☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(87వ రోజు)*
*(క్రితం భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️ౌ☸️☸️
*కృష్ణావతారం*
*చిన్ని కృష్ణుని లీలలు*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*ఉన్నచోట ఉండవు. పరుగులుదీసి ప్రాణాలు తీస్తున్నావు. నిన్ను కదలకుండా ఉంచడం ఎలాగో నాకు బాగా తెలుసు. చూడేం ఏం చేస్తానో.’’ అన్నది యశోద.*
*దగ్గరలో ఉన్న తాడు అందుకున్నది. ఒక కొస కృష్ణుని మొలకు కట్టి, రెండో కొసను రోలుకి కట్టేందుకు ప్రయత్నించింది. తాడు చాలలేదు. ఇంట్లోకి వెళ్ళింది. తాళ్ళు తెచ్చింది. ఎన్నితాళ్లో! అన్ని తాళ్ళు కట్టినా రోలు అందడం లేదు. కృష్ణుడు కదలడం లేదు. ఉన్నచోటే ఉన్నాడు. రోలు కూడా అంతే! ఉన్నచోటే ఉన్నది. మరి తాడెందుకు సరిపోవట్లేదో! అంతుచిక్కలేదు యశోదకు.*
*కన్నీరు పెట్టుకుందామె. తల్లి అలా కన్నీరుపెట్టుకోవడం కృష్ణుడు చూడలేకపోయాడు. మాయను మటుమాయం చేశాడు. ఇప్పుడు తాడు సరిపోయింది. రెండో కొసను రోలుకు కట్టింది యశోద.*
*‘‘ఇప్పుడిక ఎలా పరుగుదీస్తావో చూస్తాను. ఉన్నచోట ఉండాల్సిందే! బుద్ధిగా కూర్చో.’’ అన్నది.*
*ఎవరో పిలిస్తే వెళ్ళిపోయింది.అమ్మ చెప్పినట్టుగా వింటే అల్లరికృష్ణుడు ఎందుకవుతాడు? వినడుగాక వినడు. రోలునీ, తాడునీ పదేపదే చూసి, రోలుని లాగుతూ, దోగాడుతూ అక్కణ్ణుంచి బయల్దేరాడు కృష్ణుడు.*
*రెండు పెద్దమద్దిచెట్ల దగ్గరగా వచ్చాడు. కవలపిల్లల్లా జంటగా పుట్టిన చెట్లవి. రోలు ఈడ్చుకుంటూ ఆ చెట్లమధ్యనుంచి వచ్చాడు. చెట్లమధ్య రోలు ఇరుక్కుంది. ముందుకు రావట్లేదు. లాగి చూశాడు కృష్ణుడు. రాలేదు. బలాన్నంతా ఉపయోగించాడు. గట్టిగా గుంజాడు. రోలు గట్టిగా అదమడంతో చెట్లు రెండూ వేళ్ళతో సహా విరిగిపడ్డాయి. విరిగిపడిన చెట్ల మధ్య నుంచి ఇద్దరు సిద్ధపురుషులు వెలిశారు.*
*దివ్యతేజస్సుతో వెలిగిపోతూ ప్రత్యక్షమయ్యారు. చేతులు జోడించి చిన్నికృష్ణునికి నమస్కరించారు. వేదమంత్రాలతో స్తుతించారతన్ని. కృష్ణుడప్పుడు దివ్యరూపంతో వారిని అనుగ్రహించాడు. కృష్ణుని చుట్టూ ప్రదక్షిణగా తిరిగి, సెలవంటూ ఆ సిద్ధపురుషులిద్దరూ ఆకాశానికి ఎగిసిపోయారు. ఉత్తరదిక్కుగా తరలిపోయారు*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి