12, ఆగస్టు 2023, శనివారం

బహిష్టు సమయంలో

 బహిష్టు నందు అతి రక్తం స్రవించు  సమయంలో అతిరక్తంను ఆపుటకు నేను ప్రయోగించిన సులభ యోగం  - 


     కొందరి స్త్రీలలో ముఖ్యముగా యుక్తవయస్సులో ఉన్నటువంటి బాలికలలో అతిరక్తస్రావం జరుగుతుంది. నెలకు 10 నుంచి 15 రోజుల వరకు కూడా బహిష్టు రూపంలో రక్తస్రావం జరుగును. మరికొందరిలో నెలకు రెండుసార్లు బహిష్టు అవుతారు. ఎదిగే వయస్సులో అటువంటి సమస్య రావటం వలన రక్తం విపరీతంగా బయటకి పోయి శరీర దౌర్బల్యానికి గురిఅవుతారు. 


     కొన్ని రోజుల  క్రితం ఇటువంటి సమస్యతో బాధపడుతున్న ఒక కుటుంబం నన్ను సంప్రదించారు . యువతి వయస్సు 18 సంవత్సరాలు . ఆ యువతికి బహిష్టు సమయంలో విపరీత రక్తస్రావం జరుగుతుంది.దానివలన బాగా బలహీన  పడిపోయింది . 


        బహిష్టు సమయంలో జరిగే రక్తస్రావమునకు మగ్గిన చక్కెరకేళి అరటిపండుకు నాటు ఆవునెయ్యి పూసి తినిపించమని చెప్పాను . కేవలం 3  రోజుల్లో  సమస్య తీరినది. 


            ఇది నా అనుభవ యోగం 

  

  గర్భాశయము నందు కణతులు లేదా గడ్డలు ఉండి అధిక రక్తస్రావం ఉన్నచో చికిత్స తప్పక చేయవలెను . ఈ మధ్యకాలంలో ఇటువంటి సమస్యలకు ఆపరేషన్ చేసి గర్భాశయం తీసివేస్తున్నారు ఇలా చేయడం వలన శరీరము నందు హార్మోన్స్ అసమతుల్యత ఏర్పడి విపరీతంగా శరీర బరువు పెరిగి అనేకరకాల సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టును . 


     గర్భాశయం తీయాల్సిన పని లేకుండా ఆయుర్వేదము నందు చాలా మంచి చికిత్సలు కలవు . 


 

    నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


   

కామెంట్‌లు లేవు: