12, ఆగస్టు 2023, శనివారం

సీతారామాంజనేయ సంవాదము.*

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<*



*శ్రీ రామచన్ద పరబ్రహ్మణే నమః*


*సీతారామాంజనేయ సంవాదము.*


*ప్రథమాధ్యాయము*


*భాగము - 7*



మ. గరిమ స్వర్ణ మనేక భూషణములై; కన్నట్టు చందంబున.

బరమాత్ముం దఖిల ప్రపంచమయుఁడై; భాసిల్లు నట్లాటచే 

సురసిద్ధోరగయక్ష కిన్నరసర; స్తోమాది శశ్వచ్చరా చరరూపోజ్జ్వలసర్వభూతములకు; సద్భక్తితో మ్రొక్కెదన్.


తాత్పర్యము: 


బంగారముంటే అందులోంచి రకరకాల ఆభరణాలను వృత్తికారుడు, తన శక్తి మేరకు, మయుని వలె తన చాతుర్య మంతా ఉపయోగించి మరీ చేస్తాడు. 


అలాగే పరమాత్ముడు, తనను నమ్మినవారికి, కోరిన విధంగా దరిశనమిచ్చి, వారి వారి కోర్కెలను, ఆ కోరిన ప్రకారం ప్రసాదిస్తాడు. 


అందుకనే తను తమ కర్కెలు నెరవేర్చుకొనుటకు ఇంద్రాది సర్వదేవతలు తమకు రక్షకుడైన ఆ పరమాత్మునికి శరణాగతులై, ఆయన కరుణ ప్రసరించ అంజలి ఘటించి ప్రార్థిస్తుంటారు.



సీ. కమనీయవరదివ్య; కాంచనచేలంబుఁ గాషాయవస్త్రంబు;గా ధరించి

చాపబాణంబులఁ జంచత్కమండలు

దండము ల్లాఁగ హస్తములఁ బూని

రమణీయరత్నహా;రంబు రుద్రాక్షమా

లికగా గళంబున; లీలఁ దాల్చి

సీతావధూటిని; శ్రీరాజయోగాహ్వ

యాధ్యాత్మవిద్యగా; నవధరించి.



గీ. ప్రేమ మీఱంగ శ్రీరామ; రామ రామ యనుచుఁ దన పేరు నుడువుచు; నద్భుతముగ 

శ్రీ మహాదేవగురుఁ డైన; రామవిభుఁడు 

గరుణతోడుత నెదుట 

సా; క్షాత్కరించె.


తాత్పర్యము: 


బంగారు వస్త్రాలు ధరించు 

నా రాముడు, కాషాయ వస్త్రములు విలాసముగా ధరించి, తన సొగసుల సర్వుల సమ్మోహనబరచు, 


ఆ నీలమేఘ శ్యాముడు, సర్వాభరణములను త్యజించి, రుద్రాక్ష మాలలు, ధరించి, విల్లంబులు చేబూని, 


జనకసుత, ఆధ్యాత్మిక శక్తి (జనక) మూర్తిని ముందు పెట్టుకుని, తన దివ్య నామముతో సర్వులను తరింపచేయు, 


సీతా, రాముడు, నా గురుదేవుల కరుణించిన 

ఆ పరబ్రహ్మము, నా "శ్రీ" గురుస్వరూపముగా దరిశనమొసగి కరుణించ కోరుతున్నాను.



*సేకరణ : సకల దేవత సమాచారం గ్రూపు.*



🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

కామెంట్‌లు లేవు: