🕉 *108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు" : :
41వ దివ్యదేశం 🕉
🙏 శ్రీ అలగర్ పెరుమాళ్ ఆలయం.
అళగర్ కోయిల్ ,
తిరుమాలిరుంశోలైమలై 🙏
⚜ ప్రధాన దైవం : అలగర్ పెరుమాళ్,
⚜ ప్రధాన దేవత : సుందరవల్లి తాయార్.
⚜ ఉత్సవ విగ్రహం : సుందరరాజ పెరుమాళ్.
⚜ పుష్కరిణి : శీలంబర్ పుష్కరిణి;
నూపురగంగా పుష్కరిణి.
⚜ విమానం : సోమసుందర విమానము
🌀 స్థల పురాణం 🌀
💠 మదురై సమీపమున గల " అళగర్ " పర్వతమాలలో ఒక పర్వత పాదమందు " కల్లర్ " వంశజులైన బందిపోటు దొంగలు ఉండిరి .
వారిలో కొందరు గొప్ప విష్ణుభక్తి కూడ కలిగి తాము ధనవంతుల నుండి దోచుకొనిన ధనము , వస్తువులను శ్రీమన్నారాయణునికి అర్పించి సేవించు చుండెడివారు .
💠 12 మంది ఆళ్వార్లలో ఒకరైన తిరుమంగై ఆళ్వార్ కూడ ఈ కల్లర్ వంశజుడే . శ్రీమన్నారాయణుడు వారి భక్తికి మెచ్చి ఇచ్చట దర్శనమిచ్చెను . తిరుమల తిరుపతి లో వలె శ్రీమహావిష్ణువు శ్రీనివాసుడు , వేంకటేశ్వరుడు నామములతో దర్శనమిచ్చును .
ఆ కారణమున తిరుమల తిరుపతిని ఉత్తర తిరుపతియని , ఈ దివ్య దేశమును దక్షిణ తిరుపతియని ఈ ప్రదేశమున వ్యవహరింతురు .
💠 యమధర్మరాజు ప్రతి రాత్రి వచ్చి ఈ దివ్యదేశమున పెరుమాళ్ ను పూజించును అని స్థల పురాణము .
💠ఈ ఆలయ గోపురము చాలా పెద్దది . తొండైమాను గోపురము అందురు . సుందరపాండ్య మండపము , సూర్యమండపము , ఆత్రేయముని మండపము గలవు . ఈ మండపములను దాటిననే మూల విరాట్ సన్నిధి వచ్చును .
💠చైత్రపూర్ణిమ రోజును కలిపి 9 రోజులు అళగర్ ఉత్సవములు చాలా గొప్పగా జరుగును . ఈ ఉత్సవములు 3 రోజులు అళగర్ పర్వతమందు జరిగిన పిమ్మట 4 వ రోజున పెరుమాళ్ ఉత్సవమూర్తిని మదురై తీసుకొని పోవుదురు .
ఈ రోజున శ్రీవిల్లిపుత్తూర్ నుండి వచ్చు ఒక తులసి మాలను ఆండాళ్ ప్రేమకు చిహ్నముగా పెరుమాళ్ ధరించును .
ఇది ప్రతి సంవత్సరము నిశ్చయముగా జరుపు ఆచారము .
పెరుమాళ్ అశ్వారూఢుడై మదురై పోవును . ముందుగా " వైగై నదిలోనికి పోయి తదుపరి మదురై చేరును . పెరుమాళ్ యొక్క ఈ వైగై నదీ ప్రవేశము కూడ గొప్ప ఉత్సవముగా పాటించబడును .
💠 ఈ విధముగా పెరుమాళ్ మదురైచేరుట అచ్చట జరుగు " మీనాక్షి - సుందరేశ్వర్ " ల కళ్యాణోత్సవములను తిలకించుట కొరకు . ఆ కళ్యాణోత్సవములను 5 రోజులు చూచి , అనగా 9 వ రోజున పెరుమాళ్ అళగర్ పర్వత దివ్యదేశ సన్నిధికి చేరుకొనును . ఈ ఉత్సవములకు లక్షలాది భక్తులు వత్తురు .
💠ఇచట మూలవర్, ఉత్సవర్ కూడ పంచాయుధములతో ఉంటారు. మూలవర్‌కు వైకుంఠ నాథన్, పరమ స్వామి అనే తిరునామములు ఉన్నాయి. స్వామి సుదర్శన చక్రహస్తులై వేంచేసియున్నారు.
💠 ఈ ఆలయంలో గోపురం చాలా పెద్దది.
బ్రహ్మోత్సవ సమయంలో చక్రత్తాళ్వార్ మాత్రమే గోపుర ద్వారము నుండి వేంచేస్తారు. పెరుమాళ్లు ప్రక్కనున్న ద్వారము నుండి వేంచేస్తారు.
💠ఆలయ ప్రాంగణంలోని జ్వాలా యోగ నరసింహ సన్నిధి ప్రసిద్ధి చెందింది. అతనికి రోజువారీ తిరుమంజనం జరుగుతుంది. ఒంటరిగా యోగ నరసింహ కోపాన్ని తగ్గించడానికి పుణ్యక్షేత్రం పైకి గాలి రావడానికి పైకప్పు తెరిచి ఉంది.
💠తమిళంలో “కల్లార్” అంటే దొంగ అని అర్థం. పెరుమాల్ ను ఈ పేరుతో పిలుస్తారు ఎందుకంటే అతను తన భక్తల హృదయాన్ని తన అందం మరియు ఆశీర్వాదాల ద్వారా దొంగిలించాడు. అతను తన భక్తలన్నింటినీ చెడు నుండి రక్షిస్తాడు.
🙏శ్రీమన్నారాయణ🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి