🕉 మన గుడి : నెం 1047
⚜ కేరళ : తిరువల్ల - పతనంతిట్ట
⚜ శ్రీ వల్లభ ఆలయం ( శ్రీ కొలపిరాన్ పెరుమాళ్ ఆలయం )
💠 ఈ ఆలయం 108 శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో 66వ దివ్యదేశము.
💠 ఇది మలైనాడు దివ్యదేశాల సమూహం క్రింద వస్తుంది.
ఈ ఆలయాన్ని శ్రీ కొలపిర పెరుమాళ్ ఆలయం/ శ్రీ వల్లభ మహా క్షేత్రం అని కూడా పిలుస్తారు.
💠 ఇక్కడ దేవత దాదాపు ఏడు అడుగుల ఎత్తు ఉంటుంది.
గర్భగృహంలో వల్లభ భగవానుడు విరాటపురుష రూపంలో ఆరాధించబడుతున్నందున దేవత యొక్క పైభాగం మరియు దిగువ భాగం కనిపించని విధంగా నిర్మించబడింది.
దేవత కూడా పసుపు రంగులో కనిపించే ఇతర విష్ణు దేవతల మాదిరిగా కాకుండా కేవలం తెలుపు మరియు కుంకుమ వస్త్రాలను మాత్రమే ధరిస్తారు.
⚜ ప్రధాన దైవం: తిరువాళ్ మార్బన్ , కోలపిరాన్ , శ్రీవల్లభన్
⚜ ప్రధాన దేవత: షేల్వ తిరుకొలందు నాచియార్, వాత్స్యల్య దేవి .
⚜ పుష్కరిణి: ఘంటా కర్ణ తీర్థం, పంపానది.
⚜ విమానం: చతురంగ కోలా విమానం
💠 ఈ స్థలంలో కనిపించే మూలవర్ కోలాపిరాన్.
మూలవర్ నిండ్ర తిరుక్కోళంలో తూర్పు దిశలో తన తిరుముఖం వైపు చూస్తున్నారు.
🌀 స్థలపురాణం 🌀
💠 పరమేశ్వరుని గణనాయకులలో అతి రూపుడు , భయంకరుడు అయిన ఒకడు ఉండెను .
అతడు పరమశివుని భక్తితో పూజించి నరబలి చేసి నైవేద్యము పెట్టి ఆరగింపు చేయుచుండెడివాడు .
అంతట పరమేశ్వరుడు నరబలి చేయుట చాలా పాపము అని వివరించి చెప్పి ఇకపై అట్టి పాపకృత్యములు చేయకుండుటకై నిర్దేశించి మరియు " సంచితపాప నివృత్తికై శ్రీమన్నారాయణుని అష్టాక్షరీ మంత్రమును నిష్ఠతో జపము చేయుచు , నారాయణ ధ్యానము చేసి ముక్తిని పొందుము .
ఆ విధముగా ధ్యానించి , జపించి , స్తుతించిననే నీకు మోక్షము దొరకును " అని ఉపదేశించెను .
💠 ఆ శివగణనాయకుడు “ ఓం నమో నారాయణాయ " అను అష్టాక్షరి మంత్రమును జపించుచు , విష్ణువు నందు మాత్రమే భక్తి కలిగి యుండుటకై , తన చెవులకు గంటలు కట్టుకొని ఆ గంటల శబ్దములో శివ శబ్దము వినబడకుండునట్లు కాలము గడపుచు శివుని మరచి విష్ణువు నందు మాత్రమే ధారణ కుదుర్చుకొను యత్నము చేయుచుండెను .
💠 విష్ణు పూజలు క్రమము తప్పక చేయుచుండెను . కాని ఎల్లప్పుడు శివుని మరచి పోవుటకై చేయు యత్నములో నిరంతరము అతనికి శివుని యందే ధ్యాస నిలుచుచుండెను . అయినను అష్టాక్షరీ మంత్రము ( ఓం నమో నారాయణాయ ) ను జపించుచు , విష్ణువునకై తపించుచు , ఎల్లప్పుడు విష్ణు పూజలు చేయుచుండెను .
💠 ఆ విధముగా ఇరువురు దేవుళ్లనూ పూజించిన గొప్పఫలము కలిగి , శ్రీమన్నారాయణుని కరుణా వృష్టి అతనిపై పడి పెరుమాళ్ దర్శనమును పొందెను .
అతనిని ఘంటా కర్ణుడు అందురు . చక్కని ఆదర్శవంత జీవితము గడపి దేహాంతమున మోక్షమును పొందెను .
💠 విష్ణుమందిరములలో తులసీ చందనములను , శివమందిరములలో విభూతిని ప్రసాదముగా ఇచ్చెదరు .
కాని , పైన వివరించిన అన్యోన్యత , అభేద వివరణలకు ప్రతీకగా ఈ దివ్యదేశమున విభూతిని ప్రసాదముగా ఇచ్చెదరు .
💠 ఈ దివ్యదేశములో పెరుమాళ్ ను శంకర మంగళ తన్మయి అను ఒక స్త్రీ గొప్ప భక్తితో పూజించుచు ఏకాదశీ వ్రతమును ధర్మము తప్పక ఆచరించుచు వ్రతనియమము ప్రకారము ఒక బ్రహ్మచారికి ద్వాదశియందు భోజనము పెట్టి తరువాత తాను భుజించు చుండెను .
💠 కాని ఒక ద్వాదశి దినమున బ్రహ్మచారి ఎవరును కనిపించక చింతతో నుండి వేళ అతిక్రమమగుచుండుటచే ఆ విష్ణుభక్తురాలు శ్రీమహావిష్ణువును ప్రార్థించి తన వ్రతము నియమము తప్పక సాగునట్లు కరుణించుమని కోరెను .
💠 ఆ ప్రదేశములో తోళకాసురుడు అను ఒక రాక్షసుడు మార్గమును నిరోధించి ఎవ్వరినీ శంకర మంగళ తన్మయి యుండు చోటునకు పోనీయకుండెను .
ఆ భక్తురాలి ప్రార్థనను మన్నించిన శ్రీమహావిష్ణువు స్వయముగా ఒక బ్రహ్మచారి రూపమున వచ్చు చుండగా మార్గమున అడ్డగించిన తోళకాసురుని వధించి ఆమె ముందునకు వచ్చెను .
శంకర మంగళ తన్మయి వచ్చిన ఆ బ్రహ్మచారిని అర్థించి కాళ్లు కడిగి భోజనము వడ్డించెను .
బ్రహ్మచారి రూపమున వచ్చి భోజనము చేయుచున్న శ్రీమహావిష్ణువును గమనించుచున్న శంకర మంగళ తన్మయి తన జ్ఞాననే త్రమునకు పెరుమాళ్ వలె తోచి , బ్రహ్మచారి హృదయము పై నున్న వస్త్రమును తొలగించుమని కోరెను .
బ్రహ్మచారి ఆ విధముగా వస్త్రమును తొలగించగానే వక్షస్థలవాసియైన శ్రీమహాలక్ష్మి కనిపించెను .
💠 పెరుమాళ్ ను దర్శించిన ఆ భక్తురాలి ఆనందమునకు అవధులు లేకుండెను . తన్మయమున స్తుతించి గానము చేసెను . అట్లు దర్శన మిచ్చిన పెరుమాళ్ “ శ్రీవల్లభన్ ” అను నామమున ప్రసిద్ధి నొందెను
💠 ఈ సన్నిధి లోపలకు స్త్రీలను రానీయరు. వెలుపలనుండియే సేవింపవలెను. కానీ ధనుర్మాసములో ఆర్ద్ర నక్షత్రమునాడు, మేష సంక్రాంతినాడు మాత్రము లోపలకు రానిత్తురు
💠 ఈ స్థలం కొల్లం - ఎర్నాకులం రైల్వే లేన్ మధ్య ఉన్న తిరువల్ల రైల్వే స్టేషన్ నుండి 3 మైళ్ల దూరంలో ఉంది. కొట్టాయం వైపు వెళ్ళే బస్సులో కూడా మనం ఈ స్థలానికి చేరుకోవచ్చు. బస చేయడానికి, చత్తిరమ్‌లు అందుబాటులో ఉన్నాయి.
రచన
🌀 Santosh Kumar
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి