30, జూన్ 2023, శుక్రవారం

అతని వలననే

అతని వలననే  







వాట్సాపులో వచ్చిన ఒక వీడియోకు నే నిచ్చిన  అక్షర రూపం 

సురేష్ ఒక యువకుడు ఉద్యోగరీత్యా తల్లిదండ్రులను వదిలి ఒంటరిగా ఉంటున్నాడు.  తాను నివసించే రూముకు దగ్గరలోనే ఒక టిఫిన్ సెంటరు వుంది ఆ సెంటరులో ఎప్పుడు రద్దీగా ఉంటుంది.  యెంత రద్దీ అంటే అక్కడ టిఫిన్ తిన్నతరువాత కౌంటరులో బిల్లు చెల్లించాలంటే కనీసం 5నిముషాలు ఆగవలసి ఉంటుంది అంటే అక్కడి రద్దీని ఊహించుకోవచ్చు. రోజు సురేష్ ఆ హోటలుకు వెళుతూ ఉండటం వలన అక్కడి వేయిటరులు ఇంకా ఇతర ఉద్యోగస్స్తులు పరిచయం అయ్యారు.  అందువల్ల వారికి సురేష్ ఏమి తింట్టాడు ఏమి తాగుతాడు అంటే కాఫీ, టీలు అన్ని తెలుసు కాబట్టి అతనిని చూడంగానే ఆయన అడగకుండానే అన్ని సమకూర్చేవారు.  అది సురేషుకి కొంత ఆనందం  కలుగచేసింది. తన పరపతి హోటల్లో ఉందని అనుకోని తరచూ తన స్నేహితులిని కూడా ఆ హోటలుకే తీసుకొని వచ్చేవాడు. 

ఇది ఇలా ఉండగా సురేష్ గత కొంతకాలంగా ఒక విషయాన్ని గమనించాడు అదేమిటంటే ఒక నడివయస్కుడు పాత బట్టలు వేసుకొని సరిగా షెవింగు కూడా లేకుండా ఉన్నతను రోజు ఆ హోటలుకు వచ్చి టిఫిన్ తిని అక్కడి మందలో కలిసి చిన్నగా బిల్లు కట్టకుండా తప్పించుకునేవాడు. ఈ విషయాన్నీ మన హీరో సురేష్ చాలా కాలంగా గమనిస్తూ వున్నాడు. ఎట్లాగైనా ఈ మోసాన్ని ఆ హోటలు యజమానితో చెప్పి అతనికి శిక్ష పడేవిధంగా చేసి తన గొప్పతనం చాటుకోవాలని ప్రయత్నం  చేయసాగాడు. కానీ రోజు కౌంటరు దగ్గర అనేకమంది ఉండటంతో ఆ కౌంటరుమీద కూర్చున్న యజమానితో మాట్లాడటమే కుదరటంలేదు.  రోజు రోజుకు సురేషుకు అసహనం పెరిగిపోతున్నది. ఇదేమిటి ఈ హోటలు యజమానికి ఇంత నష్టం వస్తువున్న ఒక్క వెయిటర్ కూడా ఎందుకు చెప్పటంలేదు అని మనసులో అనుకోనగానే  అక్కడి వెయిటర్లమీద కోపం వచ్చింది 

ఒకరోజు ఎందుకో కాని టిఫిన్సెంటరులో కస్టమరులు చాలా తక్కువగా వున్నారు. అప్పుడే మన సురేషు అనుకున్నాడు ఇది సరైన సమయం నేను ఆ మనిషి మోసాన్ని హోటలు యజమానికి చెపుతాను అని అనుకోని కౌంటరు వద్ద కూర్చున్న యజమానితో తానూ రోజు చూస్తున్న విషయాన్ని చెప్పి మీరు పోలీసు కంప్లీన్ట్ చేయండి అటువంటి మోసగాళ్లను అస్సలు వదిలి పెట్ట కూడదు.  కావాలంటే నేను మీకు సాక్ష్యం కూడా చెపుతాను.  నా రక్తం వుడుకుతున్నది అని ఆవేశంతో చెప్పాడు.   అది విన్న హోటలు యజమాని తన సీటు మీది నుంచి లేచి ఒక టేబులు ముందర కూర్చొని సురేషును కూడా అక్కడ కూర్చోమని సైగ చేసాడు. ఇద్దరు టేబులు వద్ద కూర్చోగానే హోటలు యజమాని నవ్వుతూ ఒక వేటర్ని పిలిచి మా ఇద్దరికీ రెండు మంచి కాఫీలు తీసుకునిరా అని ఆర్డర్ వేసి ప్రశాంత వదనంతో ఇలా అన్నాడు చూడు సోదర నీవు గత కోద్ది కాలంగా మా హోటలుకు వస్తువున్నావు నీవు వచ్చినప్పటినుండి నీవు చూసినది నీవు చెప్పావు.  కానీ అతను చాలా  కాలంగా నా హోటలుకు వస్తువున్నాడు. అతను రావటం బిల్లు కట్టకుండా పోవటం నేనెరుగుదును అని అన్నాడు.  అప్పుడు ఆశ్చర్యపడటం సురేషు వంతయింది. ఆ అలానా అయితే మరి ఇంతవరకు అతని మీద ఎందుకు చర్యతీసుకోలేదు అని అడిగాడు.  ఇంతలో వెయిటరు కాఫీ తీసుకొని వచ్చాడు. మిత్రమా ముందు కాఫీ తాగు అంతా వివరంగా చెపుతాను అని హోటలు యజమాని అన్నాడు.  సురేషు మెదడులో అనేక సందేహాలు ఇదేమిటి నేను ఇతనికి మేలుచేసే విషయంచెప్పి మార్కులు కొట్టేద్దాము అని అనుకున్నాను.  ఈయనేమో ఎంతో కూలుగా ఉండటమే కాకుండా అంతా తనకు తెలుసు అంటున్నాడు అని మనసులో అనుకున్నాడు. మిత్రమా కాఫీ తాగు ముందు అంతా నీకు సవివరంగా చెపుతాగా అని అన్నాడు. 

నా కొక ప్రశ్నకు సమాధానం చెప్పు నా హోటలులో రద్దీ ఎలావుంది అని అడిగాడు యజమాని.  మీ హోటలుకు ఏమిటి సారూ ఈ ఏరియాలో వున్న అన్ని హోటళ్లకన్నా ఎక్కువ రద్దీ మీదే మాతో మాట్లాడాలని నేను ఎన్నో రోజులనుండి చూస్తుంటే ఈ రోజు నాకు అవకాశం లభించింది అన్నాడు. అంటే నా హోటలు మంచిగా నడుస్తున్నదని నీవు వప్పుకున్నావన్నమాట అని అన్నాడు.  నేను వప్పుకోవటం ఏమిటి మీ హోటలుకు వచ్చిన ఏ కొత్తవారయినా అదే అంటాడు. ఇంత రద్దీగా ఉండటానికి కారణం అతనే అని అన్నాడు. నిజానికి  ఈ రోజు కూడా నీకు రద్దీగానే ఉండేది కానీ ఈ రోజు పండగ చేయబట్టి ఎవ్వరు బయటి టిఫిను చేయరు ఎంచక్కా ఇంట్లో రకరకాల వంటాకాలు వండుకొని తింటారు. నిజానికి నేను ఈ రోజు హోటలుకు సెలవు  ఇవ్వవలసింది. కానీ నీలా వంటరిగా వుండే వాళ్లకు ఇబ్బంది అవుతుందని టిఫిన్ సెంటరు తెరిచాను అని అన్నాడు. 

ఈ రోజు నా హోటలు ఇంతమంది కస్టమరులతో కళ కళ లాడుతూ ఉన్నదంటే దానికి కారణం ఆయనే తెలుసా అన్నాడు. ఇదేమిటి ఒక బిల్లు ఎగ్గొట్టే వాడు మీ హోటలు అభివృద్ధికి కారణమా నిజానికి అతను ఎగవేసిన డబ్బులు చాలా మీరు నష్టపోయారు. అయినా కూడా మీరు అతనే మీ అభివృద్ధికి కారణం అని అంటున్నారు ఇదెలా సాధ్యం అని సురేషు అన్నాడు. చెపుతాను విను అని హోటలు యెజమాని చెప్పటం మొదలు  పెట్టాడు. మొదట్లో నేనుకూడా అతను బిల్లు ఎగవేసి పోవటం గమనించి అతనిమీద కక్ష సాధిద్దామని ఒకరోజు అతనిని వెంబడించాను.  ఆ విషయం తెలియక అతను ఇక్కడికి దగ్గరిలోవున్నఒక  చెట్టుక్రింద కూర్చొని భగవంతుని ఇలా ప్రార్ధిసున్నాడు " భగవంతుడా ఆ హోటలులో ఎప్పుడు రద్దీగా ఉండేటట్లు చూడు అప్పుడే నేను బిల్లు కట్టకుండా తప్పించుకోగలుగుతాను" అది విన్న నాకు అతనిమీద కోపం పూర్తిగా పోయింది.  దానికి బదులుగా ఆయనమీద నాకు జాలి కలిగింది. ఈ రోజు నేను ఈ స్థితిలో వున్నానంటే దానికి కారణం అతనే అవునంటావా కాదంటావా అన్నాడు. భగవంతుడు ఆతని ప్రార్ధనను మన్నించి నా హోటలులో రద్దీని పెంచాడని ఎందుకు అనుకోకూడదు. నిజానికి అతని స్వార్ధం కేవలం అతను బిల్లు కట్టుకోకుండా తప్పించుకోవటమే కానీ అతనికి తెలియకుండా ఆ భగవంతున్ని నాకు ఎక్కువ కస్టమర్లు రావాలని ప్రార్ధించాడు. అందుకోనేమో అతను నాహోటలుకు వచ్చిన నాటినుండి హోటల్లో రద్దీ ఎక్కువ అయ్యింది నా రాబడిరోజు రోజుకు  పెరగసాదింది. అతను రోజు తింటే యాబై లేక వంద రూపాయల టిఫిను  తింటాడు. కానీ నాకు లాభం వేలల్లో వస్తువున్నది. ఇప్పుడు చెప్పు నాకు అతని వల్ల లాభమా లేక నష్టమా అని అన్నాడు. ఇలా ఆలోచించేవారు కూడా వుంటారా అని నాకు ఆక్షణంలో అనిపించింది. 

 ఆ హోటలు యజమాని మంచితనం సురేషు ఆనందాన్ని ఇచ్చింది.  ఇద్దరు కాఫీలు తాగటం అయ్యింది. బిల్లు ఇస్తానని సురేసు అంటే మీరు నా అతిధులు మీకు నేను ఆతిధ్యం ఇచ్చాను అని అని ఇంకొక మాట అన్నాడు.  మీరు నేను అతని వద్ద బిల్లు తీసుకోవటం లేదనుకున్న నిజానికి ఏ రోజయిన ఆయన రాకపోతే నాకు ఎందుకో మనసు బాధ  పడుతుంది. ఈ రోజు ఆయనకు ఏమైంది ఎందుకు రాలేదు అని అనుకుంటాను. ఆయన రావటం అలానే తప్పించుకొని వెళ్ళటం నేను ఓరగంట కనిపెడుతాను. నిజానికి ఆయన తినే టిఫిన్లు నేను భగవంతునికి అర్పించిన నివేదనగా భావిస్తాను అని అన్నాడు. హోటలు యజమాని ఔదార్యానికి సురేషు హృదయం పులకరించిపోయింది. 

సామాన్యంగా మనమన్దరము చేసే ప్రతిపనికి అప్పుడే ప్రతిఫలం  కావాలనుకుంటాము. కానీ భగవంతుని లీలలు మనకు అర్ధంకావు అయన కొన్ని మన వద్ద తీసుకొని వాటికి బదులుగా  ఎన్నో మనకు  ఇస్తాడు.  ఈ విషయం తెలుసుకుంటే భూమిమీద ప్రతివక్కరు సంతోషంగా వుంటారు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః. 

మీ 

భార్గవ శర్మ