12, ఆగస్టు 2023, శనివారం

ఆలోచనాలోచనాలు

 👍 ఆలోచనాలోచనాలు👌 ఖర్చు లేని ఎనిమిది విలువైన బహుమతులు 💐 1* శ్రద్ధగా వినడం;--- అవునండీ! శ్రద్ధగా వినేవారినే మాట్లాడేవారు కోరుకొంటారు. అడ్డుచెప్పకుండా ఓర్పుగా ఎదుటి వ్యక్తుల మాటలను ఆలకించండి. మీరంటే వారెంతో ఇష్టపడతారు.          2* వ్యక్తులను ప్రేమించడం;---- మీరు ఎదుటివ్యక్తిని అభిమానిస్తున్నట్లు, ప్రేమిస్తున్నట్లు మీ మాటలద్వారా, చేతలద్వారా తెలియజేయండి. మీ శ్రేయోభిలాషులు మీ ప్రేమపట్ల ముఖం వాచివున్నారని గమనించండి.                       3* కార్టూనులు, జోక్స్ , హాస్యరచనల ద్వారా హాయిగా నవ్వడానికి ప్రయత్నించండి. నలుగురితో కలిసి హాయిగా నవ్వగలిగితే విందు భోజనంలో పాల్గొన్న అనుభూతి ఏర్పడుతుంది.     4* కృతజ్ఞత తెలియజేయడం;----మౌఖికమైన "" థాంక్ యు"" కంటే ఒక గేయమో, పద్యమో, చిత్రలేఖనమో లాంటి వ్రాతపూర్వక కృతజ్ఞత ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది.                5* అభినందించడం ;---- వస్త్రధారణ, అలంకరణ, ఉపన్యాసం, చిత్రలేఖనం, గీతాలాపన అదేదైనాగాని ఎదుటి వ్యక్తుల ప్రదర్శనను మనసారా అభినందించండి. వారిని ఆనందపరచండి.                  6* సహాయపడడం ;---- అనారోగ్యంతో ఉన్నప్పుడు, కుటుంబం లేదా వ్యక్తులు ఇబ్బందులలో ఉన్నప్పుడు వారికి ఆర్థికంగా, సహాయపడండి. మీరెల్లకాలం వారి జ్ఞాపకాలలో నిలిచివుంటారు. తిరిగి మీకు ప్రత్యుపకారానికి వారు సంసిద్ధంగావుంటారు.            7* ఏకాంతవాసం ;---- ఆలోచనలు మీరు ఒంటరిగా ఉన్నప్పుడే పెల్లుబుకుతాయి. జనారణ్యాలకు దూరంగా వైదొలగి రోజూ కొంతసేపు ఏకాంతంలో ఉండండి. ఇతరులకు కూడా ఈ సౌకర్యం అందేలా చూచుకోండి.                        చివరగా- - - - - -                    8* ఉల్లాసవంతమైన మనోవైఖరి;---- హాయిగా ఉండటానికి ప్రయత్నించండి. "" కాస్టర్ ఆయిల్ ఫేస్ "" లతో జనాలను బాధ పెట్టకండి. ఈ లోకంలో బాధలు, కష్టాలు లేని మనుషులంటూ ఉండరు. మీ సమస్యలతో ఇతరుల ఆనందాన్ని చెడగొట్టే హక్కు మీకు లేదు.               అన్నింటికీ మించి స్నేహితులు అరుదైన ఆభరణాలు. నిరంతరం మీ మేలును కాంక్షించే వారికి పైన పేర్కొన్న చిరుబహుమతులను కూడా అందించలేని దుస్థితిలో మనం లేము కదా!!                                    * * * * * * * * * * * * * * * * * * * *                                తెలుగు నుడికారం ( సామెతలు)                        1* రోలుపోయి మద్దెలతో మొర పెట్టుకున్న చందంగా.   2* దయ్యాలు వేదాలు వల్లించినట్లు.                        3* ఎద్దులా ఉన్నావ్! తేలు మంత్రం కూడా రాదా?            4* చుట్టమై వచ్చాడు; దయ్యమై పట్టాడు.               5* ఇల్లు అలుకగానే పండుగ అయినట్లా?          6* ధర్మానికి పోతే ఖర్మ చుట్టుకొందట.                      7* బిడ్డనిచ్చి తగవు తెచ్చుకోవాలి; లేదా డబ్బిచ్చి తగవు తెచ్చుకోవాలి.                      8* బలహీనుని భార్య ఊరంతటికీ మరదలే;            9* వాళ్ళది ఉప్పు, నిప్పు చుట్టరికం.                          10* నోరు మంచిదైతే ఊరంతా మంచే!                   తేది 12-- 8-- 2023, శనివారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: