7, జనవరి 2021, గురువారం

బ్రహ్మ, విష్ణు, మహేశ్వర

 బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, తత్వమూలమైన శక్తిని పరబ్రహ్మ తత్వ మని, ఆ పరబ్రహ్మ తత్వము శ్రీ రూపంలో కలదని అదియే ఓంకారమని యిది తెలుసుకొనుట పరబ్రహ్మ తత్వము. ఎలా తెలియాలి శ్రీగురు అనగా అది ఏమి? శ ర ఈ అనే పదం శబ్ద మూలం శ్రీ యని దాని శక్తి యెుక్క మూలం వ్యాప్తమైనది జీవులుగా తెలియును. శ్రీ అనే జీవుడు దేహమును ఆశ్రయించి ఆ దేహము ద్వారా తన లక్షణము యిది యని తెలియుట ఆహం బ్రహ్మాశ్మి. నేనే బ్రహ్మమును అనే పరతత్వమే తప్ప వేరు కాదు పరబ్రహ్మమును తెలియుట కష్టం.అది పదార్ధరూపము లేనిది. పదార్ధరూపం దేహం వలెనే. వేరు మార్గం లేదు పరబ్రహ్మ తత్వమును దర్శించుటకు. చతుర్ముఖ తత్వమైన నాలుగు వేదముల విభజన పూర్వక శక్తి లక్షణము జీవమని తెలియును. వేద వాక్యం వకటే కాని వాటిని సాంకేతికంగా సూత్ర ప్రాయంగా విభజించుట చతుర్ముఖ బ్రహ్మ తత్వం. అది రూపం కాదు. విష్ణు రూపం మానవ రూపంగా వామనావతార నామమును ద్వారా మాత్రమే జీవం పూర్ణ మని ఆకారమని తెలిసినది.అంతకు పూర్వం మృగ జంతు లక్షణములు. అవి పూర్ణం కావు ఙ్ఞానం తెలియుటకు. వామనుని వలన మాత్రమే ఆ విషయం తెలిసినది. అవతార మూల శక్తి ఈశ్వర శక్తి రూపమే మానవ రూపం. బ్రహ్మ రూపం మానవ రూపం కాదు. అది వేద పరమైన శక్తియెుక్కమూల లక్షణమే కాని నాలుగు ముఖముల రూపములో దృశ్యం ప్రకృతి రూపము నకు విరుధ్దం. అనగా పరబ్రహ్మ తత్వము అనగా చతుర్ముఖ పరబ్రహ్మ తత్వమే శ్రీ గురు రూపములో గల మానవ జీవన రూప లక్షణమని తెలియుచున్నది. ఈ అనే ఈశ్వర శక్తి రజో రూప లక్షణము విష్ణువుని దాని విభజన పదార్ధరూపమైన జీవ లక్షణము పరబ్రహ్మ తత్వమని పరబ్రహ్మ తత్వమే శంకరుల వారి అహం బ్రహ్మ అశ్మి.అశ్మి లో గల శం రజోగుణ మైన అనగా చైతన్యమైన అశ్మి. అనగాదీనికి ర అనే రుద్ర తత్వంతో చైతన్యమై రశ్మి,అనగా శక్తియని తెలియుచున్నది. అనగా అగ్ని మూలము. దాని చైతన్యం విషుః కిరణరూపంలో గల విష్ణు వ్యాప్తమైన రూపం. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: