22, ఆగస్టు 2021, ఆదివారం

ఆత్మ విద్యను

ఆత్మావారే మైత్రేయీ ద్రష్టవ్య, శ్రోతవ్య, మంత్రవ్య, నిదిధ్యాసితవ్యః-  బృహదారణ్యకం

ఆత్మ విద్యను శ్రవణ, మనన, నిదిధ్యాసనలద్వారా పొందాలి 

హయగ్రీవ జయంతి

 ॐ శ్రీ హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు.  


జ్ఞానానంద మయం దేవం 

నిర్మల స్ఫటికాకృతిమ్ I 

ఆధారాం సర్వవిద్యానాం 

హయగ్రీవ ముపాస్మహే ॥


అనంతాత్మకుల రంగారావుగారి పత్రికా వ్యాసం 👇  


హయగ్రీవుడు జ్ఞానానికి, వివేకానికి, బుద్దికి, వాక్కుకు దేవుడు. 

    శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి సందర్భంగా అసలు హయగ్రీవుడూ, ఆయన వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకొందాం!    

    హయగ్రీవుడు హయము. అంటే ‘గుర్రము’. గుర్రం ముఖంగా కలవాడు అని అర్థం. 

    ఈయన తెల్లని శరీరచ్చాయతో, నాలుగు చేతులతో వెలుగొందుతున్నాడు. ఆ నాలుగు చేతులలో, శంఖము, చక్రము, పుస్తకం, అభయ హస్తంతో ఉంటూ భక్తుల మనోభీష్టాలు నెరవేరుస్తుంటాడు. 

    ఆయనను మన మందరం —     

”జ్ఞానానందమయం దేవం, 

 నిర్మల స్పటికాకృతమ్‌ I 

 ఆధారం, సర్వవిద్యానాం 

 హయగ్రీవ ముపాస్మహే ॥” అని ఆరాధిస్తుంటాము. 

    మహా విష్ణువు స్వరూపమే హయగ్రీవుడు! 

    ఋషులు అందరూ సూతమహర్షిని సందర్శించి, ”మహర్షీ! ఋషి పుంగవా! విష్ణువు హయగ్రీవ రూపాన్ని ఎందుకు పొందవలసి వచ్చింది? వివరించండి!” అనగానే, సూతమహర్షి,    

   ”ఒకసారి శ్రీ మహావిష్ణువు రాక్షసులతో పదివేల సంవత్సరాలు యుద్ధం చేయవలసివచ్చింది. 

    సుదీర్ఘ కాలం యుద్దం చేసేసరికి, ఆయన బాగా అలసిపోయి, విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించి,  

    ఆదమరుపుగా ఉన్న సమయంలో శత్రువులు ఎవరైనా దాడి చేస్తారేమోనని భావించి, దేవాదిదేవుడు ధనస్సుకు త్రాడుకట్టి, బాణాన్ని, ఒకదానిని సంధించి, దానిపైనే తన చుబుకాన్ని ఆనించి, విశ్రాంతి తీసుకోసాగాడు.  

    ఆ సమయంలో దేవతలందరూ, మహా యజ్ఞం చేయడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారు. 

    ఇంద్రుడు, బ్రహ్మ, శంకరుడు, దేవతలు విష్ణు భగవానుని దర్శన నిమిత్తం వెళ్ళగా, విష్ణువు మంచి యోగనిద్రలో ఉండడం చూసి, ఆయనను మేల్కొల్పడం ఎలా? అని ఆలోచిస్తుం డగా, 

    శంకరుడు ”దేవతలారా!” ఎవరికైనా నిద్రాభంగం చేయడం నిషిద్ధం. అయితే యజ్ఞకార్యం సుసంపన్నమగుటకు, స్వామిని, మేల్కొల్పవలసి ఉంది. కాబట్టి ఆ కార్యాన్ని బ్రహ్మ నిర్వర్తిస్తారు.” అనగానే, 

    బ్రహ్మ ”వమ్రి” (చెదపురుగు)ను సృష్టించాడు. అపుడు బ్రహ్మ ఆ కీటకాన్ని ఉద్దేశించి ”ఓ! కీటకమా! నువ్వు వెళ్ళి, ధనస్సు త్రాడును కొరికేస్తే, ధనస్సు, వంగి, కదలిక వల్ల విష్ణువు మేల్కొంటారు.” అని ఆజ్ఞాపించగా, 

    ఆ కీటకము ”అయ్యా! లక్ష్మీవల్లభుడు, భగవంతుడు, నారాయణుడు అందరికీ ఆరాధ్యుడు. ఆ జగద్గురువు ను నేనే ఎందుకు నిద్రలేపాలి? ఆ త్రాడు కొరకడం చాలా అసహ్యకరమైన పని. ఆ పని చేస్తే నాకేమి ప్రయోజనం? ఆయన నిద్ర నుండి మేల్కొన్న తర్వాత, నన్ను శపించ వచ్చుకదా!’ అని అడిగింది. 

    అప్పుడు బ్రహ్మ ”ఓ! కీటకమా! నీకు యజ్ఞ భాగం ఇస్తాము. అంతే కాకుండా ప్రతీసారీ యజ్ఞమునందు ”హవనము” చేసే సందర్భంలో యజ్ఞవాటిక చుట్టూ ఆ హవిష్యము పడుతూంటుంది. అదీ. నీ భాగమే.” అని వరం ఇస్తున్నాను అన్నాడు. 

    దాంతో ఆ ”వమ్రి” ధనస్సుకు కట్టిన అల్లెత్రాడును కొరకగానే, ధనస్సు. బంధం విడిపోయి దానికి ఎక్కుపెట్టి ఉన్న బాణం విష్ణువు తలను తాకేసరికి, అది ఎక్క డికో ఎగిరిపోయింది. 

    ఆ త్రాడు తెగిన సందర్భంలో భయంకరమై న శబ్దము, చీకటి ఆవరించింది. ఆ చీకటి వల్ల తల ఎక్కడ పడింది? గుర్తించలేకపోయి, దేవతలందరూ దు:ఖంతో ఉండగా,  

    బ్రహ్మ ”దేవతలారా! ఇది విధి ప్రేరేపితం. మనందరం జగన్మాతను ప్రార్థిస్తే మనకు తరుణోపాయం చెబుతుంది” అని అందర్నీ అమ్మ వారిని స్థుతించమనగానే, దేవతలు అందరూ అలా చేసిన కొద్దిసేపటికి జగన్మాత ప్రత్యక్షమై, బ్రహ్మ, పరమేశ్వరుడు ద్వారా జరిగిన వృత్తాంతం తెలుసుకొని, 

    జగన్మాత- హయగ్రీవుడు అనే రాక్షసుడు అమ్మ వారి గురించి ఘోరమైన తపస్సు చేసాడు. 

    అప్పుడు లలితా పరాభట్టారిక ప్రత్యక్షమై, ”ఏమి వరం కావాలో కోరుకోమన”గానే నాకు ఏ ప్రాణివల్ల మరణం సంభవించకూడదు” అనగానే- ”పుట్టిన ప్రతీ ప్రాణి మరణించక తప్పదు. అది కుదరదు. వేరే ఏదైనా వరం కోరుకోమంటే ”నాకు నారూపంతో (గుర్రపు తల) ఉన్నవారితో మాత్రమే మరణం సంభవించాలని కోరాడు. 

    ఆ హయగ్రీవ రాక్షసుని సంహారం నిమిత్తం శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడుగా మారాలి. అందుకని తూర్పు దిశగా వెళ్ళి గుర్రపు తలను తీసుకొచ్చి అతి కించండి” అని చెప్పి అంతర్థానమయ్యింది. 

    వెంటనే తూర్పు దిశగా వెళ్ళి, గుర్రపుతలను తెచ్చి, అతికించి, అమ్మవార్ని, విష్ణువును స్తోత్రం చేయగానే హయగ్రీవుడు ఆవిర్భవించాడు. 

    ఆరోజే శ్రావణ పౌర్ణమి. అందుకే ప్రతీ శ్రావణ పౌర్ణమికి హయగ్రీవ జయంతి జరుపుకొంటున్నాము.    

    మధుకైటభులు అనే రాక్షసులు ఒకసారి బ్రహ్మ వద్దనున్న వేదాలను దొంగలించి, పాతాళ లోకంలో భధ్రపరచారు. బ్రహ్మ కోరిక మేరకు విష్ణువు హయగ్రీవ రూపంలో పాతాళ లోకానికి పోయి, అక్కడ సుదీర్ఘమైన ప్రణవధ్వని చేసాడు. ఆ ధ్వని విన్న మధుకైటభులు ఆ దిశగా పరుగెట్టారు. హయగ్రీవుడు. మరోవైపు వెళ్ళి, అక్కడ గట్టిగా బంధించి ఉంచబడిన వేదాలను కనుగొని, తీసుకువచ్చి, బ్రహ్మకు అప్పగించారు. 

    మనం లలితాసహస్రనామ పారా యణ చివరిలో ” ఇతి బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే ,శ్రీహయగ్రీవాగస్య్త సంవాదే శ్రీ లలితా రహస్యనామ ఫలనిరూపణ:” అని ఉండడం చూస్తాం. 

    ఒకసారి అగస్త్య మహర్షి ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు తీర్థయాత్రలు చేస్తూ మనుషులు పడుతున్న కష్టాలను గమనించి, వారిని రక్షించడానికి కంచిలోని ఏకామ్రేశ్వరుని ఆలయ సమీపంలో ఘోరమైన తపస్సు చేయగా, 

    హయగ్రీవ రూపంలో ఉన్న మహావిష్ణువు ప్రత్యక్షమై, అగస్త్యుని కోరిక మేరకు శ్రీ లలితా సహస్రనామావళినీ, అందులో ప్రతీనామ మహాత్మ్యాన్నీ వివరించాడు. 

    ఇలా హయగ్రీ వుడు మనకు చాలా సందర్భాలలో కనిపిస్తా డు.  

    ఆయన జయంతి రోజున ఆయనను స్మరించి ఆయన కృపకు పాత్రులవుదాము.

– అనంతాత్మకుల రంగారావు

7989462679

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము

 *22.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2238(౨౨౩౮)*


*10.1-1346-వ.*

*10.1-1347-*


*సీ. రోషాగ్నిధూమప్రరోహంబు కైవడి*

  *శిరమున సన్నపు శిఖ వెలుంగ*

*నాశామదేభేంద్ర హస్తసన్నిభములై*

  *బాహుదండంబులు భయదములుగ*

*లయసమయాంతకోల్లసిత దంష్ట్రల భంగిఁ*

  *జాఁగిన కోఱ మీసములు మెఱయ*

*నల్లని తెగఁగల నడకొండ చాడ్పున*

  *నాభీల నీలదేహంబు వెలయఁ*

*ఆ. జరణహతుల ధరణి సంచలింపఁగ నభో*

*మండలంబు నిండ మల్ల చఱచి*

*శౌరి దెసకు నడచెఁ జాణూర మల్లుండు*

*పౌరలోకహృదయభల్లుఁ డగుచు.* 🌺



*_భావము: శ్రీకృష్ణునితో ఇలా మాట్లాడిన చాణూరుడు- రగిలిన క్రోధాగ్ని వలన తలపై ఏర్పడిన దీపశిఖయా అన్నట్లున్న ఆ పిలకతో, దిగ్గజముల యొక్క బలిష్టమైన తొండములతో సమానమైన భయంకర భుజదండములతో, ప్రళయ కాల యముని యొక్క పదునైన కోరల వలె సాగియున్న కోఱ మీసాలు మెరుస్తుండగా, నడిచే కొండా యన్నట్లున్న నల్లటి శరీరంతో భయం పుట్టిస్తూ, అడుగు తీసి అడుగేస్తున్నప్పుడు భూమి కంపిస్తోందా యన్నట్లు, భుజములపై చరుచుకున్నప్పుడు చేసే చప్పుడు ఆకాశమంతా నిండిపోతుండగా, ఆ మల్లయోధుడు పురజనుల మనస్సుల్లో బల్లెమై, శ్రీకృష్ణుని మీదికి లంఘించాడు._* 🙏



*_Meaning: Daunting Sri Krishna thus, Chanura appeared- like flame of fire on his head caused by extreme fury, with powerful shoulders like the trunk of wild elephant, shining of moustaches like the fangs of Yama at the time of Pralayam, creating fear and fright in the minds with his mountain like body in full black colour. It sounded like earthquake as he walked towards Sri Krishna and the huge noise created by slaps on his own shoulders spreading across the sky. Generating a feeling of spear piercing the hearts of the onlookers, that wrestler Chanura sprang upon Sri Krishna._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

సర్వాయి పాపన్నను

 సర్వాయి పాపన్నను గజదొంగగా చిత్రీకరించినదెవరు ?

.........................................................


జానపదుల పాటలలో ఒక వ్యక్తి గురించి కీర్తించారంటే ఆ వ్యక్తి గొప్పవాడైయుండి లోకోపకారానికి కృషిచేసివుండాలి. చేసినమేలు మరవని గ్రామీణులు అతనిపై పాటలుకట్టి పాడుకోవడం ద్వారా తమ కృతజ్ఞతను తెలుపుకొంటారు.

ఆ కోవకు చెందినవాడే ఉయ్యాలవాడ నరసింహరెడ్డి (జననం 24.11. 1806 - ఉరితీత 22. 2. 1847). జానపదం బ్రతికివున్నంత వరకు మహానుభావుల కీర్తిప్రతిష్టలు జనం నోళ్ళలో నానుతూనే వుంటాయి.


సరిగా ఇలాంటి కోవకు చెందినవాడే సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్నను మేట్ కాఫ్, రిచర్డ్స్ అనే ఆంగ్లేయులు బందిపోటుదొంగగా ఎలా చిత్రీకరించారో దిగువన చూద్దాం.


సర్వాయిపాపన్న లేదా సర్ధార్‌ పాపన్న లేదా పాపడుగా పిలువబడిన పాపన్న వరంగల్లుకు దగ్గరలోని తరిగొండలో జన్మించాడు. తండ్రి కల్లుగీత కార్మికుడు. తండ్రిచేసే వృత్తిని కాదని పాపడు కత్తినిచేతబట్టాడు. ఆ రోజులలో గోల్కొండ ప్రాంత పరిస్థితులు అల్లకల్లోలంగా వున్నాయి. 1687 లో గోల్కొండ సులతాను తానీషా మొఘలాయిల చేతిలో ఓడిపోవడం జరిగింది. సరైన పాలకుడు దక్కనులో లేకపోవడం వలన అరాచక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. మరాఠాల విజృంభనను అణచటానికే ఔరంగజేబుకు కాలం సరిపోలేదు. దక్కను పీఠాన్ని ఆక్రమించాలని అధికారులలో, మొఘలు వారసులలలో కుమ్ములాటలు మొదలయ్యాయి. శాంతిభద్రతలు క్షిణించాయి.


చిన్నతనంనుండే పాపడు ధైర్యసాహసాలున్నవాడు. తండ్రిచేస్తున్న వృత్తినికాదని నాటి అరాచక పరిస్థితులను అవకాశంగా తీసుకొని రాజకీయప్రాముఖ్యం సంపాదించాలనుకొన్నాడు. 1690లో ధనవంతురాలు విధవరాలైన సోదరిని తల్లిని హింసించి డబ్బు సంపాదించాడు.ఆ డబ్బుతో తరిగొండలో ఓ మట్టికోటను నిర్మించాడు. పరిసర గ్రామాలను రైతులను దోచుకోవడం, అందమైన స్త్రీలను చెరపట్టడం చేసాడు.


ఆ రోజులలో లంబాడీలు వర్తక వ్యాపారుల వద్ద సరుకులు రవాణా చేసేవారు. పాపన్న వారిని కొల్లగొట్టి వారిని బందీలుగా చేసుకొని కోటలు కట్టేటందుకు, పరిసరభూములను సాగుచేసేటందుకు నియోగించాడు. ఆ తరువాత సైనిక శిక్షణ కొరకు ఎల్లందల జమీందారు కొలువులో సైనికుడిగా చేరాడు. జమీందారీలో కూడా దోపిడీలకు అక్రమాలకు తెరదీశాడు. కోపించిన ఎల్లందల జమీందారు పాపన్నను ఖైదుచేశాడు.అక్కడనుండి తప్పించుకొని భువనగిరి చేరి, అక్కడ సర్వాయి అనే దొంగతో చేతులు కలిపాడు. అప్పటినుండి ఇద్దరిని కలిపి సర్వాయి పాపన్నగా పిలవడం పరిపాటైంది.


సర్వాయితో చేరిన పాపన్న రైతులను, వర్తకులను, ధనవంతులను, సామాన్యజనులను దోచుకోవడాలు చేసి వచ్చిన సొమ్ముతో భాగ్యనగరానికి 50 మైళ్ళదూరంలోనున్న షాపూరులో కొటకట్టాడు. సర్వాయి పాపన్న ఆగడాలు మితిమీరడంతో ప్రజలు వర్తకులు గగ్గోలు పెట్టారు.


మొఘలాయిలకు దక్కను సుబేదారైన రుస్తుంఖాన్‌ అనే సరదారు సర్వాయి పాపన్నను పట్టిబంధించాలని రియాజుఖాన్‌ పంపాడు.ఖాన్‌ ప్రయాత్నాలు విఫలమైనాయి.


1707 లో ఔరంగజేబు మరణించాడు.మారిన రాజకీయాలలో భాగంగా యూసఫ్ ఖాన్ దక్కను ఫౌజుదారు (దండనాయకుడు) గా వచ్చాడు. 1708 లో పాపన్నబృందం వరంగల్లుపై దాడిచేసి 12వేలమంది నగర జనాభాను హతమార్చడం జరిగింది. చాలామందిని బంధీలుగా తీసుకెళ్ళడం జరిగింది. వరంగల్లు ఖాజీ భార్యను తన అంత:పురంలోనికి చేర్చాడు. అతని కూతురిని భోగంమేళాలో చేర్చాడు.ఖాజీ గుండెపగిలి చచ్చాడు.


కోపగించిన యూసఫ్ ఖానుడు సర్దారుపాపడిని శిక్షించటానికి 20 వేలమంది కాల్భటులను 15 వేలమందితోనున్న అశ్వదళాన్ని తరిగొండపైకి పంపాడు. ఇరుసేనల మధ్య ఆరునెలలపాటు భీకరయుద్ధం జరిగింది. పాపడు ఓడి పారిపోయాడు. తరిగొండ యూసఫ్ ఖానుని వశమైంది. పారిపోయిన పాపడు హసనాబాదులో ఓ కల్లంగడి (కల్లు అంగడి ) యాజమానిని ఆశ్రయించాడు. ఆ కల్లంగడి యాజమాని దుర్భుద్ధితో పాపన్నను యూసఫ్ ఖాన్ సేనకు అప్పగించాడు.

మెుఘలాయిల దక్కను సేనలు సర్దారు సర్వాయి పాపన్నను తీవ్రమైన చిత్రహింసల పాల్చేసి ఉరితీయించి, తలను బహుమతిగా డిల్లిరాజైన మొదటి బహదూర్షాకు కానుకగా పంపారు.


ఆంగ్లేయుల రచనలలో పాపడు దొంగదోపిడిదారు, వ్యసనపరుడని పెర్కొనడం అసమంజసం.ఇతను పేదలపాలిటి పెన్నిధి. దోపిడిలు దొంగతనాలు చేసింది నిజమే, అయితే దోపిడిలు చేసింది మాత్రం ప్రజలను పట్టి పీడిస్తున్న షాహుకారులను వర్తకులను అధికారులను మాత్రమే.


( సేకరణ)

................................................................................................................. జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

దుర్వాస మహర్షి

 దుర్వాస మహర్షి

దుర్వాస మహర్షి, కంచి కామాక్షీ అమ్మవారి ఆలయంలో అనేక మంది భక్తులకి వారు ప్రత్యక్ష దర్శనం ఇచ్చి అనుగ్రహించారు. కామాక్షీ అమ్మవారికి చందనోత్సవం చేసినప్పుడు ఇప్పటికీ, అమ్మవారి కుడి వైపు దుర్వాస మహర్షిని చూడవచ్చని, ఆ దర్శనం చేయగలిగిన సత్పురుషులకు వారు కనబడతారని పెద్దల విశ్వాసం.

ఎంతో మంది శ్రీవిద్యోపాసకులకు దుర్వాసో మహర్షి ఆరాధ్య దైవం మరియు సద్గురువు. గురువు నుండి పొందిన శ్రీవిద్యా మంత్రాలు, ఏ కొంచెమైనా కూడా, పూనికతో కామాక్షీ ఆలయంలో అనుష్ఠిస్తే, వారికి తప్పకుండా దుర్వాసో మహర్షి అనుగ్రహం లభిస్తుందనీ, వారికి ఆయనే ఉపాసనలో ముందుకు నడిపించే దిశానిర్దేశం చేస్తారనీ ఎంతో మంది భక్తుల అనుభవం.


దీనికి ఉదాహరణ, తమిళనాడులోని తిరుచిరాపల్లిలో మీనాక్షీ అమ్మళ్ అని ఒక తల్లి ఉండేది. ఆమెకి చాలా చిన్న వయసులోనే ఆమె మామగారే గురువై శ్రీవిద్యా దీక్ష ఇచ్చారు. అయితే, ఆమె ఎన్నో రోజులు సాధన చేయకమునుపే, ఆ గురువు (ఆమె యొక్క మావగారు) తనువు చాలించారు. అప్పటికి ఆ తల్లికి శ్రీవిద్యోపాసనలో ఇంకా సాధనాబలం లేదు. ఆమెకి గురువు గారు ఇచ్చిన మూలమంత్రము ఒక్కటే తెలుసు.


ఆమె ఆ మూలమంత్రమునే భక్తితో కొంత కాలం సాధన చేసింది. అయితే ఆమె తరచుగా తిరువారూర్ లో ఉన్న కమలామ్బికా అమ్మవారి క్షేత్రములో కూర్చుని ఆ మంత్ర జపము చేసేది. ఒకనాడు, అదేవిధముగా ఆ ఆలయములో జపం చేస్తూ ఉంటే, మంచి స్ఫురద్రూపి అయిన ఒక వృధ్ధుడు ఆమె యెదుటకి వచ్చి, నువ్వు కంచిలోని శ్రీవిద్యా పరమేశ్వరీ అమ్మవారి సన్నిధికి (అంటే కామాక్షీ అమ్మయే) వెళ్ళు, అక్కడ నీవు చేసే మంత్ర జపమునకు న్యాసము (కరన్యాసము, అంగన్యాసము) కూడా దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. ఆమె వెంటనే కంచి కామాక్షీ అమ్మవారి సన్నిధికి వెళ్ళింది. ఆశ్చర్యంగా ఆమెకి ఇక్కడ కూడా అదే వృధ్ధుడు దర్శనమిచ్చి, అక్కడ అమ్మ వారి ప్రాంగణములోనే ఉన్న మరొకరిని చూపించి ఆయనని ఆశ్రయించమని చెప్పారు. వెంటనే ఆ తల్లి పరుగు పరుగున వెళ్ళి వారి పాదములకు నమస్కారం చేసి, జరిగినదంతా చెప్పింది.


ఆ పెద్ద మనిషి మైసూర్ కు చెందిన శ్రీ యజ్ఞనారాయణ శాస్త్రి అనే ఒక గొప్ప శ్రీవిద్యోపాసకుడు. శాస్త్రి గారు, నేను నీకు ఎలా తెలుసమ్మా అని ఆవిడని అడిగితే, ఆ తల్లి వెనుకకు తిరిగి, అక్కడ నిల్చున్న వృధ్ధుడిని చూపించింది. విచిత్రముగా, ఆ వృధ్ధుడు శాస్త్రి గారు, ఆ తల్లి ఇద్దరూ చూస్తుండగా అంతర్ధానం చెందారు. తదుపరి ఆ తల్లి కామాక్షీ ఆలయంలో ప్రదకక్షిణ చేస్తూ ఉండగా, దుర్వాస మహర్షి సన్నిధికి వచ్చి నమస్కరించగానే, అక్కడ అంతర్ధానం చెందిన వృధ్ధుడే దుర్వాస మహర్షి మూర్తి యందు కనబడి, ఆమెను దీవించారు. ఇది నిత్య సత్యమైన లీల. ఇప్పటికీ ఆ తల్లి ప్రతీ యేటా కంచి వెళ్ళి అమ్మ దర్శనముతో పాటు, దుర్వాస మహర్షి యొక్క దర్శనము కూడా పొందుతారు.

పటిక బెల్లం లో మూడవవంతు

 *పటిక బెల్లం లో మూడవవంతు* 


⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️


 *అరుణాచల ఆలయంలో యదార్థo* 


ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.

ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు.

అందులో ఒకడు " ఒరేయ్ ఎవరన్నా చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో.


రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా అన్నాడు.

ఇద్దరు అరుణాచలుని కి ఎదురుగా నిలబడి మా దొంగ తనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లం లో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం, ఇది మన ఓడంబడిక ( అగ్రిమెంట్ ) అన్నారు.


ఇలా ప్రతీ రోజు పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యం గా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం మాయమవుతోంది.

ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారి కి అప్పగించాడు, వీళ్లిద్దరు ఎనిమిదేళ్ల పసి కాయలు, వీళ్ళను ఎలా శిక్షించాలి అని, అరేయ్ పిల్లలు మీరు ఇద్దరు అంతరాలయం లో 108 ప్రదక్షిణలు చేయండి అని, ఇదేమీ శిక్ష అన్నాడు.

పిల్లలు ఇద్దరు ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించారు, ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చొని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా. ఇంతలో పూజారి , అధికారి ఒక్కసారిగా తృల్లి పడ్డారు, పరిశీలించి పిల్లల్ని మళ్ళొకసారి చూసారు, ఆ ఇద్దరి పిల్లతో పాటు, మూడవ పిల్లవాడు ప్రదక్షిణ చేయడం చూసారు, మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు మళ్ళీ మాయమవుతున్నాడు మాటిమాటికీ. ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని గట్టిగా వాటేసుకున్నాడు.

అద్భుతం!!


⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️


⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️


మూడవ పిల్లవాడు కాంతిరేఖ గా మారి, గార్బాలయం లోకి వెళ్లి మాయమై పోయాడు.

అరుణాచళేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా, అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట.

ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ " అసలేం జరిగింది " అని అడిగాడు. పిల్లలు అరుణాచళేశ్వరుని వాటా గురించి చెప్పారు. అది విని వారు ఆశ్చర్యం, ఆనందం లో మునిగిపోయారు.

సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు కూడా వారితో వాటా పంచు కున్నందుకు శిక్ష అనుభవించాడన్నా మాట. ఆలయం లో సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు ఉన్నాడు అంటానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి ??.


నిష్కల్మష ప్రేమకు, నిర్మల భక్తి కి అరుణాచళేశ్వరుడు ఎపుడూ బందియే !! అరుణా చలుడు కాంతి రూపం లో ఉంటాడని, అది అగ్ని లింగం అని శాస్త్రవచనం. ఆ పరిసర ప్రాంతాలలో మరియు కొ0డపైన అరుణాచలుడు కాంతి రూపం లో, కాంతి స్తంభం ( bheem of light ) రూపం లో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు అనేకం .


 *అరుణాచల శివ అరుణాచల శివ* *అరుణాచల శివ అరుణాచలా* 




⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️

Kanyaa=

 कन्या वरयते रूपं माता वित्तं पिता श्रुतम्

बान्धवा: कुलमिच्छब्ति मिष्ठान्ने इतेरे जनाः


Kanyaa varayate roopam maata vittam pitaa shrutam

Bandhawah kulmichhanti mishthanne itero janaah.


i.e. The choice of a daughter about her prospective groom is that he should be handsome, whereas the preference of her mother is that he should be wealthy, and her father's preference is that he should be well educated. The choice of her other relatives is high social status of the groom's family, whereas other acquaintances are concerned only with getting a lavish feast at the time of marriage.


Kanyaa= a young girl. Varayate = selects, chooses, prefers. Roopam = Beautiful appearance

Vittam = money, wealth. Pitaa= father. Shrutam = Vedas.(here it means well educated)

Baandhawah = relatives. Kula = a clan or a family in society. Mishthanna = sweets.

Icchanti = wishes, desires. Itarey = other. Janaah = persons.


( The underlying idea in this Subhashit is that there is a wide variance in the choice of different persons for a thing,depending upon their age, outlook,attitude, social status, worldly experience etc.)

Daanam bhogo

 दानं भोगो नाशः तिस्रो गतयो भवन्ति वित्तस्य

यो न ददाति न भुङ्ग्ते तस्या तृतीया गतिर्भवति .


Daanam bhogo nashah tisro gatayo bhawanti vittasya

yo na dadaati na bhungte tasyaa trateeyaa gatirbhawati.


i.e. There are three types of end uses of wealth ( money) , namely (i) giving as a gift or as charity (ii) for owner's own use and (iii) destruction ( e.g.by way of theft). So, if a person neither gifts his money (for a right cause) nor uses it for his own consumption, it is certain that the fate of the wealth will be of the third type.


Daan = giving as a gift or as a charity. Bhoga = using a thing by the owner for his own use.

Naash = destruction. Tisro = three (3). Gatayoh = end result. Bhawanti = happen

Vittasya = of money and wealth. Yo = who, Dadaati = gives.

Bhoongte = consumes, uses. Tasya = his, its. Tritiya = third. Gati = fate, end result.


(It is a dictum of Economics that wealth should should always flow like running water. As soon as water stops flowing, it starts to stagnate and tends to become useless. So is the case with wealth. If it is stored just for the sake of storing, it becomes unproductive and useless for the Society as a whole.A perfect example is the Black Money stored in Tax havens, which could have been better utilised for the economic uplift of our Nation. Money earned with wrong means ultimately also ends up likewise.


There is a Hindi couplet having this very theme - खाय न खर्चे सूम धन चोर सबै लेजाय - " Khaaya na Kharche soom dhan chor sabey le jaay." i.e. a miser can not spend his money for his own upkeep and use and ultimately thieves take away all his wealth .)


దానం భోగో నాశh తిస్రో గత్యో భవన్తి ఫైనాన్స్

ఇది దదాతి లేదా భుంగ్తే తస్య తృతీయ గతిర్భవతి కాదు.


దానం భోగో నాశh తిస్రో గతయో భవంతి విత్తస్య

యో న దదాతి న భుంగ్తే తస్యా త్రతీయా గతిర్భవతి.


అనగా సంపద (డబ్బు) యొక్క మూడు రకాల తుది ఉపయోగాలు ఉన్నాయి, అవి (i) బహుమతిగా ఇవ్వడం లేదా దాతృత్వం (ii) యజమాని స్వంత ఉపయోగం కోసం మరియు (iii) విధ్వంసం (దొంగతనానికి మార్గం). కాబట్టి, ఒక వ్యక్తి తన డబ్బును (సరైన కారణం కోసం) బహుమతిగా ఇవ్వకపోయినా లేదా దానిని తన సొంత వినియోగం కోసం ఉపయోగించుకోకపోయినా, సంపద యొక్క విధి మూడవ రకం కావడం ఖాయం.


డాన్ = బహుమతిగా లేదా దానంగా ఇవ్వడం. భోగ = యజమాని తన స్వంత ఉపయోగం కోసం ఒక వస్తువును ఉపయోగించడం.

నాష్ = విధ్వంసం. టిస్రో = మూడు (3). గటయోహ్ = అంతిమ ఫలితం. భవంతి = జరుగుతుంది

విత్తస్య = డబ్బు మరియు సంపద. యో = ఎవరు, దాదాటి = ఇస్తాడు.

భూంగ్టే = వినియోగిస్తుంది, ఉపయోగిస్తుంది. తస్య = అతని, దాని. తృతీయ = మూడవది. గతి = విధి, అంతిమ ఫలితం.


(సంపద ఎల్లప్పుడూ ప్రవహించే నీటిలా ప్రవహించాలన్నది ఆర్థికశాస్త్రం యొక్క శాసనం. నీరు ప్రవహించడం ఆగిపోయిన వెంటనే, అది స్తబ్దుగా మారడం మరియు నిరుపయోగంగా మారడం జరుగుతుంది. అలాగే సంపద విషయంలో కూడా ఉంటుంది. ఇది కేవలం నిమిత్తం నిల్వ చేయబడితే నిల్వ చేయడం, ఇది మొత్తం సమాజానికి ఉత్పాదకతలేనిది మరియు నిరుపయోగంగా మారుతుంది. ఒక ఖచ్చితమైన ఉదాహరణ పన్ను స్వర్గాలలో నిల్వ చేయబడిన బ్లాక్ మనీ, ఇది మన దేశం యొక్క ఆర్ధిక అభ్యున్నతికి బాగా ఉపయోగపడుతుంది. తప్పుడు మార్గాలతో సంపాదించిన డబ్బు చివరికి కూడా అదేవిధంగా ముగుస్తుంది .


ఈ థీమ్ ఉన్న హిందీ ద్విపద ఉంది - Kha न खर्चे सूम धन चोर चोर सबै " -" ఖాయా నా ఖర్చే సూమ్ ధన్ చోర్ సబే లే జై. " అనగా ఒక పిచ్చెడు తన డబ్బును తన సొంత నిర్వహణ మరియు వినియోగం కోసం ఖర్చు చేయలేడు మరియు చివరికి దొంగలు అతని సంపద మొత్తాన్ని తీసివేస్తారు.)

జంధ్యాల పూర్ణిమ , శ్రావణ పూర్ణిమ ప్రాశస్త్యం*_

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

*ఆదివారం 22.8.2021*

జంధ్యాల పూర్ణిమ , శ్రావణ పూర్ణిమ ప్రాశస్త్యం*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉



శ్రావణ పూర్ణిమను *జంధ్యాల పూర్ణిమ* అని కూడా అంటారు. ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి , జప , అర్చనాదులను నిర్వహిస్తుంటారు. యజ్ఞోపవీతము అనే పదము *‘యజ్ఞము’* *‘ఉపవీతము’* అనే రెండు పదాల కలయికవల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే *‘యాగము’* *‘ఉపవీతము’* అంటే దారము అనే అర్థాలున్నాయి. యజ్ఞోపవీతము అంటే *యాగకర్మ చేత పునీతమైన దారము* అని అర్థము. 


యజ్ఞోపవీతం సాక్షాత్తూ గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణవల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని , యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞోపవీతాననే జంధ్యమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు.

శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ ప్రత్యేకమైన విధి. ఇది వేదాధ్యయానికి సంబంధించినది. ప్రాచీన సంస్కృత నిఘంటువైన *‘అమరకోశాన్ని’* రచించిన అమరసింహుడు *‘సంస్కార పూర్వం గ్రహణం స్వాదుపాకరణం శ్రుతేః’* అన్నాడు. సంస్కారం అంటే ఉపనయనం , వేదాన్ని అధ్యయనం చేయడం *‘ఉపాకరణం’*. సంస్కారపూర్వకంగా వేదాధ్యయనం చేయడమే ఉపాకర్మ.

మహర్షులు మనకు విధించిన పదహారు సంస్కారాలలో ఉపనయనం ఒకటి. సంస్కారాలన్నింటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఉపనయనం ద్వారా గురువు తన శిష్యునికి ప్రతిభా పాటవాలను , జ్ఞానాన్ని ఉపదేశించి ఉపదేశిస్తాడు. ఉపనయన సంస్కారం పొందినవారిని *‘ద్విజుల’* అని అంటారు. ఉపనయన సందర్భంలోనే యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. ఎడమ భుజంపైనుండి ధరిస్తారు కాబట్టి దీనిని ఉపవీతమంటారని అమరకోశం చెబుతుంది. ఉపనయనం చేసుకుని జంధ్యాన్ని వేసుకున్న వ్యక్తి త్రికాల సంధ్యావందనం చేయుటకు , గాయత్రీపూజ చేయుటకు , ఇతర పూజలు చేయుచుటకు అర్హుడవుతాడు. యజ్ఞోపవీత ధారణకు అర్హులైనవారందరూ ఈ రోజు పాత జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) ధరించవలెను. *‘సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్ తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి సృతమ్’* బ్రహ్మతత్వాన్ని సూచించడానికి , వేద తత్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే ఉపవీతము అంటే రక్షణ వస్త్రం. యజ్ఞోపవీతాన్ని , శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. అందుకే ద్విజులు అంటే రెండు జన్మలు కలిగినవారు అని , ఒకటి అమ్మ కడుపునుంచి పుట్టడం జన్మ అయితే , ఈ గాయత్రి దేవిని ఉపాసించి యజ్ఞోపవీతం ధరిండం ఆ తల్లి అనుగ్రహం పొందడం రెండవ జన్మ అన్నమాట.


ఋగ్వేదులైనవారు శ్రావణమాసంలో ఏ రోజు శ్రవణా నక్షత్రం ఉంటుందో ఆ రోజే ఆచరించాలి. *యజుర్వేదులకు పౌర్ణమి ప్రధానం. వారు పౌర్ణమినాడు దీన్ని ఆచరిస్తారు. సామవేదులు మాత్రం హస్తా నక్షత్రము* రోజున ఆచరించవలసి వుంటుంది. ఇలా ఆయా వేదాలు వారు వారికి నియమించిన తిథి నక్షత్రాలను బట్టి ఉపాకర్మను ఆచరిస్తారు. ఆదిదేవుడు , సర్వమంగళా (పార్వతీ)పతి , సర్వమంగళ కారకుడైన శివుడు కూడా మంగళం కలిగేందుకు ఉపవీతాన్ని ధరిస్తాడని యజుర్వేదంలోని *‘నమో హరి కేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః’* అనే మంత్రం మనకు చెబుతోంది. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని , యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో అనగా తొమ్మిది దారపు పోగులతో నిర్మించాలని , ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం. మొదటి తంతువులో ఓంకారం , రెండవ తంతువులో అగ్నిదేవుడు , మూడవ తంతులో నాగదేవత , నాలుగవ తంతువులో సోమదేవత , ఐదవ తంతువులో పితృదేవతలు , ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు , ఏడవ తంతువులవో వాయుదేవుడు , ఎనిమిదవ తంతువులో సూర్యుడు , తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలూ ఉంటారు.


యజ్ఞోపవీతం తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని వశిష్ఠస్మృతి ప్రమాణంగా తెలియజేసింది. నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించారు. ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే తొంభై ఆరు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్ని , గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను , ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. బాలురకు ఒంటి ముడి వున్న అంటే మూడు పోగుల జంధ్యాన్ని ధరింపజేస్తారు. ఈ మూడు పోగులు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు.


బ్రహ్మచారులు శ్రావణ పౌర్ణమినాడు నూతన యజ్ఞోపవీతాలు ధరించి వేదాధ్యయనం ప్రారంభిస్తారు. పూర్వం వేదాధ్యయనాన్ని ప్రారంభ దినంగా శ్రావణ పూర్ణిమను పరిగణించేవారు. వేద విద్యార్థులు , అధ్యాపకులు , గృహస్థులు నిత్య కర్మలు ముగించుకుని గాయత్రీ జపాలు చేస్తారు. ఈ రోజున తప్పనిసరిగా నూతన యజ్ఞోపవీతాలను ధరించాలి. *జంధ్యాల పౌర్ణమిగా శ్రావణ పూర్ణిమ* అలా ప్రసిద్ధి చెందింది.


ఈ రోజున మంత్రదష్టలైన సప్తఋషులను పూజించాలి. జంధ్యంలోని బ్రహ్మముడులను అరచేతిలో ఉంచుకుని గాయత్రీ జపం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. *ఉపాకర్మలోని విశేషం* ఇది. ఇంతటి మహిమాన్వితమైన యజ్ఞోపవీతాన్ని మొట్టమొదటగా బ్రహ్మ తయారుచేశాడంటారు. అలా బ్రహ్మ తయారుచేసిన జంధ్యాన్ని శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టాడని , లయకారుకుడు సకల శుభకరుడైన రుద్రుడు ముడివేశాడని అంటారు. ఆ తర్వాత సకల సౌభాగ్యదాయిని , సకల జ్ఞానరాశి అయిన సావిత్రీదేవి అభిమంత్రించింది. దానివల్లనే ఈ యజ్ఞోపవీతానికి అంతటి పవిత్రత చేకూరింది.


యజ్ఞోపవీతాన్ని ధరించడానికి ముందు ఆచమనం , సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత యజ్ఞోపవీతాన్ని పూజించాలి. ఆ తర్వాత రెండు చేతుల యొక్క బొటనవ్రేళ్లతోనూ , యజ్ఞోపవీతాన్ని చేసుకుని *‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం’* అనే శ్లోకాన్ని పఠించి , మొదటి కుడిచేయి ఉంచి ముడి ముందుగా వచ్చునట్లుగా ధరించాలి. నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన అనంతరం పాత (జిగి) యజ్ఞోపవీతాన్ని విసర్జించాలి.

అశౌచాలవల్ల , ఆప్తుల జనన మరణ సమయంలో , గ్రహణం పట్టి వదిలిన తర్వాత ఇతర అమంగళాలు కల్గిన సందర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి.


*ఉపాకర్మ సందేశం*


ఉపాకర్మ సామూహికంగా ఆచరించే కర్మ. అన్ని రోజులలో ఎవరి కార్యక్రమాలలో హడావుడిగా వుంటారు. ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అందరూ ఒకచోట చేరి సామూహికంగా , పూజాదులు నిర్వహించడంవల్ల సమిష్టితత్వం పెరుగుతుంది. నదీతీరాలలో ఆచరించే స్నానాదులవల్ల నదులను శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన పెంపొందుతుంది. శారీరక , మానసిక పరిపక్వతకు , పరిశుద్ధతకు యజ్ఞోపవీతమ్ దివ్యౌషధమని పెద్దలు చెబుతారు.


🌹🌷 *సేకరణ*🌹🌷

          *న్యాయపతి*

       *నరసింహారావు*

యదార్ధ దర్శనం

 యదార్ధ దర్శనం 

మనం రోజు మన చర్మ చక్షువులతో (కండ్లతో) అనేక విషయాలను చూస్తూ వాటికి సంబందించిన విషయం పరిజ్ఞానం పొందుతున్నాము. కానీ అదే ఒక అంథుడు ఆలా తెలుసుకోలేరు.  కానీ వారికి మనం తన ముందు వున్న వస్తువు యొక్క వివరాలు చెపితే అంటే నీవు చెప్పేది విని ఆ వస్తువుకు సంబందించిన జ్ఞానాన్ని పొందుతారు. నీవు నీకు తెలిసిన ఒక గ్రుడ్డి వాని వద్దకు వెళ్ళావనుకో అప్పుడు నీవు ఫలానా అంటే గతంలో నీతో వున్న పరిచయ జ్ఞానం వల్ల నిన్ను గుర్తించ గలుగుతాడు. అదే చక్కగా కండ్లు ఉండి చూడగల వాడు నిన్ను దూరం నుంచి చూసి గుర్తుపట్టి నిన్ను పలకరిస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఎవరి ఇంద్రియ జ్ఞానం యెంత వున్నది అన్నది. 

నేను ఇంకో ఉదాహరణతో వివరించేప్రయత్నిస్తాను. నీవు ఒక చీకటి గదిలో వున్నావు అనుకో దానికి ఒకటే ద్వారం వున్నది. ఆ రోజు అమావాస్య పూర్తిగా రాత్రి చీకటిగా వుంది. నేను ఆ గది తలుపు తీసాను.  నాకు నీవు గదిలో వున్నవిషయం తెలియదు.  కానీ ఎవరో తలుపు తీశారన్న విషయం నీకు తెలుస్తుంది.  ఎందుకంటె నీకు నేను కనబడక పోయిన తలుపు తీసినప్పుడు నీకు శబ్దం అయ్యింది, అది నీవు వినటం వలన నీకు గదిలో ఇంకొక మనిషి వచ్చాడని తెలుసుతున్నది. నేను మూడు రకాల టార్చి లైట్లు తీసుకొని వచననుకో ఒకటి యెర్రని కిరణాలను ప్రసారింప చేసేది ఒకటి మాములు కాంతిని ప్రసరించేది మరొకటి ఎక్స్ రేసులను ఉత్పత్తి చేసేది అనుకో. నేను గదిని ఒక టార్చి లైటు వెలిగించి చూసాను నాకు అప్పుడు గదిలోని వస్తువులు కనపడుతున్నాయి. కానీ అవి యెట్లా కనబడుతున్నాయి అన్నది ప్రశ్న. X రేసులను ప్రసరించే టార్చి తో వెతికాననుకో అప్పుడు ఆ కిరణాలను తట్టుకోలేని వస్తువులు నాకు కనిపించవు. అంటే నేను నీ మీద ఆ టార్చి వేస్తె నాకు నీ అస్థిపంజరం మాత్రమే కనపడుతుంది కానీ నీ రూపు రేకలు నాకు తెలియవు. నీవు కదులుతూ ఉండటం వల్ల ఒక సజీవ మనిషి నా ఎదురుగా ఉన్నట్లు నాకు అర్ధం అవుతుంది. అదే యెర్రని కిరణాలను ఉత్పత్తి చేసి టార్చితో నిన్ను చుస్తే నాకు నీవు కనపడతావు.  కానీ నే రంగు నాకు తెలియదు. అంటే నీవు స్త్రీవా లేక పురుషుడివా, నీవు చిన్న పిల్లవా లేక వయస్సులో వున్నా వానివా నేను తెలుసుకో వచ్చు. అదే నేను నీ మీద మాములు కాంతిని ప్రసరింప చేసే టార్చి లైటుతో చుస్తే నేను నీ గూర్చి పూర్తిగా తెలుసుకోగలను. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే మన ముందు వున్న వస్తువు నిజ స్వరూపము కేవలము మనం చూసే వెలుతురూ మీద మాత్రమే ఆధారపడి వున్నది. 

గ్రుడ్డి వానికి విషయజ్ఞానము ఇతరులు చెప్పటం వలన తెలుస్తున్నది. అదే కండ్లు ఉన్నవానికి తాను చూసే వస్తువు మీద పడిన కాంతి వలన మాత్రమే యదార్ధం తెలుస్తున్నది. 

శరీరం వున్న ప్రతివారికి అస్థిపంజరం వున్నది. మనం శరీరాన్ని మాత్రమే సాధారణ కాంతిలో చూడగలము. కానీ మనకు ఉన్నఇతర అవగాహన వల్ల మనిషి శరీరంలో అస్థిపంజరం వున్నదని నమ్ముతాము.  అంటే ఆ విషయంలో మనకు ప్రత్యక్ష జ్ఞానం లేదు. అదే చీకటి గదిలో నేను నిన్ను అస్తిపంజరంగా చుస్తే నేను నీ నిజ స్వరూమాన్ని చూడలేను.  కానీ నీవు అస్థిపంజరం కాన్న భిన్నంగా వుండివుండొచ్చని నేను భావించగలను.  దానికి కారణం నాకు వున్న పూర్వ జ్ఞానం అయిన ఇతర మనుషులను చూసిన జ్ఞానం. 

భగవంతుని విషయంలో కూడా ఇదే విధంగా మనకు అనేక విధాల జ్ఞానం కలుగుతున్నది. నిజానికి మనకు భగవంతుని గూర్చిన ప్రత్యక్ష జ్ఞానం లేదు కేవలము మనకన్నా ముందు భగవంతుని దర్శించిన పూర్వ జ్ఞానుల అనుభవాలు వారు పేర్కొన్న విషయ జ్ఞానంతో మనం భగవంతుని గూర్చిన జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నిస్తాము.  మనం అనుసరించే జ్ఞాని జ్ఞానాన్ని మనం పరిక్ష జ్ఞానంగా తీసుకొని దానినే మనం నమ్ముతాము. 

మనం ఒక విషయాన్ని స్పష్టవంగా అర్ధం చేసుకోవ ప్రయత్నించాలి. మనం అనుసరించే జ్ఞాని భగవంతుని ఏ టార్చి లోటుతో చూసిన వాడు అన్నది ముఖ్యము. ఎక్స్ రే టార్చి తో చూసే వానిని మనం అనుసరిస్తే భగవంతుడు అస్థిపంజరం అని చెపుతాడు.  అదే ఎర్ర లైటు తో చుసిన వాడు భగవంతుని రూపాన్ని తానూ చూసినట్లు నల్లగా ఉన్నట్లు చెపుతాడు.  కానీ సాధారణ కాంతితో చూసిన వాడు మాత్రమే మనకు భగవంతుని గూర్చిన సవివర మైన విషయాలను తెలుపగలరు. 

ఇంకా వుంది. 

 

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 26    

                           SLOKAM : 26   

                                                

श्रीमन्नाम प्रोच्य नारायणाख्यं

केन प्रापुर्वाञ्छितं पापिनोऽपि ।   

हा नः पूर्वं वाक्प्रवृत्ता न तस्मिं -

स्तेन प्राप्तं गर्भवासादिदुःखम् ॥ २६॥  


శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం

కేన ప్రాపుర్వాంఛితం పాపినోఽపి I    

హా న: పూర్వం వాక్ప్రవృత్తా 

                                   న తస్మిన్  

తేన ప్రాప్తం గర్భవాసాదిదు:ఖం ॥ 26


    ఎంత పాపం చేసిన వారైనప్పటికీ ‘నారాయణ’అనే పవిత్రనామాన్ని స్మరిస్తే సకల శుభాలు పొందుతారు.    

అయ్యో! 

    నేను పూర్వం నా నోట ఆ నారాయణ మంత్రాన్ని ఉచ్ఛరించకపోయినందువల్లనే నాకీ జన్మము మరియు ఈ గర్భవాస దుఃఖం ప్రాప్తించింది.  


    What person, even if most sinful, has ever said aloud the blessed name Nārāyaṇa and failed to fulfill his desires? 

    But we, alas! never used our power of speech in that way, and 

    so we had to suffer such miseries as living in a womb.


ఉదాహరణ  


నారదుని పూర్వ జన్మ వృత్తాంతం  


    మహాభాగవతం మొదటి స్కంధంలో వారదుడు తన గాథను స్వయంగా వేద వ్యాసునికి తెలిపాడు. 

     తాను పూర్వ జన్మ పుణ్య కారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచరింప గలుగుతున్నానని చెప్పాడు.


    పూర్వ కల్పంలో నారదుడు వేదవిదులైన వారింట పని చేసే ఒక దాసికి కుమారుడు. 

    ఒకమారు అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు. 

    వారి దయవలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయాభావాన్ని తెలుసుకొన్నాడు.    

    ప్రణవంతో కలిపి వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ మూర్తులను స్మరించి నమస్కరించినట్లయితే సమ్యగ్దర్శనుడౌతానని గ్రహించాడు.


    అతని తల్లి ఒకనాడు పాము కాటువల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధములనుండి విముక్తుడై అడవికి పోయి భగవత్స్వరూపాన్ని ధ్యానించ సాగాడు. 

    ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనస్సులో భగవత్స్వరూపం గోచరించింది. కాని మరుక్షణమే అంతర్ధానమైంది. 

    చింతాక్రాంతుడై నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఆదేశమిచ్చింది -  

"ఈ జన్మలో నీవు నన్ను పొందలేవు. కాని నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరింది. 

    ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్షదుడవై నన్ను పొంద గలవు" 

     - నారదుడు సంతుష్టుడై నిరంతరం హరి నామ జపం చేస్తూ కాలం గడిపి, అంతిమ సమయం ఆసన్నమైనపుడు తన దేహాన్ని త్యజించాడు.


    అనంతరం ప్రళయ కాలం సమీపించగా ఒక సముద్రంలా ఉన్న ఆ జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మ శ్వాసలో ప్రవేశించి ఆయనలో లీనమయ్యాడు. 

    వేయి యుగాల కాలం తరువాత బ్రహ్మ లేచి లోకాలను సృష్టించడం ఆరంభించినపుడు, 

    బ్రహ్మ ప్రాణములనుండి మరీచి మొదలైన మునులతోబాటు నారదుడు కూడా జన్మించాడు. కనుకనే నారదుని బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. 

    అలా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగుతుంటాడు. 

    తాను స్మరించగానే నారాయణుని రూపం అతని మనసులో సాక్షాత్కరిస్తుంది.


    ఇలా తన కథ చెప్పి, హరికథా గానంతో నిండి వున్న భాగవతాన్ని రచించమని నారదుడు వేద వ్యాసునికి ఉపదేశించాడు.

    

https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

కైవల్యం

 🎻🌹🙏హరి ఓం 🙏 ✍️ సేకరణ, 


" కాకి లేనిదే కైవల్యం లేదు " ( కాకి )


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


* కాకి అరిస్తే చుట్టాలు రాకకు సూచకం అని అంటారు ఎందుకు..? కాకికి-మనుషులకు మధ్య గల సంబందం ఏమిటి..? అసలు ఈ సామెత ఎలా వచ్చింది..?


"చక్కటి వివరణ....రామాయణ ఘట్టం"


* శ్లొకం :- !! పక్షి చ శాఖా నిలయ: ప్రవత్త: సుస్వాగతాం వాచ మదీర యాన:!!


* పక్షి కూత శుభ వాక్యాన్నీ వినడానికి నాందిగా భావించేందుకే ఈ కారణంగానే కాకి అరుస్తొంది...ఏ చుట్టాలొస్తారొ చూద్దాం అనే మాట లొకానికి వచ్చింది. దీనికి ఒక మహొత్తరమైన పురాణా గాథతొ సామెత వచ్చినది అని తెలుస్తొంది.....


* రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి...సప్త సముద్రాలా అవనిలొ...లంకా నగరానికీ సమీపంలొ...ఆశొకవనంలొ ఒక మద్ది చెట్టు క్రింద ఆమేని వదిలి పెట్టి...రాక్షసులను కాపలా వుంచి అతి జాగ్రత్తగా చూడమని చెప్పి వెళతాడు...రాజ్యం కాని రాజ్యంలొ...మనుషులు కాని మనుషుల మధ్యలొ...తనవారి జాడ అనేది తెలియని చొట...రాక్షసుల నీడలొ...రాక్షసుల వికృత ఆలవాట్లను చూస్తూ...సూటిపొటి మాటలతొ...ఆపుడపుడూ రావణాసురుడు వచ్చి పరస్త్రీ వ్యామోహ మాటలతొ...సీతమ్మ తల్లి ఆవేదనతొ బాధపడుతూ...మనసును కలచి వేస్తున్న సమయంలొ...ఎక్కడినుంచొ...ఎపుడూ కూడా...ఆ పరిసిర ప్రాంతంలొ కనిపించని పక్షి...ఒక్కసారిగా సీతమ్మ తల్లి కూర్చున్న మద్దిచెట్టు క్రొమ్మమీద వ్రాలి ఆమెని చూస్తూ పదే పదే అరవ సాగింది...


* సీతమ్మ తల్లి తదేకంగా ఆ కాకి వైపు చూస్తూ...ఏ రాక్షస మాయతొ ప్రమాద సూచకమా అని అనుకొంటున్న తరుణంలొ...కొతిపిల్ల రూపంలొ వున్న హనుమ...సీతమ్మ ముంగటికి వచ్చి...రెండు చేతులతొ నమస్కరించి...నేను రామదూతని...మీ జాడ తెలుసుకు రమ్మని...సుగ్రీవ...రామ లక్ష్మణులు...పంపగా ఏడు యోజనముల సముద్రాలని దాటి...లంకా నగరమంతా గాలించిచూ...నార చీరలొ వున్న మిమ్మల్ని చూసి నా సీతమ్మ తల్లినే అని...తన నిజరూపాన్ని చూపి రాముడు ఇచ్చిన ఉంగరీయాన్నీ చూపగా మహానందంతొ ఆ మహాతల్లి సంతొషం వ్యక్తపరుస్తున్న తరుణంలొ...


* ఆ కాకి...అంతవరకు ఆ క్రొమ్మమీదనే వుండి...కావ్.. కావ్.. కావ్.. అని అరుస్తూ సీతమ్మ ముంగట వాలగా...నీ అరుపుతొ నాకు శుభ సూచకం జరిగింది...ఏ చెట్టు అయితే నాకు నివాస గ్రుహంగా ఉన్నదొ...అటువంటి ప్రదేశంలొ నీ అరుపుతొ ఆ నివాసానికి శుభ సూచకం అవుతుందని...నీ వంశం వున్నంత వరకు అది లొకానికి శుభధాయకం అని వరం ఇచ్చింది...


* ఈ సామెత ఆలా...రామాయణం కాలం నుండి...మన వరకూ కూడా కాకి అరుపు శుభ సూచకంగా భావిస్తున్నాం....స్వస్తి సేకరణ...🙏💐


!! జై శ్రీరామ్ !! ..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

21, ఆగస్టు 2021, శనివారం

సర్వ భూతములయందు

 సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ।

ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ।। 29 ।।


సర్వ-భూత-స్థం — సర్వ భూతముల యందు స్థితుడై ఉండి; ఆత్మానం — పరమాత్మ; సర్వ — సమస్త; భూతాని — ప్రాణులు; చ — మరియు; ఆత్మని — భగవంతుని యందు; ఈక్షతే — దర్శించును; యోగ-యుక్త-ఆత్మా — అంతఃకరణ లో భగవంతుని తోనే ఏకమై; సర్వత్ర — అన్ని చోట్లా; సమ-దర్శనః — సమత్వ దృష్టి.


Translation

BG 6.29: నిజమైన యోగులు, అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి, సర్వ భూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వ భూతములయందు దర్శిస్తారు.

భగవత్ సంబంధముగా

 ఏక దేశస్థితస్యాగ్నేర్జ్యోత్స్నా విస్తారిణీ యథా

పరస్య బ్రహ్మణః శక్తిస్తథేదమఖిలం జగత్

 (నారద పంచరాత్రం)


"ఎలాగైతే సూర్యుడు ఒకే చోట ఉండి, తన వెలుగుని అన్ని దిక్కులా ప్రసరిస్తాడో, అదే విధంగా, భగవంతుడు తన ఎన్నో శక్తుల చేత అన్నిటియందు నిండి నిబిడీకృతమై వాటిని నిలిపి నిర్వహిస్తుంటాడు.

" పరిపూర్ణత సాధించిన యోగులు, అంతర్గతంగా విచ్చుకున్న విజ్ఞాన ప్రకాశంలో, ప్రతిదాన్నీ భగవత్ సంబంధముగా చూస్తారు.

శ్రీమద్భాగవతము

 *21.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2237(౨౨౩౭)*


*10.1-1343- నుండి 10.1-1345-*


*సీ. మహిమతో నుండగ మథురాపురము గాని*

  *పొలుపార వైకుంఠపురము గాదు*

*గర్వంబుతో నుండఁ గంసుని సభ గాని*

  *సంసార రహితుల సభయుఁ గాదు*

*ప్రకటించి వినఁగ నా బాహునాదము గాని*

  *నారదు వీణాస్వనంబు గాదు*

*చదురు లాడఁగ మల్లజన నిగ్రహము గాని*

  *రమతోడి ప్రణయ విగ్రహము గాదు*

*తే. వెలసి తిరుగంగ వేదాంతవీధి గాదు*

*మొఱఁగిపో ముని మనముల మూల గాదు*

*సాఁగి నడువంగ భక్తుల జాడ గాదు*

*శౌరి! నా మ్రోల నీ వెందు జనియె దింక."*  🌺



*_భావము: చాణూరుడు శ్రీకృష్ణునితో ఎకసక్కెంగా ఇంకా ఇలా అంటున్నాడు: "నీవు శ్రీహరివి, అది ఇదీ అంటావేమో! విను. నీ మహిమలు పని చేయటానికి ఇది మధుర, వైకుంఠము కాదు; ఇది కంసుని సభ, సంన్యాసుల సత్సంగము  కాదు; ఇది నా జబ్బల మీద చరచిన చప్పుడు, నారదుని  వీణానాదము కాదు; నీ చతురోక్తులతో రంజింపచెయ్యటానికి ఇది లక్ష్మీదేవితో ప్రణయ కలహముకాదు, మల్లయోధులతో సంగ్రామము; శూరసేనుని వంశములో జన్మించిన వాడా! ఇంకా చెప్పాలంటే తిరగటానికి ఇవి వేదాంతవీధులు కావు, బోధలు చేయటానికి మునుల చిత్తములు కావు, విజృంభించి నడవటానికి ఇవి భక్త సమూహాలు కావు, ఇక నీకే దిక్కు లేదు, ఎక్కడికి పోతావు?"_* 🙏



*_Meaning: Chanura was making mockery of Sri Krishna: "You might claim You are Sri Hari and all big things about Yourself. Listen from me- This is Madhura and Kamsa's court, not Vaikuntham and meeting of ascetics. These slaps on my shoulder are as war cries, not music on Veena of Narada. These are not pleasantries to exchange with Goddess LakshmiDevi, but fight with expert wrestlers. Hey Sri Krishna, born in the clan of  Surasena! Know further that these are not paths of Vedanta, not minds of sages to listen to Your teachings, not an assembly of Your Bhaktas to excel. Where can You go now? You can not escape from my grip."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*