🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*
*****
*శ్లో:- వస్త్రేణ వపుషా వాచా* ౹
*విద్యయా వినయేన చ* ౹
*వకారై: పంచభి ర్హీనః* ౹
*వాసవో౽పి న పూజ్యతే* ౹౹
*****
*భా:- లోకంలో రాణించాలంటే ప్రతి మనిషికి 1.వస్త్రము 2. వపు:(మేను) 3. వాక్కు 4. విద్య 5. వినయము అనే 5 "వ"కారాలు కావాలి. 1."వస్త్రము":- వృత్తి ప్రవృత్తులకు అద్దం పట్టి, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతిఫలింపజేసేవిగా దుస్తులు ధరించాలి. లాయర్లు, వైద్యులు, నర్సులు, గార్డులు, పోలీసులు నిర్ణీత ఆహార్యంలో కనిపిస్తుంటారు. సముచిత వేషం గౌరవం తెచ్చిపెడుతుంది. 2. "వపు:":- శుచి, శుభ్రత, ఆరోగ్యకరమైన అంగ సౌష్టవం ఉట్టిపడే దేశరక్షక దళాలు,వ్యాయామకారులు శ రీరపోషణలో జాగరూకులై ఉంటారు. చక్కని శరీరపోషణలో శ్రద్ధ వహించాలి. 3 "వాక్కు":- మృదుమధురమై, సత్యము, ప్రేమ, విశ్వాసము, ఆత్మీయత తొణికిసలాడే వాక్ నైపుణ్యము "హనుమ" నుండి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ప్రియంగా, మితంగా,హితంగా మాట్లాడాలి.4. "విద్య":- ఇహమును, పరమును సాధింపగల, అర్థమును,పరమార్థమును అందించగల , జీవితాన్ని తరింపజేయగల విద్యా సంపత్తిని గడించాలి. 5. "వినయము":- పూజ్యులు, వృద్ధులు, గురువుల పట్ల అపారమైన వినయము కలిగి, వారి నుండి జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించాలి. ఈ ఐదు లక్షణములు సలక్షణంగా ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. ఆదరిస్తుంది. పైన చెప్పిన 5 "వ"కారాలు ఎవరికి లేవో, అతడు సాక్షాత్తు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడైనా సరే పూజింపబడడు. గారవింప బడడు. ఇది ముమ్మాటికి నిత్యము. సత్యము. ప్రతి వారు వీటిని మెరుగుపరచుకొనడానికి నిరంతర సాధన చేయాలి*
*****
*సమర్పణ : పీసపాటి*

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి