*1834*
*కం*
అర్థము కన్నను వేగమ
పార్థము చెలరేగగలుగు పరికించంగా.
వ్యర్థంబగునుద్రేకము
స్పర్థలతో మనసు చెరచు సతతము సుజనా.
*భావం*:-- ఓ సుజనా!పరిశీలించగా అర్థం కన్నా అపార్థం వేగంగా చెలరేగుతుంది. అనవసరమైన ఉద్రేకము ఎల్లప్పుడూ స్పర్థలతో మనస్సు ను చెడగొట్టును.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి