13, ఫిబ్రవరి 2025, గురువారం

శయన నియమాలు

 శయన నియమాలు


1. నిర్మానుష్యంగా, నిర్జన  గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు ( మనుస్మృతి)


2పడుకొని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు ( విష్ణుస్మృతి)


3. విద్యార్థి,నౌకరు,మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో,వీరిని మేల్కొలపవచ్చును ( చాణక్య నీతి)


4. ఆరోగ్యవంతులు  ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి( దేవీ భాగవతము).

పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు (పద్మ పురాణము)


5. తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది( అత్రి స్మృతి)

 విరిగిన పడకపై,ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం ( మహాభారతం)


6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు( గౌతమ ధర్మ సూత్రం)


7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య,పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని,మృత్యువు.ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము,ఆయువు ప్రాప్తిస్తుంది( ఆచార మయూఖ్ )


8. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసం లో  1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.పగటిపూట నిద్ర రోగహేతువు,మరియు ఆయుక్షీణత  కలుగచేస్తుంది.


9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు( బ్రహ్మా వైవర్తపురాణం)


10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే పడుకోవాలి.


11.ఎడమవైపు పడుకోవడం వలన  స్వస్థత లభిస్తుంది.


12.దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు యముడు మరియు దుష్ట గ్రహముల  నివాసము వుంటారు.దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.


13.గుండెపై చేయి వేసుకుని, చెట్టు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.


14.పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.


15. పడుకొని పుస్తక పఠనం  చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది.)


ఈ నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి,మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు

జీవితం అంటే

 వృద్ధాప్యంలోనూ యవ్వనమై ఉన్న జీవితం


గోదావరి తీరంలోని ఒక చిన్న గ్రామంలో వెంకటరెడ్డి, లక్ష్మమ్మ దంపతులు నివసించేవారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు నిశ్చయించిన పెళ్లి, అదృష్టం కొద్దీ ఒకరినొకరు అర్థం చేసుకున్న దాంపత్య జీవితం, పిల్లల పెంపకం, బాధ్యతల నడుమ కాలం ఎలా గడిచిందో తెలియలేదు.


వయస్సు పెరిగేకొద్దీ పిల్లలు పెద్దవాళ్లయ్యారు, వాళ్లు వాళ్ల జీవితాల్లో స్థిరపడ్డారు. కొంతకాలానికి ఇద్దరూ మాత్రమే మిగిలిపోయారు. కానీ, వెంకటరెడ్డికి ఒక ప్రత్యేకమైన గుణం ఉండేది – జీవితాన్ని అతి తేలికగా తీసుకునే స్వభావం.


"లక్ష్మమ్మా, మన జీవితానికి ఎప్పుడైనా లక్ష్యాలు పెట్టుకున్నామా? ఏమైనా సాధించాలన్న కోరికలు పెట్టుకున్నామా?"


ఆమె నవ్వుతూ, "ఇద్దరూ కలిసుండటమే మాకు గొప్ప సాధన" అని చెప్పేది.


మరుపు, నడకలో బలహీనత, ఆరోగ్య సమస్యలు – ఇవన్నీ వచ్చాయి. కానీ, వారి మనసులో మాత్రం వృద్ధాప్యం ఆవరించలేదు. ఎందుకంటే, వాళ్లకు ఏ ఆశలూ, కోరికలూ లేవు. భగవంతుడు ఎలా నడిపిస్తాడో అలా ముందుకు సాగుతూ, "మనకు ఏం అవసరం, ఏం కోల్పోయాం" అనే ఆలోచనే లేకుండా జీవించారు.


ఒక్కోసారి ఊర్లో వాళ్లు అడిగేవారు, "నాయనా, మీకు పిల్లలు పట్టించుకోవడం లేదా?"


వెంకటరెడ్డి ఆహ్లాదంగా నవ్వేవాడు, "భగవంతుడు పెట్టాడు, ఆయనే చూసుకుంటాడు! పిల్లలు, మనమంతా కేవలం నిమిత్తమాత్రులం."


ఈ భావనతోనే, వారు నిత్యం నవ్వుతూ, చిన్న చిన్న విషయాల్లో సంతోషాన్ని వెతుక్కుంటూ, బడలిక లేకుండా జీవించారు. వృద్ధాప్యం అంటే బాధ అనుకునే వాళ్లకూ, ఈ జంట జీవన విధానం ఒక సందేశంగా మారింది. వాళ్లను చూసిన వారందరూ ఆశ్చర్యపోయేవారు – వెంకటరెడ్డి, లక్ష్మమ్మ వయసు మీద పడినప్పటికీ బాల్య ఉత్సాహంతో ఉండేవారు.


ఒక రోజు ఒక యువకుడు అడిగాడు, "తాతయ్యా, మీలో ఈ నవ్వు ఎక్కడిది?"


ఆయన మెత్తగా నవ్వి చెప్పాడు – "మనసును బాధల నుండి స్వచ్ఛంగా ఉంచితే వయసు ఏమీ కాదు బాబు! మనం బాల్యంలో ఎలా నిర్లక్ష్యంగా ఆనందంగా ఉండేవాళ్లమో, అలాగే ఉండాలి. అప్పుడే వృద్ధాప్యమూ, క్షీణతా తాకదు."


ఆరోజు ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్ళినప్పటికీ, వెంకటరెడ్డి మాటలు వేదాంతమై పదిలమైపోయాయి.


"జీవితం అంటే తీపి-వగరు కలిసిన స్వాదం. ఏది ఎక్కువగా అనిపిస్తుందో అది మన దృష్టినే కాదు, మన జీవితాన్నీ నిర్ణయిస్తుంది."

పోతన - భాగవతం 🙏

 🙏   పోతన - భాగవతం 🙏

                ఐదవ భాగం 


దితికి హిరణ్యకశిపుని హితబోధ- అమ్మా! ఉశీనర దేశానికి సుయజ్ఞుడు రాజు. అతడు శత్రువీరులతో వీరోచితంగా పోరాడుతూ యుద్ధంలో వీరమరణం పొందాడు. అతని నిడుపైన చేతులు తెగి నేలమీద ఎడంగా పడి ఉన్నాయి. శోణితం (నెత్తురు) చేత క్షోణి (భూమి) తలమంతా తడిసిపోయింది. తెగిపడిన తలజుట్టు ముడి విడిపోయింది. దివంగతుడైన ఆ భూపతి శవం చూసి భయాక్రాంతలైన అతని కాంతలు (రాణులు), బిడ్డలు, బంధువులు చుట్టుముట్టి హృదయ విదారకంగా రోదిస్తున్నారు. అవనీపతి (రాజు) అంత్యక్రియలకు అడ్డుపడుతూ, అంగలారుస్తూ అలమటిస్తున్నారు. ఇంతలో ఆదిత్యుడు అస్తమించే వేళ అయింది. ఆ సమయంలో వారి భీకర రోదన విని సమవర్తి, సంయమ చక్రవర్తి అయిన యమధర్మరాజు బాలవేషంలో వచ్చి నొచ్చుకుంటున్న ఆ ప్రేత బంధువులకు ఇలా

నచ్చచెప్పాడు.


ఉ॥ మచ్చిక వీరికెల్ల బహుమాత్రముఁ జోద్యము, దేహి పుట్టుచుం

జచ్చుచునుండఁ జూచెదరు, చావక మానెడు వారిభంగి నీ

చచ్చిన వాని కేడ్చెదరు? చావున కొల్లక డాఁగవచ్చునే?

యెచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్‌


ఆహా! ఏమి ఈ మోహ మహిమ? ఇదెంత ఊహాతీతం! మీరెంత అజ్ఞానులు! మేను (దేహం) మీద మక్కువను ఇంత ఎక్కువగా పెంచుకొని కాలం తీరినవారి కోసం ఈ తీరున భోరున విలపించడం మిక్కిలి వింతగా ఉంది. ప్రాణులకు చావు పుట్టుకలు అపరిహార్యాలు- తిరుగులేనివి, తొలగించుకోజాలనివి. మీరు ప్రతినిత్యం కనేవి, వినేవే గాని ఎరుక లేనివేమీ కాదు కదా! ఈ మట్టి మీద పుట్టి గిట్టని వాడున్నాడా? సతులారా! మీకు మాత్రం అసలు మృతే (చావే)లేనట్లు మరణించిన వారికోసం ఇలా మతిలేకుండా ఇంతగా అతిగా వెత చెందుతున్నారు. చావుకు చిక్కకుండా ఎంచక్కా నక్కి (దాగి) ఉండేవాడు ఎక్కడైనా ఒక్కడన్నా ఉన్నాడా? ఎట్టి ప్రాణికైనా పుట్టిన చోటికి పోవడం ప్రకృతి సిద్ధమే కదా! జీవులకు పరమాత్మ స్వగృహం, ప్రపంచం పరగృహం!


ఆ॥ ధనము వీధి బడిన దైవ వశంబున

నుండుఁ బోవు మూలనున్న నైన

నడవి రక్షలేని యబలుండు వర్ధిల్లు

రక్షితుండు మందిరమునఁ జచ్చు!


బంధువులారా! నిధి (ధనం) నడివీధిలో జారిపడినా విధి (దైవ యోగం) వక్రించకుండా ఉంటే అది సడి-సవ్వడి లేకుండా పడినచోటే భద్రంగా ఉంటుంది. గీత-రాత చెడిపోతే గృహంలో గుట్టుగా దాచిపెట్టినా రట్టయి మట్టుమాయమై పోతుంది. రక్షణలేని దుర్బలుడైనా పుష్కరాక్షుని- భగవంతుని కృపావీక్షణం ఉంటే వనం- అడవిలో కూడా సులక్షణంగా వర్ధిల్లుతాడు. మాతృగర్భంలో అర్భకుని పోషించే హిరణ్యగర్భుని ఈ సందర్భంలో స్మరించుకోవాలి. వాని దయ లోపిస్తే ఎంత పదిలమైన భద్రత ఉన్న సదనం (గృహం)లో ఉన్నా నిధనం (మరణం) నిశ్చయమవుతుంది.


పై ఆటవెలది పద్యం మూలశ్లోకానికి దీటుగా సాగిన పోతనగారి ముచ్చటైన అనువాదం. పంచభూతాల సమూహమైన ఈ దేహం ఒక గేహం (గృహం) లాంటిది. ఇందు మోహంతో మురిసిపోతూ మసలుతూ ఉండే జీవుడు ప్రారబ్ధం తీరిపోగానే పయనమైపోతాడు. దేహం అనిత్యం, దేహి (ఆత్మ) నిత్యం. అరణి (కట్టె)లో దాగి ఉన్న అగ్నివలె, గాత్రం (దేహం)లో సంచరించే గాలివలె, బిసము (తామరతూడు)లో ఉన్న ఆకసం (శూన్యం, అవకాశం) వలె దేహంలో దేహి వేరుగా- అంటకుండా, విలసిల్లుతుంటాడు.


బ్రాహ్మణ బాలక రూపంలో ఉన్న యముడు బేలలై విలపిస్తున ఆ బాల (స్త్రీ)లకు ఇంకా ఇలా బోధించాడు- ఈ భూపాలకుడు (రాజు) నిద్రిస్తుంటే వెర్రి పట్టినట్లు విలపిస్తారేమిటి? ఇప్పటివరకూ అంటూ, వింటూ, కంటూ, తింటూ, మంటూ ఉన్న ప్రాణం పోయిందని మీరు భావించడం పెద్ద పొరపాటు. ఎందుకని? సుషుప్తి (గాఢనిద్ర)లో ప్రాణం ఉన్నా అది అంటున్నదా? వింటున్నదా?.. అనే, వినే, కనే, తినేవాడు జీవుడు- ఆత్మ. వాడు దేహ, ఇంద్రియ, ప్రాణాలకు విలక్షణం- వేరైనవాడు. ఆత్మ ఈ కాయాన్ని (దేహాన్ని) ధరించి ఉన్నంత వరకే కర్మయోగం. జీవుడు దేహాన్ని వదలగానే ఈ సంబంధాల బంధాలన్నీ తెగిపోతాయి. కాలం మూడితే ఎంతటి గుణం, ధనం, బలం కలిగినవాడైనా నేల కూలక తప్పదు. వాన రాకడ, ప్రాణం పోకడ తెలియదంటారుగా! కావున, కాంతలారా! ఇక క్రందించక వెళ్లిపొండి. ఇలా వందల వత్సరాలు కుందుతూ, కుములుతూ కూర్చున్నా మృతి చెందిన మీ పతిదేవుని మీరు పొందలేరు- ‘మృతిబొందిన వారలు చేరవత్తురే?’


ఇలా ధర్మజ్ఞుడైన కృతాంతు (యము)ని నితాంత (మిక్కిలి) ప్రశాంతి, విజ్ఞాన ప్రదాలైన మృదు వచనాలు విని సుయజ్ఞుని భ్రాంత (మోహిత)లైన కాంతలు, బంధువులు ఎంతగానో వింతకులోనై, అంతలోనే లోకంలో ‘అనిత్యమే నిత్యమనే శాశ్వత సత్యా’న్ని గ్రహించి శోకం మానుకున్నారు. తత్తరపాటు తొలగిపోగా కర్తవ్యం గుర్తించి సుయజ్ఞ మహారాజుకి ఉత్తరక్రియలు నిర్వహించి నిర్వికారంగా నిష్క్రమించారు. అంతకుడు కూడా ఆనందాంతరంగుడై అంతర్థానమయ్యాడు.


     మిగిలిన భాగాలు తరువాత అందిస్తాను                                   స్వస్తి 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

అఘోరీ_First_Part_1

 #అఘోరీ_First_Part_1

[ పెద్ద కథ--మొదటి భాగము ]

పక్కనే శంఖనాదం వినపడటంతో తలతిప్పి చూసిందామె. తనకు స్వాగతం చెబుతున్నారా అన్నట్టు ఓ పది మంది యువకులు వరుసలో నించొని శంఖాలు పైకెత్తి, అరమోడ్పుకన్నులతో బలంగా శంఖాన్ని పూరిస్తున్నారు. రంగురంగుల ధ్వజాలు ఆ చీకట్లో కూడా రెపరెపలాడుతూ  ముద్దలుగా పడుతున్న కాంతి వెలుగులో తమ రంగుల జిలుగులను వెదజల్లుతున్నాయి 

ఎక్కడ చూసినా కాషాయ మయం. అంటే తాను జనస్రవంతిని దాటి వచ్చేసినట్టేనా? కాదు, భక్తకోటిని దాటి మాత్రమే వచ్చింది. జన ప్రవాహము ఇంకా ఉంది. వందలూ, వేలూ కాదు.. లక్షల్లో ఉన్నట్టుంది. అర్ధరాత్రిళ్ళు తిరగటము అలవాటేకానీ, ఇంతమంది జనం మధ్యకు రావడము ఇదే మొదటిసారి. కానీ సంకోచము, అప్రమత్తత అనేవి ఆమె మొహంలో లేవు.  ఆమె తలతిప్పి చూసినపుడు కుడి చెవికి పెట్టుకున్న లోలాకు వింతగా కదలి అదొకరకమైన గంభీర భావాన్ని ప్రకటిస్తోంది. 

అన్ని లక్షల మందిలో తాను వెతుకుతున్నవారిని కనుక్కోగలదా? కనుక్కున్నా, గుర్తించగలదా?  తాను గుర్తించినా, వారు గుర్తిస్తారా?  అయినా, తాను వచ్చిన పనేమి?  చేస్తున్నదేమి? 

ఒక్క క్షణం న్యూనతగా అనిపించినా, తన కర్త వ్యా న్ని సరిగ్గా తెలుసుకొని నిర్వహించాలంటే ఇది కూడా తప్పనిసరి..... అని మళ్ళీ తానే సమాధానం చెప్పుకొని మందగమనముతో ముందుకు వెళుతోంది. ఎటువంటి తొట్రుపాటు, ఆత్రము లేవు. బయలుదేరినప్పుడు ఉన్న  జాగ్రత్త, తాను అన్న ఎరుకగానీ,  లజ్జ గానీ ఇప్పుడేమీ లేవు.  

తాను పూర్తిగా నగ్నంగా లేదు.  కానీ, నగ్నంగా ఉందేమో అనుకునేవారికి అవుననిపించేటట్టూ,  కాదేమో అనుకునేవారికి కూడా ఔననిపించేటట్టూ దట్టంగా బూడిద పూసుకొని, పుర్రెలు, రుద్రాక్షలు, ఇంకా పూసలతో చేసిన మాలలు , విరబోసుకున్న జడలు కట్టిన జుత్తు ఆమె ఒంటిపై బట్టలు ఉన్నాయో లేవో తెలీకుండా కప్పి ఉన్నాయి. 

శవాలు కాలుతున్న వాసన రానురాను దగ్గరైంది. జనాలు పలుచబడుతున్నారు. వారిని జనాలు అనకూడదేమో... సాధకులు, సాధువులు, సన్యాసులు, నాగా సాధువులు, సాధ్వీమణులు, అఘోరాలు,  అక్కడక్కడా తనలాంటి అఘోరీలు... అడుగడుగునా ఉన్నారు. ఎవరూ ఎవరినీ పట్టించుకోవటము లేదు. ఎవరి సాధన, అనుష్ఠానములలో వారున్నారు. కాళ్ళ కింద ఇసక ఇప్పుడు తడిగా అనిపిస్తోంది.  అంటే వచ్చేశానన్నమాట.  ఎక్కడ చూడాలి, ఎవరిని అడగాలి?  అసలు ఎవరినైనా అడిగితే ఏమనుకుంటారు?  తన మీద అనుమానం రాదూ? తనకు పేరు కూడా తెలియదాయె.  చూస్తే కూడా గుర్తుపడతానన్న నమ్మకము లేదు.  అసలు తనకు ఎందుకు ఈ ప్రస్థానము? గురూజీ కి చెప్పి వచ్చానన్న ధైర్యం ఒకటే తప్ప, తాను నియమాలు తప్పి ప్రవర్తిస్తోందా ?అన్న అనుమానం అప్పుడప్పుడూ కలుగుతోంది.  అలాగైతే గురూజీ వారించేవారు కదా? 

మనుషులు బాగా తగ్గిపోయారు. రాత్రి రెండో జాము చివరలో ఉన్నట్టుంది.  ఉన్నట్టుండి దూరంగా ఒక సంగీతం లాంటిది వినపడింది.  డప్పులు మోగుతున్నాయా?  కాదు, ఢమరుకాలు మోగుతున్నాయి. నల్లటి పొగ నదిపై తేలుతూ వెళుతున్నది ఆ అష్టమి వెన్నెల్లో బాగానే తెలుస్తోంది.  ఏదో పాట... తెలుగు పాట!! మనసు ఉరకలు వేసింది. ఆ పాట తనకు తెలుసు!!  చిన్నప్పుడు అమ్మ పాడేది.  

నలుపూ నరుడనీ నగుబాటు గురుడని..

నలుపు నారాయణుడు నగునూ కాదా.

సుక్కలు తెలుపు సూరీడు తెలుపు

సక్కన్ని నా తల్లే తగును కాదా? 

శంభుడు, శర్వుడు, సాంబ సదాశివుడు

రుద్ర రూపుడు శివుడు అగును కాదా? 

నియత నిరుపమ రేజసు కలది 

జిల్లేడు శాఖము తెగును కాదా 

ఎవరా పాడేది? దాదాపు అరవై యేళ్ళ కిందట తన తల్లి పాడిన పాట, ఇప్పుడు ఈ త్రివేణీ సంగమములో ఈ అపరాత్రి  కాలుతున్న శవం ముందర కూర్చొని ఆ పాడేది ఎవరు?  ఆమేనా జేజెమ్మ? జేజెమ్మ ఫోటో తాను చిన్నపుడు చూసి ఉంది.  అప్పట్లో ఆ ఫోటోలో ఆమెకు పన్నెండేళ్ళు ఉంటాయి. ఆ ఫోటో ఎప్పటిదో తెలీదు. అంతకు ముందు ఒక వందేళ్ళ వెనుకటిది అని చెప్పుకునేవారు.  అంటే వంద కు అరవై కలిపితే నూట అరవై. ఆమె వయసు నూట అరవై ఉంటుందా? ఇన్నేళ్ళు బతికిందా?  బతకడము ఆశ్చర్యమేమీ కాదు.  మూడు వందల యేళ్ళు బతికినవారినీ తాను చూసింది.  అలాగని అందరూ వందల యేళ్ళు బతుకుతారని ఎలా అనగలము?  మరి, మరి.... ఆ పాట?  చిన్నపుడు తన తల్లికి ఆమె అత్తగారు నేర్పిందట.  ఆ అత్తగారికి ఆమె అత్తగారు నేర్పిందట. ఆ పాట ఎప్పటిదో? చిన్నపుడు రేడియోలో కూడా వచ్చేదట.  అలా రేడియోలో విన్నవారు  ఎందరైనా ఉండచ్చు, ఎవరైనా కావచ్చు.. ఆ పాట నేర్చుకొని ఉండచ్చు.. ఇక్కడ పాడేది జేజెమ్మే అని ఎలా చెప్పగలను?  ఒక వేళ జేజెమ్మే అయినా, గుర్తుపట్టడం అసాధ్యం. ఇప్పటి ఆమె పేరు ఇంకేదో ఉంటుంది. చిన్నప్పటి పేరు  " కుముద్వతి " అని చెప్పేవారు. ఈమెకు ఆ పేరు గుర్తు ఉండి ఉంటుందా? 

కాలుతున్న శవం దగ్గరికి వచ్చింది. 

[ సశేషం ]


-- by Vibhatha Mitra

తెనాలిరామలింగని కీర్తి!!

 శు భో ద యం🙏


తెనాలిరామలింగని కీర్తి!!


 

లింగనిషిధ్ధు కల్వలచెలింగని, మేచకకంధరున్ త్రి

శూలింగని సంగతాళిలవలింగని కర్దమదూషితన్ మృ

ణాలింగని,కృష్ణచేలుని హలింగని నీలకచెన్ విధాతృ

నాలింగని రామకృష్ణకవిలింగని కీర్తిహసించు దిక్కులన్;


       అద్భుతమైన ఈచాటుపద్యము.

స్వోత్కర్షమైన రామకృష్ణుని పద్యమో లేక ఇతరకవుల ప్రశంసయోతెలియరాదు.

      ఇంతకూ ఈపద్యమున చెప్పబడినవిషయము తెనాలి రామకృష్ణునిదిగంతవ్యాప్తమైనకీర్తిని గురించి,కవిసమయమును బట్టి కీర్తి తెల్లని తెలుపు.కళంకరహితమై విశుధ్ధమైన యాతని తెల్లని కీర్తిదిగంతవ్యాప్తమై,

         చంద్రుని, పరమేశ్వరుని, లవలీలతను, తామరను  బలరాముని

లరస్వతిని గాంచి నవ్వుచున్నదట!

        చంద్రునిలోని మచ్చ, పరమేశ్వరుని నీలగళత్వము, లవలీలతపైవ్రాలుతుమ్మెదగమి,పుండరీకమునకు బురద,బలరామునకు నీలవస్త్రధారణ,సర్వస్వతియసితకేశపాశము. వారి శ్వేతతాలోపమునకు కారణమట!

    అట్టిలోపములేనిదగుట రామకృష్ణుని కీర్తి వానిని గాంచినవ్వుచున్నదని ఈపద్యసారాంశము.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నెగెటివ్ ఆలోచనలతో ఉండకండి..

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏           🌹జీవితంలో ప్రతీ విషయంలో నెగెటివ్ ఆలోచనలతో ఉండకండి.. నెగెటివ్ ఆలోచనలు మనసుని మరియు ఆరోగ్యాన్ని మన చెజేతుల మనమే పాడుచేసుకున్న వారం అవుతాము.. అందుకే కొంతలో కొంత అయిన పాజిటివ్ ఆలోచనలతో ఉండడం చాలా అవసరం మంచిది కూడా🏵️మనిషిలోని అహంకారాన్ని జయించటం అంటే ఓ బలమైన శత్రువును ఒడించినట్లే.. మితి మీరిన అహం జీవితం నాశనానికి దారి తీస్తుంది.. మనలో ఉన్న ఆహాన్ని  విడిచి పెట్టి అందరిని సమాన భావంతో చూసిన రోజున నీకు జీవితం రంగుల హరివిల్లు అవుతుంది🏵️మనిషి లో ఉండే అహం అనేది అగ్ని జ్యాల లాంటిది.. ఆ జ్యాల జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది..అహం ఉన్నవాడు జీవితంలో ఏదైనా కోల్పోవడం క్షణం పట్టదు.. కానీ సాధించాలంటే జీవిత కాలం పడుతుంది🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్  D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును.9440893593.9182075510* 🙏🙏🙏

12, ఫిబ్రవరి 2025, బుధవారం

ఉచిత శిక్షణ

 Training of Technician Course (Free): Hurry Up! AC, TV, Washing Machine, Water Purifier, Dish Washer Etc.,

ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ ఉపాధి అవకాశాలు

హైదరాబాద్ ఏ ఎస్ రావు నగర్, రాధిక థియేటర్ దగ్గర చిన్న పరిశ్రమల మంత్రిత్వ శాఖ(NSIC)  ప్రాంగణంలో, LG మరియు ESSCI వారి ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్స్, డిష్ వాషర్స్, టెలివిజన్, వాటర్ ప్యూరిఫైయర్, మైక్రోవేవ్ ఓవెన్ కోర్సులలో సాంకేతిక శిక్షణ ఇస్తున్నారు. 

ఒక నెల/మూడు నెలల శిక్షణ తర్వాత, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ (NCEVT), మరియు ప్రతి ఒక్కరికీ ఉద్యోగం పొందడానికి సంస్థ సహాయం చేస్తుంది. చాలా అత్యాధునికమైన పరికరాలు, ట్రైనర్లు ఉన్నారు. శిక్షణ పూర్తిగా ఉచితం. శిక్షణ కాలంలో రెండు టీ-షర్టులు, ప్రాథమిక టూల్ కిట్, స్టడీ మెటీరియల్ మరియు మధ్యాహ్నం భోజనం కూడా ఉచితంగా అందించబడుతుంది. వ్యక్తిత్వ అభివృద్ధి మరియు యోగా శిక్షణ కూడా ఇస్తోంది.

అర్హత: 10వ తరగతి పాస్ అయి ఉండాలి. చిన్న ప్రవేశ పరీక్ ఉంటుంది.

వయోపరిమితి 18 to 25. ఎస్టీ, ఎస్సీలకు మరో ఏడాది వయో సడలింపు.

డిసెంబర్ 30 మరియు జనవరి 2వ వారంలో బాచ్ ప్రారంభం అవుతుంది. గ్రామవాసి, వనవాసీ పిల్లలు చేరితే వారికి ఉద్యోగం తప్పని సరిగా ఏర్పాటు చేస్తారు. యువకులకు ఈ విషయాన్ని చేరవేసి వారిని రప్పించ గలిగితే చాలా ఉపయోగం. 

https://www.youtube.com/watch?v=6VBWd4ziKUA 

https://maps.app.goo.gl/BuiN4jbHyHCTSyWV8 

సంప్రదించండి :

Sri Maruthi Prasad,

LG హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ

+91 63037 82424.

ఔషధాలు లేని జీవితం`*

 *`ఔషధాలు లేని జీవితం`*


*1.త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం ఔషధం.*


*2. ఓం జపించడం ఔషధం.*


*3.యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం ఔషధం.*


*4. ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం.*


*5.ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం.*


*6. సూర్యకాంతి కూడా ఒక ఔషధం.*


*7.కుండ నీరు తాగడం కూడా ఔషధమే.*


*8.చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే.*


*9.ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే.*


*10. ఆహారంలాగే, నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం.*


*11.ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఔషధం.*


*12.సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం.*


*13.కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం.*


*14.నవ్వు మరియు జోకులు ఔషధం.*


*15. సంతృప్తి కూడా ఔషధం.*


*16.మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం.*


*17.నిజాయితీ మరియు సానుకూలత ఔషధం.*


*18. నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం.*


*19.అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే.*


*20.ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం.*


*21.అందరితో కలిసి జీవించడం ఔషధం.*


*22.తినడం, త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే.*


*23.మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్.*


*24.సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి, ఇది కూడా ఔషధం.*


*25.ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే.*


*26.చివరగా ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం.*


*ప్రకృతి యొక్క "గొప్పతనం"ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా ఔషధం.*


*`ఈ ఔషధాలు అన్ని మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి.`*

ఛాతీ నొప్పి*

 *ఛాతీ నొప్పి* ఇటీవల, ఒక వ్యక్తి ఛాతీ నొప్పి కారణంగా చెన్నైలోని ఒక ప్రసిద్ధ ఆసుపత్రిలో చేరాడు. అతను 2016 లో గుండెపోటుకు చికిత్స పొందుతున్నాడు. వైద్యులు

యాంజియోగ్రఫిని సిఫార్సు చేశారు.


ఈ మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిలో యాంజియోగ్రఫి తర్వాత, వైద్యులు యాంజియోప్లాస్టీకి ముందు రక్తనాళంలో బహుళ అడ్డంకులు ఉన్నట్లు కనుగొన్నారు మరియు యాంజియోప్లాస్టీకి బదులుగా, వైద్యులు బైపాస్ సర్జరీని సూచించారు.


అతని గుండె చాలా బలహీనంగా ఉందని వైద్యులు సలహా ఇచ్చారు మరియు ఆ సాయంత్రం ఇంటికి తీసుకువచ్చారు, 10 - 15 రోజుల తర్వాత, బైపాస్ అధిక ప్రమాదంతో మాత్రమే చేయవచ్చని హెచ్చరించారు.


ఇంతలో, బంధువులు మరియు సన్నిహితులతో ఈ విషయాన్ని చర్చించిన తర్వాత, కుటుంబ స్నేహితుడి నుండి కొత్త సమాచారం వచ్చింది. *EECP థెరపీ* అనే కొత్త చికిత్సను ఇండియన్ మెడికల్ (AIIMS) వైద్యుడు ప్రవేశపెట్టారు.


ఇప్పుడు దీనిని *US FDA & T.N GOVT ఆమోదించింది*


ఇక్కడ,


బైపాస్ సర్జరీ లేకుండా మరియు స్టెంట్లు లేకుండా గుండె అడ్డంకులను నయం చేయవచ్చు, కానీ ఈ అధునాతన *EECP మెషిన్* యంత్రం సహాయంతో.


ఈ చికిత్సతో, బైపాస్ అవసరమయ్యే రోగి అలా చేయవలసిన అవసరం లేదు.

(దీనిని సహజ బైపాస్ అంటారు)

బదులుగా, రోగికి దాదాపు 20 బాటిళ్ల IV ద్రవాలు ఇవ్వబడతాయి, దానికి కొంత ఔషధం ఇంజెక్ట్ చేయబడుతుంది.


ఈ ఔషధం గుండెలోని రక్త నాళాలలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. రోగి వయస్సు మరియు ఆరోగ్యాన్ని బట్టి, ఎన్ని బాటిళ్లు ఇవ్వవచ్చు.


ఒక బాటిల్ ధర రూ.2,000/- వరకు ఉంటుంది.


ప్రస్తుతం, భారతదేశంలో కొద్దిమంది వైద్యులు మాత్రమే ఈ రంగంలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. వారిలో ఒకరు కోయంబత్తూరులోని DR.S.PRABU.


ప్రధాన ఆసుపత్రులలో ఈ సహజ బై-పాస్ (EECP థెరపీ) చేయించుకున్న రోగుల జాబితా అతని వద్ద ఉంది. ఈ కొత్త చికిత్స తర్వాత, గుండె రోగులు పూర్తిగా బాగున్నారు మరియు కనీస మందులు కూడా లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.


ఈ చికిత్స కోయంబత్తూరులో ఉంది

*PGS హాస్పిటల్*. పూర్తయింది

మరిన్ని సమాచారం కోసం


DR. S. Prabhu MD PGDHsc(ECHO)PPHC(UA)

(జనరల్ ఫిజిషియన్ & ప్రివెంటివ్ కార్డియాలజీ)

ఇన్వాసివ్ & నాన్-సర్జికల్ కార్డియాక్ కేర్ అనుభవం & మెరుగైన జీవన నాణ్యత.


0422 4971331

మొబైల్ : +91 91597 00800

+91 94430 61115

www.pgshospital.com

దయచేసి ఈ సందేశాన్ని ఇతరులకు ఫార్వార్డ్ చేయండి ఎందుకంటే ఇది చాలా మందికి సహాయపడవచ్చు.


దయచేసి, దీన్ని షేర్ చేయకుండా తొలగించవద్దు.


నేను వీలైనంత త్వరగా దీన్ని పంపుతాను.


ఇది 130 కోట్ల మంది భారతీయులను మరియు మిగిలిన వారిని మేల్కొల్పాలి!


*ఇది ఎవరికైనా సహాయపడవచ్చు.* దయచేసి దీన్ని మీకు వీలైనంత వరకు షేర్ చేయండి

🙏🏻🙏🙏

13-23-గీతా మకరందము

 13-23-గీతా మకరందము

           క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


ఉపద్రష్టానుమన్తా  చ 

భర్తా భోక్తా మహేశ్వరః | 

పరమాత్మేతి చాప్యుక్తో 

దేహేఽస్మిన్ పురుషః పరః || 


తాత్పర్యము:- పురుషుడు (ఆత్మ) ఈ శరీరమందున్నప్పటికిని శరీరముకంటె వేఱైనవాడును, సాక్షి భూతుడును, అనుమతించువాడును, భరించువాడును, అనుభవించువాడును, పరమేశ్వరుడును (గొప్పప్రభువు, నియామకుడును), పరమాత్మయు అని చెప్పబడుచున్నాడు.


వ్యాఖ్య:- 'ఉపద్రష్టా’ యజ్ఞమునందు 'ఉపద్రష్ట’ అనువాడు సాక్షిమాత్రుడుగ నుండును. అట్లే ఆత్మ శరీరమందున్నను 'పరః’ - శరీరముకంటె వేఱుగ, పరముగనున్నవాడై దేహేంద్రియాదులకు సాక్షిగ వెలయుచున్నాడు. కావున జీవుడు తాను వాస్తవముగ అట్టి పరమాత్మస్వరూపుడే యనియు దేహేంద్రియాదులుకాదనియు లెస్సగ భావనచేయవలెను.

‘మహేశ్వరః, పరమాత్మా దేహేఽస్మిన్’ - అని చెప్పబడినందువలన జగన్నాథుడైన పరమేశ్వరుడు, పరమాత్మ ఈ దేహమందే వర్తించుచున్నాడని స్పష్టమగుచున్నది. ఈ ప్రకారముగ భగవానుడు జీవునకు అతిసమీపమున నుండుటవలన ప్రయత్నముచే సులభముగ పొందగలడు. వారికై దూరదూరములందు ప్రయాసపడి వెతుకనక్కఱ లేదు. మఱియు శిక్షించువాడు, శాసించువాడు, (ఈశ్వరుడు) చెంతనేయుండుట వలన పాపులివ్విషయమును గమనించి పాపకృత్యము లెవ్వియు చేయకనుండవలెను.


'పరః' - అని చెప్పుటవలన ఆత్మ దేహముతో, ఉపాధితో, సంబంధములేక దానికి పరముగా వేఱుగ, అతీతముగ నున్నదని తెలియుచున్నది.

 ‘పరః పురుషః’ - అను పదములకు పరమపురుషుడు, పరమాత్మ అనియు అర్థము చెప్పవచ్చును.


ప్రశ్న:- పరమాత్మ యెట్టివాడు?

ఉత్తరము:- (1) శరీరమందున్నను, శరీరముకంటె వేఱుగనున్నవాడును, (2) సాక్షిభూతుడును, (3)అనుమతించువాడును, (4) భరించువాడును, (5) అనుభవించువాడును, (6) గొప్పనియామకుడును, (పరమేశ్వరుడును) అయియున్నాడు.

తిరుమల సర్వస్వం-146*

 తిరుమల సర్వస్వం-146* 

   

           *తొండమాన్ చక్రవర్తి -1*


 *తొండమాన్ చక్రవర్తి* 


 మనం వివిధ ప్రకరణాలలో ఇంతవరకూ ఆకాశరాజు తమ్ముడైన తొండమానుడు పద్మావతీపరిణయం లో ముఖ్య భూమిక వహించటం; శ్రీనివాసుని ఆనతిపై ఆనందనిలయం నిర్మాణం కావించి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు శాశ్వతంగా తిరుమల క్షేత్రం మీద కొలువై ఉండటానికి కారణభూతుడు అవ్వటం గురించి మాత్రమే తెలుసుకున్నాం. అయితే, ఈ భక్తశిఖామణికి ఎంతో విశిష్టమైన వృత్తాంతం ఉంది.


 *శ్రీతీర్థం – భూతీర్థం* 


 కృతయుగంలో ముల్లోక పర్యటనలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతుడై భూలోకానికేతెంచిన శ్రీమహావిష్ణువు, ఆనాడు క్రీడాద్రిగా పిలువబడే, నేటి వెంకటాద్రి పర్వతం పైనున్న ప్రకృతి సోయగానికి ముగ్ధుడై కొంతకాలం అక్కడే విహరిస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువుకు కావలసిన భోజనాదుల నిమిత్తం, ఆ పర్వతశిఖరంపై దేవేరులిద్దరూ చెరొక తీర్థాన్ని (బావులను) ఏర్పాటు చేశారు. శ్రీదేవి ఏర్పరచిన తీర్థం *'శ్రీతీర్థం"* గానూ, అలాగే భూదేవి ద్వారా ఏర్పాటు చేయబడ్డ తీర్థం *"భూతీర్థం"* గానూ ప్రసిద్ధికెక్కాయి. కాలాంతరాన, కలియుగారంభం నాటికి ఈ రెండు తీర్థాలు శిథిలమై పోయాయి. తన ప్రియసఖుల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ తీర్థాలను ఎంతగానో ఇష్టపడే విష్ణుమూర్తి, వాటిని ఎలాగైనా పునరుద్ధరింప చేయాలని సంకల్పించి తగిన సమయం కోసం వేచి చూస్తున్నాడు.


 *సద్భాహ్మణుడు - శూద్ర భక్తుడు* 


 ఇదిలా ఉండగా, కలియుగారంభం నందు చోళరాజ్యంలోని హరిద్రానదీ తీరాన ఉన్న కృష్ణ క్షేత్రమనే గ్రామంలో, శ్రీకృష్ణునికి పరమభక్తుడైన వైఖానసుడనే సద్ర్బహ్మణుడు భగవత్సాక్షాత్కారం కోసం కఠోరమైన తపమాచరించాడు. అతని నిష్ఠాగరిష్టతకు ప్రీతి చెందిన శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుని రూపంలో ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోవలసిందిగా ఆదేశించాడు. అందుకు వైఖానసుడు భౌతిక సంపదలను కోరుకోకుండా; తనకు మోక్షాన్ని ప్రసాదించమని, ఎల్లవేళల శ్రీకృష్ణుని రూపంలో తన పూజలు స్వీకరించమని కోరుకున్నాడు. 


‌ అతని నిస్వార్థభక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు, తాను వెంకటాద్రి పర్వతంపై శ్రీనివాసునిగా స్వయంవ్యక్తమై ఉన్నానని; అతను కోరుకున్నట్లే నిత్యము ఆ శ్రీనివాసుణ్ణి సేవించి తరించవచ్చునని వరమిచ్చాడు. అంతే గాకుండా ఇకనుండి వైఖానసుడే *"గోపీనాథుని"* గా ప్రసిద్ధి కెక్కుతాడని; అతనికి *"రంగదాసు"* అనే శూద్రభక్తునితో పరిచయం ఏర్పడుతుందని; కృతయుగంలో వేంకటాద్రిపై *"శంఖరాజు"* అనే భక్తునిచే నిర్మించబడిన విమానగోపురం కలిగిన తన ఆలయం శిథిలమవ్వగా, అందున్న విగ్రహం సమీపంలోనే ఉన్న ఒక చింతచెట్టు క్రింద ఉన్నట్టి పుట్టలో పడిఉన్నదని; వారిరువురూ (వైఖానసుడు, రంగదాసు) కలసి ఆ విగ్రహాన్ని పుట్టలో నుండి బయటకు తెచ్చి, ఒక వైభవోపేతమైన దేవాలయాన్ని నిర్మించి, అందులో విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి, నిత్యము పూజాదికాలు జరుపవలసిందని కూడా శెలవిచ్చాడు. 


‌ తదనంతరం, భగవదాజ్ఞ మేరకు వెంకటాద్రి పర్వతానికి బయలుదేరిన గోపీనాథునికి మార్గమధ్యంలో రంగదాసు కలువగా; ఇరువురూ కలసి సువర్ణముఖీ నదిలో స్నానమాచరించి, సమీపంలోనే ఉన్న శుకపురి (నేటి తిరుచానూరు) అనే పుణ్యక్షేత్రం లోని శ్రీకృష్ణ బలరాముల ఆలయాన్ని దర్శించుకుని, వేంకటాచలానికి తరలి వెళ్ళారు.


 *శ్రీనివాసుని సేవలో భక్తద్వయం* 


‌ శ్రీవారి ఆనతి మేరకు వెంకట పర్వతాన్ని చేరుకున్న భక్తులిరువురు స్వామి పుష్కరిణియందు స్నానమాచరించి; పుష్కరిణికి దక్షిణాన ఉన్న చింతచెట్టు క్రింది పుట్టను త్రవ్వి, అందులో నిక్షిప్తమైయున్న, దివ్య తేజస్సు ఉట్టిపడే, సాలగ్రామశిలా నిర్మితమైన స్వామివారి మూర్తిని వెలికి తీసి; ఎంతో కాలంగా పుట్టకు నీడనిచ్చిన చింతచెట్టును, శ్రీమహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన చంపక వృక్షాన్ని మాత్రమే ఉంచి; ఇతర వృక్షాలను, తుప్పలను, బండరాళ్లను తొలగించి; ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. విగ్రహం చుట్టూ అందుబాటులో ఉన్న బండశిలలతో కుడ్యాలను నిర్మించి, రెల్లుగడ్డితో పైకప్పు నేర్పరచి శ్రీవారికి తాత్కాలిక వసతి కల్పించారు.


 ప్రతిరోజూ శ్రీనివాసునికి గోపీనాథుడు పూజాదికాలు సమర్పించుకునేవాడు. పూజకు కావలసిన పుష్పాలను సమయానికి సమకూర్చే బాధ్యతను వహించిన రంగదాసు, పూదోటను పెంచటం కోసం ఆ సమీపంలోనే రెండు బావులను కూడా నిర్మించాడు. భగవత్సంకల్పంతో ఆ బావులు నిర్మించబడ్డ ప్రదేశంలోనే శ్రీదేవి భూదేవిలచే ఎప్పుడో నిర్మించబడి శిథిలమై పోయిన శ్రీతీర్థం, భూతీర్థం బహిర్గత మయ్యాయి. శ్రీతీర్థం నందలి పవిత్ర జలాలను గోపీనాథుడు శ్రీవారి వంటలకు, అభిషేకార్చనాదుల నిమిత్తం ఉపయోగించేవాడు. అదే నేడు విమానప్రదక్షిణ ప్రాకారంలో ఉన్న *"బంగారుబావి".*


[ రేపటి భాగంలో... *రంగదాసు మరుజన్మ* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము ప్రథమాశ్వాసము*


*285 వ రోజు*


*సంశక్తులతో అర్జునుడి యుద్ధం*


అర్జునుడు ఆకలిగొన్న సింహమువలె సంశక్తులను ఎదుర్కొన్నాడు. వారు అర్ధచంద్రాకారంలో మొహరించి అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు దేవదత్తఘోష విన్న సంశక్తుల హృదయాలు దద్ధరిల్లాయి అంతలోనే తేరుకుని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడిని చుట్టిముట్టి వాడి అయిన శరములు అర్జునిపై ప్రయోగించారు. అర్జునుడు వాటిని మధ్యలో త్రుంచి తన వాడి అయిన బాణములతో పది వేలమంది రధికులను చంపాడు. తన మీద పది శరములను ప్రయోగించిన వారిని కేవలం అయిదుబాణాలతో యమసదనానికి పంపాడు. సుశర్మ, సుభాహుడు, సుధన్వుడు, సురధుడు అర్జునితో పోరాడుతున్నారు. అర్జునుడు వారి కేతనములు విరుగకొట్టాడు. సుధన్వుని హయములను చంపి , విల్లువిరిచి, ఒకేఒక బాణంతో అతడి తల నరికి విజయ సూచకంగా శంఖారావం చేసాడు. అర్జునుడు సంశక్తుల సైన్యంపై పడి వారి రధములను విరుగకొట్టాడు. అర్జునిని ధాటికి సంశక్తుల సేన చెల్లాచెదురు అయ్యాయి. అది చూసి సుశర్మ కలవర పడి " భయపడకండి వెనక్కు రండి అర్జునిని పరాక్రమం మనకు తెలియనిదా ! చేసిన ప్రతిజ్ఞ మరిచారా ! సుయోధనుని ముందు తల ఎత్తుకుని ఎలా తిరుగగలము " అని బిగ్గరగా అరిచాడు. అతడి మాటాలకు సైన్యం వెనుతిరిగి వచ్చి అర్జునుడితో తలపడింది. అర్జునుడు " కృష్ణా ! త్రిగర్తులు ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతుంటారు. రథమును వెనుకకు మరల్చి వీరిని యమసదనముకు పంపినగాని మన పని పూర్తి కాదు " అన్నాడు.


*నారాయణాభిదాసుల సమరం*


కృష్ణుడు రధమును వెనుకకు మరల్చాడు ఆ సమయంలో నారాయణాభిదాసులు పదివేల మంది వారిని ఎదుర్కొన్నారు. వారందరికి కృష్ణార్జునుల మీద కోపంగా ఉంది. యుద్ధానికి ముందు ద్వారకకు వచ్చి అర్జునుడు, సుయోధనుడు సహాయం కోరిన సమయంలో అర్జునుడు తమను కృష్ణుని నుండి వేరు చేసి సుయోధనుడి పరం చేసినందుకు వారికి కృషార్జునుల ఇరువురి పైన కసిగాను కోపంగాను ఉంది. వారు కృష్ణార్జునులపై శరవర్షం కురిపించాడు. వారిని చంపనిచ్చగించని అర్జునుడు తనకు త్వష్ట ప్రజాపతి ప్రసాదించిన దివ్యాస్త్రమును వారిపై ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావంతో నారాయణాభిదాసులలో ప్రతి వారికి తన ఎదుటి వాడు అర్జుడిలా కనిపించసాగాడు. ఆ అస్త్ర ప్రభావంతో ఒకరిని ఒకరు నరుక్కుని అనేక మంది చని పోయారు. ఇంతలో అస్త్ర ప్రభావం తగ్గి పోయింది. మిగిలిన నారాయణాభిదాసులు మగధ, కేరళ మొదలగు రాజులతో కలిసి మహోగ్రంగా కృష్ణాంజ్ఞులను చుట్టుముట్టి అర్జునుడిపై శక్తి వంతములైన అస్త్రశస్త్రములు వేసారు. అర్జునుడు వారి అస్త్రములను త్రుంచి వారి శిరములను తన వాడి బాణములతో ఖండించాడు. వారి సైన్యములోని హయములు, ఏనుగులు, కాల్బలము అర్జునుడి బాణములకు ఆహుతి అయ్యాయి.


*అర్జునుని సంశక్తులు తిరుగి ఎదుర్కొనుట*


ఇంతలో సంశక్తులు తమ సైన్యాలను సమీకరించి అర్జునుడిని ఎదుర్కొని అర్జునుడి మీద శరవృష్టి కురిపించారు. వారిలో కొంత మంది రధములు దిగి అర్జునుడి రధము మీద హయముల మీద దాడి చేసారు. అన్ని దిక్కుల నుండి శరప్రయోగం చేయడంతో పాండవ సేనకు అర్జునుడి రథం కనిపించ లేదు. కృష్ణార్జునులు సంశక్తుల చేతిలో మరణించారు అనుకుని ఆందోళన పడ్డారు. వారి ఆందోళన గమనించి సంశక్తులు సింహనాదాలు చేసి శంఖారావములు చేసారు. నొగల మీద కూర్చున్న కృష్ణునికి అర్జునుడు కనిపించక కలవర పడి " అర్జునా! అర్జునా ! " అని ఎలుగెత్తి అరిచాడు. పరిస్థితి అర్ధం చేసుకున్న అర్జునుడు వాయవ్యాస్త్రం ప్రయోగించి సంశక్తుల సైన్యాలను చెదుమదురు చేసాడు. కృష్ణార్జునులు కనిపించగానే పాండవ సైన్యం ఊపిరి తీసుకుని హర్షధ్వానాలు చేసారు. సంశక్తులు తిరిగి సైన్యములను కూడగట్టుకుని ఒక్కుమ్మడుగా అర్జుడి మీద దాడి చేసారు. అర్జునుడు వారు వేసిన శరములు మధ్యలో త్రుంచి వారిపై అతి క్రూర నారాచములు వేసి వారి సైనికుల శిరస్సులను త్రెంచాడు. ఏనుగులు, హయములు, రథములు తునాతునకలు ఔతున్నాయి. మొండెములు ఇతర అవయవములు ఎగిసి పడుతున్నాయి. అయినా బెదరక సంశక్తులు అర్జునుడిపై శరపరంప కురిపించారు. తీవ్రంగా పోరు సాగుతుంది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

*124వ బ్రహ్మోత్సవాల

 *124వ బ్రహ్మోత్సవాల "అన్న సమారాధన"*


గుంటూరు నగరంలోని అరండల్ పేట 4/4 శివాలయంలో (శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠ పాలిత) శ్రీ గంగా మీనాక్షి సోమ సుందరేశ్వర ఆలయం 124వ బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఈ భక్తులకు దాతల సహకారంతో *అన్న సమారాధన కార్యక్రమం 11 - 2 - 2025 మంగళవారం మ.12 గం.ల నుండి ఏర్పాటు చేయడం జరిగింది.* కావున భక్తులు ఈ అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము.🙏🙏


*ఆలయ ఉత్సవ కమిటి*


*చాణక్య ఫ్రెండ్స్ సర్కిల్*


*శివ భక్త బృందం*


*అయ్యప్ప సేవా సమాఖ్య*

పోతన భాగవతం 🙏 నాలుగవ భాగం

 🙏పోతన భాగవతం 🙏

               నాలుగవ భాగం 

భాగవతం మరొక విశిష్టత ఏమిటంటే 

పోతన గారు  భాగవతంలో భక్తి జ్ఞాన వైరాగ్యములను చక్కగా బోధించారు. .జీవితం గురించి బంధాలు గురించి ఆయన చెప్పిన విషయాలు వింటే జీవితం బుద్బుదప్రాయం అనే విషయం అవగతం అవుతుంది. అంతేగాక మనకు మోక్ష మార్గం కూడా భాగవతంలో నిర్దేశం చేశారు.


భాగవతమును శ్రీశుకుడు ఉపదేశం చేసేప్పుడు పరిక్షిత్తుమహారాజు ఒక్కరే లేరు. ఆయన చుట్టూ ఎన్నో వేల మంది ఉన్నారు. రాజు రాజ్యం వదిలి పెట్టి ఉంటే వారంతా ఆయన చుట్టూ చేరి ఉన్నారు. ఋషులు కూడా అక్కడ చేరి ఉన్నారు. గంగను మించిన జన ప్రవాహం ఉంది అక్కడ. అందరూ భాగవతమును విన్నారు, మరి అందరూ తరించారా? ఊహు ... తరించింది ఒక్క పరిక్షిత్తుమహారాజు మాత్రమే. ఎందుకంటే అది విన్న వారి యోగ్యతపై ఆధారపడి ఉంటుంది. అందులో కొందరు రాజుగారికి సప్తదినాల్లో మరణమని తెలిసి, ఏం జరుగుతుందో చూద్దామని వచ్చి విన్నవారు, మరికొందరు ఏదో కాలక్షేపం కోసం అన్నట్లు విన్నవారూ ఉన్నారు. కానీ పరిక్షిత్తుమహారాజుకే మోక్షఫలం దక్కింది. అదేమి పక్షపాతం కాదు. విన్నవారి యోగ్యతబట్టే ఫలితం. తెలుసుకోవాలని తపన మూర్తీభవించి విన్నవాడు తరించాడు. శ్రవణం చేస్తుంటే తిండి నీరు నిద్ర అసలేం వద్దు అన్నాడు. దాహం, ఆకలి, అలసట అనేది అనిపించటం లేదు అని అన్నాడు. ఆయనకున్న శ్రద్ధ, తపన అలాంటిది. అందుకే ఆయనకి మోక్షం వెంటనే లభించింది

చుట్టాలు దొంగలు సుతులు ఋణస్థులు;-

  కాంతలు సంసార కారణములు;

ధనము లస్థిరములు; దను వతి చంచల-

  గార్యార్థు లన్యులు; గడచుఁగాల

మాయువు; సత్వర మైశ్వర్య మతి శీఘ్ర-

  మని కాదె తమ తండ్రి నతకరించి

మా తాత సాధుసమ్మతుఁడు ప్రహ్లాదుండు-

  నీ పాదకమలంబు నియతిఁ జేరె

భద్రుఁ డతనికి మృతి లేని బ్రతుకుఁ గలిగె

వైరులై కాని తొల్లి మా వారుఁ గాన

రర్థివై వచ్చి నీవు న న్నడుగు టెల్ల

బద్మలోచన! నా పుణ్య ఫలము గాదె?"

భావము:

పురాణపురుషా! “చుట్టాలు దొంగలు కొడుకులు అప్పులవాళ్ళు. భార్యలు ముక్తిని దూరంచేసేవారు. సంపదలు నిలకడ లేనివి. శరీరం స్థిరం కాదు. ఇతరులు తమప్రయోజనాన్నే కోరుతారు. కాలం నిలువదు. ఆయుస్సు త్వరగా గడుస్తుంది. ఐశ్వర్యం తొందరగా వెళ్ళిపోతుంది” అనుకున్నాడు పుణ్యాత్ముడైన మా తాత ప్రహ్లాదుడు. ఆయన తన తండ్రిని విడనాడి నీపాదాలను సేవించాడు. అదృష్టవంతుడైన అతనికి మరణంలేని మనుగడ దొరికింది. పూర్వం మావారు శత్రువులుగా మారితే తప్ప నిన్ను దర్శించలేకపోయారు. నీవు అర్థివై వచ్చి నన్ను దేహి అనడం మా పూర్వ పుణ్య ఫలమే కదా స్వామీ

హిరణ్యకశిపుడు సాక్షరుడైన రాక్షసుడు. విద్య ఉన్నా వివేకం లేనివాడు. వేదాంతం తెలిసినా భేదాంతం కాని వాడు- భేద బుద్ధి నశించనివాడు. ఎంతైనా ద్వైతబుద్ధి- భేదబుద్ధి అనే ‘దితి’ పుత్రుడేకదా! కనుక మాటల్లోనే వేదాంతం. అంటే, వాడిది మెట్టవేదాంతమే కాని తుది ముట్టే పట్టుకలిగిన గట్టి వేదాంతం కాదు. అది కేవలం ‘వాచా జ్ఞానం’. అనుభవం లేని పరోక్ష జ్ఞానం. ఇట్టి వాచా (నోటిమాటల) జ్ఞానాన్ని శాస్త్రం అజ్ఞానమనే అన్నది. వివేక, వైరాగ్యాలు లేని వాచా జ్ఞానాన్ని నాటకాల్లో వాడే దూది గదతో పోల్చారు ప్రాజ్ఞులు- తత్త్వవేత్తలు. అది ప్రదర్శనకు, ప్రవచనానికే గాని యుద్ధానికి, పరమార్థానికి పనికిరాదు.


‘పరోపదేశే పాండిత్యం’- పరులకు నీతిని బోధించడంలో హిరణ్యకశిపునికి ఉన్న పాండిత్యానికి ఈ ‘సుయజ్ఞ’ ఉపాఖ్యాన ప్రసంగం ఒక ప్రకృష్ట ప్రతీకం- సంకేతం. తన తల్లికి, కోడండ్రకు వైరాగ్యం ఉపదేశించే వీడు తాను మాత్రం మదించి మహావిష్ణువుతో విరోధం పెంచుకున్నాడు. తాము ఆచరించక ఇతరులకు బోధించి, తమను తాము బాధించుకొనే వారే అసురులు- హిరణ్యకశిపులు.

                  సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

13-24-గీతా మకరందము

 13-24-గీతా మకరందము

           క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారికII ఈ ప్రకారముగ ప్రకృతిపురుషులనుగూర్చి యొఱుంగుటవలన గలుగు ఫలితమును వచించుచున్నారు –


య ఏవం వేత్తి పురుషం 

ప్రకృతిం చ గుణైః  సహ | 

సర్వథా వర్తమానోఽపి 

న స భూయోఽభిజాయతే || 


తాత్పర్యము:- ఎవడీ ప్రకారముగ పురుషుని (ఆత్మను), గుణములతో గూడిన ప్రకృతిని తెలిసికొనుచున్నాడో, ఆతడేవిధముగ నున్నప్పటికిని మఱల జన్మింపడు.


వ్యాఖ్య:- మఱల జన్మను బొందకుండుటకు అనగా మోక్షప్రాప్తికి ఉపాయమేమియో ఇచట సెలవిచ్చుచున్నారు. పురుషుడు (ఆత్మ) యెట్టివాడు? ప్రకృతి యెట్టిది? అను ఈ ప్రకారముగ ఆత్మానాత్మవిచారణాసమర్థుడై యుండు మనుజుడు, దృక్, దృశ్యములను బాగుగ వివేచించి చూడగలడు. కాబట్టి అట్టి విచారణాశీలుడు త్రిగుణాత్మకమై, బంధజనకమై, దుఃఖప్రదమైనట్టి ప్రకృతిని ఆశ్రయింపక గుణరహితమై, బంధచ్ఛిదమై, పరమానందరూపమైనట్టి పురుషునే (ఆత్మనే) ఆశ్రయించును. కావున ఆతడిక జన్మింపడు, ముక్తుడేయగును. ఏలయనగా ప్రకృతి, పురుషుల జ్ఞానముకలవాడు, అనాత్మను, అనగా దృశ్యమును, ప్రకృతిని తనకంటె (పురుషునికంటె) వేఱుగజూచుచు అద్దానితో సంగము (కలయిక) లేకుండును. కనుకనే అట్టివాడు ముక్తుడై మరల జన్మింపడని వచింపబడినది.


‘సర్వథా వర్తమానోఽపి’ - అట్టివాడు ఎట్లున్నప్పటికిని - అని చెప్పుటచే సమాధినిష్ఠుడైయున్నను, లేక లోకమున (ప్రజోపకార) కార్యములను జేయుచున్నను, బ్రహ్మచర్యాదిరూపమగు ఏ ఆశ్రమమందున్నను, మఱల జన్మింపడని భావము. అతడెట్లువర్తించినను సర్వథాముక్తుడేయగును. అయితే “ఎట్లు వర్తించినను" అనుదానికి అర్థము 'నిషిద్ధాచరణ' గలిగియుండినప్పటికిని అని యెవరును భావింపరాదు. ఏలయనిన నిషిద్ధాచరణగలవాడు ఆత్మానాత్మవివేకి యెన్నటికిని కానేరడు. మఱియు వివేకియగువాడు నిషిద్ధకృత్యముల నెన్నటికిని  చేయడు. కావున ఇట్టి వాక్యముల యర్థమును గ్రహించుటయందు బహుజాగరూకుడై యుండవలెను.


ప్రశ్న:- ప్రకృతి, పురుషులనుగూర్చిన జ్ఞానము గలిగియున్నచో ఫలితమేమి?

ఉత్తరము:- అట్టి జ్ఞానము కలవాడు ఏ ప్రకారము వర్తించినను జన్మరాహిత్యమును బొందును. అతడు మఱల జన్మింపడు.