27, మార్చి 2025, గురువారం

*విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (87)*


*కుముదః కుందరః కుందః*

*పర్జన్యః పావనోనిలః ।*


*అమృతాంశః అమృతవపుః*

*సర్వజ్ఞః సర్వతోముఖః ॥* 


*ప్రతి పదార్థం:~*


*811) కుముద: - దుష్టులను సంహరించి భూమికి ఆనందము కలుగ చేయువాడు;  కు అనగా భూమి . అట్టి భూమి యొక్క భారమును తొలగించి మోదమును కూర్చువాడు.*


*812) కుందర: -  భూమిని చీల్చుకు పోయినవాడు. హిరణ్యాక్షుని వెతుకుతూ వరాహరూపంలో భూమిని పెకిలించిన వాడు;*


*813) కుంద: - కశ్యప మహర్షికి భూమిని దానమిచ్చినవాడు; భక్తుల పాపములను శుభ్రపరిచి అవి తిరిగి రాకుండా చేసేవాడు.*


*814) పర్జన్య: - మేఘము వర్షించి భూమిని చల్లబరుచునట్లు జీవుల తాపత్రయములను తొలగించి,వారి మనస్సులను శాంతింపచేయువాడు భగవానుడు.*


*815) పావన: - గాలి,అగ్ని, నీరు వంటి రూపములలో పవిత్రీకరించువాడు.*


*816) అనిల: - మరెవరి ప్రేరణ లేకుండానే భక్తులకు దీవెనలు ప్రసాదించువాడు;  తన భక్తులకు తేలికగా అందుబాటులో ఉండేవాడు ; సదా జాగరూకుడు*


*817) అమృతాంశ: - అమృతమును సేవించిన వాడు; తన భక్తులచే తన గుణములనే అమృతమును ఆస్వాదింప చేయువాడు.*


*818) అమృతవపు: -‌అమృతం వంటి శరీరము కలవాడు; అమృతస్వరూపుడు శాశ్వతుడు.*


*819) సర్వజ్ఞ: - అంతా తెలిసినవాడు.*


*820) సర్వతోముఖ: - అన్ని దిక్కులా ముఖము కలవాడు; ఏకకాలమున సర్వమును వీక్షించగలవాడు.*


*తాత్పర్యము:~*


*భూమికి ఆనందము కలిగించినవాడును, భూమిని చీల్చుకుని పోయినవాడును, మల్లెపూవు వలె సదా ప్రసస్నుడును, మేఘము వర్షించి భూమిని చల్లబరుచునట్లు జీవుల తాపత్రయములను తొలగించి,వారి మనస్సులను శాంతింపచేయువాడును; గాలి,అగ్ని, నీరు వంటి రూపములలో పవిత్రీకరించువాడును, తన భక్తులకు తేలికగా అందుబాటులో ఉండేవాడు, అమృత స్వరూపుడును, నాశనము లేని శరీరము కలవాడును,సర్వము తెలిసిన వాడును, ఏకకాలమున సర్వమును వీక్షించగలవాడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*


*పాఠకులందరికీ శుభం కలుగు గాక ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

       ‌        *సూచన*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్రవణం నక్షత్రం 3వ పాదం జాతకులు పై 87వ శ్లోకమును, నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు మంచి ఫలితాలు పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

కామెంట్‌లు లేవు: