7, జనవరి 2021, గురువారం

గ్రహదృష్టుల వల్ల మారే ఫలితాలు

 🙏

గ్రహదృష్టుల వల్ల మారే ఫలితాలు సైంటిఫిక్ పరంగా వివరణ:


గ్రహములు -9 వాటిలో ఛాయాగ్రహాలు (రాహువు, కేతువు ) పోను మిగిలిన వి -7 కదా. మరి వీటిలో 

కుజ, గురువు, శనులకు మాత్రమే ప్రత్యేక దృష్టులు ఎందుకు ఉన్నాయి, మిగిలిన 4 గ్రహముల కు ఎందుకు లేవు. కారణము?


ఆకాశంలో గ్రహపరిధులు ఇలా ఉన్నాయి.

ముందుగా సూర్యుడు, సూర్యుని చుట్టూ బుధుని

పరిధి ఉన్నది. తరువాత వరుసగా శుక్రుడు, చంద్రునితో కలిసిన భూమి, కుజుడు, గురుడు, శని,యురేనస్,నెప్ ట్యూన్, ప్లూటో గ్రహపరిధులు ఉన్నవి.


🌸భూమికి వెలుపలనున్న గ్రహములు అన్నీ 'ఔటర్" ప్లానెట్స్" అంటారు. వీటిలో- కుజ, గురు,శని,,యురేనస్, నెప్ ట్యూన్, ప్లూటోలు వస్తాయి.🌸


మనం ఫలితాలు పరిశీలించేటప్పుడు కుజ, గురు, శనుల ప్రభావం ఎంతో ఉంది. యురేనస్, నెప్ ట్యూన్, ప్లూటోలను కూడా గ్రహించవచ్ఛు. కాని వాటి ప్రభావంపై పూర్తి అవగాహన లేదు. ఎక్కువ గా వీరున్న స్థానములను గూర్చియే ఫలితములు ఇంత వరకు వివరించబడ్డాయి. వీరి దృష్టులను గూర్చి నిర్థారణ జరగలేదు.వీటిని ఇంద్ర, వరుణ, యమ గ్రహాలుగా సూచించారు. ఇవి ఘనస్థితిలో లేవని, వాయుస్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు.

జాతకుని జాతక చక్రంలో కుజ, గురు, శనులను వారున్న స్థానమును బట్టి, నక్షత్రములను బట్టి నిర్ణయించుట ఆంధరికీ తెలిసినదే.కాని వీరిదృష్టి ఇతర గ్రహములపై పడినపుడు ఆ గ్రహములు తమ బలమును కోల్పోతాయి.


ఔటర్ ప్లానెట్స్ అయిన కుజ, గురు, శనుల దృష్టి 

ఇన్నర్ ప్లానెట్స్ అనబడే - చంద్ర, శుక్ర, బుధుల పై  పడినపుడు వీరు బలహీనులవుతారు.


 అయితే గురుని దృష్టి మాత్రము శుభదృష్టి కావున,గురు దృష్టి పొందిన ఇన్నర్ ప్లానెట్స్ చెడు ఫలితాలను ఇవ్వవలసి వస్తే వాటి తీవ్రత చాలా మేర తగ్గి పోతుంది.


ఔటర్ ప్లానెట్స్ ఆధీనంలోనే ఇన్నర్ ప్లానెట్స్ ఉంటాయి.


🌺మరొక విశేషం ఏమిటంటే ఔటర్ ప్లానెట్స్ కు విశేష దృష్టులు న్నాయి. 🌺


🏵ఇన్నర్ ప్లానెట్స్ కు కేవలం సప్తమ దృష్టి మాత్రమే ఉన్నది🏵

విశ్వంలోని ప్రతీ గ్రహము కొంత కాస్మిక్ కిరణ ప్రసారం చేస్తున్నవి.

🔥శని గ్రహము తన కాశ్మిక్ రేడియేషన్ లో గంధకము(సల్ఫర్)ప్రసరించుచున్నది. ఇది 3-10 దృష్టి వలన, దృష్టి పొందిన గ్రహము -చెడిపోయి 

మంచి ఫలితమివ్వలేదు.🔥


👌గురు గ్రహము యొక్కదృష్టిలో ఏ విధమైన విషకిరణ ప్రసారమూలేదు.

ఇది చల్లని మలయమారుతం వంటిది. "జీవకారకము" కనుకనే గురు గ్రహమునకు ‌"జీవ"

అను పేరుఉన్నది.

గురుని దృష్టి సంజీవని వంటిది.👌


💥కుజుని దృష్టిలో అగ్నితత్వమున్నది. అందుకే కుజుని 4-8 ప్రత్యేక దృష్టులు ఎంతో ప్రభావం కలవి.💥


గురుని సప్తమ దృష్టికుజ శనులపై బడిననూ వారి చెడును తగ్గించలేదు.


గురుని 5-9 ప్రత్యేక దృష్టి పడినచో కుజ, శనుల చెడు ప్రభావము చాలా మేర తగ్గి పోవును.


💢కాని కుజ, శనుల  సప్తమ దృష్టి పొందిన గురుడు

తన శుభత్వమును కొంతమేర కోల్పోవును.

అదీ విశేషం.💢

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: