8, డిసెంబర్ 2024, ఆదివారం

ఈశ్వరార్పణ

 

ఈశ్వరార్పణ

ఒక హరిదాసుగారు నాయనలారా మీరు ఏదో ఒకటి రోజు ఈశ్వరార్పణ చేయండి అందువలన మీకు పుణ్యం వస్తుంది అని చెప్పారటఇది బాగానే వుంది ఏది ఈశ్వరార్పణ చేయాలి ఏది చేయాలన్నా మనసు రావటం లేదే అని  రమణయ్య  అనే ఒక పౌరుడు ఆలోచించాడు. అప్పుడు అతనికి ఒక అపూర్వమైన ఆలోచనవచ్చింది అదేమిటంటే నేను ఉపయోగించుకునేది ఏది కూడా ఈశ్వరార్పణ చేయటానికి మనసు రాదు కాబట్టి ఏదైనా నాకు పనికి రానిది నేను ఉపయోగించుకోలేనిది ఈశ్వరార్పణ చేస్తే అటు ఈశ్వరార్పణ చేసిన ఫలితం వస్తుంది ఇటు నాకు ఎలాంటి నష్టము రాదు అని అనుకున్నాడట

ఒకరోజు పేలాలను వేయించి (పేలాలు అంటే వడ్లు జొన్నలు, మొక్కజొన్నలను వేయించటం వలన వచ్చేవి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రోజుల్లో మనం పాప్కార్న్ అనేవి మొక్కజొన్న పేలాలు) పిండి పడుతున్నాడట ఇంతలో పెద్దగా గాలి వీచింది. గాలికి కొంత పేలపిండి కొట్టుకొని వెళ్ళిందిఅప్పుడు మన రమణయ్యకు హరిదాసుగారు చెప్పిన ఈశ్వరార్పణ గురుంచి జ్ఞ్యాపకం వచ్చింది. వెంటనే గాలికి పోయింన పేలపిండి మొత్తము ఈశ్వరార్పణమస్తు అని సంకల్పం  చేసాడట. తనకు చెందలేనిది కూడా వృధాకాలేదు తనకు ఈశ్వరార్పణ ఫలితం లభించిందని సంతోషపడ్డాడట.

ప్రతి మనిషికూడా నేను నాది, నావాళ్లు అనే భావాన్ని ఒక గిరిగీసుకొని వుంటారు చక్రపరిధిలోనుంచే ప్రతిదీ ఆలోచిస్తారు. తను చూసే తాను అనుభవించే ప్రతిదీ చక్రానికి ముడిపెట్టుకొని మసలుతారునిజానికి నేను అనేది ఏమిటి అని ఆలోచిస్తే అప్పుడు కానీ తత్త్వం బోధపడదు

సగటు మానవుని అభిప్రాయం ఏమిటంటే నేను అంటే తన శరీరం అలానే నాది అంటే తన శరీరముతో ముడివేసుకున్న సంబంధాలు అవి మరల రెండు  రకాలు ఒకటి శరీరంతో ఏర్పాటు చేసుకున్న మనుష్యసంబందాలు అంటే, తల్లిదండ్రులు, అన్నాతమ్ములు, అక్కాచెల్లెళ్లు ఇంకా భార్యా పిల్లలు ఇక రెండవది నిర్జీవయిన వస్తువులు అంటే నా ఇల్లు నా ఇంటి వస్తువులు, నా పొలము ఇలా చెప్పుకుంటూ పొతే అనేకమైనవి నాతొ ముడి పడి వున్నవివీటిచుట్టూనే ప్రతి మనిషి సంబంధం కలిగి ఉండి అదే సర్వస్వముగా భావిస్తారు. ప్రతి క్షణం తన ఆలోచనలు వీటి చుట్టూ పరిబ్రమిస్తూవుంటాయిఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బంధాల కోసమే భగవంతుని ప్రార్ధిస్తూ వుంటారుభగవంతుడా నా భార్యా పిల్లలను చల్లగా చూడు, నా కొడుకుకు పరీక్షలో మంచి మార్కులు వచ్చేటట్లు చేయి, నా కూతురుకు మంచి సంబంధం దొరికేటట్లు చేయి నాకు మంచి ఇల్లు కొనుకున్నేటట్లు దీవించు, మంచి కారు ఇప్పించు ఇలా ఇలా అనేక కోరికలు నిత్యము మదినిండా నిండిపోయి ఎప్పుడు మనస్సును తొలుస్తూ వుంటాయి. ఉచ్చులోంచి తప్పించుకోవటం అంటే అది అంత సులభసాధ్యం కాదుఇంకా స్పష్టంగా చెప్పాలంటే అసాధ్యం అని కూడా అనవచ్చు. సాధకుడు అయిన వాడు సుడిగుండం నుండి ఎలా బయటపడాలి అని సదా ఆలోచిస్తాడు

సాధకుడు తనకు వున్న బంధాలు కూడా కేవలం తన శరీరానికి చెందినవి మాత్రమే కానీ తనకు చెందినవి కావనే సత్యాన్ని తెలుసుకునే అన్ని బంధాలతో వున్న సంబంధాలను కేవలం కర్తవ్యభావనతో మాత్రమే నెరవేరుస్తాడు. నిజానికి ఆలా నడవటం చాలా అంటే చాలా కష్టమైన పని ఎంతో సాధనచేస్తేనే కానీ సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. నిజానికి ప్రపంచంలో ఈశ్వరార్పణ అనేదే ఏది లేదు ఎందుకంటె ఈ జగత్తు సంపూర్ణంగా ఈశ్వరుడిదే అయి వున్నది. కానీ  నేను ఈశ్వరార్పణ ఎందుకు చేయటంలేదు అని చాలామంది అంటూవుంటారునేను నిత్యం చేసే జపతపాలను ఈశ్వరార్పణగా చేస్తున్నాను. నేను చేసే ప్రతి పూజను ఈశ్వరార్పణగా చేస్తున్నాను అని కొంతమంది భక్తులు అనవచ్చుఅది కొంతవరకు నిజమే ఎందుకంటె భక్తులు త్రికరణ శుద్ధిగా ఈశ్వరార్పణగా చేసే  ప్రతి కర్మ తప్పకుండా ఈశ్వరునికి చెందవచ్చు. అందరు తప్పకుండ ఈశ్వరార్పణగా కర్మలు చేయాలిఅప్పుడు కర్మఫలం కేవలం ఈశ్వరునికి చెందుతుంది

భక్తుడు కొంత పరిపక్వత చెందిన తరువాత జ్ఞ్యాన మార్గాన్ని  చేరుకుంటాడు. ఎప్పుడైతే జ్ఞ్యాన మార్గాన్ని చేరుకుంటాడో అప్పుడు సాధకుని మానసిక స్థితి మారుతుంది. ఇప్పడిదాకా నేను వేరు భగవంతుడు వేరు అనే భావనతో పూజా, అర్చన చేసాడు. తన స్థితి పరి పక్వతకు చెందిన తరువాత నేను వేరు కాదు ఈశ్వరుడు వేరుకాదు అనే భావనలోకి  వస్తాడు. స్థితే "త్వమేవ అహం" అనే స్థితి స్థితిలో సాధకుడు వేరుగా ఈశ్వరుడు వేరుగా గోచరించడు అప్పుడు ప్రత్యేకించి ఈశ్వరార్పణగా చేసే కర్మలు ఉండనే వుండవు. సాధకుడు చేసే ప్రతి కర్మకూడా ఈశ్వరార్పణగానే భాసిల్లుతోంది

ఈశావాసోపనిషత్ లోని మంత్రాన్ని గమనించండి

"ఓం ఈశా వాస్య మిదగ్గ్ సర్వం

జగత్తులో ఏవేవైతే ఉన్నవో అన్నీఈశ్వరుడే అయి వున్నది. అంటే జగత్తులో ఈశ్వరుడు కానిది ఏది లేదు విషయం ప్రతి సాధకుడు తన సాధనలో  కొంత ముందుకు సాగితే కాని సత్యం తెలుసుకోలేడు. అప్పటిదాకా తానూ వేరు ఈశ్వరుడు (భగవంతుడు) వేరు అనే అజ్ఞ్యానంలో ఉంటాడు ఎప్పుడైతే అజ్ఞ్యానం తొలగి జ్ఞ్యానోదయం అవుతుందో అప్పుడు తెలుసుకుంటాడు తానూ ఈశ్వరునికన్నా బిన్నంగా లేడనిఅప్పుడు తాను చేసే ప్రతి కర్మకూడా ఈశ్వరార్పణ కర్మ గానే  గోచరిస్తుందిప్రత్యేకించి కర్మను కూడా ఈశ్వరార్పణగా చేయనవసరం లేదు. అప్పుడు సాధకుడు నిత్య సంతోషంగా ఆనందమూర్తిగా తానె ఈశ్వరుడిగా బాసిల్లుతాడు "బ్రహ్మవిత్ బ్రెహ్మయేవ భవత్" అందుకే బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మె అవుతాడు.

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ

 

బ్రాహ్మణత్వం -- తత్త్వం

 🙏బ్రాహ్మణత్వం -- తత్త్వం 🙏

దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణులలో నాలుగు సంప్రదాయములు ఉన్నాయి. అవి (1) "వైఖానస " (2)"స్మార్త" సంప్రదాయము, (3) "శ్రీవైష్ణవ" సంప్రదాయము, (4). "మధ్వ" సంప్రదాయము అని నాలుగు రకములైన బ్రహ్మణ సంప్రదాయములు ఉన్నాయి.ఎవ్వరైనా బ్రాహ్మణులే.


బ్రాహ్మణ శబ్దానికి ద్విజ, విప్ర, భూసుర, శ్రోత్రీయ వంటి పదాలు వర్యాయములుగా వాడుతున్నారు.

అది తప్పు అనను కానీ ఇవి పర్యాయ పదములు కావు. వీటికి ప్రత్యేక నిర్వచనాలు ఉన్నాయి.

రామాయణ, భారత భాగవతాది గ్రంథాలలో ఆ వ్యక్తిని బట్టి బ్రహ్మణోత్తమా అని, విప్రోత్తమా అని, శ్రోత్రీయా అని, ద్విజోత్తమా అని సంబోధించారు 

బ్రాహ్మణ అంటే బ్రహ్మ జ్ఞానాన్వేషి.అని అర్ధం బ్రాహ్మణ జాతికి వర్తిస్తుంది.

ద్విజ అంటే రెండు జన్మలు కలవాడు అని అర్ధం

ద్వి అంటే రెండు జ అంటే పుట్టుక.

 ఉపనయనానికి ముందు ఒక జన్మ, ఉపనయనము అయిన తరువాత ఒక జన్మ. ఇక్కడ ఒకవిషయం ఉపనయన సంస్కారం క్షత్రియ, వైశ్య, ఇంకా కొంతమందికి ఉన్నప్పటికీ ద్విజులు అంటే బ్రాహ్మణులు అని శాస్త్రం నిర్ణయించినది. అందుకే

ఏ పురాణాలలో అయినా ద్విజ శబ్దం బ్రాహ్మణ శబ్దానికి వర్యాయముగా వాడబడినది.


ఇక విప్ర శబ్దాన్ని తీసుకుంటే .విశిష్ఠమైన ప్రవర కలిగినవాడు విప్రుడు. మన ప్రవరలో ఋషుల వలె తాత, తండ్రి, మనుమడు ముగ్గురు (మూడు తరాలు) కూడా వేదాధ్యయనం పూర్తి చేస్తే అట్టి బ్రాహ్మణుణ్ణి విప్రుడు అంటారు.కాబట్టి ప్రతి బ్రాహ్మణుడు విప్రుడు కాదు. ఇది గ్రహించాలి 

సాధారణ బ్రాహ్మణ జీవన విధానానికి వీరి జీవనవిధానానికి చాలా వ్యత్యాసం ఉంది.


 శ్రోత్రీయుడు అంటే వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుడు అని అర్ధం.తాత, తండ్రి వేదాధ్యయనం చేయకపోయినా ఆ వ్యక్తి వేదాధ్యయనం చేస్తే శ్రోత్రీయుడే.అంతేగాక వేద విధానముగా జీవించేవాడు కూడా శ్రోత్రీయుడే కట్టు బొట్టు జుట్టు వంటివి గ్రహించాలి.

భూసురుడు అంటే భూమి మీద ఉన్న దైవ స్వరూపుడు అని అర్ధం. సర్వే జనాః సుఖినో భవంతు త్రికరణ శుద్ధిగా అనే బ్రాహ్మణుడు భూసురుడు.

ఇక వేదంలో చెప్పబడిన విషయాలు చూద్దాము.

బ్రాహ్మణో అస్య ముఖ మాసీత్‌

బాహూ రాజన్య కృతః

ఊరూ తదస్య యద్వైశ్యః

పద్భ్యాం శూద్రో అజాయతే

ఈ విరాట్టునకు (విష్ణువు ) బ్రాహ్మణుఁడు ముఖమయ్యెను .

బ్రహ్మ జ్ఞానవాంస్తు బ్రాహ్మణః ' అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన మన పూర్వీకులు

బృంహ్ - విస్తరణే - అనే ధాతువు నుండి బ్రహ్మ అనే పదము వచ్చింది. అంతటా వ్యాపించి ఉన్న చైతన్యము బ్రహ్మము. ఆ బ్రహ్మమునే అంతటా దర్శించేవాడు బ్రాహ్మణుడు.

బ్రాహ్మణులు వ్యక్తిగత సుఖాన్ని, స్వార్థాన్ని విడిచి పెట్టి, వైదికాచారాలను పాటిస్తూ, శాంతస్వభావులై, ఏకాంతప్రియులై, సత్యధర్మాచరణ చేస్తూ, దయాళువులై ఉంటారు.

" బ్రాహ్మణస్య దేహోయం న సుఖాయ ప్రకల్పతే " 


బ్రాహ్మణుని శరీరము అతని సుఖం కోసం కాదు, లోక క్షేమం కోసం పరమాత్మ తో కల్పించబడింది. బ్రాహ్మణుడు తన సుఖం చూసుకోడు. సర్వ మానవాళి సంక్షేమం కోసం పాటు పడతాడు కనుక, మిగతావారందరూ బ్రాహ్మణుని సంక్షేమం కోరాలి

శూద్రునికి జన్మించిన వాడు శూద్రుడు కాగలడు కానీ బ్రాహ్మణునికి జన్మించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడు అంటున్నది ధర్మ శాస్త్రం. వేదము, పురాణాలు, శృతులు, స్మృతులు కూడా ఇదే మాట చెబుతున్నాయి. బ్రాహ్మణున్ని 'ద్విజుడు' అని కూడా అంటారు. ద్విజుడు అంటే రెండు సార్లు జన్మించినవాడు అని అర్థం. మొదటిజన్మ తల్లి గర్భం నుండి జరిగితే రెండవ జన్మ సంస్కారం వల్ల జరుగుతుంది. జన్మవల్ల శూద్రత్వం లభిస్తే కర్మవల్ల బ్రాహ్మణత్వం లభిస్తుంది

వేదాధ్యయనం చేసినవాడు బ్రాహ్మణుడు అని అర్థం. బ్రాహ్మణ స్త్రీ యందు, బ్రాహ్మణ పురుషుడి వలన జన్మించి, తదుపరి, జాతి, కులం, వృత్తి, స్వాధ్యాయం, జ్ఞానాల వల్ల బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ వుండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం-తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారంతా బ్రాహ్మణులు కాలేరు. వారిలో ఉపనయనాది సంస్కారాలు, వైదిక కర్మలు లేని వారిని ‘‘మాత్రులు’’ అని, వైదికాచారాలు పాటిస్తూ శాంత స్వభావులైన వారిని ‘‘బ్రాహ్మణులు’’ అని, బ్రాహ్మణోచితమైన షట్ కర్మలను ఆచరించే వారిని ‘‘శ్రోత్రియులని’’, నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారిని, విద్వాంసులు,‘‘అనూచానులు’’ అని, ఇంద్రియాలను తమ వశంలో వుంచుకున్నవారిని ‘‘భ్రూణులు’’ అని, ఎప్పుడూ ఆశ్రమంలోనో, అరణ్యంలోనో వుండే వారిని ‘‘ఋషికల్పులు’’ అని, రేతస్కలనం లేక సత్య ప్రజ్ఞులైన వారిని ‘‘ఋషులు’’ అని, సంపూర్ణ తత్వ జ్ఞానం కలవారిని ‘‘మునులు’’ అని అంటారు. అఖండ భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో బ్రాహ్మణులు విస్తరించి వున్నారు.

సనాతన హిందూ సాంప్రదాయంలో చాతుర్వర్ణ వ్యవస్థ యందు ఉన్నతమైన వర్గం బ్రాహ్మణులు. బ్రాహ్మణులు లేదా బ్రాహ్మలు అనగా బ్రహ్మ ముఖము నుండి పుట్టిన వారు. బ్రాహ్మలు అని వాడుకలో పిలిచినప్పటికీ "బ్రాహ్మణులు" అనడం సముచితం. 

"యజనం యాజనం దానం బ్రాహ్మణస్యప్రతిగ్రహః అధ్యాపనం చాధ్యయనం షట్కకర్మాణి ద్విజోత్తమాః". 

యజనం = యజ్ఞం చేయడం

యాజనం = యజ్ఞం నిర్వహించడం

అధ్యయనం = (వేదం) చదవడం

అధ్యాపనం = వేదం చదివించడం, చదువు చెప్పడం

దానం = ఇవ్వడం

ప్రతిగ్రహం = తీసుకోవడం

ఈ షట్కకర్మలు బ్రహ్మణులే నిర్వహించాలి.

మునుల వలన ఏ జాతి స్త్రీకి జన్మించిన వారైనను బ్రాహ్మణులుగా గుర్తించబడతారు. భారతీయ మసుస్మృతి ప్రకారం క్షత్రియులు (యోధులు, చట్టం అమలు, పరిపాలకులు), బ్రాహ్మణులు (గురువులు, పండితులు, ఉపాధ్యాయులు, హోమాదికములు, పూజారులు), వైశ్యులు (వ్యవసాయదారులు, వ్యాపారులు, ), శూద్రులు (సేవకులు) అను నాలుగు "వర్ణాలు" లేదా తరగతులు ఉన్నాయి.

హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటుపడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదములయందు ప్రావీణ్యం కలవారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభించుతున్నది. వారు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వేద, పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై మంచి అవగాహనను కలిగి ఉంటారు.

పంచ మహాపాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి. బ్రాహ్మణులు చూడగానే గుర్తించే విధంగా ఉంటారు. వీరు చతుర్వర్ణ వ్యవస్థలో మొదటి వర్ణం వారు. మడి విధానాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తారు. మద్యపానం, మాంసాహారం వంటి దూరలవాట్లు వీరికి ఉండవు .

బ్రాహ్మణులు పౌరోహిత్యము,అర్చకత్వం, యజ్ఞాలు నిర్వహించడం, అపర కర్మలు చేయించడం,బ్రాహ్మణ మడి వంటలు వండడం,ఇంకా వ్యవసాయం, ఉద్యోగం మొదలైన పనులు చేస్తూ జీవనం సాగిస్తారు.


. ఆధునిక వాడుక భాషలో అందరూ "బ్రాహ్మణులు"" అయినప్పటికీ, ప్రాంతీయ మత ఆచార సాంప్రదాయ వ్యవహారములు, వేద పాఠశాలలు (శాఖలు) వలన వారు ఇంకా వివిధ ఉప కులాల వారీగా విభజించబడ్డారు. బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా ఆలయ పూజారులు అయిననూ బ్రాహ్మణులు అందరూ అగ్నిహోత్రం కలిగినవారు కారు.దేశ కాల పరిస్థితులను బట్టి నేడు చాలా కొద్ది మంది బ్రాహ్మణులు మాత్రం వేద విద్య నేర్చుకోవడం, సన్యాసము వంటివి నిరాడంబరంగా దేశంలో బ్రాహ్మణ విధులు నిర్వర్తించుతున్నారు. ఇప్పటి సామజిక పరిస్థితిని బట్టి ఎవ్వరిని తప్పు పట్టకూడదు. "సమాజంలో ఉన్నంతంగా బ్రతకాలి " అని ప్రతి బ్రాహ్మణుడు అనుకొంటాడు.

పురాతన భారత సామాజిక నిర్మాణం పతనం కారణంగా, వివిధ వృత్తులు, ఉద్యోగాలకు (బ్రిటిష్ వారి ద్వారా తేబడినవి) బ్రాహ్మణులు అవకాశములు వెతుక్కున్నారు. వారి బోధన, జ్ఞానమునకు గుర్తింపుగా ఉపకారవేతనాలు, బహుమతుల ద్వారా వారికి మద్దతు లభించింది. అప్పటి నుండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు బ్రాహ్మణుల వలసలు బయలుదేరినవి.

       సర్వే జనాః సుఖినో భవంతు 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఆదివారం*🌞 🌹 *08, డిసెంబర్, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* 

        🌞 *ఆదివారం*🌞

🌹 *08, డిసెంబర్, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* *దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్లపక్షం*


*తిథి : సప్తమి* ఉ 09.44 వరకు ఉపరి *అష్టమి*

*వారం    : ఆదివారం*

(భానువాసరే )

*నక్షత్రం : శతభిషం* సా 04.03 వరకు ఉపరి *పూర్వాభాద్ర*


*యోగం  : హర్షణ* ఉ 06.26 *వజ్ర* రా 03.54 తె వరకు

*కరణం : వణజి* ఉ 09.44 *భద్ర* రా 08.55 ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు*

 *ఉ 07.00 - 10.00 మ 02.00 - 04.00*

అమృత కాలం  : *ఉ 09.05 - 10.38*

అభిజిత్ కాలం  : *ప 11.37 - 12.22*


*వర్జ్యం : రా 10.09 - 11.40*

*దుర్ముహూర్తం : సా 04.05- 04.50*

*రాహు కాలం : సా 04.11 - 05.35*

గుళికకాళం : *మ 02.47 - 04.11*

యమగండం : *ప 11.59 - 01.23*

సూర్యరాశి : *వృశ్చికం*

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం :*ఉ 06.24* 

సూర్యాస్తమయం :*సా 05.35*

*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం     :  *ఉ 06.24- 08.38*

సంగవ కాలం      :  *08.38 - 10.52*

మధ్యాహ్న కాలం  :*10.52 - 01.07*

అపరాహ్న కాలం : *మ 01.07- 03.21*


*ఆబ్ధికం తిధి : మార్గశిర శుద్ధ అష్టమి*

సాయంకాలం :  *సా 03.21 - 05.35*

ప్రదోష కాలం  :  *సా 05.35 - 08.09*

రాత్రి కాలం : *రా 08.09 - 11.34*

నిశీధి కాలం      :*రా 11.34 - 12.25*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.42 - 05.33*

________________________________

        🌷 *ప్రతినిత్యం*🌷

          *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


   🌞 *శ్రీ సూర్య సోత్రం*🌞


*జయతి జనానందకరః కరనికరనిరస్తతిమిరసంఘాతః*

*లోకాలోకాలోకః కమలారుణమండలః సూర్యః*


       🌞 *ఓం భాస్కరాయ నమః*🌞

         

🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌞🌞🌹🌷

🌹🍃🌞🌞🌞🌞🍃🌹

మందు లేని జీవితం

*🏵️‼️మందు లేని జీవితం‼️🏵️*



*1.* త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం ఔషధం.

*2.* ఓం జపించడం ఔషధం.

*3.* యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం ఔషధం.

*4.* ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం.

*5.* ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం.

*6.* సూర్యకాంతి కూడా ఒక ఔషధం.

*7.* కుండ నీరు తాగడం కూడా ఔషధమే.

*8.* చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే.

*9.* ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే.

*10.* ఆహారంలాగే, నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం.

*11.* ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఔషధం.

*12.* సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం.

*13.* కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం.

*14.* నవ్వు మరియు జోకులు ఔషధం.

*15.* సంతృప్తి కూడా ఔషధం.

*16.* మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం.

*17.* నిజాయితీ మరియు సానుకూలత ఔషధం.

*18.* నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం.

*19.* అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే.

*20.* ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం.

*21.* అందరితో కలిసి జీవించడం ఔషధం.

*22.* తినడం, త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే.

*23.* మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్.

*24.* సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి, ఇది కూడా ఔషధం.

*25.* ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే.

*26.* *చివరగా...* ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం.

🪷 ప్రకృతి యొక్క *"గొప్పతనం"*ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా ఔషధం.


*ఈ మందులన్నీ మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి.*🙏🙏

కవితా సౌందర్యం

 శు భో ద యం🙏


శు భో ద యం🙏


! కవితా సౌందర్యం


                            భాషకు  అందాన్ని పెంచేది కవిత్వం. నెమలికిపింఛంలా! కోయిలకు స్వరంలా! ఒక్కొకికదానికి ఒక్కొక దానివల్ల అందం యేర్పడుతుంది. భాష అంటే యేమిటి శబ్దార్ధముల కలయికచేనేర్పడు  భావసూచిక! దానిని  అందగింప జేసేది కవిత్వం. అదికాస్త ముదిరితే కావ్యం. ఆకావ్య సముదాయమే సాహిత్యం. మనసాహిత్యంలో యెన్నిసొగసులున్నాయి? అబ్బో! చెప్పలేం? 

ఆణి ముత్యాలవంటి కవులు ,మణిహారాల లాంటికావ్యాలు, పంచదార బిళ్ళలవంటి పద్యాలు.ఇలా భాషాసౌందర్యం, కవితాసౌందర్యం, అనేక ముఖాలుగా విస్తరించింది. 


                        అలాంటి విచిత్రాలలో  మంచి శబ్ద చిత్ర మొకటి మీకు పరిచయం చేస్తాను. వినండి!    యీపద్యంలో పైకి నిందిస్తున్నట్లు ఉండటం విశేషం.కానీ  అదినిందకానేకాదు. పొగడటమే! దానినే స్తుతి నిందాలంకార మంటారు.యిదిగో పద్యమిది. 


          సీ:  ఆలు నిర్వాహకురాాలు   భూదేవియై 

                             అఖిల  భారకుడన్న  ఖ్యాతిఁదెచ్చె; 


               ఇష్ట  సంపన్నరా లిందిర భార్య యై 

                                       కామితార్ధకుడన్న  ఖ్యాతిఁ  దెచ్చె; 


               కమల గర్భుడు  సృష్టికర్త  తనూజుడై 

                                             బహు కుటుంబికుడన్న బలిమిఁ దెచ్చె; 


              కలుష  విధ్వంసిని   గంగ   కుమారియై 

                                 పతిత  పావనుడన్న  ప్రతిభఁ   దెచ్చె; 


      గీ:   ఆండ్రు  బిడ్డలు  దెచ్చు  ప్ర  ఖ్యాతిగాని 

            మొదటినుండియు  నీవు  దామోదరుడవె, 

            చిత్ర  చిత్ర  ప్రభావ   దాక్షిణ్య   భావ 

            హత  విమత   జీవ- శ్రీ కాకు ళాంధ్ర దేవ! 


                                      భూదేవి నీభార్య  కాబట్టి   అన్నీ భరించే వాడవనే పేరొచ్చింది.  లక్ష్మీదేవి  నీయిల్లాలు కాబట్టి  కోరినవన్నీ  యిచ్చేవాడవనే  ఖ్యాతి దెచ్చింది.  బ్రహ్మ  నీ కొడుకు కాబట్టి   సృష్టి  మొత్తం నీకుటుంబమేనన్న  ఖ్యాతి దెచ్చాడు. పాపాల నన్నింటినీ  ప్రక్షాళణ  చేసే గంగా దేవి నీకూతురై  పతిత పావనుడనే  పేరు దెచ్చింది. ఇదంతా  భార్యలూ  పిల్లలూ నీకు  తెచ్చిపెట్టిన  పేరు ప్రఖ్యాతులేగానీ  నీకు విజంగా యేమున్నదయ్యా!  మొదటినుండీ నీవు  దరిద్ర దామోదరుడవే! అంటాడుకవి. 


                                                భూదేవి,  శ్రీదేవి నీభార్యలు. సృష్టికర్త బ్రహ్మ నీకుకొడుకు. పాపహారి గంగాదేవి నీకుమార్తె, శ్రీహరీ నీవెంత గొప్పవాడివయ్యా! అనిపొగడ్త. చూశారావింత. తిట్టినట్టు జేసి పొగడటం!

                             స్వస్తి!

🙏👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


                            భాషకు  అందాన్ని పెంచేది కవిత్వం. నెమలికిపింఛంలా! కోయిలకు స్వరంలా! ఒక్కొకికదానికి ఒక్కొక దానివల్ల అందం యేర్పడుతుంది. భాష అంటే యేమిటి శబ్దార్ధముల కలయికచేనేర్పడు  భావసూచిక! దానిని  అందగింప జేసేది కవిత్వం. అదికాస్త ముదిరితే కావ్యం. ఆకావ్య సముదాయమే సాహిత్యం. మనసాహిత్యంలో యెన్నిసొగసులున్నాయి? అబ్బో! చెప్పలేం? 

ఆణి ముత్యాలవంటి కవులు ,మణిహారాల లాంటికావ్యాలు, పంచదార బిళ్ళలవంటి పద్యాలు.ఇలా భాషాసౌందర్యం, కవితాసౌందర్యం, అనేక ముఖాలుగా విస్తరించింది. 


                        అలాంటి విచిత్రాలలో  మంచి శబ్ద చిత్ర మొకటి మీకు పరిచయం చేస్తాను. వినండి!    యీపద్యంలో పైకి నిందిస్తున్నట్లు ఉండటం విశేషం.కానీ  అదినిందకానేకాదు. పొగడటమే! దానినే స్తుతి నిందాలంకార మంటారు.యిదిగో పద్యమిది. 


          సీ:  ఆలు నిర్వాహకురాాలు   భూదేవియై 

                             అఖిల  భారకుడన్న  ఖ్యాతిఁదెచ్చె; 


               ఇష్ట  సంపన్నరా లిందిర భార్య యై 

                                       కామితార్ధకుడన్న  ఖ్యాతిఁ  దెచ్చె; 


               కమల గర్భుడు  సృష్టికర్త  తనూజుడై 

                                             బహు కుటుంబికుడన్న బలిమిఁ దెచ్చె; 


              కలుష  విధ్వంసిని   గంగ   కుమారియై 

                                 పతిత  పావనుడన్న  ప్రతిభఁ   దెచ్చె; 


      గీ:   ఆండ్రు  బిడ్డలు  దెచ్చు  ప్ర  ఖ్యాతిగాని 

            మొదటినుండియు  నీవు  దామోదరుడవె, 

            చిత్ర  చిత్ర  ప్రభావ   దాక్షిణ్య   భావ 

            హత  విమత   జీవ- శ్రీ కాకు ళాంధ్ర దేవ! 


                                      భూదేవి నీభార్య  కాబట్టి   అన్నీ భరించే వాడవనే పేరొచ్చింది.  లక్ష్మీదేవి  నీయిల్లాలు కాబట్టి  కోరినవన్నీ  యిచ్చేవాడవనే  ఖ్యాతి దెచ్చింది.  బ్రహ్మ  నీ కొడుకు కాబట్టి   సృష్టి  మొత్తం నీకుటుంబమేనన్న  ఖ్యాతి దెచ్చాడు. పాపాల నన్నింటినీ  ప్రక్షాళణ  చేసే గంగా దేవి నీకూతురై  పతిత పావనుడనే  పేరు దెచ్చింది. ఇదంతా  భార్యలూ  పిల్లలూ నీకు  తెచ్చిపెట్టిన  పేరు ప్రఖ్యాతులేగానీ  నీకు విజంగా యేమున్నదయ్యా!  మొదటినుండీ నీవు  దరిద్ర దామోదరుడవే! అంటాడుకవి. 


                                                భూదేవి,  శ్రీదేవి నీభార్యలు. సృష్టికర్త బ్రహ్మ నీకుకొడుకు. పాపహారి గంగాదేవి నీకుమార్తె, శ్రీహరీ నీవెంత గొప్పవాడివయ్యా! అనిపొగడ్త. చూశారావింత. తిట్టినట్టు జేసి పొగడటం!

                             స్వస్తి!

🙏👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అంబా శాంభవి

 అంబా శాంభవి చంద్రమౌళీ రబలా 

అపర్ణా ఉమా పార్వతీ

కాళీ హైమవతీ శివా త్రినయనీ 

కాత్యాయనీ భైరవీ

సావిత్రీ నవయౌవనా శుభకరీ 

సామ్రాజ్య లక్ష్మీప్రదా

చిద్రూపీ పరదేవతా భగవతీ 

శ్రీ రాజరాజేశ్వరి


అంబా మోహిని దేవతా త్రిభువనీ 

ఆనంద సందాయినీ

వాణీ పల్లవపాణీ వేణు మురళీ

గాన ప్రియాలోలినీ

కళ్యాణీ ఉడు రాజబింబ వదనా 

ధూమ్రాక్ష సంహారిణి

చిద్రూపీ పరదేవతా భగవతీ 

శ్రీ రాజరాజేశ్వరి


అంబానూపుర రత్నకంకణ ధరీ 

కేయూర హారావళి

జాతీ చంపక వైజయంతి లహరీ 

గ్రైవేయ కైరాజితా

వీణా వేణు వినోద మండితకరా 

వీరాసనే సంస్థితా

చిద్రూపీ పరదేవతా భగవతీ 

శ్రీ రాజరాజేశ్వరి


అంబా రౌద్రిణి భద్రకాళి భగళా 

జ్వాలాముఖీ వైష్ణవీ

బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా 

దేదీప్య మానోజ్వలా

చాముండాశ్రిత రక్షపోష జననీ 

దాక్షాయణి వల్లవీ

చిద్రూపీ పరదేవతా భగవతీ 

శ్రీ రాజరాజేశ్వరి


అంబా శూలధను: కుశాంకుశధరీ 

అర్ధేందు బింబాధరీ

వారాహీ మధుకైటభ ప్రశమనీ 

వాణీ రమా సేవితా

మల్లాద్యాసుర మూకదైత్య వదనీ 

మాహేశ్వరీ చాంబికా

చిద్రూపీ పరదేవతా భగవతీ 

శ్రీ రాజరాజేశ్వరి


అంబా సృష్టి వినాశ పాలనకరీ 

ఆర్యా విసంశోభీతా

గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః 

పూర్ణాను సంధీకృతా

ఓంకారీ వినతా సుతార్చిత పదా 

ఉద్దండ దైత్యాపహా

చిద్రూపీ పరదేవతా భగవతీ 

శ్రీ రాజరాజేశ్వరి


అంబా శాశ్వత ఆగమాది వినుతా 

ఆర్యా మహాదేవతా

యా బ్రహ్మాది పిపీలికాంత జననీ 

యావై జగన్మోహినీ

యా పంచ ప్రణవాది రేఫ జననీ 

యా చిత్కళా మాలినీ

చిద్రూపీ పరదేవతా భగవతీ 

శ్రీ రాజరాజేశ్వరి

 

అంబా పాలిత భక్తి రాజ రనిశం 

అంబాష్టకం యః పఠే

అంబాలోల కటాక్షవీక్ష లలితా 

చైశ్వర్య మవ్యాహతా

అంబా పావన మంత్రరాజ పఠనా 

ద్దంతేచ మోక్ష ప్రదా

చిద్రూపీ పరదేవతా భగవతీ 

శ్రీ రాజరాజేశ్వరి


                - ఆది శంకరాచార్యులు

మార్గశిర శుద్ధ అష్టమి

 *నేడు మార్గశిర శుద్ధ అష్టమి - దాని విశిష్టత ఏమిటి?* 


ఆసక్తికరంగా కాలభైరవాష్టమి పుట్టుక....!!


🌿శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు.


🌸 ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం చెబుతుంది. ఒకసారి శివబ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్తా వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు 'నేను సృష్టికర్తను... పరబ్రహ్మ స్వరూపుడను... నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు. 


🌿దాంతో వారి మధ్య వాదం పెరిగింది. సమస్య పరిష్కారం కొరకు శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు.


🌹 ఋగ్వేదం:- 🌹


🌸అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్ట మొదట నారాయణుడు జన్మించాడో ఎవరు చిట్ట చివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమ శివుడు పర బ్రహ్మము అంది.


🌹 యజుర్వేదము:- 🌹


🌿తరువాత యజుర్వేదమును పిలిచారు. అసుర శక్తులు పోయి ఈశ్వర శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞము నందు ఆరాధింప బడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది.


🌹 సామవేదము:- 🌹


🌸 తరువాత సామ వేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది.


🌹 అధర్వణవేదము:- 🌹


🌿పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది.


🌸అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నాయి.


🌹 ప్రణవం:- 🌹


🌿 ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అపుడు ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో శక్తీశ్వరులై వారున్నారో అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది.


🌸ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈ మాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు. జ్యోతి సాకారం అయింది.


🌿 సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు.


🌸బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. శంకర ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. 


🌿బ్రమ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను తీసివేయి అన్నాడు.అప్పుడు ఈశ్వర రూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై రూపంతో బ్రమ్మ అయిదవ తలను గోటితో గిల్లేసింది . ఆ రూపమే


🌸ఇలా జరిగే సరికి బ్రహ్మ భయపడి పోయి నాలుగు తలకాయలు అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు.


🌿అపుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఈ రోజు నుండి కాలభైరవ అని పిలుస్తారు.


🌸కాలభైరవ నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. అని చెప్పాడు.


🌿బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు.


🌸కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు కాలభైరవా నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు.


🌿 నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు... కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది అని సలహా యిచ్చాడు.


🌸విష్ణుమూర్తి సలహా మేరకు కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని ''కపాల మోక్షతీర్థం''.


🌿కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్నిభక్తితో పూజించి తరించాడు. విశ్వనాధుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్ఛాడు. కాలభైరవ ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని 'భైరవ యాతన' అంటారు.


 🌸అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు.కానీ ఎవరు నీ గురించి వింటారో శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసివేయి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను 'అమర్దకుడు' అని పిలుస్తారు.


🌿ఇక నుండి నీవు నా దేవాలయలలో క్షేత్ర పాలకుడిగా ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు 'పాప భక్షకుడు' అనే పేరును ఇస్తున్నాను.


🌸నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు.


🌿మనల్ని కాశీ క్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా' అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇక నుండి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తారు . 


🌸భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి.


🌿ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవయాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.


🌸అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి.


🌿ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. 'మేము కాశీ వెళ్ళాము మాకు ఇంట ఏ భయమూ లేదు అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు.


🌸 కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది.

ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు.


🌿 కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.

కాశీ క్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీకాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీ నుండి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారం అయింది. 


🌸కాశీ క్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతోపాటు వడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజానంతరం శునకమునకు పసుపు, కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు. ఆ ఆచారాలు శ్రీ కాలభైరవ స్వామి వారి మాహాత్మ్యానికి నిదర్శనం.


🌿ఈ కాలభైరవుని జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని


🌸 లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడశోపచారాలతోను, అష్టోత్తరాలతోను శ్రీ కాలభైరవ స్వామిని పూజిస్తారు. మినప వడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకపూట ఉపవాసం చేస్తారు.


🌿ఈ మార్గశిర అష్టమి కాలభైరవజన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన కాలభైరవాష్టకం ను పారాయణ చేస్తారు. 


🌸ఇలా కారభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామిని స్మరించడం పూజించడం వలన సకల పుణ్య ఫలాలు కలుగుతాయి. శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్నభయాలు దూరమవుతాయ. గ్రహదోషాలు తొలగిపోతాయి..


స్వస్తి..🙏🌹


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

సూర్యాష్టకం

 *సూర్యాష్టకం*


ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే


సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం

శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం

మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 


త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం

మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ

ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం


బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం

ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం

మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం

మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం

అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్


ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే

సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా


స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే

న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి


*ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం*

సర్వరోగనివారణ సూర్యస్తోత్రం*

 *సర్వరోగనివారణ సూర్యస్తోత్రం*


సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఐశ్వర్య ప్రదాత కర్మ సాక్షి ప్రత్యక్ష నారాయణుడు. సమస్త సూర్యమండలానికి వెలుగును ప్రసాదించే దైవము. అటువంటి సూర్యారాధన సమస్త రోగములను హరించి ఆరోగ్యమును అందిస్తుంది.సర్వ రోగాలు మాయమవ్వాలంటే సూర్యభగవానుడిని స్తుతించండి.శక్తివంతమైన సూర్య స్తోత్రమును ప్రతిరోజూ పఠిస్తే--రోగాలు దరిచేరవు.


1::ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః

హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు


2::నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే

క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ


3::కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ

ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ


4::త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః

త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ


5::శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్

శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి


6::త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః

తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు


7::తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః

కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్


8::యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః

భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః


9::యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం

దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే


10::వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ)

గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి


11::ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్

బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః


12::త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః

త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ


*ఫలశ్రుతి*


ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం

పఠతాం భాగ్యసమృద్ధిః సమస్త రోగక్షయ స్స్యాత్


ఈ స్తోత్రాన్ని శ్రద్ధతో పఠించేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది.అన్ని జబ్బులూ హరింపబడతాయి


ఓం సూర్యాయ నమః

⚜ శ్రీ మణక్కట్టుదేవి ఆలయం

 🕉 మన గుడి : నెం 953


⚜ కేరళ : పల్లిప్పాడ్  : అలెప్పి


⚜ శ్రీ మణక్కట్టుదేవి ఆలయం



💠 మనక్కట్టు దేవి ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని అలప్పుజా జిల్లా, కార్తీకపల్లి తాలూకాలోని పల్లిప్పడ్‌లో ఉంది. 

ఈ ఆలయం భువనేశ్వరి దేవికి అంకితం చేయబడింది. అలాగే, ఆలయానికి నాలుగు ప్రాంతాలు ఉన్నాయి. 


💠 ఆలయ ప్రధాన దేవత భువనేశ్వరి. ఆలయంలోని ఉప దేవతలలో దేవత యక్షి అమ్మ, నాగరాజ, వల్ల్యచన్ మరియు రాక్షసులు ఉన్నారు.


💠 ఆలయం అనేక పండుగలను జరుపుకుంటుంది. 

నిరపుత్తరి, నవరాత్రి, చిరప్పు, ఆరట్టు, భగవతిప్పర, ప్రతిష్ట వార్షికం మరియు కొడియెట్టు ఉత్సవం వంటి ముఖ్యమైన పండుగలు ఈ ఆలయంలో ఉన్నాయి. అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్లే అతి ముఖ్యమైన పండుగ, పరాయెడుపు, మలయాళ మాసం మకరంలో వస్తుంది.



🔆 ఆలయ చరిత్ర


💠 చాలా కాలం క్రితం ద్వాపర యుగంలో ఈ ప్రాంతాలు ఖాండవ వనంలో చేర్చబడ్డాయి. భగవాన్ శ్రీకృష్ణుని సలహా మేరకు అర్జునుడు తన బాణాన్ని ఏవూరు (ఎయ్త్తూరు) నుండి ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణ స్వామి దేవాలయం ఉన్న ఏవూరు నుండి పంపాడు. 

ఖాండవదహనం తర్వాత ఈ ప్రాంతంలోని ఆలయాలు అగ్నికి ఆహుతయ్యాయి. 

దశాబ్దాల తర్వాత పంజా కాండానికి వెళ్లే దారిలో ఒక రైతు తన విల్లు ఆకారపు కత్తిని రాయిలో పదును పెట్టడానికి ప్రయత్నిస్తుంటే అకస్మాత్తుగా రాయి నుండి రక్తం వచ్చింది.


💠 భయపడిన అతను ప్రముఖ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆచార్యుల వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని తెలియజేసారు.

పూజారి దిగి వచ్చి అక్కడ శ్రీభువనేశ్వరి విగ్రహాన్ని కనుగొన్నాడు. 

పరశు రామునిచే ప్రతిష్టింపబడిన పాత శాస్తా దేవాలయానికి సమీపంలో అర్చక ప్రతిష్ఠాపన చేయబడ్డాడు . 

శ్రీ పొన్ను మణక్కట్టమ్మ విగ్రహం లభించిన ప్రాంతాన్ని వలియ మనక్కట్టు కావు అంటారు.


💠 మనక్కట్టమ్మ శ్రీ భువనేశ్వరి రూపంలో ఉంటుంది. అన్ని దేవతల తల్లి బ్రహ్మ విష్ణు మరియు శివను కలిగి ఉంటుంది. 

మణక్కట్టు ఆలయ ఆచారాలు పూర్తిగా భిన్నమైనవి. ఇది మూకాంబికా దేవి వంటి దుర్గా, లక్ష్మి మరియు సరస్వతికి మూడు రోజువారీ సందర్భాలలో మూడు వేర్వేరు పూజలను కలిగి ఉంటుంది .

కడుంపాయసం, తేరాలి అమ్మవారికి ముఖ్యమైన ప్రసాదం.


💠 శ్రీమనక్కడు దేవి ఆలయంలో వలియాచన్ అతి ముఖ్యమైన ఉప దేవత. అతను ధర్మరాజ కార్తీక తిరునాళ్ రామవర్మ సైన్యాధ్యక్షుడు మరియు టిప్పు సుల్తాన్‌పై విజయం సాధించిన కీలక వ్యక్తి . అతను మణక్కట్టు అమ్మవారికి అత్యంత నమ్మకమైన భక్తుడు.

అతని సైన్య సేవ తరువాత, వానప్రస్థకు వెళ్ళే వరకు మణక్కట్టు అమ్మకు సేవకుడిగా వల్యచన్ తన జీవితానికి ఎంపిక చేసుకున్నాడు . 

వానప్రస్థ సమయంలో అతను మోక్షాన్ని పొందాడని నమ్ముతారు.


💠 మనకట్టు దేవి ఆలయంలో వల్యచన్ నిజంగా శాశ్వతమైన ఉనికి. వాల్యాచన్‌పై గతంలోనూ, ప్రస్తుతంనూ అనేక సంఘటనలు జరిగాయి. నాతాలిక్కల్ మఠం సమీపంలో వల్యచన్‌కు మరొక ఆలయం ఉంది, దీనిని నతాలిక్కల్ ఆలయం అని కూడా పిలుస్తారు.


🔆 శ్రీ ధర్మ శాస్తా దేవాలయం : 

శ్రీ ధర్మ శాస్తా దేవాలయం పూర్వం ఉండేది.

 శ్రీ ధర్మ శాస్తాను శ్రీ పరశు రాముడు ప్రతిష్టించాడని శతాబ్దాలుగా నమ్ముతారు .

 కానీ ఆలయ పునర్నిర్మాణం కోసం కూల్చివేయబడింది మరియు గత 10 సంవత్సరాలుగా ఏమీ చేయలేదు. 

శ్రీధర్మ శాస్తా ప్రతిష్టను బాలాలయానికి తరలించడం భక్తులకు చాలా బాధ కలిగిస్తోంది. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు.


🔆 ఇతర ఉప దేవతలు : 

ఆలయానికి ప్రక్కనే అనేక ఉపదేవతలు ఉన్నాయి. 

ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ఉపదేవతలు:

ప్రధాన దేవాలయం.

శాస్తా ఆలయం (పాతది)

యక్షి

మాడస్వామి

నాగరాజవ్

ముహూర్తి

రేక్షలు


🔆 పండుగలు : 


ఆరట్టు


వృశ్చిక మాసం చివరి వారంలో ఆరాట్టు జరుపుకుంటారు. ఇది వృశ్చికం 24న ప్రారంభమై ధను 1న ముగుస్తుంది. కొడియేరంలోని 7 రోజున మనకట్టమ్మ శ్రీ అరయకులంగర శ్రీకృష్ణ స్వామి ఆలయ కొలను వద్దకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ధ్వజారోహణం చేస్తారు. గతంలో కొచూర్ మఠంలోని బ్రాహ్మణులు పూజలు నిర్వహించేవారు, కానీ ఇప్పుడు మనకట్టు దేవి ఆలయ తంత్రం నిర్వహించే తజమన్ మఠం తంత్రి నిర్వహిస్తారు.


రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం -81*

 **తిరుమల సర్వస్వం -81* 

*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 20*

స్వామిపుష్కరిణిలో ఉన్న మహత్తు ఏమిటంటే మూడు దివ్యమైన మార్గాలద్వారా అందులోకి జలం చేరుతూ ఉంటుంది: *మొదటిది: భూస్పర్శ.* పుష్కరిణిలో ఉన్న అనేక ఊటబావుల నుండి ఎల్లవేళలా జలం ఊరుతూ, పుష్కరిణి నిండుగా ఉంటుంది. అంటే, భూదేవి, పుష్కరిణిని నింపడానికి తనవంతు ప్రయత్నం నిర్విరామంగా చేస్తుందన్నమాట. *రెండవది: ఇంద్రుని సమర్పణ.* వర్షపుధారల ద్వారా వచ్చిన నీటితో పుష్కరిణి నిండుతుంది. 

*మూడవది: విరజానది* స్వర్గలోకం నుండి భువికి దిగివచ్చి స్వామిపాదాల క్రిందుగా ప్రవహిస్తూ పుష్కరిణిలో చేరుకుంటున్న *"విరజానది".* 

*త్రిపథ జల సంగమమైనది కాబట్టే ఈ పుష్కరిణి పరమపవిత్రమైనదిగా విరాజిల్లుతోంది.* 

ఈ పుష్కరిణి చుట్టూ దేవతలు కొలువై ఉంటారని భక్తుల విశ్వాసం. ప్రాచీనకాలంలో ఎందరో మహర్షులు పుష్కరిణి ఒడ్డున తపస్సు చేసి సిద్ధి పొందారు. సంస్కృతంలో *"నీరము"* అంటే నీరు లేదా జలము అని అర్థం. ఉదకం సాక్షాత్తు ఆ శ్రీహరి స్వరూపం కనుక, ఆ స్వామి "నారాయణుడు" అయ్యాడు. 

ఈ సందర్భంలో తీర్థక్షేత్రాల గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి: 

పుష్కరిణిలు, నదులు, ఏ ఇతర సహజ జలసదుపాయం లేకుండా ఉన్నటువంటి దేవాలయాన్ని *క్షేత్రం* అంటారు. ‌ దేవాలయం లేకుండా కేవలం సహజ జలసదుపాయం ఉంటే వాటిని *తీర్థం* అంటారు. 

‌ పుష్కరిణి లేదా నది మరియు ఆలయం - ఈ రెండూ కలిసి ఉంటే దాన్ని *తీర్థక్షేత్రం* అంటారు. *తిరుమల అన్ని తీర్థ క్షేత్రాలకు తలమానికం.* 


దేవాలయాల్లో కూడా వాటి ఆవిర్భావాన్ని బట్టి ఐదు రకాలున్నాయి: 

'భగవంతుడే "స్వయంగా" అవతరిస్తే అవి *స్వయంవ్యక్త క్షేత్రాలు.* 

దేవతలచే నిర్మింపబడినవి *దివ్యక్షేత్రాలు.* 

పురాణ ప్రసిద్ధి గాంచినవి *పురాణ క్షేత్రాలు.* 

మునిపుంగవుల ద్వారా ఏర్పాటు చేయబడినవి *సిద్ధ క్షేత్రాలు* లేదా *ఆర్షములు* 

భక్తులు, రాజులచే నిర్మించబడినవి *మానుషక్షేత్రాలు


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

విభూతియోగము

 10-35-గీతా మకరందము

          

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


బృహత్సామ తథా సామ్నాం 

గాయత్రీ ఛందసామహమ్ | 

మాసానాం మార్గశీర్షోఽహం ఋతూనాం కుసుమాకరః || 

 

తా:- సామవేదగానములలో బృహత్సామమును,  ఛందస్సులలో గాయత్రియు, మాసములలో మార్గశిరమాసమును, ఋతువులలో వసంతఋతువును నేనైయున్నాను. 

 

వ్యాఖ్య:- ‘మాసానాం మార్గశీర్షోఽస్మి’ - ఈ క్రింది కారణములచే మార్గశీర్షమాసముయొక్క శ్రేష్ఠత్వము సూచితమగుచున్నది - 

(1)పూర్వము మహాభారతకాలమున సంవత్సరము మార్గశీర్షమాసముతో ప్రారంభమగుచుండెడిది. (మహాభారతము - అను - 106,109 అధ్యా). కావున అది అన్నిమాసములకును మొదటిది అయియుండెను. 

(2)ధనుర్మాసకాలమగు ఆ సమయము మహాపవిత్రమైయున్నది. శాస్త్రములందును ఆ సమయమున వ్రతోపవాసాదులు సలుపువారికి గొప్ప ఫలితములు చేకూరునని వచింపబడినది. 

(3)జనులకు క్రొత్తపంట చేతికివచ్చును. అందఱియొద్ద ధాన్యము పుష్కలముగ నుండును. 

(4) వాల్మీకి రామాయణమునందు మార్గశీర్షమాసము సంవత్సరమునకు భూషణముగ వర్ణింపబడినది. 

(5) భగవద్గీత ఈ మార్గశిరమాసమందే ఆవిర్భవించినది. (మార్గశిర శుద్ధ ఏకాదశి). 

(6) అవతారపురుషులగు దత్తాత్రేయులు ఈ నెలయందే జన్మించిరి. (మార్గశిర శుద్ధ పౌర్ణమి). 

(7) వాతావరణము చల్లగనుండుటచే జనుల హృదయమున్ను ఉల్లాసముగ నుండును. ధ్యానాదులకది అనుకూలసమయము. 

    “ఋతూనాం కుసుమాకరః” - వసంతఋతువునందు చెట్లన్నియు చిగిర్చి శోభాయమానముగనుండును. అత్తఱి వాతావరణమున్ను సమశీతోష్ణముగ నుండును. కావున ఋతువులలో అది శ్రేష్ఠముగ వర్ణింపబడెను. శ్రీరామచంద్రుడున్ను ఆ పవిత్రఋతువునందే జన్మించిరి.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము*


*219 వ రోజు*

చెట్టు ఒకటే ఉంటే దానిని ఏనుగులు, గుఱ్ఱాలు తొక్కివేస్తాయి. గాలి కూల్చేస్తుంది గుంపుగా ఉన్న చెట్లను ఎవరూ ఏమీ చేయలేరు. అన్నదమ్ములు కలిసి ఉంటే వారిని ఎవరూ కన్నెత్తి చూడలేరు. వేరుగా ఉంటే శత్రువుకు లోకువైపోతారు. కాబట్టి కౌరవులు, పాండవులు ఒకరికొకరు అండగా ఉంటే శత్రువుకు జయించరానివారు అవుతారు. పాండు పుత్రులను పిలిచి వారికి హితం కలిగించి నీ పుత్రులను బ్రతికించుకో. ఇచ్చకాలు మాట్లాడేవారు ప్రతిచోటా ఉంటారు. అప్రియమైనా హితం పలికేవారు వేరుగా ఉంటారు. జూదం ఆడిన నాడే నేను వద్దని చెప్పాను. రోగం వచ్చినవాడికి పథ్యం సహించనట్టుగానే నా మాటలు నీవు విన లేదు. కాకుల వంటి నీ కుమారులను నమ్మి నెమళ్ళ వంటి పాండవులను వదులుకుని ఇప్పుడు తల్లడిల్లి పోతున్నావు.పిల్లులను ఆదరించి సింహాలను చేరదీసినట్టు దుర్యోధనాదులకోసం పాండవులను వదిలేసావు. కులం నిలుపుకోవడానికి ఒక్కడినయినా వదులుకోవాలని పెద్దలంటారు. అవినీతిపరుడై, మంచి మాటలు చెప్తే వినని దుర్యోధనుడిని వదులుకుంటే వచ్చే నష్టం ఏమిటి. సహాయం సంపదను బట్టి, సంపద సహాయాన్ని బట్టి ఉంటాయి. ఇలా ఒకదానితో ఒకటి కూడి ఉంటే గాని సిద్ధించవు. కాబట్టి నీ సంపద పాండవులకు, వారి సహాయం నీకు ప్రీతి కలిగిస్తుంది. పరస్పరం కలిసి ఉండడం మేలు. కురువంశోద్ధారకులైన భీష్ముడు,ధర్మరాజు,మంచి పరాక్రమవంతులైన అర్జునుడు, కర్ణుడు , భీముడు, దుర్యోధనుడు, శస్త్ర అస్త్ర విద్యలలో నిపుణులైన అభిమన్యుడు, లక్ష్మణ కుమారుడు, ద్రోణుడు, ద్రుపదుడు వంటి ఆత్మీయులు వారి బంధువులు అంతా చేరి నిన్ను సేవిస్తుంటే నీ వైభవం ఎలా ఉంటుందో ఆలోచించు. " అన్నాడు. పాండవులు ఇప్పుడు పగ విషయం మరిచిపోయినా కొన్నాళ్ళకయినా ఇబ్బందులు పడి చెడుతుందే కాని దుర్యోధనుడితో రాజ్యం పాలించబడదు. అని చెప్పాడు విదురుడు. ధృతరాష్ట్రుడు " విదురా! నీవు చెప్పిన మాటలు రాజనీతి సమ్మతములే . అయినా నా కొడుకును వదలలేను. కనుక ధర్మం జయిస్తుంది అని చూస్తూ ఉంటాను " అన్నాడు. అప్పుడు విదురుడు " రాజా! దాయాదులు గుణం లేనివాళ్ళయినా విడిచిపెట్టకూడదు అంటారు. సకల గుణసంపద కలిగినవారై, నీ అనుగ్రహం కోరే పాండవులను నీవు వదిలి పెట్టవచ్చా. నేను నీ మేలుకోరేవాడిని. పాండవులు బ్రతకడానికి చిన్న పల్లెలు అయినా కొన్నిటిని కేటాయించి, దుర్యోధనుడిని ఒప్పించి సంధి చేస్తే మంచిది. యుద్ధం నివారించడానికి కొడుకులను వదల మన్నాను కాని సంధి చేసుకుంటే అందరికీ క్షేమమే కదా!

ఎన్ని భోగాలు అనుభవించినా మహారాజులకైనా చావు తప్పదు. కాబట్టి చెవికి చేదుగా ఉన్నా  

ఈ విషయాన్ని అర్థం చేసుకున్నావంటే నీకు ఇహ పరాల్లో కీర్తి సంపదలు కలుగుతాయి. ధర్మరాజును వదిలిపెట్టకు. మనసు గట్టిచేసుకొని నీ కొడుకులకు, మంత్రులకు సంధి చేసుకోమని చెప్పు." అన్నాడు. ధృతరాష్ట్రుడు " విదురా! నీ మాటలు నా మనసును తేటపరిచాయి. ఆలోచిస్తే ఇదే తగిన పని అనిపిస్తోంది. అలాగే చేస్తాను " అన్నాడు. విదురుడు " ఆ మాట మీద ఉండు. ఇంతకాలానికి నీకు చేయదగినదానిపై మనసు స్థిరపడింది. దుర్యోధనుని చూసి మనసు మార్చుకోకుండా, అతను మొగ్గినవైపు నీవు మొగ్గకుండా ధర్మరాజుతో సంధి చేసుకో. మా వంటి వారికి ఆనందం కలుగుతుంది " అని చెప్పి తన మందిరానికి వెళ్ళాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ ఘాటీ సుబ్రమణ్య ఆలయం

 *శ్రీ ఘాటీ సుబ్రమణ్య ఆలయం... ( కర్నాటక  దొడ్డబల్లాపూర్  )*

శ్రీ సుబ్రహ్మణ్య భగవానుడు దేశవ్యాప్తంగా ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో పూజించబడతాడు.  

శివుని కుమారునిగా పరిగణించబడే సుబ్రహ్మణ్యుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతల సైన్యానికి అధిపతి.  అతన్ని షణ్ముఖ, కార్తికేయ, శరవణభవ మరియు స్కంద మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు.


🌸 గుహ అనేది సుబ్రహ్మణ్య స్వామి మరొక పేరు, అతను గుహలలో నివసించేవాడు మరియు సుబ్రహ్మణ్య స్వామి నివాసంగా పర్వతాలు మరియు గుహలు మనకు ఎల్లప్పుడూ కనిపిస్తాయి.


🌿 సుబ్రహ్మణ్య స్వామికి అనేక దేవాలయాలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి మరియు వాటిలో కొన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందిన యాత్రా కేంద్రాలు.  అటువంటి అరుదైన ప్రాముఖ్యత కలిగిన దేవాలయం బెంగుళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రంలోని ఘాటి వద్ద ఉంది.


🌸 ఘటి అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది.  కుండ అని అర్థం. ఇక్కడ పాము యొక్క పడగ ఒక కుండను పోలి ఉంటుంది.


🌿 స్థల పురాణం ప్రకారం, తారకాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి ముందు సుబ్రహ్మణ్య భగవానుడు ఈ ప్రాంతంలోని పర్వత శ్రేణులలోని గుహలలో సర్ప వేషంలో తపస్సు చేసిన ప్రదేశం.


🌸 ఈ ప్రదేశంలో సుబ్రహ్మణ్య భగవానుడు పాము రూపంలో ఇప్పటికీ తపస్సు చేస్తున్నాడని నమ్ముతారు.  

నాగుల కుటుంబాన్ని విష్ణువు వాహనం అయిన గరుడుని నుండి రక్షణ అందించమని సుబ్రహ్మణ్యస్వామి  నరసింహుడిని ప్రార్థించాడు. 


🌿 ఘాటి వద్ద ఉన్న దేవాలయం అరుదైన కలయికలో సుబ్రహ్మణ్య భగవానుడు మరియు లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేకంగా అంకితం చేయబడింది.


🌸 ఈ ఆలయం యొక్క అరుదైన విషయం ఏమిటంటే, రెండు దేవతలు ఒకే  స్వయంభూ. విగ్రహంపై ఏడు తలల నాగుపాము ఉన్న కార్తికేయ విగ్రహం ఒకే రాయితో తయారు చేయబడింది.  


🌿ఇది తూర్పు ముఖంగా ఉండగా నరసింహుని విగ్రహం పడమర దిశగా ఉంటుంది.  గర్భగుడి లోపల వ్యూహాత్మకంగా ఉంచిన అద్దం ద్వారా లక్ష్మీ నరసింహ స్వామిని వీక్షించవచ్చు.


🌸 ఘట అనేది సంస్కృత పదానికి అర్థం కుండ.  ఒక పాము యొక్క పడగ ఒక కుండను పోలి ఉంటుంది మరియు ఘటి అనేది సుబ్రహ్మణ్య భగవానుడు ఘట సర్ప రూపంలో నివసించిన ప్రదేశం. 


🌿 హిందీలో ఘాట్ అంటే పర్వత శ్రేణి మరియు ఈ సుబ్రహ్మణ్య దేవాలయం పర్వత శ్రేణులలో ఉంది.  

సుబ్రహ్మణ్య భగవానుడు ఘటికాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన ప్రదేశంగా ఘటి భావిస్తారు.


🌸 ఆలయ రికార్డుల ప్రకారం ఘటి సుబ్రహ్మణ్య క్షేత్రంలోని ఆలయానికి 600 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది మరియు దీనిని సండూర్ రాజవంశానికి చెందిన పూర్వపు పాలకులు ఘోర్పడే నిర్మించారు. 


🌿 సుబ్రహ్మణ్య భగవానుడు స్వయంగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం (కల) స్థానిక పౌరుల సహాయంతో ఈ అరుదైన మరియు స్వయంగా వ్యక్తీకరించబడిన విగ్రహాన్ని రాజు వెలికితీశారు.


🌸 ఘాటి కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన యాత్రా కేంద్రాలలో ఒకటిగా మారింది మరియు సుబ్రహ్మణ్య భగవానుని సర్పరూపం కారణంగా ఈ ప్రదేశం నాగ క్షేత్రంగా కూడా గౌరవించబడుతుంది.

సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కోసం వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సంప్రదిస్తారు.


 🌿కుజ (అంగారక) ముఖ్యంగా కుజ (అంగారక) దోషం, వైవాహిక సంబంధిత సమస్యలు మరియు శ్రేయస్సు, రాహు, సర్ప/నాగ దోషాల నుండి వచ్చే దుష్ప్రభావాలకు నివారణగా, సంతానం పొందడం కోసం; 


🌸ఆరోగ్య సమస్యలకు ముఖ్యంగా కుష్టువ్యాధి, ల్యూకోడెర్మా వంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు నివారణగా, శత్రువుల నుండి ఉపశమనం (అంతర్గత మరియు బాహ్య రెండూ), కాకుండా అప్పుల నుండి ఉపశమనం లాంటి సమస్యలు కోసం ఇక్కడ పూజలు చేస్తారు.


 🌿ఆలయ రథోత్సవం ప్రతి సంవత్సరం 6వ చాంద్రమానం (శుక్ల షష్ఠి) నాడు పుష్య మాసంలో మాత్రమే కాకుండా, ఇతర ముఖ్యమైన సందర్భాలలో సుబ్రహ్మణ్య స్వామి మరియు లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించడం కోసం ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.. 


స్వస్తి...🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

తిరుమల దర్శనంపై ఆర్టీసీ

 తిరుమల దర్శనంపై ఆర్టీసీ ప్రకటన:

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం APSRTC బస్సుల్లో రోజుకు 1000 దైవ దర్శనం టిక్కెట్లు జారీ చేయబడ్డాయి.

  ఏబీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ సువర్ణావకాశం కల్పించారు.

  ఏబీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లే ప్రయాణికులు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే ఎక్స్‌ప్రెస్ దర్శనం టికెట్ పొందవచ్చు.


  ఈ శీఘ్ర దర్శనం ప్రతిరోజూ ఉదయం 11.00 మరియు సాయంత్రం 4.00 గంటలకు నిర్వహించబడుతుంది.

  తిరుమల బస్టాండ్‌కు చేరుకున్నప్పుడు ఆర్టీసీ సూపర్‌వైజర్లు ప్రయాణికులకు శీఘ్ర దర్శనానికి సహకరిస్తారు.

  కావున తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ దర్శనం టిక్కెట్లు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.   APSRTC తిరుపతికి రోజూ 650 బస్సులను నడుపుతోంది.   ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం ఉంది.   బెంగళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కోసం వచ్చే ప్రయాణికులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.


 *చివరి అభ్యర్థన:*

  ఈ పోస్ట్‌ను షేర్ చేయడం మర్చిపోవద్దు.   మీకు ఇది అవసరం లేకపోవచ్చు, కానీ మరెవరికైనా ఇది అవసరం, కాబట్టి దయచేసి షేర్ చేయండి.🙏🏻🙏🏻💐☺️☺️