మానవ జీవితానికి వివాహం తోనే పూర్ణత్వం సిద్దిస్తుంది. వివాహం ఒక మధుర స్వప్నం. సామాజిక అవసరం!
ఐతే మారుతున్న సామాజిక పరిస్థితులు బ్రాహ్మణ కుటుంబాల పిల్లల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యం గా మగపిల్లలు పెళ్లిళ్లు కావడం లేదు. లేటు గా కావడం లేదా అసలు కాకపోవడం జరుగుతున్నది.ఇలా
.సామాజిక కారణాలు ఏమైనప్పటికి -
దైవ, గురు అనుగ్రహ కోణం లో ప్రయత్నిస్తే సమస్య తొలగి వివాహం జరుగుతుందని దత్త గురు ఉపాసకులు సూచిస్తున్నారు. అందులో ప్రముఖంగా " శ్రీపాద శ్రీవల్లభ జాతక గురు బల సిద్ది వ్రతము" చేసుకొంటే శీఘ్రము గా వివాహ యోగం కలుగుతుందని చెబుతున్నారు. అతి సులభమైన ఈ వ్రతం చేసుకొంటే " గురుబలం లోపించడం వల్ల జాతకుని వివాహ మునకు అడ్డు పడుతున్న పాప గ్రహాల బలం క్షీణించి వివాహనికి మార్గం సుగమమవుతుంది.
శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి లీలలు మనకు తెలిసినవే.!
స్వామి అనుగ్రహానికి పాత్రు లైన Dr.శ్రీ దువ్వూరి భాస్కర్ శర్మ గారి చే ఈ వ్రత గ్రంధం వెలుగు చూసింది.
4 సంవత్సరం ల క్రితం - వినాయక చతుర్థి ( శ్రీపాదు లవారి పుట్టిన రోజు ) నాడు " పూజ అనంతరం " గురు బలం లోపించడం వల్ల నాబిడ్డలు (భక్తులు ) అన్నింటిలో అపజయం పొందుతున్నారు. ఎవరు నన్ను నమ్మి నా వ్రతం చేసుకొంటే వారి కోర్కెలు నెరవేర్చి కష్టాల నుండి గట్టెక్కిస్తా నని భాస్కర్ రావు గారి కి వాక్కుల రూపంలో చెప్పారు స్వామి. మన పురాణ వ్రత వాంగ్మయంలో లేని ఈ వ్రతాన్ని స్వయంగా చెప్పి రచింప చేశారు. అంతటి విశిష్టమైన ది ఈ " శ్రీపాద శ్రీవల్లభ జాతక గురుబల సిద్ధి వ్రతం.
ఎంతో మంది ఈ వ్రతం ఆచరించి స్వామి అనుగ్రహం తో తమ వివాహం, ఆరోగ్యం, వృత్తి సమస్యలు పరిష్కారించు కోవడం మాకు తెలుసు.
ఈ వ్రతం చేసుకోవడం చాలా సులభం. పురోహితుని సహాయం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈ పుస్తకం లో వ్రతం విధానం తో పాటు పూజలో పెట్టుకోవడానికి వీలుగా స్వామి వారి యంత్రం, చిత్రం (oil print) తో ఇచ్చారు
ప్రతి బ్రాహ్మణ కుటుంబం లో ఉండ వలసిన గ్రంధం ఇది. గ్రంధం చదివి న తరువాత మీ కు ఎంతటి గొప్ప అవకాశం శ్రీపాదులవారు ఇచ్చారో అర్థం అవుతుంది.
"నా భక్తుడిని నేనే ఎన్నుకొంటాను. పులినోటికీ మాంసం చిక్కితే ఎలా వదలిపెట్టదో నేను నాభక్తుడను అలా వదలి పెట్టను " అన్న స్వామి వారి మాటల్ని స్మరిస్తూ వివాహ యోగము కోసం ' స్వామి వారి వ్రతం చేసుకోని వారి కృప తో ఒక ఇంటివారై చల్లగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.! 132 పేజీల
వ్రత గ్రంధం ఉచితం. రిజిస్టర్ పోస్ట్ / కొరియర్/ ప్యాకింగ్ చార్జీలు రూ 80/- మాత్రమే. ఇతర వివరాలకు--- C. Ravisharma. శ్రీపాద శ్రీవల్లభ దత్త సేవా పీఠం. 9704001527 కి call చెయ్యండి. లేదా వాట్సాప్ లో మెసేజ్ పెట్టoడి🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి