శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం
సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ
తస్మాద్యస్య మహాబాహో ! నిగృహీతాని సర్వశః
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా (68)
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః (69)
అర్జునా... అందువల్ల విషయసుఖాల వైపుకు వెళ్ళకుండా ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడికి స్థిరమైన బుద్ధి కలుగుతుంది; వాడే స్థితప్రజ్ఞుడు. ఆత్మానుభూతిలేని అన్ని ప్రాణులకూ రాత్రిగాతోచే సమయంలో మనోనిగ్రహం కలిగిన ముని మేలుకుని వుంటాడు. విషయాలపట్ల ఆసక్తితో సర్వప్రాణులూ మెలకువగా వున్నపుడు ఆత్మనిష్ఠకలిగిన యోగికి రాత్రి అవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి