11, జనవరి 2025, శనివారం

విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (16)*


*భ్రాజిష్ణుః భోజనం భోక్తా* 

*సహిష్ణుః జగదాదిజః ।*


*అనఘో విజయో జేతా*

*విశ్వయోనిః పునర్వసుః ॥*


*ప్రతి పదార్థం:~*


*143) భ్రాజిష్ణుః - స్వయం ప్రకాశకుడు*


*144) భోజనం - భోజ్య రూపమైనవాడు, కర్మ, జ్ఞాన ఇంద్రియములతో స్వీకరించు విషయములకు (అన్నము, శబ్దము,స్పర్శ, రస, రూపం, గంధము వంటి ) రూపమైన వాడు.*


*145) భోక్తా - భుజించువాడు; ప్రకృతిలోని సర్వమును అనుభవించు పురుషుడు,;*


*146) సహిష్ణుః - సహించువాడు; భక్తుల అపరాధములను మన్నించి క్షమించ గలిగినవాడు.*


*147) జగదాదిజః - సృష్టి ఆరంభముననే ఉన్నవాడు, ఆది పురుషుడు*


*148) అనఘః - పాపరహితుడైనవాడు*


*149) విజయః - జయించుటయే స్వభావ స్వరూపముగా గలవాడు;* 


*150) జేతా --- సదాజయము నొందువాడు*


*151) విశ్వయోనిః - విశ్వమునకు కారణభూతమైనవాడు, విశ్వ ఆవిర్భావానికి కారణమైన వాడు*


*152) పునర్వసుః - పదే పదే క్షేత్రజ్ఞుని రూపమున ఉపాధుల నాశ్రయించువాడు.*


*తాత్పర్యం :-*


*సర్వమును ప్రకాశింప చేయువాడును, ప్రకృతి రూపమగు భోజనమును పురుష రూపమున అనుభవించు వాడును, హిరణ్యాది దుష్టరాక్షసులను సంహరించిన వాడును, జగత్తునకు ప్రారంభమునందే ముందుగానున్న వాడును, పాపరహితుడును, ప్రకృతిని జయించినవాడును, నిరంతరమును జయశీలుడే అయినవాడును, విశ్వమునకు జన్మస్థానమై యున్నవాడును, తానే అనేక రూపములతో మరల మరల అవతారమెత్తువాడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*(ఏరోజుకా రోజు ఇచ్చిన శ్లోకం  కంఠస్థం వచ్చేదాకా మననం చేద్దాం)*


*సూచన: రోహిణి 3వ పాదం జాతకులు పై 15వ శ్లోకమును నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు సకల శుభాలను పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

కామెంట్‌లు లేవు: