6, జనవరి 2021, బుధవారం

పెద్దవయసు - గౌరవం*

 👶🏻

        *పెద్దవయసు - గౌరవం* 

                                         💃



పెద్దతనం వచ్చింది అనగానే

కొన్ని విషయాలు 

మనం వదిలి వేయాలి.


పట్టుకోవటం కష్టం కానీ

వదిలివేయటంలో బాధ ఏమిటి చెప్పండి?

అలా అనుమానంగా చూడకండి..

ఏమి వదిలివేయాలో చూద్దామా..


*"అమ్మాయి!!*

*గ్యాసు కట్టేసావా!!*

*గీజర్ ఆఫ్ చేసావా??*

*ఏ.సి. ఆన్ లో ఉన్నట్లుంది..*

*పాలు ఫ్రిజ్ లో పెట్టావా ??*

*కరెంట్ బిల్లు కట్టారా !!!"* లాంటి ఎంక్వయిరీలు 

వదిలి వేద్దాం !!!


"మా కొడుకు~కోడలు పట్టించుకోరు" 

అని హైరానా పడకుండా.. 


ఇలా పట్టించుకుంటూ.. 

60..70 ఏళ్ళు గడిపారు, 

ఇంకా ఎంతకాలం ??   


ఇది వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం..

కష్టనష్టాలు కూడా వాళ్ళవే !!

 

చూడండి 

అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండగలమో..


*"నా అభిప్రాయం ఏమిటంటే" అని అనటం తగ్గించి..*


*"నీ ఇష్టం, నువ్వు చెప్పు"*

అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిద్దామా!! 


*'నాకూ తెలుసు'* తో పాటు

*'నాకు మాత్రమే తెలుసు'* అనే ఆలోచన తగ్గించుకుని,

వాళ్ళకి చాలా విషయాలు~టెక్నాలజీ *'నాకంటే ఎక్కువ తెలుసు'* కదా అనే నిజాన్ని ఠక్కున ఒప్పేసుకుందాం..

మన మంచికేనండీ చెబుతున్నాను ...


*"మా కాలంలో",*

*"మా చిన్నప్పుడు"* అంటూ వీలు చిక్కినప్పుడల్లా వారిని ఊదరకొట్టకుండా.. వారి ముఖాల్లో కనిపించే విసుగుని చూడనట్లు నటించటం మానేద్దాం. మన పిల్లలు కోసం వచ్చేవారితో మితంగా మాట్లాడదాం. 


వాళ్ళు మనకోసం రాలేదు అని గుర్తుంచుకుందాం. కాసేపు మాట్లాడాక లేచి గదిలోకి వెళ్ళిపోగలిగే మనోనిగ్రహం అలవరుచుకుందాం..


పెద్దవారిని పలకరించే మర్యాదతో ఒక ప్రశ్న ఎవరైనా సహజంగా అడుగుతారు..

*"ఆరోగ్యం బాగుంది కదా"* అని.

దయచేసి వెంటనే అతిగా స్పందించవద్దు..

మన బి.పి.~షుగర్..

కీళ్ళనొప్పులు~నిద్ర పట్టకపోవటం..

నీరసం అంత రసవత్తరమైన విషయం కాదని సదా సర్వదా గుర్తుంచుకోవాలండీ బాబూ !!!

  

మనకి తోచక కాలక్షేపానికి చెప్పినా ఎదుటివాళ్ళకి దాంట్లో అంత ఇంట్రెస్ట్ ఏం ఉంటుంది చెప్పండి..

*"బాబోయ్ !! ఎందుకు అడిగామా"*

అనే పశ్చాత్తాపం వారికి కలిగించవద్దు.. 


ఇంకొక విషయం...

ఎవరో పెద్దాయన అన్నాడు..


*"మన అనుభవంతో వారిని తీర్చిదిద్దాలికదా!"* అని.


 కాలం మారింది... మారుతున్నది.. 

"రోట్లో కందిపచ్చడి రుబ్బటం..

తిరగలితో విసరటం..

కట్టెల పొయ్యి మీద వంట చేయటం,

కవ్వంతో మజ్జిగ చిలకటంలో గల నా అనుభవం నేటి తరానికి ఎలా ఉపయోగపడుతుంది ??"


ఉద్యోగాలైనా అంతే ! 

పద్దతులు మారుతున్నాయి..

టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది.


విమానంలో ప్రయాణించే వారికి

ఎర్రబస్సు లో సీటు ఎలా పట్టుకోవాలో చెప్పి ఏం ప్రయోజనం ??


*చివరగా పెద్దతనంలో మన పరువు కాపాడుకోవటం పూర్తిగా ... పూర్తిగా మన చేతుల్లోనే ఉందండీ !!*

 

*అనవసరం విషయాల్లో జోక్యం చేసుకోకుండా... మితభాషిగావుంటూ...*

*మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా...*

*ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ..*

*జిహ్వ చాపల్యం తగ్గించుకుని..* 


*అన్నింటికంటే ముఖ్యమైన విషయం "నన్ను ఎవరూ గౌరవించటం లేదు" అనే ఆత్మన్యూనతా భావం దరి చేరకుండా జాగ్రత్తపడాలి...*


భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము..

కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం..

పాజిటివ్ గా చూడండి... ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు..

మొత్తం సంసారాన్ని లాగే బాధ్యత లేదు..

పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది.. 


హాయిగా పూజలు చేసుకోవచ్చు..

భగవద్గీత, భాగవతం చదువుకోచ్చు..

దైవదర్శనం చేసుకోవచ్చు..

 

*వాట్సప్ నేర్చుకోవచ్చు*

*మనవయసువారితో,*

*స్కూలు ఫ్రెండ్స్ తో కలసి*

*వయసు తగ్గించుకోవచ్చు*


చిన్న చిన్న హాబీలు మనసు కి ఆహ్లాదాన్నిస్తాయి.

వాటికి సమయం కేటాయించవచ్చు.. 


*ఒక మాటని రోజూ అనుకుందాం..*

*"I love myself..*

*I respect my self "*

*ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది..* 


చివరగా..

మనం దిగవలసిన స్టేషన్ దగ్గరలోనే వుంది..

Platform అదిగో... 

సమయం దగ్గర పడింది.  


ఇక మనకి 

బోగీలో ఉన్నవారితో

  తగువులు,

  మనస్పర్థలు,

  ఎత్తిపొడుపు మాటలు..

  అవసరం అంటారా.


*మనం దిగుతుంటే*

*వారి ముఖాల్లో 'హమ్మయ్య' అనే భావం కనిపించాలో*


*లేక 'అయ్యో అప్పుడే స్టేషన్ వచ్చేసిందా' అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది..*


పెద్దతనం మనకి వరంలాంటిది.. 

అది ముఖ్యంగా 

మన 'అహం' తగ్గించి, 

మనకి జీవితం అంటే ఏమిటో,

మన నిజమైన విలువ ఏమిటో

సరియైన అవగాహన కల్పిస్తుంది.


కాబట్టి అందరూ వృద్ధాప్యాన్ని ఆనందంగా స్వాగతించాలి సుమండీ !!! 


*నస అనిపించుకునే కంటే nice అనిపించుకోవడం మంచిది కదా!*


ఇది నాకు ఎవరో పంపారు. బాగుందని మీకు పంపుతున్నాను.  

👏👌🙏👍😊

మొగలిచెర్ల

 *నిస్వార్ధపు కోరిక..*


తన చేతిలోని సంచీ ని తీసి ఒక బల్ల మీద పెట్టి, నేరుగా పంపుల వద్దకు వెళ్లి, కాళ్ళూ చేతులూ ముఖమూ కడుక్కొని, తన సంచీ లోంచి తుండుగుడ్డ తీసుకొని, శుభ్రంగా తుడుచుకుని, మళ్లీ ఆ తుండుగుడ్డను జాగ్రత్తగా సంచీలో పెట్టుకొని..మంటపం లోకి వెళ్లి, స్వామివారి సమాధి గదికి ఎదురుగా నిల బడి రెండుచేతులతో నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చాడు..అతని వయసు చూస్తే ముప్పై ఏళ్ళు కూడా ఉన్నట్టులేవు..కొద్దిసేపు మంటపం లోనే కూర్చుని..లేచి మా సిబ్బంది వద్దకు వచ్చాడు..వాళ్ళను ఏదో అడుగుతుంటే..నా వైపు చూపించారు..నేరుగా నేను కూర్చుని ఉన్న బల్ల వద్దకు వచ్చి నిలబడ్డాడు..ఏం కావాలి అన్నట్లుగా అతని వైపు చూసాను..


"నా పేరు సీతారామ్ అండీ..బెంగుళూరు లో ఉద్యోగం చేస్తున్నాను..గత ఆరునెలలుగా ఫేస్బుక్ లో వాట్సాప్ లోని కొన్ని గ్రూపుల్లో ఈ ఆలయం గురించి విశేషాలు వస్తూ ఉన్నాయి..రోజూ చదువుతున్నాను..ఎందుకనో ఒకసారి వెళ్లి చూసివస్తే బాగుంటుంది అని బలంగా అనిపించింది..ఎలాగూ రెండురోజులు సెలవులొచ్చాయి..అందుకని నిన్న నిర్ణయం తీసుకొని, రాత్రి బస్సెక్కి వచ్చేసాను..ఈరోజు ఇక్కడ ఉండి, రేపుదయం తిరిగి వెళ్లిపోతాను..ఈ ఆలయం గురించి, ఈ స్వామివారి గురించి చదివే వున్నాను..స్వామివారి విగ్రహానికి అభిషేకం చేయించుకొని సమాధి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాను.." అన్నాడు..


"అలాగే..అక్కడ మా సిబ్బంది వున్నారు..అభిషేకానికి టికెట్ తీసుకొని..బైట పూజాద్రవ్యాలు అమ్మే దుకాణం లో అభిషేకానికి కావాల్సిన సామాన్లు తీసుకొని రండి..మా అర్చకస్వామి అభిషేకం చేస్తారు.." అన్నాను..


సరేనని తలవూపి..టికెట్ కొనుక్కొని, అభిషేకం సామాన్లు తీసుకొని..లోపలికి వచ్చాడు..తన చేతిలో ఉన్న సంచీ లోంచి ఒక పట్టు పంచె..ఉత్తరీయము తీసుకుని, వాటిని సంప్రదాయ రీతిలో ధరించి..ఆపై అభిషేకానికి వెళ్ళాడు..అత్యంత వినయము, భక్తి, శ్రద్ధలతో కూడిన అతని ప్రవర్తన చూస్తుంటే నాకు ముచ్చటేసింది..


స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేయించిన తరువాత..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి భక్తిగా నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చాడు..


"ఈరోజు గురువారం అండీ..ఇప్పుడు రావడమే మంచిదైంది..ఇతర భక్తులెవ్వరూ పెద్దగా లేరు..పంతులు గారు కూడా చాలా శ్రద్ధగా అభిషేకం చేశారు..నాకు తృప్తిగా ఉంది..స్వామివారి సమాధి ని కూడా ప్రశాంతంగా చూడగలిగాను..నా కోరిక చెప్పుకున్నాను.." అన్నాడు..


"మీరు జవాబు చెప్పాలని బలవంతం చేయటం లేదు..మీరు ఏ కోరికతో ఇక్కడికి వచ్చారు.."? అన్నాను..


"అదేమీలేదండీ..నా వయసు 28 సంవత్సరాలు..నేను నా 21వయేటనే ఉద్యోగం లో చేరాను..నేను పనిచేస్తున్న కంపెనీ లో నాతోబాటు మరో ఐదారు వందల మంది పనిచేస్తున్నారు..ఇన్నాళ్లూ అదే కంపెనీ లో వున్నాను..వివాహం చేసుకున్నాను..ఒక పిల్లవాడు పుట్టాడు..నా భార్య నేను పిల్లవాడు హాయిగానే ఉన్నాము..నా వరకూ అంతా బాగానే ఉంది..కానీ కంపెనీ ఇబ్బందుల్లో పడింది..గత ఆరు నెలలుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది..నాకున్న అనుభవంతో వేరే చోట ఉద్యోగం వస్తుంది..కానీ మొదటి నుంచీ నన్ను ఆదరించిన కంపెనీ గురించి ప్రార్ధించాలని వచ్చాను..స్వామివారికి గట్టిగా చెప్పుకున్నాను..కొన్ని వందలమంది భవిష్యత్తు ఆధారపడి ఉన్నది స్వామీ..మీరే కాపాడాలి అని కోరుకున్నాను..." అన్నాడు..


నిస్వార్ధంగా ఉన్న అతని కోరిక విన్న తరువాత అతని మీద గౌరవం పెరిగింది..ఆరోజంతా అతను స్వామివారి చరిత్రను పారాయణం చేస్తూ గడిపాడు..ఆ రాత్రికి మంటపం లోనే పడుకున్నాడు..తెల్లవారి లేచి, స్నానాదికాలు ముగించుకొని వచ్చి, మళ్లీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు..


ఐదారు నెలల తరువాత సీతారామ్ ఆలయానికి వచ్చాడు..ఆరోజూ గురువారమే..మళ్లీ పద్దతిగా అభిషేకం చేయించుకొని, స్వామివారి సమాధి దర్శించుకొని ఇవతలికి వచ్చి, "అన్నివిధాలా బాగుందండి..కంపెనీ మళ్లీ గాడిన పడింది..కొత్త ప్రాజెక్టులూ వచ్చాయి..నేనూ ఒక ప్రాజెక్టు హెడ్ గా  వున్నాను..అందుకే స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను.." అన్నాడు..అతని ముఖం లో చక్కటి ప్రశాంతత ఉంది..


నిస్వార్ధంగా తనతో పాటు ఇతరుల జీవితాలు కూడా బాగుపడాలని కోరుకున్నప్పుడు శ్రీ స్వామివారు కూడా సానుకూలంగా స్పందిస్తారు కదా..అందులో సందేహం ఏముంది?


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

జగన్మాతరం

 జగన్మాతరం అని వేంకటేశ్వర సుప్రభాతం. అసలు ఆ దివ్య మంగళ మూర్తి లింగ భేదము లేని తత్వం సాలగ్రామ మూర్తి. సాలగ్రామ మునకు విశేషమైన శక్తి కలదు. అమితమైన రేజియేసయషన్ తో ప్రకృతి సిద్దంగా ఏర్పడినది. అమితమైన శక్తి ఏదైనా పదార్థమును ఆశ్రయించిన ఆపదార్ధ లక్షణము కలుగును. మట్టి తో బొమ్మను చేసి ఏదైనా వక ఆకృతిని దాల్చిన అది బంబరూపమగబంబరూపమగనుును. అటులనే మాన దేహము కూడా శక్తి రూపములో పదార్థమును ఆశ్రయించి రూపమును కాల్చుచున్నది. దీని లక్షణము ప్రకృతి ధర్మమును స్ర్తీ మూతృతత్వము మాత్రమే. దేహమును ఆశ్రయించుట అనగా పురుషుడు శక్తి ఉత్పన్న కారకుడు స్రీ అందుకు కావలసిన క్షేత్రం లక్షణము కలిగిన క్షేత్రంు. బాలాజీ ెఅని ఉత్తరాది వారు పిలుచుట బాల మంత్ర ఉపాసన శక్తి. జీ అనే గౌరవ సంబంధం. అనగా బాల్య గారు ,అమ్మగారు, అని అందుకే శుక్పవారాభిషేకం. భృగు తత్వం అనగా శక్తి తత్వం. బ భృ భ ప్రకాశించు తత్వమునకు మూల ప్రకృతి రమణీయత ఋ కారము అనగా ఋక్ అనగా వెలుగు యెుఋకారతత్వం పరమేశ్వర శక్తి యని దాని మూలము తెలియవలెనన్న అమ్మను ఆశ్రయించిన గాని వాని తతత్వం తెలియదు.అందుకే  బాల బాలాత్రిపుర సుందరీ తత్వం. అది మహా కాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతీ రూపమైన బాల తత్వం. భ భృ ఋక్ తత్వం స్వరూపం భ ప్రకాశించుచున్న అది స్ర్తీ తత్వం సృష్టి మూల తత్వం. అమ్మకు శుక్పవారాభిషేకం స్త్రీ తత్వం సౌందర్య లక్షణము దాని ఆశ్వాగనయే పురుష తత్వం. యిదియే సృష్టి మూలం. బాల తత్వం.

మొగలిచెర్ల

 *నారాయణ నమ్మకం..*


"శరణం ఓ స్వామీ..శ్రీ దత్తాత్రేయ ప్రభో.." అంటూ ఆ శనివారం నాటి రాత్రి పది గంటలవేళ  శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద కొందరు భక్తులు భజన చేస్తూ పాడుతూ వున్నారు..మందిరం లో ఉన్న మిగిలిన భక్తులు ఈ భజన కార్యక్రమాన్ని చూస్తూ వున్నారు..


అలా చూస్తున్న భక్తులలో ఉన్న ఒక ఆవిడ ఉన్నట్టుండి "స్వామీ దత్తాత్రేయా.."అంటూ  పెద్దగా కేక వేసింది..ఒక్కసారిగా నేల మీద పడిపోయి మెలికలు తిరిగిపోసాగింది..ఆమె భర్తా, కుమారుడు ఆమెను సముదాయిస్తున్నారు..కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించడం లేదు..వాళ్ళిద్దరి చేతులూ విసిరికొడుతూ..ఇంకా పెద్దగా కేకలు పెడుతున్నది..సుమారు  రెండు మూడు గంటలపాటు ఆమె ఆవిధంగా ప్రవర్తించి..ఆపై నేల మీద పడి నిద్రపోయింది..ఆమె భర్త, కుమారుడు, తెల్లవార్లూ ఆమె ప్రక్కనే కూర్చుని వున్నారు..


ఆ ఆడమనిషి పేరు శాంతమ్మ..భర్త పేరు నరసింహం..వివాహం జరిగి పాతికేళ్ళయింది..ఇద్దరు పిల్లలు..మొదటి సంతానం ఆడపిల్ల..ఆ పిల్లకూ పెళ్లి చేసి కాపురానికి పంపించారు..రెండవ సంతానం కుమారుడు..ఆ అబ్బాయి పేరు నారాయణ..డిగ్రీ దాకా చదువుకొని, తండ్రికి వ్యవసాయం లో సహాయం చేస్తున్నాడు..అంతవరకూ సాఫీగా సాగిపోతున్న వాళ్ళ సంసారం లో అనుకోని ఇబ్బందులు వచ్చాయి..ఉన్నట్టుండి శాంతమ్మ  ప్రవర్తన మారిపోయింది..పిచ్చి పిచ్చిగా కేకలు వేయడం, ఏడవడం..చేతిలో ఉన్న వస్తువులు విసిరి కొట్టడం లాంటి విపరీతపు పనులు చేయసాగింది..భర్తకూ, కుమారుడికి ఏమీ అర్ధం కాలేదు..ఒంగోలు లోని డాక్టర్లకు చూపించారు..ఏవేవో పరీక్షలు చేసి..హిస్టీరియా లాంటి జబ్బు అని తేల్చి..మందులు ఇచ్చి పంపించారు..


"మొగలిచెర్ల లో సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు తీసుకెళ్లండి..త్వరగా నయం అవుతుంది.."అని నరసింహం కు ఒకరిద్దరు పెద్దవాళ్ళు సలహా ఇచ్చారు..ఆ సలహాను నరసింహం పెద్దగా పట్టించుకోలేదు..మరో వారం గడిచేసరికి శాంతమ్మ ఆరోగ్యం కూడా క్షీణించసాగింది..కుమారుడితో తాను విన్న విషయాన్ని చెప్పి.."ఏం చేద్దాం.." అనిఅడిగాడు.."నాన్నా..మందులు వాడాము కదా..ఫలితం కనబడలేదు..దేవుణ్ణి నమ్ముకొందాము..రేపే అమ్మను తీసుకొని మొగిలిచెర్ల వెళదాము.." అన్నాడు..ఆవిధంగా ఇద్దరూ నిర్ణయించుకొని, శాంతమ్మ ను తీసుకొని మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్దకు వచ్చారు..ఆరోజు శనివారం..ఆరోజు రాత్రే ఈ విధంగా శాంతమ్మ ప్రవర్తించింది..


"స్వామీ నిన్నే నమ్ముకొని, మా అమ్మను తీసుకొని ఇక్కడకు వచ్చాము..కాపాడు తండ్రీ.." అని నారాయణ ఆదివారం ఉదయాన్నే స్వామివారి సమాధి వద్దకు వచ్చి వేడుకున్నాడు..స్వామివారి వెండి పాదుకలు ప్రక్కనే ఉన్న గిన్నె లోని విభూతి తీసుకొని వచ్చి, తన తల్లి నుదుటి మీద రాసాడు..మరుక్షణమే శాంతమ్మ వెఱ్ఱికేక పెట్టింది.."దత్తాత్రేయా నేను పోతున్నాను..".."నేను వెళ్లి పోతున్నాను.." అంటూ పెద్దగా  అరిచి, పరిగెత్తింది..మందిరం వెనుక వైపుకు వెళ్లి, ఒక పెద్ద బండరాయిని ఎత్తుకొని, స్వామివారి పల్లకీ తిరిగే మార్గం లోమూడు ప్రదక్షిణాలు చేసి..ఆ బండరాయిని ఒక ప్రక్కకు విసిరేసి..మళ్లీ పరుగెత్తుకుంటూ మంటపం లోకి వచ్చి..సొమ్మసిల్లి పడిపోయింది..తాను విభూతి నుదిటి మీద రాసిన తరువాత, తన తల్లి ఈ విధంగా ప్రవర్తించడం చూసిన నారాయణకు అయోమయంగా ఉంది..భర్త నరసింహానికీ ఏమీ పాలుపోలేదు..


సొమ్మసిల్లి పడిపోయిన శాంతమ్మ మరో అరగంటకు లేచి కూర్చుంది..ఇప్పుడు ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది..మెల్లిగా లేచి, భర్త వద్దకు వచ్చి.."మంచి నిద్ర పట్టిందయ్యా..ఏదో బరువు తగ్గినట్టు ఉంది.." అన్నది..ఆ తండ్రీ కొడుకులు ముందు ఊపిరి పీల్చుకున్నారు..ఆరోజు మరలా శాంతమ్మ ఏ వికారమూ లేకుండా..తనపని తాను చేసుకుంటూ ఉన్నది..ఆ తరువాత నాలుగు రోజుల పాటు శాంతమ్మ మామూలుగానే ఉన్నది..నరసింహానికీ తన భార్య కు తగ్గిపోయిందని నమ్మకం కలిగింది.."నువ్వు చెపినట్లే మీ అమ్మను ఇక్కడికి తీసుకురావడం వల్ల మంచి జరిగింది..స్వామివారు కరుణించారు..వచ్చే ఆదివారం దాకా ఇక్కడే వుండి, స్వామికి పొంగలి పెట్టుకొని మన ఊరుకు పోదాము.." అని కొడుకుతో నరసింహం చెప్పాడు..


ఆ ప్రక్క ఆదివారం నాడు శాంతమ్మ స్వయంగా పొంగలి వండుకొని, గిన్నె నెత్తిన పెట్టుకొని స్వామివారి దర్శనానికి వచ్చింది..తన తల్లిని కాపాడమని మనస్ఫూర్తిగా వేడుకున్న ఆ పిల్లవాడి ప్రార్ధన అతి త్వరగా ఫలించింది..


"మా అమ్మను స్వామివారే కాపాడారు.." అని నారాయణ స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడల్లా  మాతో చెప్పుకొని, స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు.. నమ్మినవారిని కాపాడటం తన కర్తవ్యం అని సమాధి లో ఉన్న స్వామివారు మరో మారు నిరూపించారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

🌹శ్రీ మద్ రామాయణావతరణము 🌹

   

ఉ.  ఓరి ! నిషాధ  ! నీవిటుల

             నుర్వి కిరాత కుచేష్ట బూనియున్

      కూరిమితోడ క్రౌOచములు

             కూడియు  నుండగ  నొక్కదానినిన్

      క్రూరశరమ్ముతో భువిని

             కూలగ గొట్టియు జంపినావు , నీ

      నేరత కారణంబునను

             నీవిక బ్రతుకవు పెద్దకాలమున్        18 


తే.  క్రౌంచ పక్షుల దుస్థితి  గాంచి మౌని

      శోక మందున మునిగియు  శ్లోక మొకటి

      అప్రయత్నంబుగా జెప్పి యద్భుతముగ

      మరల  యద్దాని దలచెను మానసమున    19 


తే.  అంత వాల్మీకి  యత్యంత  సంతసమున

      శ్లోక సరళిని  దలచియు  స్ఫూర్తి నొంది

      యంతరమ్మున  నిర్ణయ మరయ పొంది

      పలికె నీరీతి శిష్యుతో  పరవశమున            20 


మంజరీ ద్విపద..

       ఘన శిష్య !  నీ విది గమనించి నావ !

       నా నోట వెలువద్ద  నవ వాక్యములను

       యక్షర సమములై  యలరారి   మిగుల

       నాల్గు పాదములుగా  నయముగా  నుండె

       లయ బద్ధముగ నుండి లాలిత్య మొప్పి

       ఘన వాద్య యుక్తమౌ గానంబు తోడ

       పాడుట కనువుగా పరికించ నుండె

       ఛందస్సు గూడియు చక్కగా నున్న

       యియ్యది "శ్లోక " మే యెంచి  గాంచంగ

       ఇందులో సందేహ మిసుమంత లేదు .      21 


సీ. వాల్మీకి యారీతి వచియించ శిష్యుడు

              పరవశ మొందెను పలుకులకును

    " మా నిషాద " యనెడి మధుర శ్లోకమ్మును

             మననంబు చేసెను మరియు మరియు

     ప్రాచేతసుండంత పావన జలముల

             స్నానము గావించి సంధ్య వార్చె

     అంత భరద్వాజు  డత్యంత శ్రద్ధతో

             సలిలంబు గైకొనె కలశమందు

తే. తపసి వాల్మీకి  తదుపరి తన్మయమున

     తనదు శ్లోకమ్ము  మనమున తలచు కొనుచు

     శిష్య వర్గంబుతోడను శీఘ్ర ముగను

     యాశ్రమము జేరె యాగమ క్రియల జరుప     22

*శ్రీ లలితా నామ వైభవం-10*

 *శ్రీ లలితా నామ వైభవం-10*


ఉద్యద్భానుసహస్రాభా_చతుర్భాహుసమన్వితా  

లలితాసహస్రనామస్తోత్త్రములో ఇక్కడ పెద్ద రహస్యము ఉన్నది. దేవతల ఆ కార్యము కోసమని వస్తున్న అమ్మవారిని వశిన్యాదిదేవతలు స్తోత్త్రము చేస్తూ కేశపాదాదిపర్యంతము అనగా తలదగ్గరనుంచి పాదములవరకు అందించారు. ముందు తల చెప్పకుండా చతుర్భాహుసమన్వితా అని తల, చేతుల గురించి చెప్పడానికి ముందు ఉద్యద్భానుసహస్రాభా చేతులు – ఆయుధములు చెప్పారు. ఉద్యద్భానుసహస్రాభా అనగా ఉదయిస్తున్న వేయిసూర్యుల కాంతి కలిగిన తల్లి. సూర్యుడు ఉదయిస్తున్న సమయములో కాంతి ఎంతో ఎఱ్ఱగా ఉంటుంది. వేయిమంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందన్న  ఊహకికూడా అందదు. ముందు ఎఱ్ఱటికాంతి కనపడుతున్నదని ‘ఉత్’ అన్న శబ్దము వేశారు. ఉత్ అనగా పైకెత్తడము. కొన్ని కోట్లజన్మల తరవాత ఈ నామము వినబడి లోపల దర్శనమయితే ఆ జీవుడి జీవయాత్రలో పైకి ఎక్కడము ప్రారంభమయింది. బ్రహ్మ, విష్ణు, శివుడనే మూడుతత్త్వములను కలిపి ముద్ద చేసిన ఒకగుళిక అన్నట్టుగా సూర్యబింబము ఉన్నది. లలితాపరాభట్టారిక ఎరుపురంగులో ఎందుకు ఉంటుంది? ఆకాశము అంతా ఆ కాంతితో నిండిపోయి అన్నీ లేత ఎరుపులోకి వచ్చేస్తాయి. అమ్మవారి ఆవిర్భావమును ఎర్రటికాంతితో ధ్యానము చేస్తే ఏమవుతుంది ? ఆ ఎరుపునకు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు చెప్పిన విషయమును పట్టుకుంటే జీవనయాత్రలో కొత్తమలుపు వస్తుంది. సూర్యబింబము ఉదయిస్తున్నప్పుడు ఎఱ్ఱటికాంతి – ‘శ్రీసరణిభిః’ ముందు వచ్చి కూర్చున్న ప్రాంతము అంతా ఎరుపులో మునిగిపోయి ఆ ఎరుపులో ధ్యానము చేస్తే ఊర్వశితో సహా మూడులోకములలోని దేవవేశ్యలు అంతా వశమైపోతారని అన్నారు. ఈ శ్లోకము స్త్రీలకు ఉపాసన చెయ్యడానికి, వృద్ధిలోకి వద్దామని అనుకున్న వారికి పనికిరాదు. జగద్గురువైన శంకరులు ఇటువంటి శ్లోకము ఇవ్వడమేమిటి? ఎరుపురంగు గురించి ఈ మాట చెప్పడము ఏమిటి? అనిపిస్తుంది. గురువుల బిగింపు చాలా విచిత్రముగా ఉంటుంది. వారి వెంటపడితే తప్ప దాని రహస్యము దొరకదు. మూడులోకములలోని అందగత్తెలు వశమయ్యారు అంటే మూడులోకములలోని ఆనందము ఏది ఉన్నదో అది తామైపోయి, జ్ఞాని అయి పూర్ణులయినట్టు. ఆనందమును బయట వెతుక్కోక లోపలే అనుభవిస్తూ ఆనందస్వరూపులై ఉంటారు. ‘చిదానంద రూపం శివోహం శివోహం’ అన్న భావనలు ఏర్పడడానికి కావలసిన అమ్మవారి అనుగ్రహపు ఎర్రటికాంతులను సూర్యమండలమునందు దర్శనము చేసి ఉపాసన చెయ్యడము. అమ్మవారి ఈ అనుగ్రహము ఎర్రగా ఉండే క్రియాశక్తిగా ఉంటుంది. అన్నిపనులు చేసే చేతిని క్రియాశక్తి అంటారు. కరమే కిరణము. ఆ కిరణముల వలన మొదట వచ్చిన కాంతి ఎరుపు. ఆ ఎరుపే అమ్మవారు. ఆవిడే భగవంతునిలో కలపగలదు. ఎరుపుని ధ్యానిస్తే పూర్ణత్వం వస్తుంది. ఈ ఎరుపు కారుణ్యము. ఈ ఎరుపులో రాజసం ఉన్నది. చిక్కబడిన ఎరుపు మెల్లగా ప్రవహిస్తుంది. పలుచగా ఉన్నది తొందరగా పరిగెడుతుంది.  అమ్మవారి అనుగ్రహము బాగా ప్రసరించి ఎరుపుతో కలసిపోయినవారు మెల్లమెల్లగా కదిలి వెళ్ళి ఈశ్వరునిలో కలసిపోతారు. గొప్ప అనుగ్రహము అక్కడ మొదలయితే అనుభవించవలసిన ఆనందము ఇంకొకటి ఉండదు.   అమ్మవారు అందరికీ దర్శనము కావాలన్న కోరికతో వశిన్యాదిదేవతలతో స్తోత్రము చెప్పిస్తూ ఈ కాంతి పడని వారికి తన దర్శనము కుదరదని, అలా తనను చూడలేని వారికి తల దగ్గరనుంచి చూడడము కుదరదని చెప్పింది. చేతులు క్రియాశక్తి. చేతుల వలన ఆ శక్తిని దర్శనము చేసి జీవితమును మార్చుకుంటున్నవారు వారిని తలనుంచి పాదముల వరకు చూడగలుగుతారు. అందుకని ముందు కాంతి మీద పడాలి. ఆవిడ ఆవిర్భావము ధ్యానము చేస్తే ఆ ఎరుపుకాంతిలో మునిగిపోతే ఆనాడు జన్మకు ధన్యత కలుగుతుంది. ఎరుపు దర్శనము చేసి అనుభవిద్దామని తాపత్రయము ఏర్పడనంత కాలము జీవయాత్ర సాగుతూనే ఉంటుంది. ఏదో ఒకనాడు ఒకసారి అమ్మవారి అనుగ్రహమును బలముగా సంపాదించుకుంటే వాళ్ళయందు క్రియాశక్తి ప్రారంభము అవుతుంది.  ఇది కేవలము ఒక శ్లోకములో చెప్పడము కాదు. గురుముఖతః తెలుసుకుని ధ్యానములో అనుభవించగలగాలి. గురువు అనుగ్రహముగా ముడి విడిపోతే ధ్యానము చేసి పూర్ణులు కావాలి. ఎరుపుకాంతి వెనక ఇంత రహస్యము ఉన్నది.


*శ్రీ మాత్రే నమః*

శ్రీలలితా సహస్రనామ వివరణ

 🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*74.భండపుత్ర పధోద్యుక్త శక్తి విక్రమ నందితా*


భండాసురుని కుమారులు ముప్పైమంది. వారిని వధించడంలో బాలాత్రిపురసుందరీ దేవి చూపించిన విక్రమమునకు శ్రీదేవి చాలా ఆనందించింది. 'బాలా దేవి శ్రీలలితా అమ్మవారి కుమార్తె, ఆమె పరమేశ్వరి యొక్క ఆత్మనుండి పుట్టినది.


బాలాదేవి' అనగా "విమర్శనా శక్తి". అది అన్ని బంధనములను తొలగించుతుంది. ముక్తికి' అడ్డుగా నిలచే రకరకములైన రాక్షస స్వభావములన్నీ నశించిపోతాయి.


యుద్ధములో శ్రీమాతకు రెండువేపులా శ్యామలా దండనాయికలూ ముందూ వెనుకా సంపత్కరీ, అశ్వారూఢలూ కాపుగా వుండగా 'భండుని' కొడుకులు ముప్పైమంది వెనక నుండి ముట్టడించారు. అప్పుడు తొమ్మిదేండ్ల వయసుగల 'బాల' వారిని ఎదుర్కొని చంపి

వేసింది


శ్రీమాత తనకుమార్తెకు తన ఆయుధములలో కొన్ని యిచ్చింది. తల్లి కుమార్తె బాల యొక్క పరాక్రమం చూసి చాలా ఆనందించింది.


కం|| భండాసుర సంతానము

చండాడగ నుద్యమించు, సరణికి బాలా

మెండగు ముప్పది పుత్రుల మండించగ, జూచినంబ మదిమరి విరిసెన్!


         లలితానామసుగంధం

                   M.s.s.k

*శ్రీ లలితా నామ వైభవం-9*

 *శ్రీ లలితా నామ వైభవం-9*

చిదగ్నికుండ

సంభూతా అనగా ప్రభవించినది అని అర్థము. లోకములో ఏ ప్రాణి అయినా అగ్నిలో తన రూపము కోల్పోతుంది. సంభవించే ప్రాణి ఉంటుందా! ఆవిడ పుట్టినది మామూలు అగ్నికుండము కాదు చిదగ్నికుండము. భండాసురుడు పెట్టే బాధలు భరించలేక దేవతలు అందరూ కలిసి పెద్ద హోమకుండము ఏర్పాటు చేసి, పరమశివుడు తెచ్చిన వాయువును అగ్నిగా నిక్షేపించి, అందులో మామూలు కట్టెలు వెయ్యకుండా తమ శరీరభాగములను హవిస్సులుగా సమర్పిస్తే, దేవతలు భండాసురుని చేత భాధలు పొందుతున్నారని వాడిని నిర్జించడానికి అమ్మవారు ఆ అగ్నిహోత్రము నుంచి పైకి వస్తున్నది. చిదగ్నికుండము అందరిలో ఉంటుంది. అందులోనుంచి ఆవిర్భవిస్తున్న అమ్మవారిని చూడాలి అంటే కళ్ళు మూసుకుని లోపలికి వెళ్ళాలి. మనలోనే ఉన్న చిదగ్నికుండము కట్టెలు లేకుండా ఎలా ప్రకాశిస్తున్నది అనగా జ్ఞానమనే అగ్ని ప్రకాశిస్తూ ఉంటుంది. అగ్నికి వేడి ఒక్కటే కాక ప్రకాశము కూడా ఉంటుంది. ప్రకాశము కలిగిన జ్ఞానము, అజ్ఞానమనే చీకటిని తీసేస్తుంది. అజ్ఞానము పోతే మోక్షయోగ్యత కలుగుతుంది. ‘బ్రహ్మసత్యం – జగత్ మిథ్య’ అన్న భావము అనుభవములోకి వస్తే జ్ఞానం. నామరూపములు కనపడుతుంటే మాయ. ఈ మాయను దాటాలి అంటే అమ్మవారి అనుగ్రహము ఉండాలి. ఇంకొకటి కనపడదు అంతటా ఈశ్వరుడే కనపడతాడు. ఆ ప్రకాశములో అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. చిదగ్నికుండసంభూతా అన్నప్పుడు ఆవిడ ఆవిర్భవిస్తు పైకి వస్తున్న స్వరూప దర్శనము ప్రారంభమయితే దేవతల కార్యము కొరకు రావడము లేదు అన్నది గ్రహించ గలుగుతారు. హాయిగా తిని, హాయిగా తిరిగి, హాయిగా పడుకోవాలని అనుకుంటూ ఎప్పుడూ హాయి హాయి హాయి అనేవాడు మనలోనే ఉన్న భండాసురుడు. ఎప్పుడూ ఈ శరీరముతో తాదాత్మ్యత చెందుతూ దానికి సుఖముగా ఉన్నది చూడాలనుకునే ఈ భండప్రవృత్తిని నశింప చెయ్యడానికి అమ్మవారు వస్తున్నది. రాక్షసులు మన దేహములోనే ఉంటారు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములనే ఆరుగురు దొంగలు జ్ఞానమనే రత్నమును అపహరించుకుని పోవాలని చూస్తుంటారు. ‘అమ్మా ! ఈ రాక్షస బాధ పడలేకపోతున్నాను. నువ్వే రక్షించి సత్వగుణమును ప్రవేశ పెట్టాలి’ అని శరణాగతి చేసే భక్తులలో ఆవిర్భవించి వారిని తన మార్గములో తిప్పుకుంటుంది. దేవకార్యము అంటే లోపల ఉన్న మంచి లక్షణములను రక్షించి చెడ్డ లక్షణములను పోగొడుతుంది. అలా రక్షించే సౌజన్యమే దేవకార్యసముద్యత.


*శ్రీ మాత్రే నమః*

దృష్టి ఎట్టిదో - సృష్టి అలా

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

*మన దృష్టి ఎట్టిదో - సృష్టి అలా కనబడుతుంది*

         🌷🌷🌷

మన ఆలోచనలే మన లోచనాలు, లోచనాలు అంటే కళ్ళు.   మనం ఎలా ఆలోచిస్తే మన కళ్ళు అలా చూస్తాయి.

మన ఆలోచనలు మంచివైతే మనకళ్ళకి అన్నీ మంచిగానే కనబడతాయి.  అలాగే మన ఆలోచనలు చెడ్డవైతే మనకు అన్నీ చెడ్డగానే కనబడతాయి. 

అవే మన మనోనేత్రాలు, అందుకే ఎప్పుడూ మంచిగానే ఆలోచించాలి, అన్నింటిలోనూ మంచినే చూడాలి.


ఇద్దరు వ్యక్తులు చంద్రునిపైనున్న మచ్చలను చూస్తున్నారు.  అందులో ఒకాయన అన్నాడు.”ఆహా! ఆ మచ్చలను చూడండి, అచ్చం దేవాలయ గోపుర శిఖరాల్లా ఉన్నాయి“ అని అంటే

దానికా రెండో ఆయన “అబ్బే, అవేం కాదండీ, అవి ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు ముద్దాడుకుంటున్నట్లు ఉన్నాయి చూడండి” అన్నాడు.


మొదటి ఆయన ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే రెండో ఆయన శృంగార పరంగా చూసేడు.

అవే మచ్చలు, కాని చూడడంలో తేడా, మన మనసెలా ఉంటే మన పరిసరాలు అలా అనిపిస్తాయి.

మనం సంతోషంగా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఆనందమయంగా కనిపిస్తుంది.  అదే మనం విచారంగా ఉంటే ప్రపంచం అంతా దుఃఖ మయంగా కనిపిస్తుంది.


ఒక పాదచారి నడుచుకుంటూ వెళ్తూ త్రోవలో రోడ్డు ప్రక్కన ఒక వ్యక్తి అచేతనంగా పడి ఉండడం చూసి “పీకల దాకా త్రాగి ఉంటాడు, అందుకే పడిపోయేడు” అనుకుంటూ వెళ్లిపోయేడు.  అదే దారిన వెళ్తున్న మరొకతను చూసి “అయ్యో పాపం, స్పృహ తప్పి పడిపోయినట్లున్నాడు” అని చల్లని నీళ్ళు తెచ్చి ఆ వ్యక్తి ముఖం మీద జల్లేడు.  వెంటనే అతను తేరుకున్నాడు.  మొదటి ఆయన ఆలోచనను బట్టి అతనికి ఆ వ్యక్తి అలా కనిపించేడు.  ఇంక రెండో ఆయన విధానం వేరు, అంచేత ఆయనకు అదే వ్యక్తి మరోలా కనిపించేడు.


అలాగే రామాయణాన్ని ఒక కథగా అనుకుంటే కథలాగే అనిపిస్తుంది.  అలా కాకుండా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అందులోని అంతరార్థం బోధపడుతుంది.  శ్రీరాముడు పరమాత్మ, సీతమ్మ జీవాత్మ. ప్రతి మానవుని దేహం లంకా నగరం.  ఈ లంకాద్వీపమనే దేహంలో బంధింపబడిన సీతమ్మ అనే జీవాత్మ శ్రీరాముడనే పరమాత్మను చేరుకోవాలని కోరుతుంటుంది.


కాని రాక్షసులు దానిని జరుగనీయరు.  రాక్షసులు అంటే మానవునిలోని రజో, తమో గుణాలు. 

ఈ రజో, తమో గుణాలు సీత అనే జీవాత్మను శ్రీరాముడనే పరమాత్మతో కలుసుకో నీయకుండా దేహమనే లంకలో బంధించి ఉంచాయి. 

అలా బంధింపబడి శ్రీరాముని కలుసుకోగోరే సీతమ్మ వద్దకు హనుమంతుడనే గురువు వస్తాడు.  శ్రీరాముని అంగుళీయకం ఆమెకు చూపిస్తాడు, సకల భ్రాంతులను రూపు మాపే బ్రహ్మజ్ఞానమే ఆ అంగుళీయకం.


ఈ విధంగా శ్రీరాముని చేరడానికి సీతమ్మకు మార్గమేర్పడుతుంది.  అంటే గురువు వలన పొందిన బ్రహ్మజ్ఞానమే జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావడానికి మార్గదర్శనం చేస్తుంది.


         *🌹శుభమస్తు🌹*

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

5, జనవరి 2021, మంగళవారం

బ్రాహ్మణా సాంప్రదాయ క్యాలండరు 2021

బ్రాహ్మణా సాంప్రదాయ క్యాలండరు 2021 కొరకు క్రింద క్లిక్ చేయండి  


https://drive.google.com/file/d/1W8q4AQbOdKzi0Vh4o3H4Rxd4xt4vKiRn/view?usp=sharing

శ్రీ రామ తీర్థం

 🌹శ్రీ రామ తీర్థం 🌹


   ✍️హిందువులకు ఆరాధ్య దైవం, ఆదర్శ ప్రభువు శ్రీ రామ చంద్ర స్వామి. 


భారత దేశ నలుమూలలా ప్రతి ఒక్క పల్లెలో అయోధ్య రాముని ఆలయం ఉంటుందంటే అతిశయోక్తి లేదు.   భదాద్రికి ( భద్రాచలం) సరి సమానమైన రామ క్షేత్ర అన్వేషణలో ప్రముఖంగా వినిపించిన రెండు క్షేత్రాలు ఒంటిమిట్ట ( కడప జిల్లా), మరియు శ్రీ రామ తీర్థం ( విజయనగరం ). 


పూసపాటి రాజుల రాజధాని నగరంగా చరిత్రలో సుస్థిర స్థానం కైవసం చేసుకొని పాత కొత్త సంస్కృతులకు, పురాతన మరియు నూతన నిర్మాణాలకు కూడలిగా ఉత్తరాంధ్ర లో ఉన్నప్రసిద్ద నగరం  విజియనగరం. ఈ రాజ వంశం వారు నిర్మించిన నూట ఆరు ఆలయాలలో శ్రీ రామ తీర్థం ఒకటి.


 


సన్నటి తారు రోడ్డుకు ఎడమ పక్కన నున్నగా, పచ్చదనం లేకుండా ఉన్న బోడి కొండలు.


కుడిపక్కన నాలుగు వందల సంవత్సరాల క్రిందట నిర్మించిన ఆలయం.

కొద్దిగా ఎత్తులో చుట్టూ ప్రహరీ గోడతో ఉన్న ఆలయ ప్రాంగణానికి ఉత్తరం పక్కన నూతనంగా అయిదు అంతస్థుల గాలి గోపురం నిర్మించారు.


పది ఎకరాల పై చిలుకు విస్తీర్ణంలో ఉన్న "భాస్కర పుష్కరణి", ఈ క్షేత్రంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న స్థలాలలో ఒకటి.

నేడు ఆలయంలో పూజలు అందుకొంటున్న మూల విరాట్టులు ఎవరి కంట పడకుండా వెయ్యి సంవత్సరాలు అజ్ఞాత వాసం చేసినది ఈ సరస్సులోనే !

అందుకే భక్తులు ఈ నీటిని గంగా జల సమానంగా పరిగణిస్తారు.


 


నీరు నిండిన పిడతల పైన ప్రమిదలను ఉంచి దీపం వెలిగించి ప్రార్ధిస్తే మనోభిష్టాలు నెరవేరుతాయి అన్నది భక్తుల విశ్వాసం.

ఇలా దీపాలు వెలిగించడానికి ఈశాన్యం లో శ్రీ లక్ష్మీ నారాయణ రూపాలను నెలకొల్పారు.

పచ్చగా పాచిపట్టినా, తామర పుష్పాలతో, ఆకులతో ఆకర్షణీయంగా ఉన్న కోనేరులో ముఖ పాద హస్తాలను పరిశుబ్ర పరుచుకొని ఆలయం వైపు వెళతారు భక్తులు.


 


 ఉత్తరం వైపు రాజ గోపురం ఉన్నాప్రధాన ద్వారం మాత్రం తూర్పునే !

విరాట్ నిర్మాణాలు లేవు.

ద్వారానికి పైన గుమ్మటం లాగా ఉన్న నిర్మాణాలున్నాయి.

కళింగ ప్రాంత నిర్మాణ శైలి.

ఇలాంటివే శ్రీ కూర్మం, అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాలలో ఉంటాయి.


ద్వారం వద్ద రాతి మీద ఆలయ పురాణ చారిత్రక గాధల వివరాలను చెక్కి భక్తుల కొరకు ఉంచారు.

దాని ప్రకారం క్షేత్ర పురాణ గాధ ద్వాపర యుగం నాటిదిగా అర్ధమౌతుంది.

మాయా జూదంలో ఓడిన పాండు నందనులు అరణ్య వాసానికి తరలి వెళుతున్న సమయంలో శ్రీ కృష్ణుడు వారికి సీతా లక్ష్మణ సమేత శ్రీ రామ విగ్రహాలను ప్రసాదించి, భక్తి శ్రద్దలతో పూజిస్తే వనవాస కాలం చక్కగా గడిచి పోతుంది అని తెలిపారట.


అలానే చేస్తూ వచ్చిన పాండవులు వనవాస ఆఖరి రోజులు ఇక్కడ గడిపి, అజ్ఞాత వాసానికి వెళుతూ విగ్రహ సంరక్షణ,  పూజాదికాల భాద్యత " వేద గర్భుడు" అనే బ్రాహ్మణునికి అప్పగించారట.

నాటి నుండి అనేక శతాబ్దాల పాటు ఆయన వంశం వారే ఇక్కడ నీలాచల పర్వత పై భాగాన పాండవులు నిర్మించిన ఆలయ నిర్వహణా భాద్యతలను చూసుకోనేవారట.

కానీ క్రీస్తు శకం రెండో శతాబ్ద కాలానికి ఈ ప్రాంతంలో ఒక దాని తరువాత ఒకటిగా జైనం మరియు బౌద్ధం ప్రాబల్యాన్ని సంతరించుకొన్నాయి.


వారి విగ్రహారాధనకు వ్యతిరేకులు.

నాటి జైనుల మరియు బౌద్దుల స్థూపాలను, ఆరామ, విహారాల శిధిలాలను పక్కనే ఉన్ననీలా చల , ఘని, దేవభక్తుల కొండల మీద నేటికీ చూడవచ్చును.

తూర్పు చాళుక్య రాజు విమాలదిత్యుని ( 1011 - 1022) కాలం నాటి శాసనం పర్వతం పైన ఆంగ్ల పరిశోధకులకు పంతొమ్మిదో శతాబ్దంలో లభించినది అంటారు.

వారి ప్రభావం వలన  వేద గర్భుని వంశీకులు విగ్రహాలను నీటి మడుగులో దాచి ప్రాంతం విడిచి వెళ్లి పోయారట.

అలా సుమారు వెయ్యి సంవత్సరాలు అజ్ఞాతంగా నీటిలో ఉండిపోయిన శ్రీ రాముడు తిరిగి పదిహేడో శతాబ్దంలో ఆలయ ప్రవేశం చేసిన ఉదంతం కూడా విశేషమైనదే!


ఇక్కడికి సమీపంలోని "కుంభిలాపురం " ( నేటి కుమిలి) రాజధానిగా చేసుకొని పదహారో శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించే వారు పూసపాటి వంశం వారు.

నాటి ప్రజలలో చాలా మంది అటవీ సంపద మీద ఆధారపడి జీవనం సాగించేవారట.

అలాంటి వారిలో పుట్టు మూగ అయిన ముదుసలి కూడా ఒకరు.

ఒక నాడు ఆమె అడవిలోనికి వెళ్ళిన  సమయంలో తీవ్ర గాలులతో పెద్ద వర్షం కురిసిందట.

ముసలమ్మ భయపడిపోయి ఒక చెట్టు క్రింద వానకు తడుస్తూ వణుకుతూ రామనామ జపం చేయసాగిందట


ఆ సమయంలో  ఆమెకు శ్రీ రామచంద్రుడు దర్శనమిచ్చి భయపడవలదని, వాక్కును ప్రసాదించి, తను సమీపంలో ఉన్న కోనేరులో ఉన్న సంగతి తెలిపారట.

వాన వెలసిన తరువాత నగరానికి తిరిగి వచ్చిన పుట్టు మూగ మాట్లాడటం తెలిసి పిలిపించుకొన్న రాజు శ్రీ సీతా రామ చంద్ర గజపతి విషయం తెలుసుకొని తరలి వెళ్లి విగ్రహాలను వెలికి తీసి కొండ పైన, క్రింద ఆలయాలను నిర్మించారట.

తీర్ధం ( జాలం) లో లభించిన శ్రీ రామడు  కొలువుతీరిన క్షేత్రంగా "శ్రీ రామ తీర్థం " అన్న పేరోచ్చినది.


 


 ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే అంతర భాగంలో ప్రహరీ గోడకు  ఆనుకొని నలు వైపులా మండపం నిర్మించారు.

బహుశా యాత్రీకులు సేద తీరడానికి ఉద్దేశించి కాబోలు అనిపించింది,

 ఎదురుగా  ధ్వజస్థంభము,బలి పీఠం. ముఖ మండపం లోనికి ప్రవేశ ద్వారం.


ప్రదక్షిణా ప్రాంగణంలో దక్షిణం వైపున పాత ఉప ఆలయాల స్థానంలో పునః నిర్మించిన శ్రీ వైకుంఠ స్వామి మరియు శ్రీ మాధవ స్వామి కొలువై ఉంటారు. 


పడమర వైపున శ్రీ ఆండాళ్ పురాతన ఉపాలయం. 


ఉత్తరాన శ్రీ భూ భుజంగ వరాహ లక్ష్మి నరసింహ స్వామి మరియు శ్రీ వేణుగోపాల స్వామి ఉపాలయాలు ఉన్నాయి. 


రాయి సున్నమూ కలిపి నిర్మించిన మండపాలు, స్థంభాల పైన  ఎలాంటి శిల్పాలు చెక్కడాలు లేవు.


అమ్మవారి ఆలయంలో స్థంభాల అమరిక ప్రత్యేకంగా కనిపించినది. దగ్గర దగ్గరగా అమర్చారు.

వాయువ్యంలో కళ్యాణ మండపం.

ఈశాన్యంలో శ్రీ రామ క్రతు స్థంభం.

ఇక్కడ మాత్రం రెండు స్తంభాలు  ప్రత్యేకంగా కనిపిస్థాయి. పీఠ భాగంలో మరో రెండు స్థంభాల పైన భిన్న రూపాలలో శ్రీ ఆంజనేయుని మలచారు.దశావతార మరియు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రూపాలు కూడా కనిపించాయి.

ప్రాంగణంలో అనేక కూర్మావతార సజీవ రూపాలు తిరుగాడుతూ కనపడతాయి.


ప్రదక్షిణ పూర్తి చేసుకొని విశాలంగా ఉన్న అర్ధ మండపం దాటితే ఉన్న గర్భాలయంలోనాలుగు అడుగుల గద్దె మీద  పుష్ప స్వర్ణా భరణ భూషితులై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామ స్వామి నయన మనోహరంగా దర్శనమిస్తారు.


సహజంగా మూడు విగ్రహాలకు కలిపి ఒకే మకర తోరణం ఉంటుంది అన్ని ఆలయాలలో !

కానీ ఇక్కడ గమనింప దగిన అంశం ఏమిటంటే,మూడు భాగాలుగా విభజింపబడిన పెద్ద మకర తోరణం విగ్రహాల వెనక అమర్చడం !


ఆలయ చరిత్ర లాగే పక్కన ఉన్న మూడు పర్వతాలు కూడా భిన్నమైన చరిత్రను తెలుపుతాయి. 


 నీలాచలం మీదనే పాండవులు నివాసముండే వారట. దానికి నిదర్శనంగా ఐదు గదులుగా ఉండే కొండ గుహలను "పాండవుల పంచలు " అని, పక్కనే గుహలో ఉన్న గుర్తును " భీముని బుర్ర" అని పిలుస్తారట.

నిరంతరం నీటితో నిండి ఉండే "పాతాల గంగ" , బుద్దుని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయట.


పక్కనే ఉన్న దుర్గ లేదా గురుభక్తుల కొండ క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుండి క్రీస్తు శకం ఆరో శతాబ్దం వరకూ ఇక్కడ నివసించిన జైనుల స్థూపాలు ఇతర నిర్మాణాలు ఉంటాయట. తదనంతర కాలంలో ప్రతిష్టించిన ఆరు అడుగుల ఎత్తు  శ్రీ దుర్గా దేవి విగ్రహం అదనపు ఆకర్షణగా పేర్కొన్నారు.

చాళుక్య రాజు విమలాదిత్యుని శాసనం ఈ కొండ మీదే లభించినదట.


మూడోది అయిన  ఘని లేదా బౌద్దుల కొండ మీద బుద్దుని విగ్రహాలు, శిధిలావస్థలో ఉన్న ఆరామ విహారాలు, నీటి మడుగు ఉంటాయట.

స్కాంద పురాణం నుండి అనేక గ్రంధాలలో, కీర్తనలలో శ్రీ రామ తీర్థ ప్రాశస్త్యం గురించి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

అపర ఆదిశేషుని అంశగా పేర్కొనే శ్రీ వైష్ణవ ఆచార్యులు శ్రీ రామానుజులు శ్రీ రామ తీర్థం సందర్శించినట్లుగా ఆయన గురించి రచించిన తమిళ గ్రంధాలలో ప్రస్తావించబడినది.


ఎందరో కవులు శ్రీ రామ తీర్థం విశిష్టతను తమ రచనలలో కొనియాడారని తెలుస్తోంది.

భావకవి ఆంధ్రా షెల్లీ గా ప్రసిద్దులైన శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు తన తోలి కవిత రచించినదిక్కడే !

అభ్యుదయ కవి ఈ యుగం నాదేనని సగర్వంగా ప్రకటించుకొన్న శ్రీ శ్రీ గారి వివాహం జరిగింది కూడా శ్రీ రామ తీర్థం లోనే !!


ప్రతినిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

ధనుర్మాసంలో, పర్వదినాలలో ఈ సంఖ్యా వేల కు పెరుగుతుందని అదే శ్రీ రామనవమి మరియు శివరాత్రి సంబరాలకు లక్షకు పైగా ఉంటుందని తెలిపారు.

శివరాత్రి అత్యంత వైభవంగా జరిపే వైష్ణవ క్షేత్రం శ్రీ రామ తీర్థం.


దీనికి తగినట్లుగా క్షేత్ర పాలకుడు "శ్రీ సదా శివ స్వామి" ఆలయం పక్కనే ఉంది.

చిన్న ఆలయం .

పెద్ద లింగం .

మరోసారి క్షేత్రాన్ని సందర్శించే భాగ్యం కలిగించమని క్షేత్ర పాలకునికి వినమ్రంగా విన్నవించుకొంటే కోరిక నెరవేరుతుందని నమ్మకం.


శ్రీ రామ నవమి, బ్రహ్మోత్సవాలలో లక్షల సంఖ్యలో భక్తులు ఒడిష, ఆంధ్రా ప్రాంతాల నుండి వస్తారు.

విశేష పూజలు, అలంకరణలు, అర్చనలు మరియు ఆరగింపులు ఘనంగా జరుపుతారు.

మూడు మతాలకు కూడలిగా పేర్కొనదగిన శ్రీ రామ తీర్థం విజయ నగరం పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది.


సోర్స్ :- విజయనగరం మిత్రులు రామకృష్ణ మరియు చందు గారి దగ్గర తీసుకున్న సమాచారం.

దేవాలయ దర్శనంలో

 _*💫 మన దేవాలయ దర్శనంలో ఉన్న  సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 🥀*_


_*1. మూలవిరాట్ :* భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి._


_*2. ప్రదక్షిణ :* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి._


_*3. ఆభరణాలతో దర్శనం :* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని..._


_*4. కొబ్బరి కాయ :* ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం..._


_*5. మంత్రాలు :* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి._


_*6. గర్భగుడి :* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు._


_*7. అభిషేకం :* విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం._


_*8. హారతి :* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు._


_*9. తీర్థం :* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._


_*10. మడి :* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!_


🙏🇮🇳😷🌳🏵️🌐🤺🥀

తిరుప్పావై ప్రవచనం‎ - 20 వ రోజు

 _*తిరుప్పావై ప్రవచనం‎ - 20 వ రోజు*_ 




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*ఈ సంసార తాపాన్ని తొలగించగలిగేది కేవలం హరి సరస్సు మాత్రమే*

     



☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️




*20. వ పాశురము*



*ముప్పత్తు మూవర్* *అమరర్క్కు మున్ శెన్ఱు*

*కప్పం తవిర్క్కుం కలియే !* *తుయిల్ ఏరాయ్*

*శెప్పం ఉడైయాయ్ !* *తిఱలుడైయాయ్ శేత్తార్క్కు*

*వెప్పం కొడుక్కుం విమలా ! తుయిల్ ఎరాయ్*

*శెప్పన్న మెల్ - ములై* *చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్*

*నప్పినై నంగాయ్ ! తిరువే ! తుయిలెరాయ్*

*ఉక్కముం తట్టొళియుం తందు ఉన్ - మణాళనై*

*ఇప్పోదే ఎమ్మై నీరాట్టు - ఏలోర్ ఎంబావాయ్*



అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం , మరి అమ్మను కఠినంగా మట్లాడితే స్వామికి కష్టంగా అనిపిస్తుంది , నిన్న మన వాళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడే సరికి స్వామికి కొంచం కోపం వచ్చింది , అందుచే స్వామి లేచి రాలేదు. ఈ రోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తారు , ఆయనలో ఉండే జ్ఞానం , శక్తి , బలం , ఋజుత్వం ఇలాంటి గుణాలతో కీర్తిస్తారు. అయినను లేవలేదని , ఆయనకు ఆనందాన్నిచ్చేలా అమ్మను కీర్తిస్తారు.


ఆండాళ్ తల్లి స్వామిని మేల్కొనడానికి ఆయన వైభవాన్ని చెబుతున్నారు , *"ముప్పత్తు మూవర్ అమరర్క్కు"* ముప్పై మూడు వర్గాల దేవతలను *"మున్ శెన్ఱు"* ఆపద రానికంటే ముందే వెళ్ళి కాపాడే *"కప్పం తవిర్క్కుం కలియే !"* గొప్ప బలం కలవాడివే. *"తుయిల్ ఏరాయ్"* లేవవయ్యా. చావు అంటూ లేని దేవతలనేమో వారు పిలవకముందే వెళ్ళి కాపాడుతావు , ఏమాత్రం కోరిక లేకుండా , కేవలం నివ్వు ఆనందంగా ఉంటే చూసిపోవాలని కాంక్షించే మాలాంటి వాళ్ళను మాత్రం కాపాడవా , మేం నీదగ్గరికి రావడం తప్పైందా.


 *"శెప్పం ఉడైయాయ్! "* సత్య పరాక్రమశాలీ , అడిన మాట తప్పని వాడా , నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి , మాట ఇచ్చి , ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా , ఎమైంది నీ మాట. *" తిఱలుడైయాయ్"* సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా !, *"శేత్తార్క్కు వెప్పమ్కొడుక్కుం విమలా !"* శత్రువులకు దుఖాఃన్ని ఇచ్చే నిర్మలుడా , ఏ దోశం అంటని వాడా. *"తుయిల్ ఎరాయ్"* నిద్ర లేవయ్యా.


అయితే స్వామి లేవకపోయే సరికి , అయితే నిన్న వీళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారు ఇలా. *"శెప్పన్న మెల్ - ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్"* సముదాయ అంగ సౌందర్యం కల్గి , *"నప్పినై"* స్వామి సంబంధంతో *"నంగాయ్ !"* పరి పూర్ణమైన అందం కలదానా ! *"తిరువే !"* సాక్షాత్తు నీవే లక్ష్మివి *"తుయిలెరాయ్"* అమ్మా మేల్కో. 


వీళ్ళ ప్రార్థనకి అమ్మ కరిగి , లేచి వీళ్ళ దగ్గరకు వచ్చి , ఏం కావాలర్రా అని అడిగింది. *"ఉక్కముమ్"* స్నానానికి తర్వాత మాకు స్వేదం ఏర్పడితే దాని అపనౌదనానికి విసనకర్ర కావాలి , *"తట్టొళియుమ్"* స్నానం తర్వాత అలకరించు కోవడానికి ఒక నిలువుటద్దం కావాలి , *" తందు"* ఈ రెండు ఇచ్చి *"ఉన్మణాళనై"* నీ స్వామిని *"ఇప్పోదే"* ఇప్పుడే *"ఎమ్మై"* మాతో కలిపి *"నీరాట్టు"* నీరాడించు. ఇలా అడగటం మనకు కొంచం ఎలాగో అనిపిస్తుంది. బాహ్యంగా చూస్తే తప్పు కదా అనిపిస్తుంది. కాని దోషమేమి లేదు.


పురుషుడు ఆయనొక్కడే మిగతా జీవ వర్గం అంతా ఆయనకు చెందిందే. అందులో కొందరు ముందు ఉన్న వారుంటారు , కొందరు వెనక ఉన్న వారుంటారు. ముందున్న వారు వెనక వాళ్ళకు మార్గ నిర్దేశం చేస్తారు. అక్కడ పరమ పదంలో నిత్యశూర వర్గానికి చేందిన వారిలో మొదటిదైన లక్ష్మీదేవి , ఆ తత్వాన్ని తెలిసిన వారు , ఆ తత్వాన్ని సరిగా చూప గలిగిన వారు. మనం కొత్తగా ఒక ఊరుకి వెళ్ళి అక్కడ చెఱువులో స్నానం చేయాలంటే ఆ వూరి గురించి బాగా తెలిసిన వారి సలహాతో చేస్తాం కదా , అలాగే. 


కులశేఖర ఆళ్వార్ పరమాత్మను గురించి చెబుతూ


*"హరి సరస్సివి గాహ్య ఆపీయ తేజోజలౌగం*

 *భవమరు పరి ఖిన్నః ఖేదమద్య త్యజామి"*

 

హరీ అనేది ఒక గొప్ప సరస్సు , సంసార తాపాన్ని తొలగించ గలిగేది అదే. అందులో అందరూ మునగాల్సిన వాళ్ళే. తాపం తగ్గాలనుకొనేవారంతా అక్కడే మునగాలి , వీళ్ళు వాళ్ళు అని నియమం లేదు. జీవులమైన మనకు కానీ పరమ పదంలోని నిత్యశూరులకు గాని ఉన్నది ఒకే సరస్సు , అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపం అంతా తొలుగుతుంది.  


ఆ హరి సరస్సు గురించి తెలిసిన దానివి , నీవు మార్గం చూపిస్తే మెం దాంట్లో ప్రవేశించగలం అని , అమ్మ ఆండాళ్ తల్లి నీళాదేవిని అదే కోరుతుంది. పరమాత్మను చేరటానికి అమ్మ ఒక ప్రాపకురాలుగా పని చేస్తుంది. భగవంతుని యోక్క కళ్యాణగుణాల జలాలలో మనం నీరాడుతాం. దాన్నే మనకు తిరుప్పావై అందిస్తోంది. ఇప్పుడు అమ్మ కూడా వీళ్ళతో కల్సి మార్గ నిర్దేశం చేస్తుంది. రేపటి నుండి స్వామిని అందరూ కల్సి మేల్కోల్పుతారు .

కాళిదాస మహాకవి

 కొన్ని భోజ కాళిదాస కథలలో మహాకవిని స్త్రీ లోలుడిగా చిత్రీకరించారు.కవిగా,లలిత శృంగార రస పోషణ లో 

ఆయన అందె వేసిన చెయ్యి కావటం వల్ల ఇలాంటి అపోహ కలిగిందా? లేక కాళీ  ఉపాసనతో పాటు కేళీ పిపాస 

కూడా ఆయన జీవితం లో భాగంగా చెప్తే ఈ కథలు మరీ ఆసక్తి కరంగా వుంటాయని యిది ఈ కథలకు జోడించ 

బడిందా? లేక 'ఎంత వారలయినా కాంత దాసులే' అన్న లోకోక్తి ని కాళిదాసు కూడా పూర్తిగా అనువర్తించాడా?

చెప్పడం కష్టం.


ధారానగరం లో రమణీ మణి అనే రాజ నర్తకి వుండేది. ఆమె సౌందర్యానికి నాట్య ప్రతిభకీ దాసుడై రాజు ఆమెను తన ఉంపుడుగత్తె గా వుంచుకున్నాడు.ఆమెకు కాళిదాసు కవిత్వమంటే చాలా అభిమానం.ఆయనతోనూ ఆమెకు సంబంధాలుండేవి.ఈ రహస్యం ఆమె రాజుకు తెలియకుండా జాగ్రత్త పడింది.

అయినా కొన్నాళ్ళకు రాజుకు అనుమానం వచ్చింది. ఆయన దాన్ని తెలుసుకునేందుకు ఒక ఉపాయం చేశాడు

రాజు ఆమె భవనానికి వచ్చినప్పుడు గోడ మీద శ్లోక పాదం వ్రాశాడు.


'కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే న తు దృశ్యతే'

అర్థము:-ఒక పువ్వులో నుంచి మరో పువ్వు పుట్టటం వినటమే గానీ ఎక్కడా కనబడదు. 


ఈ శ్లోకం పూర్తిచేసిన వారికి అక్షర లక్షలు యిస్తానని భోజుడు రమణి తో చెప్పాడు.ఒక వేళ కాళిదాసు ఇక్కడికి వచ్చినట్టయితే తప్పక పూర్తి చేస్తాడు,అప్పుడు రహస్యం బట్ట బయలవుతుందని ఆయన ఉద్దేశ్యం 

యింత పెద్ద బహుమతి అంటే రమణికి ఆశ పుట్టింది.

ఈసారి కాళిదాసు వచ్చినప్పుడు ఆమె గోడమీది శ్లోక పాదం చూపించి నా కోసం దీనిని పూర్తి చేయండి అని కోరింది.ఇదేమీ తెలియని కాళిదాసు చెప్తాను రాసుకో అని 


'బాలే, తవ ముఖాంభోజే దృష్టం యిందీవర ద్వయం'

అర్థము:-- కానీ ఓ ముద్దరాలా యిప్పుడు నిన్ను చూడగా,నీ ముఖ మనే తామరపువ్వులో నీ కన్నులనే నీలి కలువలు పుట్టినట్టు కనిపిస్తున్నాయి సుమా!అన్నాడు మహా కవి.


అంత చక్కని పూరణ వినగానే రమణికి మతి పోయింది.ఈ పూరణ రాజుకు చూపిస్తే తనకు అక్షర లక్షలు ఖాయం.అనుకోని దురాశ తో కాళిదాసు నిద్రిస్తుండగా ఆయన తల నరికేసి శవాన్ని దాచేసింది.

రాజుగారు వ్రాసిన దానికిందే తన చేత్తో కాళిదాసు పూరణను కొంచెం మార్చి 'బాలే' అనే పదం కాక రాజును వుబ్బేద్దామని 'రాజే!'అని వ్రాసింది


కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే న తు దృశ్యతే 

రాజే,తవ ముఖాంభోజే దృష్టం యిందీవర ద్వయం 

అర్థము:-- ఒక పువ్వులోనుంచి యింకొక పువ్వు పుట్టటం వినడమే గానీ ఎక్కడా కనబడదు.కానీ యిప్పుడు నిన్ను చూస్తె రాజా!నే ముఖమనే కమలం లో కన్నులనే నల్ల కలువల జంట కనబడుతున్నది.


రాజు రానే వచ్చాడు పూరణ చూసి ఎవరు పూరించారు?అని అడిగాడు యింకెవరు నేనే అని బొంకింది.

రాజు ఆమె చెంప చెళ్ళు 

మనిపించాడు.దుర్మార్గురాలా నీ అబద్దం నమ్మటానికి నేను మూర్ఖుడ ననుకున్నావా?.యిది కాళిదాసు వ్రాసినదని స్పష్టంగా తెలుస్తూంది.ఎటొచ్చీ నీ బుద్ధి హీనత వల్ల 'బాలే'

అన్న మాటను మార్చి 'రాజే' అని వ్రాశావు.ఆ మాత్రం తో నేను బుట్టలో పడిపోతాననుకున్నావు.కానీ 'రాజన్'అనే సరయిన సంబోధనకు బదులు నీ సొంత తెలివి నుపయోగించి 'రాజే' అని తప్పు రాసి నీ దొంగ బుద్ధి ని నువ్వే ప్రకటించు కున్నావు.చెప్పు యింతకూ కాళిదాసు ఎక్కడ?అని నిలదీశాడు.

రమణి భయపడిపోయి తప్ప్పు ఒప్ప్పుకొని జరిగిన దంతా చెప్పింది.కాళిదాసు మరణించాడన్న వార్త రాజు నమ్మలేక పోయాడు.రమణి కాళిదాసు శవాన్ని చూపగానే రాజు మూర్ఛ పోయాడు.కాసేపటికి తేరుకొని 

తన యిష్ట దేవత భువనేశ్వరీ దేవిని ప్రార్థించాడు.నా జీవితం లో మిగిలి వున్న ఆయువు లో సగం ఈ కవీశ్వ రుడికి ధార పోస్తాను.ఈయనను బ్రతికించు తల్లీ అని ప్రార్థించాడు.దేవి కరుణతో కాళిదాసు లేచి వచ్చాడు.రాజా నీ ఆయువు లో సగం ధారపోసి నన్ను బ్రతికించావు.నా శేష జీవితం నీకే అంకితం చేసి నీ ఋణం తీర్చుకుంటాను ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించు. అన్నాడు కవిరాజు.కవీశ్వరా నువ్వు లేకుండా నేను జీవించ లేను,జీవించినా అటువంటి నిస్సార మైన జీవితం నాకు వద్దు.మనం జంటగా ఒక కావ్య రాద్దాం 

నీ పేరూ,నాపేరూ శాశ్వతంగా చరిత్ర లో నిలిచి పోతుంది.అన్నాడు రాజు.

తర్వాత యిద్దరూ కలిసి 'చంపూ రామాయణ కావ్యాన్ని ప్రారంభించారు.(చంపూ కావ్య మంటే శ్లోకాలూ,గద్యాలూ రెండింటి తో చెప్పబడ కావ్యం)సరళంగా సాగే ఈ చక్కని గ్రంథం 'భోజ చంపువు'గా ప్రచారం పొందింది.దీన్ని ఈనాటికీ సంస్కృత విద్యార్థులు తమ తొలి అధ్యయన గ్రంథాలలో ఒకటిగా చదువుకుంటారు.అయితే ఈ రామాయణం 'సుందరకాండ' వరకే భోజ,కాళిదాసుల రచన.అక్కడిదాకా వ్రాసి యిద్దరూ ఒకే సారి మరణించారు.మిగిలిపోయిన యుద్ధ కాండను ఆ తర్వాత  16వ శతాబ్దం లో లక్ష్మణ సూరి అనే ఆంధ్ర  దేశ పండితుడు పూర్తి  చేశాడట...

-------------------   శుభరాత్రి   ----------------------------

పంతొమ్మిదవ రోజు పాశురం*_

 _ *తిరుప్పావై పంతొమ్మిదవ రోజు పాశురం*_ 


 


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

 


 

*🌴19. వ పాశురము🌴*



    *కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్* 

    *మెత్తెన్ఱ పఞ్చశ యనత్తిన్ మేలేఱి ,*

    *కొత్తలర్ పూఙ్కుళల్ నప్పిన్నై కొఙ్గైమేల్* 

   *వైత్తుక్కి డన్దమలర్* *మార్ పా ! వాయ్ తిఱవాయ్*

    *మైత్తడ జ్కణ్నినాయ్ నీ యున్మణాళనై*

    *ఎత్తనై పోదుమ్ తుయిలెళ వొట్టాయికాణ్* 

    *ఎత్తనై యేలుమ్ పిరివాత్తగిల్లాయాల్*

    *తత్తువ మన్ఱుతగవేలో రెమ్బావాయ్*



*🌳భావం :🌳*



గుత్తి దీపపు కాంతులు నలుదిశలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచము మీద అందము , చలువ , మార్దవము , పరిమళము , తెలుపులనే - ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పముపై పవ్వళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీళాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవళించియున్న ఓ స్వామీ ! నోరు తెరచి ఒక్క మాటైననూ మాట్లాడకూడదా ? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీళాదేవీ ! జగత్స్యామియైన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింపకున్నావు ! క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే ? ఇది నీ స్వరూపమునకు , నీ స్వభావమునకును తగదు. నీవలె మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమేకదా ! కాన కరుణించి కొంచెమవకాశమీయము తల్లీ ! అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే యీ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్కైంకర్యరూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగ సమాప్తి చెందును. ఇందేమాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీళా శ్రీకృష్ణులను వేడుకొంటున్నారు.  




*☘️అవతారిక :☘️*




స్వామిని కీర్తించటానికి వచ్చామని , తన సుకుమారమైన చేతులకున్న గాజుల మధుర ధ్వనితో తలుపును తెరువుమని నీళాదేవిని ఆండాళ్ తల్లి ప్రార్ధించింది. ముందు (ఆ పాశురంలో) ఇప్పుడీ మాలికలో - ఆండాళమ్మగారి ప్రార్ధన నాలకించి నీళాదేవి తలుపు తెరవబోగా , మనవారి కెదురుగా ముందు యీమె వుండరాదని శ్రీకృష్ణుడు యీమెను తలుపు తెరవనీయక ఆమెను బిగ్గ కౌగలించి పడకనుంచి లేవనీయకయుండే శ్రీకృష్ణుని మేల్కొలపమని అతడు మాట్లాడకయుండగా - అతనిని మేల్కొలుపుమమ్మాయని ఆండాళమ్మగారు నీళాదేవిని పదేపదే వేడుకొంటున్నారు.         



*🌹19. వ మాలిక🌹*



*(కాపిరాగము - ఆదితాళము)*


ప.. తగదిది నీకిది తరుణిరొ వినవే !

    జాగు సేయకే శ్రీకృష్ణుని లేపవె !


అ..ప. తగునా ? నీ స్వరూప స్వభావమ్ములకు 

    మగని విశ్లేషమును సహింపజాలవె !

    దీప కాంతులెల్లెడళ విరియగా 

    ఆ పంచగుణముల పడకను శయనించి 

    సుపుష్ప సుగంధ కచ కుచ శోభిత 

    శ్రీ పద్మాక్షుని మాటాడనీయవె !

    ఓ పద్మాక్షీ ! విభుని లేపవే !