7, జనవరి 2021, గురువారం

నవగ్రహాల అనుకూల స్తితి*

 *నవగ్రహాల అనుకూల స్తితి*


గ్రహాలు అనుకూలించాలి అంటే పరిహార ప్రక్రియలు చేసుకోలేని వారికి ఈ విధంగా చేస్తే గ్రహాలు కొంత వరకు  అనుకూలిస్తాయి. రవిచంద్రులు అనుకూలించాలి అంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి. తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి. గురు బలం కావాలంటే ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి. లేకుంటే రోజు పసుపును పాలతో కలిపి నుదుటన బొట్టు పెట్టుకోవాలి. ఆడవారు అయితే ముఖానికి పసుపు రాసుకోవాలి. శుక్ర గ్రహం అనుకూలించాలి అంటే ఇంటి ఆడ పిల్లలను గౌరవించాలి. ఆదరించాలి అలా చేస్తే శుక్ర గ్రహము వందకు రెండు వందల శాతం అనుగ్రహం ఇస్తుంది. ఒకవేళ ఇంటిలో ఆడపిల్లలు లేకుంటే మేనత్తను గౌరవించాలి. అత్త కూడా లేకుంటే కన్నతల్లిని గౌరవించాలి. కన్నతల్లి కి శుక్రవారం రోజు తాంబూలం ఇచ్చి పాద నమస్కారం చేసుకోవాలి. కుజుడు అనుభవించాలంటే సోదర వర్గాన్ని ఆదరించాలి. సోదరి బాగా చూసుకోవాలి. కార్తీకమాసం వచ్చిన భగినీహస్తభోజనం శుద్ధ విదియ నాడు వస్తుంది. ఆడపిల్ల ఇంటికి వెళ్ళి  భోజనం చేసి బట్టలు పెట్టి  రావాలి.  శని భగవానుడు  అనుకూలించాలి అంటే ఇంట్లో పని మనుషుల పై చికాకు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పనిచేసే వారికి తగినంత జీతం ఇవ్వాలి. ఇంట్లో పని వారు లేకుంటే బీద సాద లను వికలాంగులను ఆదరించాలి. బుధుడు అనుగ్రహించాలంటే మేనమామను ఆదరించాల బాగా చూసుకోవాలి. యోగక్షేమములు బాగా చూసుకోవాలి. 

....

..............

కామెంట్‌లు లేవు: