20, జులై 2022, బుధవారం

ప్రక్కటెముకలలో ( side ribs ) నొప్పి

 ప్రక్కటెముకలలో ( side ribs ) నొప్పి  - 


        జిల్లేడు ఆకు రసం , గొధుమ పిండితో కలిపి మెత్తగా పిసికి ఆ ముద్దను రొట్టెలాగా వెడల్పు చేసి ప్రక్కటెముకల పైన పట్టు వేయాలి . 


                  ఈ విధంగా చేయడం వలన నిమోనియా వలన కలిగే ప్రక్కటెముకల నొప్పి కాని , వాతం వలన కలిగే నొప్పి కాని బహుత్వరగా తగ్గిపోతుంది . 


         

ముఖ్యమైన విషయాలు

 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻


🌹 *ముఖ్యమైన విషయాలు*.🌹


*పూజ:-*

పూర్వ జన్మ వాసనలను నశింపచేసేది, జన్మ మృత్యువులను లేకుండా చేసేది, సంపూర్ణ ఫలాన్నిచ్చేది.


*అర్చన:-*

అభీష్ట ఫలాన్నిచ్చేది, చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.


*జపం:-*

అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది. పర దేవతను సాక్షాత్కరింప చేసేది జపం, ఇది జీవుణ్ణి దేవుణ్ణి చేస్తుంది.


*స్తోత్రం:-*

నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.


*ధ్యానం:-*

ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది.


*దీక్ష:-*

దివ్య భావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.


*అభిషేకం:-*

అభిషేకం చేస్తే చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి, అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరతత్వాన్ని అందిస్తుంది.


*మంత్రం:-*

తత్త్వం గురించి మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం, అఖండ శక్తిని ఇస్తుంది.


*ఆసనం:-*

ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్త సిద్ధిని లేదా నవ సిద్ధులను కల్గించేది ఆసనం.


*తర్పణం:-*

పరివారంతో కూడిన పర తత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.


*గంధం:-* 

గంధంలో పరదేవత కొలువై ఉన్నారు. *”మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లీ” అని దేవతలంతా అమ్మవారిని కోరారు. అప్పుడు అమ్మవారు “మీరు గంధంలో కొలువై ఉందురుగాక” అని వరం ఇచ్చారు. అప్పటినుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది.*


*అక్షతలు:-*

కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ, నూకలు (విరిగిన బియ్యం) లేని మంచి బియ్యం కలిపి చేయాలి.


*పుష్పం:-*

పుణ్యాన్ని వృద్ధి చేసి, పాపాన్ని పోగొట్టేది మంచి బుద్ధిని ఇచ్చేది. *అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి.* *మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది.* *(ఈమధ్య పుష్పాలను చించి రేకలను విడదీసి వాడుతున్నారు. అలా చేయవద్దు. కాగా తొడిమలను తప్పకుండా తుంచి వేశాకే పుష్పాలను పూజలో వినియోగించాలి.*


*ధూపం:-*

చెడు వాసనల వల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది. *భూత, ప్రేత, పిశాచాలు పారిపోతాయి.*


*దీపం:-*

సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పర తత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం. పూజ గదిలో దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న దుష్ట ప్రభావం దగ్గరికి రాదు. “అగ్ని” శివుడి కుమారుడైన కుమారస్వామికి ప్రతీక.


*నైవేద్యం:-*

మధుర పదార్థాలను నివేదన చేయుటయే నైవేద్యం.


*ప్రసాదం:-*

భగవంతుడికి నివేదించిన నైవేద్యమే ప్రసాదం. ప్రకాశానందాలనిచ్చేది, సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం. ప్రసాదం భగవదనుగ్రహ సంకేతం. అత్యంత పవిత్రమైన పదార్థం. *ఏ రూపంలోని ప్రసాదాన్నైనా “ప్రసాదం” అని మాత్రమే వ్యవహరించాలి. ఇటీవల అందరూ ‘పులిహోర’, ‘కొబ్బరి’ అని అనడానికి అలవాటు పడ్డారు. అలా అనకూడదు. “పులిహోర ప్రసాదం”, “కొబ్బరి ప్రసాదం” అనవచ్చు.*


*వందనం:-* అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం. చేతులు జోడించి కూడా వందనం చేయవచ్చు. సాష్టాంగ ప్రణామం అంటే వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకు తాకించి చేసేది వందనం. ఈ సాష్టాంగ ప్రణామం పురుషులు మాత్రమే చేయాలి ఇది స్త్రీలు చేయరాదు. స్త్రీలు మోకాళ్ళపై భగవంతుడికి వందనం చేయొచ్చు.


*ఉద్వాసన:-*

దేవతలను, ఆవరణ దేవతలను పూజించి, పూజను ముగించడాన్ని ఉద్వాసనమని అంటారు. చివర్లో ప్రార్థన, దోష క్షమాపణ చెప్పి తీర్థ, ప్రసాదాలు స్వీకరించి స్వస్తి చెప్పి ఉద్వాసన చేయవలసి ఉంటుంది.......


సేకరణ...🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻


కోమలాంగా - శీతలాంగా

 కోమలాంగా - శీతలాంగా


1958వ సంవత్సరం. పరమాచార్య స్వామివారు చాతుర్మాస్యం తరువాత మాంబళం శ్రీ జి.వి. కళ్యాణరామ అయ్యర్ గారి ఇంట్లో ఎంతోకాలం బస చేశారు. అప్పుడు మైలాపూర్ లో ఒక ప్రముఖ ప్రవచనకారులు రోజూ ప్రవచనం చెప్పేవారు. ఒకరోజు నేను కూడా ప్రవచనానికి వెళ్లాను. ఆయన అప్పయ్య దీక్షితుల శ్లోకాన్ని ఇలా చెప్పాడు.


మౌళౌ గంగాశశాంకౌ కరచరణతలే కోమలాంగా భుజంగా 

వామే భాగే దయార్ద్ర హిమగిరి దుహితా చందనం సర్వగాత్రే, 

ఇత్థం శీతం స్రభూతం కసక సభా నాథ! సోఢుం క్వశక్తిః ? 

చిత్తే నిర్వేదతప్తే యది భవతి న తే నిత్యవాసో మదీయే.


దాన్ని ఇలా వివరించారు.


నీ తలపై గంగ మరియు చంద్రుడు. కాళ్ళు చేతులపైన చల్లని సర్పాలు. నీ ఎడమవైపేమో దయాసముద్రుని అయిన హిమవంతుని కూతురు, నీవేమో ఒళ్ళంతా చల్లని చందనం పూసుకున్నావు. ఓ కనకసభాపతీ! అంత చల్లదనాన్ని ఎలా భరిస్తున్నావు? నేను చేసిన తప్పుల వల్ల వెచ్చగా ఉండే న హృదయ కుహరంలో శాశ్వతంగా నివసించు తండ్రీ.


నాకు శ్లోకంలో ఎందుకో కాస్త తప్పు అనిపించింది. కోమలమైన సర్పాలకు చల్లని వస్తువులపైన ఉండడమెందుకు? ఇన్ని చల్లని వస్తువుల మధ్యన కోమలమైన సర్పములు ఎందుకు? చల్లదనం ఉంటే కోమలత్వం ఎందుకు పోతుంది?

కోమలాంగా భుజంగా - కాదు కాదు; బహుశా శీతలాంగా భుజంగా అనునదే ఇక్కడ సరైన ప్రయోగమేమో?


మరుసటిరోజు మహాస్వామి వారితో మాట్లాడడానికి సమయం దొరికినప్పుడు, చూచాయగా నా అభిప్రాయాన్ని తెలిపాను. ‘శీతలాంగా’ అన్న పద ప్రయోగాన్ని పరమాచార్య స్వామి వారు మెచ్చుకున్నారు.


ఆ ఉపన్యాసకుణ్ణి రమ్మని కబురుచేసి, వారి ఉపన్యాసాన్ని ఎంతో మెచ్చుకున్నారు స్వామివారు. “మౌళౌ గంగా శ్లోకాన్ని అద్భుతంగా వివరించారని తెలిసింది. ఈ పిల్లవాడు కూడా దాన్ని విన్నాడు . . .” అని మొదలుపెట్టి రాత్రి తొమ్మిది గంటల నుండి మధ్యరాత్రి దాకా వివిధ కోణాల్లో ఈ శ్లోకం గురించిన వివరణ ఇచ్చారు స్వామివారు.


“కోమలాంగా అన్న పదం కాకుండా శీతలాంగా అన్న పదం సరిగ్గా కుదురుతుంది అని ఈ అబ్బాయి ఆలోచన. అదే సరి అయినది అని నాకు కూడా అనిపించింది. ఇప్పటినుండి దాన్ని శీతలాంగా భుజంగా అని అచ్చు వేయిద్దాము” అని తమ నిర్ణయాన్ని తెలిపారు స్వామివారు.


నాకు మరియు ఇతర విద్వాంసులకు కలిగిన ఆనందం వర్ణనాతీతం. నేను చెప్పిన ఒక పదాన్ని స్వామివారు గుర్తించి దాన్ని ఆచరణలో పెట్టిన విధానాన్ని తలచుకుంటేనే నాకు ఒళ్ళు పులకిస్తుంది.


--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, కంచి శ్రీమఠం విద్వాన్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

మంచి పురాణ గాధ ..

మనలో చాలామంది కి తెలియని ఒక మంచి పురాణ గాధ ..మీకోసం..
చాలా  మంచి పోస్టు  . అందరూ చదవండి .
ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం
రావణసంహారం జరిగిపోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి.
'14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేనిమనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే... ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,' అని ఎవరో గుర్తుచేశారు.
ఆ మాటలు విన్న రాములవారికి ఒక అనుమానం వచ్చింది. ''14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు.
నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిదని తెలుసు. కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు,' అని అడిగారు.
''మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని,'' అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. కానీ సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఓసారి లెక్కపెడదామని అనుకున్నారట. దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది. ''లక్ష్మణా! ఓ ఏడు రోజులపాటు ఆహారంగానీ ఆరగించావా ఏం!'' అని పరిహాసంగా అడిగారట రాములవారు.
''అన్నయ్యా! మొదటి సందర్భంలో, తండ్రిగారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనేలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు. నేను ఇంద్రుజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్రుజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు. మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు,'' అని బదులిచ్చాడు లక్ష్మణుడు.
లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా. అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. ''తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు!'' అన్నారట రాములవారు.
రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. కానీ ''ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చోటుకంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు,'' అని వేడుకుందట ఊర్మిళ.
''కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,'' అంటూ వరాన్ని అందించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే! ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది.      🙏🙏🙏🙏🙏
 సేకరణ :  *@SatyaDeva Medicals-VPM*

ఆధిక్యత కులం..(

 :-ఆధిక్యత కులం..(M.N.Srinivas) :-

ప్రతీ చోటా ఏదో ఒక కులం రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో ఆధిపత్యం ప్రదర్శించడం అనే దృగ్విషయం పై ప్రముఖ సోషియాలజిస్ట్ M.N.శ్రీనివాస్ తన

 'సోషియల్ ఛేంజ్ ఇన్ మాడరన్ ఇండియా'  మరియు ఇతర పుస్తకాలలో చర్చించాడు.  'ఆధిక్యత కులం' భావనను తన  కర్ణాటక లోని గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలన తరువాత ఆయన రూపొందించారు.

     M. N. శ్రీనివాస్ కర్ణాటక లోని 'రాంపూర్ 'అనే గ్రామంలో  జరిపిన అధ్యయనంలో 'ఆధిక్యత కులం ' అనే భావనను  గ్రహించి ప్రతిపాదించారు. ఆయన ఉద్దేశ్యం లో  గ్రామీణ ప్రాంతంలో ఈ 'ఆధిక్యత కులం 'అనేది ప్రముఖ పాత్ర వహిస్తోంది.ప్రతి గ్రామంలోనూ ఒక ఆధిక్య కులం ఉంటుంది.ఆ ఆధిక్య కులం ఆ గ్రామం లోని అన్ని వ్యవహారాలను కంట్రోల్ చేస్తూ ఉంటుంది .

ఆధిక్య కులం లక్షణాలను  M.N.శ్రీనివాస్ గారు  తెలియచేశారు.

*ఆ గ్రామంలో అధిక వంతు భూములు కలిగి ఉండడం.

*రాజకీయ ఆధిక్యత.

*ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండడం.

*ఇంగ్లీష్ చదువు/పాశ్చాత్య విద్య.

*అవసరమైతే హింసను ఉపయోగించగలగడం.

*ప్రభుత్వ ఉద్యోగాలలో అధిక భాగం సంపాదించడం.

     పై లక్షణాలను M.N . శ్రీనివాస్ గారు విపులంగా తెలియజేశారు.

వారు చెప్పిన విషయాలను మనం నిత్య జీవితంలో చూడగలం.ఏ గ్రామం, ప్రదేశం, రాష్ట్రంలో చూసినా మనకు ఈ విషయాలు స్పష్టంగా అర్థం అవుతాయి.

ప్రతీ చోట ఏదో ఒక కులం ఆధిపత్యం లో ఉంటుంది.ఉదాహరణకు 

గ్రామ  వార్డు మెంబర్ , సర్పంచి ,సింగిల్ విండో చైర్మన్, ఎమ్.పి.టి.సి,జెడ్.పి.టీ.సీ.,మండలాధ్యక్షుడు,ఎమ్.ఎల్.ఏ,ఎమ్.పి.,ఇంకా ఆ పై స్థాయి పోస్ట్ లు అన్నింటిలో ఆయా ఆధిపత్య కులం వారే ఉంటారు. అన్నింటిలో కాకపోయినా చాలా వాటిలో వారే ఉంటారు.వీటిలో కొన్ని, రిజర్వేషన్లు, రాజకీయ పరిస్థితుల వలన ఇతరులకు లభించినా , తమకు అనుకూలమైన వారిని నియమించుకోవడం, లేదా నియామకం అయిన వారిని నయానో భయానో  తమకు అనుకూలంగా మలచుకొంటారు.అధికారులను కూడా తమకు అనుకూలంగా మలచుకుంటారు. వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తారు. వీరు తమకన్నా పై స్థాయి రాజకీయ నాయకులను కూడా ప్రభావితం చేస్తారు. వీరి మద్దతు లేకపోతే భవిష్యత్తు లో తాము ఎన్నికలలో గెలవలేమని పైస్థాయి నాయకులకు తెలుసు. ఇక అధికారుల పోస్టింగ్ లలో తమ కులపు వారికి ప్రాధాన్యత ఇస్తారు.ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని రకాల కాంట్రాక్టులు, సబ్సిడీ లు,రాయితీలు  వీరు చేజిక్కించుకుంటారు. తమకు పోటీకి వచ్చిన వారిని ఏదోవిధంగా ప్రభావితం చేసి పక్కకు తప్పిస్తారు. అలాగే ఉద్యోగ సంఘాలు, ఇతర ప్రభావ వర్గాలలో కూడా పట్టు సంపాదిస్తారు. ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా వీరి ముందస్తు అనుమతి తప్పనిసరి.ఎన్నికల సమయంలో తమకు అనుకూలమైన వారికి ఓట్లు వేసే విధంగా ప్రజలను ప్రభావితం చేస్తారు.


ఇకపోతే గ్రామీణ సమాజంలో భూమికి  ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. భూమి చుట్టూ అన్ని వ్యవహారాలు, జీవనోపాధి ఉంటుంది. వ్యవసాయ కూలీలు, వృత్తి పని వారు,పశు పోషకులు  భూమి పైనే ఆధారపడతారు.ఎక్కువ భూమి ఉన్న వాడు ఆ గ్రామంలో మోతుబరి కావడం సహజం. హరిత విప్లవం వచ్చిన తరువాత భూమి కల వర్గం సహజంగానే అత్యున్నత స్థాయి కి చేరిపోయింది.ఈ వర్గం ఆర్థిక పరిస్థితి కూడా ఉన్నత స్థాయికి చేరిపోయింది.రియల్ ఎస్టేట్ తదితర రంగాలలో కూడా ఆధిక్యత కలిగి ఉండడం, భూముల ధరలు పెరగడంతో వీరు  మరింత లబ్ధి పొందారు.

ఇక మిగిలిన అంశాలన్నీ ఆర్థిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా సహజంగా ఏర్పడతాయి.

కర్ణాటక లో ఒక్కలిగ, లింగాయతులు, కేరళలో నాయర్ లు మొదలైనవి  'ఆధిక్య కులాలు 'గా‌ చెప్పవచ్చును. ఉత్తర భారతం లో కుల పార్టీలు హవా చూపిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ కొన్ని కులాలకు ప్రాధాన్యత ఉంది.

ఐతే ఇటీవల కాలంలో రిజర్వేషన్లు, జనాభా పెరుగుదల, చట్ట పరమైన మద్దతు ,విద్య ,రాజకీయ చైతన్యం, తదితర కారణాల వల్ల వెనకబడిన తరగతులు, తదితర కులాలలో కొన్ని ఆయా ప్రాంతాల్లో ఆధిక్య కులాల రూపం పొందుతున్నాయని చెప్పవచ్చును.

  ఇక బ్రాహ్మణుల విషయంలో రాజరికం కాలంలో ఉన్నత స్థాయి అనుభవించిన బ్రాహ్మణులు కాలక్రమేణా అటువంటి ఆధిక్యతను ప్రస్తుత ప్రజాస్వామ్య కాలంలో క్రమక్రమంగా కోల్పోయినారని చెప్పవచ్చు.

        (సమాప్తం)

కనువిప్పు

 కనువిప్పు కలిగించే యదార్ధ గాథ. 🙏


‘  ఓమ్ భూర్భువస్సువః –తత్సవితు ర్వరేణ్యం


భర్గో దేవస్య థీమహి– థియో యోనః ప్రచోదయాత్-‘


 అని తాతగారి గదిలోంచి వినిపిస్తున్న’ గాయత్రీ మంత్రా’ న్ని విని వినోద్, వనజా  నవ్వుకున్నారు.


“తాతగారికి ! చాదస్తం ఎక్కువలా ఉంది..ఇలా రోజూ మూడు వేళలా మూడు  గంటల సమయం వృధా చేసుకుంటున్నారు.  దీని బదులు వాకింగ్ కానీ, మరేదైనా ఎక్సర్ సైజ్ చేస్తే మేలు కదా!” అన్నాడు వినోద్. వంటగదిలోంచి  వీరి మాటలు వింటున్న బామ్మ భవాని ” ఏరా! తాతగారిని విమర్శించేంత  గొప్పవారా మీరు!  మీకేం తెల్సురా ‘ గాయత్రీ ‘ మాత  ప్రభావం ? “అంది కోపంగా.


“ఏంటర్రా!  పిల్లలూ! మీ బామ్మ ఏదో చెప్తున్నట్లుంది ? ఏదైనా కధా?” అని అడిగాడు తాత  తారకరామయ్య.


“వీరికి కాస్త గాయత్రి గురించి చెప్పండి .’గాయత్రీ మాత ‘మహత్వం తెలీక ఏదో అనుకుంటున్నారు . పైకి అనలేదు కానీ వీరి మనస్సుల్లో ‘ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ?’ అనే సందేహం మాత్రం ఉంది .” అంటూ బామ్మ వంట గదిలోకి  వెళ్ళింది.


తారకరామయ్య తన వాలు కుర్చీలో కూర్చున్నాక,  పిల్లలిద్దరూ  వెళ్ళి ఆయన కిరువైపులా  స్టూల్స్ లాక్కుని కూర్చుని ” తాతగారూ చెప్పరూ! ప్లీజ్ ! ” అని అడిగారు.


ఆయన గొంతు సవరించుకుని చెప్పసాగారు. “ఇది  నిజంగా జరిగిన సంఘటన, కల్పనా కాదు, ఎవరో రాసిన కధా కాదు. యదార్ధగాధ.  అది ఆంగ్లేయులు మన దేశంలో ఉన్నప్పటి విషయం,  అప్పటి ఒక ఆంగ్ల దొర ‘ధామస్ మన్రో ’ అనే ఆయన పేరని గుర్తు. క్యాంప్ మీద కన్నడదేశానికి వచ్చి, ఒక రోజున తన గుఱ్ఱం మీద   తుంగభద్రా నది ఒడ్డున షికారుకు బయల్దేరాడు . ఆయన తోటి షుమారుగా  అరడజను మంది జవాన్లు గుఱ్ఱంతో పాటుగా పక్కనే పరుగెడుతూ  అనుసరించ సాగారు.


” మన గురించీ  ఏమనుకుంటున్నారు జనం?” ధామస్ తన వెంట ఉన్న వారిని అడిగాడు.                                                                         ” “చాలామంచివారనుకుంటున్నారు దొరా!” వారిలో ఒక ముఖ్య సేవకుడు, బాపన్న చెప్పాడు.


” మీరంటే  అందరికీ భయమే దొరా!”  ముఖప్రీతికై మరో జవాన్ చెప్పాడు.


” సరి, సరి.ఈ రోజు విశేషాలేంటి?” ధామస్ మళ్ళీ అడిగాడు.


“ఏమున్నాయ్ దొరా! మీరీ  సమయంలో  షికారుకు వస్తున్నారు కదా ఈ వారంగా ఒక్కపిట్టా ఈ దారంట రాదు.”


“ఓహ్! అక్క డ చాలామంది జనం ఉన్నారు? ఏంటి విశేషం! ” ఆశ్చర్యంగా అడిగాడు ధామస్ .


” దొరా! అక్కడ నది ఒడ్డున ‘ శృంగేరి పీఠాధిపతులు’  కొలువు చేసి ఉన్నారు , ఆయన శిష్యులూ , స్వామి వారి ప్రవచనం ఆలకించను ఊరి జనమూ చేరి ఉన్నారు దొరా!”


“శృంగేరీ పీఠమా! అదేంటీ ఎన్నడూ విన లేదే?”


” దొరా ! మీరిక్కడికి ఎప్పుడూ రాలేదు కదా ! అంచేత విని ఉండరు. ఈ కన్నడదేశంలోని , చిక్క మగళూరు దగ్గరే శృంగేరి ఉంది. ఆది శంకరాచార్యులు  ధర్మ ప్రచారం కోసం మొదటి మఠాన్ని ఇక్కడ శృంగేరీ లో స్థాపించారు.”


” శృంగేరి అంటే అర్ధమేంటి ? దానికా పేరు మఠస్థాపన తర్వాత వచ్చిందా ? లేక ముందు నుంచే ఉందా? “    “శృంగేరి తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది దొరా!. తుంగభద్ర నది ఇటు ప్రక్కన విద్యాశంకర దేవాలయం , తుంగభద్ర నది అవతల ఒడ్డున నరసింహవనం ఉన్నాయి . శృంగేరి అనే పేరు ‘ఋష్యశృంగగిరి ‘నుండి వచ్చిందని అంటారు దొరా! శృంగేరికి సమీపంలో  ’ శృంగపర్వతం’ ఉన్నది .  విభండక మహర్షి కుమారు డు  ‘ ఋష్యశృంగ ‘ మహర్షి.  ఈ యోగి మహానుభావుడు  ఒకసారి ‘రోమపాదు’ డనే రాజు పాలిస్తున్న ‘అంగ రాజ్యం’ క్షామానికి  గురై , జనం బాధపడసాగారుట. ఆ సమయంలో, ఋష్యశృంగుడు  అడుగు పెట్టగానే  వర్షాలు పడి, క్షామ నివారణ ఐనదని అంటారు . ఈ గ్రామములో శంకరాచార్యులు అద్వైతాన్ని వ్యాప్తి చేయ టానికై  స్థాపించినదే ఈ శృంగేరీ శంకరమఠం. ”


” ఎంతైనా మీ భారతదేశం చాలా గొప్పదోయ్ ! మహాను భావులు ఎంతోమంది ధర్మస్థాపనకై కృషి చేసిన ‘పుణ్యభూమి’ మీది. నాకెంతో ఇష్టం  మీ దేశమంటే , నేనిక్కడ పుట్టకపోతినే అని బాధపడుతుంటాను అప్పుడప్పుడూ.”  ధామస్ మనస్పూర్తిగా అన్నాడు.


“ఔ దొరా! మాదేశం మహా గొప్పది!” మురిసిపోతూ  తన దేశాన్ని గురించీ చెప్పుకున్నాడు మరో జవాన్  రొప్పుతూ వెంట నడుస్తూ.


” శంకరాచార్యుల వారు మఠాన్నిఇక్కడే ఎందుకు  స్థాపించాలనుకున్నారో తెల్సా?” థామస్ అడిగాడు.


“శంకరాచార్యుల వారు, తన పరివార శిష్యులతో ధర్మ ప్రచారం కోసం దేశాటన  జరుపుతూ ఇక్కడ పర్యటిస్తూన్నప్పుడు, ఆయన ఒక చిత్రం చూశారు దొరా! ఒక సర్పం ప్రసవిస్తున్నఒక కప్పకు ఎండ పడకుండా తన పడగ నీడ పడుతున్న దృశ్యం , ఆయన చూసి ఆశ్చర్యపడ్డారు , ఈ స్థల మహత్యం గొప్పదని గమనించారు .  అంతే కాక ఇక్కడ వరకు వచ్చేసరికి మండన మిశ్రుడి భార్య ఐన ఉదయ భారతి సరస్వతి మూర్తిగా మారి పోతుంది. ఆ కధ చాలాపెద్దది ఇంకోమారు చెప్తాను దొరా! ఈ రెండు సంఘటనలు చూసిన  ఆయన  ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మఠాన్ని స్థాపిస్తారు . ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపారని చెప్తారు. అంత గొప్ప పుణ్యక్షేత్రం  ఈ శృంగేరి.”


“మరి ఆ మహాపురుషుడేనా ఈయన? ”


” కాదు దొరా అది జరిగి చాలా ఏళ్ళైంది . ఈయన ఆ గురు పరంపరలోనివారే ! వీరంతా బాల్యంలోనే  పీఠాన్ని చేరి వేద వేదాంగాలూ , శంకరాచార్యుల వారు ప్రవచించిన విశేషాలన్నీ అధ్యయనం చేస్తారు దొరా ! వీరంతా బ్రహ్మచారులు, ఎవ్వరూ వారిని ముట్టుకోడం కాదుగదా! దరిదాపులకు వెళ్ళనే ఝడుస్తారు , స్త్రీలైతే బహు దూరం నుంచీ దర్శించవలసినదే! వారు అనుగ్రహ భాషణంలోని ఆధ్యాత్మిక విషయాలు చాలా గొప్పవి దొరా! ఒక్కటి  ఆచరిస్తే  చాలు జన్మ సార్ధకమవుతుంది.”                                                                                                                                   దూరం  నుంచీ ఆ ఆచార్యులను గమనించిన ధామస్ ” ఆహా! ఆ ముఖ వర్చస్సెంత గొప్పగా ఉంది! వెయ్యి వాల్టుల బల్బు వెలుగుతున్నట్లుంది వారి తేజస్సు! మరి బాపన్నా! ఆచార్యుల చెంతగా ఉన్న ఆ స్త్రీ మూర్తి  ఎవరు? స్త్రీలకు ప్రవేశమే లేదన్నట్లు చెప్పావు ? మరి వారికి అంత దగ్గరగా ఉన్న ఆ అందమైన ,  అద్భుతమూర్తి, టీనేజ్ గాళ్  !ఎవరు బాపన్నా! వెళ్ళి తెల్సుకుని వస్తావా? ఈజ్ షీ హిజ్ సిస్టర్ !”                                                                                                                          ” దొరా! మాకక్కడ ఎవ్వరూ స్త్రీమూర్తి కనిపించడం లేదే! మీకెవరు కనిపిస్తున్నారు?”


” అదో బాపన్నా! అంత బాగా కనిపిస్తుంటే లేదంటావేం? వెళ్ళి అడిగిరాపో?” అన్నాడు ధామస్ దొర .


దొర ఆదేశం మేరకు బాపన్న  చేతులు కట్టుకుని  దగ్గరగా వెళ్ళి వినయంగా , ఆచార్య శిష్యులకు తమ దొర సందేహం విన్నవించాడు .


ఆ శిష్యుడు ఆశ్చర్యంగా ”  అక్కడ మాకెవ్వరూ స్త్రీమూర్తి కనిపించడం లేదే ! అసలిక్కడ స్త్రీలకు ప్రవేశమేలేదే?” అన్నాడు.                                                                                                                                                        బాపన్న” ఔ  స్వామీ! మాకూ కనిపించడంలేదు . కానీ మా దొరకు కనిపిస్తున్నదిట! అడిగి వివరం తెల్సుకు రమ్మన్నారు. పీఠాధిపతులకు విన్నవించండి”అన్నాడు.


ఆ శిష్యుడు పీఠాధిపతులను సమీపించి , ఆ దొరగారి సందేహాన్ని  చెప్పగానే  , ఆశ్చర్యంగా ఆయన తలెత్తి దూరంగా గుఱ్ఱం దిగి తననే దీక్షగా చూస్తున్న ఆ దొరను చూసి,” నాయనా! నా సమీపంలో ఉన్నది శారదా మాత! ఆ తల్లి దర్శనం ఎవరికో నిష్టగా గాయత్రి  చేసే వారికి కానీ లభించదు . నేను ఇక్కడ ప్రవచిస్తున్నప్పుడంతా ఆ మాత  నా సమీపంలో ఉండి సద్వాఃక్కులను నా నోట పలికిస్తుంటుంది . నాశిష్యులైన మీరే కాంచలేని  ‘అమ్మ’ను  ఆ దొర దర్శించాడంటే  ఆయన పూర్వజన్మలో భారతదేశంలో జన్మించి , గాయత్రీ జపం సంపూర్ణంగా , నిష్టగా  గావించి  ఏదో ఒక కారణాంతరంవల్ల ఆంగ్లేయుడై , ఆ ప్రాచ్యదేశంలో జన్మిం చాడు. నేను  పీఠాధిపతిని కనుక ఆయనకు నమస్కరించరాదు .  లేనిచో  ఆయన  నమస్కార అర్హుడని వెళ్ళి చెప్పిరా!” అని శృంగేరీ  పీఠాధిపతి  చెప్పిపంపారు. ‘


“అదిరా గాయత్రీ మంత్ర మహత్యం  అర్ధమైందనుకుంటా ! నియమంగా భక్తితో  జపించిన వారికి  ఈ జన్మలోనే కాక మరు జన్మలోనూ రక్షణ నందిస్తుంది.” అని తాతగారు వివరంగా చెప్పారు. .


పిల్లలిద్దరూ ” మన్నించండి  తాతగారూ!! మాకివన్నీతెలీక తేలిగ్గా మాట్లాడాము. మాకూ ’ గాయత్రి’ ఉపదేశించండి.. ఈ వేసవిలో ఇక్కడ ఉన్నన్నాళ్ళూ మీతో పాటు  రోజూ  గాయత్రి  చేస్తాము . మా ఊరువెళ్ళాక వీలున్నంత సేపు నిత్య గాయత్రీ చేసేందుకు ప్రయత్నిస్తాము.”  అన్నారు.🕉🚩🕉️

ఆదివారం

 *వద్దు* వద్దు *వద్దు* వద్దు *వద్దు* వద్దు *ఎందుకు*

👇👇👇👇👇👇👇👇👇👇

 *💥ఆదివారం సెలవువద్దు💥*


*ఆదివారం పవిత్ర దినం, ఇకనైనా మేల్కొందాం!* 

*ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని ఓక శ్లోకం మీకోసం.* 

*అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |* 


*సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||*


*స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |*


*న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ||*


*💥తాత్పర్యం:* 


*మాంసం తినడం..!* 

*మద్యం తాగడం..!*

*స్త్రీతో సాంగత్యం..!* 

*క్షవరం చేసుకోవటం..!*

*తలకు నూనె పెట్టుకోవడం..!*


*ఇలాంటివి ఆదివారం నాడు  నిషేధించారు,* 

*కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం..!* 

*ఈ కర్మలు చేసినవాడు  జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు* 

*అని నొక్కి చెప్పారు మన పెద్దలు దరిద్ర్యం అంటే* *డబ్బు లేకపోవడం* 

*ఒక్కటే కాదు..* 

*కుటుంబ సౌఖ్యం లేకపోవటం..*

*ఆనారోగ్యం కూడా..!!*


*ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి,* 

*తిండిపోతులకి* 

*ఇష్టమైన రోజు అయింది..!!*


*మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు..!!*


*ఎందుకంటే..* 

*అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు..* 

*సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి..!!* 

*సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం..!!*


*అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి..!!*


*ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి..!!*


*ఇలాంటి ఆదివారం మనకి* 

*చాలా పవిత్రమైన రోజు..* 


*అలాంటి ఆదివారాన్ని వీకెండ్* 

*పేరుతో ఆదివారం సెలవు అనే* 

*పేరుతో అపవిత్రం పాలు చేశారు..!!* 

*చేస్తున్నాము..!!*


*మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ..*

*ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి...!!*


*అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు (Thomas Babington Macaulay, ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు..* 

*మన హిందువులే మన సంస్కృతిని*

*నాశనం చేసేలా చేశారు..!!* *ఆదివారం నాడు మన హిందూ* 

*దేవాలయాలు వెలవెల బోతాయి.!!*


*పూర్వకాలంలోవృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు.!* 

*ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!*


*మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు..* 

*ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు..* 

*మధ్యాన్ని తాగేవారు కాదు..!!*


*కానీ ఇప్పుడు సీన్ అంతా* 

*రివర్స్ అయ్యింది!!*


*ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు.!* 

*ఇప్పటికైనా కళ్ళు తెరవండి.!* 

*విదేశీ సంస్కృతిని విడనాడండి.!* 

*స్వదేశీ_సాంప్రదాయాలను పాటించండి..!*


*యోగ చేయండి.!* 

*ప్రాణాయామం చేయండి.!* 

*సూర్య_నమస్కారాలు చేయండి.!*  

*సూర్యోపాసన చేయండి.!!* 

*ఆయురారోగ్య ఐశ్వర్యాలను* 

*పొందండి..!!*


*ఈ పోస్టు కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియు కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది..!!* 

*కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి..!!*


*ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు.🙏 ఓం నమః శివాయ 🌞

శ్రీ శివానన్దలహరీ

 ॐ                 श्री शिवानन्दलहरी    

                     శ్రీ శివానన్దలహరీ    

      SREE SIVAANANDALAHAREE      


              (श्रीमच्छंकरभगवतः कृतौ)   

           (శ్రీ శంకరాచార్య విరచితమ్)  

        (BY SREE AADI SANKARA)            


                                  శ్లోకం :89/100

                           SLOKAM :89/100     


नतिभिर्नुतिभिस्त्वमीशपूजा-

     विधिभिर्ध्यानसमाधिभिर्न तुष्टः ।

धनुषा मुसलेन चाश्मभिर्वा

     वद ते प्रीतिकरं तथा करोमि ॥ ८९॥


నతిభిర్నుతిభిస్త్వమీశ! పూజా 

విదిభిర్ధ్యానసమాధిభిర్నతుష్టః I 

ధనుషా ముసలేన చాశ్మభిర్వా 

వద తే ప్రీతికరం తథా కరోమి ॥          -89    


పరమేశ్వరా!  

    నమస్కారాలచేత, 

    స్తుతులచేత,  

    పూజావిధులచేత,  

    ధ్యానసమాధులచేత నీవు సంతోషించలేదు.    


ధనస్సుచేగానీ,     

రోకలిచేగానీ,     

రాళ్లతోగానీ ఎదుర్కొంటే నీకు ఇష్టమవుతుందా? చెప్పు. 

    ఆ ప్రకారంగానే స్పందిస్తాను.   

    

Hey, Lord, who rules over the universe! 


    You seem to become more pleased with bow or with pestle or with stones 

    than with prostrations or singing of your praise  or worship, 

Or meditation  or Samadhi. 


    Please tell me  which you like most and I will do the same.  


    అర్జునుడు పాశుపతాస్త్ర సంపాదనకోసం తపస్సుచేస్తూ కొండదొర రూపంలో ఎదిరించిన పరమేశ్వరుణ్ణి వింటితో కొట్టినట్లు భారతంలో స్పష్టంగా వర్ణింపబడింది.      

    రోకలితోనూ, రాళ్లతోనూ పరమశివుణ్ణి ఎదిరించిన భక్తుల చరిత్ర పురాణాలలో ఎక్కడో ఉండియుంటుంది.  


    ఈ శ్లోకం వైరభక్తి తత్త్వాన్ని నిరూపిస్తోంది.  

    వైరభక్తితో గూడ పరమాత్మని ఆరాధింపవచ్చు అని ఉపదేశిస్తోంది.    

    భక్తితో కొందరు పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందగా, మరికొందరు శత్రుత్వంతో పొందినట్లు పురాణాలలో ప్రసిద్ధం. అది వైరభక్తి అనిపించుకొంటుంది.    

    హిరణ్యాక్ష హిరణ్యకశిపులు,    

    రావణ కుంభకర్ణులు మొదలైనవారు ఆ కోవకు చెందుతారు.  

    చిరకాలం భక్తితో సేవించడం కంటే శత్రుత్వంతో సులభంగా పరమాత్మ సాయుజ్యాన్ని పొందవచ్చు అని శ్రీమహాభాగవతంలో  చెప్పబడింది. 


వైరానుబంధనంబునఁ 

జేరిన చందమున విష్ణుఁ జిరతర భక్తిం    

జేరఁగ రాదని తోఁచును    

నారాయణ భక్తి యుక్తి నా చిత్తమునన్ .


* భక్తుల తనయెడ జేసిన అకార్యాలని వాత్సల్యాన భగవానుడు క్షమిస్తాడు. 


https://youtu.be/h8qlcoPKG5o


                            కొనసాగింపు.. 


                         =x=x=x= 


సేకరణ, కూర్పు :                         

 రామాయణం శర్మ 

      భద్రాచలం

బ్రాహ్మణత్వము

 బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి...ధర్మరాజు ఇలా అడిగాడు...!💐శ్రీ💐


పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము పొందవచ్చునా ! అని తన సందేహం వెలిబుచ్చాడు. 


భీష్ముడు ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభం.ఎన్నోజన్మలు ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు. 


ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు. 


దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో  అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది. 


గాడిద మాటలను అర్ధము చేసుకున్న విప్రకుమారుడు ఆ గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది. లేకుంటే అలా ఎందుకు అంటుంది? అనుకున్నాడు. విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు. 


గాడిద విప్రకుమారా ! నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు అని చెప్పింది. ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో  తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడను కాను. 


ఆ గార్ధభము ఏదో శాపవశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది. లేకున్న ఈ నా జన్మరహస్యము ఎలా తెలుస్తుంది?. తండ్రీ ! నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు.


మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై కుమారా ! నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు ? నీ కోరిక ఏమిటి  అని అడిగాడు. మతంగుడు దేవా ! నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి అని అడిగాడు. 


ఇంద్రుడు కుమారా ! బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో అని అన్నాడు. మతంగుడు అయ్యా ! నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి. నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు. 


ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. 


ఇంద్రుడు కుమారా ! నీ పట్టు విడువక ఉన్నావు! శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా ! 


ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు. 

దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శూద్రుడు వైశ్యుడు కాలేడు. 

దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు. 

దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు. 

దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు. 


అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సరాల తపస్సుకు వస్తుందా ! చెప్పు అన్నాడు. ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టుకొనుట కష్టము.


 ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కాని బ్రాహ్మణజన్మ ఎత్తలేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు ఔతాడు. 


తిరిగి బ్రాహ్మణజన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణజన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు. నీ కిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు అన్నాడు. 


మారుమాటాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యేవరకు తపస్సు చేసాడు. 


అతడి శరీరము శిధిలమై పడిపోతుండగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు? చక్కగా వేరు వరములు అడిగి సుఖపడు అన్నాడు. 


మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు నీవు చంఢదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల. పూజలందుకుని వారి వలన నీ కోరికలు ఈడేర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు. 

కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు.

(భారతంలోని అనుశాసనిక పర్వంలోని కథ).


అటువంటి ఉత్కృష్టమైన, పరమ పవిత్రమైన బ్రాహ్మణ జన్మను కాపాడుకోవలసిన అవసరం మన బ్రాహ్మణులదే.

జై బ్రాహ్మణ్...జై జై బ్రాహ్మణ్..స్వస్తి..!!


లోకా సమస్తా సుఖినో భవంతు..!!💐

                         💐శ్రీ మాత్రే నమః💐

19, జులై 2022, మంగళవారం

హనుమంతుడు

 🍃🌷🌻🙏🌻🍃


శ్రీ *హనుమంతుడు* ఎప్పుడూ 

నమస్కరిస్తూనే కన్పిస్తాడెందుకు ?

( ఆలయ విగ్రహాల్లో )


రావణవధ! 

అయ్యాక వెళ్ళిపోతుంటే 


సీతారాములు కూడా వెళ్తుంటే 

రాముడు ఆంజనేయుడితో అన్నాడు 


" హనుమా " నీకేం కావాలి ? అని 


అప్పుడు హనుమంతుడు 

ఇలా అన్నాడు !


నాకు మరే విధమైన 

కోరికలు లేవు తండ్రి... 

ఏ రూపంలో చూచినా 

అందులో 

నీ రూపమే కన్పించేలానూ 

ఏ శబ్దం వినిపించినా 

అందులో సీతారాముల కథే 

ఉందని అనిపించేలానూ


ఎక్కడ నమస్కరించినా 

అది మీకే చెందేలానూ

ఈ భావం నాకు శాశ్వతంగా

ఉండేలా అనుగ్రహించు

అని సీతారాముల ముందు

కోరాడు హనుమంతుడు


దానికి రాముడు సరేనన్నాడు !


అందుకని ఆంజనేయుని 

నమస్కారం సీతారాములకే !

ఆంజనేయ ధ్యానమంతా 

సీతారాముల విషయంలోనే 


సీతారాములకి 

నమస్కరిస్తున్న హనుమకి

నమస్కరించడం 

సీతారాములకి మరింత ఇష్టం !!


ఎందుకంటే 


భగవంతుడు తనకి చేసిన

నమస్కారం కంటే,

తన భాగవతునికి ( భక్తునిగా )

చేసిన నమస్కారానికి 

ఎక్కువ ప్రాధాన్యాన్నిసాడు కదా !!

( అహం స్మరామి మద్భక్తమ్ )


🙏శ్రీరామదూతం శిరసా నమామి🙏


                🌷 *సేకరణ*🌷

          🌹🌷🌞🌞🌷🌹

                  *న్యాయపతి*

               *నరసింహా రావు*


🌴🎋🌾🌹🍁🛕🍁🌹🌾🎋🌴

శ్రీ శివానన్దలహరీ

 ॐ                 श्री शिवानन्दलहरी    

                     శ్రీ శివానన్దలహరీ    

      SREE SIVAANANDALAHAREE      


              (श्रीमच्छंकरभगवतः कृतौ)   

           (శ్రీ శంకరాచార్య విరచితమ్)  

        (BY SREE AADI SANKARA)            


                                  శ్లోకం :88/100

                           SLOKAM :88/100     


यदा कृताम्भोनिधिसेतुबन्धनः

     करस्थलाधःकृतपर्वताधिपः ।

भवानि ते लङ्घितपद्मसम्भवः

     तदा शिवार्चास्तवभावनक्षमः ॥ ८८॥


యదా కృతాంభోనిధి సేతుబంధనః 

కరస్థలాధఃకృతపర్వతాధిపః I 

భవాని తే లంఘితపద్మసంభవ 

స్తదా శివార్చాస్తవ భావన క్షమః ॥          -88    


శంకరా!    

    ఎప్పుడు సముద్రానికి వంతెన కట్టినవాణ్ణి (రాముణ్ణి) కాగలనో,    

    వింధ్యపర్వతాన్ని ఎగనీయకుండా అరచేతితో అణచినవాణ్ణి (అగస్త్యుణ్ణి) కాగలనో,    

    బ్రహ్మదేవుని మించగలనో  అప్పుడే నిన్ను అర్చించడంలోను, స్తుతించడంలోను, ధ్యానించడంలోను సమర్థుణ్ణి కాగలుగుతాను.    

 

    How will I ever worship thee lord? 

    For I have not built the bridge across the sea (Rama), 

    I have not subdued the king of the mountain by palm of my hands (Agasthya) and 

    I am nor born out of lotus from the belly of Lord Vishnu (Brahma). 

    

    If I ever  do or attain these, 

    then I would become capable of 

    offering flowers, 

    singing your praise and 

    meditating on you.    


    పరమేశ్వరుణ్ణి భక్తితో 

  - పూజించి రాముడు సముద్రానికి వారధి కట్టాడు.    

  - స్తుతించి అగస్త్యుడు వింధ్యపర్వతాన్ని మీదికి ఎదగనీయకుండా చేతితో అణచివేశాడు.    

  - ధ్యానించి బ్రహ్మ సృష్టికార్యాన్ని నిర్వహిస్తున్నాడు.  

     కాబట్టి పరమశివుణ్ణి భక్తితో అర్చించి స్తుతించి, ధ్యానించి జీవితాన్ని తరింపజేసుకోవాలి. 


*  శ్రీరామ - అగస్త్య - బ్రహ్మలు మహాశివ భక్తులు. 

    శివభక్తులకు అసాధ్యముండదు, 

    సర్వమూ సాధ్యమే! 


https://youtu.be/h8qlcoPKG5o


                            కొనసాగింపు.. 


                         =x=x=x= 


సేకరణ, కూర్పు :                         

 రామాయణం శర్మ 

      భద్రాచలం

భోజన నియమాలు

 *హిందూ సాంప్రదాయములో భోజన నియమాలు, క్లుప్తంగా----*

>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<<<                                     

1. భోజనానికి ముందు,తరువాత తప్పకకాళ్ళు,చేతులుకడుక్కోవాలి. 

తడికాళ్ళను తుడుచుకుని భోజనా నికి కూర్చోవాలి.

2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు,మొదలైన.) తినే పళ్ళాని కి తాకించరాదు.  

అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి. 

ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరా దు. చాలా దోషం.  

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పె ట్టి నెయ్యినీ కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

5. భోజనంచేస్తున్నప్పుడుమధ్య లో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్నిచూ పించరాదు. తాకరాదు.  

7. ఎడమచేతితో తినే కంచాన్నిము ట్టుకోన కూడదు. 

ఒకవేళకంచాన్నిముట్టుకుంటే! .వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టు కోనవలెను.  

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కం చంలో భోజనానికి పనికిరాదు.  

9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్ర మంగా దరిద్రులు అవుతారు.

10  భగవన్నామము ఉచ్చరించి భో జనం చేయాలి.

11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపము తో అన్నం పెట్టేవారిని తిట్టడంచేయ రాదు.

12.  ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోనరాదు. ఏవైనా పదార్థా లలో ఉప్పు తక్కువైతే  ఆ పదార్థా లుఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.

13. కంచంఒడిలోపెట్టుకునిభోజనం చేయరాదు. పడుకునే  మంచం మీ ద భోజనం చేయరాదు. 

(ఇదివృద్ధులకు,అనారోగ్యము గా ఉన్న వారికి వర్తించదు.)

14. మాడిన అన్నాన్నిదేమునకు ని వేదించరాదు.అతిథులకుపెట్టరాదు.15. భోజనం అయ్యాక క్షురకర్మ చే సుకోనరాదు. (వెంట్రుకలు కత్తిరిం చడం)

16. గురువులు లేదా మహాత్ములు అతిథులుఇంటికి వస్తే మనంతినగా మిగిలిన వి పెట్టరాదు. 

మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి. 

17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తి బేధం చూపరాదు. అనగా ఒకరికి ఎ క్కువ వడ్డించడం మరొకరికితక్కువ వడ్డించడం చేయరాదు. 

18. భోజనం చేస్తున్నప్పుడు తింటు న్నపదార్థాలలోవెంట్రుకలువస్తే,ఆపదార్ధములోనెయ్యినివడ్డించితినాలి. పురుగులు వస్తే ఆ భోజనం తక్షణం విడిచి పెట్టాలి.

19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలోఆవునెయ్యివేసుకుం టే ఆహారం శుద్ధి అవుతుంది. 

20.భగవన్నామములుతలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ  వంట వండడం, భోజనం చేయడం చాలా ఉత్తమము. 

21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బల వంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి  ఇబ్బంది అవ్వచ్చు) 

22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.  

23. గిన్నెలోనిపదార్ధమునుమొత్తం ఊడ్చుకుని తినరాదు.ఆహార పదా ర్థాలను కాళ్ళతో తాకరాదు.

24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డనసమయంలోఅక్కడఉండరాదు.

26. అరటిఆకులవంటి వాటిలో భో జనం చేసిన వ్యక్తి వాటినిమడవకూ డదు (తిన్న విస్తరిని మడవడం అ నాచారం).తన ఇంటిలో ఒక్కడే ఉ న్నప్పుడు ఈ నియమం వర్తించదు.

27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడి కి వచ్చేపుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రము.

(జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసినరాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆ కులు ఎత్తాడని మహాభారతం చెబు తోంది.)    

28.  భోజనం అయ్యాక రెండుచేతు లూ,కాళ్ళూ కడుక్కోవాలి. 

అవకాశం లేనప్పుడు రెండు చేతు లైనా తప్పక కడుక్కోవాలి. 

నోరునీటితోముమ్మారుపుక్కిలించుకోవాలి.

29.  భోజనం అయ్యాకనేలనులేదా బల్లనుశుద్ధిచేయాలి (మెతుకులుతీ సేసి,తిన్నచోట శుద్ధిపేట్టితడిగుడ్డతో శుభ్రం) చేసినతరువాత మాత్రమేఅ క్కడ వేరేవారికి భోజనంవడ్డించాలి.(ఇప్పటికీసదాచారములుపాటించేకొందరి ఇళ్ళల్లో గోమయం లేదా ప సుపునీళ్ళు చల్లి మరీశుద్ధిచేస్తారు.)  

30.స్నానం చేసి మాత్రమే వంట వం డాలని కఠోర నియమము.  

పెద్దలు,సదాచారపరులు,హోటళ్ళలో మరియు ఎక్కడంటేఅక్కడభోజ నం చేయకపోవడానికిఇదేముఖ్యకా రణం.అక్కడవంటచేసేవారుస్నానం చేసారో లేదో తెలియదుకదా,పాచి ముఖంతో వంట చేసినా,రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించివంటచేసినా దోషము. అవి తిన్న వారికి మెల్లగా వారిమనసుపైప్రభావంచూపుతుంది.పుణ్యం క్షీణిస్తుంది.అజ్ఞానంవస్తుం ది జ్ఞాపకశక్తిపోతుంది.

31.ఒకసారివండాకఅన్నము,కూర,పప్పు వంటి ఇతరఆహారపదార్థాల ను మళ్ళీ వేడిచేసి తినరాదు. ద్వి పాక దోషం వస్తుంది. 

32. ఆడవారు గాజులు ధరించకుం డా భోజనం చేయరాదు. ఇతరులకుభోజనమువడ్డించరాదు.

*ఇవీ,క్లుప్తంగా  హిందూసాంప్రదా యంలోని కొన్ని భోజన నియమా లు---//-*

పాదుకా స్పర్శనం - పరమాత్మ దర్శనం

 పాదుకా స్పర్శనం - పరమాత్మ దర్శనం


పరమాచార్య స్వామికి గొప్ప భక్తులైన పోలూర్ శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్ గారు జీవితంలో ఒక్కసారైనా స్వామివారి పాదుకలను తాకాలని ఆశపడేవారు. వారు సాంప్రదాయక బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతూ పోస్ట్ మాష్టరుగా ఉద్యోగం చేసేవారు. తలపై శిఖతో మూడుపూటలా సంధ్యావందనం చేసే నిష్టాగారిష్టుడు.


భగవంతుడే భక్తుని వద్దకు వెదుక్కుంటూ వస్తాడని నమ్మేవారు. దాన్ని నిజం చేస్తున్నట్టుగా మహాస్వామివారు కలశపక్కం జిల్లాలో మకాం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య అయ్యర్ మహాస్వామివారి దర్శనానికి బయలుదేరగా, స్వామివారు ఈశ్వరాలయానికి వెళ్తున్నారు. వెంటనే స్వామివారు వెళ్ళిన దారిలో ఈశ్వరాలయానికి వెళ్ళాడు. కొద్దిదూరంలో మహాస్వామివారు ఆలయానికి వెళ్తుండడం గమనించారు. అప్పుడే ఆయన దృష్టి మహాస్వామివారి పాదాలపై, వారు వేసుకున్న దివ్యపాదుకలపై పడింది.


ఒక్కక్షణం ఇలా ఆలోచించారు. “ఒక్కసారి పరమాచార్య స్వామివారి పాదుకలను తాకగలిగితే, ఈ జన్మకే కాదు ఇక నాకు మరో జన్మంటూ ఉండదు” అని. మహాస్వామివారు దేవాలయం బయట ఆగి ఒకసారి అందరిని చూశారు. సుబ్రహ్మణ్య అయ్యర్ పరిగెత్తుకుని వెళ్లి గుంపులో చేరాడు. స్వామివారి పాదుకలను చూసుకునే భాగ్యం కల్పించాలనే మహాస్వామి వారు ఆలయ దర్శనానికి వచ్చారు అని తనలో తానూ అనుకున్నాడు.


పరమాచార్య స్వామివారు అందరిని పలకరించి, “నేను లోపలి వెళ్లి స్వామీ దర్శనం చేసుకుని వచ్చేదాకా ఎవరైనా నా పాదుకలను చూసుకుంటారా?” అని అడిగారు. ఇది వినగానే ఆ భాగ్యం ఎవరికీ కలుగుతుందో అని అందరూ ఉత్సుకతతో చూస్తున్నారు. మరలా స్వామివారు, “ఈ గుంపులో శాస్త్రోక్తమైన శిఖముడి ఉన్నవారెవరైనా ఈ పనికి రావచ్చు” అని అన్నారు.


అక్కడున్నవారందరిలో స్వామివారి సహాయకులు వినా శిఖముడి ఉన్నవారు సుబ్రహ్మణ్య అయ్యర్ ఒక్కరే. మనం విన్నట్టు రామాయణంలో ఆ రోజు భరతునికి కలిగిన భాగ్యం ఈ రోజు సుబ్రహ్మణ్య అయ్యర్ కు దక్కింది. వొణుకుతున్న చేతులతో, కళ్ళల్లో ఆనందభాష్పాలతో ఆ పాదుకలను చేతిలోకి తీసుకున్నారు సుబ్రహ్మణ్య అయ్యర్.


ఆయన ఆలయం వెలుపల ఆనందంగా నిల్చుని ఆ పాదుకలను అత్యంత మృదువుగా తాకుతూ, కళ్ళతో చూస్తూ, తలపై పెట్టుకుంటూ తనలో తాను రమిస్తున్నాడు. స్వామివారి అనుగ్రహానికి కరిగి కన్నిరైపోయాడు. స్వామివారితో సహా అందరూ దర్శనానికి లోపలి వెళ్ళారు. నిజమైన భక్తుడికి భగవంతుని విషయంలో ‘చాలు’ అనే మాట ఉండదు. సుబ్రహ్మణ్య అయ్యర్ విషయంలో కూడా అంతే. స్వామివారి పాదుకలు లభించడం మహా భాగ్యమే. కానీ అందరిలా మహాస్వామివారితో కలిసి ఈశ్వర దర్శనం చేసుకునే భాగ్యం కలగలేదు కదా అనుకున్నాడు.


పరమాచార్య స్వామివారికి స్వాగతం పలికిన పిదప ఆలయ అర్చకులు శివునకు మంగళ నీరాజనం ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నారు. స్వామివారు ఆ అర్చకున్ని ఆపమని తమ పార్శదున్ని పిలిచి, “బయట నా పాదుకలు పట్టుకుని నిలుచున్న అతణ్ణి లోపలికి పంపు, ఆ పాదుకలను నీవు తీసుకుని” అని పంపారు.


తక్షణమే సుబ్రహ్మణ్య అయ్యర్ రెండవ కోరికను కూడా స్వామివారు తీర్చారు. గర్భాలయంలో నాగాభరణం ధరించి, బిల్వామాలతో విరాజమానంగా ఉన్న శివలింగానికి మంగళ హారతి ఇస్తున్నారు. శివలింగం చుట్టూ కట్టిన పంచె జలపాతంలా పక్కనే మహాస్వామివారు నిలబడి ఉండగా ఇరువురికి ఏకకాలంలో నీరాజనం అర్పించారు అర్చక స్వాములు. అమ్మవారి ఆలయంలో కూడా సుబ్రహ్మణ్య అయ్యర్ కు ఇలాంటి దృశ్యాన్నే అనుగ్రహించారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అటుదిటు ( చిన్నకథ)🌷

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

   *🌷అటుదిటు ( చిన్నకథ)🌷* 

                శశికళ ఓలేటి 

                   🌷🌷🌷

"ఏవండీ! సేతు మాధవరావు గారు , భార్యా వచ్చారు ఇందాకా...వాళ్ళ పెద్దబ్బాయి ఇంటి గృహప్రవేశం ట. పిలవడానికి వచ్చారు."


"ఏ సేతు మాధవరావు? "


"ఎంతమంది ఉన్నారేమిటి? అదే మన వియ్యంకుడు,మన అమ్మాయిని ఇచ్చుకున్న ఇంటి యజమాని!"..  అన్నారు లక్ష్మిగారు కాస్త వ్యంగ్యంగా. 


" ఓ ఆయనా. నేనేం ఇవ్వలేదు నా కూతుర్ని.‌ఆయనే‌ అడిగి మరీ చేసుకున్నాడు. ఇంతకీ ఏంటంటావు? ఈ ఉన్న ఊళ్ళో సంబంధాలు కాదు కాని, ఏదో దానికి పిలుపు..ఇహ‌ నీ అత్యుత్సాహం. చూడవోయ్...ఈ మొహమాటాలన్నీ నా వల్ల కాదు. ఆ సోదంతా వింటూ, అందరినీ పలకరిస్తూ,ముఖస్థుతులు చేస్తు కూర్చోడం నాకు తలనొప్పి. నా మాట విని...ఆ బట్టలూ గట్రా కొనేసి, ఏం చదివిస్తావో చదివించేసి‌ చక్కా‌వచ్చేయి. నేనయితే కలవలేను వాళ్ళతో.".. అంటూ నిక్కచ్చిగా చెప్పేస్తున్న భర్త అహంకారానికి ఒళ్ళు మండిపోయింది లక్ష్మి గారికి.‌


"అయినా ఆ శాఖాభేదం మీరు మనసులోంచి తీసేయట్లేదు. వాళ్ళు పద్ధతులన్నీ శాస్త్రోక్తంగా పాటిస్తున్నారు.ఇంట్లో ఆ దేవతార్చన లు, అనుష్టానాలు.. పితృకార్యాలు...సమస్తం ఎంతో వేదోక్తంగా జరుపుతారు. మనలాగా అన్నీ మమ‌ అనేసి నీళ్ళు వదిలేయరు. మన పిల్ల అదృష్టం అలాంటి ఇంట్లో పడడం.. ! మీ బడాయిలు‌ పక్కకు పెట్టి‌ నడవండి.‌ పిల్లకు తలవంపులు తేకూడదు.""...పెట్టవలసిన నాలుగూ పెట్టి... ఆదివారం వియ్యాలారి కొత్తింటికి బయలుదేర దీసింది భర్తగారిని.


‌‌ వెళ్తూనే ఆయన ఎవరితోనూ ఒక పలుకూ, పలకరింతా లేకుండా బిగుసుకుపోయాడు. ఆయన వ్యవహారానికి లక్ష్మి గారికి బీపీ పెరిగి పోతోంది.‌అమెరికాలో ఉన్న కూతురి కి ఎక్కడ మాటొస్తుందో అని, కలివిడిగా.. కొంగు బిగించి అన్ని పనుల్లోకీ‌ దూకేసింది.‌వియ్యపురాలి చేతిలో పని లాక్కుని మరీ చేసేస్తు, అందరితో అంటీ ముట్టనట్లు మాట్లాడుతున్న భర్తమీద ఒక కన్నేస్తు...తెగ అలిసిపోయింది.‌ 


వియ్యాలారు మర్యాదస్తులు.‌ వియ్యంకుడు,ఆయన అన్నదమ్ములు ఈయనతో కూర్చుని కబుర్లు చెప్తూ, ఈయన అప్పుడప్పుడు రాలుస్తున్న మాటలు ముత్యాలు శ్రద్ధగా ఏరుకుంటూ..బాగానే ఎంగేజ్ చేస్తున్నారు. 


 సందడంతా సద్దుమణిగింది. పాపం ఆఖరు వరకు ఉండి,అలిసిపోయిన వాళ్ళకు టీలు పెట్టీ అందించి మరీ సెలవు తీసుకుంది లక్ష్మి గారు. ఆయన మటుకు అదే‌ గోరోజనం మెయింటెయిన్ చేస్తు వెళ్ళొస్తా అని చెప్పేసి కారెక్కేసాడు. ఇంటిల్లిపాదీ బయటకొచ్చి మరీ వీడ్కోలిచ్చారు. 

" హమ్మయ్య! పెద్ద మొహమాటం వదిలిపోయింది.‌విసుగొచ్చేసిందనుకో అంత సేపు కూర్చోవాలంటే!"... అన్నారు బడాయి గా! 


" మీ ముక్తసరి ప్రవర్తనకు ఖచ్చితంగా వెనుక అనుకుంటార్లెండి.".. అంది ఆవిడ వెటకారంగా! 


‌‌వియ్యాలారింట....


" మన చిన్నాడి‌‌ మావగారు పదిమంది పెట్టే.‌ మనిషి మితభాషి అయినా మర్యాదస్తులు,చిరునవ్వు మొహంలో చెదరకుండా అందరినీ ఇట్టే ఆకట్టుకున్నారు.నిండుకుండ‌ తొణకదు‌ అంటే‌ ఇదే!"అంటూ భార్యతో అన్నారు వియ్యంకుడు.


" మరే! ఆయన నిండుకుండే. కానీ ఆవిడే‌ మహాగాభరా మనిషి. పదే‌పదే సాయం చేస్తానని ఓ కాళ్ళల్లో,చేతుల్లో పడిపోతూ..‌పనులు తెమలనివ్వకుండా!"....అంది వియ్యపురాలు కాస్త విస్సాటంగా.


 *శశికళ ఓలేటి గారి కథ.*

గ్రామదేవతలు

 💐💐*గ్రామ దేవతల పేర్లు*💐💐

💐*గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు* :-💐

*పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షనిస్తుందని బలమైన నమ్మకం* .

*ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు .వారిలో కొందరు* .

1.పాగేలమ్మ

2.ముత్యాలమ్మ

3 .గంగమ్మ

4.గంగానమ్మ

5.బంగారమ్మ

6.గొంతెమ్మ

7.సత్తెమ్మ

8.తాళమ్మ

9.చింతాలమ్మ

10.చిత్తారమ్మ

11.పోలేరమ్మ

12.మావుళ్లమ్మ

13.మారెమ్మ

14.బంగారు బాపనమ్మ

15.పుట్టానమ్మ

16.దాక్షాయణమ్మ

17.పేరంటాలమ్మ

18.రావులమ్మ

19.గండిపోచమ్మ

20.మేగదారమ్మ

21.ఈరినమ్మ

22.దుర్గమ్మ

23.మొదుగులమ్మ

24.నూకాలమ్మ (అనకాపల్లి ,విశాఖజిల్లా )

25.మరిడమ్మ

26.నేరెళ్లమ్మ

27.పుంతలో ముసలమ్మ (మెయ్యెరు ,అత్తిలిదగ్గర ,పశ్చిమగోదావరిజిల్లా )

28.మాచరమ్మోరు

29.మద్ది ఆనాపా అమ్మోరు

30.సొమాలమ్మ

31.పెద్దయింట్లమ్మ

32.గుర్రాలక్క (అంతర్వేది ,తూర్పుగోదావరిజిల్లా గుర్రాలమ్మ )

33 .అంబికాలమ్మ

34.ధనమ్మ

35.మాలక్షమ్మ

36.ఇటకాలమ్మ

37.దానాలమ్మ

38.రాట్నాలమ్మ

39.తలుపులమ్మ

40.పెన్నేరమ్మ

41.వెంకాయమ్మ

42.గుణాళమ్మ

43.ఎల్లమ్మ (విశాఖపట్నం )

44.పెద్దమ్మ

45.మాంటాలమ్మ

46.గంటాలమ్మ

47.సుంకులమ్మ

48.జంబులమ్మ

49.పెరంటాలమ్మ

50.కంటికలమ్మ

51.వణువులమ్మ

52.సుబ్బాలమ్మ

53.అక్కమ్మ

54.గనిగమ్మ

55.ధారాలమ్మ

56.మహాలక్షమ్మ

57.లంకాలమ్మ

58.దోసాలమ్మ

59.పళ్ళాలమ్మ (వానపల్లి ,తూర్పుగోదావరిజిల్లా )

60.అంకాళమ్మ .

61.జోగులమ్మ

62.పైడితల్లమ్మ

63.చెంగాళమ్మ

64.రావులమ్మ

65.బూరుగులమ్మ

66.కనకమహాలక్ష్మి (విశాఖపట్నం )

67.పోలమ్మ

68.కొండాలమ్మ

69.వెర్నిమ్మ

70.దే శిమ్మ

71.గరవాలమ్మా

72.గరగలమ్మ

73.దానెమ్మ

74.మహాంకాళమ్మ

75.వేరులమ్మ

76.మరిడమ్మ

77.ముళ్ళ మాంబిక

78.యలారమ్మ

79.వల్లూరమ్మ

80.నాగులమ్మ

81.వేగులమ్మ

82.ముడియలమ్మ

83.రేణుకమ్మ

84.నంగాలమ్మ

85.చాగాలమ్మ

86.నాంచారమ్మ

87.సమ్మక్క

88.సారలమ్మ

89.మజ్జిగౌరమ్మ

90.కన్నమ్మ -పేరంటాలమ్మ

91.రంగమ్మ -పేరంటాలమ్మ

92.వెంగమ్మ -పేరంటాలమ్మ

93.తిరుపతమ్మ

94.రెడ్డమ్మ

95.పగడాలమ్మ

96.మురుగులమ్మ (బండారులంక ,తూర్పుగోదావరిజిల్లా )

97.కుంచమ్మ విశాఖపట్నంలో

98.ఎరకమ్మ

99.ఊర్లమ్మతల్లి

100.మరిడమ్మ

101.సుంకాలమ్మవ్వ ఉన్నారు .

💐నుసకపల్లి ,పామర్రమండలం తూర్పుదోదావరిజిల్లాలోని గ్రామదేవతలు .

1.నుసకపల్లమ్మ

2.వెలగలమ్మ

3 .ఊర్లమ్మతల్లి (గణపవరం ,కర్లపాలెం మండలం ,గుంటూరుజిల్లా )

4.పైళ్లమ్మతల్లి

5.బల్లమ్మతల్లి

6.లొల్లాలమ్మతల్లి

7.ఊడలమ్మ తల్లి

8.కట్వాలాంబిక

9.నాగాలమ్మ నాంచారమ్మతల్లి

10.సింగమ్మతల్లి

11.ఘట్టమ్మతల్లి

12.అంజారమ్మతల్లి .

13. మంత్రాలమ్మ తల్లి

14.పాతపాటేశ్వరి తల్లి

15.కుంకుళమ్మ ద్వారకా తిరుమల

16.చౌడమ్మ నందవరం కర్నూల్ జిల్లా

అలాగే ఖమ్మం ,నల్గొండ జిల్లాలలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది .

💐అమ్మలగన్న అమ్మలు ఆదిపరాశక్తిలు గ్రామదేవతలకు వందనాలు,💐

💐💐మన గ్రామదేవతలు ఎలా వెలిశారు ?💐💐

మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటి?

💐గ్రామదేవతా వ్యవస్థ:💐

గ్రామాలలో వెలిసే దేవత...దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను  గ్రామదేవతలని అంటారు.

సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు.

ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు,

ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో,కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే

కుదరకపోవచ్చు.

ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము

సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో

అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు

ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే

తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.

ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త,

ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది.

ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు

అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో

అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా

నియమించారు పూర్వీకులు.

అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు.

దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది

కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము

సరైన మూహూర్తములోనే జ్ వేయబడింది కాబట్టి

గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-

భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు.

అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన

ఆ నెల, ఆ తిథినాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారాఏదైనా లోటు పాట్లు కలిగివుంటే తొలగుతుంది.

💐💐గ్రామదేవతల ఆవిర్భావము:💐💐

పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది.

అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు

గ్రామదేవతలను ఏర్పాటు చేసారు

తొలి దశలో.

💐పృధ్వీ దేవత:💐

మొదటిది పృధ్వీ అంటే నేల,ఇది పంటకి ఆధారము,

కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన

పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు.

గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారము

కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసారు.

జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు.

మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూ వుండడము, దాన్నే సొమ్ముగా

మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ.

పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని

చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి

కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది.

ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో

జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.

💐జల దేవత:💐

రెండవది జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది.గుడి ఎత్తుగా కట్టినా

తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.

💐అగ్ని దేవత:💐

మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ,రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. ( చిత్తూరు పున్నమ్మ గుడిలో హారతి సమయంలో పంబల్లు వాయిస్తారు అది ఉంటూ హారతి చూస్తే అమ్మవారు ఆనందంతో వెలిగిపోతున్నట్టు కనిపిస్తోంది, ఎప్పుడూ అదే కొనసాగుతోందా తెలియదు).

సూరమ్మను ప్రతి అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమినాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు.

ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళలమ్మ (సూర్య,చంద్రుల కళ వున్న అమ్మ).

💐వాయు దేవత:💐

నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి.

కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.

💐ఆకాశ దేవత:💐

ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను

ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు,గాలివాన. ఇలాంటి వాటి నుండి

రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.

💐*గ్రామదేవతా నామ విశేషాలు*:💐

మనం రకరకాల పేర్లతో పిలిచే  ప్రతి గ్రామదేవత

పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది 

సొంతవూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల

రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో

వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది.

ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.

ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి

'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట.

ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు

రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది.

ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే

ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల

(ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేసే+అమ్మ=

కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది.

స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో (స్వచ్ఛమని)సు+అచ్చ= స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది.

సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది.

'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో

ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే

క్రమముగా అది మావుళ్ళమ్మ' అయింది.

ప్రజల మనసులో పుట్టే ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన. వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా 'తలుపులమ్మ'గా మారింది.ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటపుడు తల్లికి

లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.

శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో

అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా

అంకగళమ్మ, అంకాళమ్మ గా మారిపోయింది.

పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ.

ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి.

తన గ్రామములోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత

పిశాచ గణాలను గ్రామములోనికి రాకుండా

వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే.

పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి.

అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో

పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ'

అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=

సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ.

గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా

ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ. 

అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న) అమ్మ పుల్లమ్మ.

ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది

కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.

ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే

చోటవున్న తల్లి అర్పణ+అమ్మ =అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది.

బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు

బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ=అప్పలమ్మ అన్నారు.

అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది

బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ

అయినది పెంటి (బాల)+అమ్మ=పెంటమ్మ.

భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో

బోనముల (భోజనమనే పదానికి వికృతి)+అమ్మ=

బోనాలమ్మ.

అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి

ఈమెను 'అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల

పిలుస్తారు.

లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది

కాబట్టి గుర్రాల+అమ్మ=గుర్రాలమ్మ అయినది.

ఊరు పేరుని బట్టి పీల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోల+అంబ='సోమపోలమాంబ'

అన్నారు.సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట..!!

పేర్లు ఏవైతేనేమి,

ఆ తల్లి ఎప్పుడూ

మనకు తోడుగా,

అండగా నిలిచి

మనందరినీ

కంటికి రెప్పలా

కాపాడుతుంది...

శుభం .ఓం శనైశ్చరాయనమః


ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి ఈ గ్రూపులో చెర్పించండి 🌹🌹🌹jai గురు దత్త 🌹🌹🌹