7, జనవరి 2021, గురువారం

భయమే మరణం


భయమే మరణం:- భయపడుతూ జీవించేవారు అనుక్షణం మరణిస్తూ ఉంటారు. అలాగే వీరికి తరుచూ అనారోగ్యాలు వస్తాయి. 

ఎవరో ఏదో తీసుకెళ్లిపోతారనీ, మన నుండి లాగేసుకుంటారనీ, మనల్ని తొక్కేస్తారనీ కుంచించుకుపోయి భయంభయంగా బ్రతకడం మంచిది కాదు.


జీవితం నుండి శాశ్వతంగా తీసుకెళ్లగలిగేది ఏదీ ఉండదు. వేరే వాళ్లు లాక్కునేది ఏదీ ఉండదు. నిరంతరం మొహంపై వెలిగే కల్మషం ఎరుగని చిరునవ్వు మాత్రమే ఉన్నన్నాళ్లూ జీవితాన్ని వెలిగిస్తుంది. మన సంకుచితాలు అన్నీ మన మనస్సుని బంధీఖానా చేసి ఒరిపిడికి గురిచేసే ఛెయిన్స్ మాత్రమే. వాటిని ఎంత త్వరగా తొలగించుకుంటే అంత మంచిది.


స్వార్థాలూ, కుట్రలూ, గాసిప్స్, పక్కోడి గురించి చెడ్డగా మాట్లాడడాలూ, అనవసరమైన క్యూరియాసిటీలూ, కుల, మత, ప్రాంతీయాభిమానాలూ, ఇతర సంకుచిత స్వభావాలను అధిగమించినప్పుడు మాత్రమే నిజమైన హృదయం వికసిస్తుంది. లేదంటే ఉండేది బానిస బ్రతుకే. జైల్లో ఖైదు చేసిన నేరస్థుడు, స్థంభానికి కట్టేసిన జంతువు ఎలాగైతే అటూ ఇటూ ఓ ఛట్రంలో తిరుగాడుతూ సంఘర్షణ పడుతుందో అలాంటి నీ మానసిక సంఘర్షణే నీ శాపాలూ, నీ దురదృష్టం అనే పదాలూ! వాటిని అధిగమించు. ఆత్మ విశ్వాసం , భగవాన్ పై విశ్వాసం, ధర్మ ఆచరణ , ఇదే ఉత్తమ స్థితి ని శాంతి ని అందిస్తుంది. 

స్వస్తి🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: