శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం
కర్మయోగం: శ్రీ భగవానువాచ
సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత
కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్ (25)
న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినామ్
జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ (26)
అర్జునా.. అజ్ఞానులు ఫలితాలు ఆశించి కర్మలు చేసినట్లే ఆత్మజ్ఞానులు ఫలాపేక్ష లేకుండా లోకకల్యాణం కోసం కర్తవ్యకర్మలు ఆచరించాలి. ఫలం కోరి కర్మలు చేసే పామరుల బుద్ధిని విజ్ఞులు వికలం చేయకూడదు. జ్ఞాని యోగిగా సమస్తకర్మలూ చక్కగా ఆచరిస్తూ ఇతరులు చేతకూడా చేయించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి