
దత్తపది : కాక., తాత., మామ., పాప.... రామాయణార్థంలో...పూరణం.
సీ ll మామ మారీచుని మాట మన్నింపక
దానవేంద్రుడు వంశహీనుడయ్యె
తమ్ముని భార్యను తా తమకమునపొంది
ప్రాణము గోల్పడె వానరపతి
కాకుత్స రాముని కామించి శూర్పణఖ
నాసికా కర్ణముల్ బాసి చనియె
పాపచిత్తముతోడ పడతి నహల్యనుకూడి
భ్రష్ఠత్వ మొందె త్రివిష్టపపతి
తే ll కామకల్మష వాసన గ్రమ్ముకొనగ
పాప పుణ్యము లెంచరు పతితులగుచు
ధర్మహీనులు మసలుచు దైత్యులట్లు
ముందుగతి జూడజాలరు మందమతులు ll
---- పరమహంస ----
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి