31, ఆగస్టు 2020, సోమవారం

దేహం.. దేహి

🧘🧘🧘🧘🧘
ఈ దేహం నేను అనే గట్టి భావన జన్మజన్మాంతరముల నుండి మనకు ఉన్నది. ఇలా ఉండటానికి కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానమే ఆత్మయైన మనను జీవుడుగా భ్రమపడేట్లు చేసింది. శాస్త్రజ్ఞానం ఏమాత్రం లేకపోవటమే అజ్ఞానం. ఏ మానవ జన్మలోనైనా ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి ప్రయత్నం జరగాలి. అలాంటి ప్రయత్నం జరగాలంటే అంతకుముందు జన్మలలో పుణ్యకార్యాలు, దైవకార్యాలు, నిజమైన దైవభక్తితో చేసి ఉండాలి, మహాత్ములను దర్శించాలి, భగవంతుని కోసం తపించాలి. అలా తపించినప్పుడే ఎవరో ఒక మహాత్ముడు తటస్థపడటం జరుగుతుంది. ఆయన మాటలతో జన్మసార్థక్యత ఏమిటో తెలుస్తుంది. అప్పుడు ఆ తరువాతి జన్మలలో ఒక సద్గురువు లభించటం, ఆయన ద్వారా శాస్త్రాలను వినటం, తెలుసుకోవటం, సాధనలు చేయటం జరుగుతుంది. అప్పుడే అజ్ఞానం తొలగేది. అజ్ఞానం తొలగితేనే నేను ఆత్మననే జ్ఞానం కలిగేది. ఈ జ్ఞానాన్ని అపరోక్షంగా, అనుభవపూర్వకంగా పొందితే జీవన్ముక్తియే
మరి లోకంలో ఈ మార్గంలో ప్రవేశించేవారు. వెయ్యికి ఒక్కరు కూడా లేరు. "మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే" అని భగవద్గీతలో అన్నట్లుగా ఎక్కడో ఒకరు అరుదుగా ఈ మార్గంలోకి ప్రవేశిస్తారు. ఎందుకంటే పూర్వజన్మసుకృతం ఉండటాన. మిగిలినవారికి ఆ సుకృతంలేదు గనుక జన్మలకు జన్మలు కొనసాగించాల్సిందే.
🧘🧘🧘🧘🧘

కామెంట్‌లు లేవు: