13, ఫిబ్రవరి 2025, గురువారం

తెనాలిరామలింగని కీర్తి!!

 శు భో ద యం🙏


తెనాలిరామలింగని కీర్తి!!


 

లింగనిషిధ్ధు కల్వలచెలింగని, మేచకకంధరున్ త్రి

శూలింగని సంగతాళిలవలింగని కర్దమదూషితన్ మృ

ణాలింగని,కృష్ణచేలుని హలింగని నీలకచెన్ విధాతృ

నాలింగని రామకృష్ణకవిలింగని కీర్తిహసించు దిక్కులన్;


       అద్భుతమైన ఈచాటుపద్యము.

స్వోత్కర్షమైన రామకృష్ణుని పద్యమో లేక ఇతరకవుల ప్రశంసయోతెలియరాదు.

      ఇంతకూ ఈపద్యమున చెప్పబడినవిషయము తెనాలి రామకృష్ణునిదిగంతవ్యాప్తమైనకీర్తిని గురించి,కవిసమయమును బట్టి కీర్తి తెల్లని తెలుపు.కళంకరహితమై విశుధ్ధమైన యాతని తెల్లని కీర్తిదిగంతవ్యాప్తమై,

         చంద్రుని, పరమేశ్వరుని, లవలీలతను, తామరను  బలరాముని

లరస్వతిని గాంచి నవ్వుచున్నదట!

        చంద్రునిలోని మచ్చ, పరమేశ్వరుని నీలగళత్వము, లవలీలతపైవ్రాలుతుమ్మెదగమి,పుండరీకమునకు బురద,బలరామునకు నీలవస్త్రధారణ,సర్వస్వతియసితకేశపాశము. వారి శ్వేతతాలోపమునకు కారణమట!

    అట్టిలోపములేనిదగుట రామకృష్ణుని కీర్తి వానిని గాంచినవ్వుచున్నదని ఈపద్యసారాంశము.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: