12, ఆగస్టు 2023, శనివారం

రామాయణము ..288

 రామాయణము ..288

...

ఆనందము ఆర్ణవమై ,రాహువు విడిచిన చంద్రబింబమువలే సీతమ్మ ముఖము ప్రకాశించసాగింది.

.

ఆమెకు నమ్మకము కలిగింది,

 ఆతడు రాముని దూతయేనని ,

.

తన ప్రాణనాధుడు,తన హృదయవిహారి అయిన రాముని సందేశమేదో హనుమ తెచ్చినాడని మనస్సులో సంతోషము మొగ్గలు తొడిగి ఆమె ముఖపద్మము సహస్రదళ వికసిత కమలమయ్యింది.

.

అమ్మా సీతమ్మా! ఇదుగో రాముని ఆనవాలు ! ఆయన అంగుళీయకము అని హనుమ స్వామి సీతమ్మకు శ్రీరాముని ఉంగరము ఈయగా తన ప్రియవిభుని కరస్పర్శపొందినట్లయి శరీరము పులకెలెత్తి కన్నుల వెంట ఆనందభాష్పములు జలజలరాలి సిగ్గులమొగ్గయిన సీతమ్మ తల్లి బాహ్య ప్రపంచ స్పృహను కోల్పోయి అంతరంగమందు రామపరిష్వంగ మధురోహలు ముప్పిరిగొనగా చేతనావస్థను కోల్పోయినదాయెను.

.

 మనస్సు రామమయము,

ప్రపంచము రామమయము, రమణిసీత ఊహలు రామమయము ,

జగమే రామమయమయ్యి అశోకవనము ఆమెకు రమణీయముగా కనపడెను.

.

అమ్మా సీతమ్మా ! అన్న పిలుపుతో తేరుకొని హనుమను బహుథా ప్రశంసించసాగింది సీతామాత.

.

జానకిరామారావు వూటుకూరు

కామెంట్‌లు లేవు: