31, ఆగస్టు 2020, సోమవారం

రామాయణమ్ ...47


.
ఎంత ఎంత వేడుతుంటే అంత అంత బెట్టు చేస్తున్నది కైక .
.
ఛీ దుర్మార్గురాలా నీ ముఖం చూస్తుంటేనే పంచ మహా పాతకాలు చుట్టుకుంటాయి నాకు.... అని కన్నీరుమున్నీరు గా విలపిస్తున్నాడు దశరథుడు .
.
అయినా నీ కోరిక భరతుడు మన్నిస్తాడనుకుంటున్నావా వాడు రామునికన్నా ధర్మాత్ముడు!
.
రామాదపి తమ్ మన్యే ధర్మతో బలవత్తరం .

ఓ రాత్రీ తెల్లవారకు !                           
వద్దులే !శీఘ్రముగా వెళ్ళిపో నీవు,
 ఈ దుష్టురాలి గృహమునుండి త్వరగా వెళ్లిపోవాలి నేను అని తనలో తను మాట్లాడుకుంటూ ఉన్నాడు దశరథుడు.
.
ఇంతటి దైన్య స్థితి జీవితంలో ఇదే మొదటిసారి దశరథుడికి ,అంతకు మునుపెన్నడూ ఆయన ఇంతటి విపత్కర పరిస్థితిలో చిక్కుకొని ఎరుగడు.
.
కైక ఇంకా క్రూరంగా మాట్లాడటం మొదలుపెట్టింది . ఏమిటిది? నేనేదో కోరరానిది కోరినట్లు నీవంత బాధ పడుతూ క్రిందపడి విలపిస్తున్నావు ?
.
అసలు నీ ప్రాణం నేను పెట్టిన భిక్ష! ,
.
పెద్ద సత్య సంధుడవైనట్లు ఆ రోజు మాట ఇవ్వనేల నేడు విలపించనేల .
.
శిబిచక్రవర్తి మాట కోసం శరీరంలో తన మాంసం కోసి ఇచ్చిన సంగతి నీవెరుగవా?
.
అలర్కుడు ఇచ్చిన మాటకోసం తన కన్నులు ఒక బ్రాహ్మణుడికి దానం చెయ్యలేదా
.
సముద్రుడు చెలియలికట్ట దాటుతున్నాడా?
.
నీకు మూడుమాట్లు చెపుతున్నాను
రాముడిని అడవికి                           
పంపుము ,
పంపుము,
పంపుము
.
,నీవు మాట నిలబెట్టుకో !లేదా ,నేను ప్రాణత్యాగం చేస్తాను. అని బెదిరించి దశరథుని తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసింది కైక.
.
ఇంతలో భళ్ళున తెల్లవారింది వసిష్టాది మునులంతా రామ పట్టాభిషేక మహోత్సవ ముహూర్తం సమీపిస్తున్నదని దశరథుని పిలుచుకొని రమ్మని సుమంత్రుని పంపారు.
'
సుమంత్రుడు కైక ఇంటికి వెళ్లి రాజుకు విషయం తెలిపాడు .దశరథుడు మాట్లాడే పరిస్థితిలో లేడు, కళ్ళు చింతనిప్పులవలె ఎర్రగా ఉండటం గమనించాడు సుమంత్రుడు .
.
 సుమంత్రుడి ఆలోచన గ్రహించిన కైక రాత్రి సంతోషముతో నిదురలేక అలా అయినాయి ఆయన కళ్ళు .
నీవు త్వరగా వెళ్లి రాముని ఇచ్చటికి తీసుకొనిరా అని ఆజ్ఞాపించింది కైక.
.
రాముడు వచ్చి దోసిలి యొగ్గి తండ్రి వద్ద వినయంగా నిలుచున్నాడు .
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: