27, మార్చి 2025, గురువారం

అమ్మా పద్య దళమ్ములన్

 శా.అమ్మా పద్య దళమ్ములన్ గొనుము నే నర్థించెదన్నిన్ను చే

కొమ్మా పద్మ శతమ్ము రేఖలివి వాగ్రూపమ్ము లైనట్టి పు

ష్పమ్ముల్ గైకొన వేడెదన్ రఘుపతిన్ శాస్త్రాన్వయున్ భక్తినీ

సొమ్ముల్ గాగ నొసంగెదన్  భగవతీ శోభాప్రదా భారతీ!౹౹109


సామాజిక శతక పద్య హేళలో భాగంగా రచియించిన ఈ భారతీ శతకం సర్వమ్ శ్రీ వాసరేశ్వరీ  శ్రీమాతా జ్ఞాన సరస్వతీ మాతృ చరణారవిందార్పణ మస్తు

స్వస్తి సమస్త సన్మంగళాని భవంతు


ఓం తత్సత్ పరబ్రహ్మణే నమః

కామెంట్‌లు లేవు: