12, మార్చి 2025, బుధవారం

దైవాధీనం జగత్ సర్వం

 "దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం" 


ఈ జగత్తు అంతా పరమాత్మ ఆధీనంలో ఉంటే ఆ పరమాత్మ మంత్రానికి ఆధీనంలో ఉంటాడు. 


మనకు లోకంలో కనిపించే అన్ని మంత్రాల్లో పరమాత్మ నామం కనిపిస్తుంది. నామం అనగా వంచేది అని అర్థం. పరమాత్మనామాల్ని తెలిపే విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం చేద్దాం. అలా పరమాత్మను తెలుపే ఎన్నో నామాల్లో, కొన్ని నామాలను మనం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం ! అంతటా నిండిఉన్నదాన్ని పూర్ణం అంటారు. భగవంతుడు స్వరూపంచే పూర్ణం, స్వభావంచే పూర్ణం, శక్తిచే పూర్ణం, గుణంచే పూర్ణం. అన్ని రకాలుగా పూర్ణం. మరి మనం పూర్ణత్వాన్ని సాధించుకోవాలంటే మరి ఆ పూర్ణ తత్వాన్ని మన జ్ఞానంతో తాకిస్తే, మనస్సులో తలిస్తే, నాలుకతో పలికితే మనకు కొంచం పూర్ణత లభించకమానదు. ఒక చేపను తాకితే ఆ దుర్వాసన ఎన్నో రోజులు అంటి ఉంటుందే, క్షుద్రమైన వస్తు సంపర్కమే అంత వాసన పట్టేస్తుంటే, దివ్యమైన కళ్యాణ గుణమైన, మంగళకరమైన, పూర్ణుడైన పరమాత్మని మనస్సులో తలిస్తే పూర్ణతవాసన కోంచెం పట్టదా!! మన జ్ఞానానికి పూర్ణత ఏర్పడదా!! ఎన్నో లోపాలు మనలో ఉన్నాయి వాటిని నింపుకోవాలని, ఆ లోపాలు తొలగాలి మనకు ఉండదా!! అందుకు ఆ పరమాత్మ నామాల్ని ఉపాసన చేద్దాం.


జై శ్రీమన్నారాయణ


🌷🙏🙏🙏🙏🙏🌷

కామెంట్‌లు లేవు: