7, జనవరి 2021, గురువారం

దేవాలయముల యందు


దేవాలయముల యందు భక్తులు చేయకూడని పనులు దేవాలయాల్లో ఇతరులకు నమ స్కారంచేయకూడదు!? 

ఎందుకో తెలుసా?

                                                                                                        ఆలయాల్లోఇతరులకునమస్కా రము చేయకూడదు. ఎందుకంటే భగవంతుని ముందు-అందరూ సమానులే అని భావించాలి.


దేవాలయాలుపంచ(ఐదు)రకములుగా ఉంటాయి.

స్వయంవ్యక్త స్థలాలు:- భగవంతుడే స్వయంగా వెలసినవి.


దివ్యస్థలాలు:- దేవతలచేప్రతిష్టిం పబడినవి.


సిద్ధ స్థలాలు:- మహర్షులు, తప స్సుచేసి సిద్ధి పొందినవి, స్వాములు ప్రతిష్టించినవి.


పౌరాణిక స్థలాలు:-పురాణాలలో చెప్పబడి ప్రసిద్ధిగాంచినవి.


మానుష స్థలాలు:- రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ట చేయబడి ఉం టాయి.


దేవాలయ గోపురాలు:-

హిందూ దేవాలయాల్లో ఎక్కువగా గాలి గోపురాలు ఉంటాయి. గాలిగోపురం, ప్రధాన ద్వారం,వైకుం ఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వారపాలకులు, వంటశాల తదిత ర విభాగాలు ఉంటాయి.


ఈ పనులు చేయకండి:-

దేవాలయాల్లో ఆగమశాస్త్రం ప్రకా రము పూజారులు, భక్తులు, అధికా రులు ఏవిధంగా వ్యవహరించకూడదంటే ముఖ్యంగా ఆలయంలోపలి కి ఎవ్వరూ కూడా వాహనాలలో రా వడం చెప్పులు,బూట్లు,పాదరక్షలు వంటి వాటితో తిరగడంచేయరాదు.


దేవాలయమునకు ప్రదక్షణలు చేసేఅప్పుడే లోపలికి ప్రవేశించాలి.

ఆలయం లోపలికి తలపాగా, టోపిధరించి వెళ్లకూడదు. అలాగే చేతుల్లో ఏవైనా ఆయుధాలను పెట్టుకుని అస్సలు ప్రవేశించకూడదు.


మనముతినే,తినుబండారాలను తీసుకుని వేళ్ళరాదు.          ఆలయంలో దైవసన్నిధికి ఒట్టి చేతు లతోగాని, కుంకుమ పెట్టుకోకుండా గాని, తాంబూలచర్వణం చేస్తూగాని, తినుబండారాలేవైనా తింటూ గాని దేవాలయంలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదు.


దేవాలయము తీసిఉన్న సమయమున నిద్రపోరాదు


దేవాలయంలో అడుగుపెట్టినతర్వా త పగలు,నిద్రపోవడం, కాళ్లు చాపు కుని కూర్చోవడం వంటి పనులను కూడా చేయరాదు. అలాగే ఆలయ ప్రాంగణంలో మల, మూత్ర విసర్జన, ఉమ్మివేయుట,వంటి పనులు చేయ కూడదు.


దేవాలయమునదైవసన్నిధిలోనవివాదాలు పెట్టుకోరాదు.


ఆలయాల్లో ఎవ్వరితోనూ. ఎప్పటి కీ వివాదం అనేదే పెట్టుకోరాదు. అలాగే దేవాలయ ప్రాంగణంలో ఏ జీవికీ హాని కలిగించడం లేదా హింసిం చడం వంటివి అస్సలు చేయరాదు.


ఇతరులతోదేవాలయముపైవిమర్శలు,దైవదూషణ,పరనింద చేయకూడదు.


దేవాలయ ప్రాంగణంలో అహంకారం, గర్వంతో, అధికార దర్పంతో అస్సలు ఉండకూడదు. దేవుని ఎదుట పరస్తుతిని, పరనింద వంటి పనులను చేయరాదు.                                  ఒకే చేతితో నమస్కారం చేయరాదు. అధికార గర్వంతో దేవాలయమున కూడని సమయాన అకాలమందున దైవప్రాకారంలో ప్రవేశించి అకాల 

సేవలను చేయించరాదు. అలాగే, దేవుని ఎదుట ప్రుష్ఠభాగం చూపిస్తూ కూర్చోకూడదు.                                            అధికాదర్పము చూపించి తనఉనికి మరచి ప్రవర్తించరాదు.                              తనకుభక్తి శ్రద్దలేకుండా తన ద్రవ్యం,  తాను సంపాదించని పూజా ద్రవ్యములతో పూజలు చేయించుకొనరాదు. దాన, దక్షణలులేని పూజలు నిరర్దకములు .ఫలితము నివ్వజాలవు. అశుభహేతువులు.                     దేవాలయములందు ఆగమవిధులను అనుసరించి నడచుకొనవలెను. దేవాలయ పరిపాలనకు సహకరించి దేవాలయ నిత్యసేవాదులు నడచుటకై ధనమును దానమిచ్చుట. భగవానుని  కి ధనము(హుండిలో) నిక్షిప్తముచేయుట, (వేయుట) ఆర్జిత సేవలయందు దేవాలయమున సహస్రనామ, అష్టోత్తరశతనామ, ,అభిషేకము,హోమములకు, వివిధపూజాసేవలకై, తప్పనిసరిగా అందరుటిక్కేట్టు తీసుకొనుట, విధిగా చేయవలసిన పనియని, టిక్కేట్టును తీసుకొనుట అవమానమని భావించి టిక్కేట్టును తీసుకొనక చేయించుకొను పూజలు దైవాపరాధములు,దైవ ద్రోహముగా ఆగమమున చెప్ప బడినది. అట్టిపుాజ ఫలసూన్యము. అశుభముగా తెలియనగును.

                

పత్రం,పుష్పం,ఫలం,తోయం,యో మేభక్త్యా ప్రయచ్చతి,అని శాస్ర్తవచనము.                               కావునమనము భక్తి శ్రద్దతోదేవాల యమందు మెలగ వలసి ఉన్నది. ఆలయ నియమానుసార విధు లను అనుసరించి దైవదర్శనము అ ర్చనలు,సేవలు, కైంకర్యములు చేయవలసిన అవుసరం ఉన్నది, అన్న విషయము అందరము గ్రహించి పాటించాలి. 

స్వస్తి🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: