మనకు కోపం బాధ ఉన్నప్పుడు
ఎవరితోనూ మాట్లాడకండి కాసేపు మౌనంగా ఉండండి
అవి తగ్గడానికి మంచి సంగీతాన్ని వినండి
మనల్ని ఎవరూ గౌరవించడంలేదని
మన మాటలకు విలువ ఇవ్వడం లేదని
మీలో మీరే మధనపడిపోకండి
మన విలువ మనకు తెలిస్తే చాలు
మన మాట విలువైనదైతే వారే వెతుక్కుని వస్తారు
ఇక్కడ ఎవరూ ఓడిపోకుండా లేరు
విజయానికి ముందు ఎన్నో ఓటములు చూసి ఉన్నవారే
ఓడిపోయానని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు
గెలుపు నీకు దగ్గరగానే ఉందని పరిగెట్టు
ఏమీ సాధించలేకపోయాననీ పిచ్చి ఆలోచనలు
మనసులో రానివ్వకు
అలా మనసు అటు ఇటు అంటూ అవస్థ పడుతున్నప్పుడు
మంచి పుస్తకం చదువు
పుస్తకాలకంటే మంచి మిత్రులు వేరొకరు లేరు
మనసును ఆ ఓటమి అనే పిచ్చి నుండి
దూరం చేయడానికి
కాసంత దూరం ఒంటరిగా నడవండి
ప్రకృతితో గడపండి మనసును ఉతేజపరచి
మనల్ని మామూలు స్థితికి తీసుకువచ్చే శక్తి
ఆ ప్రకృతిలోని అందాలు
అందమైన పువ్వులకు ఉన్నదీ
కాసేపు ఆ జాబిలిని చూస్తూ గడుపు
ఇక ఎప్పటికీ గెలవలేనేమో అని నిరాశ పడకు
నీపైన నీకే నమ్మకం లేకపోతే ఇంకెవరూ నిన్ను నమ్మగలరు
ఒకేసారి విజయం నిన్ను వరిస్తే ఆ తియ్యదనం నువ్వు ఎలా ఆస్వాదించగలవు
మనకు ఏమీ జరిగినా మన మంచికే అనుకుంటూ జీవితపు అడుగులు ముందుకు సాగనివ్వు
నిన్ను చూసి హేళన చేసినవారే నిన్ను చూసి అసూయపడేలా మారి చూడు
మనం ఒకరితో స్నేహం కానీ బంధం కోసం కానీ పరిగెట్టరాదు
మనతో స్నేహం కోసం మనల్ని వెతుకుంటూ వచ్చేలా ఆత్మవిశ్వాసంతో ఉండు
నిజాయితీని నీ పక్కనే ఉంచుకుంటే చాలు
నమ్మకం ఎప్పుడూ నీకు అండగానే ఉంటుంది నీతోనే ఉంటుంది
ఒక్కడినే అని ఎప్పుడూ ఒంటరిగా ఏమీ చేయగలని వెనుకడుగు వేయకు
ఒంటరిగానైనా ఒక్కడే అయినా మనకు మనమే ధైర్యం కావాలి మనకు మనమే గొప్ప కావాలి
ఇది పొగరు అస్సలు కాదు మనలోని ఆత్మవిశ్వాసానికి రూపం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి